
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు(ఆదివారం) శ్రీరామ నవమి వేడుకలు(Sri Rama Navami celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా జైశ్రీరాం నినాదాల నడుమ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రోడ్లపై భక్తజన సందోహం కనిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆయుధ పూజలు నిర్వహించారు. రోడ్లపై కత్తులు తిప్పుతూ కనిపించారు.
బీజేపీ నేత చంద్రశేఖర్ బావన్‌కులే.. మమత సర్కారుపై పలు ఆరోపణలు చేశారు. సీఎం మమతా బెనర్జీ రామనవమి వేడుకలను అడ్డుకుంటున్నారని, శోభాయాత్రలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే జనం మమతా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఘోరువై శ్రీరామనవమి సందర్భంగా దుర్గాపూర్‌లోని చండీదాస్ బజారులో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన కత్తులను గాలిలో తిప్పుతూ, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మాల్డాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల నిర్వాహకులు భక్తులకు మిఠాయిలను పంచిపెట్టారు. బీజేపీ నేత శుభేందు అధికారి నందీగ్రామ్‌లోని సోనాచురాలో నూతన రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ కోల్‌కతా సెంట్రల్ ఎవెన్యూ(Kolkata Central Avenue)లోని రామాలయంలో జరిగిన పూజలలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Manipur: నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్