
ఎన్నో రకాల డైట్‌లు గురించి విని ఉంటారు. కానీ ఇదేంటీ జనరల్ మోటార్స్ డైట్..?.పేరే ఇలా ఉంది. ఆహార నియమాలు ఎలా ఉంటాయిరా బాబు అనిపిస్తోంది కదూ. కంగారు పడకండి మనం చూసే డైట్ మాదిరిగానే ఉంటుంది కానీ దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గిపోతారట. అయితే ఇది ఆరోగ్యకరమైన రీతీలోనే ఉంటుంది. కానీ ఈ డైట్ ప్లాన్ నియమాలను తుచా తప్పకుండా సరిగా అనుసరిస్తే వారంలోనే బరువు తగ్గడంలో మంచి మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది మంచేదేనా అంటే..?..
బాలీవుడ్ నటి సురభి చంద్నా తాను జనరల్ మోటార్స్ డైట్‌గా పిలిచే జీఎం డైట్‌ని ఫాలో అయ్యేదానిని అని చెబుతోంది. దీని వల్ల ఫిట్‌గా బాడీ ఉంచుకోగలిగానని అంటోంది. ఆమె బాలీవుడ్ బుల్లి తెర షో ఖుబూల్ హైలో విలక్షణమైన నటనతో మెప్పించిన నటి. నటి సురభి తనకు ఈ డైట్ అంటే మహా ఇష్టమని, ఇట్టే బరువు తగ్గిపోతామని చెబుతోంది.
ఈ డైట్‌లో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మనకిష్టమైన వాటిని తింటూ హ్యాపీగా బరువు తగ్గించే బెస్ట్ డైట్ అని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ డైట్ నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదా..?. నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ డైటీషియన్ అండ్ డయాబెటిస్ నిపుణురాలు కనిక మల్హోత్రా ఇది బరువు తగ్గేందుకు ఉపకరించే ఏడు రోజుల జీఎం డైట్ అని చెప్పారు. దీన్ని ఎఫ్‌డీఏ, యూఎస్‌డీఏ సహాకారంతో రూపొందించిన డైట్‌ని అని వాదనలు ఉన్నాయి.
అందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ డైట్ ప్రకారం నిర్థిష్ట ఆహార పదార్థాలనే తీసుకోవడం జరుగుతుంది. దానిలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లపై దృష్టి పెట్టి.. కొవ్వులు, కార్బోహైడ్రేట్లను తగ్గించడంపై దృష్టి పెడుతుంది అని మల్హోత్రా వివరించారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఆహారంలో పరిమిత కేలరీలు తీసుకోవడం అనే సూత్రంపై ఆధారంగా ఉంటుంది ఈ డైట్ ప్లాన్. ప్రతి రోజు పరిమిత పరిధిలో ఒకరకమైన ఆహారమే తీసుకోవాల్సి ఉంటుంది.
అదెలా అంటే..
మొదటి రోజు: పండ్లు మాత్రమే (అరటిపండ్లు తప్ప)
రెండో రోజు: కూరగాయలు మాత్రమే (పచ్చి లేదా వండినవి)
మూడవ రోజు: పండ్లు, కూరగాయల మిశ్రమం
నాల్గవ రోజు: అరటిపండ్లు, పాలు
ఐదో రోజు: టమోటాలు, లీన్ ప్రోటీన్లు ఉండే మాంసం (లేదా ప్రత్యామ్నాయాలు)
ఆరో రోజు: మరిన్ని కూరగాయలు, మాంసం
ఏడవ రోజు: బ్రౌన్ రైస్, పండ్ల రసాలు, కూరగాయలు
అలాగే ఈ డైట్‌ని అనుసరించేవారు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీరు తాగాల్సి ఉంటుంది. ఈ డైట్‌ని ప్రయత్నించిన వారందరూ గణనీయమైన బరువు తగ్గుతారనేది నిజమేనని అన్నారు. ఎందువల్ల అంటే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలే ఉండటంతో శరీరానికి కావల్సిన ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, కేలరీలు మాత్రం తక్కువగానే ఉంటాయి.
దీంతో సులభంగా బరువు కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ డైట్‌లో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు లేకపోవడం వల్ల ఆరోగ్యకరంగానే సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. అలాగే ఈ డైట్ వల్ల చక్కెరను తీసుకోవడం చాలామటుకు తగ్గిపోతుందని కూడా చెప్పారు.
ప్రతికూలతలు..
ఇందులో మంచి కొవ్వులు, విటమిన్ బీ12, డీ, ఇనుము, కాల్షియం వంటి పోషకాల లోపిస్తాయిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణరాలు మల్హోత్రా. కాలక్రమేణ ఈ డైట్‌ని ఫాలో అయితే విటమిన్ డెఫిషెన్సీకి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తీవ్రమైన కేలరీల పరిమితి వల్ల ఆకలి భావన ఎక్కువగా ఉంటే ప్రమాదం లేకపోలేదు.
దీర్ఘకాలికంగా ఇది అంత ఆచరణీయమైనది కాదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వుకు బదులుగా ఎక్కువగా కోల్పోయిన నీటి బరువే ఉంటుందని చెబుతున్నారు మల్హోత్రా. అయితే ఎప్పుడైన ఈ డైట్ స్కిప్ చేసి నార్మల్‌గా తినేస్తే మాత్రం ఎంత స్పీడ్‌గా అయితే బరువు తగ్గామో అంతే మాదిరి పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరగ్యో నిపుణురాలు మల్హోత్రా.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 'ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..)
Comments
Please login to add a commentAdd a comment