devuni kadapa
-
భక్తజనం మధ్య వైభవంగా దేవుని కడప క్షేత్రంలో రాయుని రథోత్సవం (ఫొటోలు)
-
‘ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలి’
సాక్షి, కడప : ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలని ఆలయాల సంరక్షణ సంధాన కర్త రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుని కడపలోని వెంకటేశ్వరస్వామి ఆలయంపై టీటీడీ అధికారులు చిన్న చూపు మానుకోవాలన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అర్చకులకు జీత భత్యాలు తక్కువగా ఇవ్వడం అన్యాయం అన్నారు. సంభావన తక్కువ ఉన్న వారికి జీతం కూడా తక్కువ ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. టీటీడీలో ఈఓల పెత్తనం తగ్గాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేశారు. వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలని కొనసాగించాలని కోరారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
దేవునికడపలో ముస్లిం భక్తుల పూజలు కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లాలో ఉగాది రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. పండుగ సందర్భంగా దేవునికడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని దినసరి భత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవతామూర్తులు, తీర్థంలో మిశ్రమాల వివరాలను అడిగి తెలుసుకుని కొబ్బరికాయలు సమర్పించారు. ముస్లిం భక్తుల్లో కొందరు తిరుమల లడ్డూలను కొనుగోలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది అస్థానం జరిపి పంచాంగ పఠనం నిర్వహించారు. -
వైభవంగా చక్రస్నానం
కడప కల్చరల్ : దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ రెండున్నర గంటలపాటు వేద మంత్ర యుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఏఈఓ శంకర్రాజు, డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యంల ఆధ్వర్యంలో తిరుమల వేద పండితులు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణమూర్తి తదితరులు పాలు, పెరుగు, తేనె, జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పర్యవేక్షణలో భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో మునకలు వేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. స్వామి ప్రత్యేక ప్రసాదంగా ఉత్సవ మూర్తులకు లేపనం చేసిన సుగంధం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
దేవుని కడపలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
దేవుని కడపలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
కడప: ఏపీ ప్రతిపక్షనేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కడప జిల్లాలో విస్త్రతంగా పర్యటించారు. రథ సప్తమి సందర్భంగా ప్రసిద్ద దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. రధంపై ఊరేగుతూన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. రథ సప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ రాకతో అక్కడి భక్తులు జగన్ను చూసేందుకు తరలి వచ్చారు. అనంతరం బాలిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరించారు. అదే విధంగా స్ధానిక టీటీడీ కల్యాణమండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి కూడా వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం తన వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. -
దేవిని గడప కడపలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
-
సోమేశ్వరాలయంలో చోరీ
కడప అర్బన్ : కడప నగర పరిధిలోని దేవుని కడప సోమేశ్వరాలయంలో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనపై ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శ్రీధర్, స్థానిక ప్రజల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని దేవుని కడప సోమేశ్వరాలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. కార్తీక మాసం కావడంతో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలోకి కటాంజనం గడియ పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్లుగా తెలుసుస్తోంది. ఆలయంలో నంది విగ్రహం సమీపంలోను, లోపలి భాగంలోనూ రెండు హుండీలను ఏర్పాటు చేశారు. ఆ హుండీలను సైతం పెకలించి, ఆలయం వెనుక భాగానికి తీసుకెళ్లారు. హుండీలకు ఏర్పాటు చేసిన సీళ్లతో కూడిన గడియలను రాడ్లతో పగులగొట్టారు. హుండీల్లో భక్తాదులు సమర్పించిన కానుకలను అపహరించారు. పెండ్లిపత్రికలను చెల్లాచెదురుగా పడేశారు. సమీపంలోనే మద్యం సేవించి తాపీగా తమ పని కానిచ్చేసినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ ఎస్ఐ రామకృష్ణుడు తమ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఏడాది జూన్లో రెండు హుండీలను లెక్కించామన్నారు. ప్రస్తుతం కార్తీక మాసం పూర్తయిన తర్వాత ఆ హుండీలను లెక్కించాలని అనుకున్నామన్నారు. ఈ హుండీలలో రూ. 40 నుంచి 50 వేల మధ్య నగదు ఉంటుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే వున్న ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ రెండు సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం!
కడప : నెల రోజుల్లో తిరుమలలో సామాన్య భక్తుడు రెండు గంటల్లో స్వామివారిని దర్శించుకునేలా చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన బుధవారం వైఎస్ఆర్ జిల్లాలో దేవుని కడప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సత్వర దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే భూకబ్జాకు గురైన దేవాలయ భూముల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.