దేవుని కడపలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
Published Fri, Feb 3 2017 4:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
కడప: ఏపీ ప్రతిపక్షనేత , వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కడప జిల్లాలో విస్త్రతంగా పర్యటించారు. రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ రాకతో అక్కడి భక్తులు జగన్‌ను చూసేందుకు తరలి వచ్చారు.
అనంతరం బాలిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరించారు. అదే విధంగా స్ధానిక టీటీడీ కల్యాణమండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి కూడా వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం తన వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
Advertisement
Advertisement