
ఆలయ సన్నిధిలో కూచిపూడి నృత్య ప్రదర్శన
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7గంటలకు సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. తూర్పు రాజగోపురం వద్ద ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు.
అనంతరం టి.కే.సిస్టర్స్ కర్నాటక గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద్య కచేరి భక్తులను ఆకట్టుకుంది. వేడుకల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment