బదినేహల్‌లో అశేష భక్త జనం మధ్య మల్లికార్జున స్వామి రథోత్సవం
కౌతాళం రూరల్: మండల పరిధిలోని బదినేహల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన ఈ వేడుక ఈసారి ఘనంగా జరిగింది. రథోత్సవానన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచచ్చారు. ముందుగా మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మహామంగళహారతులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
సాయంత్రం గ్రామానికి చెందిన హరిచంద్రరెడ్డి వంశీయుల కుటుంబం నుంచి మొదటి కుంభం దేవాలయానికి చేరి రథానికి పూజలు చేసిన అనంతరం గ్రామసస్తులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగపు నాయకుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ నాగరాజుగౌడ్, బదినేహల్ సింగల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రితనయగౌడ్, నాయకులు నాకేష్‌రెడ్డి, రవిరెడ్డి, ఏకాంబరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్‌ఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు.
హెచ్.మురవణిలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ
పెద్దకడబూరు: మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామంలో శ్రీ సీతారామాంజినేయస్వామి వారి రథోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు సత్యనారాయణస్వామి, మూర్తిస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ముందుగా కిందిగేరి వేమారెడ్డి ఇంటినుంచి కలశం, పైగేరి ఓంకారప్ప ఇంటినుంచి కుంభాన్ని రథం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి అశేష భక్త జనుల మధ్య ఊరేగించారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
బుడుములదొడ్డిలో..
కౌతాళం రూరల్: సుళేకేరి గ్రామంలో బుడుములదొడ్డి అంజనేయ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవంలో భాగంగా మొదట అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. ఆ తర్వాత సాయంత్రం ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్‌ఐ రమేష్‌బాబు గట్టి బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment