తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు | Ratha Saptami Celebrations In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Published Fri, Feb 19 2021 7:22 AM | Last Updated on Fri, Feb 19 2021 11:25 AM

Ratha Saptami Celebrations In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై భక్తులకు  శ్రీవారు దర్శనమిస్తున్నారు. 7 టన్నుల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ గావించారు. రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శన మివ్వనున్నారు. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై, ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనంపై, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై,  సాయంత్రం 6 నుంచి రాత్రి 7 వరకు సర్వ భూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.



చదవండి: రథ సప్తమి: ప్రత్యక్షదైవం పుట్టిన రోజు...   
యోధులారా వందనం : సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement