యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరుస్తారు.
విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధ పూజాధికాలు.. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, కుంకుమార్చన. రాత్రి 9–9.30 రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం. ద్వార బంధనం.
సర్వ దర్శనాలు: ఉదయం 6–7.30. మళ్లీ 10–11.45. మధ్యాహ్నం 12.30 –3. సాయంత్రం 5–7. రాత్రి 8.15–9. వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 9 నుంచి 10 వరకు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో వీఐపీలకు ఉదయం, సాయంత్రం కల్పించే బ్రేక్ దర్శనాలను శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దుచేసినట్లు ఈఓ గీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహులను ఆదివారం 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పట్టణంలోని బస్టాండ్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు భారీగా కనిపించారు. కొండపైన గల క్యూ కాం ప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తాగునీరు, మరుగుదొడ్ల వసతులు లేకపోవడంతో భక్తు లు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడున్నర గంటలకు పైగా సమయం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment