
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.
యాదాద్రి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించడం ఇదే తొలిసారి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.