
స్వామివారి రాజగోపురం వద్ద భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రమైన నేపథ్యంలో ఈసారి భక్తుల రాక తగ్గింది. చిరుజల్లుల కారణంగా ఆలయ పరిసరాలు చిత్తడిగా మారాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నంను ఆలయ అధికారులు రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment