భక్తులపై కుప్పకూలిన రథం.. ఒక్క క్షణంలో అంతా తారుమారు!
బెంగళూరు: కార్తీక మాసంలో నిర్వహించే ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. వందల మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. అంతా.. దేవుడి నామస్మరణలో ఉండగా ఒక్కసారిగా రథం కుప్పకూలింది. ఈ సంఘటన కర్ణాటక, చామరాజనగర్ జిల్లాలోని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం రథోత్సవంలో జరిగింది. రథం చక్రాలు విరిగిపోవటం వల్లే ఇలా జరిగినట్లు స్థానికులు తెలిపారు.
అయితే, రథం చక్రం విరిగిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టటంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయం నుంచి బయటకు తీసుకొస్తుండగా రథం లాగుతున్న వారిపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని చన్నప్పనపుర గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం చేపట్టారు భక్తులు.
#WATCH | Karnataka: Devotees had a narrow escape after a temple chariot fell down due to a broken wheel while it was being carried by them during a festival at Veerabhadreshwara Temple in Channappanapura village in Chamarajanagar, earlier today. pic.twitter.com/pUNahaBQr9
— ANI (@ANI) November 1, 2022
ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు!