రాయచూరురూరల్: దేవదుర్గ తాలూకా గబ్బూరులో కొలువైన బూదిబసవేశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులనుంచి పూజలందుకుంటున్నారు. స్వామివారిని తలుచుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు, పెళ్లి కానివారు ఈ ఆలయంలో నిద్రచేస్తుంటారు. నవాబ్, నిజామ్‌ల కాలం నుంచే స్వామివారు మహిమలు చూపేవారని భక్తులు చెబుతారు. రథోత్సవం రోజున లేచిరా బసవా అని ఐదుసార్లు పిలిస్తే రథం దానంతటకదే పది అడుగుల దూరం మేర కదిలి వస్తుంది. బూది బసవేశ్వర జాతర పదిరోజులపాటు జరుగుతుంది. భక్తులంతా ఈ పది రోజులూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. 13న జరిగే రథోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment