యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ఘటనలో భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొండపైన వేసవిలో నీడ కోసం రేకులతో చలువ పందిళ్లు వేశారు. వాటిపైన ఎండను తట్టుకునేందుకు గడ్డిపరిచారు. కార్యాలయంలోని పనికిరాని ఫైళ్లను 2 నెలలకోసారి ఆలయం గోడచాటున వేసి తగులబెడుతుంటారు.
ఇలా శుక్రవారం ఫైళ్లను తగులబెడుతుండగా గాలికి నిప్పురవ్వలు లేచి చలువ పందిళ్లపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడంతో చలువ పందిళ్ల కింద సేదదీరిన భక్తులు భయాందోళనతో పరుగులుతీశారు. ఫైర్ ఇంజన్ రావడానికి చాలా అలస్యమవడంతో స్థానికులు, దుకాణదారులు బకెట్లతో నీటిని తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
యాదగిరికొండపై అగ్నిప్రమాదం
Published Sat, May 4 2019 1:56 AM | Last Updated on Sat, May 4 2019 1:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment