gm
-
జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..
ఎన్నో రకాల డైట్లు గురించి విని ఉంటారు. కానీ ఇదేంటీ జనరల్ మోటార్స్ డైట్..?.పేరే ఇలా ఉంది. ఆహార నియమాలు ఎలా ఉంటాయిరా బాబు అనిపిస్తోంది కదూ. కంగారు పడకండి మనం చూసే డైట్ మాదిరిగానే ఉంటుంది కానీ దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గిపోతారట. అయితే ఇది ఆరోగ్యకరమైన రీతీలోనే ఉంటుంది. కానీ ఈ డైట్ ప్లాన్ నియమాలను తుచా తప్పకుండా సరిగా అనుసరిస్తే వారంలోనే బరువు తగ్గడంలో మంచి మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది మంచేదేనా అంటే..?..బాలీవుడ్ నటి సురభి చంద్నా తాను జనరల్ మోటార్స్ డైట్‌గా పిలిచే జీఎం డైట్‌ని ఫాలో అయ్యేదానిని అని చెబుతోంది. దీని వల్ల ఫిట్‌గా బాడీ ఉంచుకోగలిగానని అంటోంది. ఆమె బాలీవుడ్ బుల్లి తెర షో ఖుబూల్ హైలో విలక్షణమైన నటనతో మెప్పించిన నటి. నటి సురభి తనకు ఈ డైట్ అంటే మహా ఇష్టమని, ఇట్టే బరువు తగ్గిపోతామని చెబుతోంది.ఈ డైట్లో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మనకిష్టమైన వాటిని తింటూ హ్యాపీగా బరువు తగ్గించే బెస్ట్ డైట్ అని ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఈ డైట్ నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదా..?. నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రముఖ డైటీషియన్ అండ్ డయాబెటిస్ నిపుణురాలు కనిక మల్హోత్రా ఇది బరువు తగ్గేందుకు ఉపకరించే ఏడు రోజుల జీఎం డైట్ అని చెప్పారు. దీన్ని ఎఫ్‌డీఏ, యూఎస్డీఏ సహాకారంతో రూపొందించిన డైట్‌ని అని వాదనలు ఉన్నాయి.అందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ డైట్ ప్రకారం నిర్థిష్ట ఆహార పదార్థాలనే తీసుకోవడం జరుగుతుంది. దానిలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లపై దృష్టి పెట్టి.. కొవ్వులు, కార్బోహైడ్రేట్లను తగ్గించడంపై దృష్టి పెడుతుంది అని మల్హోత్రా వివరించారు.ఎలా పనిచేస్తుందంటే..ఆహారంలో పరిమిత కేలరీలు తీసుకోవడం అనే సూత్రంపై ఆధారంగా ఉంటుంది ఈ డైట్ ప్లాన్. ప్రతి రోజు పరిమిత పరిధిలో ఒకరకమైన ఆహారమే తీసుకోవాల్సి ఉంటుంది.అదెలా అంటే..మొదటి రోజు: పండ్లు మాత్రమే (అరటిపండ్లు తప్ప)రెండో రోజు: కూరగాయలు మాత్రమే (పచ్చి లేదా వండినవి)మూడవ రోజు: పండ్లు, కూరగాయల మిశ్రమంనాల్గవ రోజు: అరటిపండ్లు, పాలుఐదో రోజు: టమోటాలు, లీన్ ప్రోటీన్లు ఉండే మాంసం (లేదా ప్రత్యామ్నాయాలు)ఆరో రోజు: మరిన్ని కూరగాయలు, మాంసంఏడవ రోజు: బ్రౌన్ రైస్, పండ్ల రసాలు, కూరగాయలుఅలాగే ఈ డైట్‌ని అనుసరించేవారు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీరు తాగాల్సి ఉంటుంది. ఈ డైట్‌ని ప్రయత్నించిన వారందరూ గణనీయమైన బరువు తగ్గుతారనేది నిజమేనని అన్నారు. ఎందువల్ల అంటే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలే ఉండటంతో శరీరానికి కావల్సిన ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, కేలరీలు మాత్రం తక్కువగానే ఉంటాయి.దీంతో సులభంగా బరువు కోల్పోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ డైట్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు లేకపోవడం వల్ల ఆరోగ్యకరంగానే సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. అలాగే ఈ డైట్ వల్ల చక్కెరను తీసుకోవడం చాలామటుకు తగ్గిపోతుందని కూడా చెప్పారు.ప్రతికూలతలు..ఇందులో మంచి కొవ్వులు, విటమిన్ బీ12, డీ, ఇనుము, కాల్షియం వంటి పోషకాల లోపిస్తాయిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణరాలు మల్హోత్రా. కాలక్రమేణ ఈ డైట్‌ని ఫాలో అయితే విటమిన్ డెఫిషెన్సీకి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తీవ్రమైన కేలరీల పరిమితి వల్ల ఆకలి భావన ఎక్కువగా ఉంటే ప్రమాదం లేకపోలేదు.దీర్ఘకాలికంగా ఇది అంత ఆచరణీయమైనది కాదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వుకు బదులుగా ఎక్కువగా కోల్పోయిన నీటి బరువే ఉంటుందని చెబుతున్నారు మల్హోత్రా. అయితే ఎప్పుడైన ఈ డైట్ స్కిప్ చేసి నార్మల్‌గా తినేస్తే మాత్రం ఎంత స్పీడ్‌గా అయితే బరువు తగ్గామో అంతే మాదిరి పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరగ్యో నిపుణురాలు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 'ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
వీడియో తీసి.. రూ.8.5 లక్షలు వసూలు
జగిత్యాల క్రైం: విలేకరినని పరిచయం చేసుకున్నాడు.. డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎర్ర యాదగిరి పరిశ్రమల శాఖ జగిత్యాల జిల్లా జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 20న విధుల్లో ఉండగా డీపీఆర్వో కార్యాలయ అటెండర్, జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌కు చెందిన బాలె జగన్ వచ్చాడు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్‌నాయక్‌ను ఓ చానల్ విలేకరని ఆయనకు పరిచయం చేశాడు.మరుసటి రోజు లోన్ కావాలని..21న సంతోష్‌నాయక్ జనరల్ మేనేజర్ యాదగిరి ఆఫీస్‌కు ఓ మహిళను తీసుకెళ్లాడు. తన బంధువని చెప్పి, సబ్సిడీపై కారు లోన్ కావాలని అడిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రూ.5 వేలను కవర్లో పెట్టి, ఆయన టేబుల్‌పై పెట్టాడు. తర్వాత రహస్యంగా వీడియో తీశాడు. అదేరోజు రాత్రి ప్రెస్ గ్రూప్‌లో పెడతామంటూ ఆ వీడియోను అధికారికి వాట్సాప్ చేసి, బెదిరించాడు. కాసేపటికి సంతోష్‌కుమార్‌కు సంబంధించిన ఒడ్డెలింగాపూర్‌కు చెందిన పాలకుర్తి రాకేశ్, లోక్యానాయక్ తండాకు చెందిన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్‌లు కారులో వచ్చి, యాదగిరిని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారుకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ కొట్టారు. దీంతో ఆయన రూ.35 వేలు ఇచ్చారు. అవి సరిపోవని చెప్పడంతో మళ్లీ రూ.35 వేలతోపాటు ఫోన్‌పే ద్వారా మరో రూ.30 వేలు ముట్ట జెప్పారు. సంతోష్‌కుమార్ 22న ఫోన్ చేసి, డబ్బులు సరిపోలేదని బెదిరించడంతో కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ ఆఫీసు వద్ద రూ.2 లక్షలు ఇచ్చారు. 23న మా చానల్ చైర్మన్ ఒప్పుకోవడం లేదనడంతో 25న కలెక్టర్ కార్యాలయ సమీపంలోని వాటర్‌ట్యాంక్ వద్ద రూ.5.50 లక్షలు అప్పగించారు. ఇలా.. నిందితులు మొత్తం రూ.8.50 లక్షలు వసూలు చేశారు.బెదిరింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు..అయినా, బెదిరింపులకు పాల్పడటంతో అనుమానం వచ్చిన జీఎం యాదగిరి 30న జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. భూక్య సంతోష్‌కుమార్, పాలకుర్తి రాకేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన బంగారం, రూ.16 వేలు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వసూలు చేసిన డబ్బులో నుంచి కొంత మొత్తం తీసి, సంతోష్‌కుమార్ తన అప్పులు కట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న తిరుపతి, గంగాధర్, జగన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. -
జతకలిసిన జీఎం, హ్యుందాయ్.. కొత్త ప్లాన్ ఇదే..
జీఎం (జనరల్ మోటార్స్) & హ్యుందాయ్ మోటార్ రెండూ కలిసి కీలకమైన రంగాలలో భవిష్యత్ ప్రణాళికలను రచించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు బ్రాండ్స్ కలిసి కొత్త శ్రేణి వాహనాలను తీసుకురానున్నట్లు సమాచారం.ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలతో సహా ప్రయాణికులకు అవసరమయ్యే వాహనాలు, కమర్షియల్ వాహనాలను జీఎం.. హ్యుందాయ్ మోటార్స్ తయారు చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రానున్న రోజుల్లో రెండు బ్రాండ్స్ కలయికతో ఏర్పడ్డ కొత్త వెహికల్స్ రూపొందుతాయని తెలుస్తోంది.ఈ ఒప్పందంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుయిసన్ చుంగ్ & జనరల్ మోటార్ చైర్మన్ అండ్ సీఈఓ మేరీ బర్రా సంతకం చేశారు. రెండు కంపెనీల మధ్య ఏర్పడ్డ భాగస్వామ్యం వాహన అభివృద్ధిని మరింత సమర్థవంతంగా చేసేలా చేస్తుందని బర్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!భారత్‌లో జనరల్ మోటార్స్1996లో జనరల్ మోటార్స్ కంపెనీ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో కార్లను నిర్మించడం ప్రారంభించింది. కొన్ని రోజులు దేశంలో సజావుగా ముందుకు సాగిన తరువాత కాలంలో కంపెనీ తన కార్యకలాపాలను దేశంలో పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ భాగస్వామ్యంతో మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. -
జీఎం ఆవాల విడుదలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) ఆవాల విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జీఎం ఆవాల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు గురువారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈలోగా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోరాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి తెలిపింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు వీలుగా జీఎం ఆవాలను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అరుణా రోడ్రిగ్స్ తన పిటిషన్లో సవాల్ చేశారు. -
జెట్ ఎయిర్వేస్ అప్- జీఎం బ్రూవరీస్ వీక్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం మార్కెట్లకు జోష్‌నిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 417 పాయింట్లు జంప్‌చేసి 40,296 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొనుగోలు రేసులో కల్రాక్- జలన్ కన్సార్షియం ముందంజలో ఉన్నట్లు వెలువడిన వార్తలు జెట్ ఎయిర్వేస్ కౌంటర్‌కు బూస్ట్‌నిచ్చాయి. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో లిక్కర్ తయారీ కంపెనీ జీఎం బ్రూవరీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జెట్ ఎయిర్వేస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎం బ్రూవరీస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ విమానయాన సేవల కంపెనీ జెట్ ఎయిర్వేస్ విక్రయానికి ఎస్బీఐ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం నిర్వహించిన బిడ్డింగ్‌లో కల్రాక్- జలన్ కన్సార్షియం ముందంజలో నిలుస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్.. బ్యాంకులకు రూ. 8,000 కోట్లకుపైగా బకాయి పడింది. మొత్తం రూ. 40,000 కోట్లవరకూ రుణాలున్నట్లు అంచనా. దీంతో జెట్ ఎయిర్వేస్ విక్రయానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బ్యాంకింగ్ కన్సార్షియం బిడ్డింగ్‌ను చేపట్టింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి కల్రాక్- జలన్ కన్సార్షియం దాఖలు చేసిన బిడ్‌కు బ్యాంకులు అత్యధికంగా ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో జెట్ ఎయిర్వేస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30.10 వద్ద ఫ్రీజయ్యింది. జీఎం బ్రూవరీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీఎం బ్రూవరీస్ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 40 శాతం తగ్గి రూ. 73 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 37 శాతం నీరసించి రూ. 15 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో జీఎం బ్రూవరీస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం పతనమై రూ. 381కు చేరింది. ప్రస్తుతం 4.4 శాతం నష్టంతో రూ. 386 వద్ద ట్రేడవుతోంది. -
రైల్వే జీఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, విజయవాడ: అమరావతి నూతన రైల్వేలైను, దక్షిణకోస్తా జోన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీలమంతా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విజ్ఞప్తి చేశామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. విజయవాడ, గుంతకల్లు, కర్నూలు, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీ ఎంపీలు మంగళవారం జీఎంతో భేటీ ఆయ్యారు. ఎంపీలు గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వంగ గీతా, రెడప్ప, శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజు, కనకమేడల రవీంద్రబాబు, సత్యవతి, దుర్గా ప్రసాదరావు, వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ డివిజన్‌లోనే వాల్తేర్ ఉండాలని ఎంపీలమంతా జీఎంకి వినతిపత్రం అందించమన్నారు. దీనికి టీడీపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. గత ఐదు ఏళ్లలో జరిగిన పనులు, రాబోయే ఐదు ఏళ్లలో ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలను చర్చించామని తెలిపారు. వాల్తేర్ లేని రైల్వే జోన్ వద్దని వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ కూడా చెప్పిందని వెల్లడించారు. దీనికి సంబంధించి పార్లమెంటులో పోరాటం చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పన, 45 కిలోమీటర్ల ‘నడికుడి రైల్వే లైన్’ పూర్తి చేయాలని.. ‘కడప-బెంగళూరు రైల్వే లైన్’ను కూడా 2023 నాటికి పూర్తి చేయాలని చర్చించామన్నారు. గూడూరు, గుంతకల్, విజయవాడ డబ్లింగ్ పనులు త్వరలో పూర్తి చేయాలని.. స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తాము ఇచ్చిన సూచనలు తీసుకుంటామని.. కోర్టు తీర్పు అనంతరం నడికుడి రైల్వేలైన్‌ను ఐదు నెలల్లో పూర్తి చేస్తామని జీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేవారికి వీలుగా అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి రైళ్లు నడపాలని కాకినాడ ఎంపీ వంగా గీత జీఎంను కోరినట్టు తెలిపారు. జగ్గయ్యపేట రైల్వే లైను గురించి చర్చించామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్ మాయమైపోతుందంటే బాధ కలిగిందని మొత్తం ఎంపీలంతా కలిసి వాల్తేరు గురించి మాట్లాడామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఒక డివిజన్‌ని తీసివేయడం ఇప్పటి వరకు దేశ చరిత్రలో జరగలేన్నారు. అనంతపురం జిల్లాకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు అనంతపురంలో ఆగేలా చూడాలని జీఎంను కోరామన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వేగవంతం చేయటం, వచ్చే రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు. కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ డివిజన్‌కు మరిన్ని కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని కోరినట్టు ఎంపీలు తెలిపారు. విజయవాడ డివిజన్ మరింతగా విస్తరించడంతో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని జీఎం దృష్టికి తీసుకువచ్చామన్నారు. దక్షిణ కోస్తాజోన్కు మరింత భూమిని, ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాలని ఎంపీలు జీఎంకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. జగ్గయ్యపేట ప్రాంతంలో గత 30 ఏళ్లుగా గూడ్స్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయని.. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైల్వే లైన్ వేసి, ప్రజల సౌకర్యం కోసం కృషి చేయాలని రైల్వే అధికారులకు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ అందజేశారు. విజయవాడ రైల్వే లైన్లలో ఇబ్బందులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు జీఎం గజానన్‌కు వివరించారు. రామవరప్పాడు, గుణదల, మధురానగర్ ప్రాంతాలలో రైల్వే లైన్ల పారిశుధ్యంపై మాట్లాడామని మల్లాది మీడియాకు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల డబ్లింగ్ త్వరగా పూర్తి చేస్తామని జీఎం హమీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే చెప్పారు. -
భారీగా పడిపోతున్న ఈ కార్ల రీసేల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జిఎం) భారతీయ కార్ల మార్కెట్ నుంచి నిష్క్రమించాలన్న ప్రకటన కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా రీసేల్ మార్కెట్ లో షెవ్రోలె కార్ల ధరలు భారీగా పడిపోయాయి. గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు పడిపోతున్నాయని, ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం భారతదేశ దేశీయ విక్రయ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రధాన ప్రకటన చేసింది జినరల్ మోటార్. దేశీయ విఫణిలో నిరంతర నష్టాలు, చిన్న మార్కెట్ వాటా (2017 ఏప్రిల్ నాటికి 0.32 శాతం) తర్వాత కంపెనీ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపదని అంచనా వేసినప్పటికీ, జీఎం బ్రాండ్ షెవ్రోలె కార్ల పునఃవిక్రయాలపై మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఎం ప్రకటించిన తరువాత రీసేల్ మార్కెట్లో 5శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే దేశీయ విక్రయాలను నిలిపి వేసినప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తామనీ కార్ల విడిభాగాలు. ఇతర సర్వీసులను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. వారెంటీలకు సంబంధించి అన్ని ఒప్పందాలను, అమ్మకాల సేవలను గౌరవిస్తామని జిఎం వినియోగదారులకు గురువారం ప్రకటించింది. అయినా వినియోగదారుల్లో ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరోవైపు ఈ సంవత్సరాంతానికి సంస్థ ఆథరైజ్డ్ సర్వీసులు విలువైన సేవల్ని అందించలేకపోవచ్చని ట్రూ బిల్ కో ఫౌండర్ సుభ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీఎం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించడం కూడా కష్టం కావచ్చని అంచనా వేశారు. ఒక సంస్థ అమ్మకాలను నిలిపివేసినపుడు సాధారణంగా సంవత్సరం కాలంలో క్రమంగా 10-15 శాతం ధరలు పతనం నమోదవుతుందని అయితే జీఎం కార్ల విషయంలో ఇప్పటికే 5 శాతం పతనం నమోదైందని తెలిపారు. కాగా డిసెంబర్31, 2017 నుంచి విక్రయాలు ముగియనున్నాయని జీఎం ఇండియా ఎండీ కహర్ కజిమ్ ప్రకటించారు. అయితే, అమ్మకాల సేవలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని స్థానిక వాటాదారుల మద్దతు కొనసాగిస్తామనిచ భారతదేశంలో విక్రయించిన జీఎం కార్ల భాగాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కజీమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జీఎం బీట్, స్పార్క్, సెయిల్(సెడాన్) క్రూయిజ్, ఎంజాయ్, తవేరా, ట్రయిల్ బ్లేజర్లతో సహా ఏడు మోడళ్లను విక్రయిస్తుంది.మోడళ్లను విక్రయిస్తోంది -
రైల్వే జీఎం ‘రాచరిక’ పర్యటన
– కర్నూలు సిటీ స్టేషన్‌ను తనిఖీ చేసిన వినోద్ కుమార్ యాదవ్ – రాచరిక పాలన తరహాలో గొడుగులు పట్టిన అధికారులు – పోలీసుల అత్యుత్సాం.. ఫొటోగ్రాఫర్ల తోసివేత కర్నూలు (రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్ కుమార్ యాదవ్ కర్నూలు పర్యటన రాచరిక పాలనను తలపించింది. అధికారులు, పోలీసులు ఆయనకు దాసోహమై తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు ఉదయం ఉదయం 10:05 గంటలకు ప్రత్యేక రైలులో ఇక్కడికి చేరుకున్నారు. వచ్చినప్పటి నుంచి తిరిగి ఆయన వెళ్లే వరకు స్థానిక అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఆద్యంతం హడావిడి చేశారు. ఆయన రైలు దిగిన వెంటనే రోప్ పార్టీ పోలీసులు తాడుతో చుట్టూ వలయం వేశారు. అక్కడి నుంచి ఇంజినీరింగ్ విభాగ ఎగ్జిబిషన్‌ను తిలకించి ఉద్యోగుల కోసం కొత్తగా రూ.15లక్షలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వెళ్తున్న ఆయనకు పెద్ద పెద్ద గొడుగులు పట్టారు. దేశ ప్రధానమంత్రే ఎండలకు రోడ్లపై తిరుగుతుంటే జీఎంకు యువరాజులాగా గొడుగులు పట్టడం పట్ల ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని ప్రకారం ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. అయినప్పటికీ ఆర్ఓ వాటర్ ప్లాంట్‌తోపాటు పవర్ జనరేటర్, సీనియన్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) కార్యాలయాన్ని, టైప్–4 స్టాఫ్ క్వార్టర్స్‌ను, పార్క్‌ను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని మేధావులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. మీడియాకు అవమానం కర్నూలు రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ పర్యటనలో మీడియాకు అవమానం జరిగింది. స్థానిక రైల్వే, జిల్లా సమాచార శాఖ అధికారులు ఆహ్వానం మేరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లు జీఎం పర్యటన కార్యక్రమాలను కవరేజీ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఆర్పీఎఫ్ పోలీసులు, రోప్ పార్టీ అడుగడుగునా అడ్డుకున్నారు. ఫోటోలు, విజువల్స్ తీసుకునేందుకు యత్నించే ప్రతినిధులు పక్కకు జరుపుకుంటూ వెళ్లారు. చివరకు కార్యక్రమం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో నిరీక్షించారు. అయితే ముందుగా అక్కడికి వచ్చిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో వీఐపీ లాంజ్ నుంచి బయటకు పంపారు. అక్కడ జీఎంను కలిసిన ప్రజా ప్రతినిధుల ఫొటోలు తీసేందుకు యత్నించిన ఫోటో గ్రాఫర్లును ఆర్పీఎఫ్ పోలీసులు పక్కకు తోసేశారు. కిందపడబోయిన వారిని ఇతరులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు తమను పిలిచి అవమానిస్తారా అంటూ నిలదీశారు. దీనిపై డీఆర్ఎం అరుణా సింగ్ సమాధానం ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి జీఎంతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. కర్నూలు రైల్వే స్టేషన్‌కు రూ.9వేలు, రైల్వే ఆస్పత్రికి రూ.5వేలు నగదు నజరానాను జీఎం ప్రకటించారు. -
28న రైల్వే జీఎం కర్నూలు రాక?
కర్నూలు(రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్‌కుమార్ యాదవ్ ఈనెల 28వ తేదీన కర్నూలకు రానున్నట్లు సమాచారం. గత 20 రోజుల క్రితమే పర్యటన తేదీ ఖరారు కావడంతో స్థానిక అధికారులు అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. అయితే పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రొగ్రాం వివరాలు ఏవీ రాలేదని సిటీ రైల్వే స్టేషన్ మేనేజరు మక్బూల్ హుసేన్ తెలిపారు. కాగా ప్రస్తుతం హైదరాబదు డివిజన్ డీఆర్ఎంగా పనిచేస్తున్న అరుణా సింగ్‌కు ఇటీవలే స్థాన చలనం కలిగించినా ఎవరినీ నియమించలేదు. 28వ తేదీలోపు ఎవరినైనా నియమిస్తే పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కూడా వాయిదా పడోచ్చని అధికారులు చర్చించుకుంటున్నారు. -
గేట్ తెరిపించాలని రైల్వేజీఎంకు వినతి
ఆలేరు : ఆలేరులో రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ మే తెరిపించాలని కోరుతూ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు బుధవారం దక్షిణ మ«ధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జీఎం హామీ ఇచ్చారన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) ఏర్పాటుకు, ఆర్యుబీ ఏర్పాటయ్యే వరకు రైల్వేగేట్ తెరిపేంచేందుకు రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఇన్చార్జ్ సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఎండి జైనొద్దీన్, తునికి దశరథl, మొరిగాడి చంద్రశేఖర్, దానియల్, గంపల విజయ్, గుత్తా శమంతారెడ్డి తదితరులు ఉన్నారు. -
అధికారులతో జీఎం సమీక్ష
సెంటినరీకాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్లోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో ఆర్జీ–3 జీఎం ఎంఎస్.వెంకట్రామయ్య అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్న సీఅండ్ఎండీ శ్రీధర్ బొగ్గు ఉత్పత్తి తగ్గడంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థలో ఉత్పత్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటూనే రక్షణకు ప్రాదాన్యత ఇచ్చి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి వృథా వ్యయాలు ఆపడానికి ప్రతి ఒక్కరూ పాటుపడి సంస్థను లాభాల బాటలో నిలుపాలన్నారు. అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పని చేసి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి సంస్థ మనుగడలో భాగస్వాములు కావాలని సంస్థ లాభాల్లో పయనించిన నాడే మనకు సంస్థకు అన్ని విధాలా శ్రేయస్కరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓసీపీ–1,2 పీవోలు శ్రీనివాసరావు, వీరస్వామి, ఎస్వో–2 జీఎం పి. శ్రీనివాస్, ఏరియ ఇంజనీర్ వైజీకే మూర్తి, పర్సనల్ మేనేజర్ సాల్మన్‌రాజ్, డీజీఎం ఐఈడీ సీÜహెచ్.వెంకయ్య, డీజీఎం సివిల్ నాగేశ్వర్రావు, డీజీఎం ఫైనాన్స్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ద.మ.రైల్వే సీసీఎంగా గణేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పి.గణేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1983 ఐఆర్టీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన.. వివిధ కేడర్లలో విధులు నిర్వహించారు. హుబ్లీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయనను దక్షిణ మధ్య రైల్వేకు బదిలీ చేశారు. మైసూరు, తిరుచిరాపల్లి, మధురై, పాల్ఘాట్, చెన్నై తదితర ప్రాంతాల్లో పని చేశారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ కలిగిన ఆయన.. గతంలో దక్షిణ మధ్య రైల్వే ఆంధ్ర లలిత కళాసమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. -
ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ