Chariot Festival
-
భక్తులపై కుప్పకూలిన రథం.. ఒక్క క్షణంలో అంతా తారుమారు!
బెంగళూరు: కార్తీక మాసంలో నిర్వహించే ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. వందల మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. అంతా.. దేవుడి నామస్మరణలో ఉండగా ఒక్కసారిగా రథం కుప్పకూలింది. ఈ సంఘటన కర్ణాటక, చామరాజనగర్ జిల్లాలోని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం రథోత్సవంలో జరిగింది. రథం చక్రాలు విరిగిపోవటం వల్లే ఇలా జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే, రథం చక్రం విరిగిపోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టటంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయం నుంచి బయటకు తీసుకొస్తుండగా రథం లాగుతున్న వారిపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆలయ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని చన్నప్పనపుర గ్రామంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం చేపట్టారు భక్తులు. #WATCH | Karnataka: Devotees had a narrow escape after a temple chariot fell down due to a broken wheel while it was being carried by them during a festival at Veerabhadreshwara Temple in Channappanapura village in Chamarajanagar, earlier today. pic.twitter.com/pUNahaBQr9 — ANI (@ANI) November 1, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు! -
తంజావూరు రథోత్సవంలో విషాదం
సాక్షి, చైన్నై: తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు. తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్ స్వామి మఠం ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు అప్పర్ సత్య జాతరని నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్ ఆలయానికి చెందిన పండుగలో రెండో రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. తంజావూర్–బూదలూర్ రహదారిపై రథం వెళుతుండగా తెల్లవారుజాముయ సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 13, 14, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, తండ్రీ, కుమారుడు ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన వెంటనే రథాన్ని లాగుతున్న కొందరు భక్తులు కుప్పకూలిపోయారు. కరెంట్ షాక్‌కి మంటలు వ్యాపించడంతో రథం నిలువునా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనకి రథోత్సవం తిలకించడానికి వచ్చిన ప్రజలు బెదిరిపోయారు. చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ హాహాకారాలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.50 వేలు సహాయంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, డీఎంకే తరపున తలా రూ.2 లక్షలు సాయంగా అందజేశారు. -
Tamil nadu: రథయాత్రలో అపశ్రుతి.. ఘోర ప్రమాదం
తమిళనాడులో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తంజావూరులో రథయాత్ర సందర్భంగా.. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందారు. కలిమేడు గ్రామంలో, ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా నిన్న(మంగళవారం) రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల గుండా తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోగా, హైవోల్టేజీ వైరు తగిలి రథంపైకి విద్యుదాఘాతం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో.. ఇద్దరు పిల్లలు సహా పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 11కి చేరింది. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి తంజావూర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. தஞ்சாவூர் மாவட்டம் களிமேடு கிராமத்தில் மின்சார விபத்தில் உயிரிழந்தவர்களின் குடும்பத்தாருக்கு ஆறுதல் மற்றும் நிவாரண உதவிகளை மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் அறிவித்துள்ளார். pic.twitter.com/v4FSMClq0q — CMOTamilNadu (@CMOTamilnadu) April 27, 2022 మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారాయన. అంఏతకాదు.. పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ప్రకటించారు. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi — PMO India (@PMOIndia) April 27, 2022 -
వైభవం..చెన్నకేశవ రథోత్సవం
బద్వేలు అర్బన్ : చెన్నంపల్లె సమీపంలోని శ్రీదేవి, భూదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నెరవేరిం. ఉదయం నుంచే భక్తులు రథాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వేలాదిమంది భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవంలో ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం ముగిసిన అనంతరం భక్తుల దర్శనం కోసం స్వామివారిని రథంపై నుంచి కిందకు దించి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ఆదిచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత పోటీలను మున్సిపల్ చైర్మన్ వీ.రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. సుమారు 6 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మొదటి బహుమతిని రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన కమ్ముసాహెబ్ రసూల్ ఎడ్లు కైవసం చేసుకోగా, వీరికి రూ.40,116ల నగదును బహుమతిగా అందజేశారు. ద్వితీయ బహుమతిని కమలాపురం గ్రామానికి చెందిన చల్లా శివారెడ్డి వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.20,116ల బహుమతిని అందజేశారు. తృతీయ బహుమతిని గోపవరం మండలానికి చెందిన నెమలయ్య వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.10,116ల బహుమతిని అందించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రంగారెడ్డి, పోటీల నిర్వాహకులు నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
బసవా అని పిలిస్తే రథం దానంతటదే కదిలి వస్తుంది
రాయచూరురూరల్: దేవదుర్గ తాలూకా గబ్బూరులో కొలువైన బూదిబసవేశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులనుంచి పూజలందుకుంటున్నారు. స్వామివారిని తలుచుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు, పెళ్లి కానివారు ఈ ఆలయంలో నిద్రచేస్తుంటారు. నవాబ్, నిజామ్ల కాలం నుంచే స్వామివారు మహిమలు చూపేవారని భక్తులు చెబుతారు. రథోత్సవం రోజున లేచిరా బసవా అని ఐదుసార్లు పిలిస్తే రథం దానంతటకదే పది అడుగుల దూరం మేర కదిలి వస్తుంది. బూది బసవేశ్వర జాతర పదిరోజులపాటు జరుగుతుంది. భక్తులంతా ఈ పది రోజులూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. 13న జరిగే రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు. -
చింతలాముని రథోత్సవంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
సాక్షి, కర్నూలు: చింతలాముని రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదోని మండలం పెసులబండలోని చింతలాముని రథోత్సవంలో కరెంట్ షాక్ సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 8మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఘనంగా మూలపేట మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం
-
శ్రీకాళహస్తిలో వైభవంగా రథోత్సవం
-
లాక్డౌన్ వేళ దేవుడి రథోత్సవం!
బెంగుళూరు: కర్ణాటకలోని కలబుర్గిలో సిద్ధలింగేశ్వర ఆలయం రథోత్సవం సందర్భంగా భక్తులు లాక్డౌన్ నిబంధనలు తుంగలో తొక్కారు. చితాపూర్‌లో గురువారం జరిగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో 100 నుంచి 150 మంది పాల్గొని రథాన్ని లాగారు. దాదాపు 20 నిముషాలపాటు రథోత్సవం సాగిందని, లాక్డౌన్ నిబంధనలు పాటించని 20 మందికిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ లడ మార్టిన్ తెలిపారు. మత సంబంధ కార్యక్రమ నిర్వహణపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు యంత్రాంగం స్థానిక ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 36 కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 315 చేరాయి. 13 మంది మృతి చెందారు. 82 మంది కోలుకున్నారు. -
రథయాత్రలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఘోర ప్రమాదం తప్పింది. ఊరేగింపులో రథం వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం కూలిపోవడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం
మార్మోగిన హరోం..హర నామస్మరణ జనసంద్రమైన మల్లాం చిట్టమూరు: శ్రీ వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మల్లాంలో స్వామి వారి రథోత్సవం కనులపండువగా సాగింది. మల్లాసుర కొల్లాసుర రాక్షసులను లోక కళ్యాణార్ధం స్వామివారు సంహరించిన అనంతరం విజయోత్సవానికి చిహ్నంగా దేవేరులతో కలసి రథంపై కొలువుదీరి మల్లాంలో విహరిస్తారు. ఈ సందర్భంగా మల్లాం గ్రామం భక్తులతో కిక్కిరిసిపోయింది. హరోం..హర నామస్మరణతో మార్మోగింది. యువతీయువకులు తమకు వివాహాలు కావాలని సుబ్రహ్మణ్యేశ్వరున్ని మొక్కుకుంటూ రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు తాము త్వరగా ఉపశమనం పొందాలని ఆకాంక్షిస్తూ తేరుపై మిరియాలు, ఉప్పుచల్లి పూజలు నిర్వహించారు. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన అశ్వరథంపై దేవేరులతో కలిసి స్వామి వారు కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, భక్తుల హరోం..హర నామస్మరణ మధ్య కార్తికేయుడి రథం ముందుకు కదిలింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి వారికి స్వాగతం పలుకుతూ నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఊరుఊరంతా పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఉభయకర్తలుగా చిల్లకూరు పార్థసారధిరెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు. రామిశెట్టి హరనాథ్ ఉభయకర్తత్వంతో రాత్రి నిర్వహించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి పర్యవేక్షించారు. నేడు షణ్ముఖస్వామి కల్యాణోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం షణ్ముఖస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. -
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి
గొలగమూడి(వెంకటాచలం): గొలగమూడి వెంకయ్యస్వామి 34వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. ఉదయం స్వామికి నిత్య పూజల అనంతరం వాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరిచారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శన నిర్వహించింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనసేవకు నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. వేడుకగా గజ వాహనసేవ ఆరాధనోత్సవాల్లో ఆదివారం రాత్రి గజ వాహనసేవ నిర్వహించారు. గజ వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి పూల, విద్యుద్దీపాలంకరణ చేశారు. పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. గ్రామోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆమంచర్లకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు గజ వాహనసేవకు ఉభయకర్తగా వ్యవహరించారు. నాట్యాచార్యులు జె.శ్రీరామచంద్రమూర్తి(విజయవాడ) శిష్యులచేత భరతనాట్య ప్రదర్శన చేశారు. ఉత్సవ ఏర్పాట్లను ఆశ్రమ కార్యనిర్వాహణాధికారి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఉత్సవాల్లో నేడు సోమవారం ఉదయం అశ్వవాహనసేవ, రాత్రి పెదశేషవాహనసేవ నిర్వహించనున్నారు. అనంతరం వేదాంతం విజయలక్ష్మి శిష్యులచే కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్దం వార్సీను, సత్యహరిశ్చంద్ర పూర్తినాటకం ప్రదర్శించనున్నారు. -
జగన్నాథుడు అందరివాడు
జూలై 6 జగన్నాథ రథయాత్ర పూరీ శ్రీక్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుడు అందరివాడు. ఎక్కడో అల్లంత దూరాన కొండలపై కాకుండా, భక్తులకు చేరువగా సముద్ర తీరానికి కూతవేటు దూరంలో వెలసిన దేవదేవుడు జగన్నాథుడు. ఆలయానికి రాలేని భక్తులకు కన్నుల పండుగ చేసేందుకు ఏడాదికి ఒకసారి సోదరీ సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతాడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ బొడొదండొలో (పెద్దవీధి) ముందుకు సాగుతూ ఉంటే, ఆలయాలే కదలి వస్తున్నాయా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఈ రథాల పైభాగం ఆలయ గోపురాల్లానే గోచరిస్తాయి. స్నానపూర్ణిమతో ప్రారంభం పూరీ శ్రీక్షేత్రంలో నిత్యం వేడుకలు, తరచు పండుగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ ‘బారొ మాసొ తేరొ పొర్బొ’ (పన్నెండు నెలలు... పదమూడు పండుగలు) అనే నానుడి స్థిరపడింది. జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. దీనినే స్నానపూర్ణిమ అంటారు. స్నానపూర్ణిమ రోజు నుంచే రథయాత్ర వేడుకలకు సన్నాహాలు మొదలవుతాయి. స్నానపూర్ణిమ రోజున గర్భగుడిలోని మూలవిరాట్టులైన దారువిగ్రహాలను బయటకు తెచ్చి, ఆలయం తూర్పువైపు ప్రహారీగోడ వద్ద స్నానం చేయిస్తారు. ఈ స్నానానికి ఆలయంలోని ‘సునా కువా’ (బంగారుబావి) నుంచి తోడితెచ్చిన 108 కుండల నీటిని వినియోగిస్తారు. ఈ స్నానం తర్వాత జగన్నాథుడు జలుబు, జ్వరంతో బాధపడతాడంటారు. అందుకే రెండు వారాల పాటు చీకటి గదిలో ఉంచేసి, దైతాపతులు పసర్లు, మూలికలతో చికిత్స చేస్తారు. ఈ తతంగం జరిగే రెండు వారాల్లో ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. మూలవిరాట్టుల పీఠంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల పటచిత్రాన్ని ఉంచి పూజలు చేస్తారు. రెండు వారాల చికిత్స తర్వాత తేరుకున్న జగన్నాథుడు రథారూఢుడై గుండిచా మందిరానికి బయలుదేరుతాడు. నయనానందకరం రథయాత్ర వేడుక పూరీలో అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర వేడుక నయనానందకరంగా సాగుతుంది. ఆషాఢ శుద్ధి విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లయిన గుండిచా మందిరానికి బయలుదేరుతారు. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష్’ కాగా, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. నందిఘోష్ అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది. దీని ఎత్తు 44.2 అడుగులు. ‘తాళధ్వజ’ ఎత్తు 43.3 అడుగులు, ‘దర్పదళన్’ ఎత్తు 42.3 అడుగులు. రథయాత్ర రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. ముందే సిద్ధం చేసిన రథాలను పూరీ రాజు స్వయంగా చీపురుపట్టి శుభ్రపరుస్తారు. రథాలను శుభ్రపరచడం పూర్తయ్యాక భారీ దారువిగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. విగ్రహాలను రథాలపైకి తరలించే కార్యక్రమాన్ని ‘పొహాండి’ (పాండోజనం) అంటారు. రథాలపైకి చేరిన విగ్రహాలకు పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రథాలకు కట్టిన పొడవాటి మోకులను భక్తులు లాగుతారు. భక్తులు రథాలు లాగుతుండగా రథాలపై పూజారులతో పాటే ఉండే ‘డకువా’లు జేగంటలు మోగిస్తూ జగన్నాథుడిపై నిందాస్తుతులతో కీర్తనలు అందుకుంటారు. రథయాత్ర సాగుతున్నంత సేపు పూరీ బొడొదండొ (పెద్దవీధి) లక్షలాది మంది భక్తజనసందోహంతో కిటకిటలాడుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర మరునాటికి మూడు రథాలూ గుండిచా మందిరానికి చేరుకుంటాయి. గుండిచా మందిరంలో సుభద్రా బలభద్రుల సమేతంగా జగన్నాథుడు ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువు దీరుతాడు. గుండిచా మందిరంలో ఉన్నన్నాళ్లూ జగన్నాథుడు దశావతారాల వేషాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడు శ్రీక్షేత్రం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా’ (మారు రథయాత్ర) అంటారు. ఆషాఢ పూర్ణిమ నాటికి శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఆ రోజున జగన్నాథుడు స్వర్ణాలంకార వేషంతో (సునా బెసొ) భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనంతో రథయాత్ర వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఊరూవాడా రథాల వేడుక పూరీలోనే కాదు, ఒడిశా రాష్ట్రంలో ఊరూరా రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాల పరిధిలో జరిగే రథయాత్ర వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. అయితే, ఊళ్లల్లో చిన్నారులు సైతం చిన్న చిన్న రథాలపై జగన్నాథుడిని వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. జేగంటలు, తప్పెట్లు మోగిస్తూ తమకు తోచిన రీతిలో పూజలు చేసేస్తూ ఉంటారు. నచ్చిన చిరుతిళ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇతర దేవతలను ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పూజించడానికి పిల్లలకు అనుమతి ఉండదు. అయితే, అందరివాడైన జగన్నాథుడి విషయంలో ఎలాంటి ఆంక్షలు, నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. అందుకే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. ఛప్పన్న భోగాల నైవేద్యం జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. అనుదినం స్వామికి ఛప్పన్న (యాభయ్యారు) భోగాలను నివేదిస్తారు. ఈ నైవేద్యాల కోసం పూరీ శ్రీమందిరంలో అనునిత్యం వంటలు సాగుతూనే ఉంటాయి. కట్టెల పొయ్యలపై కుండలలో వంటకాలు వండుతారు. దివ్యధామమైన పూరీలో నివేదించే ప్రసాదాన్ని ‘ఒభొడా’ అంటారు. వడ్డించడాన్ని ఒరియాలో ‘భొడా’ అంటారు. మహాప్రసాదాన్ని వడ్డించరు. అందుకే దీనికి ‘ఒభొడా’ అనే పేరు వచ్చింది. పూరీ ఆలయంలో ఈ నైవేద్యాల తయారీ కోసం 752 కట్టెపొయ్యలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. నాలుగు వందల మంది పాకప్రవీణలు అలుపెరగకుండా గరిటెలు తిప్పుతూనే ఉంటారు. పూరీ ఆలయ ప్రాంగణంలోని ఆనంద్‌బజార్‌లో ఈ ప్రసాదాలను కుండల్లో పెట్టి భక్తులకు విక్రయిస్తారు. ఛప్పన్న భోగాలను ఎందుకు నివేదిస్తారనే దానిపై ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిదిసార్లు తినేవాడట. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులు, యాదవుల రక్షణ కోసం గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు ఏడురోజులు భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఇంద్రుడికి బుద్ధి చెప్పి గోవర్ధనగిరిని కిందకు దించిన కృష్ణుడికి యాదవులందరూ 56 పదార్థాలను సమర్పించారట. అందుకే కృష్ణుడి రూపమే అయిన జగన్నాథుడికి పూరీలో 56 పదార్థాలను నివేదించడం ఆచారంగా వస్తోందని చెబుతారు. -
రథోత్సవంలో రాజకీయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇరువర్గాల మధ్య రాజకీయ కక్షలు గ్రామంలో నిప్పురాజేశాయి. పెట్రోబాంబుల దాడులతో అమ్మవారి రథంతోపాటు ప్రజల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. ఈ విధ్వంసకాండలో జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసులకు గాయాలు కాగా 120 మందిని అరెస్ట్ చేసి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా శంకరాపురం సమీపంలో శేషముత్తిరం అనే గ్రామం ఉంది. గ్రామంలో కొలువుదీరి ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రతిఏటా ఉత్సవాలు చేస్తారు. ఇందుకోసం 2012లో అమ్మవారికి కొత్తగా రథం చేయించారు. అదే ఏడాది ఉత్సవాల్లో రథోత్సవం చేయాలని నిర్ణయించారు. అయితే గ్రామ రోడ్లలో రథోత్సవం చేయరాదని పేర్కొంటూ ఒక వర్గం అభ్యంతరం లేవనెత్తింది. గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ససేమిరా అనడంతో రథోత్సవంపై నిషేధం విధించారు. మూడేళ్లుగా ఆడిమాస తిరువిళారోజున ఇరువర్గాల మధ్య చర్చ జరగడం, నిషేధంతో రథోత్సవం జరుపకపోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా రథోత్సవం జరపాలని ఒక వర్గం నిర్ణయించుకుంది. నిషేధం విధించినా ఆదివారం ఉదయం రథోత్సవం జరిపితీరాలని ఏర్పాట్లు చేసుకుంది. బాంబుల బీభత్సం: తమ మాటను కాద ని రథోత్సవానికి సిద్ధం అయ్యారని ఆగ్రహం చెందిన ఆలయ ప్రత్యర్థి వర్గం సుమారు 500 మందితో శనివారం రాత్రి ట్రాక్టర్లతో గ్రామానికి చేరుకుంది. కొత్తగా తయారుచేసిన రథంపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోబాం బులను విసరగా పూర్తిగా దగ్దం అయింది. అలాగే ఆ పరిసరాల్లోని ఇళ్లపై బాంబులు విసరడంతో అగ్నికి ఆహుతైనాయి. ఈ మంటలు పరిసరాలకు వ్యాపించడంతో వరికుప్పల్లు పరశురామ ప్రీతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా ఆందోళనకారులు వారిపై రాళ్లురువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి చెదరగొట్టారు. పరిస్థితి అదుపుతప్పడంతో విల్లుపురం జిల్లా ఎస్సీ నరేంద్రనాథ్ గ్రామంలోకి రావడంతో ఆయనపై కూడా రాళ్లురువ్వారు. ఈ దాడుల్లో ఎస్సీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో మహిళలు సహా సుమారు 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసి 144వ సెక్షన్ విధించారు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వ్యక్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మారియమ్మన్ ఆలయానికి కొత్త రథం తయారుచేయించాడు. ఇదే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి గ్రామంలో రధ సంచారంపై ఉన్న నిషేధాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసానికి దారితీసినట్లు సమాచారం.