rathotsavam
-
భక్తజనం మధ్య వైభవంగా దేవుని కడప క్షేత్రంలో రాయుని రథోత్సవం (ఫొటోలు)
-
రథోత్సవం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా మహారథోత్సవం
తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామి మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఈ రథోత్సవం వేడుకగా సాగింది. అనంతరం సుమారు గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్ఠితో తిరుమల సప్తగిరులు పులకించాయి. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం రథాన్ని లాగారు. అశ్వవాహనంపై ఆనంద నిలయుడి దర్శనం రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులను పరవశింపజేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష పుష్పాలంకరణాంతరం స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నేడు చక్రస్నానం శనివారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇది ముగిసాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
కాణిపాకం : కనులపండువగా సిద్ధి వినాయక రథోత్సవం (ఫొటోలు)
-
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
కనులపండువగా సింగపట్నం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం (ఫొటోలు)
-
సర్వభూపాలునిపై సర్వాంతర్యామి
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజైన బుధవారం ఉదయం హరి అంతరంగ అలిమేలు మంగ సర్వభూపాలునిపై ఉట్టి కృష్ణుడు అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు అమ్మవారిని అద్దాల మహల్ నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో అమ్మవారిని చేతితో ఉట్టి కొడుతున్న శ్రీకృష్ణుడిగా అలంకరించారు. ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మి అమ్మవారు సాయంత్రం సౌభాగ్యలక్ష్మిగా స్వర్ణరథంపై తిరువీధుల్లో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ముందు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపిణిగా అలంకరించి రథ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. సాయంత్రం 4.20 గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు నడుమ సర్వతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి గరుడ వాహనంపై శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
భక్తులపై కుప్పకూలిన రథం.. ఒక్క క్షణంలో అంతా తారుమారు!
బెంగళూరు: కార్తీక మాసంలో నిర్వహించే ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. వందల మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. అంతా.. దేవుడి నామస్మరణలో ఉండగా ఒక్కసారిగా రథం కుప్పకూలింది. ఈ సంఘటన కర్ణాటక, చామరాజనగర్ జిల్లాలోని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం రథోత్సవంలో జరిగింది. రథం చక్రాలు విరిగిపోవటం వల్లే ఇలా జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే, రథం చక్రం విరిగిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టటంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయం నుంచి బయటకు తీసుకొస్తుండగా రథం లాగుతున్న వారిపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని చన్నప్పనపుర గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం చేపట్టారు భక్తులు. #WATCH | Karnataka: Devotees had a narrow escape after a temple chariot fell down due to a broken wheel while it was being carried by them during a festival at Veerabhadreshwara Temple in Channappanapura village in Chamarajanagar, earlier today. pic.twitter.com/pUNahaBQr9 — ANI (@ANI) November 1, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు! -
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
చూసిన కనులదే భాగ్యం
కౌతాళం రూరల్: మండల పరిధిలోని బదినేహల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన ఈ వేడుక ఈసారి ఘనంగా జరిగింది. రథోత్సవానన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచచ్చారు. ముందుగా మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మహామంగళహారతులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గ్రామానికి చెందిన హరిచంద్రరెడ్డి వంశీయుల కుటుంబం నుంచి మొదటి కుంభం దేవాలయానికి చేరి రథానికి పూజలు చేసిన అనంతరం గ్రామసస్తులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగపు నాయకుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ నాగరాజుగౌడ్, బదినేహల్ సింగల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రితనయగౌడ్, నాయకులు నాకేష్రెడ్డి, రవిరెడ్డి, ఏకాంబరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు. హెచ్.మురవణిలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ పెద్దకడబూరు: మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామంలో శ్రీ సీతారామాంజినేయస్వామి వారి రథోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు సత్యనారాయణస్వామి, మూర్తిస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ముందుగా కిందిగేరి వేమారెడ్డి ఇంటినుంచి కలశం, పైగేరి ఓంకారప్ప ఇంటినుంచి కుంభాన్ని రథం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి అశేష భక్త జనుల మధ్య ఊరేగించారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బుడుములదొడ్డిలో.. కౌతాళం రూరల్: సుళేకేరి గ్రామంలో బుడుములదొడ్డి అంజనేయ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవంలో భాగంగా మొదట అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. ఆ తర్వాత సాయంత్రం ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు గట్టి బందోబస్తు చేపట్టారు. -
కదిరి లక్ష్మి నరసింహస్వామి రథోత్సవం (ఫొటోలు)
-
నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో ఘనంగా రధోత్సవం (ఫొటోలు)
-
శ్రీకాళహస్తిలో అశేష భక్తజన నడుమ రథోత్సవం (ఫొటోలు)
-
నయనానందకరంగా అంతర్వేది 'రథయాత్ర'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం మంగళవారం నయనానందకరంగా సాగింది. సంపద్రాయబద్ధంగా సాగిన రథయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు అంతర్వేదికి పోటెత్తారు. మెరక వీధిలో మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర మొదలైంది. కళ్యాణమూర్తులను రథం మీద ఉంచి పురవీధుల్లో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. స్వామివారు కళ్యాణ అనంతరం రథం మీద వెళ్లి తన సోదరి గుర్రాలక్కకు చీర, సారె పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ముఖ్యఅతిథిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల కొంతమంది గుర్తుతెలియని దుండగులు అంతర్వేది రథాన్ని దగ్ధంచేయడం.. రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కొత్త రథాన్ని తయారుచేయించడం.. అనంతరం కళ్యాణోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ దీనిని ఇటీవలే ప్రారంభించడం తెలిసిందే. కాగా, కొత్త రథాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ సమయం కన్నా రథయాత్ర సమయంలోనే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ముస్తాబు చేసిన కొత్తరథాన్ని తాకి పులకించిపోయారు. పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు మరోవైపు.. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున సముద్ర సంగమ ప్రాంతంలో జరిగిన పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. అంతర్వేది బీచ్ నుంచి సంగమ ప్రాంతం వరకు సుమారు కిలోమీటరు మేర భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం అర్ధరాత్రి కల్యాణ వేదిక వద్ద అసంఖ్యాకమైన భక్తుల సమక్షంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు. -
రమణీయం..రథోత్సవం
-
వైభవంగా అమరావతి అమరేశ్వరుడి రథోత్సవం
-
సామర్లకోటలో ఘనంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
-
తిరుమలలో కన్నులపండుగగా రథోత్సవం
-
కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం
-
గోరంట్లలో గోవింద నామస్మరణ
- అశేషజన భక్తజన వాహిని మధ్య మాధవుడి రథోత్సవం కోడుమూరు రూరల్ గోరంట్లలో వెలసిన శ్రీలక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణతో గోరంట్ల గ్రామం మారుమోగిపోయింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షమందికిపైగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
కదిరిలో ఘనంగా లక్ష్మీ నారసింహడి రథోత్సవం
-
కదిరి రథోత్సవంలో అపశ్రుతి
- ఇద్దరికి గాయాలు కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శనివారం జరుగుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక హోమ్‌గార్డుతో సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నులపండువగా ప్రారంభమైంది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన నృసింహుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసిశోభాయమానంగా అలంకరించారు. స్వామివారి వూరేగింపునకు ముందు భక్తబృందాలు, భజనమండల్ల సభ్యులు ఆధ్యాత్మిక గీతాలాపన చేశారు. రథంపై కొలువుతీరిన స్వామివారు నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. రథంపై దవనం మిరియాలు చల్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రా, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
ఇరువర్గాల ఘర్షణ
- ఒకరికి గాయాలు - ఐదుగురిపై కేసు నమోదు హాలహర్వి : గూళ్యం రథోత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. గూళ్యం గ్రామంలో జరుగుతున్న గాదిలింగేశ్వరుడు రథోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన జె.హోసళ్లి గ్రామానికి చెందిన భీమన్నపై బళ్లారి జిల్లా బెణకల్కు చెందిన పరమేష్, బసవరాజు, రామకృష్ణ, రాముడు, దొబ్బురవాహన దాడి చేశారు. తోపులాటలో భీమన్న కాలుతొక్కాడంటూ వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో దాడి చేయడంతో భీమన్న గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. -
మహానందమాయే!
కనుల పండువగా సాగిన మహానందీశ్వరుడి రథోత్సవం మహానందిలో కనులపండువగా జరిగిన రథోత్సవం అశేష భక్తజనవాహిని మధ్య కదిలిన రథం మహానంది: నల్లమల పర్వత పాన్పుల అందాలు.. నీలాకాశం నింగి అందాలకు తోడుగా మహానందీశ్వరుడి రథోత్సవం కనులపండువ సాగింది. మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో ఆదివారం సాయంత్రం రథోత్సవం వైభవంగా సాగింది. కర్నూలు అడిషనల్ జడ్జి ఇంతియాజ్ అహ్మద్, నంద్యాల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్రావు, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు రథోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణం పూర్తయిన తర్వాత ఆదివారం పెళ్లిపెద్దలు శ్రీ పార్వతీ సహిత శ్రీ బ్రహ్మనందీశ్వరస్వామితో కలిసి రథంలో కొలువయ్యారు. ఈ మేరకు లక్షలాది మంది భక్తులు హరహర...మహాదేవ...శంభో శంకర.....శ్రీ మహానందీశ్వరస్వామికి జై...శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై....అంటూ భక్తులు భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు. ఆలయం పురవీధుల్లో సాగిన ర థోత్సవాన్ని తిలకించిన భక్తులు మహానందానికి గురయ్యారు. రథోత్సవంలో విశేష పూజలు: రథోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రథం వద్ద వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, తదితర çపండిత బృందం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, రథాంగబలి, నవకలశ స్నపనము, రథాంగహోమము, దీక్షా హోమం, తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి చెందిన పుల్లయ్యాచారి కుంభంకూడు మోసుకొచ్చారు. రథానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తెడ్లకు కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేపట్టారు. రథంలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, ప్రదక్షిణలు చేయడం ద్వారా పునర్జన్మ ఉండదని, సర్వ పాపాలు హరిస్తాయని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. తూర్పున ధర్మం, పడమట జ్ఞానం, ఉత్తరాన ఐశ్వర్యం, దక్షిణాన మోక్షం లభిస్తుందన్నారు. రథంలో బ్రహ్మ, అనంతుడు, ఇంద్ర, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఉంటారని వారు వివరించారు. పూజా కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు బండి శ్రీనివాసులు, రామకృష్ణ, సీతారామయ్య, మునెయ్య, బాలరాజు, శివారెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేంద్రనా«ద్‌రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో ఉద్రిక్తత: మహానందీశ్వరుడి రథోత్సవంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మహానందీశుని రథోత్సవం స్థానిక ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం వద్దకు చేరుకోగానే అక్కడ ఆపాలి అంటూ కొందరు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అర్చకులు, పండితులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు వెంటనే వారించడంతో సమస్య సద్దుమణిగింది. -
మార్మోగిన గోవింద నామస్మరణ
హిందూపురం అర్బన్ : గుడ్డం రంగనాథస్వామి రథోత్సవం అశేషభక్తజన వాహిణి మధ్య ఆదివారం కనుల పండువగా జరిగింది.శ్రీదేవిభూదేవి సమేత రంగనా«థస్వామి ఉత్సవమూర్తుల ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో మూలవిరాట్ రంగస్వామికి అభిషేకాలు, పుష్ప, తులసీ ఆకులతో అర్చన చేశారు. అలాగే విశేష పుష్పాంకరణతో ముస్తబు చేసి వేదపండితుల మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవిభూదేవి రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువుదీర్చి పుర వీధుల్లో ప్రాకారోత్సవం చేశారు. అనంతరం పూజలు చేసి రంగనాథస్వామి గోవిందా.. అంటూ భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులు, కమిటీ చైర్మన్ మోహన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాము, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రెహెమాన్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. -
పంచ వాహనాలపై పరిమళాచార్యుడు
– అను మంత్రాలయంలో రథోత్సవం – రాఘవేంద్రుల దర్శించుకున్న నటి గీతాసింగ్ – మంగళవారంతో ముగిసిన రాయరు సప్తరాత్రోత్సవాలు మంత్రాలయం: ప్రముఖ రాఘవేంద్రస్వామి 345వ సప్తరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి రాఘవేంద్రులు పంచ వాహనాలపై ఊరేగించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. సర్వ సమర్పణోత్సవంలో భాగంగా తురగ, గజ, సింహ, స్వర్ణపల్లకీ, చెక్క రథాలపై శ్రీమఠం మాడవీధులను చుట్టేశారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రథయాత్ర చూడముచ్చటగా సాగింది. ఉదయం అను మంత్రాలయం (తుంగభద్ర) మత్తిక బందావన మఠంలో రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాయరు మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం చెక్క రథంపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు, మృత్తిక బృందావన ప్రతిమను కొలువుంచి హారతులు పట్టారు. గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకలో తరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. రాత్రి సినీ నటి గీతాసింగ్ బృందవనాన్ని దర్శించుకున్నారు. ఆమె వెంట నిర్మాత నాగిరెడ్డి, రంగస్థల కళాకారుడు నారాయణ ఉన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర మండపంలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర బృందం తాళవాయిద్య కచేరి వీనుల విందు చేసింది. బనగానపల్లెకు చెందిన అంజలి బృందం కూచిపూడి నాట్యం, హెచ్ఆర్ ఉన్నత్ భరతనాట్యం భక్తులను అలరించాయి. -
నేత్రపర్వంగా దేవదేవుని రథోత్సవం
-
ప్రకాశంలో భావనరుషి స్వామి రధోత్సవం
-
ఒ౦టిమిట్ట రథోత్సవ౦లో వైఎస్ జగన్
-
ఇక నుంచి నేను ఎమ్మెల్యేను కానట్టే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శుక్రవారం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవంలో తనను అధికారులు అవమానించారంటూ ఆరోపించారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తన కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. తన అనుచరులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని మేడా మల్లికార్జునరెడ్డి కంటతడి పెట్టారు. ఇక నుంచి తన శాసనసభ్యుడి కానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వాహనంతో పాటు గన్మెన్లను కూడా వెనక్కి పంపుతున్నట్లు మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే మేడా ఒంటిమిట్ట రథోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. -
జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారి రథోత్సవం
-
గోవిందరాజుల స్వామి రథోత్సవంలో అపశ్రుతి
తిరుపతి : తిరుపతి గోవిందరాజులు స్వామివారి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనటంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. ఒక్కసారిగా ఈ ఘటన జరగటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేత్రపర్వంగా వెంకన్న రథోత్సవం
చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాసమంగాపురంలోని కల్యా ణ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం అశేష భక్తజ న సందోహం మధ్య నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేక అ లంకరణలో ఉన్న స్వామిని తిలకించిన భక్తులు పులకిం చి పోయారు. అంతకు ముందు ఆలయంలో తెల్లవారు జామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి ధూపదీప నిత్య కైంకర్య, పూజాకార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని వాహన మండపంలో కొలువుంచి తిరుమంజన సేవ నిర్వహించారు. అభిషేకితులైన స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకారమూర్తులైన స్వామి అమ్మవార్లు రథంపై కొలువయ్యారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడు మ స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయ మాడా వీధుల్లో విహరించిన స్వామికి భక్తులు దారిపొడవునా కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ కన్నులపండువగా జరిగింది. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, సూపరింటెం డెంట్ ధనంజయ ఇతర అధికారులు పాల్గొన్నారు.