Temple Chariot Collapses During Rathotsava In Karnataka, Video Viral - Sakshi
Sakshi News home page

రథోత్సవంలో అపశృతి.. భక్తులపై ఒక్కసారిగా కుప్పకూలిన రథం

Published Tue, Nov 1 2022 5:15 PM | Last Updated on Tue, Nov 1 2022 8:32 PM

Temple Chariot Collapses During Rathotsava In Karnataka - Sakshi

బెంగళూరు:  కార్తీక మాసంలో నిర్వహించే ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. వందల మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. అంతా.. దేవుడి నామస్మరణలో ఉండగా ఒక్కసారిగా రథం కుప్పకూలింది. ఈ సంఘటన కర్ణాటక, చామరాజనగర్‌ జిల్లాలోని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం రథోత్సవంలో జరిగింది. రథం చక్రాలు విరిగిపోవటం వల్లే ఇలా జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

అయితే, రథం చక్రం విరిగిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టటంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయం నుంచి బయటకు తీసుకొస్తుండగా  రథం లాగుతున్న వారిపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని చన్నప్పనపుర గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం చేపట్టారు భక్తులు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement