వింటర్ సీజన్ జైపూర్ లో ఉండటానికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం పొగమంచుతో, పగలంతా ఎండ, సాయంత్రం నగరం అందించే కళలను ఆస్వాదించడానికి తగినంత చల్లగా ఉంటుంది. అందుకు తగినవిధంగానే జైపూర్ ఈ వింటర్‌లో కళ, సంస్కృతి, వారసత్వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ’కుంభ్ ఆఫ్ లిటరేచర్’గా పరిగణించబడే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో రచయితల సెషన్ కళాత్మకంగా జరుగుతుంది. ఇక జైపూర్ ఆర్ట్ వీక్‌లో ఎగ్జిబిట్‌లు, ఇన్‌స్టాలేషన్‌ల ద్వారా వర్ధమాన కళాకారుల తెలుసుకోవచ్చు.
లిటరేచర్ ఫెస్టివల్ 2025
టీమ్‌వర్క్ ఆర్ట్స్ రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, వినోదకులు, సాంస్కృతిక చిహ్నాల ఆసక్తిని పరిచయం చేస్తుంది. జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లోని ఐదు రోజుల ఉత్సవంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా వివిధ కళారూ΄ాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రాంగణంలో జైపూర్ కళాకారులు చిత్రించిన కుండలు, అప్లిక్ ఎంబ్రాయిడరీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటి తయారీ కళ, వాస్తుశిల్పం, జైఘర్, రాజస్థాన్ కోటల చరిత్ర, జైపూర్ నగర దృశ్యాలు, వారసత్వం, భారతదేశ అసంఖ్యాక చరిత్రలు, ప్రశంసలు పొందిన వక్తలు, రచయితలు, చరిత్రకారులతో కూడిన సెషన్‌లో కళలను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది.
జానపద కళా రూపాలు
ఆవాజ్ స్టూడియోచే నిర్వహించే ఆర్ట్స్, డిజైన్ ఈవెంట్ ఏఐఊఖీ. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఎదుగుతున్న అట్టడుగు నేపథ్యాలను అన్వేషించే పాటలకు ప్రసిద్ధి చెందిన ఇండీ కళాకారుడు రాహ్‌గీర్‌ను ప్రదర్శించే మూడు రోజుల పండుగ. డిసెంబర్ 20న ్ర΄ారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో రాష్ట్రంలోని జానపద కథల పరిణామం ఇక్కడ చూడచ్చు. హ్యాండ్–బ్లాక్ ప్రింటింగ్, కుండల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ల, మూడు రోజులలో రాజస్థాన్ హస్తకళల సొగసును చూడచ్చు. మాస్టర్ కల్బెలియా కళాకారులచే 500 మందికి పైగా జానపద నృత్యంలో పాల్గొంటున్నారు.
కళల ప్రదర్శన
పబ్లిక్ ఆర్ట్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PAT)చే నిర్వహించే, ఒఅగి 4.0 వారం రోజులపాటు ఆర్ట్ వీర్ జరుగుతుంది. ఆ కార్యమ్రంలో ప్రదర్శనలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం నగరంలోని వర్ధమాన కళాకారులు తమ చేయూతను అందిస్తున్నారు. దేవుళ్లు, రాక్షసులు, ఆలయ పెయింటింగ్‌లు, జానపద కథలను వీటిలో రూపొందించారు. ఆర్కిటెక్చరల్ ఆర్టిస్టుల బృందం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌ను ఆవిష్కరిస్తుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఆర్ట్ వీక్ జరుగుతుంది. వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్
Comments
Please login to add a commentAdd a comment