Festival Celebration
-
మమ్ము ఆశీర్వదించు మేరీమాతా! గుణదల తిరునాళ్ల సంరంభం
దేశంలోని క్రైౖస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా విజయవాడలోని గుణదల మేరీమాత క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమాతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతియేటా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచీ లక్షలాది యాత్రికులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.నూరేళ్ల క్రితమే ప్రతిష్ట..కతోలిక క్రైస్తవులు భారతదేశంలో సేవనారంభించిన తొలినాళ్లలో అనగా 1925లో గుణదల ప్రాంతంలో విద్యాబోధన ప్రారంభించారు. గుణదల కొండ సమీపంలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్కి అప్పటి రెక్టర్ ఫాదర్ గా పనిచేస్తున్న అర్లాటి స్వామి కొండ పైభాగంలో సహజసిద్దం గా ఉన్న కొండ గుహను గుర్తించారు. భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ఆ గుహలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచీ కతోలిక క్రైస్తవులు, ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు కొండపై ఉన్న మరియమాత స్వరూపాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేడాదికి ఒకసారి ఫిబ్రవరి 11వ తేదీన మరియమాత ఉత్సవాలను జరుపుకోవడం సంప్రదాయమైంది.అర్లాటి స్వామి మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన నాటి నుంచీ మేరీమాత పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కొండ శిఖరాగ్రాన యేసుక్రీస్తు శిలువను ప్రతిష్టించారు.1937లో కొండగుహలో మేరీమాత విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేశారు. అటుపై ప్రత్యేక్ర ప్రార్థనలు, సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని నిర్మించారు. కొండగుహను తొలిచి మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 1948లో కొండ శిఖరాగ్రానికి చేరుకునే దారిలో దేవ రహస్యములు తెలియపరిచే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుణదల పుణ్యక్షేత్రంలో పనిచేసే గురువులు భక్తులకోసం మౌలిక సదు΄ాయాలు, మెట్లమార్గాలు ఏర్పాటు చేశారు. రానురాను ప్రాచుర్యం పెరిగి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మేరీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టారు.ఆచారాలుకులమతాలకు అతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. తొలుత మరియమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. మైనపువత్తులు వెలిగించటం, కొబ్బరికాయ లు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, దివ్యపూజలు చేయించడం, యాత్రికులు నిద్ర చేయటం వంటి ఆచారాలను అనుసరిస్తుంటారు.ఉత్సవాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమష్టి దివ్యబలిపూజ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అంతేకాకుండా నిరంతరం క్రై స్తవ భక్తి గీతాలాపనలు, ప్రత్యేక ప్రసంగాలు, క్రై స్తవ నాటికలు ప్రదర్శిస్తున్నారు. మహోత్సవాలు ప్రారంభంప్రస్తుతం 101వ తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 10 లక్షలమందికి పైగా విచ్చేస్తారని అంచనా. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రార్థనల్లో కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్, ఖమ్మం పీఠాధిపతి సగతి ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభంఆదివారం ఉదయం విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ యేలేటి విజయం జయరాజులు ప్రత్యేక ప్రార్థనలు, సమష్టి దివ్యబలి పూజ సమర్పించి తిరునాళ్ల మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ గురువులుసందేశాలిచ్చారు– చక్రాల శరత్ రాజుసాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) -
దూకుడుతో శిశురక్షణ
కార్పస్ క్రిస్టీ కేథలిక్ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్ ఫెస్టివల్’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్ కొలాచో’ (ది డెవిల్) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు. -
Hyderabad Literary Festival 2025: సాహిత్య సౌరభం..
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్ ఆఫ్ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్‌తో చర్చించారు. అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్ టాక్స్, ఆర్ట్ వర్క్ షాప్స్, నన్హా నుక్కడ్ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్ అండ్ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్టూన్ స్పెషల్.. ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్ శర్మ, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.ఎస్ఎన్ మోహంతి పాల్గొన్నారు.యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో 2లోనే క్లైమాక్స్.. అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు. -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
వాళ్లు.. విందులు, వినోదాల్లో.. వీళ్లు.. వీధుల్లో, విధుల్లో..
రిషి.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. ప్రస్తుతం కోనసీమ కోళ్ల పందేల్లో బిజీబిజీగా ఉన్నాడు.. పండుగకు మూడ్రోజుల ముందే ఊరొచ్చేశాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రవీణ్.. ప్రభుత్వ ఉద్యోగి.. సొంతూరు జనగామ. భోగి ముందు రోజున వచ్చాడు. చెడ్డీ దోస్తులతో, బంధువులతో సంబరాలు చేసుకుంటున్నాడు.కిశోర్.. ప్రైవేటు ఉద్యోగి.. తూర్పుగోదావరి జిల్లా.. సేమ్ అందరిలాగే సంక్రాంతి వేడుకల్లో తలమునకలై ఉన్నాడు..ఇక్కడా కొందరు తలమునకలై ఉన్నారు.. విందులు, వినోదాల్లో కాదు.. వీధుల్లో.. విధులను నిర్వహిస్తూ తలమునకలై ఉన్నారు. నాన్నెప్పుడొస్తడా అంటూ ఇంట్లో ఎదురుచూస్తున్న పిల్లలను తలచుకుంటూ.. ఊర్లో ఉన్న అమ్మాబాపులను యాది చేసుకుంటూ.. పండుగ రోజున కూడా సెలవు తీసుకోని మన సంరక్షకులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అది ఉప్పల్‌లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ఓ పోలీసు కావచ్చు.. గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్న ఒక వైద్యుడు కావచ్చు.. పతంగులు చిక్కుకోవడం వల్ల ఫీడర్లో అంతరాయాలు తలెత్తి.. మనకు కరెంట్ పోకుండా చూస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి కావచ్చు.. లేదా.. ఆర్టీసీ, వాటర్ బోర్డు, శానిటరీ సిబ్బంది, టీవీ రిపోర్టర్లు, అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు, మాల్స్‌లో పనిచేసేవారు, స్విగ్గీ, జొమాటో బాయ్స్.. వీళ్లెవరైనా కావచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ‘మన కోసం’ అలుపెరుగని వీరుల్లా పనిచేస్తూనే ఉన్నారు.పండుగ రోజు.. కరెంట్ పోకుండా..సంక్రాంతి పండుగ అంటే పతంగులు. ఎగరేసేప్పుడు గాలివేగానికి దారం తెగి పతంగులు అనేక చోట్ల విద్యుత్ లైన్ల మధ్య చిక్కుకుంటాయి. ఇదే సమయంలో పలు ఫీడర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వాటిని వెంటనే సరిచేసి సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రీన్లాండ్స్ డివిజన్ సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ)విభాగం ఏడీఈ చరణ్‌సింగ్ నేతృత్వంలోని బృందం ఫ్యూజ్ ఆఫ్ కాల్ సహా ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూం నుంచి వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు లైన్ల మధ్య చిక్కుకున్న గాలిపటాలను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది.ఇంట్లో ఉండాలంటారు.. నాకు వీలవదు..నాకు పండుగ పూట ఇంట్లో ఉండాలని ఉంటుంది. కానీ విధి నిర్వహణ తప్పదు. నాన్న వస్తాడంటూ ఎదురు చూడటం పిల్లలకు అలవాటైపోయింది. ఇంట్లో ఉండండి అని చాలా సార్లు అడిగారు. నాకు వీలవ్వదుగా.. ఈ మధ్య వాళ్లు అమ్మమ్మ వారింటికి వెళ్లిపోతున్నారు. నేను ఇలా డ్యూటీకి వచ్చేస్తున్నాను. – ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డిఈ సంతృప్తి ముందు ఏదీ సాటి రాదు..సొంతూరు వెళ్లి కుటుంబం, బంధువులతో సంక్రాంతి పండుగను జరుపుకోలేకపోతున్నామనే బాధ కొంత ఉంటుంది. అయితే విధి నిర్వహణలో రోగులకు సేవలు అందించడంలో ఉన్న సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. రోగులకు సేవలు అందించడం గర్వంగా ఉంది.– డాక్టర్ పీవీ శ్రీనివాసరావు, గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్మేం పనులు చేయకపోతే.. రోడ్లు అధ్వానమే.. మాది వరంగల్ దగ్గరి మైలారం. పండుగలప్పుడు మేం పనులు చెయ్యకపోతే రోడ్లు అధ్వానంగా అవుతయి. అప్పుడెలా? అందుకే మాకు పండుగలప్పుడు సెలవులుండవు. ఊరికి వెళ్లడం కుదరదు. –జి.బాబమ్మ, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలుఇలాంటి సంతృప్తి పోలీసు శాఖలోనే..పోలీసు ఉద్యోగంలోకి వచ్చి 30 ఏళ్లవుతోంది. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ఎన్నో పండుగల సమయంలో విధుల్లో ఉన్నాను. విధినిర్వహణలో ఎంతో మంది మమ్మల్ని కలిసి శుభాకాంక్షలు తెలుపు తారు. ఇలాంటి సంతృప్తి పోలీసుశాఖలోనే దొరుకుతుంది.తర్వాతి రోజు ఇంట్లో పండుగ జరుపుకొంటాం.– బి.యాదగిరి, హెడ్ కానిస్టేబుల్, బచ్చన్నపేట, జనగామ జిల్లా -
పని చేయకపోతే ఇల్లెలా గడుస్తాది.. నారాయణుడి జీవిత గాథ
యేటి సేత్తామ్.. అందరికి అనుకున్నట్లు అవుతాదేటీ.. ఎవలికి ఏది ప్రాప్తమో.. అదే దక్కుతాది.. నువ్వెంత ఎగిరినా కాణీ ఎక్కువ రాదు.. అంటాడు నారాయణ. అచ్చం రజనీ కాంత్ చెప్పినట్లే చెప్పాడు.. దక్కేది దక్కకుండా పోదు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే మాటను నారాయణ సింపుల్‌గా చెప్పేసాడు.అవును.. ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల ఉన్న నారాయణకు అరవయ్యేళ్లపైనే ఉంటుంది.. అప్పట్లో చిట్టివలస జూట్ మిల్లులో పని చేశాడట.. అది మూసేసాక ఇక వేరే పనేం లేక.. ఆనందపురం దగ్గర్లోని తాళ్ల వలసలో ఊరకనే ఇంట్లో ఉండడం ఎందుకని కూరగాయలు.. ఆకుకూరలు, పూలు.. మార్కెట్లో కొనుక్కుని మళ్ళా మారు అమ్మకానికి మోపెడ్ మీద తిరుగుతాడు. రోజూ దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు తిరుగుతాడు.పెద్దగా తెలివితేటలు లేవు .. ఎక్కువ రేటు చెప్పడు.. మార్కెట్ రేటుకు మరి కాసింత పైన వేసుకుని అమ్ముతాడు.. ఇదేంటి నారాయణ ఇంత అమాయకుడివి.. తెలివి లేదు ఎలా బతుకుతావు అంటే.. పల్లకుందూ ఎవడినైనా ముంచాలంటే తెలివుండాలి గానీ.. మామ్మూలుగా బతకడానికి తెలివెందుకు.. మనం కొన్న సరుకుమీద కేజీకి ఐదో పదో వస్తే చాల్లే.. నాకెందుకు తెలివి.. మేడలు కట్టాలా.. మిద్దెలు కట్టాలా అంటాడు.. అవునులే.. బతకడానికి తెలివి అక్కర్లేదు.. రెక్కలకష్టం చాలు.. ఎవరినో మోసం చేయాలంటే తెలివి ఉండాలి.. అనేశాను.నారాయణతో వాదించలేం.. తెలివి లేదంటాడు.. కొత్త లాజిక్కులు తీస్తాడు.. నారాయణ ఇద్దరు కొడుకులూ మేస్త్రీలే.. రోజూ పని.. డబ్బులు ఉంటాయి.. ఇద్దరి బతుకులకు ఎక్కడా సమస్య లేదు.. ఆడపిల్లను కూడా దగ్గిరోళ్లకే ఇచ్చాను.. దాని బతుక్కి పర్లేదు.. అల్లుడు మంచోడే.. పండక్కి కూతురికి మూడువేల ఇచ్చాను.. నా కొడుకులు కూడా తలా వెయ్యేసి ఇచ్చారు.. మొత్తం ఐదువేలు.. దానికి దాని పిల్లలకు గుడ్డముక్కలకు సరిపోతాయి.. ఇంకేటి కావాలి చెప్మి అంటాడు.. అంత దిలాసాగా ఉన్నవాడితో మనం నెగ్గుకురాలేం.. అవును నారాయణ జీవితానికి ఇంకేటి కావాలి అన్నాను. పిల్లలు బాగున్నారు కదా మరి నువ్వెందుకు తిరగడం అంటే.. మా బాగా చెప్పినావ్.. మన బతుకు మనది.. నేను మా ముసల్ది .. నా జీవితం వేరే.. పిల్లలతో మనకెందుకు.. ఒంట్లో సత్తువున్నంత వరకు మనం పంజేయాలా. పైసా తెచ్చుకోవాలా.. మనం ఆళ్ళమీద చెరబడ్డం ఎందుకు.. నాకసలు అలాంటివి నచ్చదు.. రోజూ ఇలాగే తిరుగుతా నాకు మా ఇంటిదానికి సరిపోతాయి.. ఇంకా వందా యాభై మిగిలితే మానవరాళ్లకు గట్రా ఇస్తుంటా అంటాడు.. యేటి మరి పండక్కి బట్టలు కొన్నావా అంటే.. ఆ.. రెండు కొత్త నిక్కర్లు.. చొక్కా కొన్నా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.. మరేటి ఐతే కనుమకు ఏర్పాట్లు అంటే.. ఉంటుందిలే.. ముక్కలు గట్రా.. ఉండవేటి మరి.. అన్నీ ఉంటాయి.కనుమంటే కనుమే అంటాడు.. మరి కనుమకు మా ఇంటికి వచ్చేరాదూ నారాయణా అంటే.. గొప్పగ చెప్పినావ్.. మనవళ్లు.. మనవరాళ్లు కొడుకులు.. కోడళ్ళు.. ఓస్.. ఎంతమంది ఉన్నారనుకున్నావ్.. మా ఇల్లే పెద్ద జాతర తెలుసా.. నువ్వే మా ఇంటికి వచ్చిద్దు.. మంచి మాంసం కూర వండుకుందుము అని ఎదురు ఆహ్వానిస్తాడు.. అప్పుడంతే జగనన్న ఉన్నప్పుడు పండుక్కి ఏదో పధకం డబ్బులొచ్చేవి.. పండుగ గడిసిపోయేది.. ఇప్పుడవేటి లేవు.. ఇంట్లో పైసా లేదు. జనాల దగ్గర డబ్బుల్లేవు.. మనమే ఏదో చేసి తెచ్చుకోవాలి.. అంటూ ఎకనామిక్స్ మొదలెట్టాడు.. ఆ ఓహో అన్నాను. సర్లే.. నీతోటి మాట్లాడుకుని కూకుంటే నా యాపారం లాసైపోద్ది .. ఎల్తాను.. మళ్ళా పండుగ.. కనుమల తరువాత వస్తాను.. అంటూ కూరగాయల సంచితో బయల్దేరాడు..-సిమ్మాదిరప్పన్న. -
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్‌కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగే కేమెల్ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
దుమ్ము దులిపేద్దాం.. జ్ఞాపకాలు సర్దేద్దాం!!
అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి. నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!
ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్‌లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. వైద్యశాస్త్రం కూడా ఉందట..రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది. ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.ముగ్గులో గమ్మతైన గణితం..ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనం..ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట. మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌గా చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట. దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్..!
వింటర్ సీజన్ జైపూర్ లో ఉండటానికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం పొగమంచుతో, పగలంతా ఎండ, సాయంత్రం నగరం అందించే కళలను ఆస్వాదించడానికి తగినంత చల్లగా ఉంటుంది. అందుకు తగినవిధంగానే జైపూర్ ఈ వింటర్లో కళ, సంస్కృతి, వారసత్వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ’కుంభ్ ఆఫ్ లిటరేచర్’గా పరిగణించబడే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో రచయితల సెషన్ కళాత్మకంగా జరుగుతుంది. ఇక జైపూర్ ఆర్ట్ వీక్‌లో ఎగ్జిబిట్లు, ఇన్స్టాలేషన్ల ద్వారా వర్ధమాన కళాకారుల తెలుసుకోవచ్చు. లిటరేచర్ ఫెస్టివల్ 2025టీమ్‌వర్క్ ఆర్ట్స్ రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, వినోదకులు, సాంస్కృతిక చిహ్నాల ఆసక్తిని పరిచయం చేస్తుంది. జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్లోని ఐదు రోజుల ఉత్సవంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా వివిధ కళారూ΄ాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రాంగణంలో జైపూర్ కళాకారులు చిత్రించిన కుండలు, అప్లిక్ ఎంబ్రాయిడరీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటి తయారీ కళ, వాస్తుశిల్పం, జైఘర్, రాజస్థాన్ కోటల చరిత్ర, జైపూర్ నగర దృశ్యాలు, వారసత్వం, భారతదేశ అసంఖ్యాక చరిత్రలు, ప్రశంసలు పొందిన వక్తలు, రచయితలు, చరిత్రకారులతో కూడిన సెషన్లో కళలను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. జానపద కళా రూపాలుఆవాజ్ స్టూడియోచే నిర్వహించే ఆర్ట్స్, డిజైన్ ఈవెంట్ ఏఐఊఖీ. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఎదుగుతున్న అట్టడుగు నేపథ్యాలను అన్వేషించే పాటలకు ప్రసిద్ధి చెందిన ఇండీ కళాకారుడు రాహ్గీర్ను ప్రదర్శించే మూడు రోజుల పండుగ. డిసెంబర్ 20న ్ర΄ారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో రాష్ట్రంలోని జానపద కథల పరిణామం ఇక్కడ చూడచ్చు. హ్యాండ్–బ్లాక్ ప్రింటింగ్, కుండల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ల, మూడు రోజులలో రాజస్థాన్ హస్తకళల సొగసును చూడచ్చు. మాస్టర్ కల్బెలియా కళాకారులచే 500 మందికి పైగా జానపద నృత్యంలో పాల్గొంటున్నారు. కళల ప్రదర్శనపబ్లిక్ ఆర్ట్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PAT)చే నిర్వహించే, ఒఅగి 4.0 వారం రోజులపాటు ఆర్ట్ వీర్ జరుగుతుంది. ఆ కార్యమ్రంలో ప్రదర్శనలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం నగరంలోని వర్ధమాన కళాకారులు తమ చేయూతను అందిస్తున్నారు. దేవుళ్లు, రాక్షసులు, ఆలయ పెయింటింగ్‌లు, జానపద కథలను వీటిలో రూపొందించారు. ఆర్కిటెక్చరల్ ఆర్టిస్టుల బృందం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌ను ఆవిష్కరిస్తుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఆర్ట్ వీక్ జరుగుతుంది. వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్ -
విజయవాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Kukur Tihar: శునకాల పండుగ
కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి మరుసటి రోజును ‘కుకుర్ తిహార్’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు శునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో ఉంది.నేపాల్‌లో శునకాల మీద ప్రేమ బాల్యం నుంచి నేర్పిస్తారు. అక్కడ దీపావళి పండుగ ఐదు రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు దీపావళి అయితే రెండోరోజు ‘కుకుర్ తిహార్’. అంటే శునకాల పండుగ. ఆ రోజున శునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తారు. ‘పిల్లలూ... మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతోపాటే ఉంటుంది. మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. అంతేకాదు... మనం చనిపోయాక స్వర్గం వరకూ దారి చూపించేది అదే. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాలి. కుకుర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి’ అని చెబుతారు.నేపాలీలు తరతరాలుగా ఇలా ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని ‘కుకుర్ తిహార్’ నిర్వహిస్తారు.కుంకుమ బొట్టు... బంతి పూల మాల‘కుకుర్ తిహార్’ రోజు పెంపుడు కుక్కలకు గాని, ఇంటి కుక్కలకు గాని ప్రతి ఇంటి వారు తప్పక పూజ చేస్తారు. పూజలో మొదట కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తర్వాత నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. ఆపైన బంతి పూల మాల వేస్తారు. ఆ పైన హారతి ఇచ్చి నమస్కరించుకుంటారు. ఇక అప్పుడు దానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తారు. కుక్కలు కూడా బుద్ధిగా కూచుని ఇవన్నీ చేయించుకుంటాయి. తమ యజమానులను మరింతగా ప్రేమిస్తాయి.విశ్వాసానికి కృతజ్ఞతకుక్కలా విశ్వాసంగా ఉండే జీవి మరొకటి లేదు. చరిత్రలు దాదాపు 14 వేల సంవత్సరాల క్రితం నుంచే మనిషికి, కుక్కకు స్నేహం కుదిరిందని ఆధారాలు చెబుతున్నాయి. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతారు. అందుకే కుకుర్ తిహార్ ఎంతో శ్రద్ధగా జరుపుతారు. మరో విషయం ఏమిటంటే కుక్కలకే కాదు మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు. -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
టీమిండియా కెప్టెన్ ఇంట కర్వా చౌత్ వేడుకలు (ఫొటోలు)
-
దేవర గట్టు కర్రల సమరం.. పగిలిన తలలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడ్డారు. కర్రల సమయంలో 100మందికి పైగా గాయాలయ్యాయి. 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ భక్తుల్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
ఫెస్టివ్ లుక్.. ఫ్యాషన్ క్లిక్..
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్‌కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్‌గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్‌కు కేరాఫ్‌గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్‌లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్‌లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..డిజైనర్స్ సూచనలు.. పండుగ సీజన్లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్‌కి రంగురంగుల వైబ్స్‌ని జోడిస్తుంది. ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది. బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్‌గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో మేళవించాలి. నడుముకు బెల్ట్‌తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. డ్రేప్డ్ బాటమ్తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్‌తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్. పేస్టెల్, బ్రైట్ కలర్స్‌తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్‌ఫిట్‌తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు. ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది.. సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు. వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి. పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు. పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి. పురుషుల కోసం.. ఎతి్నక్వేర్తో పండుగ లుక్‌ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్‌గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్‌ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్‌ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్‌కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్‌గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే ఎంపికలే. యాక్సెసరీస్... భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్‌పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్‌గా ఎంచుకోవాలి. -
కావ్య మండవతో దసరా ప్రత్యేక ఇంటర్వ్యూ
-
విజయవాడ : దసరా సందర్భంగా సిద్ధార్థ ఆడిటోరియంలో యువజనోత్సవాలు (ఫొటోలు)
-
నేటినుంచి పూల పండుగ: ఇల్లిల్లూ ఓ గుడి... వీధంతా సింగిడి
తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లేముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుచులతో ఎటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుగా ఉన్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండి జిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి.పూరిగుడిసెలమీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకమ్మ’ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికీ తెలంగాణలో ఉంది.తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభం అవుతుంది. కొన్నిచోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి.అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాలమీదే ఉంటాయి. ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. భాద్రపద అమావాస్య అక్టోబరు 2నప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి, అక్టోబరు 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. – డి.వి.ఆర్. -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
పట్నా: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్‌పూర్ బ్లాక్‌లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్‌లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ -
Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!
దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు! మనసంతా షాపింగ్సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్లైన్లైనా ఆన్లైన్లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్కలిసొచ్చే సెలవులుదసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.స్వీట్లుస్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దసరా భక్తిదసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి. రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలుఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బొమ్మల కొలువుదసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది. -
వినాయక మండపంలో రాజ్యాంగ పఠనం
జాల్నా: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా జరుగున్నాయి. అయితే మహారాష్ట్రలోని జాల్నాలో గణేశ మండపం ఒక ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ ప్రతిరోజా సాయంత్రం వేళ వినాయకుని హారతి ఇచ్చిన అనంతరం భక్తులంతా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తున్నారు.ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, ప్రాథమిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమనే లక్ష్యంతో రోజూ రాజ్యాంగ పఠంనం చేస్తున్నామన్నారు. ఈ మండపాన్ని గణేష్ మహాసంఘ్ అధ్యక్షుడు అశోక్ పంగార్కర్ సారధ్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాయ్‌సాహెబ్ దానే, ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల తదితరులు మండపాన్ని దర్శించుకున్నారు. -
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
పండుగ డిమాండ్..లక్షల్లో గిగ్ జాబ్స్!
రాబోయే పండుగ సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. కస్టమర్ల నుంచి అంచనాలను మించి డిమాండ్ ఉంటుందనే లెక్కలతో కంపెనీలు తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు)లను పొలోమంటూ నియమించుకుంటున్నాయి. దీంతో గిగ్ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుందనేది హైరింగ్ ఏజెన్సీల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్పండుగల పుణ్యామా అని తాత్కాలిక హైరింగ్ జోరందుకుంటోంది. పరిశ్రమలవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అంచనా. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఇది 15–20 శాతం అధికం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం.. స్టాక్ మార్కెట్లు కూడా మాంచి జోరుమీదుండటంతో వినియోగదారులు పండుగల్లో ఈసారి కొనుగోళ్లకు క్యూ కడతారని కంపెనీలు భావిస్తున్నాయి.పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ కూడా దన్నుగా నిలుస్తుందని లెక్కలేస్తున్నాయి. వెరసి పండుగ అమ్మకాల కోసం కీలక పరిశ్రమలు తాత్కాలిక కొలువులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, సీఈఐఎల్, హెచ్ఆర్ సరీ్వసెస్, టీమ్‌లీజ్ సరీ్వసెస్ తదితర హైరింగ్ సంస్థలు చెబుతున్నాయి.ఈ రంగాల్లో జోష్... రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్లు వేస్తున్నాయి. ఫుల్ డిమాండ్ ఉంటుందనన్న అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్‌కు గేట్లెత్తాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, కన్జూమర్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, తయారీ, పర్యాటకం–ఆతిథ్య రంగాలు కూడా పటిష్టమైన డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయి. ‘పండుగ హైరింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, మండుటెండల ప్రభావంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో, పండుగల్లో దండిగానే ఖర్చు చేసే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల్లోనూ కలిపి 6 లక్షల నుంచి 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నాం’ అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్/గూడ్స్ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పండుగ షాపింగ్‌కు కొత్త కళ తీసుకొస్తున్నాయి. మరోపక్క, బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా మరింత వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలనేది వాటి ప్లాన్. దేశంలోని చాలా కంపెనీల వార్షిక వ్యాపారంలో మూడింట రెండొంతులు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యే జరుగుతుందని అంచనా.చిన్న నగరాల్లో మరింత అధికంపట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం, మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్కృతి విస్తరిస్తుండటం.. వినియోగదారుల ఖర్చు కూడా పుంజుకోవడంతో చిన్న నగరాల్లో కూడా గిగ్ వర్కర్లకు మరింత డిమాండ్ జోరందుకుంది. ‘ముఖ్యంగా గౌహతి, బరోడా, జామ్‌నగర్, వైజాగ్, కటక్, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, భువనేశ్వర్, భోపాల్, లూధియానా, చండీగఢ్ వంటి పలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు తాత్కాలిక ఉద్యోగులకు హాట్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇక్కడ గిగ్ వర్కర్ల డిమాండ్‌లో 25–30 శాతం వృద్ధి కనిపిస్తోంది.పికర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్ల వెంటపడుతున్నాయి కంపెనీలు’ అని హైరింగ్ సంస్థ అడెకో డైరెక్టర్ మను సైగల్ పేర్కొన్నారు. పండుగల్లో ఆఫర్ల జోరు నేపథ్యంలో ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన డెలివరీ సిబ్బంది, కస్టమర్ సరీ్వస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ తెలిపారు. -
17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు
రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (ఎఫ్‌ఓజీ),ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం కనిపించనుంది. ఇండియా డే పరేడ్, ఫెయిర్‌లో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెల్నెస్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ, హిప్-హాప్ తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ అమెరికాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. -
ఇలాంటి కార్లు ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
Eid Al-Adha 2024: మౌలిక విధులు..
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక సూత్రాల్లో ‘హజ్’ కూడా ఒకటి. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మౌలిక సూత్రాల్లో ఏ ఒక్కదాన్ని నమ్మక పోయినా విశ్వాసం పరిపూర్ణం కాదు. అందుకని ఈ ఐదు అంశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులోని చివరి అంశం హజ్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం మక్కాలో నిర్మించిన దైవ గృహ సందర్శనా ప్రక్రియను ‘హజ్’ అంటారు.హజ్ అనేది ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్ హజ్జ్ నెల పదవ తేదీన మక్కాలో నిర్వహించబడుతుంది. అదేరోజు యావత్ ప్రపంచ ముస్లింలు ఈద్ జరుపుకొని ఖుర్బానీలు సమర్పిస్తారు. ఇస్లామీయ క్యాలండరులో ఇది చివరి నెల. దీని తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.అందుకే ఈ నెలకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ నెలలోని మొదటి పదిరోజులూ చాలా ప్రాముఖ్యం కలిగినవి. ఈ దశకంలో దైవ కారుణ్యం కుండపోతగా వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగి దేవుని కృపకు పాత్రమవుతుంది. ఈ దినాల్లో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం)... ఏడాది మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ (జిల్ హజ్ నెల 9వ తేదీ) నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అరఫా రోజు సైతాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడు. అవమాన భారంతో చితికి పోతాడు.‘అరఫా’ రోజు ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలాకుల్లి షయ్ ఇన్ ఖదీర్’ అనే దుఆ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. దీనితో పాటు ‘తహ్ లీల్’ అంటే, ‘లాయిలాహ ఇల్లల్లాహ్’; ‘తక్బీర్’ అంటే, ‘అల్లాహుఅక్బర్’; ‘తహ్ మీద్’ అంటే, ‘అల్ హందులిల్లాహ్’; ‘తస్ బీహ్’ అంటే, ‘సుబ్ హానల్లాహ్’ అని తరచుగా ధ్యానిస్తూ ఉండాలి. అరఫా రోజే కాకుండా ‘అయ్యామె తష్రీఖ్’లో కూడా అంటే, పండుగ తరువాతి మూడు రోజులూ (జిల్ హజ్ నెలలోని 11, 12, 13 తేదీలు) వీలైనంత అధికంగా ఈ వచనాలు పఠించాలి. కనుక ఈ సుదినాలను సద్వినియోగం చేసుకుంటూ పండుగ ముందు రోజు పాటించే ‘అరఫా’ ఉపవాసం పాటించి, సత్కార్యాలు ఆచరిస్తూ దైవక్రృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ సన్మార్గ పథం అనుగ్రహించుగాక! – మదీహా అర్జుమంద్ (నేడు బక్రీద్) -
వసంతోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. వసంతోత్సవాలకు అవరోధాలు కలగకుండా సకల దేవతలను కోరుతూ మంగళవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. యాగశాలలో సిద్ధంగా ఉంచిన నవపాళికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టడంతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యానవనంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు తిరువీధోత్సవం నిర్వహించనున్నారు. రేపు స్వర్ణరథోత్సవం వసంతోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వసంతోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. స్నపన తిరుమంజనం జరిగే మండపం చుట్టూ చల్లదనం కోసం వట్టివేళ్లతో తెరలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా రంగోళి, అమ్మవారి చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలంకరణతో ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
-
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Happy Bihu 2024: అంబరాన్నంటే సంబరాలు.. (ఫోటోలు)
-
పండుగ పూట.. మహిళలుగా మారిపోయే పురుషులు (ఫొటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్‌లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
ఒక్క జిలేబీ చాలు.. కుటుంబానికి పండుగే!
కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో 300లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు. 1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్‌లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు. తాజ్ మహోత్సవ్‌ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు. -
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
చికూ ఫెస్టివల్ గురించి విన్నారా?
ఓ పండు కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఇది. ఓ మారుమూల గ్రామం ఈ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంతేగాదు అక్కడ ఉత్పత్తి అయ్యే ఆ పండ్లు మంచి నాణ్యత గల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఎక్కడ ఈ పండుగ జరుగుతుంది? దేని గురించి నిర్వహిస్తున్నారు? అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర నగరానికి 200 కి.మీ దూరంలో ఉండే బోర్డ్ బీచ్ ముంబై వాసులకు మంచి పర్యాటక ప్రాంతంగా అలరారుతుంది. అక్కడకు సమీపంలో ఉండే దహను జిల్లాలోని ఘెల్వాడ అనే చిన్న తీర గ్రామం ఉంది. ఈ గ్రామం చికూ పండ్లకు మహా ప్రసిద్ధి. ఇంతకీ ఏంటీ చికూ పండు అంటే? అదేనండి మనం ఎంతో ఇష్టంగా తినే సపోటానే కొన్ని చోట్ల "చికూ" పండ్లు అని అంటారు. ఈ పండుని దేశ విదేశాల్లో ఒక్కో పేరుతో ప్రసిద్ధి. అయితే ఈ ఘెల్వాడ్ గ్రామం మాత్రం ఈ చికూ పండ్లు(సపోటా పండ్ల)కు మంచి పేరుగాంచింది. అక్కడ ఎటూ చూసిన ఈ పండ్లే కనిపిస్తాయి. పైగా అక్కడ సపోటా మంచి రుచికరంగా ఉంటుంది. అంతేకాదండోయ్ సపోటాల్లో అవే అత్యంత రుచికరమైన నాణ్యతగల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఈ పండ్లను నగరీకరణ పేరుతో కనుమరగ్వ్వకుండా కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తల సంక్షేమ ఫౌండేషన్ నేతృత్వంలోని స్థానికి సంఘం 2013 నుంచి ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. స్థానిక రైతులు ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే గాక రైతులకు, పట్టణ కేంద్రాల్లోని జనాభా మధ్య అంతరాన్ని తగ్గించేలా చేయడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 10వ చికూ ఫెస్టివల్ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో బోర్డి తీరాన ఘనంగా జరుగుతోంది. ఈ పండుగను వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తరలి వస్తారు కూడా. ఈ పండుగలో బీచ్ పారాగ్లైడింగ్, చికూ పొలాలు, ఫుడ్ యూనిట్ల పర్యటన, సైక్లింగ్ ఈవెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు(వార్లీ పెయింటింగ్), జానపద నృత్యం, స్థానిక సంగీతం తదితరాలు ఎంతగానో అలరిస్తాయి. ఈ చికూ ఫెస్టివల్లో సంగీత విద్వాంసుడు అష్మిక్ పటేల్, సౌరభ్ సేవ్, కథక్ నృత్యకారిణి యోగిని మ్హత్రేతో వంటి కళకారులు ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఈ ఫెస్టివల్లో ఆ చికూ పండుతో తయారు చేసే ఐస్‌క్రీంలు, కుల్ఫీలు, చిప్స్ వంటి ఎన్నో రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ సందడి చేస్తాయి. ఒకర రకంగా ఈ పండుగలో ఆ చికూ పండ్ల వ్యవసాయం, వాటి కోసం రైతులు పడే శ్రమ తదితరాలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇక్కడ అత్యంతా బాగా ఆకట్టుకునేది ఉమెరగావ్‌లోని ఉద్యానవనాలు. హిరణ్యకేశి నది సమీపంలోని హిరణ్యకేశ్వర్ ఆలయం, గుహలు, తదితరాలు. ఒక పండు కోసం పండుగ నిర్వహించడమే గాక దాని ద్వారా రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చేయాలనుకోవడం ప్రశంసించదగ్గ విషయం కదూ! (చదవండి: ఆ మోటర్ సైకిల్‌కి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదట!పాక్‌గా ఏర్పడక ముందు జరిగిన ఘటన) -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్‌పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
శ్రీ సూర్యనారాయణా...
బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది! జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీక రించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు; మహాకవి చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికూనలమైపోవాలి అందరం. జీవితం అనుక్షణ ఉత్సవభరితమే అయినా ప్రకృతిలో మారే ప్రతి ఋతువూ, కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగూ పెద్దపండుగ అవుతుంది. ధనూరాశి నుంచి మకరరాశి లోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి. ఏటా నెల నెలా రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భమూ సంక్రాంతే అయినా, మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే; అప్పటికి మంచుపొరలు, చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్ళు తెరచుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులు, పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అలా ప్రతి ప్రాణితోనూ, చెట్టుతోనూ, పుట్టతోనూ తన ముడిని గుర్తుచేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్రవిచిత్రమైన రంగవల్లులను తీర్చిదిద్దేది, కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మజీవులకు ఆరగింపు చేసి భూతదయను చాటుకునేందుకేనని పెద్దలంటారు. ఒక్కోసారి తత్త్వం అడుగంటి తంతు మిగలడం కాలం చేసే మాయ. మనిషి ఊహలో తొలిదైవంగా ముద్రపడిన ప్రాకృతిక అద్భుతమే సూర్యుడు. పరోక్ష దేవతలకు భిన్నంగా ఆయన ప్రత్యక్ష దైవం. అందుకే సర్వసాక్షి, కర్మసాక్షి సహా ఆయన చుట్టూ ఎన్నో కల్పనలు. దేవతల్లో పెద్దాయన ఆయనే. ప్రపంచమంతటా తొలి కొలుపులు అందు కున్నవాడిగా ఆయన వైశ్విక దైవం. దేవుడి గురించిన తొలి ఎరుక కలిగించిన ఆ మెరుపు, మైమరపు ఋగ్వేదంతో సహా ఆదిమ కృతులన్నింటిలో నిసర్గసుందరంగా వ్యక్తమవుతాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒకప్పుడు ప్రధాన దైవమైన సూర్యుడికి మన పౌరాణిక ప్రసిద్ధుడైన నారాయణుని పేరు చేర్చిన ఫలితంగానే ఆయన సూర్యనారాయణుడయ్యాడని గుంటూరు శేషేంద్రశర్మ అంటారు. ఒకప్పుడు పశ్చిమాసియాలో మిత్రారాధన పేరుతో వర్ధిల్లిన సూర్యారాధన ప్రభావం ఇతర మతాలపై ఎలా పడిందో అత్యంత ఆశ్చర్యకరంగా వివరిస్తాడు జి.జె.ఎం. ఫ్రేజర్ తన ‘గోల్డెన్ బౌ’ అనే బృహద్రచనలో. మన శ్రీరామచంద్రుడే కాక, ఒకనాటి పశ్చిమాసియా రాజులు, పర్షియన్ చక్రవర్తులు కూడా తమను సూర్యుడితో ముడిపెట్టుకున్నారు. ఆదిత్యçహృదయోపదేశం పొందిన తర్వాతే రాముడు రావణుని జయించగలిగాడని రామాయణం అంటుంది. సంక్రాంతినీ, సూర్యునీ లోతుగా తడిమిన కొద్దీ ఇంకా ఎన్నెన్ని విశేషాలో! సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఘట్టాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకొంటాం కానీ నిజంగా సూర్యుడికి గమనమంటూ ఉంటుందా? భూమే సూర్యుడి చుట్టూ ఒకింత వంపుతో తిరుగుతూ దూరమూ, దగ్గరా అవుతున్న క్రమంలోనే కాలాలూ ఋతువులూ ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతిని ఇప్పుడు జనవరి 15న జరుపుకొంటున్నాం కానీ, క్రీ.శ. 1000లో డిసెంబర్ 31న, క్రీ.శ.272లో డిసెంబర్ 21న జరుపుకొనేవారట. మరో తొమ్మిదివేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జూన్ నెలలో వస్తుందట. జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన కాలగణనాలు ఇలాంటి విచిత్రాలను ఆవిష్కరిస్తే, శాస్త్రవిజ్ఞానం మరో రకమైన విలక్షణ దృశ్యానికి తెరతీసి ఒక్కోసారి వెన్నులో వణకు పుట్టిస్తుంది. సూర్యుడు ఎంత పెద్దాయనంటే, ఆయన వయసు 460 కోట్ల సంవత్సరాలకు పైనేనట. మరో 500 కోట్ల సంవత్సరాలు గతిస్తే, తన చుట్టూ తిరిగే భూమితో సహా అన్ని గ్రహాలనూ తనలో కలిపేసుకుని ఓ తెల్లని మరుగుజ్జు నక్షత్రంగానూ, ఆ తర్వాత నల్లని నక్షత్రంగానూ మారిపోతాడట. ఆ లోపల తన కేంద్రంలో నిరంతరాయంగా జరిగే కోట్ల టన్నుల హైడ్రోజన్, హీలియవ్ుల కలయిక నుంచి లక్షల టన్నుల పదార్థం శక్తిగా మారిపోయే క్రమంలోనే మన మనుగడకు అవసరమైన వెలుగు, వేడి లభిస్తున్నాయి. శీతోష్ణాల నిర్విరామ ఘర్షణ నుంచే జీవి పుట్టి మనతో సహా అనేక ప్రాణుల రూపంలో పరిణామం చెందడం వేరే కథ. మన ఊహకు అతీతమే కాక, మన నిత్యజీవన సంతోషాలకు ఏమాత్రమూ అడ్డురాని సూర్యుని వైశ్విక మూలాలను ఈ పండుగ వేళ మరీ లోతుగా తడమడమెందుకు? ప్రకృతితో మమేకమై వెలుగూ వేడిలో స్నానిస్తూ ఈ క్షణాలను మధురమధురం చేసుకుందాం. పొన్న,ఉల్లి, జాజి, సంపంగి, మల్లె, మంకెన, ములగ, ఆవ, వంగ, గుమ్మడి పూచాయలు ధరించే ఆ సూర్యనారాయణుడికి నోరారా మేలుకొలుపు పాడుకుందాం. కవయిత్రి కుప్పిలి పద్మ అన్నట్టు, ఒక్కుమ్మడిగా పండుగను పిలిచేందుకు ఈ చేతులతో చుక్కల ముగ్గుల్ని, రంగుల చామంతుల్ని పూయిద్దాం. ఎక్కడెక్కడి చుట్టాలనో ఏడాదికొకచోట కలిపే సారంగధర మెట్ట మీది తనివితీరని తిరునాళ్ళ పుట్టినిల్లు జ్ఞాపకాల నెగడు దగ్గర చలి కాగుదాం. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా తుప్పల వెంటా పుంతల వెంటా పడి తిరుగుతూ, ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్క మొగ్గనీ తెంపకుండా, ఒక్క పువ్వునూ వదలకుండా మృదువైన పూల వేట సాగిద్దాం. -
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్‌తో లంచ్‌కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
నటి సాయి పల్లవి కమ్యూనిటీకి చెందిన ‘హేతై హబ్బా’ వేడుక గురించి తెలుసా?
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, అందం, అభినయంతో చాలా తక్కువ కాలంలోనే ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న చక్కటి నటి సాయి పల్లవి. కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమాల కథలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆమె ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటేనే ఈ వైఖరే సాయి పల్లవికి నటిగా గౌరవనీయమైన స్థాయిని అందించింది. పాత్ర ఏదైనా సహజంగా ఆ పాత్రలో ఒదిగి పోవడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు నాట్యంలో కూడా నాట్య మయూరి అనిపించుకుంది. బడగ తెగకు చెందిన సాయి పల్లవి ఫిదాలో అల్లరి అమ్మాయిగా ఫిదా చేసింది. ప్రేమమం మొదలు తెలుగులో నటించిన లవ్ స్టోరీలో సారగ దరియా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా విరాటపర్వంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో పేదల కష్టాలపై పోరాడే అన్నల ఆకర్షితురాలైన యువతిగా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటన నభూతో నభవిష్యతి. ఏ పాత్రనైనా అవలీలగా నటించడం ఆమెకు తెలుసు. అయితే సాయి పల్లవి తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతానికి చెందిన బడగ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పల్లవి. అసలు ఏంటీ బడగ జాతి ఈ వివరాలు చూద్దాం. #WATCH | Tamil Nadu: A large number of devotees participate in the Hethiyamman temple festival, in Nilgiris. pic.twitter.com/jLBINIdul9 — ANI (@ANI) January 1, 2024 బడగా, అంటే అర్థం 'ఉత్తరం. పాత కన్నడ బడగానా నుంచి వచ్చింది. బడగాలపై పరిశోధన దాదాపు ఆరు దశాబ్దాలపాటు పరిశోధించిన అమెరికన్ మానవ శాస్త్రవేత్త పాల్ హాకింగ్స్ ప్రకారం సుల్తానుల హింసనుంచి పారిపోయి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన వొక్కలిగాలుగా భావిస్తారు. నీలగిరి జిల్లాలో దాదాపు 400 గ్రామాలలో బడగలు నివసిస్తున్నారట. బడగలు బడగా అనే భాషను మాట్లాడతారు. దాదాపు ఇది కన్నడ భాషకు దగ్గరగా ఉంటుంది. కానీ లిపి లేదు. ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలతోపాటు బడగ భాషను కూడా సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. బడగలు దాదాపు 400 గ్రామాలలో నివసిస్తున్నారు. నీలగిరి జిల్లాలో బడగలు అతిపెద్ద ఆదిమ తెగలు. నీలగిరి మొదట గిరిజనుల భూమి.కుకల్, కడనాడ్, ఈతలార్, నుండాల, మేలూరు, హులికల్, అతికరాట్టి, మేల్కుంద, కిల్కుంద, కెట్టి, తంతనాడు, మిలిదేను, నందట్టి, జక్కనారి, అరవేను, తిన్నియూర్, అయ్యూరు, కన్నెరిముక్కు, బెరగని, త్వున్నేర్, జక్క, తదితర గ్రామాల్లో వీరు నివసిస్తారు.వీరిని నీలగిరి గౌడలు అని కూడా అంటారు.బడగాలు ప్రాచీన శిలాయుగానికి చెందినవారిగా చరిత్రకారులు భావిస్తారు. బడగాలు పండుగలను "హబ్బా" అని పిలుస్తారు. బడగాస్ ప్రధాన దేవతలు హెతాయ్ , అయ్య. అలాగే శివుడు, కృష్ణుడు, ఖాలి, మారి, మునియప్పను కూడా పూజిస్తారు. ముఖ్యమైన పండుగలు డెవ్వా హబ్బా, హేతే హబ్బా, సకలతి హబ్బా, ఉప్పట్టువ హబ్బా. గిరిజన తెగ అయిన బడగాలు మా ఖలీ హబ్బా, దేడిసిమి హబ్బా, కృష్ణ జయంతి, వినాయగర్ చతుర్థి, మర్రి హబ్బా, మురుగర్ హబ్బా, రామర్ హబ్బా, హనుమాన్ జయంతి తోపాటు ప్రకృతిని, నీటిని, సూర్యుడు, సర్పాలను ప్రకృతిని పూర్వీకులను కూడా పూజిస్తారు. ఆదివాసి బడగా పురాతన అగ్ని తయారీ ప్రక్రియ (చెకుముకి రాళ్ల రాపిడి ద్వారా నిప్పు తయారీని) ఇప్పటికీ వారి దేవా పండుగ సమయంలో అవసరమైన ఆచారంగా ప్రదర్శిస్తారు వారు రెండు రాళ్లు లేదా రెండు కర్రలు రుద్దడం ద్వారా రాపిడి ద్వారా అగ్నిని ఉత్పత్తి చేశారు. దీన్ని "నీలిగోలు" లేదా నిటారుగా ఉండే కర్ర అంటారు. శివుని అవతారంగా భావించే సూర్యుడిని,విష్ణువు అవతారంగా నాగప్పను ఆరాధిస్తారు హేతై హబ్బా ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరిలో ఒక నెల పాటు హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా , ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ పండుగ పచ్చని నీలగిరి ప్రకృతి దృశ్యం నేపథ్యంలో భక్తులు సాంప్రదాయ తెల్లని దుస్తులలో హేతే దేవతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడగలు తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. సాయి పల్లవి కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు గతంలో షేర్ చేసింది. బడగ కమ్యూనిటీనుంచి వచ్చిన ఇతర ప్రముఖులు బడగ తెగ సంస్కృతి, ఆచారాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే 80 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలలో , మరికొందరు విదేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ లోక్‌సభ ఎంపీ, దివంగత అక్కమ్మ దేవి. ఆమె డిగ్రీ చదివిన తొలి బడగ మహిళ . 1962 నుండి 1967 వరకు నీలగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక తొలి మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ బెల్లి లక్ష్మీ రామకృష్ణన్ MA ప్రసిద్ధి. ఈమె తొలి మహిళా గెజిటెడ్ అధికారిణి కూడా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశారు. -
హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
క్రిస్మస్ శాంటా తాత ఎవరు? ఏ ఊరి నుంచి వస్తాడు? అసలు నిజమేంటి?
"క్రిస్మస్ రోజున శాంటా తాత వస్తాడు. బహుమతులెన్నో తెస్తాడు. శాంటా ఉత్తర ధ్రువం నుంచి వస్తాడని అందరూ అంటారు. కాదు శాంటా మా ఊరి నుంచి వస్తాడు అంటారు ఫిన్లాండ్ దేశస్తులు. ఫిన్లాండ్లోని ‘రొవానియమి’ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రతి క్రిస్మస్కు పర్యాటకులు అక్కడకు వెళ్లి శాంటా ఊరు ఇదేనంటూ సందడి చేస్తారు. ఈ ఊరి విశేషాలు చాలానే ఉన్నాయి. పిల్లలకు చెప్తే అబ్బుర పడతారు." ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే’.. ఎర్రని దుస్తుల్లో, తలమీద టోపీతో, గుబురు గెడ్డంతో, రైన్ డీర్లు లాగే స్లెడ్జ్ బండి మీద, బోలెడన్ని కానుకలు మూటగట్టుకుని క్రిస్మస్ రాత్రి ఆకాశ వీధుల గుండా క్రిస్మస్ తాత వస్తాడని పిల్లలకు ఒక నమ్మకం. క్రిస్మస్ వచ్చే ముందే తల్లిదండ్రులు పిల్లల్ని ‘క్రిస్మస్ తాత ఏం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావు’ అని అడుగుతారు. కొందరు పిల్లలు ‘ఫలానాది ఇవ్వు’ అని క్రిస్మస్ తాతకు లెటర్లు రాస్తారు. కొందరు పిల్లలు ఇవేవీ అడక్కుండా తమకోసం ఏం ఇస్తాడో చూద్దాం అని ఉత్సుకతతో ఎదురు చూస్తారు. ఎవరి బాల్యంలో అయినా ఇది అద్భుతమైన జ్ఞాపకం. క్రిస్మస్ తాత అంటూ ఎవరూ రారు అని పిల్లలకు తెలిసినా.. ఏమో వస్తాడేమో అనుకునే అమాయకమైన వయసు అది. వస్తాడేమో అనిపించే ఉత్సుకత ఉండేప్రాయం అది. అందుకే తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులు ఉన్నచోట వారు నిద్రపోయాక వారి కోసం తల దగ్గర కానుకలు పెట్టి వెళతారు. పిల్లలు తెల్లారి లేచి వాటిని చూసుకుని ‘శాంటా ఇచ్చాడు’ అని సంబర పడతారు. శాంటా తాత ఎవరు? ఇది బైబిల్ పాత్ర కాదు. క్రీ.శ.280 కాలంలో టర్కీలో సెయింట్ నికొలస్ అనే ఒక బిషప్ క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి, ముఖ్యంగా పిల్లలకు ఎంతో కొంత సహాయం చేసేవాడట. నిద్రపోతున్న వారి పక్కన కానుకలు, డబ్బు పెట్టి వెళ్లేవాడట. సాక్సుల్లో బంగారు నాణెలు పెట్టి ఇళ్లల్లో పడేసేవాడని అంటారు. పండగంటే ఆనందం పంచడమే కదా. ఇది అందరికీ నచ్చింది. ఇలా ఒక తాత వచ్చి కానుకలు ఇస్తే బాగుండు అనే కోరిక పెరిగింది. మంచి కోరికను తీర్చడానికి ప్రపంచమంతా ముందుకొస్తుంది. అందుకే క్రిస్మస్ తాత అందరి తాత అయ్యాడు. సెయింట్ నికోలస్ కాస్తా శాంటా క్లాజ్ అయ్యాడు. శాంటా ఊరు.. నిజమైన శాంటా క్లాజ్ టర్కీ వాడైనా కాలక్రమంలో నార్త్‌పోల్ వాడయ్యాడు. దీనికి కారణం 1893–96ల మధ్య థామస్ నాస్ట్ అనే అమెరికన్ కార్టూనిస్టు శాంటా క్లాజ్ బొమ్మలు పత్రికలకు గీసి శాంటా నార్త్‌పోల్ వాడని అడ్రస్ పెట్టాడు. దానికి కారణం ఆ రోజుల్లో నార్త్ పోల్ (ఉత్తర ధ్రువం) ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక దాని చుట్టూ ఒక దైవిక కల్పనలు సాగేవి. సెయింట్స్ అక్కడే ఉంటారని అనుకొని ఉండొచ్చు. అదీగాక అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది కనుక క్రిస్మస్ అంటే మంచుకాలం కనుక థామస్ నాస్ట్ ఏకంగా 24 గంటలూ మంచు ఉండే ప్రాతాన్ని శాంటా క్లాజ్ తావును చేసి ఉంటాడు. ఇక అక్కడ రైన్డీర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాహనంగా మార్చారు. ఫిన్లాండ్ ఊరు.. ఫిన్లాండ్ దేశం వారు శాంటా తమ ఊరి వాడేనని ఒక వాదన మొదలుపెట్టారు – పర్యాటక ఎత్తుగడే కావచ్చు. ఫిన్లాండ్ ఆర్కిటిక్ సర్కిల్లో వచ్చే దేశం కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచే కాబట్టి శాంటా ఊరు తమ దేశంలోదే అనుకుని ఉండొచ్చు. అంతటితో ఆగక ‘రొవానిఎమి’ అనే ఊరిని శాంటా ఊరిగా టూరిస్ట్ ఎట్రాక్షన్ చేశారు. ఇక్కడ శాంటా ఇల్లు, శాంటా పోస్టాఫీసు, శాంటా తిరిగే స్లెడ్జ్బళ్లు అన్నీ ఉంటాయి. మైనస్ 12 డిగ్రీల చల్లదనం ఉండే క్రిస్మస్ కాలంలో కూడా టూరిస్టులు శాంటా ఊరికి వెళ్లి సందడి చేస్తారు. మత భావనలు పొందుతారు. ఈ ఊరి వారు శాంటాతో మాట్లాడాలనుకునే పిల్లల కోసం ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడి పోస్టాఫీసుకు ప్రతి సంవత్సరం 200 దేశాల నుంచి రెండు లక్షల ఉత్తరాలు శాంటా నుంచి పిల్లలకు వస్తాయి. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు ఇక్కడి పోస్టాఫీసులో ఉత్తరం రాసి పడేస్తే కరెక్ట్‌గా క్రిస్మస్కు అందేలా పంపుతారు. అంటే శాంటా పంపినట్టు పంపుతారు. అదో సరదా. 'శాంటా అబద్ధం కావచ్చు. కాని శాంటా ఉంటాడన్న పిల్లల అమాయక కామన అబద్ధం కాకూడదు. ఈ క్రిస్మస్ రోజున అందరు పిల్లలకూ, ముఖ్యంగా ఆట వస్తువులు లేని పేద పిల్లలకు మీరే శాంటాగా మారండి. హ్యాపీ క్రిస్మస్. ఇవి చదవండి: ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు? -
విజయవాడ : అమరావతి బాలోత్సవం...ఆకట్టుకున్న చిన్నారుల ఆటపాటలు (ఫొటోలు)
-
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్‌కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్‌కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్‌కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజలు (ఫొటోలు)
-
రాజకీయ విభేదాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే
ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్‌తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు. రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్‌తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా? -
పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట
ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. "ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్‌ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. #WATCH | Huge rush of people at Anand Vihar- Kaushambi on Delhi-UP border near the Anand Vihar railway station and inter-state bus terminal pic.twitter.com/DkDXSgganz — ANI (@ANI) November 11, 2023 న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. #WATCH | Gujarat | A stampede situation ensued at Surat railway station due to heavy crowd; one person died while three others were injured. The injured were shifted to the hospital: Sarojini Kumari Superintendent of Police Western Railway Vadodara Division (11.11) pic.twitter.com/uAEeG72ZMk — ANI (@ANI) November 11, 2023 ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్‌లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్‌లో కూడా కనిపిస్తుంది. దుబాయ్‌వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్ అంతటా కనిపిస్తాయి. దుబాయ్‌లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్‌లోని మార్కెట్లు, మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్‌ను విరివిగా విక్రయిస్తుంటారు. దీపావళి నాడు దుబాయ్‌లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్ ఉక్కుపాదం! -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్‌గా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
దీపావళిని ఏ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు? బెంగాల్ ప్రత్యేకత ఏమిటి?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు. పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్‌లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు. దక్షిణ భారతదేశంలో దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు. తూర్పు భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దీపావళినాడు కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?
భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు. ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ ఇజ్రాయిల్‌లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు. యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చార్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్‌బలయ్ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
బన్నీ ఉత్సవంలో అపశృతి ముగ్గురు మృతి
-
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
రావణునికి కంగన నిప్పు.. చరిత్రలో తొలిసారి!
దేశవ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్‌లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్‌లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు. లవకుశ రామ్‌లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్‌పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) ఈ వీడియోలో నటి తన తేజస్ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్‌లో రాశారు. కంగనా రనౌత్‌కి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్‌పూర్‌లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్‌కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
కులులో ఘనంగా అంతర్జాతీయ దసరా ఉత్సవాలు
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్‌లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్‌పూర్‌కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు. 14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు -
ఈ రోజే ఎందుకు విజయదశమి జరుపుకుంటున్నాం?
మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది... ఎందుకీ గందరగోళం.. విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు. శృంగేరిలో కూడా.. శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం. (చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి) -
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం.