
ఇసుకేస్తే రాలనంత భక్తజనం మధ్య.. ఉవ్వెత్తున ఎగసిన ఆనందోత్సాహాల నడుమ .. కడప రాయుని రథం వైభవంగా కదిలింది

బ్రహ్మదేవుడు సారధ్యం వహించినట్లుగా అలంకరించిన రథం విశ్వతేజోమూర్తి సూర్యుని సాక్షిగా తేరు మేరు పర్వతంలా గంభీరంగా సాగింది.

కడప రాయుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రథోత్సవాన్ని నిర్వహించారు

దేవునికడప వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మిద్దెలు, మేడలపై నుంచి కూడా భక్తులు రథంలోని దేవదేవుడిని తిలకించి పులకించారు

















