న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) ఆవాల విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జీఎం ఆవాల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు గురువారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈలోగా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోరాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి తెలిపింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు వీలుగా జీఎం ఆవాలను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అరుణా రోడ్రిగ్స్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment