Ratha Saptami celebrations
-
సింహాచలం సింహగిరిపై ఘనంగా రథ సప్తమి వేడుకలు
-
సూర్య జయంతిని 'రథ సప్తమి' అని ఎందుకంటారు?
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మ స్వరూ పంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్య నారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన, ఏడు గుఱ్ఱములతో లాగబడుతున్న, అనూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంసనేత్రముతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథము ప్రత్యేకతను తెలియజేస్తూ, సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టిన రోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని “రథసప్తమి” పేరుతో జరుపుకుంటున్నాము. సూర్య రథానికి ఉన్న ప్రత్యేకతలు.. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది ఆయన సారథీ అంతే... కాళ్ళున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్లవచ్చు. కానీ వికలాంగుడైన అనూరుడు అలా చెయ్యలేడు. కాళ్ళు లేకపోవడంవల్ల అతడు మనపాలిట వరం అయ్యాడు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేదఛందస్సులు. అవి 1. గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం సూర్యుని ఏడుగుర్రాలూ 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యకిరణాల్లో 7 రంగులుంటాయి. సప్త వర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను – సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్రసు, సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్త వర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. అందుకే మనల్ని భారతీయులని పిలుస్తారు.. భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. 'భా” అంటే సూర్యకాంతి. “కతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారందరూ భారతీయులు. 'భారతీ” అంటే వేదమాత. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. సాంబుడు నిర్మించని కోణార్క్ దేవాలయం శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠు రోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమనీ, రోగం నయమౌతుందనీ చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీతీరాన వేపవృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోణార్క్‌లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్య నారాయణుని ప్రతిష్టించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నించినా, కోణార్క్ దేవాలయం నేటికీ అత్యంత ఆకర్షణీయంగా అలరారుతున్నది. దేవేంద్రుడి నిర్మించిన అరసవెల్లి దేవాలయం ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళద్దంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధ పడుతుంటే, ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధ పోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి, ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చును. సూర్యారాధన చేసినవారు.. ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్నిపొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పనాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి రోజున షష్టి తిథి ఉంటే కనుక షష్టి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం. ఆ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకుని, రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. ‘సూర్యునికి అర్కః అని పేరు’. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే.. జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి.. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది.. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సూర్యరాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. (చదవండి: గ్రీకులు, రోమన్లు సరస్వతి దేవిని పూజించేవారా?) -
తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
-
చిన్నశేష వాహనం పై శ్రీవారి ఊరేగింపు
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
వైభవంగా రథసప్తమి వేడుకలు
-
యాదాద్రిలో ఘనంగా రథసప్తమి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదాద్రి క్షేత్రంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించడం ఇదే తొలిసారి. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. -
తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు (ఫొటోలు)
-
యాదాద్రిలో రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మొదటిసారిగా రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. ప్రధానా లయం పునఃప్రారంభమైన తర్వాత.. శనివారం రథ సప్తమి రోజు శ్రీస్వామి వారిని ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తుల మధ్య ఊరేగించనున్నట్లు ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వెల్లడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రథ సప్తమి వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. -
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుక ఫోటోలు
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిస్తున్నారు. 7 టన్నుల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ గావించారు. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శన మివ్వనున్నారు. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై, ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనంపై, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 వరకు సర్వ భూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. చదవండి: రథ సప్తమి: ప్రత్యక్షదైవం పుట్టిన రోజు... యోధులారా వందనం : సీఎం జగన్ -
తిరుమలలో రథసప్తమి వేడుకలు
-
అరసవిల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తన కిరణాలతో లోకాలను తట్టిలేపే ప్రత్యక్ష దైవానికి పుట్టిన రోజు ఉత్సవం ఘనంగా మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి సప్తమి ఘడియల్లో కర్మసాక్షి అయిన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు వేదమంత్రాల నడుమ అర్చక బృందం ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేక స్నానాలు చేయించారు. ముల్లోకాలను వెలుగులతో నింపిన ఆదిత్యుడు నిశిరాత్రి వేళ తెల్లని పాలపొంగుల్లో దర్శనమిచ్చాడు. నల్లటి అరుణశిల కాస్తా.. శ్వేతవర్ణంలో మారిపోయి భక్తులకు కనువిందు చేశాడు. సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం అరసవిల్లి సూర్యదేవాలయం భక్తులు తో కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరిస్తున్నారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అరసవల్లి సూర్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి వారి జయంత్యుత్సవం... ఒకరోజు బ్రహ్మోత్సవంగా బ్రహ్మండమైన రీతిలో జరిగింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటలకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్సవ అధికారి ఎన్.సుజాత, జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తదితరులు స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం స్థానిక అనివేటి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వ ర్యంలో మహా సంకల్పం జరిగింది. అనంతరం 12.30 గంటలకు తొలి అభిషేకాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా జరిపించారు. గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 12.45 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. అభిషేక సేవ శనివారం ఉదయం 8 గంటల వరకు జరిగింది. అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతా రాం సతీసమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్ జె.నివాస్ స్వామిని దర్శించుకున్నారు. పోటెత్తిన భక్తజనం రథసప్తమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రి సరికే అరసవల్లి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిõÙకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు క్షీరాభిషేకం ప్రారంభమై.. శనివారం ఉదయం 8 గంటలకు ముగిసింది. తర్వాత నిజరూపంలో స్వామి దర్శనమిచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలతోపాటు క్షీరాభిõÙక దర్శనం (రూ.500), ప్రత్యేక దర్శనం (రూ.100) క్యూలైన్లవారికి కూడా ఆలయ సింహద్వా రం (ఆర్చిగేట్) నుంచి ప్రవేశం కలి్పంచారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతావ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే స్థానిక డీసీఎంఎస్ గొడౌన్ నుంచి రూ.500, రూ.100 దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే సా ధారణ దర్శనాల మార్గం కూడా ఇలాగే ప్రారంభమయ్యింది. అయితే ఈ లైన్ అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి సాగింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి నాటికే ఆలయ పరిసరాలకు చేరుకున్న గ్రామీణ ప్రాంత భక్తులు క్యూలైన్లలోనే ఉండి పోయారు. తొలి దర్శనాలకు వీలు కోసం అక్కడే అర్ధరాత్రి వరకు కాలం గడిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి సామాన్యుల దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కలెక్ట ర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించా రు. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త పర్యవేక్షణ లో వీఐపీల దర్శనాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రకా రం శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ పోలీసుల వలయంగా సింహద్వారం కని్పంచింది. దాతల కుటుంబసభ్యుల వాహనాలను అటు 80 ఫీట్ రోడ్డులోనే (అనుమతి పాస్ లేనివి) నిలిపివేయడంతో సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావలసివచ్చింది. అలాగే సాధారణ దర్శనాలకు వెళ్లే వారు కూడా ఎక్కువ దూరమే నడిచేలాఏర్పాట్లున్నాయని జిల్లాకలెక్టర్ నివా స్ ఆదేశాల మేరకు ఆల య మండపాల్లో జిగ్‌జాగ్ లైన్లు కాకుండా నేరుగా ఒకే లైన్లో దర్శనాలకు అనుమతిచ్చారు. మినీ బ్రహ్మోత్సవం.. చూతము రారండి తిరుమల : వేంకటాదివాసుడు ఏడాది పొడవు నా 450కి పైగా ఉత్సవాలు, సేవల్లో పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆయా మాసాల్లో నిరి్ధష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలూ నిర్విఘ్నంగా కొ నసాగుతున్నాయి. అర్ధంతరంగా ఆగిపోయిన కొన్ని సేవల్ని పునరుద్ధరించడం, మరికొన్నింటిని మార్పులు, చేర్పులు చేసి, టీటీడీ తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతోంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కొక్క ఉత్సవంలో దివ్యతేజోమూర్తి వైభవం ఒక్కోలా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ కటాక్షిస్తూ భక్తుల మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. విశేషమైన సేవలు, ఉత్సవాల్లో వేంకటేశుని దర్శిస్తూ భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. ఇందులో రథసప్తమి కూడా అతిముఖ్యమైన ఉత్సవంగా చెప్పవచ్చు. దీన్నే మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వాహన సేవలు ప్రారంభమై రాత్రి 9 వరకు సేవలు జరుగుతాయి. ఏడువాహనాలపై మలయప్పస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
వైభవంగా రథసప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరువీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగారు. ఈ రోజు ఉదయం చినశేష వాహనంపై స్వామి వారిని ఊరేగించగా, తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ విస్తృత పర్యటన
పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా దేవుని కడపలో నిర్వహించిన వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఉత్సవ మూర్తి దర్శనం అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ..రథోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పులివెందులలో సైదాపురం ఓబుల్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం అలమలపాడు వెంకటేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఆయన వ్యక్తిగత పీఏ రవిశేఖర్ ఇంటికి వెళ్లారు. ఇటీవల రవిశేఖర్ భార్య మృతి చెందడంతో వైఎస్ జగన్ రవిశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. బంధువులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రాజకీయాలను తరిమికొడదామని వైఎస్ జగన్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పులివెందులలో శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవుని కడపలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
దేవుని కడపలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
కడప: ఏపీ ప్రతిపక్షనేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కడప జిల్లాలో విస్త్రతంగా పర్యటించారు. రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ రాకతో అక్కడి భక్తులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు. అనంతరం బాలిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరించారు. అదే విధంగా స్ధానిక టీటీడీ కల్యాణమండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి కూడా వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం తన వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. -
నిజరూపంలో అరసవెల్లి ఆదిత్యుడు
శ్రీకాకుళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్థరాత్రి ఆదిత్యుని నిజరూప మూర్తికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ క్షీరాభిషేకం, ప్రథమ అర్చనలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు పుష్పాలంకరణ సేవ జరగనుంది. రాత్రి 11 గంటలకు పవళింపు సేవ, మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేక దర్శనం టిక్కెట్ల ధరను రూ.500కు పెంచడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉత్తరంలో ఉన్న గోడను పోలీసులు కూల్చివేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులను ఆ మార్గంగుండా అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, టీడీపీ నాయకుడు కరణం బలరాం తదితరులు ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.