sri mallikarjuna swamy
-
చూసిన కనులదే భాగ్యం
కౌతాళం రూరల్: మండల పరిధిలోని బదినేహల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన ఈ వేడుక ఈసారి ఘనంగా జరిగింది. రథోత్సవానన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచచ్చారు. ముందుగా మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మహామంగళహారతులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గ్రామానికి చెందిన హరిచంద్రరెడ్డి వంశీయుల కుటుంబం నుంచి మొదటి కుంభం దేవాలయానికి చేరి రథానికి పూజలు చేసిన అనంతరం గ్రామసస్తులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగపు నాయకుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ నాగరాజుగౌడ్, బదినేహల్ సింగల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రితనయగౌడ్, నాయకులు నాకేష్రెడ్డి, రవిరెడ్డి, ఏకాంబరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు. హెచ్.మురవణిలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ పెద్దకడబూరు: మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామంలో శ్రీ సీతారామాంజినేయస్వామి వారి రథోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు సత్యనారాయణస్వామి, మూర్తిస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ముందుగా కిందిగేరి వేమారెడ్డి ఇంటినుంచి కలశం, పైగేరి ఓంకారప్ప ఇంటినుంచి కుంభాన్ని రథం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి అశేష భక్త జనుల మధ్య ఊరేగించారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బుడుములదొడ్డిలో.. కౌతాళం రూరల్: సుళేకేరి గ్రామంలో బుడుములదొడ్డి అంజనేయ స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవంలో భాగంగా మొదట అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. ఆ తర్వాత సాయంత్రం ఉత్సవ మూర్తుల విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దతుంబళం ఎస్ఐ రమేష్‌బాబు గట్టి బందోబస్తు చేపట్టారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రమైన నేపథ్యంలో ఈసారి భక్తుల రాక తగ్గింది. చిరుజల్లుల కారణంగా ఆలయ పరిసరాలు చిత్తడిగా మారాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నంను ఆలయ అధికారులు రద్దు చేశారు. -
కొమురవెల్లిలో భక్తుల రద్దీ
సిద్దిపేట: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సిద్దిపేట, జనగామ, వరంగల్, హైద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడెల స్తంభం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కొందరు భక్తులు స్వామి, బలిజమేడలాదేవి, గొల్లకేతమ్మలకు ఒడి బియ్యం పోయగా మరికొందరు భక్తులు స్వామివారికి అభిషేకాలు, కల్యాణం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేయించుకున్నారు. స్వామి ధర్మదర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం గంటలోపు జరిగింది. మల్లన్నకు మొక్కులు అప్పగించిన తర్వాత భక్తులు మల్లన్న గుట్టపై శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మలకు బోనాలు అప్పగించి ఒడి బియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. -
రమణీయంగా మల్లన్న కల్యాణం
హైదరాబాద్ (గోల్నాక): బాగ్అంబర్పేటలోని గంగాబౌలి మల్లన్నగుడిలో సోమవారం శ్రీ మల్లికార్జునస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి కల్యాణం సందర్భంగా నిర్వాహకులు ఆకట్టుకునే సదర్‌పటాన్ని వేశారు. గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలోని నిప్పుల్లో నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు.అనంతరం మల్లన్నస్వామివార్లను ఊరేగింపు నిర్వహించారు. -
చైతన్యం కోసమే ‘ప్రజా పోలీస్’
=కళాజాతాలతో అవగాహన =ప్రతి ఫిర్యాదుకు రశీదు =డీఐజీ కాంతారావు చేర్యాలటౌన్, న్యూస్‌లైన్: ప్రజా చైతన్యం కోసమే కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామని డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు అన్నారు. సోమవారం చేర్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. కేసుల వివరాలు, స్థానిక సమస్యలు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ చట్టాలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సన్నిహిత కౌంటర్‌ను ఏర్పాటు చేస్లి, ప్రతి ఫిర్యాదుకు జవాబుదారితనంగా ఉండేందుకు రశీదు ఇస్తున్నట్లు తెలిపారు.. కమ్యూనిటీ పోలీస్ ఆధ్వర్యలో కళాజాతాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో చైల్డ్ మ్యారేజ్లు, దురాచారాలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా రౌడీషీట్లు తెరిచి జైలుకు పంపుతామని హెచ్చరించారు. చేర్యాల చారిత్రిక నకాశీ చిత్రకళకు కేంద్రంగా ఉందని, ఆ కళను చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గ్రామీణ టూరిజం క్రింద అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పోలీసుల పరేడ్‌ను స్వయంగా పరిశీలించారు. పోలీస్ కేస్ స్టడీని అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీకాంత్, జనగామ డీఎస్పీ సురేందర్, చేర్యాల సిఐ జితేందర్, చేర్యాల, బచ్చన్నపేట ఎస్ఐలు సూర్యప్రసాద్, షాదుల్లాబాబా, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేర్యాల: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామికి డీఐజీ కాంతారావు, ఏఎస్పీ శ్రీకాంత్, జనగామ డీఏస్పీ సురేందర్ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం చేర్యాల మండలంలోని కొమురవెల్లిలోని రాజగోపురం నుంచి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు వారికి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సీఐ జితేందర్, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట ఎస్ఐలు సూర్యప్రసాద్, రామకృష్ణ, బాబులతో పాటు ఆలయ హోంగార్డులు డీ. బాబు, ఏ.వినోద్‌లు ఉన్నారు.