sri lakshmi narasimha swamy temple
-
కన్నులపండువగా ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం (ఫొటోలు)
-
వైభవంగా యాదగిరిగుట్ట నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవం పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. వానమామలై రామానుజ జీయర్ స్వామితో కలిసి రేవంత్.. శ్రీ సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ చేసి, స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీనృసింహుడికి అంకితమిచ్చారు. సంప్రోక్షణ మహోత్సవం సాగిందిలా.. మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా పంచకుండాత్మక యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11:24 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా యాగశాలకు చేరుకోగా రుతి్వక్కులు వారికి స్వాగతం పలికారు. ఆపై ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రికి అర్చకులు సంకల్పం చెప్పారు. ఆ తరువాత కలశంలో నాలుగు రోజులుగా పూజలు నిర్వహించిన 14 నదుల జలాలను తీసుకొని వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ప్రాకార మండపం మీదుగా స్వామివారి శిరస్థానమైన ఆలయ పంచతల స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు చేరుకున్నారు. స్వర్ణ విమాన గోపురం చుట్టూ ఉన్న తెరలను తొలగించి 11:32 గంటలకు దేశంలోనే ఎత్తయిన దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత స్వర్ణ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి చేతుల మీదుగా నదీజలాలతో పూజలు నిర్వహించిన నవ కలశ స్నపన తీర్థంతో ఆలయ శిఖరంపై సుదర్శన చక్రానికి కుంభాభిషేకం చేశారు. ఉదయం 11:54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తాన స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. గర్భాలయంలో సీఎం దంపతుల పూజలు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవం పూర్తికాగానే తూర్పు రాజగోపురం ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అక్కడి నుంచి ధ్వజస్తంభం వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వయంభూవులను దర్శించుకున్నారు. వారిని అర్చకులు అష్టోత్తరంతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో సీఎం దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వానమామలై రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. సీఎంను జీయర్ స్వామి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రికి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు విమాన గోపురం ప్రతిమను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పలకరింపు.. పడమటి రాజగోపురం మీదుగా ఆలయం నుంచి సీఎం దంపతులు బయటకు వచ్చారు. కాలినడకన వస్తూ కొండపైన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. కొండపైన ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. అంతా బాగుందని.. భక్తులు అధికంగా వస్తున్నారని సీఎంకు వారు చెప్పారు. అనంతరం ఈఓ కార్యాలయానికి వెళ్లి స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. కాగా, ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు నిర్వహించిన స్తపతి రవీంద్రన్, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బంగారు కడియాలు తొడిగారు. మరోవైపు కొండపై కల్యాణమండపం నిర్మించాలని సీఎం రేవంత్‌ను కోరగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. బాల్యమిత్రుడి కుమార్తె వివాహానికి హాజరు గుట్ట ప్రెసిడెన్షియల్ సూట్లో తన చిన్ననాటి స్నేహితుడు భాష్యం ఎదుమోహన్–కల్యాణి దంపతుల కుమార్తె శ్రీలిపి, వరుడు జయసూర్య విశ్వనాథ్‌ల వివాహానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో తిరుగుపయనం అయ్యారు. -
నేడు మహాకుంభాభిషేక సంప్రోక్షణ
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదగిరిగుట్ట క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం జరిగే స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. గుట్టలో ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న పంచకుండాత్మక నారసింహ యాగం పూర్ణాహుతి అనంతరం ఆదివారం ఉదయం 11.54 గంటలకు దివ్య స్వర్ణ విమాన గోపురం కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది.68 కిలోల బంగారంతో తాపడం.. యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తయినదని చెపుతున్నారు. పంచతల రాజగోపురానికి సుమారు 68 కిలోల బంగారంతో తాపడం చేయించారు. రూ.5.10 కోట్ల ఖర్చుతో భక్తులు, దాతలు ఇచి్చన బంగారం, నగదుతోపాటు, దేవస్థానం హుండీలో భక్తులు వేసిన కానుకలతో స్వర్ణ తాపడం చేపట్టారు. గోపురంపై సింహ, గరుడ విగ్రహాలు, నారసింహ రూపాలు చెక్కారు. దాతల కోటాలో కేసీఆర్‌కు ఆహ్వానం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్స్వామిలను దాతల కేటగిరీలో దేవస్థానం అధికారులు ఈ మహోత్సవానికి ఆహ్వానించారు. మహా కుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక నారసింహ యాగం జరుగుతున్న తీరును కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. త్వరలో ఆయన యాదాద్రీశుని దర్శనానికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. హాజరుకానున్న మంత్రులు యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరుకానున్నారు.ఆర్జిత సేవలు రద్దు: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయంలో నిత్య కల్యాణం, పుష్పార్చనతో పాటు ఆయా ఆర్జిత సేవలను రద్దుచేశారు. అంతే కాకుండా ఉదయం, సాయంత్రం ఆలయంలో బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేశారు. ఉదయం 10 గంటల నుంచి ఉచిత, వీఐపీ, ఇతర టికెట్ దర్శనాలను రద్దు చేశారు. ఉదయం సమయంలో స్వామి వారి దర్శనాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావాలని ఆలయ ఈవో భాస్కర్‌రావు పేర్కొన్నారు.నేడు పంచకుండాత్మక యాగం ముగింపుయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురానికి కుంభాభిõÙకం, సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగం ఆదివారంతో ముగియనుంది. శనివారం ఉదయం ప్రధాన ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం, యాగశాలలో చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమాన్ని రుత్వికులు నిర్వహించారు. తర్వాత ఏకాశీతి కలశ స్నపనము, చాతుమరై నిర్వహించి నిత్య పూర్ణాహుతి చేశారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించారు. ఆయా వేడుకల్లో వానమామలై మఠం మధుర కవి రామానుజ జీయర్ స్వామి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఇతర అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ అన్నవరం.. యాదగిరిగుట్ట
సత్యనారాయణస్వామి వ్రతాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం.. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం క్షేత్రం తర్వాత.. ఆ స్థాయిలో యాదగిరిగుట్టలోనే వ్రతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్షకు పైనే వ్రతాలు నిర్వహిస్తుండటం విశేషం. కార్తీకమాసం, శ్రావణమాసంలో వ్రతాలు ఆచరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్రత పూజల కోసం కొండ దిగువన అధునాతన మండపం నిర్మించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఏటేటా వ్రతాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ మంచే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల భక్తులు వచ్చి వ్రత పూజలు చేస్తున్నారు. – సాక్షి, యాదాద్రిరోజూ అయిదు బ్యాచ్‌లుగా వ్రతాలుయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకునేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన వ్రత మండపంలో శ్రీస్వామి ఫొటోతో కూడిన పీటలు ఏర్పాటు చేశారు. టికెట్‌పై భక్తులకు పూజా సామగ్రిని దేవస్థానం అందజేస్తుంది. రోజూ ఐదు బ్యాచ్‌ల్లో వ్రతాలు జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో 700 జంటలు వ్రతాలు ఆచరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రత సమయాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. వ్రతాలు జరుగుతున్న సమ యంలో భక్తుల కుటుంబసభ్యులు.. మండపం బయట నీడలో కూర్చునేందుకు ప్రత్యేకంగా జర్మనీ టెంట్ ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం కొండపై ప్రసాదాల కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా.. వ్రత మండపం పక్కనే ప్రత్యేక ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్రతాలు పూర్తికాగానే వ్రత మండపం హాళ్లను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. భక్తుల వాహనాలకు హెలిపాడ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.ప్రత్యేక ప్రసాదాల కౌంటర్కార్తీకమాసంలో యాదగిరిగుట్ట క్షేత్రంలో పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి. భక్తు లకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ఈసారి కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి ఆదివారం వరకు 16 వేల వ్రతాలు జరిగాయి. కార్తీక మాసం చివరి వరకు భక్తులు వస్తూ వ్రతాలు ఆచరిస్తుంటారు. భక్తులు ఇబ్బంది పడకుండా వ్రత మండపం వద్ద ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశాం. – భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట దేవస్థానం సకల శుభాలు కలుగుతాయిశ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు వ్రతాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో వ్రతాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ శివకేశవులు కొలువై ఉన్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. – నర్సింహమూర్తి, దేవస్థానం అర్చకుడువ్రతం చేయిస్తే పుణ్యం నా తల్లిదండ్రులతో కలి సి వ్రత పూజకు వస్తాను. ప్రతి కార్తీక మాసంలో, వీలైనప్పుడు యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆ లయంలో వ్రతం చేయించి మొక్కులు తీర్చుకుంటాం. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వ్రతం చేశాం. – స్వర్ణలత, బాలానగర్పదేళ్లుగా వ్రతం చేస్తున్నాంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలయంలో వ్రత పూజ చేస్తే మంచి జరుగుతుందని భావించి ప్రతి కార్తీక మాసంలో ఆలయానికి వస్తాం. కార్తీక మాసంలోనే మా వివాహ వార్షికోత్సవం కావడంతో కలిసి వస్తోంది. వ్రత పూజ చేసిన తరువాత శివుడిని, లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంటాం. – వందనపు కరుణశ్రీ, సంస్థాన్ నారాయణపురం. -
ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి చెందిన భక్తులు శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని దర్శించుకొని, అక్కడే ఉన్న ప్రసాద విక్రయ శాలలో లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు. ఆ ప్రసాదాన్ని మొదటి ఘాట్ రోడ్డులో కూర్చుని తింటున్న క్రమంలో.. చనిపోయిన ఎలుక పులి హోరలో ప్రత్యక్షమైంది. దీంతో కంగుతిన్న భక్తు లు, వెంటనే ఆలయాధికారుల వద్దకు తీసు కెళ్లారు. భక్తులను ఆలయ అధికారులు సము దాయించి, వేరే పులిహోర ప్రసాదం అందజేసి, అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ప్రసాదం సెక్షన్ అధికారి అశోక్ కుమార్‌ను వివరణ కోరగా.. పులిహోర ప్రసాదంలో ఎలు క వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విష యాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
11నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ♦ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ ♦ 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం ♦ 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, వేద పారాయణం, సాయంత్రం శేష వాహనం సేవ ♦ 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ ♦ 15న ఉదయం శ్రీకృష్ణ (మురళీ కృష్ణుడు) అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ ♦ 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ♦ 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ♦ 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు. ♦ 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవలో శ్రీస్వామి వారి ఊరేగింపు, రాత్రి దివ్య విమాన రథోత్సవం. ♦ 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, రాత్రి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు ♦ 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11నుంచి 21వ తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను రద్దు చేయనున్నారు. 17, 18, 19 తేదీల్లో అర్చనలు, భోగములు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నారు. 18వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. -
వైభవంగా అంతర్వేది తిరు కళ్యాణ మహోత్సవాలు
-
ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన సమయంలో దక్షిణ రాజగోపురంపై ప్రతిష్టించిన బంగారు కలశాల్లో ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై స్థానిక భక్తులు, పలువురు అధికారులు తెలిపిన వివరాలివి. యాదాద్రి ఆలయ దక్షిణ రాజగోపురంపై బిగించిన బంగారు కలశాల్లో ఒకటి మంగళవారం సాయంత్రం సమయంలో కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆలయాధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దక్షిణ రాజగోపురంపై బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శిల్పులు తిరిగి బిగించారు. దీనిపై ఆలయ డీఈవో దోర్భల భాస్కర్‌శర్మను ప్రస్తావించగా.. గోపురంపై కలశాలు బిగించేటప్పుడు కింద పడకుండా చెక్కలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవి వదులైపోవడంతో పాటు కోతులు వాటిపైకి ఎక్కి ఆడటంతో ఊడిపోయాయని పేర్కొన్నారు. వెంటనే గోపురం వద్ద పూజలు జరిపించి, శిల్పులతో బిగించామని వెల్లడించారు. -
కోరుకొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం చూసొద్దాం రండి..!
-
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి
-
యాదాద్రికి భక్తుల తాకిడి (ఫొటోలు)
-
యాదాద్రిలో వైభవంగా శ్రీచక్ర తీర్థం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలను నిర్వహించిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించాక విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. -
నృసింహస్వామి పెండ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం ప్రధానాలయ మాఢ వీధుల్లో శ్రీస్వామివారు జగన్మోహిని అలంకార సేవలో..సాయంత్రం అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని ఆలయ మాఢవీధిలో ఊరేగించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి... శ్రీనృసింహస్వామికి లక్ష్మీదేవితో వివాహం చేసేందుకు మూహుర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి తుల లగ్నం ముహుర్తంలో 9.30గంటలకు బ్రహ్మోత్సవ మండపంలో శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీస్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. -
గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు. -
మురళీ కృష్ణుడిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి (ఫొటోలు)
-
శ్రీకృష్ణుడి అలంకార సేవలో శ్రీలక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీస్వామి వారు మురళి చేతబట్టి శ్రీకృష్ణుడి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం.. పొన్న వాహన సేవలో తిరు మాడ వీధుల్లో ఊరేగారు. ఆచార్యులు తిరు మాడ వీధుల్లో స్వామిని ఊరేగించి, పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపంలో అధిష్టించి అలంకార సేవల విశిష్టతలను వివరించారు. సాయంత్రం ఆలయ మాడ వీధిలో వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
యాదాద్రిలో వైభవంగా సాంస్కృతికోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7గంటలకు సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. తూర్పు రాజగోపురం వద్ద ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 100 మంది కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అనంతరం టి.కే.సిస్టర్స్ కర్నాటక గాత్ర కచేరీ నిర్వహించారు. శ్రీసాయి బృందం మోర్సింగ్ వాయిద్య కచేరి భక్తులను ఆకట్టుకుంది. వేడుకల్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
మత్స్యావతారంలో యాదగిరీశుడు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం అలంకార సేవలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం నిత్య పూజలు, నిత్య పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక.. 9గంటలకు మత్స్యావతార అలంకారంలో సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాలయం తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద శ్రీస్వామి వారి మత్స్యావతార సేవను ప్రారంభించారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిశాక 7గంటలకు శేష వాహనంపై శ్రీనారసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మత్సా్యవతార, శేష వాహన సేవల విశిష్టతను ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు భక్తులకు వివరించారు. -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
వైభవంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచారాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానాలయాన్ని పూల మాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బంగారు వర్ణంలో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది. 0గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన, ఉపాచారాల అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం నిర్వహించారు. విష్వక్సేనుడు సమస్త సేవా నాయకులకు అధిపతి. అంటే.. సర్వసైనాధ్యక్షుడు కావడంతో ఈయనను ఈ ఉత్సవాలకు ఉద్యుక్తున్ని చేయడమే ఈ పూజ ప్రత్యేకత. అలాగే ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి మంత్రోచ్ఛారణల మధ్య వాటికి ప్రత్యేక పూజలు చేశారు. రక్షాబంధనం ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. గర్భాలయంలో స్వామివారి వద్ద కంకణాలకు పూజ చేసి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు.. చైర్మన్ బి.నర్సింహమూర్తి, దేవస్థానం ఈఓ గీతారెడ్డిలకు రక్షాబంధనం చేశారు. అంకురార్పణ సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పట్టు ధోవతి, కండువా, చీర సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు అగ్ని పరీక్ష, ధ్వజారోహణం, రాత్రి 7.30 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనము జరుగుతాయి. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలో విశ్వక్సేన ఆరాధనతో ఆచార్యులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆరు సంవత్సరాల పాటు బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉద్ఘాటన తర్వాత తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో కొండపై శ్రీస్వామి సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలిరానున్నారు. విదేశీ భక్తులు సైతం వచ్చే అవకాశం ఉంది. ఆర్జిత సేవలు రద్దు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రూ.1.50 కోట్ల బడ్జెట్ ప్రధానాలయం ఉద్ఘాటన అనంతరం జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రూ.1.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఉత్తర మాడ వీధిలో కల్యాణం 28వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణాన్ని ప్రధానాలయం ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ షెడ్యూల్.. ►21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం. ►22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్సా్యవతార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ. ►24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి, రాత్రి 7గంటలకు హంస వాహన సేవలు. ►25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకారం (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ. ►26న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి, రాత్రి 7 గంటలకు సింహవాహన సేవలు. ►27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలు, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం ►మార్చి 1న ఉదయం 9 గంటలకు మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం. ►3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం -
21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు ఆలయ ఆచార్యులతో అధికారులు సోమవారం పూజలు చేయించారు. బ్రహ్మోత్సవాలలో జరిగే పూజా కార్యక్రమాలు ఇవీ.. ►21వ తేదీ ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు. ►22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. ►24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ. ►25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ►26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ. ►27న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం. ►మార్చి 1వ తేదీన ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన. ►3వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. ఉత్తర మాడవీధిలో కల్యాణం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరుతున్నారు. కల్యాణానికి సీఎం వచ్చే అవకాశం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణ వేడుకకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు ఉదయం సీఎం కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆలయ అధికారులు, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు. -
యాదాద్రిలో మెట్ల నృత్యోత్సవం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని భావనాలయ నాట్యాచార్యుడు డాక్టర్ వట్టికోట యాదగిరిచార్యులు, ఆయన శిష్య బృందం ఆదివారం మెట్ల నృత్యోత్సవం నిర్వహించాయి. మొదట శ్రీస్వామి వారి వైకుంఠద్వారం వద్ద మెట్ల పూజను నిర్వహించారు. అనంతరం మెట్లపై నృత్యం చేస్తూ కొండపైకి వెళ్లారు. కొండపైన తూర్పు రాజగోపురం వద్ద కుంభ నీరాజనంతో కార్యక్రమాన్ని ముగించారు. యాదాద్రి వైభవాన్ని నలు దిశలా చాటేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వట్టికోట యాదగిరిచార్యులు స్పష్టం చేశారు. -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్ తమిళిసై
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆమెకు ఆలయ తూర్పు త్రితల రాజగోపురం వద్ద ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూప్రసాదాన్ని దేవస్థానం ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు గవర్నర్‌కు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి పట్టువస్త్రాలు అందజేశారు. గవర్నర్ రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఉన్న సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. అంతకుముందు కొండపైన వీఐపీ గెస్ట్‌హౌస్ వద్ద గవర్నర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విలేకరులు మాట్లాడించేందుకు ప్రయత్నించగా అందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. -
ఘనంగా నృసింహుడి ఎదుర్కోలు
యాదగిరిగుట్ట: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్లకు గురువారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం హవన పూజలు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్టానాలు, పారాయణికులతో వేద పారాయణాలు జరిపించిన అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను సింహవాహనం సేవపై తిరువీధుల్లో ఊరేగించారు. సాయంత్రం జరిగిన ఉత్సవంలో శ్రీస్వామి వారిని అశ్వవాహనంపై మేళతాళాలతో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదుర్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
యాదాద్రిలో ఘనంగా రథసప్తమి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదాద్రి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించడం ఇదే తొలిసారి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మొదటిసారిగా రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. ప్రధానా లయం పునఃప్రారంభమైన తర్వాత.. శనివారం రథ సప్తమి రోజు శ్రీస్వామి వారిని ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తుల మధ్య ఊరేగించనున్నట్లు ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రథ సప్తమి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సంతోష్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు జస్టిస్ సంతోష్‌రెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జస్టిస్ సంతోష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
ముగ్గురు సీఎంలతో కలిసి యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫొటోలు)
-
గోదాదేవి కల్యాణంలో సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన గోదాదేవి– శ్రీరంగనా«థుల కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గోదాదేవి– శ్రీరంగనాథులను అలంకరించి తిరువీధుల్లో ఆచార్యులు ఊరేగించగా.. సీఎస్ శాంతికుమారి దంపతులు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో ముందు నడిచారు. ఆలయ ముఖ మండపంలో జరిగిన కల్యాణ వేడుకను తిలకించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి యాదాద్రి క్షేత్రానికి వచ్చిన శాంతికుమారికి ఆచార్యులు, ఈవో గీతారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎస్ దంపతులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. నరసింహ నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు (ఫొటోలు)
-
యాదాద్రి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు మూడు గంటలు, వీఐపీ దర్శనానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్య ఆదాయం రూ.45,86,412 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు
భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురి ల్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువ జామునే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాద్రిలో...: భద్రాచలంలో సోమ వారం తెల్లవారుజామున వైకుంఠ ద్వా ర దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు. యాదాద్రిలో... యాదాద్రిలో వేకువజామునే ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చ కులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు చేశారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉదయం 6:48 గంట ల నుంచి 7:30 గంటల వరకు స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో స్వామిని ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో అధ్య యనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్స్య అవతారంలో ఊరేగించారు. యాదాద్రి ప్రధానా లయ ఉద్ఘాటన తర్వాత తొలిసారి జరిగిన ఉత్తర ద్వార దర్శనానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారు లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, యాదా ద్రి కొండకు దిగువనున్న తులసీ కాటేజీలో దాతల సహకారంతో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. -
నారసింహుడి సేవలో ముర్ము
సాక్షి, యాదాద్రి/ సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం 9.22 గంటలకు బొల్లారం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో కొండపైకి వెళారు. ఆలయంలో త్రితల రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నారసింహుడికి ప్రత్యేక పూజలు, కేశవ నామార్చన చేశారు. తర్వాత ముఖ మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్ తమిళిసైలకు వేదాశీర్వచనం చేసి.. ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి జ్ఞాపికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రపతికి అందజేశారు. ఆలయం నుంచి బయటికి వచ్చాక ఉత్తర రాజగోపురం ముందు మంత్రులు, అధికారులు, అర్చకులు, దేవస్థానం సిబ్బందితో రాష్ట్రపతి ఫొటోలు దిగారు. కాగా.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు యాదాద్రి కొండపైకి అనుమతించలేదు. అమర సైనికుల కుటుంబాలతో భేటీ యాదాద్రి నుంచి వచ్చిన తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అమర సైనికుల కుటుంబాలను ముర్ము పరామర్శించారు. దేశం కోసం ప్రాణా లు అర్పించిన వీరులను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులతో కొంతసేపు మాట్లాడారు. వారిని సన్మానించి, బహుమతులు అందచేశారు. ప్రముఖులకు విందు రాష్ట్రంలో పర్యటన ముగుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాజకీయ ప్రముఖులకు ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరికొందరు మంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.లక్ష్మణ్, నామా నాగేశ్వర్రావు, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు, జ్ఞాపికతో వీడ్కోలు హైదరాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకున్న రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆమెకు గవర్నర్ తమిళిసై, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నూతన పట్టువస్త్రాలు, జ్ఞాపిక, ఫలాలను రాష్ట్రపతికి అందచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కలిసి వెండి వీణను బహూకరించారు. -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి (ఫొటోలు)
-
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. యాదాద్రి గర్భాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. యాదాద్రిలో భారీ ఏర్పాట్లు కాగా రాష్ట్రపతి యాదాద్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానాలయాన్ని మామిడి, అరటి తోరణాలు, పూలతో అలంకరించారు. ఉత్తర రాజగోపురం గుండా రాష్ట్రపతి శ్రీస్వామివారి దర్శనానికి వెళ్లనుండడంతో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు కూల్ పేయింట్ వేశారు. రాష్ట్రపతి ఆలయానికి చేరుకొని తిరుగుపయనం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసుల ఆధీనంలో యాదాద్రి రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యాదాద్రి ప్రధానాలయంతో పాటు రింగ్ రోడ్డు, ఘాట్‌రోడ్డు, హెలిపాడ్లు ఏర్పాటు చేసిన యాగస్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో అడిషనల్ సీసీ సురేంద్రబాబు, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్లా నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట పట్టణ సీఐ సైదయ్య బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి వెంట ఎస్పీజీ, ఐబీ, క్యూఆర్టీ టీంలు రానున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రధానాలయంలో భక్తులతో నిర్వహించే పూజలను రద్దు చేసి స్వామివారికి చేపట్టే ఆర్జిత సేవలను అంతరంగికంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉదయం 9నుంచి 10 గంటల వరకు ఉన్న బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతనే భక్తులు శ్రీస్వామి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు కోరారు. -
యాదాద్రికి భక్తుల తాకిడి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, రింగ్ రోడ్డు ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి మూడున్నర గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని 40వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వివిధ పూజలతో రూ.64,50,178 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. -
సత్యప్రమాణాలకు నిలయం.. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం. దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు: ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు. చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు. దేవుడిపై నమ్మకం ఎక్కువ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. – ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ సత్యప్రమాణం చేయాలంటే భయం తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది. – గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ -
యాదాద్రికి పెద్ద ఎత్తున భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు ఏకాదశి కలసి రావడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కాగా, వివిధ పూజల ద్వారా యాదాద్రి దేవస్థానానికి రూ.59,04,585 నిత్య ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఇక ఆన్లైన్లో యాదాద్రి బ్రేక్ దర్శనం టికెట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో బ్రేక్ దర్శనం టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్ దర్శనాలకు రూ.300 టికెట్ కొనుగోలు చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. http://yadadritemple.telangana.gov.in లో లాగిన్ కావాలని ఈవో6 సూచించారు. ఈ వెబ్సైట్లో ఉఈ్చటటజ్చిnకు వెళ్లి బ్రేక్ దర్శనం రూ.300 అన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్లో రుసుము చెల్లించి టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. -
యాదాద్రి ఆదాయం @ రూ.1.16 కోట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చారు. దీంతో శ్రీస్వామివారికి రికార్డుస్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాదం విక్రయశాల వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 4 గంటలకుపైగా, వీఐపీ దర్శ నానికి రెండున్నర గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం భక్తులు బారులుదీరి కనిపించారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ప్రధా న బుకింగ్‌తో రూ.3,24,650, కైంకర్యాలు రూ. 16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచార శాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం రూ.44,37,150, పాతగుట్ట ఆలయం రూ.3,78,670, కల్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వతపూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండపైకి వాహనాల ప్రవేశం రూ.9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52, 348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాల యం రూ.32,600, అన్నదానం రూ.55,659, బ్రేక్ దర్శనాలు రూ.9,75,000 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి వారి నిత్య ఆదాయం గత ఆదివారం రూ.1.09 కోట్లు రాగా, ఈ ఆదివారం అదనంగా రూ.6,31,531 ఆదాయం వచ్చింది. -
భక్త జన యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణలోని నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయం పట్టింది. ఇక ధర్మదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వీరికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదం కొనుగోలు చేయడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్యాదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజే శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.1,09,82,446 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆదివారం ఉదయమే కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు, దీపారాధనలకు క్యూకట్టారు. అనంతరం కొండపైన స్వయంభూలను దర్శించుకునేందుకు వెళ్లారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 5 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఒక్కరోజే నిత్య ఆదాయం రికార్డుస్థాయిలో రూ.85,62,851 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రద్దీ నేపథ్యంలో కొండపైకి, కిందికి బస్సులు ఆలస్యంగా నడవడంతో భక్తులు ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బ్రేక్ దర్శనాల కోసం భక్తులను నిలిపివేయడంతో కొండపైన, కొండ కింద భక్తులు క్యూలైన్లలో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రసాద విక్రయ శాల వద్ద తోపులాట జరిగింది. -
యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 9కి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొండపైన రిసెప్షన్ కార్యాలయంలో ఉద యం 8.30 నుంచే భక్తులు బ్రేక్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ప్రథమ ప్రాకార మండపంలోకి చేరుకున్నారు. 9గంటల సమయంలో భక్తులను తూర్పు త్రితల రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు. బ్రేక్ దర్శనాలతో రూ.87,600 ఆదాయం సమకూరింది. 8న ఆలయం మూసివేత నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారని వివరించారు. 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారన్నారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తా మని తెలిపారు. కాగా చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు. -
25న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు. దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు. -
యాదగిరి నర్సన్నకు బంగారు సింహాసనం.. విలువెంత?
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు దీన్ని బహూకరించాడు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల కోసం ఇప్పటికే ఒక బంగారు సింహాసనాన్ని ఓ భక్తుడు అందజేశారు. తాజాగా మరో సింహాసనాన్ని దాత ఇచ్చాడు. ఈ సింహాసనం విలువ ఎంత ఉంటుంది, ఎంత బంగారం పట్టిందనే అంశాలను అధికారులు తెలియనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ సింహాసనాన్ని ఆలయ ముఖ మండపంలో భద్రపరిచారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ప్రసాదం కౌంటర్, క్యూలైన్లు, ఘాట్ రోడ్డు.. ఇలా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రూ.150 టికెట్ దర్శనం క్యూలైన్ సరిగ్గా లేకపోవడంతో భక్తులు అష్టభుజి ప్రాకార మండపంలో బారులు దీరారు. టికెట్ కొనుగోలు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వామి వారిని 22,776 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం రూ.40,29,719 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరావడంతో రింగ్‌రోడ్డు, కొండపైన ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొండపైన పార్కింగ్ స్థలం కిక్కిరిసిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ కింద ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. -
యాదాద్రిలో లడ్డూ ప్రసాదం కోసం తోపులాట..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరిగ్గా అందక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసాద కౌంటర్ల వద్ద లడ్డూలు అయిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ప్రసాద విక్రయశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. సిబ్బంది తలుపులు మూసేయడంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన లడ్డూ తయారీ మెషీన్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పాతగుట్టలో లడ్డూ తయారు చేయిస్తున్నామని.. అక్కడి నుంచి మూడవ ఘాట్ రోడ్డు మీదుగా లడ్డూ ప్రసాదం తీసుకురావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పారు. కాగా, యాదాద్రి కొండపై, ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. చాల మంది కాలినడకన కొండపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలను సరిగా పార్కింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. యాదాద్రికి పోటెత్తిన భక్తులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. 40వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్మదర్శనా నికి 4గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
యాదాద్రిలో త్వరలో కోటి పుష్పార్చన వేడుక
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానా ర్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వేడుక తేదీలను ప్రకటిస్తామన్నారు. అంతే కాకుండా కోటి పుష్పార్చన వేడుక ముగిసిన వెంటనే వేయి యజ్ఞ గుండాలతో లోక కల్యాణార్థమైన లక్ష్మీనరసింహ సహస్ర కుండాత్మక మహాయాగం నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణమాసం ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలి వ చ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీస్వామి వారి ధర్మదర్శనానికి సుమారు మూడున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామిని 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వివిధ పూజల ద్వారా శ్రీస్వామి వారికి నిత్య ఆదాయం రూ.47,19,965 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
కనువిందు చేసిన కూచిపూడి నృత్యం
యాదగిరిగుట్ట: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాంపల్లిలోని సాంస్కృతిక విశ్వ కళామండలి, కళాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాంనర్సయ్య ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన కూచిపూడి నృత్య ఉపా«ధ్యాయిని హవిష సమక్షంలో 50 మంది విద్యార్థులు ఆరు గంటలపాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. యాదాద్రీశుడు, వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాలకు సంబంధించిన పాటలకు నృత్యం చేశారు. అలాగే పేరిణి నాట్యం ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూచిపూడి, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పేరిణి నృత్యాలు చేశారు. -
కదిరి మల్లెల గుబాళింపు.. ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం
సాక్షి, సత్యసాయి జిల్లా(కదిరి): కదిరి మల్లెల గుబాళింపునకు దేశంలోనే పేరుంది. ఇక్కడి మల్లెలు వెదజల్లినంతగా ఏప్రాంత మల్లెలు సువాసనలు ఇవ్వలేవన్న పేరు ఉంది. ముఖ్యంగా బ్రహ్మో త్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనలు ఇస్తాయని అంటుంటారు. ఈ ప్రాంతంలోని మల్లెల సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ప్రీతిపాత్రం. కదిరి మల్లెలకు భలే గిరాకీ కదిరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే మల్లెల గుబాళింపు అందరినీ మైమరిపిస్తుంది. ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువ. దాదాపు 600 ఎకరాలకు పైగా రైతులు మల్లెలు సాగుచేస్తుంటారు. ఇవి ఎందరికో ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు మల్లెలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో మల్లెపూలను విక్రయించేవారు ప్రత్యేకంగా కదిరి మల్లెలని అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాని రైతులు చెబుతున్నారు. ఖాద్రీశుడికి మల్లెపూల ఉత్సవం అలంకార ప్రియుడైన లక్ష్మీ నారసింహ స్వామికి తెల్లని మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టణానికి సమీపంలోని మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీర్చి ప్రత్యేకంగా మల్లెపూలతోనే అలంకరిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టం హిందువుల ఆరాధ్య దైవం శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెపూలతో అలంకరిస్తాం. శ్రీవారికి మల్లెపూలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం. – నరసింహాచార్యులు, నృసింహాలయ ప్రధాన అర్చకుడు ఎకరాకు రూ.5 లక్షలు వస్తుంది ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు. నాకున్న 72 సెంట్ల స్థలంలో పూర్తిగా మల్లెలే సాగు చేస్తున్నా. వేసవిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో మల్లెపూలు రూ.500కు అమ్ముడు పోతుంటాయి. సన్నమల్లెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. – విశ్వనాథ్, మల్లెతోట యజమాని, కదిరి రోజూ రూ.300 సంపాదిస్తా కిలో మల్లెపూలు కోస్తే రూ.75 కూలి చెల్లిస్తారు. ఈ లెక్కన రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను. ఈ డబ్బుతోనే నా కుమార్తెను బాగా చదివిస్తున్నా. ఏడాదిలో 8 నుంచి 9 నెలలు పూల కోత పని ఉంటుంది. – ప్రమీలమ్మ, కదిరి -
నరసింహుడికి బంగారు సింహాసనం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగిం చేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్ స్వామి, వీరమణి స్వామి ఆదివారం బహూకరిం చారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వ హించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. -
ముగిసిన నృసింహుడి జయంత్యుత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. ప్రధానాలయంలో నిత్య హవనాలు నిర్వహించిన అనంతరం ప్రథమ ప్రాకారంలోని యాగశాలలో పూర్ణాహుతి, ముఖమండపంలో సహస్ర కలశాలకు పూజలు, స్వయంభువులకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ ప్రవచనం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, మంగళ నీరాజనం చేసి ఉత్సవాలను ముగించారు. యాదాద్రిలో భక్తుల రద్దీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవురోజు కావడం, స్వామి జయంతి, స్వాతి నక్షత్రం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువుతో పాటు ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. 30 వేలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 45 నిమిషాలకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. -
యాదాద్రి క్షేత్రం వరదమయం (ఫోటోలు)
-
వైభవంగా రామలింగేశ్వరాలయ ఉద్ఘాటన
రా.. ఆంజనేయులు.. ‘గుట్ట’కు పోదాం! తుర్కపల్లి: సీఎం కేసీఆర్ సోమవారం యాదగిరిగుట్టకు వస్తూ మధ్యలో భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆగారు. గ్రామస్తులతో మాట్లాడారు. సర్పంచ్ పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్‌లో ఎక్కించుకుని యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిస్థితుల గురించి ఆంజనేయులును ఆడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో రామాలయం, పాఠశాల తొలగింపుపై గ్రామస్తుల అభిప్రాయాలను ఆంజనేయులు సీఎంకు వివరించారు. కాగా సీఎం ప్రయాణం సందర్భంగా వాసాలమర్రిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపై శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన గత నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న రామలింగేశ్వరుడి ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మించారు. ఇటీవలే ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో మహాకుంభాభిషేకం, ఉద్ఘాటన, స్పటిక లింగ ప్రతిష్టాపన చేపట్టారు. సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లింగానికి అభిషేకం చేశారు. అనంతరం పూజారులు అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్ దంపతులకు యాగ మండపంలో మాధవా నంద సరస్వతి స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తీర్చి దిద్దిన స్తపతి బాలసుబ్రహ్మణ్యంను శాలువాతో సన్మానించి, బంగారు కంకణాన్ని చేతికి తొడిగారు. తొలుత నరసింహుడిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం 11.50 గంటలకు యాదగిరిగుట్టకు వచ్చారు. ప్రెసిడెన్షియల్ సూట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని.. మూడో ఘాట్‌రోడ్డు మీదుగా ప్రధానాలయానికి చేరుకున్నారు. వేద పండితులు తూర్పు రాజగోపురం వద్ద సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. తర్వాత సీఎం దంపతులు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించు కుని.. శివాలయానికి వెళ్లారు. 12.48 గంటలకు మహాశివుడిని దర్శించుకొని, శ్రీమాధవనంద సరస్వతి స్వామితో కలిసి అభిషేకం, పూజల్లో పాల్గొన్నారు. మహాపూర్ణాహుతి అనంతరం 1.37 గంటల సమయంలో ప్రెసిడెన్షియల్ సూట్‌కు వెళ్లారు. అక్కడ భోజనం చేసి, అధికారులతో సమీక్షించారు. 3.10 గంటల సమయంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. ప్రత్యేక ఏర్పాట్లు.. బందోబస్తు.. సీఎం రాక సందర్భంగా యాదగిరిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం నుంచి శివాల యం వరకు ఎర్ర తివాచీలు పరిచారు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో సీఎం దంపతులకు ప్రత్యే కంగా గొడుగులను ఏర్పాటు చేశారు. ఇక గుట్ట పైన, కింద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. -
యాదాద్రి ప్రధానాలయం అత్యద్భుతం
యాదగిరిగుట్ట: యాదాద్రిలో పునర్నిర్మితమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం అత్యద్భుత కట్టడమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ కొనియాడారు. దేశ స్వాతంత్య్రానంతరం పూర్తిగా రాతితో ఇంత పెద్ద ఆలయం ఎక్కడా నిర్మితం కాలేదని చెప్పారు. మంగళవారం తొలిసారి యాదాద్రికి విచ్చేసిన ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వరూపానందేంద్ర సరస్వతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ శైలిని పరిశీలించారు. ఆ తర్వాత యాదాద్రి కొండ కింద తులసీ కాటేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర స్వామీజీతో కలసి మాట్లాడారు. తిరుమల అంత గొప్పగా కావాలి... దేశంలో హిందూ నాయకులమని చెప్పుకొనే వారు ఎందరున్నా యాదాద్రి ప్రధానాలయాన్ని పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అహోబిలం, తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం సహా మరెన్నో మండపాలను శ్రీకృష్ణదేవరాయల హయాంలో అభివృద్ధి చేయగా ఇప్పుడు ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ ప్రజలకు అందించడం సంతోషకరమన్నారు. యావత్ దేశంలో శక్తివంతమైన, అద్భుతమైన క్షేత్రంగా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్పగా యాదాద్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ శారదా పీఠానికి వచ్చే భక్తులు యాదాద్రి నిర్మాణం గురించి చెప్పడంతో చూసేందుకు వచ్చానని తెలిపారు. ఇటీవలే ప్రధానాలయ నిర్మాణం జరిగినందున ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే ఆలయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి బోర్డు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దేవాలయాలు ఎవరి సొత్తూ కాదు.. హిందూ దేవాలయాలు ఏ ఒక్కరి సొత్తు కావని... అవి సనాతన ధర్మాల సొత్తు అని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అలా ఎవరైనా అనుకుంటే పొరపాటని చెప్పారు. అలాగే ఏ ఆలయాన్నీ వైష్ణవులకో లేక శైవులకో పరిమితం చేయరాదన్నారు. వైష్ణవులు, శైవుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు సకల దేవతలను కీర్తిస్తూ స్తోత్రా లు రాశారని స్వరూపానందేంద్ర గుర్తుచేశారు. ఆదిశంకరాచార్యులు రాసిన ‘ఉగ్రం వీరం మహా విష్ణువు జ్వలంతం సర్వతో ముఖం’ స్తోత్రాన్ని యాదాద్రిలోనూ పఠిస్తున్నారన్నారు. -
యాదాద్రిలో దర్శనానికి 2 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో పంచనారసింహులను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండుగా కనిపించాయి. -
యాదాద్రి సమాచారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ పూజాధికాలు.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన. రాత్రి 9–9.30 రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం. ద్వార బంధనం. సర్వ దర్శనాలు: ఉదయం 6–7.30. మళ్లీ 10–11.45. మధ్యాహ్నం 12.30 –3. సాయంత్రం 5–7. రాత్రి 8.15–9. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వీఐపీలకు ఉదయం, సాయంత్రం కల్పించే బ్రేక్ దర్శనాలను శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దుచేసినట్లు ఈఓ గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రికి పోటెత్తిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహులను ఆదివారం 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని బస్టాండ్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు భారీగా కనిపించారు. కొండపైన గల క్యూ కాం ప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తాగునీరు, మరుగుదొడ్ల వసతులు లేకపోవడంతో భక్తు లు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది. -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్
యాదగిరిగుట్ట: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధానాల యం తూర్పు రాజగోపురం వద్ద గవర్నర్ దంపతు లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులు కొలు వైన స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. ముఖ మండపంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అంద జేశారు. దైవదర్శనం తరువాత గవర్నర్ దంపతులు ప్రధానాలయ కట్టడాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద తమిళిసై మాట్లా డుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రానికి వచ్చిన చిన్నారులతో గవర్నర్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయానికి వచ్చిన గవర్నర్... 2:10 గంటలకు తిరిగి వెళ్లారు. గవర్నర్ వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులున్నారు. గవర్నర్ పర్యటనకు దూరంగా ఈఓ.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానా లయం పునఃప్రారంభమైన తరువాత తొలిసారి స్వయంభూలను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశ మైం ది. యాదాద్రీశుడి దర్శనానికి శనివారం మధ్యా హ్నం గవర్నర్ వస్తున్న విషయాన్ని రాజ్ భవన్ అధికారులు ఆలయ అధికారులకు ముందుగా నే సమాచారం అందించారు. ఆలయ మర్యాద లు, ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ఈవో స్వా గతం పలకాలి. అలాగే దగ్గరుండి పూజలు చే యించాల్సి ఉంది. కానీ ఈవో గీతారెడ్డి గవర్న ర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆల య అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి గవర్నర్ దంపతులను దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. తరువాత స్వ యంగా లడ్డూ ప్రసాదం అందజేశారు. అయితే గవర్నర్ పర్యటనకు డుమ్మాకొట్టిన ఈవో... సా యంత్రం ఆలయంలో జరిగిన సేవలో, ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
యాదాద్రి సమాచారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని బుధవారం వేకువజామున 3 గంటలకు తెరుస్తారు. విశేష పూజలు: తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. అనంతరం విశేష పూజాధికాలు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు).. ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.30 వరకు తిరువారాధన. 7.30 నుంచి 8.15 వరకు సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. 9.15 నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన (ఆరగింపు). 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం.. ఆలయ ద్వారబంధనం. సర్వ దర్శనాలు: 6.30 నుంచి 8 గంటల వరకు. తిరిగి 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్లీ 12.45 నుంచి 4 గంటల వరకు, ఆపై సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు..చివరిగా రాత్రి 8.15 నుంచి 9.15 వరకు సర్వ దర్శనాలు. వీఐపీ బ్రేక్ దర్శనాలు: ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. 16 నుంచి నిత్య కల్యాణాలు! యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో వచ్చే నెల 16 నుంచి నిత్య కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పూజలకు సంబంధించి త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. యాదాద్రిలో ప్రసాదం కౌంటర్లు ప్రారంభం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనాన్ని ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. కల్యాణ కట్ట వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం (సీఆర్వో) వద్ద టికెట్లు తీసుకుని, కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రసాదం కౌంటర్లలో ప్రసాదం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం ప్రసాదం కొనుగోలు ద్వారా ఆలయానికి రూ.817,580 ఆదాయం వచ్చింది. – యాదగిరిగుట -
నమో నారసింహ
సాక్షి, యాదాద్రి: కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ మహాక్రతువులో చివరగా మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించి, ప్రధాన ఆలయంలో దర్శనాలను మొదలుపెడతారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంభూ నారసింహుడి వద్ద తొలిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధానాలయంతోపాటు పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. పంచాకుండాత్మక యాగం ముగించి.. తొలుత ఉదయం 6.30 గంటలకు బాలాలయంలో హవనం ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగుస్తుంది. అనంతరం స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, ఆళ్వారులు, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్ర నిర్వహించాక మూర్తులను లోనికి తీసుకెళతారు. ఏకకాలంలో అన్నిచోట్లా.. శోభాయాత్ర అనంతరం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు. కలశ ప్రతిష్ట, ప్రారంభ పూజలకు అతిథులు వీరే.. మహకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. ప్రధానాలయం విమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. తూర్పు రాజగోపురం వద్ద దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దక్షిణ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, పశ్చిమ రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉత్తర రాజగోపురం (పంచతల) వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, పశ్చిమ రాజగోపురం (సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్, తూర్పు రాజగోపురం (త్రితల) వద్ద మంత్రి గంగుల కమలాకర్ పూజలు చేస్తారు. శ్రీగరుడ ఆళ్వార్ సన్నిధి వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బ్రహోత్సవ మండపం వద్ద మంత్రి కేటీఆర్, ఆళ్వార్ సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్, ఆగ్నేయ ప్రాకార మండపం–3 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాయవ్య ప్రాకార మండపం–18 వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–21 వద్ద మంత్రి మల్లారెడ్డి, ఈశాన్య ప్రాకార మండపం–22 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈశాన్య ప్రాకార మండపం–23 వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈశాన్య ప్రాకార మండపం–24 వద్ద మంత్రి హరీశ్‌రావు, శ్రీరామానుజ సన్నిధి వద్ద సీఎస్ సోమేశ్‌కుమార్, వాయవ్య ప్రాకార మండపం–17 వద్ద ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పాల్గొంటారు. జంటలుగా వీఐపీలు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న ముఖ్యులు దం పతులతో కలిసి రావాలని ఆహ్వానంలో కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు జంటగా పూజల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదీ.. ► సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో సోమవారం ఉదయం 10.45 గంటలకు యాదాద్రి టెంపుల్ సిటీకి వస్తారు. ► ప్రత్యేక కాన్వాయ్‌లో 10.50 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటారు. ► 11.20 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా యాదాద్రి కొండపైకి వస్తారు. ► కేసీఆర్, కుటుంబ సభ్యులు 11.30 గంటలకు ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభయాత్రలో పాల్గొంటారు. ► తర్వాత 11.55 గంటలకు ప్రధానాలయ విమాన గోపురం వద్ద మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. ► 12.30 గంటల సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి గర్భాలయంలో తొలిపూజ చేస్తారు. ► వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకుని.. ఆలయ పునర్నిర్మాణ క్రతువులో పాల్గొన్నవారిని సన్మానిస్తారు. ► మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొండ కింద యాగస్థలంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ భోజనాలు చేస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. పూలు, దీపాలతో అలంకరించి.. మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పూలతో ప్రధానాలయం, మండపాలు, ధ్వజ స్తంభం, గర్భాలయాన్ని ముస్తాబు చేశారు. యాదాద్రి ప్రధానాలయం, పరిసరాలతోపాటు కొండ మొత్తం రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. -
యాదాద్రి వైభవాన్ని చూసొద్దాం (ఫోటోలు)
-
అగ్నిమథనం.. ప్రతిష్ఠ
సాక్షి, యాదాద్రి: యాదాద్రిలో శ్రీ నృసింహస్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు రెండోరోజు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వశాంతి, లోకకల్యాణార్థం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానాచార్యులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు కనులపండువగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 9 గంటలకు శాంతిపాఠం, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమ«థనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభించారు. విశేష వాహనములు, మూర్తిమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు. 30 నిమిషాలపాటు అగ్నిమథనం ఉత్సవాల్లో భాగంగా మహా మండపంలో యాగశాల ముందు భాగంలో అగ్నిమథనం కార్యక్రమాన్ని జరిపించారు. 10 మంది అర్చక స్వాములు, యాజ్ఞీకులు సహజంగా అగ్ని వచ్చేటట్లు అగ్నిమథనం చేశారు. జమ్మి, రాగి చెట్టు కర్రల ద్వారా అగ్నిని పుట్టించారు. ఈ అగ్నిని పుట్టించేందుకు సుమారు 30 నిమిషాలపాటు సంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాలతో ఆచార్యులు, పారాయణీకులు పూజలు చేశారు. వృత్త కుండంలో అగ్ని ప్రతిçష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆ వృత్త కుండం నుంచి మిగతా అన్ని కుండాలకు అగ్నిని విస్తరించారు. విశేష యజ్ఞ హవనములు పంచకుండాత్మక మహా యాగంలో అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణుడిని ప్రస్తుతించే మంత్రాలు, మూల మంత్రాలతో దశాంశ, శతాంశ, సహస్రంశాది తర్పణాలు, శ్రీ లక్ష్మీనారసింహుని స్తోత్రాలతో బీజాక్షర మంత్రాలతో విశేష హోమం నిర్వహించారు. బాలాలయంలో రాత్రి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి వారి ప్రధానాలయంలో బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం చేశారు. బింబ పరీక్ష ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన నూతన శిలస్వరూపులైన దేవతలు శిల్పి ఉలి తాకిడికి ఏర్పడిన అపరాధాన్ని తొలగించడానికి మంత్రోచ్ఛరణతో సంప్రోక్షణ చేయడం, శాంతి హోమం ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం ప్రధాన ఆలయంలోని ఆయా మూర్తుల తేజస్సును పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు. నవకలశ స్నపనం ద్వారా సర్వాభీష్ట సిద్ధి, సర్వసంపదలు కలగాలని నిర్వహించారు. -
ఉద్ఘాటన ఉత్సవాలకు వేళాయె..
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన ఉత్సవాలు సోమవారం మొదలుకానున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా అంకురార్పణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనం, సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం పూజలతో ప్రారంభమవుతాయి. ఈనెల 28 వరకు జరిగే ఆలయ ఉద్ఘాటన కార్యక్రమంలో ప్రతిరోజూ వివిధ రకాల యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. 108 మంది పారాయణికులు, వేద పండితులు బాలాలయంలో ఏడు రోజులపాటు సప్తాహ్నిక పంచకుండాత్మక యాగం నిర్వహిస్తారు. ఇప్పటికే బాలాలయంలోని మహా మండపంలో పంచ కుండాలను ఏర్పాటు చేసి, అందులోకి ప్రవేశించేందుకు ద్వారాలను సైతం అమర్చారు. యాగ మండపం అంతా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలతో సిద్ధం చేశారు. 28వ తేదీన ఉదయం 11.55 గంటలకు మిథున లగ్న ముహూర్తంలో జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సంప్రోక్షణ తరువాత మధ్యాహ్నం 2గంటలకు భక్తులకు శ్రీస్వామి వారి స్వయంభూ దర్శనాన్ని కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. పంచ నారసింహ క్షేత్రం అయినందున.. యాదాద్రీశుడు వెలసింది పంచ రూపాలతో కాబట్టి ఈ పంచ నారసింహ క్షేత్రంలో పంచ కుండాత్మక యాగాన్ని నిర్వహించడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యాగంలో ప్రధానంగా కుండాలను ఆయా దిశల్లో ఏర్పాటు చేశారు. చతురస్ర కుండం దీనిని వాసుదేవ కుండం అంటారు. దీన్ని తూర్పు దిశలో ఏర్పాటు చేశారు. ధనుస్సు కుండం దీనిని సంకర్షణ కుండంగా పిలుస్తారు. దీనిని దక్షిణ దిశలో పెట్టారు. వృత్త కుండం దీనిని ప్రద్యుమ్న కుండం అంటారు. దీన్ని యాగశాలలో పశ్చిమ దిశలో ఏర్పాటు చేశారు. త్రికోణం కుండం దీనిని అనిరుద్ర కుండం అంటారు. దీనిని యాగశాలకు ఉత్తర భాగంలో పెట్టారు. ఇక పద్మ కుండం దీనిని అవసఖ్య కుండం అంటారు. ఈ కుండాన్ని ఈశాన్య దిశలో నిర్మించారు. నేటి కార్యక్రమాలు 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వస్తి వాచనం, విష్వక్సేన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమం, వాస్తు పర్వగ్నకరణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 9.30 వరకు మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన ఉంటుంది. 2,167 రోజుల తర్వాత.. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 2016 ఏప్రిల్ 21న గర్భాలయాన్ని మూసివేసి భక్తుల కోసం బాలాలయం నిర్మించి స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు గర్భాలయంలో అర్చకులు స్వామి వారికి పూజలు నిర్వహించినప్పటికి భక్తులకు మాత్రం దర్శన భాగ్యం కలగలేదు. ఈనెల 28న ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పిస్తారు. అంటే 2,167 రోజుల తర్వాత భక్తులకు స్తంబోద్భవుని దర్శనభాగ్యం కలగనుంది. 28 నుంచి బాలాలయం మూసివేస్తారు. 1,200 కోట్లతో నిర్మాణం యాదవ మహర్షి తపస్సుతో కొండ గుహలో వెలసిన పంచ నారసింహుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. పూర్వం కీకారణ్యంలోని గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు పూజలు చేస్తుండే వారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి యాదాద్రి క్షేత్రాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. తొలిసారిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద ఆలయం భక్తులకు అందుబాటులోకి వస్తోంది. రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ఆలయం పునర్మిర్మాణ పనుల్లో ప్రధానాలయానికి రూ.248 కోట్లు ఖర్చుచేశారు. పచ్చదనం, సుందరీకరణ, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞానికి ప్రతీకగా యాదాద్రి నూతన ఆలయం నిలువనుంది. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వందల ఏళ్ల క్రితం రాజులు నిర్మించిన పురాతన ఆలయాల అనుభూతి కలగనుంది. -
రోజూ 45 వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఉద్ఘాటన ఉత్సవాలు జరిగే సమయంలో రోజూ 45 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 75 మినీ బస్సులను కొండపైకి నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బస్సులు సేవలందిస్తాయి. జేబీఎస్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి ప్రత్యేక బస్సులు సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి పికెట్ డిపోకు చెందిన ఆరు బస్సులను నేరుగా యాదాద్రి కొండపైకి నడపనున్నారు. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా ఏసీ వజ్ర బస్సుల్లో కూడా భక్తులను కొండపైకి చేర్చనున్నారు. ఇక యాదగిరిగుట్ట– భువనగిరి నుంచి నిరంతరం భక్తుల కోసం బస్సులు అందుబాటులో ఉంటాయి. కాగా, వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ఇతర డిపోల బస్సులు పాత బస్టాండ్‌లో భక్తులను దించుతాయి. అక్కడనుంచి నేరుగా కొండపైకి వెళ్లేందుకు మినీ బస్సులు సిద్ధంగా ఉంటాయి. ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో కొండపైకి ఆటోలు, ప్రైవేట్ వాహనాలను బంద్ చేయనున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం పాత గోశాల సమీపంలో తమ వాహనాలను పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. 34 అడుగుల ధ్వజస్తంభం కిలో 780 గ్రాములతో స్వర్ణతాపడం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన బంగారు ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. సుమారు 34 అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజ స్తంభానికి కిలో 780 గ్రాముల బంగారంతో తయారు చేసిన కవచాలను బిగించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా «బలిపీఠం, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
యాదాద్రి ఆలయానికి సీఎం కేసీఆర్ దంపతులు
-
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
యాదాద్రి ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు ట్రయల్‌రన్
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధుల బృందం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ దర్శనం టికెట్ దేవస్థానం అధికారులు నిర్ణయించిన ధరతో వస్తుంది. ఇందులో దర్శనానికి సంబంధించి రిపోర్టింగ్ తేదీ, సమయం, ఏ గేట్ వద్ద రిపోర్ట్ చేయాలి, బుకింగ్ నంబర్, బుకింగ్ డేట్, చెల్లించిన నగదు, ఆలయసేవలు, ఆలయానికి సంబంధించిన ఫోన్ నంబర్, ఆధార్, పేరు క్యూర్ కోడ్‌తో ఉండనున్నాయి. ప్రధానాలయం ప్రారంభం అయిన తర్వాత ఎన్ని రోజులకు ఈ టికెట్ బుకింగ్ విధానం ప్రవేశపెడతారు, ఏ వెబ్సైట్లో వీటిని వినియోగించాలనే అంశాలను అధికారులు నిర్ణయించాల్సి ఉంది. -
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. బాలాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. ముందుగా గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం కార్యక్రమాలను నిర్వహించారు. ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. మొదట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి యజ్ఞాచార్యులకు, ఆ తర్వాత ఆలయ అర్చకులకు రక్షాబంధనం చేశారు. అనంతరం అర్చకులు దేవస్థాన ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నర్సింహమూర్తిలకు రక్షాబంధనం చేశారు. ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్ష తీసుకోవడమే రక్షాబంధనం. అనంతరం పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు చీరలు, ధోవతి, కండువా, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపచేశారు. పుట్టమన్నును 12 పాత్రలలో వేసి 12 రకాలైన ధాన్యాలను వేసి 12 రకాల దేవతలతో ఆవాహన చేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. ధ్వజస్తంభానికి బంగారు తొడుగు ఈనెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అళ్వార్ మండపంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి చేపట్టిన బంగారు తొడుగుల పనులు తుది దశకు చేరాయి. ధ్వజస్తంభం 34 అడుగుల ఎత్తు ఉంది. ఇక గోపురాలు, విమాన శిఖరాలపై బిగించేందుకు బంగారు కలశాలు సిద్ధం చేస్తున్నారు. కలశాలు 8 నుంచి 10అడుగుల ఎత్తు ఉన్నాయి. -
Antarvedi: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ఫొటోలు
-
CM KCR : యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన (ఫొటోలు)
-
స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్వాన్కు చెందిన బండారి బ్రదర్స్ సోమవారం తమ కుటుంబం తరఫున రూ.50లక్షల విలువైన డీడీలను ఈఓ గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారు ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, సోదరుల తరపున ఈ విరాళం అందించామని తెలిపారు. -
యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్ ల్యాబ్ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు. మరో రూ.50 లక్షలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. స్వర్ణతాపడానికి బంగారం అందజేత యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు. -
యాదాద్రి ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన సందీప్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 11న యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. స్వామి వారి నిత్య కల్యాణ వేడుకలో పాల్గొన్న వీరికి వడ ప్రసాదం అందజేశారు. ఇంటికెళ్లిన తర్వాత సోమవారం రాత్రి వడ ప్రసాదం తింటున్న సమయంలో అందులో ప్లాస్టిక్ కవర్ తగిలింది. దీంతో సందీప్ ‘‘ఎవరైనా చూసుకోకుండా తింటే ప్రాబ్లెమ్ అవుతుంది..దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను’’అంటూ వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయమై దేవస్థానం సూపరింటెండెంట్ అశోక్‌ను సాక్షి వివరణ కోరగా..ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని వాటిపై ఉన్న కవర్ చిన్నది పడినట్లుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400లకు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివి స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన 2 కేజీల బంగారాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డికి విరాళంగా అందజేశారు. యాదాద్రీశుడి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అంతకుముందు బంగారం నాణేలకు ప్రతిష్టామూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన పి.మధుబాబు అనే భక్తుడు బంగారం తాపడం కోసం రూ.1,72,000ను విరాళంగా గీతారెడ్డికి అందజేశారు. నాడు భక్త రామదాసు.. నేడు సీఎం కేసీఆర్ భదాద్రి రామచంద్రస్వామి ఆలయాన్ని నాడు భక్త రామదాసు నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని పునర్నిర్మాణం చేస్తు న్నారని జనార్దన్‌రెడ్డి కొనియాడారు. విమాన గోపురానికి బంగారం తాపడంలో తమ కుటుంబం పాత్ర ఉండాలని బంగారాన్ని అందజేశానని, టెంపుల్ సిటీపై నిర్మిస్తున్న కాటేజీలకూ రూ.2 కోట్లను జేసీ బ్రదర్స్ కంపెనీ తరఫున ఇస్తున్నట్లు వెల్లడించారు. -
యాదాద్రికి మల్లారెడ్డి రెండో విడత విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి రూ. 3 కోట్ల 64 వేలు అందించారు. రెండవ విడతగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో మొత్తం రూ.84,29,880 నగదు, రూ.2,16,35,042 విలువ చేసే చెక్కులు, 200 గ్రాముల బంగారాన్ని బాలాలయంలో ఆలయ ఈవో గీతారెడ్డికి సోమవారం అందజేశారు. మొదటి విడతగా గత నెల 28వ తేదీన రూ.1.83 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజు ల్లో 11 కిలోల బంగారానికి అవసరమయ్యే నగదును అందజేస్తామని వెల్లడించారు. -
ఒకే రకమైన దర్శనం కల్పించాలి
యాదగిరిగుట్ట: అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో రాబోయే రోజుల్లో భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం లభించే విధంగా ప్రభుత్వం, అధికారులు కృషిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి అన్నారు. యాదాద్రీశుడిని శనివారం జస్టిస్ సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆచార్యులు మండపంలో ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే యాదాద్రి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వీఐపీలు, వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సైతం శ్రీస్వామివారి దర్శనం అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా జడ్జి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
యాదగిరి నర్సన్నకు.. మంత్రి మల్లన్న 3.5 కిలోల బంగారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడంకోసం మూడున్నర కిలోల బంగారానికి సరిపడే నగదును కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (మల్లన్న) గురువారం తన నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. మేడ్చల్‌లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో మం త్రి మల్లారెడ్డి యాదాద్రి కొండకు చేరుకున్నారు. రూ.కోటి 83 లక్షల నగదును తలపై పెట్టుకొని కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి బాలాలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి, ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించిన సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, అలాగే మేడ్చల్ ప్రజల తరపున కూడా బంగారం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరపున రూ.1 కోటి 83 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో రూ.72 లక్షలు చెక్కు రూపంలో, రూ.కోటి 11 లక్షలు నగదు రూపంలో అందజేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.మల్లారెడ్డి అనుచరులు బాలాలయంలో శ్రీస్వామివారి ప్రతిష్టా కవచమూర్తుల విగ్రహాలను సెల్ ఫోన్లతో ఫొటోలు తీశారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఫొటోలను సెల్ ఫోన్లో నుంచి తొలగించారు. ‘జేఎస్ఆర్ సన్‌సిటీ’రూ.50 లక్షల విరాళం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులకు స్థిరాస్తి సంస్థ జేఎస్ఆర్ సన్‌సిటీ అధినేత జడపల్లి నారాయణ విరాళం అందజేశారు. గురువారం రూ.50 లక్షల చెక్కును ఆయన ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. -
మరో తిరుమలగా యాదాద్రి !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇలవేల్పుగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం త్వరలో మరో తిరుమలగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా నిర్మిం చిన ఆలయంలో స్వామి దర్శనం మొదలుకాగానే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. యాదగిరిగుట్టగా ఉన్న దాదాపు వెయ్యేళ్లనాటి ఆలయాన్ని రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రిగా కొత్తరూపుతో పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ఉత్సవమూర్తిని బాలాలయంలో ప్రతిష్టించి దర్శనాలు కల్పిస్తున్నారు. మార్చిలో సుదర్శనయాగాన్ని నిర్వహించి కొత్త ఆలయంలోకి స్వామి వారిని తరలించి మూలవిరాట్టుతో కలిపి దర్శనభాగ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం 25 వేలమంది వరకు భక్తులు ప్రస్తుతం బాలాలయాన్ని నిత్యం 20 వేల నుంచి 25 వేల మంది దర్శించుకుంటున్నారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఆ సంఖ్య 40 వేలను మించుతోంది. అతి సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 12 వేల మంది వస్తున్నారు. అయితే కొత్త ఆలయంలో దర్శనాలు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య 50 వేలకు చేరుకుంటుందని అధికారులు అంచనాకొచ్చారు. ఇక సెలవులు, ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల కాలంలో 70 వేలను మించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తిరుమల వెంకన్నను నిత్యం సగటున 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య 80 వేలను మించుతుంది. ఈ విధంగా భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే యాదాద్రి రెండో తిరుమలగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పునర్నిర్మాణానికి ముందు 7 వేల వరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని యావత్తు తెలంగాణ ఇలవేల్పుగా భావిస్తుంటారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో స్వామివారిని ఇలవేల్పుగా భావించే కుటుంబాలు భారీగా ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకముందు నిత్యం సగటున ఏడు వేల మంది వరకు దర్శించుకునేవారు. ప్రత్యేక సందర్భాల్లో ఆ సంఖ్య 10 వేల వరకు ఉండేది. పునర్నిర్మాణ పనులు మొదలై, నిర్మాణ ప్రత్యేకతలకు ప్రాధాన్యం వచ్చి ప్రచారం జరగటంతో ఒక్కసారిగా ఆలయానికి రద్దీ పెరిగింది. ప్రధాన ఆలయం పనులు కొలిక్కి రానప్పటికీ, బాలాలయంలో ని స్వామిని దర్శించుకునేవారి సంఖ్య రెండు రెట్లకు చేరింది. సాధారణ భక్తులకు కొత్త దేవాలయంలోకి ఇప్పటివరకు అనుమతి లేదు. రాతి నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్న ఆలయ పనులపై ఆసక్తి ఉన్నా, పనులకు ఆటంకం కలగవద్దన్న ఉద్దేశం తో భక్తులను అటువైపు అనుమతించటం లేదు. అయినా రద్దీ పెరుగుతూనే వస్తోంది. ఒకేసారి లక్ష మందికి వసతులు ఆలయానికి ఒకేసారి లక్ష మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగని విధంగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది కూడా భక్తుల సంఖ్య పెరిగేందుకు దోహదపడనుంది. దేవాలయం ఉన్న గుట్టకు మరోవైపు ఉన్న పెద్ద గుట్టను ఏకంగా ఆలయ నగరిగా మార్చేస్తున్నారు. దాదాపు వేయి ఎకరాల మేర విస్తరించిన ఒక గుట్టను సాధారణ భక్తుల కాటేజీలు, ఇతర వసతులకు కేటాయించారు. ఇందులో 250 ఎకరాల్లో ఒక్కోటి నాలుగు సూట్లు ఉండే 252 కాటేజీలు నిర్మించారు. ప్రెసిడెన్షియల్ విల్లాతో పాటు వీవీఐపీలకు కాటేజీలను 13 ఎకరాల్లో విస్తరించిన మరో గుట్టపై నిర్మించారు. 3 వేల మంది ఒకేసారి ఉండేలా క్యూలైన్లను నిర్మించారు. పూర్తి రాతి నిర్మాణం రాజుల పాలనలో రాతి నిర్మాణాలుగా దేవాలయాలు రూపుదిద్దుకునేవి. ఆ తర్వాత సిమెంటు నిర్మాణాలే చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో తొలిసారి కృష్ణ శిలతో పూర్తి రాతి నిర్మాణంగా యాదాద్రి రుపుదిద్దుకుంది. ఇది భక్తుల్లో ఎనలేని ఆసక్తిని పెంచింది. ఇక భాగ్యనగరానికి యాదాద్రి కేవలం 70 కి.మీ. దూరంలోనే ఉంది. నాలుగు వరసల రోడ్డు అందుబాటులోకి రావటంతో ప్రస్తుత ప్రయాణ సమయం గంటగంటన్నరగానే ఉంటోంది. కోటి జనాభా ఉన్న భాగ్యనగరానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాదాద్రి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి కూడా దీన్ని చూసేందుకు భక్తులు వస్తున్నా రు. నగరానికి వచ్చే పర్యాటకులు పనిలోపనిగా ఆలయానికి వస్తున్నారు. చుట్టూ పర్యాటక ప్రాజెక్టులు కూడా రానుండటం తో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
త్వరలోనే ఆలయ భద్రత చర్యలను చేపడతాం: ఆళ్ల రామకృష్ణారెడ్డి
-
సింహాచలం భూములపై లోతుగా విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాల గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ ఇ.పుష్పవర్దన్ బుధవారం టర్నర్ సత్రం ఉప కమిషనర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఆస్తుల జాబితా, 22 ఏ జాబితా, ఇతర రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. అడంగల్ కాపీలు, టెన్ వన్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. 2016 డిసెంబర్–2017 ఫిబ్రవరి మధ్య 740 ఎకరాల భూమిని జాబితాల నుంచి తప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాల్లోని భూములను జాబితాల నుంచి తప్పించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2010 రికార్డుల ప్రకారం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉండగా.. 2016 నాటికి 10,278 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ అధికారులు రెండు రోజుల్లో దేవదాయ శాఖ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
ష్... గప్‌చుప్!
సాక్షి, అమరావతి: సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా గుట్టుగా ఆలయ ఈఓ స్థాయిలో సాగుతున్న ఈ భూబాగోతం వ్యవహారం గురించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఉప్పు అందింది. దీంతో అప్పటి కమిషనర్ ఈ మొత్తం తతంగంపై విచారణకు మౌఖికంగా ఆదేశిలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్ కార్యాలయంలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. ఆరు పేజీలతో కమిషనర్‌కు నివేదిక కాగా, ఆలయాల ఆస్తుల రిజిస్టర్లో పేర్కొన్న భూముల వివరాల వారీగా ఆ ముగ్గురు అధికారులు మూడ్రోజులపాటు విచారణ జరిపి కమిషనర్‌కు ఆరు పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో.. ఎవరి నుంచి ఎలాంటి వినతులు రాకుండా ఏకపక్షంగా సదరు 748 ఎకరాలు దేవుడి భూములు కావని ప్రకటించే అధికారం ఎవరికీ లేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. భూములు తమవిగా ప్రజల నుంచి వినతి వచ్చినప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం విచారణ జరిపి వాటికి కమిషనర్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) జారీచేయాల్సి ఉంటుందని అందులో వివరించారు. లేదంటే.. దీనిపై ఎవరైనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే ట్రిబ్యునల్ తగిన ఆదేశాలు జారీచేస్తుందంటూ దేవదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆ ముగ్గురు అధికారులు తమ నివేదికలో స్పష్టంచేశారు. కాగా, ఈ ఆరు పేజీల నివేదిక ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద భద్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందరూ సైలెంట్.. ఇదిలా ఉంటే.. ముగ్గురు అధికారులు అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ స్థాయిలో ఈ భూముల గోల్మాల్ యథేచ్ఛగా కొనసాగింది. కానీ, అప్పటి కమిషనర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. అప్పటి ప్రభుత్వ ముఖ్యుల నుంచి అందిన ఆదేశాలే కారణమని విశ్వసనీయ సమాచారం. -
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
-
నయనానందకరంగా అంతర్వేది 'రథయాత్ర'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం మంగళవారం నయనానందకరంగా సాగింది. సంపద్రాయబద్ధంగా సాగిన రథయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు అంతర్వేదికి పోటెత్తారు. మెరక వీధిలో మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర మొదలైంది. కళ్యాణమూర్తులను రథం మీద ఉంచి పురవీధుల్లో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. స్వామివారు కళ్యాణ అనంతరం రథం మీద వెళ్లి తన సోదరి గుర్రాలక్కకు చీర, సారె పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ముఖ్యఅతిథిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల కొంతమంది గుర్తుతెలియని దుండగులు అంతర్వేది రథాన్ని దగ్ధంచేయడం.. రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కొత్త రథాన్ని తయారుచేయించడం.. అనంతరం కళ్యాణోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ దీనిని ఇటీవలే ప్రారంభించడం తెలిసిందే. కాగా, కొత్త రథాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ సమయం కన్నా రథయాత్ర సమయంలోనే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ముస్తాబు చేసిన కొత్తరథాన్ని తాకి పులకించిపోయారు. పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు మరోవైపు.. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున సముద్ర సంగమ ప్రాంతంలో జరిగిన పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. అంతర్వేది బీచ్ నుంచి సంగమ ప్రాంతం వరకు సుమారు కిలోమీటరు మేర భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం అర్ధరాత్రి కల్యాణ వేదిక వద్ద అసంఖ్యాకమైన భక్తుల సమక్షంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు. -
19న అంతర్వేదికి సీఎం జగన్
సఖినేటిపల్లి: రథసప్తమి పర్వదినాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి దర్శనార్థం రానున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం అంతర్వేదిలో సిద్ధమైన కొత్తరథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రథసప్తమి రోజున భక్తుల ద్వారా రథాన్ని బయటకు తీసే అవకాశం ఉందని, ఈ తరుణంలో అంతర్వేదికి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరగా అంగీకరించారని చెప్పారు. రథం దగ్ధమైన ఘటనపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో భక్తుల మనోభావాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిందన్నారు. అయితే, సీబీఐ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రథానికి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మూడో రోజును పూర్ణాహుతి చేసి, అన్నిరకాల పూజలు చేయిస్తామని చెప్పారు. దీనికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విచ్చేస్తున్నారన్నారు. -
నరసన్న రథం రెడీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండున్నర నెలల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం రథానికి సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు చాలా బాగుందయ్యా! ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు. – మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం -
ఫిబ్రవరి 23న అంతర్వేదిలో ఉత్సవాలు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున రావు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి రథం నిర్మాణం పూర్తవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం ఫిబ్రవరి 23న వస్తుందని, ఆ రోజు నూతన రథంతో ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ మరియు ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి నూతన రథం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అధిక నాణ్యత గల బస్తర్ టేక్ వుడ్‌ను రథం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం) -
‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం
మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానార్చకుడు పి.కిరణ్, అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పనులు ప్రారంభించారు. రథం తయారీకి వినియోగించే టేకు కలపకు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు రూ. కోటి వ్యయంతో ఈ రథాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రథం తయారీకి అవసరమైన ఖరీదైన బస్తర్ టేకు కలపను రావులపాలెంలో కొనుగోలు చేసి, ఆలయం వద్దకు తరలించారు. ► రథం పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుతూ ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపంలో తొలుత శ్రీ సుదర్శన నారసింహ మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ► మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. రానున్న స్వామివారి కల్యాణోత్సవాల నాటికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా రథం తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ► కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక, సతీష్‌కుమార్, చిట్టిబాబు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత ఉట్టిపడాలి : సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి : ‘‘అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణం అద్భుతంగా రూపుదిద్దు కోవాలి. అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుం డా, తొట్రుపాటు పడకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరగాలి. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు, భక్తులకు సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండాలి’’అని సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులు, స్తపతులు, ఆర్కిటెక్ట్‌లను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఆదివారం 6 గంటల పాటు పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి 12.12 గంటలకు సీఎం చేరుకున్నారు. ముందుగా బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శిం చుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చారు. అనం తరం సుమారు ఆరు గంటలపాటు కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతిని సమీక్షించారు. ప్రధాన ఆలయంలోకి భక్తులు ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణ అనంతరం గర్భాలయంలోగల శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వెళ్లే క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలోకి భక్తులు వచ్చి పోయే మార్గాలు, పూజారుల మార్గాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన సీఎం అనంతరం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్నారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉప ఆలయాలను పరిశీలించారు. బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు ఆలయ నిర్మాణంపై ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కేసీఆర్ తిలకించారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వచ్చే క్యూలైన్, దర్శనం అనంతరం పడమటి రాజగోపురం నుంచి బయటకు భక్తులు వెళ్లేందుకు ఉద్దేశించిన క్యూలైన్ అంశాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. క్యూలైన్లకు సంబంధించిన పలు మార్పులు, చేర్పులను ఆనంద్‌సాయికి సీఎం సూచించారు. బ్రహ్మోత్సవ మండపం వెనుకభాగం నుంచి అష్టభుజి ప్రాకార మండపం, తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే విద్యుత్ దీపాలకు సంబంధించిన ప్రజెంటేషన్ చూశారు. బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు చూడముచ్చటగా ఉన్నాయని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇన్నర్ ప్రాకార మండపంలో నిర్మాణం జరుగుతున్న అద్దాల మండపం ప్రజెంటేషన్‌ను చూశారు. ఊయలలో ఊగుతూ శ్రీస్వామి అద్భుతంగా కనిపిస్తున్నారని, వీడియోలో ఉన్న మాదిరిగానే ఆలయం క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, అద్దాల మండపం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద తంజావూర్ చిత్రం, గర్భాలయ ముఖ మండపంపై ఏర్పాటు చేసిన ప్రహ్లాద చరిత్రలు బాగున్నాయన్నారు. ఆలయంలో రెండు హుండీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ఆలయంలో ఒకటి, మండపాల్లో మరొక హుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టోన్ ఫ్లోరింగ్ పనులు నాణ్యతతో చేయాలన్నారు. అనంతరం శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం విశాలంగా ఉందన్నారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, గణపతి దేవుడిని దర్శించుకున్న అనంతరం శివుడిని దర్శించుకునే విధంగా క్యూలైన్లు ఉండాలన్నారు. అంతే కాకుండా మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన మహా నందీశ్వరుడి విగ్రహాన్ని ఆలయానికి తూర్పు ప్రాకారంలో పెట్టాలని సూచించారు. మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్ పెట్టాలి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం ఆలయ ఇన్నర్ ప్రాకార మండపంలో చెక్కుతున్న ఎంబోజింగ్ చిత్రాలస్థానంలో తంజావూర్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని స్తపతులకు, వైటీడీఏ అధికారులకు సూచించారు. మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్‌తో రూపుదిద్దుకున్న సుమారు 50 లక్ష్మీనరసింహస్వామి చిత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు ప్రతి కట్టడాన్ని తిలకించాలి యాదాద్రి ఆలయానికి వచ్చిన భక్తులు ప్రతి రాతి కట్టడాన్ని తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందు కోసం తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు పడమటి రాజగోపురం నుంచి బయటకు నేరుగా వెళ్లకుండా కట్టడాలను తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాలను ప్రతి భక్తుడు చూసి తరించి పోయేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మణిహారంలా రింగ్‌రోడ్డు... యాదాద్రి ఆలయానికి రింగ్‌రోడ్డును మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో రింగ్‌రోడ్డును అత్యంత సుందరంగా తయారు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిచెరువును పుష్కరిణిగా తీర్చిదిద్దుతున్నందున ప్రతి రెండునెలలకోసారి కాళేశ్వరం గోదావరి జలాలతో నింపాలన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణపనుల కోసం మూడువారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావును సీఎం ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి 4,000 మంది వ్రతం చేసుకునేలా వ్రత మంటప ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వీఐపీ సూట్లు, గిరిప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, గండిచెరువు, టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగారు. సీఎం వెంట మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్‌ఆండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, స్థపతి ఆనందాచారి వేలు, అర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అద్భుతంగా స్వర్ణ ద్వారం యాదాద్రి గర్భాలయానికి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యంతో అద్భుతమైన స్వర్ణ ద్వారాన్ని రూపొందిస్తున్నారు. అత్యంత నాణ్యమైన టేకు చెక్కపై రాగి, ఇత్తడి, షీట్మెటల్పైన బంగారు పూతతో తయారు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు కళాకారులు తయారు చేస్తున్న స్వర్ణ ద్వారం గురించి సీఎం వాకబు చేశారు. కోతుల ఆకలి తీర్చిన కేసీఆర్ యాదాద్రి పర్యటనలో కోతులను గమనించిన కేసీఆర్ కారు ఆపి మరీ వాటి ఆకలిని తీర్చారు. పున్నమి గెస్ట్ హౌజ్‌లో భోజనం అనంతరం గిరిప్రదర్శన రోడ్డు పరిశీలనకు వాహనంలో వెళ్లారు. రోడ్డుపక్కన వానర సమూహాన్ని గుర్తించిన కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కారులోంచి దిగారు. తన వెంట కారులో ఉన్న అరటిపండ్లను తీసుకుని కోతులకు స్వయంగా అందించారు. అరటి పండ్ల పంపిణీతో పెద్ద ఎత్తున కోతులు సీఎం వద్దకు చేరుకున్నాయి. కోతులతో ప్రమాదం అని సెక్యూరిటీ వారించినప్పటికీ ఏమీ కాదంటూ సీఎం స్వయంగా పండ్లను వాటికి అందజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యాదాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడాలి: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ..శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశాలు ఇచ్చారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్అండ్బీ ఈఎన్సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అనీ, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హరిత అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీత, ఆర్అండ్బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి డాక్టర్ వేలు తదితరులు పాల్గొన్నారు. -
100 ఏళ్లు ఉండేలా కొత్త రథం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కొత్త రథం నిర్మాణం కోసం రూ.95 లక్షల అంచనాతో దేవదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందుకోసం నియమించిన దేవదాయ శాఖ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్ రెండు రోజులుగా అంతర్వేది ఆలయాన్ని పరిశీలించి కొత్త రథం నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. దేవదాయ, అగ్నిమాపక, ఇతర శాఖల సమన్వయంతో వారం, పది రోజుల్లో డిజైన్‌కు తుది రూపమివ్వనున్నారు. 1,300 ఘనపుటడుగుల టేకు అవసరం ► రథం నిర్మాణం కోసం 1,300 ఘనపుటడుగుల నాణ్యమైన ముదురు టేకు కలప అవసరమని లెక్క తేల్చారు. రథం 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించారు. ► విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో టేకు కలప కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో టింబరు డిపోను పరిశీలించారు. సింహాచలం అడవుల్లోని 25 నుంచి 30 సంవత్సరాల కిందట తీసిన పాత కలప కోసం ప్రయత్నిస్తున్నారు. ► దగ్ధమైన రథానికి వినియోగించిన టేకు బర్మా నుంచి తెచ్చారు. ఆ రథం నిర్మాణం జరిగి 54 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదర లేదు. అందుకు తగ్గట్టుగానే కొత్త రథం సుమారు 100 సంవత్సరాల మన్నిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► కొత్త రథానికి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో 80 ర«థాల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గణపతి ఆచారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి... ► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా రథానికే నీటి సరఫరా ఉండేలా ప్రత్యేక పైపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రథం ఉంచే షెడ్డుకు కూడా అవసరాన్ని బట్టి నిరంతరం నీటి సరఫరా జరిగేలా పైపులుండేలా డిజైన్‌ను రూపొందిస్తున్నారు. ► నాణ్యత, రక్షణ విషయంలో రాజీపడకుండా రథం నిర్మాణానికి రూ.1.10 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దగ్ధమైన రథం 39.7 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉండేది. ప్రస్తుత కొత్త రథం 40 నుంచి 41 అడుగులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ► వచ్చే ఫిబ్రవరిలో జరిగే స్వామి ఉత్సవాల కంటే ముందుగానే రథం సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. 10 రోజుల్లో కొత్త డిజైన్ కొత్త రథం డిజైన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో దేవదాయ, అటవీ, అగ్నిమాపక, పోలీసు శాఖ ప్రతినిధులు ఉన్నారు. పది రోజుల్లో కొత్త రథం డిజైన్ కొలిక్కి వస్తుంది. నాణ్యమైన కలప లభ్యతను బట్టే కొత్త రథం డిజైన్ ఉంటుంది. – వై భద్రాజీ రావు, ఈవో, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అంతర్వేది -
ఆలయ స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం..
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఆలయ నిర్మాణంలో పలు పనులకు బంగార తాపడం చేపిస్తున్నారు. ఇదే క్రమంలో యాదాద్రి ప్రధానాలయం గర్భాలయం స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం చేపించారు. బంగారు తాపడంతో ఉండే ద్వారాల నమూనా వీడియోను దేవాలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు. దీనితోపాటు అత్యంత స్వర శోభతో ఉండే విధంగా వివిధ నరసింహుని రూపాలు, దేవత విగ్రహాలు,పద్మాలతో స్వర్ణ తాపడంతో ఆలయ ద్వారాలు వుండే వీడియో నమూనాను అధికారులు విడుదల చేశారు. (అద్భుతం.. అద్దాల మండపం) -
అద్భుతం.. అద్దాల మండపం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పడమటి రాజగోపురం సమీపంలోని ఇన్నర్ ప్రాకార మండపం నైరుతి దిశలో నిర్మాణమవుతున్న అద్దాల మండపం క్షేత్రానికి వచ్చే భక్తులను మరింత ఆకర్షించనుంది. ప్రస్తుతం అద్దాల మండపంలో విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. అద్దాల మండపానికి సంబంధించిన ఓ వీడియోను ఆలయ అధికారులు మంగళవారం విడుదల చేశారు. పూర్తి స్థాయిలో బంగారు వర్ణంతో కూడిన అద్దాల మండపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు ఊయలలో ఊగుతున్నట్లు కనిపిస్తున్నారు. సుమారు 123 ఇంచుల ఎత్తు, నాలుగు దిక్కుల 60 ఫీట్ల చుట్టు వెడల్పుతో అద్దాల మండపం నిర్మాణమవుతోంది. మండపానికి ముందు భాగంలో రెండు నల్లరాతితో చెక్కిన ఏనుగులను ఏర్పాటు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మండపానికి ప్రధాన ఆకర్షణీయంగా బంగారం వర్ణంలో దర్వాజాల ముందు భాగంలో ఆళ్వార్ చిత్రాలను రూపొందించారు. -
యాదాద్రి ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ. కారణం
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ తగ్గుతోంది. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆలయం, పరిసర ప్రాంతాలు వెలవెల బోతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న కరోనా భయం, శ్రావణ మాసంలో కూడా భక్తుల రద్దీ కానరావడం లేదు. లాక్ డౌన్ ముందు ప్రతిరోజు స్వామివారి దర్శనానికి 10 నుంచి 15 వేల మంది, శని, ఆది,వారాలలో, 20 నుంచి 30 వేయిల మంది భక్తులు దర్శించుకునే వారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత ప్రతిరోజు సుమారు 2, నుంచి 3, వేల మంది భక్తులు శని, ఆది,వారాలలో 5 నుంచి 6 వేల మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలుస్తుంది. (యాదాద్రి రింగ్‌రోడ్డు మ్యాప్ సమర్పించండి) స్వామి వారికి వచ్చే నిత్య ఆదాయం, మరియు హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గింది. లాక్డౌన్ ముందు 30 రోజులో హుండీ సుమారు 80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు వచ్చేది. విశేష రోజుల్లో కోటికి పైగా వచ్చిన సందర్భాలున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ సడలించి దేవాలయంలోకి భక్తులకు అనుమతిలిచ్చినా 30 రోజుల నుండి ఆదాయం సుమారు 20 లక్షల నుండి 30 లక్షలు మాత్రమే వస్తోంది. (యాదాద్రి.. పెరిగిన భక్తుల రద్దీ) ఈ ఏడు పవిత్ర శ్రావణ మాసంలోనూ భక్తుల సందడి కనిపించడం లేదని, కరోనా కారణంగా భక్తుల సందడి బాగా తగ్గిందని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు అంటున్నారు. భక్తుల సందడి లేక బాలాలయం వెలవెలబోతోంది. కాగా కొండపైన కళ్యాణ కట్ట, సత్యనారాయణ స్వామి వ్రతాలు కోవిడ్ కారణంగా అనుమతించకపోవడం ఓ కారణం అయితే.. స్వామి సన్నిధిలో ఆర్జిత సేవలను సైతం ఆన్ లైన్ లో నిర్వహీస్తుండడంతో భక్తులు క్షేత్రం సందర్శనకు అంతగా ఇష్టపడడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అధికంగా కేసులు నమోదు కావడంతో భక్తులు యాదాద్రి కి రావడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. స్వామివారి నిత్యకల్యాణం, అభిషేకం, సుదర్శన నరసింహ హోమ సేవల టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయిస్తున్న ప్పటికీ భక్తులు మాత్రం ఆన్లైన్ సేవలకు దూరంగా ఉంటున్నారు. (చల్లంగ చూడు స్వామి) -
కళ్యాణం కమనీయం
-
ఆగమశాస్త్రం ప్రకారం పకడ్బందీగా జరగాలి: కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఎలాంటి తొందరపాటు, ఆత్రుత అవసరం లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచిం చారు. ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్‌లైన్ పెట్టుకొని చేసేవి కావని, శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 17న యాదాద్రి సందర్శించి డిసెంబర్లో మళ్లీ వస్తానన్న సీఎం కేసీఆర్... చెప్పిన విధంగా సరిగ్గా నాలుగు నెలలకు యాదాద్రి పర్యటనకు వచ్చారు. మంగళవారం ఉదయం రోడ్డు మార్గాన యాదాద్రి చేరుకున్న కేసీఆర్ తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం సీఎం ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సలహాలు, సూచనలు అందించారు. ‘‘గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏమాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యత పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి. ప్రతిదీ నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం. ఇక్కడ పూజలు చేయడం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశ, విదేశాల్లో స్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు దైవ దర్శనం, వసతి సౌకర్యాలు, పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’అని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి ఆలయంలో పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ తదితరులు గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. తొందరపాటొద్దు. జాగ్రత్త, నాణ్యత పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి. ప్రతిదీ నియమాలను అనుసరించి సాగాలి. – సీఎం కేసీఆర్ ఉద్యానవనాలు పెంచాలి... ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, స్థల పురాణం ప్రస్ఫుటించే విధంగా తైలవర్ణ చిత్రాలను వేయించాలని ఆదేశించారు. అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వీవీఐపీ కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్‌ను పరిశీలించి కొన్ని మార్పులు సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని లాంటివారు వచ్చినప్పుడు వారికి సౌకర్యవంతంగా ఉండేలా ప్రెసిడెన్షియల్ సూట్ ఉండాలన్నారు. బస్వాపురం రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మారుస్తున్న విధంగా ప్రెసిడెన్షియల్ సూట్‌కు సమీపంలో ఉన్న మైలార్‌గూడెం, యాదగిరిపల్లి చెరువులను కూడా సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయం ఉండే గుట్ట నుంచి రింగ్‌రోడ్డు మధ్యభాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. యాదాద్రిలో నిర్మించనున్న ప్రెసిడెన్షియల్ సూట్ నమూనా స్వయంభూల దర్శనానికి ముహూర్తం పెట్టుకుందాం... ‘‘అమెరికాలో పర్యటిస్తున్న శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అక్కడి నుంచి రాగానే అందరం కూర్చొని స్వయంభూల దర్శనానికి ముహుర్తం పెట్టుకుందాం. లోకోత్తర స్థాయిలో మహాయాగం జరగాలని 3 వేల మంది యజ్ఞం చేసే వాళ్లు, 3 వేల మంది సహాయకులు, 3 వేల మంది ప్రచారకులను సిద్ధం చేస్తున్నాం. యాగానికి ప్రతిరోజూ 1.50 లక్షల నుంచి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తుంటారు కాబట్టి వారందరికీ వసతులు, భోజనాలు, ప్రసాదం ఏర్పాట్లు కల్పించాలి’’అని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ప్రాకారం బాగుందన్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా, ఆగమ శాస్త్రప్రకారం జరుగుతున్నాయని కితాబిచ్చారు. ప్రధానాలయంలో ప్రహ్లాద ఘట్టాలు ఎక్కడ వస్తున్నాయి? గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం ఎప్పుడు జరుగుతుంది? అని స్తపతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ 100 కల్యాణాలకుపైగా జరిపే విధంగా మండప నిర్మాణం, ప్రధాన ఆలయం రెండవ ప్రాకారంలో అద్దాల మండపం పూర్తి కావాలన్నారు. ‘‘మరో 15 రోజుల్లో మళ్లీ వస్తా. చిన్న, పెద్ద పనులన్నీ పూర్తి కావాలి’’అని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీవీఐపీ కాటేజీల నమూనా శిల్పులకు ప్రత్యేక అభినందనలు... రాతి శిలలను అద్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని మెచ్చుకున్నారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అద్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలు సిద్ధమయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్దడం యాదాద్రిలోనే సాధ్యమైందన్నారు. క్షుణ్ణంగా పనుల పరిశీలన... ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఆరున్నరగంటలపాటు సాగింది. ఆలయంలో పూజల అనంతరం రెండు గంటలపాటు ప్రధానాలయ నిర్మాణ ప్రాంతంలో కేసీఆర్ కలియదిరిగారు. గోపురాలు, మాఢ వీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజ స్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం, వంటశాల, పుష్కరిణి, యాగశాల నిర్మాణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం యాదాద్రి ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ప్రధానాలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంతో కలసి మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, వివేకానంద, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, కలెక్టర్ అనితా రాంచంద్రన్, ఈఓ గీతారెడ్డి, ఆలయ నిర్మాణ శిల్పి ఆనంద్‌సాయి, స్తపతి ఆనందవేలు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆలయ పనులను పరిశీలించారు. ఫ్రిబవరిలోగా పనులు పూర్తి కావా..? ‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్‌లైన్ పెట్టుకొని చేసేవి కావు’అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే నిర్మాణ పనులు ఫిబ్రవరిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రధాన ఆలయ పనులతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం, ఆలయ పరిసర పనులు, రోడ్ల వెడల్పు, విస్తరణ పనులు, రింగ్‌రోడ్డు, గిరి ప్రదక్షిణ పనులు పురోగతిలో ఉన్నప్పటికీ క్యూలైన్లు, పార్కింగ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆలయం పునఃప్రారంభం అయితే రోజూ లక్ష మంది వరకు భక్తులు వస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. కానీ వసతులు లేకుండా, నిర్మాణ పనులు పూర్తి కాకుండా భక్తులకు నృసింహుని స్వయంభూ దర్శనం కల్పిస్తే ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించే సీఎం పైవిధంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రధాన ఆలయ ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
నేడు యాదాద్రిలో కేసీఆర్ పర్యటన
-
నేడు యాదాద్రికి సీఎం రాక
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రధానా లయ, ప్రెసిడెన్షియల్ సూట్లు, కాటేజీల నిర్మాణ పనులను పరిశీ లిస్తారు. అలాగే ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహా సుదర్శనయాగం కోసం అవసరమైన స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎంరాక సందర్భంగా వైటీడీఏ, జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. -
2 కోట్లతో యాదాద్రి మెట్లు
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా సుమారు రూ.2 కోట్లతో మెట్లదారిని ఆధునీకరిస్తున్నారు. ఇందుకోసం పాతమెట్లను ఇప్పటికే తొలగించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల్లో 75 శాతం మంది మెట్ల దారి గుండా వెళ్తుంటారు. మిగతా వారు ప్రధాన ఘాట్ రోడ్ వెంబడి వాహనాల్లో వెళ్తుంటారు. మెట్ల దారిలో అన్ని సౌకర్యాలు... కొండపైకి వెళ్లడానికి గతంలో సుమారు 3,500 మెట్లు ఉండేవి. ఈసారి మెట్లకు మెట్లకు మధ్యమధ్యలో నడక దారిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భక్తులు మధ్యలో కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు, తాగు నీటి కుళాయిలు, మెట్లకు ఇరువైపులా పట్టుకుని నడవడానికి పైపులను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణుల లాంటి వారు సేదదీరడానికి ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. చిన్న చిన్న హోటళ్లు, దుకాణాలు లాంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 2.కోట్ల వరకు కేటాయించారని సమాచారం. కృష్ణ శిలలతో నిర్మాణం చేస్తున్న మెట్ల దారిని మరో రెండు నెలల్లోపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఐదు అంతస్తుల్లో కొండ కింది గోపురం... కొండ కింది రాజగోపురాన్ని సైతం 5 అంతస్తులుగా నిర్మాణం చేస్తున్నారు. ఈ వైకుంఠ రాజగోపురానికి మధ్యమధ్యలో శిల్పాలను అమర్చనున్నారు. ప్రస్తుత రాజగోపురానికి ఎలాంటి రంగులు, సున్నాలు లేకుండా సహజత్వం ఉట్టిపడేలా నిర్మాణం చేస్తున్నారు. -
యాదాద్రి ఆలయానికి మూడు వాకిళ్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి మూడు వాకిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గర్భాలయానికి అమర్చిన మూడో వాకిలిని బంగారంతో తాపడం చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరు మల తరహాలోనే బంగారు వాకిలిని రూపొందించడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏడంతస్తుల ప్రధాన రాజగోపురానికి అమర్చనున్న మొదటి వాకిలికి 27 అడుగుల ఎత్తులో టేకు చెక్కతో భారీ ద్వా రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండవ వాకిలి ద్వా రాన్ని టేకుతో తయారు చేసి, దానిపై వెండి తాపడం చేయనున్నారు. దీన్ని 18 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. అలాగే గర్భాలయం లోపల భాగంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయాన్ని అన్ని హంగులతో శోభాయమానంగా రూపుదిద్దడానికి మరో మూడు నెలలు పట్టనుందని వారు పేర్కొన్నారు. 5 నుంచి వరుణయాగం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఈ నెల 5 నుంచి 7 వరకు వరుణ యాగం తలపెట్టారు. ఈ యాగానికి 16 మంది రుత్వికులకు ఆహ్వానాలు పంపాలని తీర్మానించారు. భక్తులు సైతం పాల్గొని వరుణ యాగాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. ఇలా మూడు రోజుల పాటు యాగం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
అద్భుత క్షేత్రంగా శివాలయం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న శివాలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటోంది. యాదగిరికొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని నభూతోనభవిష్యత్ అన్న రీతిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ప్రాకారం పూర్తి చేశారు. ప్రాకార గోడలపై అందమైన పువ్వుల డిజైన్లతోపాటు శిల్పాలను అమర్చారు. నవ నందులు, శివుడికి ప్రతి రూపాలు, అమ్మవారి అష్టలక్ష్మి శిల్పాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ముఖ మండపాన్ని నిర్మిస్తున్నా రు. అదే విధంగా మరకత లింగాన్ని ప్రతిష్ట చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యేలా పనులను వేగవంతం చేశారు. గతంలో ఉన్న ఆలయం కంటే భిన్నంగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదగిరికొండపై 14 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా శివాలయాన్ని గతంలో కంటే భిన్నంగా నిర్మిస్తున్నారు. కాకతీయులు, చోళుల కాలంనాటి నిర్మాణ రీతులను ప్రామాణికంగా తీసు కుని అందుకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా భక్తులకు అన్ని వసతుల ను ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న çవిశాలమైన స్థలంలో స్వామివారి పూజకు కావాల్సిన బిల్వం, మారేడు వృక్షాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రూ.300 కోట్ల ప్రణాళికతో ఆలయ పనులు కొనసాగుతున్నాయి. -
నేటి నుంచి యాదాద్రిలో ఉత్సవాలు
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి మూడ్రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధ వారం ఉదయం 9 గంటలకు విష్వక్సేనారాధనతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 10:30కి లక్ష పుష్పార్చన, 11:30 గంటలకు తిరువేంకటపతి అలంకారం సేవ, సాయంత్రం 6:30 గంటలకు అంకురార్పణం, మృత్స్యంగ్రహణం, చతుస్థానార్చన, మూర్తి కుంభస్థాపన, మూల మంత్రహవనం, రాత్రి 8:30 గంటలకు గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారం సేవలు జరుగుతాయి. 20 మంది రుత్విక్కులకు ఆహ్వానం ఉత్సవాలను పురస్కరించుకుని అధికారులు మూల మంత్ర జపాలను నిర్వహించడానికి 20 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. సహస్ర కలశాభిషేకాలకు కలశాలను సిద్ధం చేశారు. ఈ మూడ్రోజుల పాటు భక్తులతో నిర్వహించే శాశ్వత పూజలను కూడా నిలిపివేశారు. నేటి నుంచి బెల్లం లడ్డూల విక్రయాలు యాదాద్రి దేవస్థానంలో బుధవారం నుంచి బెల్లం లడ్డూల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. లడ్డూ విషయంలో వారం రోజులుగా ట్రయల్‌రన్ చేసి నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపామన్నారు. వంద గ్రాముల లడ్డూ రూ.25గా ధర నిర్ణయించామన్నారు. ప్రసాదాల కౌం టర్ల ద్వారానే వీటిని విక్రయిస్తామన్నారు. -
యాదగిరికొండపై అగ్నిప్రమాదం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ఘటనలో భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొండపైన వేసవిలో నీడ కోసం రేకులతో చలువ పందిళ్లు వేశారు. వాటిపైన ఎండను తట్టుకునేందుకు గడ్డిపరిచారు. కార్యాలయంలోని పనికిరాని ఫైళ్లను 2 నెలలకోసారి ఆలయం గోడచాటున వేసి తగులబెడుతుంటారు. ఇలా శుక్రవారం ఫైళ్లను తగులబెడుతుండగా గాలికి నిప్పురవ్వలు లేచి చలువ పందిళ్లపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడంతో చలువ పందిళ్ల కింద సేదదీరిన భక్తులు భయాందోళనతో పరుగులుతీశారు. ఫైర్ ఇంజన్ రావడానికి చాలా అలస్యమవడంతో స్థానికులు, దుకాణదారులు బకెట్లతో నీటిని తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. -
యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహ్మాస్వామి సన్నిధిలో అగ్ని ప్రమాదం
-
యాదగిరీశుడికి పెరిగిన ఆదాయం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.6 కోట్లపై చిలుకు ఆదా యం పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత యాదాద్రి ఆలయం అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రూ.2,000 కోట్ల నిధులతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న రాతి కట్టడాలతో ఆలయం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యాదాద్రి అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆయన పలుమార్లు యాదాద్రికి వచ్చారు. గవర్నర్ నరసింహన్‌తోపాటు పలువురు ప్రముఖులు యాదాద్రికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. గర్భాలయం పునురుద్ధరణ పనులు జరుగుతున్నందున స్వామి వారి నిజదర్శనం నిలిపివేశారు. బాలాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానాలయం పనులు పూర్తి కావస్తున్న తరుణంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2013–14లో రూ. 63 కోట్ల ఆదాయం రాగా అది 2018–19 నాటికి రూ.99.57 కోట్లకు చేరుకుంది. 2017–18లో రూ.93.96 కోట్లు వచ్చింది. గతేడాది కంటే భారీ స్థాయిలో ఆదాయం పెరగడం విశేషం. హుండీ, సత్యనారాయణస్వామి వ్రతాలు, అతిశీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, ప్రసాద విక్రయాలు, ఇతర రూపంలో ఆదాయం పెరిగింది. మరికొన్ని నెలల్లో ప్రధానాలయం పూర్తయితే లక్షల్లో భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆదాయం మరింత పెరుగుతుందని దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
జనసంద్రమైన అంతర్వేది క్షేత్రం
-
శివాలయ ప్రాకారాలకు విగ్రహాల కూర్పు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా శివాలయం చుట్టూ ప్రాకారాలకు విగ్రహాల కూర్పు చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఆలయంలోనికి వెళ్లడానికి ద్వార గోపురం పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే రామాలయం పూర్తయింది. శివాలయం రాజగోపురం పనులు సైతం పూర్తి కావొస్తున్నాయి. శివాలయానికి చుట్టూ ప్రాకారం గోడలకు సాలహారం పనులు జరుగుతున్నాయి. అందులో గణపతిలో ఉన్న లక్ష్మీగణపతి, గజముఖ గణపతి, శ్వేతాంబర గణపతి, సిద్ది గణపతి తదితర గణపతి విగ్రహాలు, అదేవిధంగా నవవిధ దుర్గలు, సరస్వతి, కాళీ, మహాలక్ష్మి అమ్మవార్లు, సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, నంది, సింహవాహిని దుర్గ వంటి అనేక దేవతల విగ్రహాలను పొందుపరుస్తున్నారు. వారం రోజుల్లో ఈ విగ్రహాల కూర్పు పూర్తవుతుంది. పూర్తయిన రాజగోపురాలు.. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా సప్త రాజగోపురాలు పూర్తయ్యాయి. ఇంతకుముందే ఆరు రాజగోపురాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లే సప్తతల రాజగోపురం పూర్తి కావడంతో సప్త రాజగోపురాల పనులు పూర్తయినట్లే. తిరుమాడ వీధుల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సప్తతల రాజగోపురం ఎత్తు దాదాపు 65 నుంచి 70 అడుగులు ఉంటుంది. -
రంగులు, సున్నాల జాడేలేదు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధీనంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతోంది. కానీ వాటి ఏర్పాట్ల ఊసే కనిపించడం లేదు. ఆలయంలో ఈనెల 11 నుంచి అధ్యయనోత్సవాలు, 15 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏడాది 10రోజుల ముందు నుంచి రంగులు, సున్నాలు. జాజులు అద్దేవారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేసేవారు. కానీ ఈ సారి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. గత ఏడాది ఈపాటికే ఆలయంలో హోమగుండాలు నిర్మించి విగ్రహాలకు పాలిషింగ్ చేసి కరపత్రాలను ఊరూరా పంచారు. ప్రతిసారీ అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు కలిపి 15 మంది రుత్వికులకు వారం పది రోజుల ముందే ఆహ్వానాలు పంపేవారు. అయితే ఈసారి ఈ రోజు వరకూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని అధికారులు చెబుతున్నారు.« ధ్వజస్తంభం, స్వామి అమ్మవార్ల వాహనాలకు పాలిషింగ్ చేసేవారు. ప్రస్తుతం ఇటువంటి ఆనవాళ్లు కనిపించడంలేదు. యాదాద్రి కొండపైన నిర్మాణ పనుల్లో భాగంగా అన్ని కార్యాలయాలు తొలగిస్తున్న కారణంగా అక్కడి కార్యాలయాలను కొన్నింటిని కొండ కిందికి, మరికొన్నింటిని పాతగుట్టకు మార్చాల్సి ఉంటుంది. దీంతో పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు ఎక్కువమంది భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ పాతగుట్టలో అధికారుల జాడే లేకుండా పోయింది. గతంలో వాల్‌పోస్టర్లను అందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఈసారి ఎవరికీ తెలియకుండా వాల్ పోస్టర్లను ఆవిష్కరించినట్లు అధికారులే చెబుతున్నారు. మొత్తానికి పాతగుట్ట ఉత్సవాల సందడే లేకుండా పోయింది. -
ఆధ్యాత్మికం.. అక్షయం.. అమృతం
ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావని, సాటిమానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువ కావచ్చునని నిరూపిస్తోంది హరేకృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి స్వర్ణదేవాలయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గల∙స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం. రోడ్డు నెంబర్ 12లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. నిజాం కాలంలో అక్కన్న, మాదన్నలు ఇక్కడకు వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెబుతారు. శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీనరసింహుడి విగ్రహానికి ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుంది. శివుడు తపస్సు చేయగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి శివుడి శిరస్సుపై శంఖం ఉంచి దీవించాడట. అందుకే ఇక్కడి శివలింగంపై శంఖం ఉంటుంది కనుక పాంచజన్యేశ్వరుడిగా పేరు వచ్చింది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రదేశంలో అనేక అద్భుతాలు. ఆలయ విశిష్టత స్వయంభువనూ శ్రీ లక్ష్మి నరసింహస్వామి, పాంచజన్యేశ్వర స్వామి(క్షేత్ర పాలకుడు), రాధాగోవింద, జప ఆంజనేయస్వామి, గరుడ, పురాతన నారాయణ శాలగ్రామం (జల గర్భంలో ఉండే శిల) ఈ క్షేత్రంలో కొలువుదీరారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీవారి నందనవనం, జలపాతం, ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తూ, సందర్శకులకు భూతల వైకుంఠంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగిస్తాయని ఆలయ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస తెలిపారు. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలోగల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గర్భాలయంలోనే అరుదైన ‘జలగర్భ నారాయణ సాలగ్రామ శిల’ గా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ప్రపంచంలోగల అతిపెద్ద సాలగ్రామ శిలల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడో చేతిలో జపమాల ఉంటుంది. నాల్గవ చేతిలో అక్షమాల ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహుడిని చూసుకుంటూ హనుమంతుడు అపురూపంగా కనిపిస్తాడు. శ్రీచతుర్భుజ జప ఆంజనేయస్వామిని భక్తులు ముందు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు మంత్ర పీఠంలో జపం చేసి ఆలయంలోని శ్రీ రాధా గోవిందుల అర్చామూర్తుల సుందరాకృతులను మనస్సునిండా నింపుకుని హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన్మయత్వం పొందుతారు. తర్వాత అనంతశేషుడిపై నిల్చుని ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం క్షేత్రపాలకుడిగా ఉన్న పాంచజన్యేశ్వరుడని దర్శించుకుంటారు. హరేకృష్ణ ఉద్యమం చేస్తున్న ఆధ్యాత్మిక, సమాజ సేవ కార్యక్రమాలలో కొన్ని... దేవాలయానికి 10 మైళ్లు లోపు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న హరేకృష్ణ ఉద్యమం వ్యవస్థాపకాచార్యులు శ్రీ శ్రీ ప్రభుపాదులవారి ఆశయానికి అనుగుణంగా సంస్థ తమ ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థులు ఆకలి వల్ల చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో సంస్ధ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర తెలంగాణలో అంకురార్పణకు ఈ ఆలయమే కేంద్రస్ధానం. మరిన్ని వివరాలకు 9396956984ను సంప్రదించవచ్చునని హరేకృష్ణ ఉద్యమం తెలంగాణ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస తెలిపారు. హరేకృష్ణ ఉద్యమం హైదరాబాద్ ఆధ్వర్యంలో యవతకి స్వశక్తికరణ సదస్సులు నిర్వహించి, ప్రతి ఆదివారం భగవద్గీత ద్వారా సమాజ విలువలతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం యువతకి ప్రస్తుత ప్రపంచం వాస్తవికతలకు వేద జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో బోధిస్తుంది. అలాగే రోజువారీ జీవితంలో అనుభవించే కఠినమైన సమస్యలకు పరిష్కారాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, జీవితంలో కుంగుబాటులను అధిగమించి, ఆత్మవిశ్వాసాలను అధిగమించటం, ఇంకా సమాజంలో ఎలా కొనసాగించాలో, ఎలా పర్యవేక్షించాలంటే ఎన్నో విషయాలకు వేదికగా మారడం ముదావహం. లౌకిక విద్యాసంస్థలు ఈ ప్రకృతిని మన ఇంద్రియ భోగాల కోసం ఎలా ఉపయోగించుకోగలమో నేర్పుతాయి. కాని మనిషి ఎదుర్కొనే ఒత్తిడి, అసంతృప్తి, కుంగుబాటు, ఆవేదనలు, జయాపజయాలు, కీర్తి, అప్రతిష్టలు మొదలైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనగలమని బోధించేవి మాత్రం ఆధ్యాత్మిక కేంద్రాలే. మంచి సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక బోధనలు అత్యంత ఆవశ్యకమని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి నమ్మకం. మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలు కావాలన్నది ఆయన తపన. మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి, కలియుగ కల్మషాలన్నిటిని పారద్రోలడానికి దేవాలయాలు దోహదం చేస్తాయి. ఇందుకోసమే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అనువుగా ఈ స్వర్ణదేవాలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం నుంచే అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చిన్నారులకు సంస్కృతీ వారసత్వ పండుగ, యువతకు జానపదం, గృహస్తులకు ‘గిఫ్ట్’, గ్రామాల్లో ఆధ్యాత్మిక బోధన, దేవాలయంలో ఏడాది మొత్తం జరిపించే పండుగలతోపాటు ప్రముఖ తీర్థయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా సమాజ సేవలో భాగంగా అక్షయపాత్ర, అన్నపూర్ణ 5 రూ. భోజనం, భోజనామృతం, సద్దిమూట, అక్షయ అల్పాహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. -
సిద్ధమవుతున్న యాదాద్రి ధ్వజస్తంభం
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం సిద్ధమవుతోంది. ఈ ధ్వజస్తంభంలోనే సమస్త శక్తులు ఇమిడి ఉంటాయనేది పురాణాలు చెబుతున్నాయి. దీనిని ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. యాదాద్రి ధ్వజస్తంభాన్ని నారవేప కర్రతో తయారు చేస్తున్నారు. మరో 15 రోజుల్లో ఇది పూర్తికానుంది. ప్రధానాలయం మొత్తం ఎత్తు 50 నుంచి 60 అడుగుల మధ్యలో ఉండటంతో ధ్వజస్తంభానికి 40 అడుగుల కర్రను వాడుతున్నారు. దాని ఎత్తు 40 ఫీట్లు ఉంటుంది. ఇంతకుముందు ఆలయంపైన ధ్వజారోహణ చేసేవారు. ఇప్పుడు ఆలయంలోపలే వస్తుండటంతో స్తంభానికి చేసే ప్రతి కార్యక్రమం ఆలయంలోపలే చేయాల్సి ఉంటుంది. అందంగా సాలహారం పనులు యాదాద్రి క్షేత్రానికి సాలహారం పనులు అమితమైన అందాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతి ఆలయానికీ సాలహారం పనులే ఆకర్షణనిస్తాయని స్థపతులు చెబుతున్నారు. ప్రస్తుతం యాదాద్రి క్షేత్రానికి చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాలకు సాలహారం పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రాకారం గోడలకు దండ మాదిరిగా చేసే శిల్పాకృతుల పనులే సాలహారం. ఆలయానికి రానున్న సప్త రాజగోపురాల పనులు మరో వారంలో పూర్తికానున్నాయి. 6 రాజగోపురాల పనులు పూర్తిచేశారు. ఇంకా మిగిలి ఉన్న సప్తతల ప్రధాన రాజగోపురం పనులు మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేయనున్నారు. శివాలయంలో సైతం ప్రధానాలయంతో పోటీ పడి పనులు జరిపిస్తున్నారు. తోగుట పీఠాధిపతి మాధవానంద స్వామీజీ సూచనల మేరకు ప్రధానాలయం ప్రతిష్ఠలో భాగంగానే శివాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు. చినజీయర్ స్వామి సూచించిన తేదీల ప్రకారంగానే 2 ఆలయాల పనులు మార్చిలో పూర్తి చేయాలని వైటీడీఏ అధికారులు కృషిచేస్తున్నారు. శివాలయం ముందు ఐదు అంతస్థుల ప్రధాన ద్వారం పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరుకల్లా పనులు చేస్తామని పేర్కొంటున్నారు. -
యాదాద్రికి ద్వారపాలకుల విగ్రహాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా సుదర్శన విమాన రాజగోపురంపైన ఏర్పాటు చేసేందుకు జయ విజయుల విగ్రహాలు శుక్రవారం యాదాద్రికి చేరుకున్నాయి. ఇవి ఒక్కోటి సుమారు ఆరున్నర అడుగులు ఉన్నాయి. శనివారం ఉదయం వీటిని రాజగోపురంపై ప్రతిష్ఠించనున్నారు. ఒక్కో ద్వారపాలకుడి విగ్రహం తయారు చేసేందుకు సుమారు 2 నెలల సమయం పట్టిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 8 విగ్రహాలను ఆళ్లగడ్డ, గుంటూరు నుంచి తీసుకువచ్చారు. ఇప్పటికే శిల్పులు సప్త రాజగోపురాలను పూర్తి చేశారు. ప్రస్తుతం వాటిపై శిల్పాలను ప్రతిష్ఠించే పనులు చేస్తున్నారు. వీటిని సైతం మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రధానాలయం పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. చినజీయర్‌స్వామి ఆదేశాల మేరకు ప్రధానాలయం ప్రతిష్ఠ కార్యక్రమాలకు తేదీల నిర్ణయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిత్య కల్యాణ మండపం మార్పు ప్రధానాలయంలోని ప్రాకారానికి వెనక వైపు నిత్య కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు మొదట భావించారు. అయితే రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అది సరిపోదని భావించి నిత్యకల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా నిర్మించాలని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో సుమారుగా 50 నుంచి 70 కల్యాణాలు జరుగుతాయి. కాగా, ప్రతి శని, ఆదివారాలు, పర్వదినాలు, శేష రోజుల్లో వందల సంఖ్యలో జరుగుతాయని భావించి పెద్దగా ఉండేలా ప్రత్యేక మండపం నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మండపానికి వచ్చేందుకు ఒక ద్వారం, వెళ్లేందుకు మరోద్వారం ఏర్పాటు చేయనున్నారు. శిలాస్తంభాలపై నాణేల చిత్రాలు అష్టభుజి మండపం శిలాస్తంభాలపై 5 రూపాయలు, ఒక రూపాయి, రెండు పైసల నాణేం వంటి అనేక చిత్రాలే కాకుండా జంతువులు, వివిధ పనులకు సంబంధించిన పనిముట్లు, కాకతీయుల కాలం నాటి ముద్రణలు, శివాజీ, అమ్మవారి కలశం, వంటి వివిధ ఆకృతులలో ఉండే చిత్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. తెలంగాణ జీవన శైలికి అద్దం పట్టే విధంగా ఈ కళాకృతులను చెక్కుతున్నారు. -
అద్భుతంగా యాదాద్రి నిర్మాణం
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు అద్భుతంగా జరుగుతున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు గవర్నర్ సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం గవర్నర్ ఆలయ పునఃనిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాలయాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా, స్వయంభూ మూర్తులను కదల్చకుండా ఆలయాన్ని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో స్థపతులు, అధికారులు బాగా శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రధాన ఆలయాన్ని కృష్ణ శిలతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి తదితరులున్నారు. -
శివాలయం, ప్రధానాలయం ఒకేసారి ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మితమవుతున్న శివాలయం, స్వామి వారి గర్భాలయం రెండు ఒకేసారి ప్రారంభించడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయ ప్రతిష్ట చేసే తేదీలను చినజీయర్ స్వామి ప్రకటించడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంలోని గర్భాలయంలో స్వయంభూ మూర్తుల వద్ద ఫ్లోరింగ్ చేసి బండలు వేస్తున్నారు. ప్రధాన ముఖ మండపంలో పనులన్నీ పూర్తయ్యాయి. బయట ఉన్న అష్టబుజి మండపం, ఆలయ ప్రాకారం పనులు, రెండో ప్రాకారం పనులు జరుగుతున్నాయి. వీటిని మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. శివాలయం పనులు: శివాలయంలో ప్రస్తుతం రాజగోపురాలు, ప్రధాన ద్వారం, చుట్టూ ప్రాకారం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే రెండు ఆలయాల ప్రతిష్ట కార్యక్రమాలను ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జనవరిలోనే ప్రధానాలయం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆలయ పనుల పరిశీలన: తిరుమాడ వీధులు, రాజగోపురాలు, నూతన ప్రధానాలయం పనులను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. -
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
-
టీటీడీ వివాదం.. శ్రీలక్ష్మి బదిలీ
సాక్షి, అమరావతి : పురావస్తు శాఖ ఇటీవల టీటీడీకి జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం చెలరేగటంతో ఆశాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ టి.శ్రీలక్ష్మిని చెన్నైకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో చెన్నైలో పని చేస్తున్న రామన్‌ను నియమించారు. తిరుమల దేవాలయాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఈ నెల 5వ తేదీన సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి టీటీడీ కార్యనిర్వహణాధికారికి సర్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెంటనే సర్క్యులర్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తోందని బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో చేసేది ఏమీలేక కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. -
మత్స్యావతారం.. శేష సేవ..
-
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
దండాలన్నా నాంపల్లి నర్సన్నా
పుణ్య తీర్థం ఐదు తలల సర్పాకారం... తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. 52 అడుగుల ఎల్తైన గుట్ట.. చుట్టూ పచ్చని పంటలు.. కనుచూపు మేర కనువిందుచేసే అందాలు... మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు...ఎన్నిసార్లు చూసినా... తనివి తీరని అద్భుత శిల్పాలు నాంపల్లిగుట్ట సొంతం. ఆ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందానుభూతులలో ఓలలాడతారు. నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి. గుట్టపై గుహలు నాంపల్లిగుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు(తొమ్మిది మంది) ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు. కాళీయ మర్దనం.. ప్రత్యేకత నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ... నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు. వేడుకలు.. ఉత్సవాలు ప్రతి శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, శివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణ వేడుకలు జరుగుతాయి. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లిగుట్ట అభివృద్ధికి తెలంగాణ పర్యాటక శాఖ రూ.29 కోట్లతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్ అండ్ సౌండ్స్ వంటి ఆధునిక వసతులను సమకూర్చేందుకు ప్రతిపాదించారు. గుట్టపైకి ఘాట్ రోడ్డు సౌకర్యం ఉంది. ఎలా చేరుకోవాలి..! నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగావచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. గుట్టపైకి వాహనాలు వెళతాయి. మెట్ల గుండా ఆలయానికి చేరుకోవాలి. – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’, రాజన్న సిరిసిల్ల -
పెళ్లికళను సంతరించుకున్న వెయ్యినూతుల కోన
చుట్టూ కొండలు... మధ్యలోయలు పచ్చదనంతో పరిఢవిల్లే... సుమపరిమళాల చెట్లు... వేసవికాలమైన సరే... కళకళలాడే కోనేర్లు... భక్తులకు ఆహ్వానం పలికే వసతి గృహాలు...ఆçహ్లాదకర వాతావరణం... శిల్పకళ ఉట్టిపడే ఆలయం... అందులో ఉగ్రరూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి. కాస్త దూరంలో లక్ష్మీదేవి ఆలయం... చూడ ముచ్చటైన క్షేత్రం... ఈ వెయ్యినూతలకోన. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లె గ్రామంలో వెయ్యినూతలకోన క్షేత్రం ఉంది. వెయ్యి నూతులు (బావులు) ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతుల కోన అనే పేరు వచ్చింది. క్రమంగా నూతుల కాస్తా నూతల అయింది. ఈ క్షేత్రంలో శ్రీలక్ష్షీ్మనరసింహస్వామి, లక్ష్షీ్మదేవి అమ్మవార్లు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్నారు. క్షేత్రం ప్రాంగణం చుట్టూ వెయ్యి కోనేర్లు ఉండేవని, తద్వారా వెయ్యినూతలకోన పేరు వచ్చిందని పురాణగా«థ. ఈ పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రాత్రికి గరుడ సేవ, మరుసటి రోజు కల్యాణం జరపడం అనవాయితీ. బ్రహ్మోత్సవాల కోన... శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా 8వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నేటి ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి గరుడసేవ, రేపు ఉదయం కల్యాణోత్సవం, చక్రస్నానం, గజవాహన సేవ, సాయంత్రం ధ్వజ అవరోహణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా చిన్నదాసరిపల్లె గ్రామస్థులు ఒంగోలు జాతి కోడెలకు రాతిదూలం బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ చర్రిత.... విజయనగర సామాజ్య కాలంలో వెయ్యినూతలకోన వెలసినట్లు అక్కడి శాసనాలు వివరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలకాలంలో సాళువ మంగరాజు... తల్లి జ్ఞాపకార్థం వెయ్యినూతలకోన క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి గుడికట్టించారు. అచ్యుత దేవరాయలు గుడిని దర్శించి 27 ఎకరాలు భూమిని మాన్యంగా ఇచ్చారు. తాళ్లపాక అన్నమాచార్యులు స్వామి వారిని సందర్శించి 10కి పైగా సంకీర్తనలు రచించారు. ఆనాటి పూజారులు వంశపారంపర్య ధర్మకర్త పిన్నపాటి వంశీయులు నిత్యం పూజలు, నైవేద్యాలు కొనసాగిస్తున్నారు. 2006లో లక్ష్మీదేవి ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టి, 2007లో పునఃప్రతిష్టించారు. 2009లో స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, పనులు పూర్తి చేశారు. భక్తులు, దాతల సహకారంతో చేపట్టిన ఈ రెండు ఆలయాల జీర్ణోద్ధరణకు దాదాపు రూ.2.50 కోట్లు వెచ్చించారు. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలను సందర్శించడానికి రెండుకళ్లూ చాలవనిపిస్తుంది. కాకులు, గద్దలు సంచరించవు... వెయ్యినూతలకోనలో కాకులు, గద్దలు సంచరించవు. దీనికి ఒక పురాణ గాథను చెబుతారు. అదేమంటే... త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దండకార్యణంలో ప్రవేశించినప్పడు సీతాదేవి ఒడిలో తల ఉంచి ఈ ప్రాంతంలో సేదతీరాడట. కాకాసురుడు అనే రాక్షసుడు పండు అని భ్రమించి సీతాదేవి తొడను ముక్కుతో పొడిచాడట. అది చూసిన రాముడు కోపంతో కాకాసురుడిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడట. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిసరాలల్లోకి కాకులు, గద్దలు సంచరించవని పురాణగాధ. చేరుకోవడం ఇలా.... –ఈ క్షేత్రం కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరాన ఉంది. –కడప–పులివెందుల ప్రధాన రహదారిలో మండల కేంద్రమైన పెండ్లిమర్రి సమీపంలోని చెర్లోపల్లె బస్టాప్‌కు మూడు కిలోమీటర్లు. –వేంపల్లె నుంచి 23 కిలో మీటర్లు . విశేషాలు... వెయ్యినూతలకోన క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి పల్లకిని మోస్తే మనసులో కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. ఉత్సవాల రోజు కోనేర్లుల్లో చక్కెర స్నానం చేస్తే పాపకర్మలు తొలగి పోతాయని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. అందువల్ల ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. – పి.చెన్నకేశవరెడ్డి, సాక్షి పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా -
బ్రహ్మోత్సవ గిరి
పుణ్యతీర్థం శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవునికి నిలయమైన పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పంచనదీ సంగమక్షేత్రంగా వాసికెక్కింది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి వరకు పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 28న శ్రీ చెన్నకేశవుని చందనోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. 29న అక్షయ తదియ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. 30న ముత్యాల తలంబ్రాలతో శ్రీ కామాక్షీ వైద్యనాథుల, శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల కల్యాణోత్సవాలు, మే1న ఇరువురు స్వాముల రథోత్సవాలు జరగనున్నాయి. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది. పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసం వుండి ఆయా దేవతలను దర్శిస్తే ఈలోకంలోనే కాక పరలోకంలో కూడా సౌఖ్యం లభిస్తుందని స్థల పురాణం చెపుతోంది. సూర్యగ్రహణ సమయంలో కానీ, అక్షయతృతీయ రోజున గానీ సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేయడం ఎంతో ఫలదాయకమని, గయ క్షేత్రంలో చేసే పిండ ప్రదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం ఇక్కడ ప్రవహిస్తున్నపినాకినీ నది పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పంచ నదీ సంగమంగా వాసికెక్కింది. ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అబ్బుర పరిచే శిల్ప సంపద కొండపైన గల చెన్న కేశవ స్వామి ఆలయ కుడ్యాలపై వున్న శిల్ప సంపద మన వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాళీయ మర్దనం, క్షీర సాగర మదనం, తాండవ కృష్ణుడు, నారసింహుడు, యోగ నారసింహ మూర్తి, కృష్ణార్జున యుద్ధ ఘట్టం, ప్రత్యేకతను సంతరించుకున్న నృత్య గణపతి శిల్ప సంపద చూపరులను ఆకర్షిస్తుంది. శ్రీరామునిచే పూజలందుకున్న వైద్యనాథేశ్వరుడు ఒక ఇతిహాసం ప్రకారం శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ ఈ ప్రాంతంలో కొంతకాలం న్నాడు. ఆయన ప్రతిరోజూ ఇక్కడి వైద్యనాథేశ్వరుని పుష్పాలతో పూజించి, ముందురోజు పూజకుపయోగించిన పూలను తీసి నదిలో వేసేవాడు. కొన్నాళ్లకు ఆ పూల రాసి క్రమంగా కొండంత పెరిగి, నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందనే కథ ప్రచారంలో వుంది. ఆది శంకరాచార్యులు స్థాపించిన అద్వైత పీఠం శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరిలోని పీఠం ప్రఖ్యాతి గాంచింది. స్వయంగా ఆది శంకరాచార్యుల శిష్యులైన శ్రీ విద్యారణ్య భారతి స్వామి అధిష్టించి ధర్మపాలన చేసిన పీఠం. ఆయన పరంపరగా శ్రీ విద్యా శంకర భారతి స్వామివారు ప్రస్తుతం ఈ పీఠానికి పీఠాధిపతిగా ధర్మ సంస్థాపనకు కృషి చేస్తున్నారు. ఈ పీఠంలోని మహిమాన్విత చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం పూజలు జరుగుతాయి. విశిష్టమైన శ్రీ చక్రం పుష్పగిరిలోని వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వున్న శ్రీ కామాక్షీదేవి ఆలయంలో అమ్మవారికి ఎదుట ఎంతో విశిష్టత కల శ్రీచక్రం వుంది. చతుర్దశ భువనాలకు అధికారిణి అయిన కామాక్షీ దేవి శ్రీచక్ర సంచారిణి అని ప్రతీతి. ఇక్కడి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపనకు హరి హర బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్టితమని స్థలపురాణం చెబుతోంది. దర్శించాల్సిన ఆలయాలు పుష్పగిరి గ్రామంలో శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి, లక్ష్మీనారాయణ స్వామి, భీమలింగేశ్వర స్వామి ఆలయం, త్రికూటేశ్వర స్వామి ఆలయంలో త్రికూటేశ్వరుడు, భీమేశ్వరుడు, ఉమా శంకరుడు, అభినవ చెన్న కేశవ స్వామి, పాతాళ గణపతి, పుష్పగిరి పీఠం. పుష్పగిరి కొండపైన శ్రీ చెన్న కేశవ స్వామి, లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర, రుద్రపాదం, దుర్గ, ఇంద్ర నాథేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. చేరుకోవడం ఇలా వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది. అక్కడి నుండి బస్సులు, ఆటోల్లో పుష్పగిరికి చేరుకోవచ్చు. కడప రైల్వే స్టేషన్ నుండి దాదాపు 18 కి. మీ దూరం వుంటుంది. – నవనీశ్వర్‌రెడ్డి సాక్షి, వైఎస్సార్ జిల్లా -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వరుస సెలవు దినాలు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతించ లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఇరవై నాలుగు ముద్దులు!
‘మిణుగురులు’ వంటి విలక్షణమైన చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్యకుమార్ ‘శ్రీలక్ష్మి అండ్ 24 కిస్సెస్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రవిశేషాలను అయోధ్యకుమార్ చెబుతూ - ‘‘ఇదొక యునిక్ లవ్‌స్టోరీ, ఎమోషనల్ ఎంటర్టైనర్. టైటిల్ కొంచెం హార్డ్‌గా ఉన్నా, కథలో స్వచ్ఛమైన ప్రేమకథ ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగులో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ చిత్రం రాలేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. జులైలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రముఖ హీరో, హీరోయిన్ నటించనున్న ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది’’ అని చెప్పారు. -
అహోబిలంలో రెచ్చిపోయిన ఆక్రమణదారులు
కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో, మఠం కార్యాలయాలపై ఆక్రమణ దారులు దాడులకు తెగబడ్డారు. అసిస్టెంట్ ఈవో శివరాముడు, మఠం ప్రతినిధులపై కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దిగువ అహోబిలంలో దేవస్థానం భూములను కొందరు ఆక్రమించుకుని నివాసాలు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని దేవస్థానం వారు తొలగించనున్నారనే ఆందోళనతో ఆక్రమణదారులు గురువారం అర్ధరాత్రి సమయంలో దేవస్థానం ఈవో, మఠం కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత దేవస్థానం అసిస్టెంట్ ఈవో శివరాముడు, మఠం ప్రతినిధులపై కూడా దాడి చేసి పరారయ్యారు. ఈ దాడుల్లో సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. అహోబిలంలో పోలీసు అవుట్‌పోస్ట్ ఉన్నప్పటికీ ఆక్రమణదారులు దాడులు చేయడం గమనార్హం. -
టేకు చెట్ల నరికివేతలో రెవెన్యూ ప్రమేయం
► నిందితులను కటకటాల వెనక్కి పంపుతాం ► ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్) : శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయ భూముల్లో టేకు చెట్ల అక్రమ నరికివేత కేసు వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలిందని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమార్కులకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరించారని, ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని వదిలే ప్రసక్తే లేదని, అరెస్ట్‌చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే టేకు కలపను అక్రమంగా నరికివేసిన ఘటనలో పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోన్నారని పత్రికల్లో కథనాలు రావడం దారుణమన్నారు. తాము ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే నిందితుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు, కార్యాలయాలు, వైన్‌షాపులపై చర్యలు తీసుకొన్నామన్నారు. కేసు పూర్వాపరాలను లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు అక్రమంగా తరలించిన టేకు విలువ రూ.8.5 లక్షలని తెలిపారు. అపోహలు వీడండి కేసు విషయంలో అపోహలు వీడాలని మీడియా సిబ్బందికి ఎస్పీ సూచించారు. కేసులో అన్ని నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు పెట్టామన్నారు. ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా నేరుగా తనతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చన్నారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా కొన్ని విషయాలు వెల్లడించలేక పోతున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో నెల్లూరు రూరల్, నగర, ఎస్బీ డీఎస్పీలు డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డి, ఎస్బీ, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్లు సి.మాణిక్యరావు, సీహెచ్ దుర్గాప్రసాద్, ఎస్బీ ఎస్ఐ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
మరో పది రోజులే...
తర్వాత ఏడాదిన్నర ఆగాల్సిందే యాదగిరికొండ (నల్లగొండ): తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోన్న యూదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వయంభు మూర్తులను భక్తులు దర్శించుకునేది ఇక 10 రోజులు మాత్రమే. ఈ నెల 21వ తేదీన బాల ఆలయంలో విగ్రహ మూర్తులను చిన జీయర్ స్వామి ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత బాల ఆలయంలోనే భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. దీంతో యాదాద్రికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి మరీ పోటీ పడుతున్నారు. ఈ పది రోజులు దాటిందంటే దేవస్థానంలోనే స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలంటే భక్తులు ఏడాదిన్నర ఆగాల్సిందే. మరోవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దీక్షలు (నరసింహ మాలధారణ) సోమవారం నుంచి ప్రారంభం కానున్నారుు. స్వామి వారి జయంతి వచ్చేనెల 20 వ తేదీన ఉండడంతో మండల దీక్ష చేపట్టే స్వాములు ఈ నెల 11న, అర మండల దీక్ష తీసుకునే స్వాములు మే 1న మలధారణ చేయూలని ఆలయ అర్చకులు సూచించారు. -
10 నుంచి యాదాద్రి బహ్మోత్సవాలు
కాచిగూడ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... 12వ తేదీ నుంచి 19 వరకు ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు జరుగుతాయన్నారు. 16వ తేదీన రాత్రి 9.45 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 17న రాత్రి 9.45 గంటలకు తిరు కళ్యాణం, 18వ తేదీన రాత్రి 9 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజూ స్వామి అలంకార, వాహన సేవలు జరుగుతాయని... స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు (దంపతులు మాత్రమే) రూ.10,116 చెల్లించి పాల్గొనవచ్చునని తెలిపారు. -
వివాహిత సజీవదహనం
కృష్ణాజిల్లా: మతి స్థిమితం లేని మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతిచెందిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. కంకిపాడు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అర్జున్‌రావు, శ్రీలక్ష్మీ(36) భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం శ్రీలక్ష్మీ అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ధర్మపురి హుండీ ఆదాయం రూ.22 లక్షలు
ధర్మపురి (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో రూ. 22,43,723 నగదుతో పాటు,19 గ్రాముల బంగారం, 2.280 గ్రాముల వెండి, విదేశాలకు చెందిన 26 కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. -
మళ్లీ వివాదంలోకి...
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వ్యవహారం లో కొత్త వివాదం రాజు కుంది. గతంలో ఆలయ స్థల లీజును వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమించటంతో తర చూ వార్తల్లోకెక్కగా... ఇప్పు డు మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు పోటెత్తాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు శాస్త్రవిరుద్ధంగా ఉందో లేదో తేల్చేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ వేయాల్సి వచ్చింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో సమీప బస్తీలకు అరిష్టం చుట్టుకుందని, దీనివల్ల అనారోగ్యానికి గురై చనిపోతున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇదీ సంగతి..: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఓ ధార్మిక సంస్థ లీజుకు తీసుకుని పునరుద్ధరణ, అభివృద్ధి పనులు జరుపుతోంది. పురాతన ఆలయం దెబ్బతినకుండా చుట్టూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంటోంది. అయితే ఈ పనుల పేరుతో దేవాయంలోని మూల విరాట్టులను మరోచోటికి తరలించటం, ధ్వజస్తంభాన్ని తొలగించటం, చుట్టూ ఉన్న గుట్ట రాళ్లను మార్పుచేర్పులు చేయటాన్ని స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రవిరుద్ధమైన పనులని, దీనివల్ల తమకు అరిష్టం చుట్టుకుందంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. నెలరోజులుగా ఈ వివాదం నానుతోంది. ఇటీవల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు స్థానికులు రాగా నిర్వాహకులు అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారని, ఆలయంలో స్వామిని దర్శనం చేసుకోనివ్వటం లేదని ఫిర్యాదు చేయటంతో ప్రభుత్వం స్పందించింది. అక్కడి పనులు శాస్త్ర సమ్మతమా, విరుద్ధమా తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో ఈ ఆలయ స్థలం స్వాహా చేసేందుకు రాజకీయ నేతలు యత్నించటం, ఆ తర్వాత ధార్మిక సంస్థ అభివృద్ధి చేసేందుకు ముందుకు రావటంతో ప్రభుత్వం లీజుకివ్వటం తదితరాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది. కమిటీ ఆలయ సందర్శన: దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు కన్వీనర్‌గా, ఆగమ శాస్త్ర నిపుణులు వెంకటాచార్యులు, స్థపతి వల్లినాయగం, దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింహులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులు ఓ దఫా ఆలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి రికార్డు చేశారు. ధార్మిక సంస్థ నిర్వాహకులతో మాట్లాడగా వారం రోజుల్లో పనుల ప్రణాళికలు అందిస్తామని, ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసి ఆలయాన్ని తెరిచేలా చూస్తామని వెల్లడించారు. వాటిన్నింటిని పరిశీలించి మరో పది రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. -
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్
నల్గొండ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉదయం హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. స్వామి, అమ్మ వార్లకు రాష్ట్రపతి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయంలో స్వామి వారికి స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మహామండపంలో ప్రణబ్‌ను వేద పండితులు ఆశీర్వదించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.00 గంటల వరకు దేవాలయంలో సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను నిలిపివేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు యాదాద్రి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రణబ్ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఉన్నారు. -
బాబూ... చిట్టీ!
కమెడియన్ అంటే మగవాడేనా? ఆడవాళ్లు నవ్వించలేరా? శ్రీలక్ష్మిని చూసి కూడా ఆ మాట అనగలమా! ఒక్క శ్రీలక్ష్మి... వంద కమెడియన్ల పెట్టు. జంధ్యాల ప్రసాదించిన కామెడీ వరాల్లో శ్రీలక్ష్మి మేలైన వరం. కాదు కాదు... ఫిమేలైన వరం. శ్రీలక్ష్మి చేసిన అయస్కాంతాల్లాంటి అనేక పాత్రల్లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లోని ఈ కాంతం పాత్ర ప్రత్యేకమైనది! రాంబాబు, సూరిబాబు... ఇద్దరూ జంట కవుల్లాంటి వాళ్లు. ఒకే మంచంలో తిని, ఒకే కంచంలో పడుకునేంత... సారీ సారీ... ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత ఫ్రెండ్సాతి ఫ్రెండ్సు. రాంబాబుకు తలపోటు వస్తే, సూరిబాబు శారిడాన్ వేసుకునేంత క్లోజన్నమాట. వీళ్లిద్దరూ ఓ ఇంట్లో అద్దెకుంటుంటారు. అప్పటివరకూ హుషారుగా రోడ్లన్నీ బలాదూర్‌గా తిరిగేసిన ఈ జంట... ఇంటి సమీపానికి రాగానే మాత్రం టెన్షనైపోతారు. అటెన్షనైపోతారు. ధైర్యం కోసం ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, పిల్లుల్లా నడుస్తూ ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. ఎందుకంత భయం? ఆ ఇంట్లో అల్సేషియన్ కుక్క ఉందా?... లేదు. రెంట్ బాకీ ఉందా? అస్సల్లేదు. కుక్క ఉంటే కరిపించుకుని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్స్ అయినా చేయించుకోవచ్చు. రెంట్ కట్టాలనుకుంటే నానాగడ్డీ కరిచి, వాళ్ల గడ్డం... వీళ్ల గడ్డం పుచ్చుకుని అప్పు తీసుకోవచ్చు. మరేంటి ప్రాబ్లమ్? ఓకే... మీకంత ఆరాటంగా ఉంటే... పదండి ముందుకు... పదండి తోసుకు... పోదాం పోదాం. గోపాలం అండ్ కాంతం ఇంటికి. తలుపు చప్పుడైతే కాంతం వెళ్లి తీసింది. రాంబాబు, సూరిబాబు లోపలకొచ్చి, చాలా బుద్ధిగా పైన రూమ్కెళ్లడానికి మెట్లు ఎక్కబోతున్నారు. వాళ్లు ఊహించిన ప్రమాదం ఎదురవ్వనే అయ్యింది. ‘‘అవునూ... ఎందుకింత లేటయ్యింది?’’ అడిగింది కాంతం. ‘చచ్చాంరా దేవుడోయ్’ అనుకున్నారిద్దరూ. రాంబాబు నీళ్లు నములుతూ ‘‘ఊళ్లోకి ‘శనిదేవుని లీలలు’ అనే భక్తి సినిమా వచ్చింది అక్కయ్యగారూ’’ అని చెప్పాడు. కాంతం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ‘‘ఏంటి... మిమ్మల్నే... భక్తి సినిమాకెళ్లొస్తున్నారా?’’ అనడిగింది. ఇద్దరూ బుర్రలూపారు. అంతే... కాంతం కళ్లల్లో మున్సిపాల్టీ ట్యాప్ ఓపెనైపోయింది. ఇక్కడ రాంబాబు గుండెను ఎవరో డోలు వాయిస్తున్న ఫీలింగ్. సూరిబాబుకేమో తనే సన్నాయిలా అయిపోయినట్టు డ్రీమ్. పి... పి....పీ... పీ... డుం... డుం... వచ్చేసింది సునామీ. ‘బాబూ... చిట్టీ’ అంటూ కాంతం గభాల్న రాంబాబును గట్టిగా కౌగిలించుకుంది. బోనులో పడ్డ ఎలకలాగా రాంబాబు తెగ కంగారుపడిపోయాడు. కాంతమ్మక్కయ్య కౌగిలిని విడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ‘‘ఏవండీ... పొరపాటైపోయిందండీ’’ అని వాపోయాడతను. అయినా కాంతం వదిలితేగా! ‘‘మా చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబూ’’ అని తెగ కన్నీరు మున్నీరైపోయింది. చివరకు ఎప్పటికో వదిలిందామె. పులి నోట్లో చిక్కుకుని తప్పించుకున్న కుందేలు పిల్లలాగా బెదిరిపోయాడు. ఇప్పుడర్థమైందిగా... రాంబాబు, సూరిబాబులు ఎందుకంత భయపడుతున్నారో! ఈ కాంతానికి ఓ విషాదకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. చెబితే మీరు కూడా కరిగిపోయి ‘బాబూ! చిట్టీ’ అంటూ ఎవరో ఒకరిని వాటేసుకోవడం ఖాయం! వీళ్లకు ఒక్కగానొక్క సంతానం. పేరు చిట్టి. 21 ఏళ్లు నిండకుండానే నూరేళ్లూ నిండిపోయాయి పాపం. ఆ చిట్టిని మర్చిపోవడం ఆమె వల్ల కావడం లేదు. చిట్టి జ్ఞాపకాలు ఈ చిట్టి తల్లిని టీవీ సీరియల్లాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా ‘మాట’ అంటే చాలు... ‘మా చిట్టి కూడా సేమ్ టూ సేమ్ ఇలానే...’ అంటూ వాళ్లను వాటేసుకుని మరీ భోరున విలపించడం ఆమెకు కామనైపోయింది. ఈ ‘చిట్టి’తల్లి బాధితుల్లో చాలామంది ఉన్నారు. పాలవాడు... కూరలవాడు... పోస్ట్‌మేన్... మన రాంబాబు, సూరిబాబు... ఇలా కోకొల్లలు. అయితే అందరికీ ఆమె తల్లిప్రేమ తెలుసు కాబట్టి, ఎవరూ అపార్థం చేసుకోరు. రాంబాబు బాగా పడ్డాడు. బురదలో కాదండోయ్... ప్రేమలో. అమ్మాయిది సూరిబాబు వాళ్ల ఊరే. ఆ ప్రేమ ప్రయత్నంలో భాగంగా ఆ ఊళ్లోనే తిష్ఠ వేశాడు మన రాంబాబు. గుళ్లూ గోపురాలు తిరుగుతూ పుణ్యదంపతులైన గోపాలం-కాంతం కూడా ఈ ఊరొచ్చారు. లటుక్కున దొరికేశాడు రాంబాబు. సరే.. అని ఓ ప్లాన్ వేశాడు. తన అమ్మానాన్నల్లా నటించమని అడిగాడు. వాళ్లు ఓకే... సూరిబాబు నాన్నది ఓ చిత్రమైన కేరెక్టర్. పేరు పటేల్. నైజాం నుంచి ఇక్కడికి ఇల్లరికం వచ్చాడు. మహా సినిమా పిచ్చి, డబ్బు పిచ్చి. ఇంటికొచ్చి ఎవరు కాఫీ తాగినా, టిఫినీ తిన్నా చేతిలో బిల్లు పెట్టేస్తాడు. గోపాలానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆయన ఎంచక్కా కాఫీ జుర్రుకుంటూ తాగేసరికి, ఈ పటేల్ వచ్చి చేతిలో బిల్లు పెట్టాడు. గోపాలం షాక్. ‘‘నేను పైసలు కాడ బరాబర్ ఉంటా’’ చెప్పాడు పటేల్. అంతే... ఈ మాటలు విని లోపల్నుంచీ పరిగెత్తు కుంటూ వచ్చింది కాంతం. ‘‘ఏమన్నారు... పైసలు దగ్గర కచ్చితంగా ఉంటాననా?’’ అనడిగింది. పటేల్ అయోమ యంగా ‘‘అవును’’ అన్నాడు. అంతే... డోలు- సన్నాయి ఒక్కసారిగా పి... పి... పీ... పీ... డుం... డుం... అంటూ మోగాయి. ‘‘బాబూ... చిట్టీ’’ అంటూ కాంతం, పటేల్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడింది. గోపాలం అడ్డుపడ్డాడు. ‘‘కాంతం ఆగిపో... ఆవేశపడకు... కావలించుకుంటే చొక్కా నలిగిపోయిందని బిల్లు చేతిలో పెడతాడు’’ అన్నాడు గోపాలం. దాంతో కాంతం తన ఆప్యాయతానురాగాభి మానాల ప్రేమ సముద్రాన్ని తనలోనే దాచేసుకుంది. ఈ పటేల్ చెప్పే సైన్మా కథలకు గోపాలం బుర్ర వాచి పోతోంది. ఎంత తప్పించుకుందామన్నా వదిలి చావడే. చివరకు ఈ ‘బాబూ చిట్టీ’ నామస్మరణే గోపాలానికి పటేల్ పీడ వదిలేలా చేసింది. అదెలా అంటే... పటేల్ ‘పాండవ వనవాసం’ సైన్మా కథ చెబుతున్నాడు. ‘‘ఎస్వీవోడు తొడగొడుతున్నాడు... సావిత్రమ్మ ఏడుస్తోంది... భీముడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు...’’ ఇలా పటేల్ ఊకదంపుడుగా చెబుతూనే ఉన్నాడు. గోపాలంలో ఆగ్రహం బ్యారికేడ్లు దాటేసింది. దాంతో తానే రివర్స్‌లో కథ చెప్పడం మొదలుపెట్టాడు గోపాలం. ఎన్టీవోడంటాడు... గవాస్కరంటాడు... హేమమాలిని మనవరాలంటాడు... మహ్మద్ బీన్ తుగ్లక్ అంటాడు... ఇక చూడాలి పటేల్ తిప్పలు. బెంబేలెత్తిపోయాడు. ‘‘తమ్మీ... ఇంక నన్ను వొదిలేయరాదే... ఒడ్డున పడ్డ చేప తీరునయిపోయింది నా బతుకు’’ అని వాపోయాడు పటేల్. అప్పుడే ఎంటరైంది కాంతం. ‘‘ఏమన్నావ్ బాబూ... ఒడ్డున పడ్డ చేపా?’’ అనడిగింది. పటేల్ బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. ‘‘బాబూ... చిట్టీ’’ అని కాంతం వాటేసుకోవడానికి సిద్ధమైంది. పటేల్ బిక్కచచ్చిపోయాడు. దెబ్బకు పరుగో... పరుగు... అదండీ... ఈ ‘చిట్టి’ కథ. ఇక కథ కంచికి... మీరు ఇంటికి. ఎక్స్‌క్యూజ్‌మీ... మీరుండేది సొంతిల్లా? అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అయితే కాంతంగారు లేరు కదా..! హహ్హహ్హహ్హహ్హ... - పులగం చిన్నారాయణ ఇన్స్పిరేషన్ ఎవరో ఉండే ఉంటారు! ‘‘ఈ పాత్ర అనే కాదు... జంధ్యాల గారు సృష్టించిన ఏ పాత్ర అయినా చిరంజీవుల్లా కలకాలం నిలిచి పోయేవే. 26 ఏళ్ల క్రితం చేసిన ఈ పాత్ర ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మార్మోగిపోతూనే ఉంది. ఈ క్రెడిట్ ఓ రకంగా ‘సాక్షి’ టీవీకి దక్కుతుంది. వాళ్లు ఈ ‘బాబూ! చిట్టీ’ని సెటైరిక్‌గా బాగా వాడుకోవడంతో, అన్ని గేమ్ షోల్లోనూ, న్యూస్ చానల్స్‌లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. జంధ్యాలగారు చుట్టూ ఉన్న సమాజం నుంచి, మనుషుల నుంచి ప్రేరణ పొంది పాత్రలు సృష్టిస్తుంటారు. ఈ పాత్రక్కూడా కచ్చితంగా ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది. నాకైతే తెలీదు.’’ - శ్రీలక్ష్మి ఆ నాదస్వరం బిట్ తప్ప మరేదీ అక్కడ అతకదు! ‘‘జంధ్యాల గారి దర్శకత్వంలో తొలిసారిగా మేము సంగీతం అందించిన చిత్రం ‘జయమ్ము... నిశ్చయమ్మురా!’. శ్రీలక్ష్మి ‘బాబూ చిట్టీ’ అనే డైలాగ్ చెప్పినచోటల్లా ప్రత్యేకమైన రీరికార్డింగ్ మ్యూజిక్ బిట్ పెట్టాలనుకున్నాం. కె.వి. మహదేవన్ సంగీతంలో వచ్చిన పాత తమిళ సూపర్‌హిట్ ‘తిల్లానా మోహనాంబాళ్’లో శివాజీగణేశన్ నాదస్వర విద్వాంసుడు. పద్మిని నర్తకి. అందులో పద్మిని, శివాజీ జంట మీద వచ్చే ‘నలందానా....’ (బాగున్నావా అని అర్థం) అనే పాట పెద్ద హిట్. పాటలో హీరోయిన్ పలికే ఆ మాటకు, ‘పి...పి.. పీ..పీ...’ అంటూ నాదస్వరంలో బదులిస్తాడు హీరో. సరిగ్గా ఆ పాపులర్ నాదస్వరం బిట్‌నే ఈ ‘బాబూ చిట్టీ’కి వాడితే కామెడీ బాగా పండుతుందని అనిపించింది. అది తప్ప మరేదీ అక్కడ అతకదని అనిపించింది. అలా చేసిన ప్రయోగం ఇవాళ్టికీ అందరూ చెప్పుకొనే పెద్ద హిట్ కామెడీ సీన్ అయింది.’’ - రాజ్ - కోటి జంటలో ఒకరైన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: జయమ్ము నిశ్చయమ్మురా (1989) డెరైక్ట్ చేసింది: జంధ్యాల; సినిమా తీసింది: జీవీహెచ్ ప్రసాద్ మాటలు రాసింది: జంధ్యాల -
గుట్టలో ‘పొంగులేటి’ పూజలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని ధ్వజ స్తంభం వద్ద ముందుగా నమస్కరించుకుని ఆలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ఎంపీకి ఘన స్వాగతం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు వడ్లోజు వెంకటేశ్, గూడూరు జైపాల్‌రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొండపైన దేవస్థానం అతిథి గృహంలో స్థానిక కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. బాగున్నారా అంటూ కార్యకర్తలందరినీ పలకరించారు. అనంతరం ఆయన తన కుటుంబ సమేతంగా కార్యకర్తలతో కలిసి దర్శనానికి వెళ్లారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. అర్చకులతో కాసేపు.. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ అర్చకులతో కలిసి మాట్లాడారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. అర్చకుల బాగోగులు, వేతనాల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గుట్ట ఆలయ అభివృద్ధిపై ఆరా తీశారు. క్షేత్ర మహాత్యం, పూజల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నల్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, సాధు రమేశ్‌రెడ్డి, నేలకొండపల్లి మండలాధ్యక్షుడు కోటి సైదిరెడ్డి, చెన్న రాజేశ్, హరిప్రసాద్, బట్టు సతీష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వసంత వల్లభుని వైభవం
మార్చి 1 నుండి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు ఏ రోజు ఏ ఉత్సవమంటే..? మార్చి 1న అంకురార్పణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 2వ తేదీన కళ్యాణోత్సవం, 3న హంసవాహనం, 4వ తేదీ సింహ వాహనం, 5వ తేదీ హనుమంత వాహనం, 6వ తేదీ బ్రహ్మ గరుడసేవ, 7వ తేదీ శేషవాహనం, 8వ తేదీన పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ ఉత్సవాలు, 9వ తేదీన మోహినీ ఉత్సవం, 10వ తేదీన ప్రజా గరుడ సేవ, 11వ తేదీ గజవాహనం, 12న బ్రహ్మ రథోత్సవం, 13వ తేదీన అశ్వ వాహనం, 14వ తేదీన తీర్థవాది(శ్రీవారి చక్రస్నానం), 15వ తేదీన పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. - చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు నిత్య పూజలతో వెలుగొందుతున్నాడు. ఆలయానికి పడమటి వైపున నదీతీరం ఉంది. అక్కడ భృగుమహర్షి తపస్సు చేసి శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారని, ఆ మహర్షి కోరిక మేరకే స్వామివారు స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని పురాణ వచనం. వీటిని శ్రీవారు వసంత రుతువులో అనుగ్ర హించడం వల్ల ఉత్సవ మూర్తులకు వసంత వల్లభుడని పేరొచ్చింది. వసంత వల్లభుడైన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి యేటా పక్షం రోజుల పాటు ప్రతిరోజు వివిధ అవతారాల్లో తమ భక్తులకు కనువిందు చేస్తారు. వాటినే బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మార్చి 1న అంకురార్పణంతో ప్రారంభమై 15న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. ఖాద్రీ క్షేత్రం ప్రత్యేకత: లోక కంటకుడైన హిరణ్యకశిపుడి సంహారానికి శ్రీవారు మహోగ్రరూపంలో స్తంభంనుంచి ఆవిర్భవించారు. సగం మనిషి, సగం సింహరూపం దాల్చిన స్వామివారు తన భక్తుడు ప్రహ్లాదుని స్తోత్రంతో శాంతించి ఖాద్రీ క్షేత్రంలో కొలువుదీరారు. స్వామిపాదం కొండపై మోపడంతో ఖాద్రి అని పిలిచారు. కాలక్రమేణా దీన్ని కదిరిగా పిలుస్తున్నారు. కదిరి నృసింహుని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కల్గిన ఈ దివ్య క్షేత్రం ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామివారి స్వేద బిందువులు చూడచ్చు!: ఇక్కడ స్వామివారి మూలవిరాట్‌కు ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం స్వామివారి మూలవిరాట్ నుండి స్వేదబిందువులు ఉద్భవిస్తాయి. దీన్ని భక్తులు మహిమాన్వితంగా భావిస్తారు. ఇంకో విశేషమేమంటే ఈ ఆలయంలో స్వామివారు శ్రీలక్ష్మీ సమేతంగా శాంత మూర్తిగా దర్శనమిస్తారు. ఆలయ చరిత్ర: కదిరి-అనంతపురం రహదారిలోని 16 కిలోమీటర్ల దూరంలోవున్న పాతిరేపల్లి(నేటి పట్నం) రంగనాయకుడికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కన్పించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆయన ఆ విగ్రహాన్ని వెలికితీసి, ప్రతిష్టించి గర్భగుడిని కట్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత క్రీ.శ 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో పూర్తిస్థాయిలో ఆలయం నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. అతి పెద్ద తేరు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనారసింహుడు మార్చి 12న బ్రహ్మ రథోత్సవం సందర్భంగా బ్రహ్మరథంపై దర్శనమిస్తారు. ఆ రోజు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తారు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం. కదిరికి ఇలా చేరుకోవచ్చు: ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవాలంటే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10ని,,కు ఓ బస్సు ఉంది. అక్కడి నుండి 90 కి.మీ ఉంది. పుట్టపర్తి నుండి రావాలంటే కేవలం 40 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదా నల్లమాడ మీదుగా చేరుకోవచ్చు. తిరుపతి నుండి వచ్చే భక్తులు మదనపల్లి లేదా రాయచోటి మీదుగా రావచ్చు. పులివెందుల నుండి రావాలనుకుంటే నామాలగుండు మార్గంలో బీ కొత్తపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఈ బ్రహ్మోత్సవ వేడుకలలో రథోత్సవం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారే మిరియాలతో తలకు పట్టు వేసుకుంటారని నానుడి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఇలవేల్పు శ్రీ ఖాద్రి నరసింహస్వామి వారేనని స్థలపురాణం చెబుతోంది. నా పూర్వజన్మ సుకృతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి నారసింహుని సేవలో ఉన్నాను. నేనే కాదు.. మా కుటుంబమంతా స్వామి సేవకు అంకితమైపోయాం. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి రాలేని భక్తుల కోసం స్వామివారే భక్తుల చెంతకు వెళ్తారు. స్వామికి సేవలందించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. - ఏవీ నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు -
భూమాయ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినదని చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1353లో ముమ్మిడి నాయకుడు అనే రాజు, లక్ష్మీదాసి అనే భక్తురాలు దాతల నుంచి విరాళాలు సేకరించి, ఆలయాన్ని పునర్నిర్మించారు. అదే సమయంలో రెడ్డి రాజులు, ముమ్మిడి నాయకుడు కలిసి స్వామివారికి ధూప, దీప, నైవేద్యాల కోసం సుమారు 1,616 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ భూమిలో 900 ఎకరాలను స్వామివారికి నిత్యం సేవలందించే సుమారు 150 మందికి ఈనాముగా కేటాయించారు. మిగిలిన 700 ఎకరాలు కౌలుకు ఇచ్చారు. ఈ భూములు కోరుకొండ, గోకవరం మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవం తదితర గ్రామాల్లో ఉన్నాయి. భూములను ఈనాముగా పొందినవారిలో అర్చకులు, కాపలాదార్లు, కులవృత్తులు చేసుకునేవారు తదితరులు ఉన్నారు. ఇది ఒకనాటి మాట. ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామివారి పేరిట కేవలం 16 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈనాముదారులు తమకు ఇచ్చిన భూములను అనధికారికంగా అమ్మేసుకుని లక్షలు వెనకేసుకోవమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆ భూములు నలుగురైదుగురి చేతులు మారినట్టు తెలుస్తోంది. ఎకరం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు అమ్మేసుకున్నట్టు ఆలయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనాముగా ఇచ్చిన 900 ఎకరాల్లో 700 ఎకరాలకు సంబంధించి అసలు రికార్డులు కూడా లేవని చెబుతున్నారు. ఈనాము భూములను 2013 గెజిట్ ప్రకారం కౌలు భూములుగా మార్చేందుకు సమాయత్తమైన సమయంలోనే ఈ భూ బాగోతం ఆలయ అధికారుల దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. అప్పటినుంచీ ఈ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయనే దానికోసం ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేదని అంటున్నారు. కోరుకొండ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను అన్నవరం దేవస్థానం అధికారులు నాలుగేళ్లుగా చూస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయం కొలిక్కి రాలేదని చెబుతున్నారు. వేలాది ఎకరాలున్నప్పటికీ ఏటా స్వామివారికి మార్చి నెలలో ఐదు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు అన్నవరం దేవస్థానంపై ఆధారపడటాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామివారి భూములు అన్యాక్రాంతమైన వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
‘గుట్ట’ అభివృద్ధికి అత్యున్నత సంస్థ
-
‘గుట్ట’ అభివృద్ధికి అత్యున్నత సంస్థ
చైర్మన్‌గా సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి అత్యున్నతస్థాయి పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్, సభ్యులుగా మంత్రులు, నల్లగొండ జిల్లా లోక్‌సభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరించనున్నారు. ఈ ప్రతిపాదనలకు కేసీఆర్ ఆమోదం తెలపగానే రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆలయాభివృద్ధి కోసం ఈ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పనులను నేరుగా పర్యవేక్షించనుంది. ఆలయాభివృద్ధి సంస్థ పరిధిని ఆలయం చుట్టూ ఉన్న 8 గ్రామాల్లోని సుమారు 28 వేల ఎకరాల వరకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిని సీఎం ఆమోదిస్తే, యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, గిండ్లపల్లి, సైదాపూర్, దాతార్పల్లితో పాటు భువనగిరి మండలం రాయిగిరి తదితర గ్రామాల నుంచి ఈ భూమిని సేకరించనున్నారు. -
‘గుట్ట’ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి సీఈఓ కిషన్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుట్ట దేవస్థానం అభివృద్ధికి అన్ని శాఖల నుంచి నిష్ణాతులను సభ్యులుగా తీసుకుని ఒక అథారిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా కలిసి గుట్ట దేవస్థానంలో గల అభివృద్ధి కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారన్నారు. గుట్ట దేవస్థానాన్ని తిరుపతి తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయడం, అభయారణ్యాల ఏర్పాటు, వేదపాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకుముందు గుట్ట దేవస్థానం ఈఓ గీతారెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. -
తెంచుకుపోతున్నారు మహాప్రభో
10 నిముషాల్లో 10 తులాల బంగారం సంపాదించడం ఎలాగో ఎవరికైనా తెలుసా .. తెలియదా? అయితే హైదరాబాద్ నగరంలో పోలీసు స్టేషన్లలో నమోదువుతున్న క్రైం రిపోర్టు చూస్తే తెలుస్తుంది. జంట కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లో చైన్ స్నాచర్ల కేసులు ఎవరెస్ట్ కొండను తలదన్నేలా రోజురోజుకూ పెరిగిపోతుంది. రోజుకు కనీసం 15 నుంచి 20 కేసులు చైన్ స్నాచింగుల కేసులే నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అని కాదు నగరవ్యాప్తంగా చైన్ స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో నగరంలో ఆర్థరాత్రే కాదు... పట్టపగలు కూడా రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొందని నగర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న యూసఫ్‌గూడలో చైన్ స్నాచర్లు ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మీ మెడలో గొలుసు తెంచుకుపోయారు. నిన్న అమీర్‌పేట, మధురానగర్, ఈఎస్ఐ ప్రాంతాల్లో నడిరోడ్డుపై పట్టపగలు నలుగురు మహిళల మెడల్లోని దాదాపు 30 తులాల బంగారపు గొలుసులను తెంచుకుని పోయారు. జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు15 నుంచి 20 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అవుతున్నాయని సమాచారం. మొన్నామధ్య ఓ చైన్స్నాచర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటే.. గొలుసు దొంగలను కూడా అంతలా చంపాలా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ, తీరాచూస్తే అతగాడికి ఓ పెద్ద బంగ్లా లాంటి ఇల్లు, రెండు మూడు పెద్ద విలాసవంతమైన కార్లు, భారీ ఎల్ఈడీ టీవీ.. ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ గొలుసులు తెంపి సంపాదించినవే! అంత స్థాయిలో వాళ్లు విలాసాలు అనుభవిస్తుంటే.. ఇటు బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నవాళ్లు మాత్రం తమ జీవితకాల సంపాదన పోయిందంటూ వాపోతున్నారు. -
పోలీసు పోలీసు... నో పోలీసు
హైదరాబాద్ నగర పోలీసులు అంతర్జాతీయ ఖ్యాతీ నార్జించాలి.... హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలి ... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలి... మూడు నెలల్లో అన్ని ప్రాంతాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు.... గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమం (ఆగస్టు 14)లో భాగంగా మొదటి విడతలో 100 ఇన్నోవాలు, 300 బైక్‌లను పోలీసు శాఖకు అందజేస్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలివి. 100 ఇన్నోవాలు, 300 బైకులపై పోలీసులు నిరంతరం గస్తీతో తమకిక గుండెలమీద చేయి వేసుకుని పడుకోవచ్చనుకున్నారు నగరవాసులు. అయితే ప్రజల నమ్మకాన్ని ఖాకీలు మరోసారి వమ్ము చేశారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి గొలుసు చోరీ ఉదంతమే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంత పోలీసుల గస్తీలోను, కెమెరాల పహారాలోను ఆమె మెడలోని బంగారపు గొలుసును దుండగులు తెంపుకుని పోయారు. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే దుండగులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన అప్పటికే వారు మామమైయ్యారు. శ్రీలక్ష్మి షాక్ నుంచి తెరుకుని పోలీస్, పోలీస్ అని పిలిచినా పలికే నాధుడే లేడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కోసం 100 డయల్ చేసినా అటువైపు నుంచి స్పందన శూన్యం. చేసేదీలేక ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత అట్టహాసంగా పెట్రోలింగ్ కోసం అంటూ వందల ఇన్నోవా... వందల బైకులు తీసుకువచ్చినా పోలీసులు స్పందనలో మార్పులేకపోవడం శోచనీయం.అదికాక ఇన్నోవా డ్రైవర్లు, నిర్వహణదారులకు ఏపీ పోలీసు అకాడమితోపాటు అడ్మినిష్ట్రేన్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఆ వాహనాల్లో ఏసీ, జీపీఎస్ సిస్టమ్, ట్యాబెట్లు పీసీలు, కెమెరాలు, వీహెచ్ఎఫ్ సెట్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా స్పందనారాహిత్యంతో పోలీసు వ్యవస్థ అభాసుపాలవుతోంది.హైదరాబాద్ మహానగరంలో గొలుసు చోరీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూన్నారు. కానీ ఆ కేసుల్లో మాత్రం పురోగతి ఎండమావిని తలపిస్తోంది. రక్షక భటులు ఇకనైనా మేల్కోపోతే సామాన్యులకు తిప్పలు తప్పవు. -
అమ్మానుషం..!
దోమకొండ, డిచ్పల్లి: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లులే.. మాతృత్వాన్ని మరిచి, కర్కశంగా మారారు. తనను భర్త అనుమానించడంతో ఒక మహిళ తట్టుకోలేక... ఇద్దరు చిన్నారులను చెరువులో పడేసి తొక్కి చంపేసింది. మరో తల్లి... వికలాంగురాలైన కూతురిని సాకలేక విషమిచ్చి, తానూ తాగింది. ఈ దారుణాలు నిజామాబాద్ జిల్లాలో బుధవారం జరిగాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలివీ...కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం గజసింగారానికి చెందిన లావణ్యకు దోమకొండ మండలం అంబర్‌పేటకు చెందిన పిడుగు నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు నాగచైతన్య(3), కూతురు పల్లవి (3నెలలు) ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండే భర్త నవీన్, ఊళ్లోకి వచ్చినప్పుడల్లా భార్య లావణ్యతో గొడవపడేవాడు. తరచుగా ఆమెను అనుమానించేవాడు. ఈ క్రమంలో బుధవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తట్టుకోలేని కోపంతో లావణ్య కొడుకు నాగచైతన్య, కూతురు పల్లవిని ఊరిచివరి చెరువులోకి తీసుకెళ్లి, బురదలో ముంచి కాళ్లతో తొక్కి చంపేసింది. కూతురికి సపర్యలు చేయలేక.. మరో సంఘటన... డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని వెస్లీ తండాలో జరిగింది. తండాకు చెందిన చౌహాన్ తిరుమల, రవి దంపతులకు కొడుకు రక్షపతి, కూతురు శ్రీలక్ష్మి (6) ఉన్నారు. శ్రీలక్ష్మి పుట్టుకతోనే వికలాంగురాాలు కావడంతో మంచానికే పరిమితమైంది. కూతురుకు అవసరమైన అన్ని పనులు తల్లి చూసుకునేది. రోజూ సపర్యలు చేయాల్సి రావడం, వైద్య ఖర్చులు భరించలేనివిగా మారటంతో తిరుమల మనస్తాపానికి గురైంది. దీంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగు మందును కూతురికి తాగించి, తనూ తాగింది. వీరిని కుటుంబసభ్యులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కూతురు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమించడంతో ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించారు. -
నృసింహుని సన్నిధిలో తెలంగాణ ఐజీ
మంగళగిరి: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తెలంగాణా ఐజీ నవీన్ చంద్ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఐజీ కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఎగువ, దిగువసన్నిధిల్లోని స్వామి వార్లను, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు మర్యాదపూర్వకంగా ఐజీ కుటుంబ సభ్యులను కలిశారు.