Stay
-
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
‘సుప్రీం’లో ఆప్ సర్కార్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట
బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాస్త ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతోపాటు మరికొందరిపై నమోదైన కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు తమపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు. -
జపాన్ వనితలా స్లిమ్‌గా ఉండాలంటే..! ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రస్తుతం మనదేశంలో చాలమంది టీనేజర్లు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు అధిక బరువు సమస్యతో బాధపుతున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అమ్మాయిలు బొమ్మల్లా, భలే అందంగా ఉంటారు. పెళ్లి అయ్యిందో లేదో కూడా చెప్పలేం అంత స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. మరీ వాళ్లు అంతలా ఉండేందుకు గల ఫిటెనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఏం చేయాలంటే..జపాన్ వాళ్లు నాజుగ్గా ఉండేందకు కఠినమైన ఆహార నియమావళిని ఫాలో అవుతారట. ఇది వారికి ఆరోగ్యంగా ఉండేదుకే గాక దీర్ఘాయువుతో ఉండటానికి ఉపయోగపడుతుందట. వాళ్లు కడుపు నిండుగా అస్సలు తినరట. భోజనం చేసేటప్పుడు ఉదర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తింటారట. కేలం 80 శాతమే తిని మిగతా భాగం సాఫీగా అరిగిపోయేందుక వీలుగా ఖాళీగా ఉంచుతారట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండువు, బానపొట్టలా రాదు కూడా. అలాగే వాళ్లు ఫుడ్ ప్లేట్లు చిన్నవే ఎంచుకుంటారట. ఇలా చేస్తే ఆహారం ప్లేటు నిండుగా ఉన్న ఫీల్ తోపాటు ఎక్కువ తింటున్నాం అనే అనుభుతి కలగడంతో తక్కువగానే తింటామని వారి నమ్మకం. అలాగే రెండోసారి వేసుకుని తినడానికి ఆలోచిస్తారట. నచ్చిందని గమ్మున వేసుకుని తినేయరట. అదీగాక భోజనం చేసేటప్పుడూ మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూస్తు అస్సలు తినరు. భోజనంపై ధ్యాస ఉంచి తినడానికి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమిలినమిలి మైండ్‌ఫుల్‌నెస్‌తో తింటారట. ఇలా చేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమవ్వడమే గాక అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొనరు. పైగా నాజుగ్గా అందంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరీ..!.(చదవండి: 'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!) -
తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.కాగా, తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు.కోర్టు కేసులు, స్టే ఆర్డర్లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని నాగార్జున అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ హాల్ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
TG: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
Supreme Court: ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
బెయిల్ నిలిపివేతపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ (ఈడీ)కేసులో తనకు ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ మీద హైకోర్టు స్టే ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ ఆదివారం(జూన్23) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సోమవారం(జులై24) ఉదయమే పిటిషన్‌ను విచారించాలని కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్20న ఈ కేసులో ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌పై 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణ చేపట్టి అదే రోజు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తుది తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ లోపే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కే జ్రీవాల్‌ను ఈడీ ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేసింది. అనంతరం ఆయనకు లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొడిగించాలని తిరిగి కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించింది. వెంటనే కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు తీర్పు రిజర్వు చేయడంతో ఆయన తిరిగి తీహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది.తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ వేయడంతో హై కోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే ఇచ్చింది. -
కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. రిలీజ్‌పై స్టే
న్యూఢిల్లీ, సాక్షి: న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఆయన రెగ్యులర్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీంతో కాసేపట్లో జైలు నుంచి విడుదల కావాల్సిన ఆయన.. బయటకు రాకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరింది. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తాము విచారణ జరిపేంతవరకు కేజ్రీవాల్ రిలీజ్‌ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.లిక్కర్ కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్న పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు గురువారం సాయంత్రం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్ బిందు ఆదేశించింది. అలాగే.. తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.ఈ క్రమంలో.. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌పై ఆంక్షలు విధించింది ట్రయల్ కోర్టు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే ఈ ఉదయం కేజ్రీవాల్ విడుదల నేపథ్యంలో.. నీటి సంక్షోభంపై పోరాటం చేద్దామని ఉత్సాహంతో ఉన్న ఆప్ శ్రేణులకు ఆయన రిలీజ్‌పై స్టే ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా ఢీలా పడిపోయింది.ఈడీ వాదనల్ని పట్టించుకోని కోర్టుకేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. 2021 నవంబరు 7న కేజ్రీవాల్ గోవాలోని గ్రాండ్హయత్ హోటల్లో బస చేసినప్పుడు ఆయన తరఫున రూ.లక్ష బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్ సింగ్ కూడా సహ నిందితుడేనని తెలిపింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది.ఇక.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని, కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ట్రయల్‌కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. -
సుప్రీం కోర్టులో ‘నీట్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కొనసాగుతున్న వేళ.. కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ క్రమంలో దాఖలైన ఓ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతేకాదు.. నీట్ అవకతవకలను సీబీఐతో విచారణ చేయించాలని సదరు పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ అభ్యర్థనలకు కోర్టు నిరాకరించింది. ఇంకోవైపు ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే కూడా నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ ఇంతకు ముందు ఓ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది.ఇక.. వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA).. 1,563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది. అంతేకాదు.. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చూస్తామని తెలిపింది. దీంతో.. వాళ్లకు ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించన్నారు. ఆ ఫలితాలను 30న వెల్లడించి.. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా జులై 6వ తేదీనే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేసుకుంటోంది. -
‘శారదా మార్కెట్’ స్వాదీనంపై హైకోర్టు స్టే
నెహ్రూనగర్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కొల్లి శారదా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో ఉన్న షాపుల లీజు కాలపరిమితి ముగియడంతో గత కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు షాపుల స్వా«దీనానికి నోటీసులిచ్చారు. దీని విషయమై లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది. 13వ తేదీలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని పేర్కొంది. కొల్లి శారదా మార్కెట్లో 1999లో 88 షాపులు నిర్మించారు. 25 ఏళ్ల లీజుతో షాపులను లీజుదారులకు అప్పగించారు. ఇటీవల గడువు ముగియడంతో వాటి స్వా«దీనానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆ షాపులను కాపాడుకునేందుకు లీజుదారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం బస్టాండ్ దగ్గరలో ఉండటం.. అదీగాక హోల్‌సేల్ మార్కెట్ కావడంతో రైతుల క్రయ, విక్రయాలు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ రోజుకు కొన్ని రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, కొంత మంది రెవెన్యూ అధికారులే లీజు దారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అడ్డదారిలో షాపుల నిర్వహణకు సంబంధించి లూప్ హోల్స్ చెప్పి.. ఆ షాపులను నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. -
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
సాక్షి, గుంటూరు: APPSC (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. 2018 గ్రూప్ వన్ కింద 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది. దీంతో.. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. న్యాయస్థానం బెంచ్‌లో సభ్యులైన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగానే దానికి నానా వక్రభాష్యాలు జోడించి తప్పుడు ప్రచారానికి దిగింది తెలుగుదేశం, జనసేన. APPSCమీద వచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఓ ఎలక్ట్రానిక్ బోర్డు, దాంట్లో నాలుగు గ్రాఫిక్స్ పెట్టుకుని చంద్రబాబు నానా హంగామా చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో సదరు అసత్య ప్రచారాలకు ఫుల్స్టాప్ పడ్డట్టయింది. -
‘సీఏఏ’పై వందల పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరింది. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు సీఏఏపై సుప్రీంకు వెళ్లారు. ఇదీ చదవండి.. బాండ్ల నంబర్లేవి -
తిండి లేక అలమటిస్తున్న పాలస్తీనియన్లు!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలు గాజా సరిహద్దులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజాలో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తిండి గింజలు కరువై, ప్రాణాలు నిలుపుకునేందుకు కలుపుమొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ అల్ జజీరా పేర్కొంది గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపును కూడా నింపుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని అల్ జజీరా కరస్పాండెంట్ తారెక్ అబూ అజౌమ్ తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుండి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన క్వేకర్ సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రటరీ జాయిస్ అజ్లౌనీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. గాజాలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని తమ సిబ్బంది చెబుతున్నారని జాయిస్ అజ్లౌనీ పేర్కొన్నారు. -
Calcutta High Court: జడ్జి వర్సెస్ జడ్జి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
కలకత్తా: పశ్చిమ బెంగాల్ హైకోర్టులో రెండు బెంచ్‌ల మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. మెడికల్ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హై కోర్టులోని సింగిల్ జడ్జి బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశించగా అలాంటిదేమీ అవసరం లేదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. డివిజన్ బెంచ్ నిర్ణయంపై మళ్లీ సింగిల్ జడ్జి బెంచ్ జోక్యం చేసుకుని డివిజన్ బెంచ్ నిర్ణయం అక్రమం, చట్ట విరుద్ధం అని పేర్కొంది. దీంతో ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును శనివారం(జనవరి 27) విచారించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని రెండు బెంచ్‌ల ముందు నడుస్తున్న మొత్తం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారం(జనవరి 29)కి వాయిదా వేసింది. ఇదీచదవండి..నితీశ్ సర్కారు కీలక నిర్ణయం -
ఎస్ఐ రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై స్టే
సాక్షి, అమరావతి: ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెల్లడించవద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని కూడా ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఎస్ఐ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతలను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆరుగొళ్లు దుర్గాప్రసాద్‌తో పాటు మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిక్రూట్మెంట్కు సంబంధించి అక్టోబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఓ అనుబంధ పిటిషన్ కూడా వేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్.వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. ఎత్తు, ఛాతి చుట్టుకొలతను కొలిచేందుకు అధికారులు డిజిటల్ విధానాన్ని అవలంభించడంతో కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. విచారణ జరిపిన హైకోర్టు మాన్యువల్ విధానంలో అభ్యర్థుల ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలవాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మాన్యువల్‌గా ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలిచారని చెప్పారు. కానీ, గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులను ఈసారి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. 2018లో కొలిచిన వివరాలను, తాజాగా కొలిచిన వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 2018లో 169.1 సెంటీమీటర్లు ఉన్న ఎత్తు, ఇప్పుడు 167.6 సెంటీమీటర్లకు ఎలా తగ్గిందని రిక్రూట్మెంట్ బోర్డును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. -
అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం
సాక్షి, న్యూఢిల్లీ: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాల (టీవోఆర్)ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 6న కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాలపై తదుపరి చర్యలు లేకుండా నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. జల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం జల వివాదాల ట్రిబ్యునల్‌కే ఉందని, ఏపీ ప్రభుత్వం పిటిషన్లో లేవనెత్తిన అంశాలు ఆర్టికల్ 262 పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్టికల్ 32 కింద కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం పిటిషన్ దాఖలు చేయాల్సిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. పిటిషన్‌కు మెయింటైన్‌బిలిటీ లేదంటూ అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాథమిక అభ్యంతరాలను కౌంటర్ అఫిడవిట్లో పేర్కొనాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ న్యాయవాది మెరిట్స్‌లోకి వెళ్తున్నారని, ఆ అవసరం లేదని, ట్రిబ్యునల్ టీవోఆర్‌పై స్టే విధించాలని కోరారు. ఈ సమయంలో కేంద్రం తరఫు న్యాయవాది వారం రోజులు గడువు ఇస్తే అభిప్రాయం చెబుతామని ధర్మాసనాన్ని కోరారు. మెరిట్స్‌పై వాదించడానికి సిద్ధంగా ఉన్నామని, స్టే విధించొద్దని వైద్యనాథన్ కోరగా.. అయితే తాము కూడా మెరిట్స్‌పై వాదనకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ, కేంద్రం కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ కార్యకలాపాలు కొనసాగడం అనేది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ట్రిబ్యునల్ ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ నెల 29న చేపడతామని ధర్మాసనం పేర్కొంది. -
అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!
దళపతి విజయ్ లియో మూవీ విడుదలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిర్మాతలకు చుక్కెదురైంది. తాజాగా తెలుగు వర్షన్ అయినా బెనిఫిట్ షోలు చూడొచ్చని భావించిన అభిమానులకు మరో షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇది చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) లియో తెలుగు వర్షన్ ఈనెల 19న విడుదల చేయవద్దంటూ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. లియో టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. డి స్టూడియోస్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు విడుదల చేయవద్దని ఆదేశాలిచ్చింది. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్! ఈ నిర్ణయంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమిళంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలుగులోనైనా మార్నింగ్ షోలు చూడొచ్చని అభిమానులు భావించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లో లియోకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!) -
TS: టీచర్ల బదిలీలపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలపై ఈ నెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్మోషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పదోన్నతుల తర్వాత బదిలీలు చేయాలంటూ న్యాయవాది బాలకిషన్ వాదనలు వినిపించారు. చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. -
అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై... ఈ నెల 19 వరకు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. డీఈవో, డీఎస్ఈతో పాటు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అధికారులు ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ టి.శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని, కేడర్‌ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారు. దీనిపై పిటిషనర్ల అభ్యంతరాలకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అయితే తుది సీనియారిటీ జాబితాను జారీ చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. లంచ్‌మోషన్‌లో పిటిషన్ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈనెల 19 వరకు సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ, అప్పటివరకు బదిలీలు, పదోన్నతులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. -
మళ్లీ మొదటికి.. నేడు జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే
చండీగఢ్: అడ్డంకులు తొలగి ఎన్నికలకు సిద్ధమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు పంజాబ్ –హరియాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. తద్వారా వివాదాస్పద సమాఖ్య మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. నేడు ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నిక కావాల్సి ఉండగా... హైకోర్టు ఓ రోజు ముందే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హరియాణా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘానికి ఓటేసే హక్కు ఇవ్వడం పట్ల హరియాణా రెజ్లింగ్ సంఘం హైకోర్టులో పిటిషన్ వేయడంతో... శుక్రవారం విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఎన్నికలు నిర్వహించరాదని స్టే విధించింది. బ్రిజ్‌భూషణ్‌కు ఎదురుదెబ్బ! భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌పై కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కీలక సాక్ష్యాధారాలను ఢిల్లీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్‌కు తెలపడంతో ఆయన విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. -
ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..!
భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్‌లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?.. నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు. అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది. -
పారని బాబు, నారాయణ పాచిక
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో భాగమైన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులైన మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయనకు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి నారాయణ ఏదో జరిగిపోతోందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి వినతి మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత వారి పిటిషన్లపై విచారణ సాగకుండా వారే శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్టే పొడిగింపు ఉత్తర్వులూ పొందుతున్నారు. హైకోర్టులో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. తాజాగా గురువారం ఇదే రీతిలో విచారణను సుదీర్ఘ కాలానికి వాయిదా వేయించేందుకు వారి న్యాయవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. కోర్టులో వారి ఎత్తులను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. న్యాయస్థానానికి సైతం వారి ఎత్తుగడలు అర్థమయ్యాయి. దీంతో వచ్చే గురువారానికి మాత్రమే విచారణను వాయిదా వేయించుకోగలిగారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టే పొంది వాయిదాల మీద వాయిదాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2021లో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలంటూ బాబు, నారాయణ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2021 మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ వాయిదా పడుతోంది. ఆ తరువాత ఈ వ్యాజ్యాలు ఓ న్యాయమూర్తి వద్ద విచారణకు రాగా, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే కొనసాగుతుందంటూ ఉత్తర్వులు పొందారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. చంద్రబాబు, నారాయణ తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మరోసారి సుదీర్ఘ వాయిదాకు వారి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. బాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు నోటీసు అందలేదని, అందువల్ల విచారణ జరపడం సరికాదని అన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించిన కోర్టు అధికారి.. నోటీసు ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని మరోసారి రికార్డులు చూడాలని కోరారు. మరోసారి రికార్డులను పరిశీలించగా, రామకృష్ణారెడ్డికి 2021లోనే నోటీసులు పంపినట్లు ఉన్న ఉత్తర్వుల కాపీ దొరికింది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు, నారాయణ న్యాయవాదులు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి సుధాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. నోటీసులు అందలేదన్న సాకుతో వాయిదా వేయించాలని చూశారన్నారు. వాదనలు వినిపించేందుకు సిద్ధమని చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఎందుకు వాయిదా కోరుతున్నారని, ఇది టూ మచ్ అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఇప్పటికే విచారణను ఎన్నోసార్లు వాయిదా వేయించారని చెప్పారు. వాళ్లే చాలాసార్లు వాయిదా తీసుకున్నారని దమ్మాలపాటి అనగా, ఎవరు ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నారో తేల్చేందుకు తాను ఇక్కడ లేనని న్యాయమూర్తి కరాఖండిగా చెప్పారు. సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బుధవారం మరో కేసు ఉన్నందున విచారణను గురువారానికి కోరతామని దమ్మాలపాటి చెప్పడంతో తాను అంగీకరించినట్లు తెలిపారు. గురువారం కూడా వాయిదా కోరడంలో అర్థం లేదన్నారు. తమ ఎత్తుగడ ఫలించదని బాబు, నారాయణ న్యాయవాదులకు అర్థమవడంతో తాము సుదీర్ఘ వాయిదా కోరడం లేదని దమ్మాలపాటి చెప్పారు. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ బుధవారానికి మొగ్గు చూపగా, దమ్మాలపాటి పదే పదే అభ్యర్థించడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు. పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్‌ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు. పరువు తీయడం కాంగ్రెస్‌కు అలవాటే: బీజేపీ గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్‌కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
గోద్రా అల్లర్ల కేసు: తీస్తా షెతల్వాద్‌కు ఊరట
అహ్మదాబాద్: గుజరాత్లో 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాద్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశిస్తూ శనివారం గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. తొలుత తీస్తా షెతల్వాద్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారంటూ నమోదైన కేసుపై శనివారం జస్టిస్ నిర్జర్ దేశాయ్ విచారణ జరిపారు. ఈ కేసులో తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని విన్నవిస్తూ షెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 30 రోజుల పాటు స్టే ఇవ్వాలన్న షెతల్వాద్ తరఫు లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు. దీంతో ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట ద్విసభ్య వెకేషన్ ధర్మాసనం విచారణ జరిపింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెతల్వాద్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ బీఆర్ గావై, జసిŠట్స్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ హైకోర్టు ఉత్తర్వుపై వారం రోజులపాటు స్టే విధించింది. -
నిలిచిపోతున్న ‘సిప్’ ఖాతాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (సిప్)లు కొన్ని నిలిచిపోతున్నాయి. మార్కెట్లు స్థిరంగా ర్యాలీ చేస్తున్నప్పటికీ మే నెలలో సిప్ ద్వారా పెట్టుబడులను నిలిపివేసిన ఖాతాల సంఖ్య 14.19 లక్షలకు చేరింది. ఏప్రిల్ చివరికి ఉన్న 13.21 లక్షల ఖాతాలతో పోలిస్తే 7.4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మే నెలలో రికార్డు స్థాయిలో రూ.14,749 కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఈ సాధనాన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మే నెలలో నూతన సిప్ ఖాతాల నమోదు 24.7 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇది 19.56 లక్షలుగా ఉండడం గమనార్హం. నిలిచిపోయిన సిప్ ఖాతాలతో పోలిస్తే కొత్తగా నమోదైన సిప్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఈ మార్గం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తిని తెలియజేస్తోందని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ ఎండీ డీపీ సింగ్ పేర్కొన్నారు. సిప్‌లను సులభంగా ఆన్లైన్లో రద్దు చేసుకునే సదుపాయం ఉండడం కూడా ఒక కారణమన్నారు. సిప్ ఆస్తులు రూ.7.53 లక్షల కోట్లు మరోవైపు మే నెలలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడుల పెట్టడంతో మొత్తం సిప్ ఆస్తుల విలువ ఏప్రిల్ చివరికి ఉన్న రూ.7.17 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.7.53 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 1.43 కోట్ల సిప్ ఖాతాలు నిలిచిపోవడం లేదా గడువు తీరిపోవడం జరిగింది. 2021–22లో ఇలాంటి ఖాతాలు 1.11 కోట్లుగా ఉన్నాయి. ఇక మే చివరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ 4.5 శాతం వృద్ధితో రూ.16.56 లక్షల కోట్లకు చేరింది. -
బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే!
ఫైవ్ స్టార్ హోటల్ అంటేనే విలాసవంతమైన వసతులకు కేరాఫ్ అడ్రస్. విశాలమైన గదులు, హై క్లాస్ ఫుడ్, కళ్లు చెదిరే స్మిమ్మింగ్ ఫుల్ ఇలా ప్రతి ఒక్కటి లగ్జరీస్‌గా ఉంటాయి. సామన్యులు ఈ హోటల్లో ఉండటం ఎంతో ఖరీదైన వ్యవహారం. ఒక్క రోజు ఇక్కడ బస చేయాలన్న లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి దాదాపు రెండేళ్లుగా ఫైవ్ స్టార్ హోటల్లోనే గడిపాడు. అది కూడా బిల్లు చెల్లించకుండ.. వినడానికి కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎరోసిటీలో రోసేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అయితే ఆ హోటల్ సిబ్బందితో కుమ్మక్కై రెండేళ్లపాటు ఓ వ్యక్తి ఎలాంటి బిల్లు కట్టకుండా ఉండటంతో రూ. 58 లక్షల నష్టం వాటిల్లిందని సదరు హోటల్ యాజమాని వినోద్ మల్హోత్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అంకుశ్ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న ఒకరోజు నిమిత్తం హోటల్లో దిగాడు. మరుసటి రోజు ఖాళీ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ఆయన 2021 జనవరి 22 వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. మొత్తం 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకోవడంతో అతను హోటల్‌కు రూ.58 లక్షలు బకాయిపడ్డాడు. ఆడిట్లో రికార్డుల తనిఖీల సందర్భంగా ఇటీవల ఈ మోసం బయటపడింది.హోటల్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా 72 గంటలకు పైగా ఉంటే. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్ సీఈఓ, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి అధికారులకు తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. చదవండి: ఇదేంటండీ..! ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేస్తారా..? అయితే హోటల్ సిబ్బంది కొంతమంది అంకుశ్ దత్తాకు సహకరించినట్లు హోటల్ ప్రతినిధి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్, మరి కొందరు కలిసి హోటల్ గదులను యాక్సెస్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను మార్చి, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. హోటల్ నిబంధలు ఉల్లంఘించి దత్తాను హోటల్లో బస చేయించాడని ఆరోపించారు. దీనికి ప్రకాష్, దత్తా నుంచి కొంత మొత్తంలో నగదు పొంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం మొత్తంలో ప్రేమ్ ప్రకాష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రకాష్ మే 30 2019 నుంచి అక్టోబరు 25 2019 వరకు ఎలాంటి పేమెంట్ రిపోర్ట్లు చేయలేదని అయితే అక్టోబరు 25 తర్వాత అతను దత్త బాకీ ఉన్న పేమెంట్ రిపోర్ట్‌ను రూపొందించినప్పుడు కావాలనే ఇతర పెండింగ్ బిల్లులతో కలిపి రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బిల్లులను ఫోర్జరీ చేసి నిందితుడికి అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను సృష్టించినట్లు చెప్పారు. అయితే దత్తా మూడు వేర్వేరు తేదీల్లో మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, అవి బౌన్స్ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా ప్రకాశ్ దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. -
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 వాయిదా పిటిషన్‌పై కోర్టుకు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. 36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు పణంగా పెట్టగలమా అన్న ఏజీ.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈలోపు పరీక్ష వాయిదా కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టుకెక్కడం గమనార్హం. -
జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి.. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన ఆకారం ‘శివలింగం’ అని పేర్కొంటూ హిందూ ఆరాధకులు, శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కార్బన్ డేటింగ్(వయసు నిర్ధారణ కోసం) సహా సైంటిఫిక్‌సర్వేకు పురావస్తు శాఖకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో ‘శివలింగం’గా పేర్కొంటున్న ఆకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీద్ ప్యానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. హైకోర్టు తీర్పుతో విభేదించింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు వద్దు. కాబట్టి శాస్త్రీయ సర్వేను వాయిదా వేద్దాం’’ అని మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. ఇక ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మాత్రం తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: థ్యాంక్యూ ఇండియా.. సాయంపై చైనా మెసేజ్ -
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణపై హైకోర్టు స్టే
-
లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!
సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్ఆర్ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కోర్టు ఉత్తర్వులు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్‌మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది. చదవండి: రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ -
కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఖమ్మంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ గురువారం హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రారంభింపజేయాలని భావించిన మంత్రి పువ్వాడ అజయ్.. ఆయనకు ఆహ్వానం సైతం అందించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అసలు వివాదం మొదలైంది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపైనా హిందూ సంఘాలతో పాటు పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓవైపు.. కాదని విగ్రహాన్ని ప్రారంభిస్తే కూలుస్తామంటూ భారత యాదవ సంఘం నేతలు హెచ్చరికలు సైతం జారీ చేశారు. మరోవైపు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లకుగానూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకుంది. ఇంకోవైపు.. ఈలోపు ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని అయినా పెట్టుకోండి లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అయినా పెట్టుకోండి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దు. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలి అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం.. తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉంది. -
ఆర్-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కూల్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. దీంతో అప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బెంగాల్ పోలీసులు.. సీబీఐ, ఈడీ అధికారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సీజేఐ జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఫలితంగా టీఎంసీ సర్కార్‌కు ఊరట లభించినట్లయింది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీ, మాణిక్ భట్టాచార్యలను ఇదివరకే అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహాను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ స్కాంతో అభిషేక్ బెనర్జీకి కూడా సంబంధంముందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు.. -
సుప్రీంకోర్టులో కవితకు షాక్.. ఈడీ నోటీసులపై స్టేకు నిరాకరణ..
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా.. నిరాశ ఎదురైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చదవండి: అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా? మోదీ తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారు.. -
తెలంగాణ: టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఝలక్ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలపై నెలపాటు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగ దంపతులు, గుర్తింపు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధించిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
జీవో నెంబర్-1: హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
సాక్షి, ఢిల్లీ: జీవో నెంబర్-1పై ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఏపీ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ఈనెల 23 వరకు జీవో నెం.1 పై హైకోర్టు తాత్కాలిక స్టే
-
Supreme Court: వాళ్లంతా మనుషులు.. రాత్రికి రాత్రే ఖాళీ చేయించటమేంటి?
న్యూఢిల్లీ: ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4వేల ఇళ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వేలాది మందిని రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కూల్చివేతలతో ప్రభావితమయ్యే ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని అభిప్రాయపడింది. కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వారు ఉంటున్న ప్రాంతంలో రైల్వేకు చెందిన భూమి, ప్రభుత్వానికి చెందిన భూమిపై ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు. ఇక్కడ మానవతా కోణం దాగి ఉంది. వారంతా మనుషులు. ఏదో ఒకటి జరగాలి. వారికి ఏదో విధంగా న్యాయం అందాలి.’అని పేర్కొంది ధర్మాసనం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. నిరాశ్రయులవుతున్న వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. హల్ద్వానీలోని 29 ఎకరాల భూమిలో ఆక్రమణలను కూల్చివేయాలని డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. తొలగింపులను ఆపాలని నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. క్యాండిల్ మార్చ్‌లు, ధర్నాలు చేశారు. ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా! -
కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఊరట
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఊరట లభించింది. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఈఓ ధర్మారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు ఏమిటి? టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రోగ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011లో జారీ చేసిన టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తమను ప్రోగ్రాం అసిస్టెంట్లుగా తమ స్వర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశించాలని కొమ్ము బాబు, రామావత్ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు పిటిషన్ దాఖలు చేశారు. క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదని పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ 16న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్.. టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి నెలరోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ధర్మాసనం స్టే విధించటంతో ఊరట లభించింది. ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మారెడ్డి అప్పీల్ -
సన్నీ లియోన్ కేసు విచారణపై కేరళ హైకోర్టు స్టే
కొచ్చి: బాలివుడ్ నటి సన్నీ లియోన్‌కి కోజికోడ్‌లో ఒక స్టేజ్ షోకి సంబంధించిన కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆమెపై నాలుగేళ్ల క్రితం కోజికోడ్‌లో స్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌కి ఒప్పందం విషయమై నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సన్నీ లియోన్‌పై కోజికోడ్‌లో రంగస్థల ప్రదర్శన కోసం ఒక సంస్థలో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లఘించారంటూ కార్యక్రమ నిర్వహకుడు షియాస్ కుంజుమహమ్మద్ నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే సన్నీ లియోన్ తనపై దాఖలైన ఎఫ్ఆర్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ జియాద్ రెహమాన్ విచారణ నిలిపేశారు. ఈ మేరకు సన్నీ లియోన్ పిటిషన్లో..తాను, తన భర్త, తమ ఉద్యోగిపై వచ్చి ఆరోపణలను తిరస్కరించారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని వివరించారు. అలాగే తమను అరెస్టు చేసే విధంగా పోలీసులుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అందువల్ల వారు ఏమి చేయలేకపోయారని చెప్పారు. తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేయడంతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లందని వాపోయారు. ఐతే ఆమెపై ఎర్నాకులంకి చెందిన కార్యక్రమ నిర్వాహాకుడు షియాస్ కుంజుమహమ్మద్ ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షియాస్ సన్నిలియోన్ విదేశాలలో స్టేజ్ షోల ప్రదర్శనకు సుమారు రూ. 39 లక్షలు అదుకుని మరీ ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కారు. (చదవండి: ఆప్ అభ్యర్థి కిడ్నాప్!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా) -
జీఎం ఆవాల విడుదలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) ఆవాల విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జీఎం ఆవాల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు గురువారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈలోగా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోరాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి తెలిపింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు వీలుగా జీఎం ఆవాలను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అరుణా రోడ్రిగ్స్ తన పిటిషన్లో సవాల్ చేశారు. -
ఓలా, ఉబర్, రాపిడోలకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్‌కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్‌కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు. కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం -
వీఆర్వోల అంశంపై తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) ప్రక్రియ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు స్టే విధించింది. జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తూ.. తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్4 (1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమ లును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వేరే శాఖల్లో బాధ్యతలు చేపట్టని ఉద్యోగులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవో నంబర్ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల విడుదల చేసిన ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లేనని, వివక్షపూరితమని పేర్కొంటూ.. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, నల్లగొండ జిల్లా మహమూదాపురం వీఆర్వో పగిళ్ల వీరయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో తమను సర్దుబాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారమే వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐదు వేల మంది వీఆర్వోల్లో 56 మందే వేరే శాఖల్లో చేరలేదని, 98.9 శాతం ఉద్యోగులు చేరిపోయారని వెల్లడించారు. ఉద్యోగం నుంచి ఎవరినీ తొలగించలేదని, ప్రభుత్వానికి ఏ శాఖలో అవసరమో అక్కడ సర్దుబాటు చేశామని.. దీంతో వీఆర్వోలకు నష్టం జరగడం లేదన్నారు. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. వీఆర్వోల బదిలీలతో సంబంధం లేకుండానే జీవో వెలువడిందన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు చట్టం తెచి్చన ప్రభుత్వం అందుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించలేదని నివే దించారు. రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలు కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విధివిధానాల నిబంధనలను రూపొందించకుండా జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదే శించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి -
వీఆర్వోల బదిలీ ప్రక్రియపై హైకోర్టు స్టే
-
రావోయి.. మా ఇంటికి
సాక్షి, అమరావతి: ఇంటికి చుట్టాలొచ్చినట్టే.. పర్యాటకులొస్తారు. మన ఇంట్లో తయారు చేసిన భోజనాన్నే తింటారు. ఇందుకు ప్రతిగా నగదు చెల్లిస్తారు. గ్రామీణ పర్యాటకంలో ఈ రకమైన ‘హోమ్ స్టే’ అనేది ట్రెండీ కాన్సెప్్టగా నిలుస్తోంది. వాణిజ్య వసతి గృహాలకు అవకాశం లేని గ్రామాలు, మారుమూల పల్లెల్లో ఇది స్థానికులకు ఉపాధి వనరుగా మారి వారికి ఆరి్థక భరోసానిస్తోంది. సంపూర్ణ పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. అలాగే పర్యాటకులకు హోటళ్లలో ఉండేందుకు అయ్యే ఖర్చులో సగం మాత్రమే అవుతుండటంతో వారు కూడా హోమ్ స్టేపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో చాలా తక్కువగానే అయినా ఈ విధానం కొనసాగుతోంది. కోనసీమ ప్రాంతాల్లో పూర్వీకుల పాత పెంకుటిళ్లను పెద్దల గుర్తుగా కాపాడుకుంటూనే ‘హోమ్ స్టే’ విల్లాలుగా మారుస్తున్నారు. ప్రస్తుతం కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, గ్రామీణులకు ఆరి్థక భరోసానిస్తూ హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ సందర్శనీయ స్థలాల్లో పర్యటించాలనుకునే వారు హోటళ్లు, రిసార్ట్‌లలో కంటే గ్రామీణుల మధ్య వారి ఇళ్లల్లోనే, స్థానిక ఆహార సంప్రదాయాలు, సాంస్కృతిక జీవనంలో మమేకమవుతున్నారు. ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ వెబ్సైట్లో సైతం హోమ్ స్టే బుకింగ్‌ను అందుబాటులో ఉంచారు. ఏపీలోనూ ‘హోమ్ స్టే’ విస్తరణకు అధికారుల ప్రణాళికలు కళల పరిశ్రమలు, సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా కళలు, ఆచారాలు, ఆహార సంప్రదాయాలు, భాషలు, వేషధారణ, సాంస్కృతిక జీవనశైలిని దేశీ, విదేశీ పర్యాటకులు ఆస్వాదించొచ్చు. ఇందులో భాగంగా హోమ్ స్టే విధానంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించనున్నారు. వాణిజ్య ఆతిథ్య రంగంలో పాటించే సకల భద్రత ప్రమాణాలను హోమ్ స్టేలోనూ అమలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తిగల ఇళ్ల యజమానులు పర్యాటక శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. పరస్పర సాంస్కృతిక మార్పిడికి అవకాశం హోమ్ స్టే విధానంతో అతిథి, హోస్ట్ పరస్పర సాంస్కృతిక మారి్పడికి అవకాశం ఉంటుంది. వివిధ జాతుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించే వేదికగా గ్రామాలు మారుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా వలసలు తగ్గుతాయి. స్థానికులు స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై బాధ్యత కూడా పెరుగుతుంది. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
ఏపీ పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ లాయర్ కోర్టుకు వివరించారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి -
కిషోర్ బియానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)ను తీవ్ర స్థాయిలో నిరోధిస్తూ 2021 మార్చి 18న జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పుపై డివిజనల్ బెంచ్ సోమవారం తదుపరి విచారణ వరకూ స్టే విధించింది. ఫ్యూచర్ రిటైల్ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం అనుమతిస్తూ, ఈ కేసులో ప్రతివాదైన గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 18న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అన్నింటిపై స్టే విధించాలన్న ఫ్యూచర్ గ్రూప్ తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో సింగిల్ జడ్జి గత మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ స్టే విధించడం, అనంతరం కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కూడా వెళ్లడం వంటి అంశాల నేపథ్యంలో కేసులో మార్చి 18న సింగిల్ జడ్జి తుది తీర్పు ఎలా ఇస్తారని సాల్వే వాదించారు. ఆయా వాదనలతో ఏకీభవించిన హైకోర్డు డివిజనల్ బెం చ్, సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించి తదుపరి కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: (రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్ మరో అడుగు) న్యాయపోరాటం ఇదీ... ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్‌సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్–ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్ గ్రూప్ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను విచ్ఛిన్నం చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని విచ్ఛిన్నం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ఓ ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నౌకను ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్న ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. గత ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా హోం శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది. ఈ నౌకను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ గతంలో బాంబే హైకోర్టుని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ అభ్యర్థించింది. నౌకను కొనుగోలు చేసేందుకు ఎన్ఓసీ కోరిన ప్రైవేటు కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబర్ 3న, జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ మిలిండ్ జాధవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
'ధరణి'పై స్టే మళ్లీ పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్‌పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ధరణిపై నమోదైన అభ్యంతరాలపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా.. అటార్నీ జనరల్ ప్రసాద్ స్పందిస్తూ.. అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని, ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. ధరణిపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు కాగా, అందులో ఇదు పిటిషన్లు ఒకే అంశంపై దాఖలైనవే కాబట్టి వాటిపై విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం రెండు పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు పిటిషన్లపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ జరుపుతోంది. కాగా, ధరణిలో ఇదివరకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, వ్యవసాయేతర భూముల నమోదు మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. -
పంతం వీడండి
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులు మొండిపట్టు వీడి, ప్రభుత్వంతో అంశాల వారీగా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున, రైతులు పంతానికి పోవడంలో అర్థం లేదన్నారు. 19వ తేదీన రైతు సంఘాలతో పదో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఎటువంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. రైతులు మాత్రం చట్టాల రద్దుపైనే పట్టుదలకు పోతున్నారు’అని చెప్పారు. ‘దేశం మొత్తానికి వర్తించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చింది. వీటికి రైతులు, నిపుణులు, సంబంధిత వర్గాల మద్దతు ఉంది’అని తెలిపారు. ‘మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపాం. పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం. రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాయి. అంశాల వారీగా చర్చల్లో సంఘాల అభ్యంతరాలు సరైనవే అని తేలితే, ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది’అని చెప్పారు. కాగా, కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 19వ తేదీన మొట్టమొదటి సమావేశం జరపనుంది. పూసా క్యాంపస్‌లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. కమిటీలోని నలుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణ సందర్భంగా కమిటీ సభ్యుడు వైదొలగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు, 26న ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతివ్వరాదంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం వేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుంది 26న గణతంత్ర దినోత్సవం రోజున ముందుగా ప్రకటించిన విధంగానే ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సింఘు వద్ద ఆదివారం రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘మా ర్యాలీ ప్రశాంతంగా సాగుతుంది. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించం. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తారు’అని వివరిం చారు. రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న /మద్దతు పలికిన నిషేధిత సిక్కు సంస్థకు చెందిన రైతు నేతకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని మరో నేత దర్శన్ పాల్ సింగ్ తీవ్రంగా ఖండించారు. 2024 మే వరకు పోరుకు సిద్ధం నాగపూర్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2024 మే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలను సైద్ధాంతిక విప్లవంగా ఆయన అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టపరమైన హామీగా రైతులు భావిస్తున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పటి వరకు వెనక్కి తగ్గబోమని గ్రామీణ ప్రాంతాల నుంచి వేర్వేరు సంఘాల నుంచి వచ్చిన రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్/మే నెలలో జరగనున్నాయి. -
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈ నెల 10 వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించిన మూడు జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కోర్టుకు ఏజీ తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని.. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని హైకోర్టు సూచించింది. సేకరించిన డేటాకు చట్టబద్ధతమైన భద్రత ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 10కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. (చదవండి: కేంద్రం మెడలు వంచుతాం: తలసాని) -
‘ఆధిపత్య’ ఆరోపణలు... ఫ్లిప్‌కార్ట్‌కు ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: వ్యాపారంలో దూసుకుపోవడానికి తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణల విషయంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట లభించింది. దీనిపై పునఃదర్యాప్తు దర్యాప్తు జరపాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆదేశిస్తూ మార్చి 4వ తేదీన నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన రూలింగ్‌కు బుధవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ (ఏఐఓవీఏ– అమ్మకందారుల సంఘం), సీఐఐలకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామస్వామిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు అవాస్తవం: ఫ్లిప్‌కార్ట్ ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సీసీఐ, తక్కువ ధరల విధానంతో తన ఆధిపత్య స్థానాన్ని ఫ్లిప్‌కార్ట్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలను తోసిపుచ్చుతూ 2018 నవంబర్ 6న రూలింగ్ ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌ను స్వీకరించిన ఎన్సీఎల్ఏటీ, అసోసియేషన్ వాదనలపై తిరిగి విచారణ చేపట్టాలని సీసీఐని ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫ్లిప్‌కార్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసులో సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ, ఈ అంశంలో ‘ప్రిడెక్టరీ ప్రైసింగ్’ (అతి తక్కువ ధరకు వస్తు, సేవల ద్వారా ప్రత్యర్థులను మార్కెట్ వదిలిపోయేలా చేయడం) కీలకాంశం అన్నారు. ఇలాంటి ఆరోపణలను (ప్రిడెక్టరీ ప్రైసింగ్) కేవలం ఆధిపత్య కంపెనీపైనే చేయాల్సి ఉంటుందని అన్నారు. అసలు ఫ్లిప్‌కార్ట్ ఆధిపత్య కంపెనీ కోవలోకే చెందదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఫ్లిఫ్‌కార్ట్ ఆధిపత్య స్థానంలోనే లేదని సీసీఐ తన ఉత్తర్వు్యలో పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్సీఎల్ఏటీ కూడా తోసిపుచ్చలేదని గుర్తుచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, కేసు తదుపరి విచారణకు వాయిదావేసింది. 2018 నవంబర్‌లో ఇచ్చిన సీఐఐ ఉత్తర్వుల ప్రకారం, ఆల్ ఇండియా ఆన్లైన్ వెండార్స్ అసోసియేషన్‌లో 2,000కుపైగా సెల్లర్స్‌కు సభ్యత్వం ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తరహాలోనే ఏఐఓవీఏ సభ్యత్వ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్‌పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి. -
ఈసీకి ఆ అధికారం లేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు 'స్టే' విధించింది. ‘స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి అభ్యర్థిని తొలగించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.. నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిది’ అని కోర్టు ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున... కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్ నాథ్ పిటిషన్‌పై సోమవారం(నవంబర్ 2) విచారణ చేపట్టింది. (చదవండి: ‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్) మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటెం' అని కమల్ నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్ నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కమల్ నాథ్ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే' అని కమల్ నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది విభజనలో ‘సుప్రీం’ స్టే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ కార్మికుల విభజన వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగులు, టీఎస్ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు.. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సోమవారం విచారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ స్థానికత కలిగిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు తెలంగాణలో విధుల్లో చేరి బదిలీ, డిప్యుటేషన్లపై స్వస్థలమైన ఆంధ్రాలో విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం వీరి అసలు పోస్టింగ్ అయిన తెలంగాణకు వెళ్లిపోవాలంటూ ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రా స్థానికత కలిగిన తమను తెలంగాణకు పంపడం అన్యాయమని ఆర్టీసీ సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులను హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
దర్యాప్తు దశలో ‘స్టే’ వద్దు
సాక్షి, అమరావతి కేసు నమోదు, దర్యాప్తు చేయడం పోలీసుల పరిధిలోని అంశాలు. న్యాయవ్యవస్థ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. కాగ్నిజబుల్ నేరాల్లో న్యాయస్థానం అనుమతి లేకుండా దర్యాప్తు చేసే హక్కు పోలీసులకుంది. – కింగ్ ఎంపరర్ వర్సెస్ ఖ్వాజా అహ్మద్ (1945) నేరంపై దర్యాప్తు జరపడం పోలీసులకు సంబంధించింది. దర్యాప్తులో నేరం చేసినట్లు తేలితే, ఆ నేరం చేసినట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఆస్కారమే లేదు. – స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ జేఏసీ సల్దాన (1979) శాంతిభద్రతల పరిరక్షణలో దర్యాప్తు అధికారిదే కీలక పాత్ర. నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించే స్వేచ్ఛను పోలీసులకు న్యాయస్థానాలివ్వాలి. – స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ పీపీ శర్మ (1991) నేరాలపై దర్యాప్తు చేయడం దర్యాప్తు అధికారుల పరిధిలోని అంశం. అత్యంత అరుదైన కేసుల్లో తప్ప కోర్టులు దర్యాప్తులో ఏవిధంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నేరస్తుల విచారణ, సమాధానాలు రాబట్టడం, అవి సంతృప్తికరంగా ఉన్నాయా.. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయా? అనేవి దర్యాప్తు సంస్థ పరిధిలోనివి. – పి.చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (2019) అమరావతి భూకుంభకోణంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వంటివి గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఇలాంటి కేసుల్లో ఉత్తర్వులిచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే సామాన్యులు మాకొక న్యాయం, వారికొక న్యాయమా? అని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. – ఎల్.రవిచందర్, సీనియర్ న్యాయవాది, హైకోర్టు దర్యాప్తు చేయడానికి ముందు, దర్యాప్తు కీలక దశలో ఉండగా స్టే ఇవ్వడాన్ని అసాధారణంగానే భావించాలి. దర్యాప్తు సంస్థలను వాటి పని వాటిని పనిచేసుకోనివ్వాలి. ప్రత్యేక పరిస్థితుల్లోనే కోర్టులు జోక్యం చేసుకోవాలి. – గండ్ర మోహనరావు, న్యాయవాది దర్యాప్తును ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఫిర్యాదులో చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. – చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది ఇవేకాదు. నిర్మల్జీత్సింగ్ హూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ (1972), స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ వర్సెస్ సుజిత్‌కుమార్ రాణా (2004), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అరుణ్ కుమార్ భజోరియా (1997) సహా ఎన్నో కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని పదేపదే ఉద్ఘాటిస్తూ వస్తోంది. నిన్నగాక మొన్న రాజధాని భూములకు సంబంధించిన ఓ కేసులో కూడా ఇలాంటి ఉత్త్తర్వులే ఇచ్చింది. “దర్యాప్తు పోలీసుల పరిధిలోని వ్యవహారం. ప్రాథమిక స్థాయిలోనే దర్యాప్తును న్యాయస్థానాలు అడ్డుకోవడానికి వీల్లేదు’ అని పేర్కొంది. ఇటీవల కొన్ని కేసుల్లో... ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్లపై, అరెస్టులపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. “్ఙ75 ఏళ్లుగా ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిస్తూనే ఉంది. దర్యాప్తు దశలో కోర్టుల జోక్యం తగదని చెబుతూనే ఉంది. మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కనకే మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెబుతోంది’’ అని రిటైర్డు న్యాయమూర్తి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హైకోర్టులో ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన కేసుల్ని ఒకసారి చూస్తే... తుళ్లూరు భూముల కేసులో అప్పటి తహసీల్దార్ సుధీర్‌బాబుపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని కొట్టేయాలని ఆయన మార్చి 23న హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ ఆ మరుసటి రోజే తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడాన్ని ప్రాథమికంగా తప్పుపడుతూ కేసును వారంలో తేల్చాలని హైకోర్టుకు సూచించింది. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రి ఓ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది మరణించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించకుండా పారిపోయిన రమేశ్ ఆస్పత్రి చైర్మన్ రమేశ్‌బాబు తనపై ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్... కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో అవినీతిని వెలికితీసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగాయని అన్ని ఆధారాలతో ఇది నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్‌ను వేసింది. సిట్ కేసు నమోదు చేయడానికి ముందే.. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వీటి ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు.. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే.. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేసి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఆ మర్నాడు ఉదయమే ఏసీబీ అటు దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై అప్పటికప్పుడు విచారణ జరిపిన సీజే జస్టిస్ జేకే మహేశ్వరి.. నిందితులెవరినీ అరెస్ట్ చేయొద్దని, కేసు వివరాలను మీడియాలో రాయవద్దని పేర్కొంటూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. రిటైర్డ్ లెక్చరర్‌ను మోసం చేసిన కేసులో దమ్మాలపాటి, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు తదితరులపై మంగళగిరి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ సీతారామరాజు గత నెల 28న పిటిషన్ వేయగా 29నే తదుపరి చర్యలన్నీ మూడు వారాలపాటు నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఈ నెల 15 వరకూ హైకోర్టు పొడిగించింది. కూల్చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. భవనాల్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని, దీని విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఇదే విధంగా తీర్మానం చేసిన దానిపై తాము ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. మంత్రివర్గం గత నెల 30న తీర్మానం చేసిన విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అనిపిస్తోందని,, పత్రికల్లో వార్తలు రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజలకు చెప్పకపోయినా కోర్టులకైనా తెలియజేయాలని ఆదేశించింది. ప్రజలకు తెలియజేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్లో మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయాలని కోరింది. పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ... నిర్మాణాలు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, పలు చట్టాలను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడిందని, అనుమతి తీసుకుని కూల్చారో లేదో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ వాదనను ఏజీ వ్యతిరేకిస్తూ, భవనాల కూల్చివేత పనులు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిగా కూల్చేందుకు వీలుగా స్టేను ఎత్తేయాలని కోరారు. మంత్రివర్గ తీర్మాన ప్రతిని ఈరోజే మధ్యాహ్నానికి ఇస్తామని, విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై.. పిటిషనర్ వాదనల దాఖలుకు సమయం ఇవ్వాలని, విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం మంత్రివర్గ తీర్మాన ప్రతిని, పిటిషనర్ కౌంటర్ రిప్లై్ల దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మంత్రివర్గం ఆమోదించింది ప్రభుత్వం చట్ట ప్రకారమే సచివాలయ భవనాల్ని కూల్చివేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. మంత్రివర్గం జూన్ 30న ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఆర్అం డ్బీ ఈఎన్సీ అదే నెల 4న 25.50 ఎకరాల్లోని సచివాల య భవనాల కూల్చివేతకు నివేదిక ఇచ్చారని, దీనికి అనుగుణంగా కూల్చివేతలకు జీహెచ్ఎంసీ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. కాలుష్య సమస్యతో ఎవ్వరూ బాధపడటం లేదని, హుస్సేన్‌సాగర్ సమీపంలో కూల్చివేయరాదన్న వాదన చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిర్మాణాలు– కూల్చివేతలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లోని 4(3)ను ఉల్లంఘించలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, వీటిని కొట్టేయాలని కోరారు. -
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
-
ఇల్లే శ్రీరామ రక్ష!
-
అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. ‘మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు. దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి’ అని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫున లాయర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్‌గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఈనెల 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు తలారి పవన్ జల్లాడ్‌ను పంపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ అధికారులకు లేఖ రాశారు. ముకేశ్, పవన్, వినయ్‌లు ఆఖరిసారిగా తమ కుటుంబసభ్యులను ముఖాముఖి కలుసుకున్నారు. అక్షయ్ కుటుంబసభ్యులు కూడా ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఉపశమనం కల్పించండి : అమెజాన్
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలను నిలిపి వేయాలని తన పిటిషన్లో కోరింది. ఈమేరకు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని విన్నవించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు తమ వ్యాపారంలో పోటీ చట్టాల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయంటూ పలు సంఘాలు ఇదివరకే తీవ్ర ఆరోపణలు చేశాయి. ఫలితంగా రిటైలర్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించాయి. కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటూ మొబైల్‌ఫోన్ వంటి ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు అందజేస్తున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటైలర్లు, చిన్న వ్యాపారాలు భారీగా నష్టపోతున్నాయని పేర్కొంటూ వ్యాపారుల సంఘం ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతోపాటు భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ వార్తలపై అమెజాన్ ఇండియా స్పందించాల్సి వుంది. చదవండి : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు.. -
పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు సంక్షోభానికి కారకులైన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు షాకిచ్చింది. రూ.4,355 కోట్ల విలువైన స్కాంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారి చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీ వాదనలను పరిశీలించింది. బాంబే హైకోర్టు అసాధారణంగా ఈ ఉత్తర్వులిచ్చిందనీ, హైకోర్టు వాస్తవంగా వారికి బెయిల్ మంజూరు చేసిందన్నవాదనను సుప్రీం సమర్ధించింది. రియల్ ఎస్టేట్ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేశ్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడానికి అనుమతించిన బొంబాయి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వేల కోట్ల కుంభకోణంలో అరెస్టైన వారిద్దరినీ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి మార్చడానికి వీల్లేదని ఆదేశించింది. కాగా పీఎంసీ బ్యాంకు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు వాద్వాన్ సోదరులను జైలు నుంచి తరలించాల్సిందగా దాఖలపై పిటిషన్నువిచరించిన కోర్టు వారిని గృహనిర్బంధంలోకి మార్చేందుకు అంగీకరించింది. అంతేకాదు బాధితుల డిపాజిట్ సొమ్మును రికవరీ చేసే చర్యల్లో భాగంగా కంపెనీ ఆస్తులనువేలానికి త్రిసభ్య కమిటీనొకదాన్ని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే విచారించాల్సిందిగా కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కేసులో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు, మేనేజింగ్ డైరెక్టర్ సారంగ్ వాధ్వాన్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులుగత ఏడాది అక్టోబరులో అరెస్ట్ చేశారు. రాకేశ్ కుమార్ వాధ్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్ ఫైల్ ఫోటో -
పోలీసు అధికారుల జైలు శిక్షపై స్టే
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో ముగ్గురు పోలీసు అధికారులకు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ కమల్‌హాసన్‌రెడ్డి, కరీంనగర్ ఏసీపీ తిరుపతి, ఎస్హెచ్ఓ శశిధర్‌రెడ్డిలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10 చొప్పున లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశిస్తూ గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ పోలీసు అధికారులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని ఓ రిసార్టుపై దాడులు చేయరాదని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా సివిల్ దుస్తుల్లో వెళ్లి తనిఖీలు చేసినందుకు పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు సింగిల్ జడ్జి జైలుశిక్ష విధించారు. అయితే రిసార్ట్స్ యాజమాన్యం సమర్పించిన పత్రాల ఆధారంగా సింగిల్ జడ్జి తీర్పు చెప్పారని, వాస్తవానికి ఇది కింది కోర్టు తేల్చాల్సిన వ్యవహారమని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్ పిటిషన్లను విచారణకు అనుమతిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విషయమై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా, చెన్నమనేని తరపున సీనియర్ న్యాయవాది వేదల వెంకటరమణ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేష్ జర్మనీలో అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశాడని తెలిపారు. 2008 జనవరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, 2009లో పౌరసత్వం వచ్చిందని వెల్లడించారు. తర్వాత ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు జారీ చేసిందని వివరించారు. చెన్నమనేని రమేష్ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2010 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారని తెలిపారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి ప్రజాసేవ చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు ఈ కేసులో ప్రతివాది అయిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు మాట్లాడుతూ.. భారతీయ పౌరుడు కాని చెన్నమనేని రమేష్ తప్పుడు అఫిడవిట్ పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారని వాదించారు. చట్టాలను మోసం చేసే వాళ్లు చట్టసభల్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు హోంశాఖ చెప్పిందని గుర్తు చేశారు. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని అనేక ఆధారాలు ఉన్నందున హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు స్టే విధించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికకు బ్రేక్
సాక్షి, కరీంనగర్ : నిర్ధిష్ట ప్రమాణాలు పాటించకుండా.. మాజీ కార్పొరేటర్లకు ప్రయోజనం చేకూరేలా అధికార యంత్రాంగం హడావుడిగా చేసిన వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదటికే మోసం తెచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల కుల గణనలో అవకతవకలపై సాక్ష్యాధారాలతో పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సవరించేంత వరకు ఎన్నికలు నిర్వహించరాదని స్టే జారీ చేసింది. దీంతో కరీంనగర్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. పునర్విభజన అనంతరం ఏర్పాటైన 2, 3, 18 డివిజన్లలో అవకతవకలు జరిగాయని, ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్లను తారుమారు చేశారని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి, హౌజింగ్‌బోర్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు వాడె వెంకటరెడ్డితోపాటు ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి రిట్ పిటిషన్లలో మరో 26 మంది వరకు ఇంప్లీడ్ అయినట్లు సమాచారం. శుక్రవారం హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజనపై విచారణ జరగగా, కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలను సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు పిటిషనర్లు ‘సాక్షి’కి తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రతులు రాకపోవడంతో సోమవారం ఈ స్టేకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా పునర్విభజన, ఓటర్ల తుది జాబితా ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోనే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ముందుగా డివిజన్ల సంఖ్యను ప్రకటించిన అధికారులు, ఆ సంఖ్యకు అనుగుణంగా ఓటర్లను నిర్ధారిస్తూ హద్దులను నిర్ణయించారు. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. కరీంనగర్లో 50 డివిజన్లు గతంలో ఉండగా, చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేయడంతో వాటి సంఖ్య 60కి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కో డివిజన్లో ఓటర్ల సంఖ్య 3,700 నుంచి 4,600 వరకు ఉండాలని మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా తొలుత డివిజన్లను పునర్విభజించినప్పటికీ, ఇంటి నెంబర్ల ఆధారంగా విభజన జరపడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో మార్పులు చేసి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతోపాటు రిజర్వేషన్ల ముసాయిదా కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తం డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించినప్పుడే రాజకీయ జోక్యం మొదలైంది. తాజా మాజీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. డివిజన్ల రిజర్వేషన్లు ప్రభావితం అయ్యేలా ఓటర్లను ఇష్టానుసారంగా మార్చివేశారు. తాజా మాజీలైన కార్పొరేటర్లు చెప్పినట్టే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది డివిజన్లలో ఓటర్లను చేర్చడం, తొలగించడం జరిగిందనేది వాస్తవం. శాస్త్రీయ పద్ధతి లేకుండా కొంతమంది ప్రయోజనాల కోసమే ఓటర్లను మార్చడంతో ఏకంగా 26 మంది వరకు కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బీసీగానో, జనరల్‌గానో ఉన్న డివిజన్ ఎస్సీ లేదా ఎస్టీ అయితే పదేళ్ల వరకు తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం రాదనే ఉద్దేశ్యంతో ఓ మాజీ కార్పొరేటర్ రాష్ట్ర స్థాయిలో పైరవీ చేసి, ఒక వర్గం ఓటర్లను పక్క డివిజన్‌లోకి మార్పించారనే విమర్శ ఉంది. కౌన్సిల్లో మొన్నటిదాకా కీలకస్థానంలో ఉన్న ఓ నాయకుడు తన డివిజన్లో కొత్తగా వేరే డివిజన్ల ఓట్లు చేరకుండా జాగ్రత్త పడడంతో అతితక్కువ ఓటర్లుగా నమోదయ్యాయి. ఆ పక్కనే ఉన్న డివిజన్లో దాదాపు రెట్టింపు ఓటర్లు ఉండడం గమనార్హం. ఎస్టీ డివిజన్లో మొదలై.. మిగతా ప్రాంతాలకు పాకి.. 3వ డివిజన్లో ఎస్టీ ఓటర్లు 350కి పైగా ఉండగా, అవన్నీ రాత్రికి రాత్రే 2వ డివిజన్‌లోకి చేరాయి. కేవలం ఎస్టీ ఓటర్లున్న ఇళ్లను మాత్రమే 2వ డివిజన్లో కలిపి, మిగతా ఓటర్లను యధాతథంగా 3వ డివిజన్లో ఉంచడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ కావలసిన ఈ డివిజన్ జనరల్‌గానో, బీసీగానో చేసే కుట్ర జరిగిందని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి వాదన. ఇదే అంశాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 2వ డివిజన్లో ఎస్టీ ఓటర్లను చేర్చడం వల్ల తమకు కేటాయించాల్సిన రిజర్వేషన్ కాకుండా పోతుందని ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 18వ డివిజన్లో ఏకంగా 600 అగ్రవర్ణ ఓటర్లను బీసీలుగా చూపించారని హౌజింగ్‌బోర్డుకు చెందిన వాడె వెంకటరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. డివిజన్లో 4,600కు మించకుండా ఓటర్లు ఉండాలనే నిబంధనను పక్కన బెట్టి 4,813 మంది ఓటర్లతో డివిజన్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఏకంగా 2900 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పక్కనున్న 25వ డివిజన్లో 5,100 మంది ఓటర్లు ఉన్నారు. 19వ డివిజన్లో కూడా ఓటర్లను చేర్చడంలో అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్ సతీష్ సైతం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 40వ డివిజన్లో ఒకే ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని బీజేపీ నాయకులు చిట్టిబాబు, రాజేష్ సైతం కోర్టుకు విన్నవించారు. కోర్టు స్టే కాపీ కోసం అధికారుల నిరీక్షణ శాస్త్రీయత లేకుండా ఇష్టానుసారంగా డివిజన్ల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు హైకోర్టు ఆగ్రహంతో తల పట్టుకుంటున్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసినా, ఏయే అంశాలపై కోర్టు అభ్యంతరం తెలియజేసిందో హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వస్తే గానీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులు డివిజన్ల విభజన విధానాన్ని మరోసారి పరిశీలించే పనిలో పడ్డారు. ప్రధానంగా 2,3, 18, 19 వార్డులతోపాటు అభ్యంతరాలు వ్యక్తమైన ఇతర డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. కాగా కోర్టు ఆదేశాల మేరకు డీలిమిటేషన్లో హైకోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, లోపాలను సవరించి కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మునిసిపాలిటీలతోపాటే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జయ మృతి విచారణ కమిషన్‌పై స్టే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న ఏకసభ్య ఆర్ముగస్వామి కమిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. అపోలో వైద్యులను కూడా విచారించేందుకు జస్టిస్ ఆర్ముగ స్వామి పూనుకోవడంతో అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆర్ముగ స్వామి ఒక్కరే కాకుండా స్వచ్ఛంద వైద్య నిపుణుల బృందం, ప్రత్యేక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి వైద్యులను విచారించాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు అపోలో అభ్యర్థనను తోసిపుచ్చడంతో అపోలో సుప్రీంను ఆశ్రయించింది. -
సుప్రీంకోర్టు ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిత్రం విడుదలపై ఆంక్షలు విధించడాన్ని అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి దాఖలు పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీలో చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు ససేమిరా
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేధింపుల కేసులో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల్లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. 2018 మార్చి 20వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేసింది. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని పునర్ నియమించాలని సూచించింది. ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్ యూయూ లలిత్‌ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ భాగమైనందున ఆయనను ఇందులో చేర్చాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ అరెస్టులను నిలువరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కోర్టు స్టేతో ఆగిన ఇళ్ల నిర్మాణం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : హైకోర్టు స్టే కారణంగా ప్రభుత్వం హౌసింగ్‌ఫర్ ఆల్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కలెక్టర్‌తోపాటు అధికార పార్టీ నేతలెవ్వరికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రస్తుతం లబ్ధిదారులకు ఎవరు సమాధానం చెబుతారని, డిపాజిట్ ఎలా తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్‌పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ అధికారులు 76.17 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వైఎస్ మరణానంతరం పరిశ్రమలను ఏర్పాటు చేయలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అపెరల్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని హౌసింగ్ ఫర్ ఆల్పథకం కింద 4150 ఇళ్లు నిర్మించేందుకు కేటాయించారన్నారు. అందులో ఉచితంగా పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ముందుగా డిపాజిట్లు సేకరించి తర్వాత బ్యాంకు రుణం ద్వారా ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. అపార్ట్మెంట్ తరహాలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఈ సమస్యపై తాను గతంలోనే 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టానన్నారు. కలెక్టర్ కేవీ రమణ హయాంలోనే తాను అపెరల్‌పార్కు స్థలంలో ఇళ్లు నిర్మించొద్దని కోరానన్నారు. అయితే జిల్లా అధికారులు మాలెపాడు గ్రామం వద్ద నిర్మించనున్న స్థలాన్ని మినహాయించి అపెరల్ పార్కులో ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే సమస్య.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్ పార్కు ఏర్పాటు కోసం 34 మంది రైతుల నుంచి 76.17 ఎకరాల భూమిని సేకరించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన రైతు చిన్న వెంకటసుబ్బన్న సర్వే నంబర్ 679లోని 7.78 ఎకరాల భూమిపై, మల్లేల బాల పుల్లయ్య సర్వే నంబర్ 680లోని 3.76 ఎకరాలపై హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ ప్రకారం చిన్న వెంకటసుబ్బన్నకు గత ఏడాది నవంబర్ 23న, బాలపుల్లయ్యకు డిసెంబర్ 4న హైకోర్టు స్టే మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. అధికారులు మొత్తం 4150 మందికి ఇళ్లు నిర్మించాలని తలపెట్టగా 825 మంది డీడీలు చెల్లించి అధికారులకు ఇచ్చారన్నారు. 107 బ్లాకుల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. హైకోర్టు స్టే కారణంగా వీటిలోని 33 బ్లాకుల్లో నిర్మిస్తున్న 400 ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు. అధికారులు సమాచారాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి అధికారులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూమి ఇచ్చిన మిగతా 32 మంది రైతులు కోర్టును ఆశ్రయిస్తే హౌసింగ్ ఫర్ ఆల్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి విలువ రూ.4కోట్ల నుంచి రూ.5కోట్లు పలుకుతోందన్నారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇందుకు ప్రభుత్వంతోపాటు సంబంధిత అధికా రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ విషయంపై లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గోనా ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మేల్కొని ఉండండి
గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది! కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు. ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు. మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు. కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి. అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి. – డి.వి.ఆర్. -
ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌పై ఇవ్వరాదని హైకోర్టు ఆదేశం
-
తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ఓటర్ల జాబితా ఆటంకం కలిగించనుంది. ఓటర్ల జాబితా అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చుతూ.. శుక్రవారమే పిటిషన్లు దాఖలు చేయాలని ఫిటిషనర్లకు సూచించింది. సుప్రీంకోర్టు కాపీ అందడంతో ఉమ్మడి హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల జాబితా, నోటిఫికేషన్ రిట్ ఫిటిషన్‌కు లోబడి ప్రకటించాలని సూచించింది. తుదిజాబితాను ఈసీ అధికారిక వెబ్సైట్లో పెట్టకూడదని, మొదటగా డ్రాఫ్ట్ కాపీని ఫిటిషనర్లకు, హైకోర్టుకు అందించాలని తెలిపింది. ఈనెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీచేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా న్యాయస్థానం రెండు పిటిషన్లను కొట్టేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించండంతో శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. -
ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో విచారణ
-
‘రాఫెల్’పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాఫెల్ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు. -
తమిళ విద్యార్థులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని తప్పుపడుతు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సుప్రీంకోర్టు పిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ ఎస్ బాంబ్డే, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ పద్దతిలో విద్యార్థులకు మార్కులు ఇవ్వలేమని, ఇరువురు సమావేశమై సమస్యను పరిష్కారించాలని న్యాయస్థానం పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్ఈ తీరును తప్పు పట్టింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సీబీఎస్‌ఈను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులతో పాటు ఇతర క్రిమినల్, సివిల్ కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉండగా, వాటిపై ఏవైనా స్టే ఉత్తర్వు లు ఇచ్చిఉంటే, ఆ స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దయిపోతాయంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని హైకోర్టు బుధవారం ఉభయ రాష్ట్రాల్లోని అన్ని కింది కోర్టులను ఆదేశించింది. జిల్లాల పరిధిలో ఈ తీర్పు అమలయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జీలందరికీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌తో పాటు సుప్రీంకోర్టు తీర్పును కూడా పంపింది. ఈ యాక్ట్ కింద నమోదైన కేసులపై స్టే విధిస్తూ ఇప్పటికే ఏవైనా ఉత్తర్వులు జారీచేసి ఉంటే, ఆ ఉత్తర్వులు ఆరు నెలల తరువాత ఆటోమేటిగ్గా రద్దయిపోతాయంటూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ స్టేని పొడిగించాలంటే, అందుకు తగిన కారణాలను తెలియచేయాలని అటు హైకోర్టులు, ఇటు కింది కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తరువాత ఈ కేసుల్లో ప్రొసీడింగ్స్‌ను కొనసాగిం చాలని కింది కోర్టులను ఆదేశించింది. ఈ తీర్పు అమలయ్యేలా చూసేందుకు కింది కోర్టులకు తగిన సూచనలు చేయాలని హైకోర్టులకు స్పష్టం చేసింది. -
నీట్ అర్హత నిబంధనలపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్‌లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 9 చివరితేదీ కాగా పరీక్ష మే 6న జరగనుంది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది n eligibility norms for NEET -
ప్రియా వారియర్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్(18)కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రియాతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అలాగే వీరిద్దరిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుచేయరాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఒరు అదార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా చిత్రీకరించారంటూ తెలంగాణ, మహారాష్ట్రల్లో వారిపై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పాట కేరళలో చాలా ప్రాచుర్యం పొందిందనీ, దీన్ని అపార్థం చేసుకోవడం వల్లే వేర్వేరు రాష్ట్రాల్లో తమపై కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయమై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. -
టీటీడీలో అన్యమత ఉద్యోగులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : టీటీడీలో అన్యమత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. అన్యమత ఉద్యోగస్తులను తొలగించవద్దని హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 45మంది అన్యమతస్తుల ఉద్యోగులను తొలగిస్తూ టీటీడీ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలోనే టీటీడీ కౌంటర్ దాఖలు చేసింది. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న హైందవేతరులను ఎలా తొలగిస్తారని న్యాయస్థానం ఈ సందర్భంగా టీటీడీని ప్రశ్నించింది. తదుపరి కోర్టు ఉత్తర్వులు వెలువరించే వరకూ అన్యమతస్తుల తొలగింపుపై చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. కాగా 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. అయితే 2007లో ఇకపై ఇలా జరగొద్దని టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఏడుగురు ఉద్యోగాల్లో చేరారు. -
ప్రధాని మోదీ బసకు నో చెప్పిన హోటల్
సాక్షి, మైసూర్ : ప్రధాని తలుచుకుంటే తాను కోరుకున్న చోట ఉండవచ్చని అనుకుంటే పొరపాటే. ఈనెల 19,20 తేదీల్లో మైసూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భద్రతా సిబ్బంది బస కోసం అధికారులు ఓ హోటల్‌ను సంప్రదించగా వసతిని కల్పించేందుకు సదరు హోటల్ నిరాకరించింది. ఓ వివాహ రిసెప్షన్ కోసం రూములన్నీ బుక్ అయ్యాయని, ప్రధానికి వసతి కల్పించలేమని హోటల్ లలితా మహల్ ప్యాలెస్ అధికారులకు తేల్చిచెప్పింది. ప్రధాని, ఆయన సిబ్బంది వసతి కోసం డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఓ అధికారి తమను సంప్రదించారని..అయితే ఓ వివాహ వేడుక కోసం రూమ్స్ అన్నీ బుక్ అవడంతో తాము ప్రధాని బృందానికి ఆశ్రయం కల్పించలేకపోయామని హోటల్ జనరల్ మేనేజర్ జోసెఫ్ మతియాస్ చెప్పారు. ప్రధాని పర్యటన సమయంలోనే ఆదివారం సాయంత్రం నుంచి వివాహ రిసెప్షన్ ప్రారంభమైందని తెలిపారు. హోటల్లో కేవలం మూడు రూములే ఖాళీగా ఉన్నాయని..అయితే భద్రతా కారణాల రీత్యా ప్రధాని ఆయన భద్రతా సిబ్బందితో కూడిన భారీ బృందానికి అవి ఏమాత్రం సరిపోవని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రధానితో పాటు భద్రతా సిబ్బందికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం నగరంలోని హోటల్ రాడిసన్ బ్లూలో అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి మైసూర్ చేరుకున్న ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం మైసూర్లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. -
శరద్ సభ్యత్వం రద్దుపై స్టే కుదరదు’
న్యూఢిల్లీ: జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ సభాధ్యక్షుడు ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయని జడ్జి జస్టిస్ విభు బఖ్రు స్పష్టం చేశారు. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవనుంది. -
యూనిటెక్కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూనిటెక్ వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్ణయాన్ని తప్పుపట్టిన అత్యున్నత ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలపై స్టే విధించింది. గృహ కొనుగోలుదారులు, ఇతర ఇన్వెస్టర్ల ప్రయోజనాలకోసం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 12కి వాయిదా వేసింది. యూనిటెక్ స్వాధీనంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్సీఎల్టీ భారీ షాకిచ్చింది. ఎన్సీఎల్టీ ఆదేశాలపై సంక్షోభంలో చిక్కుకున్న యూనిటెక్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది. యూనిటెక్ పిటీషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీం ఎన్సీఎల్టీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసును నేటికి వాయిదా వేసింది. కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఎన్సీఎల్టీ డిసెంబర్ 8 ఆదేశాలు జారీచేసింది. అలాగే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కేంద్రాన్నిఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 20లోగా అందించాలని సూచించిన సంగతి తెలిసిందే. -
కార్టూనిస్ట్ బాలా ఎఫ్ఐఆర్పై స్టే
మదురై: కార్టూనిస్ట్ బాలాపై దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తనపై విచారణను రద్దుచేయాలని కోరుతూ బాలా వేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలిస్తూ దీనికి కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు అనుమతి లేకుండా విచారణ జరిపే అధికారం పోలీసులకు లేదని బాలా తన పిటిషన్లో పేర్కొన్నారు. తానేం క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో లేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తాజా ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపించారు. -
ముఖ్యమంత్రికి మళ్లీ షాక్
జైపూర్ : వసుంధరా రాజే ప్రభుత్వానికి రాజస్థాన్ హైకోర్టులో ఊహించని ఝలక్ తగిలింది. ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై స్టే విధిస్తూ గురువారం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాలుగు కులాలను ముఖ్యంగా గుజ్జర్లను లక్ష్యంగా చేసుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 5 శాతానికి పెంచింది. ఈ మేరకు గత నెల చివరి వారంలో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసింది కూడా. బంజారా, బల్దియా, లబానా- గదియా లోహర్, గదోలియా- గుర్జర్, గుజార్, రైకా, రెబరి, దెబసి, గదారియా, గాద్రి, గాయారి కులాలకు వీటిని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కోటా 50 శాతానికి మించి ఉండకూడదు. కానీ, ఇక్కడ తాజా పెంపుతో అది 54 శాతానికి చేరింది. అందుకే స్టే విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. గతంలోనే వసుంధరా రాజే ప్రభుత్వం ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేసి న్యాయస్థానం నుంచి మొట్టికాయలు వేయించుకుంది. 2015లో వెనుకబడిన కులాల ప్రత్యేక చట్టం-2015 ద్వారా వారి రిజర్వేషన్లను 21 నుంచి 26 పెంచేందుకు యత్నించింది. అయితే కోర్టు ఆ చట్టాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ యేడాది మే19న మరోసారి ప్రత్యేక వర్గంలోకి వారిని చేరుస్తూ ఓబీసీ జాబితాను తయారు చేసింది. అయితే ఆ సమయంలో గుజ్జర్ నేతలు కొత్త చట్టంపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. చర్చల్లో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవట్లేదంటూ ఆందోళన బాట పట్టారు. దీంతో చర్చల ద్వారా వారిని బుజ్జగించిన సీఎం వసుంధరా రాజే బిల్లును పాస్ చేయించారు. -
అమెరికాలో ట్రావెల్ బ్యాన్పై మళ్లీ స్టే
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాల ప్రజలతోపాటు ఉత్తర కొరియా పౌరులు, వెనుజులా అధికారులు అమెరికాకు రావడంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వులను రెండు అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. ట్రంప్ ఉత్తర్వులు మరికొన్ని గంటల్లో అమల్లోకి రావాల్సి ఉండగా, ఆ ఆదేశాలపై స్టే విధిస్తూ హవాయ్ ఫెడరల్ కోర్టు, మేరీలాండ్ ఫెడరల్ కోర్టులు తీర్పునిచ్చాయి. గత నిషేధ ఉత్తర్వుల మాదిరే తాజా బ్యాన్ కూడా అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందనీ, ముస్లిం మతస్తులను లక్ష్యంగా చేసుకుంటోందని మేరీలాండ్ కోర్టు జడ్జి థియోడర్ చువాంగ్ పేర్కొన్నారు. ట్రంప్ తన తాజా ఉత్తర్వుల్లో ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్‌తోపాటు ఉత్తరకొరియా పౌరులు, వెనిజులాకు చెందిన కొందరు అధికారులు అమెరికాలోకి రావడంపై ఆంక్షలు విధించారు. నిర్దిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని, జాతీయత ఆధారంగా వివక్ష చూపేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని హవాయ్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వైట్‌హౌస్ సంకేతాలు పంపింది. -
కాజల్ పిటిషన్ కొట్టివేతపై హైకోర్టు స్టే
తమిళసినిమా: నటి కాజల్‌అగర్వాల్ పిటిషన్ కొట్టివేతపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కాజల్‌అగర్వాల్ చెన్నైకి చెందిన వాణిజ్య సంస్థ వీవీడీ అండ్ సన్స్ ప్రొడెక్ట్ వీవీడీ కొబ్బరి నూనె ప్రచార ప్రకటనలో నటించారు. అయితే ఆ ప్రకటన గడుపు ముగిసిపోయినా ప్రచారం చేసుకుంటున్నారని నటి కాజల్ ఆ సంస్థపై చెన్నైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆమె తనకు నష్టపరిహారంగా రూ.2.5 కోట్లను వీవీడీ అండ్ సన్స్ సంస్థ చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి టి.రవీంద్రన్ కాజల్‌అగర్వాల్ నటించిన వాణిజ్యప్రకటనపై కాపీ చట్టం ప్రకారం ఆ సంస్థకు 60 ఏళ్లు హక్కు ఉంటుందని పేర్కొంటూ కేసును కొట్టివేశారు. దీంతో కాజల్‌అగర్వాల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కాజల్ పిటిషన్ విచారణకు రాగా ప్రతివాదులు బదులు పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఈ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చే సింది. -
తీర్పు.....?
♦ అందరి చూపూ హైకోర్టు వైపు ♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికపై నిర్ణయం 16వ తేదీకి వాయిదా ♦ ఇదంతా టీడీపీ పనేనని నగరవాసుల మండిపాటు ► ఓటమి భయంతో ఇంత నీచ రాజకీయమా అంటూ ఆగ్రహం ►రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కింది కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన రెండు డివిజన్లను వదిలేసి ఎన్నికలు నిర్వహించుకోవాలని హై కోర్టు చెబుతుందా? ►రెండు డివిజన్లను పెండింగ్ పెట్టడానికి, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం లేదని, ఫలితాలను యథావిధిగా ప్రకటించుకోవచ్చని సూచిస్తుందా? ►పెండింగ్‌లో ఉన్న రెండు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు తాజాగా నిర్వహించే 48 డివిజన్ల ఎన్నికల ఫలితాలను రిజర్వులో ఉంచాలని ఉటంకిస్తుందా... ►మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది నిబంధన. ఈ లెక్కన ప్రస్తుతం జరుగుతున్న 48 డివిజన్లకుగాను నిబంధనల ప్రకారం 24 డివిజన్లు మహిళలకు కేటాయించాల్సింది. కానీ ప్రస్తుతం 23 డివిజన్లు మాత్రమే మహిళలకు రిజర్వు అయ్యాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? ►ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్నికలు ఆపడం కుదరదని హైకోర్టు స్పష్టంగా ప్రకటించనుందా? ► ప్రస్తుతం నిర్వహిస్తున్న సాంకేతికంగా సరికాదని, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఎన్నికలను వాయిదా వేస్తుందా? సాక్షి ప్రతినిధి, : కాకినాడ నగర ప్రజలను, రాజకీయ పక్షాలను తొలిచేస్తున్న సందేహాలివీ. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేస్తారా? కొనసాగిస్తారా? ప్రస్తుతం ఈ అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుంచి హైకోర్టులో గడచిన నాలుగైదు రోజులుగా లంచ్ మోషన్ పిటీషన్‌పై ఏరోజుకారోజు వాయిదాలు పడుతూ వాదనలు జరిగాయి. ప్రతిరోజూ తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశాయి. తాజాగా 16వ తేదీన తీర్పు వెలువరిస్తామని కోర్టు చెప్పడంతో నరాలు తెగే టెన్షన్ అటు పార్టీల్లోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ నెలకొంది. టీడీపీ విశ్వ ప్రయత్నాలు... ఎన్నికలు నిలుపుదల చేసేందుకు గల సాంకేతిక కారణాలపై విస్తృత వాదనలు జరుగుతున్నాయి. ఈ పాత్రను ముఖ్యంగా అధికార పార్టీ నేతలు పోషిస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తేనే తమకు మంచిదన్న ఆలోచనతో టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. తమకున్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడమంటే కష్టమనే అభిప్రాయంతో ఎన్నికలను ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి వాయిదా వేయించేందుకే చూస్తోంది. ఒక్కొక్కరిదీ ఒక్కో వాదన... ప్రధానంగా కార్పొరేషన్ చట్టం ప్రకారం కనీసం 50 డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని అయితే ప్రస్తుతం 48 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ఎన్నికకు భవిష్యత్తులో చట్టబద్దత ఉండదని, ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్న వాదన ఒకవైపు విన్పిస్తోంది. మరోవైపు 48 డివిజన్లలో ఎన్నికలు జరపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం కూడా లేదనే వాదన కూడా ఉంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకుని మొత్తం ఎన్నికను వాయిదా వేయాలని తీర్పు ఇచ్చిన సందర్భాలు కూడా ఎప్పుడులేవని, దీనిదృష్ట్యా ఎన్నికలు వాయిదా పడకపోవచ్చునని అంటున్నారు. అధికారుల తప్పిదంతో కొత్త సమస్యలు... విలీనం చేసిన మూడు పంచాయతీలకు సంబంధించిన మూడు గ్రామ పంచాయతీలపై కోర్టు స్టే కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని విలీనం చేసి ఎన్నికలకు సిద్ధంకావడం అధికారులు చేసిన పెద్దపొరపాటుగా చెబుతున్నారు. కోర్టు స్టే తొలగకుండానే ఎన్నికలకు సిద్దమైన తీరే మొత్తం ఈ సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. ఒక వేళ 48 డివిజన్లకు ఎన్నికలు జరిపి, మిగిలిన డివిజన్లు నిలుపుదల చేస్తే మరో కొత్త సమస్య కూడా వచ్చిపడే అవకాశం ఉంటుందంటున్నారు. వాయిదాపడ్డ డివిజన్ల నుంచి అభ్యర్థులు తమకు రాజకీయంగా అవకాశాలు కోల్పోయమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. పరిష్కారం జరగాలంటే ఒక వేళ సమస్య పరిష్కరించాలంటే ప్రస్తుతం ఉన్న 48 డివిజన్లను (విలీన పంచాయతీలను పక్కనపెట్టి) 50 డివిజన్లుగా విభజించి డీ లిమిటేషన్, వార్డుల పునర్విభజన పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇదంతా జరగాలంటే ప్రస్తుత ఎన్నికను వాయిదా వేసి మరో నెల నుంచి రెండు నెలలు కసరత్తు పూర్తి చేశాక మాత్రమే ఎన్నికలు జరిపే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. మరీ, ఈ వ్యవహారంలో కోర్టు ఎన్నికలకు సంబంధించి స్వతంత్రంగా ప్రకటిస్తుందా? ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ళమంటుందా అన్న అంశమే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది. -
ఐఐటీల్లో కౌన్సెలింగ్‌కు అనుమతి
► ప్రవేశాలపై స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు ► 2005 నాటి తీర్పుతో దీన్ని పోల్చలేం ► ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఐఐటీలకు ఆదేశం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమ తినిచ్చింది. ఐఐటీ–జేఈఈ (అడ్వాన్స్)– 2017 ఫలితాల ఆధారంగా నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌పై గతవారం విధించిన స్టేను ఎత్తివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వు లిచ్చింది. అయితే గందరగోళాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియకు సంబం ధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించ వద్దని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఎంఎం శంతనగౌడార్ల ధర్మాసనం అన్ని హైకోర్టులకూ సూచించింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు, బోనస్ మార్కుల కేటాయింపు వంటివి పునరావృతం కాకుండా కచ్చితమైన వ్యవస్థ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వాలని ఐఐటీలను ఆదేశించింది. అందుకు తగిన చర్యలు తీసుకొంటామని ఐఐటీల తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ కేసుతో దీన్ని పోల్చలేం... ప్రస్తుత వ్యాజ్యంలో నెగటివ్ మార్కులతో పాటు, 1.56 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడివున్నాయని, కనుక గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం కేసు (2005)లో ఇదే కోర్టు ఇచ్చిన తీర్పును దీనికి అమలు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గురునానక్‌దేవ్ వర్సిటీ కేసు పది వేల మంది విద్యార్థులకు సంబంధించిందని, అందులో తప్పుగా రాసిన జవాబుకు నెగటివ్ మార్కులు లేవని తెలిపింది. బోనస్ మార్కుల కేటాయింపును తప్పు పడుతూ ఐఐటీ ర్యాంకర్ ఐశ్వర్యా అగర్వాల్, ర్యాంకుల జాబితాను రద్దు చేయాలంటూ మరికొంత మంది విద్యార్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. ఇప్పటివరకు దేశంలోని వివిధ ఐఐటీ కాలేజీల్లో 33,307 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది, ఫీజులు సైతం చెల్లించారు. ఈ నెల 19న తరగతులు ప్రారం భం కానున్నాయి. ఈనెల 7న ఐఐటీ– జేఈఈ (అడ్వాన్స్) ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఐఐటీలను ఆదేశించిన∙విషయం తెలిసిందే. -
ఐఐటీ కౌన్సెలింగ్‌పై సుప్రీం స్టే!
న్యూఢిల్లీ: ఐఐటీ–జేఈఈ 2017 (అడ్వాన్స్డ్) ఫలితాల ఆధా రంగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే ఆపాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఈ ఆదే శాలు అమల్లో ఉంటాయంది. కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించరాదని హైకోర్టులకు సూచించింది. ఐఐటీ–జేఈఈ 2017 ర్యాం కుల జాబితా, అభ్యర్థులందరికీ అదనపు మార్కులు కేటాయించడాన్ని సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల్లో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో చెప్పాలని ఆయా రిజిస్ట్రీలను ఆదేశిస్తూ విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది. ఎందరో విద్యార్థులు పరీక్షలు రాశారని, వారందరినీ దృష్టిలో పెట్టుకుని సమస్యకు సరైన పరిష్కారం చూపాలని అడ్వొకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. పిటిష నర్ల న్యాయవాది వికాస్æ వాదిస్తూ.. ‘బోన స్ మార్కులు కేటాయించడం విద్యార్థుల హక్కులను హరించడమే’అన్నారు. స్పందించిన కోర్టు... సదరు ప్రశ్నలకు జవాబులు రాసిన వారికి ‘బోనస్ మార్కులు’ కేటాయించడమొక్కటే దీనికి పరిష్కార మంటూ 2005 నాటి ఓ తీర్పును ప్రస్తావించింది. -
గ్రూప్–2పై హైకోర్టు స్టే
నియామక ప్రక్రియ నాలుగు వారాల పాటు నిలిపివేత సాక్షి, హైదరాబాద్:గ్రూప్–2 నియామక ప్రక్రియ,హైకోర్టు ,స్టేరాత పరీక్ష జవాబుల ‘కీ’లో దొర్లిన తప్పులపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామ చంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2015లో జారీ చేసిన ప్రధాన నోటిఫికేషన్, 2016లో ఇచ్చిన అనుబంధ నోటిఫికేషన్లను రద్దు చేసి.. తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలం టూ మహబూబ్‌నగర్‌కు చెందిన నరసింహు డు, మరో 17 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. రాతపరీక్ష నిర్వహించాక గత డిసెంబర్లో జవాబుల ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసి, అభ్యంతరాలను కోరిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సురేందర్‌రావు కోర్టుకు నివేదిం చారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో టీఎస్పీఎస్సీ పలుమార్లు మార్చిన ‘కీ’లను విడుదల చేసిందని.. చివరి ‘కీ’ లోనూ తప్పు లున్నాయని వివరించారు. వాదనలను పరిగ ణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. గ్రూప్–2 నియామక ప్రక్రియను 4వారాల పాటు నిలిపే యాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. విచార ణను రెండు వారాలకు వాయిదా వేశారు. అర్హతగా ఎందుకు తీసుకోరు? వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అర్హతగా ఇంటర్ ఒకేషనల్ కోర్సులను పరిగణనలోకి తీసుకోకపోవడంపై జస్టిస్ రామ చంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. ఈ పోస్టుల భర్తీలో ఇంటర్ ఒకేష నల్ కోర్సులను అర్హతగా తీసుకునేందుకు వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి తిరస్కరించడా న్ని సవాలు చేస్తూ ఒకేషనల్ విద్యార్థులు, నిరు ద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పశువధ నిషేధంపై స్టే
మద్రాస్ హైకోర్టు నిర్ణయం 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం సాక్షి, చెన్నై/కోల్‌కతా: పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల స్టే విధించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్ల ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు రాజ్యాంగ, సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు సెల్వగోమతి, అసిక్ఇలాహీ భావా పేర్కొన్నారు. నిబంధనలు 1960నాటి జంతుహింస నిరోధక చట్టానికి కూడా వ్యతిరేకం కనుక వాటిని రద్దు చేయాలని కోరారు. కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్ ఆహార సంబంధ అంశం కనుక దానికి మొదట పార్లమెంటు ఆమోదం అవసరమని వాదించారు. ‘రాజ్యాంగం ప్రసాదించిన మతస్వేచ్ఛకు నిషేధం విఘాతం కలిగిస్తోంది. జంతుబలి, బలి ఇచ్చిన జంతువుల మాంసంతో వంటలు చేసుకోవడం దేశంలోని చాలా సమాజాల సంస్కృతి. నిషేధం వల్ల బలి కోసం పశువుల క్రయవిక్రయాలకు వీలుండదు.. రైతులు, వ్యాపారులు, కబేళాల ఉద్యోగుల జీవనోపాధికి విఘాతం కలుగుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం:కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: పశువధ నిషేధంపై పలు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుప్రీం కోర్టు, జంతు హింసపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అభిప్రాయాల నేపథ్యంలో నిషేధం తెచ్చారన్నారు. నిషేధాన్ని పాటించకండి: మమత పశువధపై కేంద్ర నిషేధాన్ని.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలిచ్చేంతవరకు పాటించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అధికారులకు చెప్పారు. ‘రంజాన్ నెల నడుస్తోంది. అందరికీ తమ పండుగలను జరుపుకునే హక్కు ఉంది. ఎవరేం తినాలో ఆదేశించే హక్కు ఎవరికీ లేదు’ అని అన్నారు. -
టెకీలకు గుడ్ న్యూస్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
-
గృహ నిర్మాణాలపై స్టే
టీనగర్: చెన్నై చిట్లపాక్కంకు చెందిన న్యాయవాది ఎస్ వైద్యనాథన్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. చెన్నై సమీపంలోగల చిట్లపాక్కంలో 80 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉండేదని, ప్రస్తుతం ఈ చెరువు విస్తీర్ణం 20 ఎకరాలకు కుంచించుకుపోయిందని తెలిపారు. ఈ చెరువు స్థలంలో ఆలయాలు, కల్యాణ మండపాలు, గ్రంథాలయం పేరిట అనేక మంది ఆక్రమణలు జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా గృహాలతోపాటు అనేక భవనాలను నిర్మించినట్లు తెలిపారు. ఈ చట్టవిరుద్ధ ఆక్రమణలతో గత 2015 డిసెంబర్లో చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు. నిర్మాణాలపై స్టే: నీటి కాలువలను ఆక్రమించి పలువురు నిర్మాణాలు జరిపారని, అందువల్ల ఈ చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించాలని, మళ్లీ చెరువును పాత స్థితికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ చెరువు ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు స్టే విధించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఎం.సుందర్‌ల సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు చిట్లపాక్కం చెరువులో నిర్మాణాలను చేపట్టరాదని స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా ఈ చెరువులో ఆక్రమణ వివరాలను హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల నష్టం: రాష్ట్రంలోగల 578 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఆదాయాన్ని 20 వేల కోట్లకు పెంచే విధంగా 2012లో స్థలాల రీవాల్యుయేషన్‌ను పలు రెట్లకు పెంచారు. అయితే ఇందులో అవకతవకల కారణంగా ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయమే లభిస్తూ వచ్చింది. ఈ కోవలో నాలుగేళ్లలో రూ.40 వేల కోట్ల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇందులో అధికారులు కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడయింది. -
సుప్రీం స్టే పై స్పందించిన శివశంకరన్
న్యూఢిల్లీ:ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్నిఎయిర్సెల్ అసలు ప్రమోటర్ సి శివశంకర్ స్వాగతించారు. న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందనీ, సుప్రీం పరిశీలనను గౌరవిస్తామంటూ సంతోషం వ్యక్తంచేశారు. మలేషియా మాక్సిస్ గ్రూప్ మాక్సిస్ నుంచి ఎయిర్ సెల్ 2 జి లైసెన్సుల బదిలీ ఒప్పందంపై తాత్కాలిక స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మర్చంట్ బ్యాంకర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (ఎస్సీబీ)భారతీయ బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్ సెల్స్ యూజర్స్ ను టేక్ ఓవర్ చేసే కొనుగోలుదారుని చూడలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ను శివశంకర్ కోరారు. తద్వారా ఎయిర్ సెల్, శివ గ్రూపు బాకీల చెల్లింపునకు తోడ్పడాలని కోరారు. కాగా కావాలనే తన 2జి స్పెక్ట్రం లైసెన్సు తిరస్కరించారని చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ అప్పట్లో ఆరోపించారు. అలాగే ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే14 రకాల లైసెన్సులకోసం దరఖాస్తు చేసుకోగా వేటినీ పట్టించుకోలేదు. విసిగి పోయిన శివశంకరన్ డిసెంబరు 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్ కి 14 లైసెన్సులూ వచ్చేశాయి. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి సోదరుని కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రు.599.01 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే. -
123 జీవోపై స్టేతో నష్టం లేదు!
దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్న నీటి పారుదల శాఖ 2013 చట్టం ప్రకారమే నోటిఫికేషన్, భూసేకరణ జరుగుతోందని వెల్లడి సవరణ బిల్లు ఆమోదం పొందితే 123 జీవో కింద సేకరణ అధికారికం అవుతుందని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూసేకరణ చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు కోరుకున్నట్లుగా భూసేకరణ చేస్తున్నందున.. కోర్టు ఉత్తర్వులపై మళ్లీ అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. భూసేకరణ చట్టం–2013 ప్రకారమే ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు, భూసేకరణ జరుగుతోందని... జీవో 123 కింద సేకరించిన భూమి సైతం భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే అధికారికం అవుతుందని పేర్కొంటోంది. భారీగా భూసేకరణ: రాష్ట్రంలో మొత్తంగా 3.2 లక్షల ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, అందులో ఇప్పటికే 2.12 లక్షల ఎకరాల సేకరణ పూర్తయింది. ఇందులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 63 వేల ఎకరాల మేర సేకరించగా.. దీనిలో 47 వేల ఎకరాలు 123 జీవో కింద, 16 వేల ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నారు. ఇంకా ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 45 వేల ఎకరాలు, పాలమూరు కింద 13 వేల ఎకరాలు, దేవాదుల కింద 7 వేల ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ప్రభుత్వం సంబంధిత నిర్వాసితులతో నేరుగా మాట్లాడి, ఒప్పించి 123 జీవో మేరకు భూసేకరణ జరుపుతోంది. ఆయా చోట్ల మార్కెట్ ధరల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అందిస్తోంది. అయితే ఆ ధర తమకు సరిపోదని.. చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరిన చోట ఆ విధంగా భూసేకరణ జరుపుతోంది, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో 13 వేల ఎకరాల మేర సేకరించగా.. వేములఘాట్ గ్రామ పరిధిలో 1,300 ఎకరాలు భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తోంది. పాలమూరులోని పలు గ్రామాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ఏమాత్రం ఉండబోదని నీటి పారుదల శాఖ పేర్కొంటోంది. ఇక ఇప్పటికే 123 జీవో కింద సేకరించిన భూమి సైతం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే.. చట్ట ప్రకారం సేకరించినట్లు అవుతుందని చెబుతోంది. ‘‘కోర్టు తీర్పుతో ప్రాజెక్టుల్లో భూసేకరణ ఎక్కడా ఆగిపోదు. చట్ట ప్రకారం భూసేకరణ జరుగుతుంది. కాబట్టి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం సైతం లేదు.’’అని ఉన్నత స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లో అనుమతులు లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు గాను కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్ లీడర్ కుమార్ విశ్వాస్‌పై ఎన్నికల సంఘం అధికారులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. దీనికి సంబంధించి యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు కేజ్రీవాల్, విశ్వాస్‌లకు సమన్లు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్, విశ్వాస్‌లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై విచారణ జరిపిన జగదీష్ సింగ్ ఖేర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. సుల్తాన్ పూర్ కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. -
బిహార్ మద్య నిషేధ చట్టం రద్దుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర మద్యపాన నిషేధ చట్టాన్ని కొట్టేస్తూ పట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. మద్యం, ప్రాథమిక హక్కులు కలిసి సాగలేవని పేర్కొంది. ఈ చట్టాన్ని పట్నా హైకోర్టులో సవాలు చేసిన కక్షిదారులైన మద్యం తయారీ సంస్థలకు నోటీసులు జారీచేసింది. జన్యు ఆవాలపై స్టే.. జన్యుమార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన ఆవాల(జీఎం మస్టర్డ్) విత్తనాల సరఫరాపై సుప్రీంకోర్టు పది రోజులపాటు స్టే విధించింది. విత్తనాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
స్టే యథాతథం..
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్ల అమలు సక్రమంగా అమలు చేయనందున ఎన్నికలను నిలుపుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని మద్రాసు హైకోర్టులో డీఎంకే ఇటీవల ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కృపాకరన్ ఎన్నికల నిర్వహణను తప్పుపట్టారు. పిటిషన్ దారుడు ఆరోపిస్తున్న అంశాలు తప్పిదం అంటూ ఎన్నికల కమిషన్ నిరూపించలేక పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలు ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే హైకోర్టు మంజూరు చేసిన స్టేపై ప్రభుత్వం అప్పీలు పిటిషన్‌ను దాఖలు చేసింది. అభ్యర్థుల నామినేషన్లు, ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి అయిన దశలో వాయిదా పడడం ఇబ్బందికరమని ప్రభుత్వం తన అప్పీలు పిటిషన్లో పేర్కొంది. ఈ అప్పీల్‌ను అత్యవసర కేసుగా స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వ అప్పీల్ వల్ల ఎన్నికలపై మంజూరైన స్టే ఎత్తివేయకుండా డీఎంకే ముందు జాగ్రత్త చర్యగా కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను అత్యవసర కేసుగా విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తులు హూలువాడి రమేష్, వీ పార్తిబన్‌తో కూడిన ద్విసభ్య బెంచ్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలపై హైకోర్టు న్యాయమూర్తి జారీచేసిన స్టే విధించారు, స్టే జారీ కాగానే ఎన్నికలను రద్దు చేస్తున్నామని, ఎన్నికల ఏర్పాట్లన్నీ నిలిపి వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారని అన్నారు. ఎన్నికలు రద్దయినట్లు ఈసీ ఒకసారి ప్రకటించిన తరువాత అవే ఎన్నికలను కొనసాగించడం సాధ్యం కాదని అన్నారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు వేచి ఉండడమే సమంజసమని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించాలని, ఇతర రాష్ట్రాల అధికారులను నియమించాలని తదితర కోర్కెలతో మద్రాసు హైకోర్టులో డీఎంకే వేసిన పిటిషన్‌పై ఈనెల 18వ తేదీన విచారణ జరుగనుందని అన్నారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు వ్యక్తం చేసే అభిప్రాయాలను అనుసరించి ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు హైకోర్టు వాఖ్యలతో విఫలమయ్యాయి. అవకాశం మళ్లీ దక్కేనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ పెద్దల కాళ్లావేళ్లా పడి సంపాదించుకున్న టికెట్టు కోర్టు స్టేతో వృథాగా పోయిందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల తేదీ ప్రకటించగానే అన్నాడీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభించారు. సీట్ల కేటాయింపులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య మనస్పర్థలు రేగి సద్దుమణిగిన వెంటనే నామినేషన్లు వేసి ప్రచారంలోకి దిగారు. అన్ని పార్టీల వారు ఇంటింటికీ తిరిగి ఓటును అభ్యర్థించడం కొనసాగుతున్న దశలో ఎన్నికలు రద్దయినట్లు పిడుగులాంటి వార్త అభ్యర్థుల చెవిన పడింది. ఈ ఏడాది చివరలో ఎన్నికలు వచ్చినా మరోసారి తమకే అవకాశం దక్కుతుందా అనే ఆందోళనలో పడిపోయారు. -
స్పెషల్ డీఎస్సీపై హైకోర్టు స్టే
మారేడుమిల్లి : స్పెషల్ డీఎస్సీ 2016లో ఏపీ టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనరల్ డీఎస్సీ మాదిరిగా వెయిటేజ్ మార్కలు కలపాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషనుకు హైకోర్టు స్టే ఇచ్చినట్టు ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లె ల్లం శేఖర్ తెలిపారు. స్థానిక చెలకవీధిలో శనివారం జరిగిన సంఘం సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గత నెల 28వ తేదీన రంపచోడవరం, 29వ తేదీన చింతూరు గ్రామంలో జరగాల్సిన డీఎస్సీ 2016 ఉపాధ్యాయుల నియామకాల పరీక్షలకు జీఓ నెం 2922/2016 ప్రకారం స్పెషల్ డీఏస్సీలో టేట్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనే అంశంపై గిరిజనులు సింహచలం, దుర్బాంబ, మాధవి, విజయ భాస్కర్ రెడ్డి, అన్నం నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చి తాత్కాలికంగా వాయిదా వేశారని తెలిపారు. టేట్ ఆదివాసీ అభ్యర్థులు ఆదివారం రంపచోడవరంలోని స్వర్ణ భారతి గ్రౌండ్లో జరిగే సమావేశంలో తమ పేర్లు న మోదు చేసుకోవాలని సూచించారు. సంఘం నాయకులు అందాల రత్నారెడ్డి, కత్తుల ఆదిరెడ్డి, పల్లాల రాజశేఖర్ రెడ్డి, రంభ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు స్టే తెచ్చుకోవడం సరికాదు’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్ధపడాలని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ 17సార్లు స్టే ఎందుకు తెచ్చుకున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నిప్పునని చెప్పుకునే బాబు స్టే కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని, డీపీఆర్ లేకుండానే టెండర్లు పిలుస్తున్నారని ఆయన విమర్శించారు. -
పదవిలో కొనసాగాలనుకున్నా- రాజన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణకు కేవలం రెండు రోజుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలని అనుకున్నానని కానీ, అది సాధ్యపడలేదని జాతీయ మీడియాతో తెలిపారు. కొన్ని అంసపూర్ణ చర్యల నేపథ్యంలో తాను రెండవసారి గవర్నర్ గా కొనసాగాలని భావించానని తెలిపారు. కానీ అది నెరవేరలేదని తెలిపారు. దీనిపై మరింత వివరించడానికి నిరాకరించిన రాజన్ తన వివాదాస్పద ప్రసంగాలను సమర్థించుకున్నారు. ఐఐటీ ఢిలీలో సహనం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆలోచనలతో కూడిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఆయన వివరణ ఇచ్చారు. కొంతకాలం పాటు పబ్లిక్ స్పీక్ కు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. తాను నిజానికి దేశంలోని కొన్ని అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలనుకుంటున్నానీ, దీనికోసం దేశం చుట్టి రావాలనుకుంటున్నానని చెప్పారు. ఊర్జిత్ కు తాను సలహాలు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. అతనిమీద తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత అన్ని విషయాలపై ఆయనకు వివరించాననీ, ఆయన ధోరణి ఆయకుందని రాజన్ చెప్పారు. ఇపుడిక మళ్లీ అకాడమీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలాకాలం దూరంగా ఉన్న పరిశోధన, బోధన రంగానికి వెళ్లాలన్నారు. అక్కడ ఎన్నాళ్లు అన్నదే ప్రశ్న అని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత దిగి వస్తుందన్నారు. జులై నెలలో ఇది అంతకంటే ఎక్కువే (6.07 శాతం) ఉంది. 6 శాతం కంటే తక్కువే ఉంచాలన్నదే తన లక్ష్యమనీ, అది సాధించాకే తన పదవీకాలం ముగిసిందని రాజన్ తెలిపారు. కాగా ఈనెల (సెప్టెంబర్) 4వ తేదీన రాజన్ పదవీ కాలం ముగియనుంది. ఆర్ బీఐ నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే. -
జెడ్పీటీసీ సభ్యుడి సస్పెన్షన్ నిలిపివేత
జీఓను సస్పెండ్ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు హన్మకొండ/ గూడూరు : గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు మహ్మద్ ఖాసీంను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోఓను నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అటవీ భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ 532, తేదీ 04.08.2016తో ఖాసీంను సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే, తనను అకారణంగా సస్పెండ్ చేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఖాసీం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఖాసీం పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అలాగే, కౌంటర్ దాఖలు చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. -
రెండు వారాలకు మించి ఉండలేను
లాస్ ఏంజెల్స్: కుటుంబాన్నివదిలి దూరంగా ఉండటానికి కొంతమంది ఇష్టపడరు. కొందరు ఇంటిమీద బెంగతో హోం సిక్ అవుతారు కూడా. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ హీరోలు సైతం ఇంటిపై బెంగ పెట్టుకుంటారట. హాలీవుడ్ హీరో మాట్ డమోన్ తన కుటుంబాన్ని వదిలి రెండు వారాలకు మించి ఉండలేనని అంటున్నారు. ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ లో ఉన్నా రెండు వారాలకొకసారి ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. సినిమా ఒప్పుకోగానే తన భార్య లూసియానా బారోస్ తో చర్చిస్తానని చెప్పాడు. రెండు వారాలకు మించి షూటింగ్ కోసం వేరేచోట ఉండాల్సి వస్తే తన భార్య, పిల్లలను తీసుకెళ్తానని తెలిపాడు. ఇది ఒక్కోసారి తమ కుటుంబానికి హాలిడే ట్రిప్ లాగా ఉంటుందని అన్నాడు. గతేడాది చైనా పర్యటనకు ఆరు నెలలు తమ కుటుంబంతో కలిసి వెళ్లినట్టు తెలిపాడు. -
రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ‘సాక్షి’కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను కూల్చివేయడంపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ప్రజా ప్రయోజనాల దష్ట్యా వైఎస్ఆర్సీపీ తరపున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ హైకోర్టు మంగళవారం స్టే మంజూరు చేసిందని ఆయన తెలిపారు. -
నీట్ ఆర్డినెన్స్ స్టేపై సుప్రీం కోర్టు నిరాకరణ
-
నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు. టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి. చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు. ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు. ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు. -
జాట్ల రిజర్వేషన్‌పై స్టే
పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులు చండీగఢ్: జాట్లతోపాటు మరో ఐదు వర్గాలకు బీసీ (సీ) కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించింది. హర్యానా వెనుకబడిన తరగతుల (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్) చట్టం-2016ను హర్యానా అసెంబ్లీ గత మార్చి 29న ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.. దీని చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ఎస్ సరోన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మురారిలాల్ గుప్తా అనే వ్యక్తి కొత్తగా తెచ్చిన బీసీ (సీ) కేటగిరీని సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక మేరకు ప్రభుత్వం జాట్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించిందని, అయితే ఈ కమిషన్ నివేదికను అప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషనర్ చెప్పారు. న్యాయ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లుబాటుకాదన్నారు. ఈ కమిషన్ నివేదికలోని అంశాలపై సవరణలు చేసే అధికారం కేవలం న్యాయవ్యవస్థకే ఉందని, దీనిపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు. -
రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే
హర్యానా ప్రభుత్వం జాట్ సిక్కులు, జాట్ ముస్లింలు, బిష్ణోయ్స్, రోర్స్, త్యాగీ కులాలను బీసీలలో చేరుస్తూ ప్రత్యేకంగా తయారుచేసిన 'సీ' కేటగిరీ రిజర్వేషన్లపై పంజాబ్-హర్యానా హైకోర్టు స్టే విధించింది. మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం జాట్ల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ భివానీకి చెందిన మురారీలాల్ గుప్తా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత మార్చి 29న హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిన ఈ బిల్లును జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ తయారుచేసిందని, ఈ రిపోర్టును సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఒకసారి న్యాయవ్యవస్థ ద్వారా ఇచ్చిన తీర్పును తిరిగి మళ్లీ దాని ద్వారానే మార్చాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. 2014లో ప్రభుత్వం జాట్లను ఓబీసీల్లోకి చేర్చే ప్రయత్నం చేసిందని.. సుప్రీం కోర్టు కమిషన్ రిపోర్టులను కొట్టివేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు గుప్తా గుర్తుచేశారు. వాదోపవాదనలు విన్న జస్టిస్ మహేశ్ గ్రోవర్ తో కూడిన ధర్మాసనం అసెంబ్లీ బిల్లుపై స్టే విధిస్తూ.. తీర్పును వాయిదా వేసింది. -
మీ తరఫున పోరాడేది నేనొక్కడినే..
♦ ఇళ్ల తొలగింపుపై స్టే తెచ్చింది నేనే.. ♦ అవసరమైతే వారికోసం నిరాహార దీక్ష చేస్తా.. ♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ♦ 38, 39,45,46,47,48 డివిజన్లలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో ♦ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన టీఆర్ఎస్కు ఓట్లేయకపోతే మీ ఇళ్లు పీకేస్తామని బెదిరించిన సంగతి నా దృష్టికి వచ్చింది. మీ ఇళ్లను ఎవరూ తొలగించలేరు. వాటికి పట్టాలిప్పిస్తా. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఒక్కొక్కటి ఏర్పాటు చేయిస్తా. నా వెనుక మంత్రులు, సీఎంలు లేరు. నేనొక్కడినే.. మీ అందరి కోసం పోరాడతా. ఎంపీగా గెలవక ముందు శ్రీనివాస నగర్లో ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే.. వారి తరఫున హైకోర్టు నుంచి స్టే తెచ్చాను. ఇప్పటికీ వాళ్ల జోలికి వెళ్లిన వారు లేరు. ఇలాగే మీ ఇళ్లకు పట్టాలు వచ్చేందుకు అవసరమైతే మీ మధ్యలోనే కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాల్వకట్ట ప్రజలకు భరోసానిచ్చారు. ఖమ్మం : కార్పొరేషన్ పరిధిలోని 38,39,45,46,47,48 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు కోసం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 39వ డివిజన్లో... ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. 39వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు(నగేష్)ను మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థించారు. కాల్వకట్టపై పాదయాత్ర చేస్తూ.. ఇంటింటి ప్రచారం చేపట్టారు. గతంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ైవె ఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు పరిష్కరించారని కాలనీవాసులు చెప్పారు. సేవచేసే నాగేశ్వరరావుకు ఓట్లేస్తామని ఎంపీ పొంగులేటికి హామీ ఇచ్చారు. అనంతరం వారితో ఎంపీ మాట్లాడుతూ.. 39వ డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు(నగే ష్)ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో డివిజన్ నాయకులు వల్లూరి తిరుపతిరావు, శింగు శ్రీనివాసరావు, కోటి మోహన్‌రెడ్డి, పీరూనాయక్, తోట వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, సురేందర్, మోహన్‌రాజా, నాగరాజు, పి.స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. 38వ డివిజన్లో... 38వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డోన్వాన్ ప్రియాంకను గెలిపించాలని కోరుతూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. గుట్టల బజార్, సుందర్, కిన్నెరసాని థియేటర్ ఏరియా, జహీర్పురా, ఎస్సీ కాలనీ ఏరియాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరా, డ్రెయినేజీ, శ్మశాన వాటిక సమస్యల పరిష్కారంతోపాటు డివిజన్ సుందరీకరణ కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిని డోన్వాన్ ప్రియాంకను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ధోన్వాన్ స్వాతి, సైదాబాయి, భట్టు స్వాతి, రాజు, లింగన్న, కృష్ణ, సురేష్, ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్లో... ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 45వ డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర్లె నాగకమలను గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. డివిజన్ పరిధిలోని మార్కెట్ ఏరియాతోపాటు పలు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి, అభ్యర్థిని బూర్లె నాగకమల రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో గుండపనేని ఉదయ్‌కుమార్, సింగం రామ్మూర్తి, కంబాల శ్రీను, గురుమూర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 46వ డివిజన్లో... 46వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని బాణాల అనితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని పారిశుద్ధ్య, తాగునీరు, అంతర్గత రోడ్ల ఏర్పాటుకు కృషి చేసిన బాణాల అనితను గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలకు స్థలం కేటాయించేలా ప్రభుత్వంపై పోరాడుతామని, దీనికోసం తనను గెలిపించాలని బాణాల అనిత కోరారు. ప్రచారంలో కేవీ.చారి, బాణాల లక్ష్మణ్, చిత్తూరు నాగేశ్వరరావు, దుర్గారావు, ఉపేందర్, సతీష్, సురేష్, పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. 47వ డివిజన్లో... 47వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి సంపెట వెంకటేశ్వర్లు వైఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని జగనన్న అడుగుజాడల్లో ప్రజా సేవ చేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డివిజన్లో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన నిస్వార్థపరుడు సంపెట వెంకటేశ్వర్లు అని అన్నారు. ఎలాంటి చందాలు, దందాలు లేకుండా... ఎవరికి ఏ పని కావాలన్నా.. తనను ఆశ్రయిస్తే అందరికీ సేవ చేసుకుంటానని సంపెట వెంకటేశ్వర్లు అన్నారు. డివిజన్లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. 48వ డివిజన్లో... ఇద్దరు కొడుకులు డాక్టర్లు.. మంచి సంపాదన.. ప్రశాంత జీవితం అనుభవించే నిస్వార్థపరుడు చిత్తలూరి నర్సయ్యగౌడ్ అని.. తన జీవితంలో ఎక్కడా ఎవరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని.. ఇతర వ్యక్తుల మాదిరిగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తి కాదని.. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి చిత్తలూరి నర్సయ్య గౌడ్‌ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. నర్సయ్యగౌడ్‌ను గెలిపించి హామీలు నిలబెట్టుకోలేని టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రచారంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ సాదు రమేష్‌రెడ్డి, సింగరపు యాగలక్ష్మి, కేవీ.చారి, బీ.లక్ష్మిరెడ్డి, వట్టం రాంబాబు, రంజిత్, సురేష్, ఏడుకొండలు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మదురై, రంగంలలో జోరుగా జల్లికట్టు
సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోని జనం చెన్నై/చంద్రగిరి: సుప్రీంకోర్టు వద్దన్నా.. సాంప్రదాయ ఆట ఆగలేదు. తమిళనాడులోని మదురై శివార్లలో శనివారం ఎప్పటిలాగే ఘనంగా జల్లికట్టును నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్డినెన్సు తేవాలని కేంద్రాన్ని తమిళనాడు అధికార విపక్షాలు కోరటం, ప్రజలు కూడా రోడ్లపై నిరసనలు చేపట్టిన సందర్భంలో.. ఈ క్రీడపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం మదురైతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా జల్లికట్టు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ... చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో నిర్వహించే ఎడ్ల పందేల(జల్లికట్టు)ను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జల్లికట్టులో గెలుపొందిన వారు చెక్క పలకలను చే త పట్టుకుని విజయగర్వంతో ఊగిపోయారు. జల్లికట్టు సందర్భంగా రంగంపేట గ్రామం జనంతో నిండిపోయింది. చిత్తూరు జిల్లా రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టులో పరుగులు తీస్తున్న పోట్లగిత్తలు -
జల్లికట్టుకు అనుమతిపై సుప్రీంకోర్టు స్టే
-
జల్లికట్టుకు అనుమతిపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: జల్లికట్టుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది. జల్లికట్టుపై గతంలో సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని కేంద్రం ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో సంబరాలు చేసుకున్నారు. అయితే జంతు పరిరక్షణ సంస్థతో పాటు పలువురు కేంద్రం తీరుపై మండిపడుతూ జల్లి కట్టును నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం...జల్లికట్టు అనుమతిపై స్టే విధిస్తూ కేంద్రానికి, తమిళనాడు సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. -
'కిల్లింగ్ వీరప్పన్'పై కోర్టు స్టే
బెంగళూరు: రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం విడుదలపై బెంగళూరు నగర సివిల్ కోర్టు స్టే విధించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అడవిదొంగ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందించిన చిత్రంపై కన్నడ, తమిళ చలనచిత్ర రంగానికి చెందిన రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. వీరప్పన్ జీవిత చరిత్రను ముద్రించడానికి, తెరకెక్కించడానికి తనకే సర్వహక్కులు ఉన్నట్లు ఈ మేరకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ తనకు లిఖిత పూర్వకంగా అనుమతిచ్చారని రాజు కోర్టుకు తెలిపారు. దీంతో 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా విడుదలపై స్టే ఇస్తూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు నిర్మాత కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించడానికి రెండు మూడు రోజుల్లో రానున్నట్లు సమాచారం. కిల్లింగ్ వీరప్పన్‌లో శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
ఆ రైతు కుటుంబాలను నిలబెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు మళ్లీ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మహిళా రైతులు, శ్రామికుల హక్కుల వేదిక (మకాం) డిమాండ్ చేసింది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన మహిళలను రైతులుగా గుర్తించాలని, వారు వ్యవసాయం కొనసాగించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరింది. మహిళా రైతులను ఆదుకునేందుకు వారి పేరిట పట్టాలు, రుణాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. శుక్రవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం-మహిళా రైతులు, శ్రామికులపై పడుతున్న ప్రభావం-మనమేం చేద్దాం?’’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక సభ్యురాలు గోపరాజు సుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోప్రొ.రమా మెల్కొటే, మకాం ప్రతినిధులు ఉషా సీతాలక్ష్మి, విజయ రుక్మిణిరావు, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. మకాం పక్షాన గ్రామాలకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని, మహిళా రైతు లు, గ్రామాల్లో సంప్రదాయ వ్యవసాయ పరిరక్షణకు చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయంలో మహిళల పాత్రను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను బాధిత రైతు కుటుంబాల మహిళలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమా మెల్కొటే మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం సమగ్రమైన విధానం రూపొందించాలన్నారు. సాగును మరిచిపోయి కేవలం పాశ్చాత్య దేశాల్లోని అభివృద్ధిని అనుసరించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడకపోవడం వల్లే సంక్షోభం తలెత్తుతోందని ఉషా సీతాలక్ష్మి అన్నారు. రైతుల కోసం విరాళాలు సేకరిస్తున్నవారిలో.. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం కాకుండా, వారి ద్వారా ఏం ప్రయోజనం పొందుదామనే ధోరణే కనిపిస్తోందని కె.సజయ అన్నారు. మహిళా రైతులకు గుర్తింపు, ఇతరత్రా సమస్యలపై పాదయాత్ర నిర్వహించాలని ప్రముఖ రచయిత్రి విమల సూచించారు. -
డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
మాంసం నిషేధంపై హైకోర్టు స్టే
ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ నెల 17న మాంసం అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హైకోర్టు స్టే విధించింది. ఆ రోజు జంతు వధ విషయంలో జోక్యం చేసుకొని అలాంటివి జరగకుండా చూడాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. 2004లో కూడా రెండు రోజులపాటు మాంసం అమ్మకాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని గుర్తు చేసింది. జైనుల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమిది రోజులు మాంసం నిషేధించాలని, ఆతర్వాత నాలుగురోజులకు కుదించి, అప్పటికీ పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో తర్వాత రెండు రోజులకు చివరికి ఒకే రోజుకు మాంసాన్ని నిషేధించినా.. దానిపై కూడా హైకోర్టు స్టే విధించింది. -
'వచ్చే నెల వరకు వారిని అరెస్టు చేయొద్దు'
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం సుప్రీంకోర్టు వారిని అరెస్టు చేయకుండా గడువు మరింత పొడిగించింది. వచ్చే నెల 15 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. 2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
కోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో ఊరట లభించింది. అమేథి కోర్టు కేజ్రీవాల్ కు జారీ చేసిన వారెంట్‌పై అలహాబాద్ హైకోర్టు మూడు వారాల పాటు స్టే విధించింది. సోమవారం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్బంగా కేజ్రీవాల్ విద్వేషపూరిత ప్రసంగం చేసినట్టు కేసు నమోదైంది. కేసుకు సంబంధించి అమేథి కోర్టు కేజ్రీవాల్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. -
'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు'
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మెడికల్ టెస్టును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రీ మెడికల్ టెస్టు ఫలితాలు వెల్లడించకుండా స్టేను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ మెడికల్ టెస్టులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
బొగ్గు కేసులో మన్మోహన్‌కు ఊరట
- సబీఐ కోర్టు సమన్లపై సుప్రీంకోర్టు స్టే - నేరపూరిత కుట్ర ఎక్కడ ఉందని ప్రశ్నించిన సిబల్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న కోర్టుకు హాజరవ్వాలంటూ మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను కూడా నిలిపివేస్తూ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అలాగే, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డీ)(3) చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలంటూ కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధానిగా ఉన్న సమయంలో ఒడిశాలోని తలబిర 2 బొగ్గు గనులను హిందాల్కో కంపెనీకి అక్రమంగా కేటాయించిన కేసులో మన్మోహన్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ ఈ మాజీ ప్రధానిని కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన స్టే ఆ కేసులో ఇతర నిందితులు హిందాల్కో యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖ్, హిందాల్కో సంస్థ, ఆ కంపెనీ ఉన్నతాధికారులు భట్టాచార్య, శుభేందు అమితాబ్‌లకు కూడా వర్తిస్తుంది. మాజీ ప్రధాని తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల సమయంలో మన్మో హన్‌సింగ్ కుమార్తెలు ఉపీందర్ సింగ్, దామన్ సింగ్ కోర్టుహాల్లోనే ఉన్నారు. హిందాల్కోకు బొగ్గు గనిని కేటాయించడం పరిపాలనాపరంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ)కి అన్వయించడాన్ని తప్పుబడుతూ.. మన్మోహన్‌సింగ్‌కు జారీ చేసిన సమన్ల న్యాయబద్ధతను తన వాదన సందర్భంగా సిబల్ ప్రశ్నించారు. సిబల్ వాదనలోని ముఖ్యాంశాలు.. - స్కీనింగ్ కమిటీ విధివిధానాలు చట్టబద్ధంగా లేవంటూ.. గతంలో జరిగిన అన్ని బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు అదే స్క్రీనింగ్ కమిటీ విధివిధానాలను పాటించలేదంటూ నా క్లయింట్ మన్మో హన్‌కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇది హేతుబద్ధంగా లేదు. - సీఆర్పీసీ ప్రకారం నేర నిర్ధారణకు అవసరమైన వాటిలో.. నిందితులంతా కలసి నేరం చేయడానికి కుట్ర పన్ని ఉండాలి. ఈ కేసులో అలాంటిదేమీ జరగలేదు. తలబిర గనులను ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించడంలో నేరపూరిత కుట్ర కనిపిస్తోందా? ఒక బొగ్గుగనిని ప్రైవేటు కంపెనీకి కేటాయించడం నేరమవుతుందా? - సమాఖ్య స్ఫూర్తితో ఒడిశా ప్రభుత్వ వినతిని గౌరవిస్తూ ప్రధాని మన్మోహన్ బొగ్గుశాఖ మంత్రి హోదాలో ఆ నిర్ణయం తీసుకున్నారు. - చట్టపరంగా, సాక్ష్యాలను అర్థం చేసుకునే పరంగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు సమన్లు జారీ చేయడం ట్రయల్ కోర్టు చేసిన దారుణమైన తప్పు. - నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 197 కింద పబ్లిక్ సర్వెంట్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ముందస్తు అనుమతి అవసరమన్న విషయాన్ని ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విచారించాలంటూ 2014, డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు సీబీఐని ఆదేశించడం కూ డా తప్పు. ఒక న్యాయమూర్తి అలా ఆదేశించకూడదు. సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించవచ్చు కానీ దర్యా ప్తు తీరును జడ్జి నిర్ణయించకూడదు. -
ఉబర్ అత్యాచార కేసులో హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే
న్యూఢిల్లీ: ఉబర్ రేప్ కేసులో సాక్షులని పునర్విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. అంతే కాకుండా ప్రస్తుతం ట్రయిల్ కోర్టులో కొనసాగుతున్న విచారణలపై కూడా స్టే మంజూరు చేసింది. సాక్షుల పునర్విచారణకి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన అప్పీలుపై స్పందించిన న్యాయమూర్తులు జస్టిస్ జగదీష్ సింగ్, జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను సీల్డు కవర్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే బాధితురాలు దాఖలు చేసిన అప్పీలుపై రెండు వారాల్లోగా స్పందించాలని నిందితుడు శివ్‌కుమార్ యాదవ్, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సాక్షులని సరిగ్గా విచారించలేదని వారిని పునర్విచారించాలని నిందితుడు ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయగా, దానికి కోర్టు సానుకూలంగా స్పందిస్తూ మార్చి 4న తీర్పునిచ్చింది. అయితే, బాధితురాలు ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారణ ఆలస్యం అయితే బాధపడాల్సింది నిందితుడేనన్న హైకోర్టు వ్యాఖ్యలపై బాధితురాలు స్పందించింది. అది పూర్తిగా తప్పు, ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ మొదలుకొని ప్రతి విషయంలో తానే వ్యధకు గురవుతున్నానని పేర్కొన్నారు. సాక్షుల పునర్విచారణకు ఆదేశిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా సాక్షుల పునర్విచారణను రోజువారీ పద్ధతిలో చేయాలని, విచారణను వాయిదాలు వేయొద్దని హైకోర్టు మార్చి 4న తీర్పులో వెలువరించింది. -
బెజవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' పై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు...ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది. బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు. పేరు.. ఊరు.. ఏం చేస్తారు.. రాత్రి వేళ ఏ పనిమీద వెళ్తున్నారు వంటి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు ముఖ్యంగా సదరు పౌరునికి సంబంధించి ఆధార్‌కార్డు లేదా ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన మరేదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తారు. ఒకవేళ పట్టుబడిన వారు నేరస్థులైతే.. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తారు. దీనిపై న్యాయమూర్తి...హైకోర్టును ఆశ్రయించటంతో ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను తాత్కాలికంగా బ్రేక్ వేసింది. -
కిల్లర్ కోలీ మరణ శిక్షపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి తాత్కాలిక వూరట లభించింది. కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. కాగా కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు.కాగా కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి. -
కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టేకు హైకోర్టు నిరాకరణ
-
చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులకు ఉన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఊచకోత తోసిన విషయం తెల్సిందే. దీనిపై చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు తీర్చునిచ్చింది. కాగా ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను జరిపిన సుప్రీంకోర్టు ...దిగువ కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించటంతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చింది. కాగా దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
డ్రగ్‌స్టోర్‌కు తాళం
ఓ ఫార్మాసిస్టు నిర్వాకం - సస్పెన్షన్ ఎత్తివేయలేదని నిరసన - క్షయ నివారణ కేంద్రంలో - ఇది రెండో ఘటన ఐదు రోజులుగా - మౌనందాల్చిన అధికారులు కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: తన సస్పెన్షన్‌పై ట్రిబ్యునల్ కోర్టు స్టే ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ ఫార్మాసిస్టు జిల్లా క్షయ నివారణ కేంద్రం డ్రగ్‌స్టోర్‌కు తాళం వేశారు. పైగా ఒక పేపర్‌పై తన పేరు రాసి, తాళానికి సీల్ చేయడం గమనార్హం. విషయం తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2010లో క్రిష్ణగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న బి.శారద ఎస్సీ, ఎస్టీ కేసు విషయమై అప్పట్లో వారం రోజుల పాటు జైలుకు వెళ్లారు. ఈ విషయమై ఆమె కోర్టుకు వెళ్లడంతో 2012లో కేసును కొట్టేశారు. ఘటన జరిగిన నాలుగేళ్లకు అధికారులు ఆమెకు శిక్ష విధించారు. జైలుకు వెళ్లిన విషయం ఆమె దాచి పెట్టారంటూ గత నెల 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆమె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అదే నెల 28న సస్పెన్సన్‌పై కోర్టు స్టే ఇచ్చింది. ఆ మేరకు తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆమె జిల్లా క్షయ నివారణఅధికారిని కోరారు. సస్పెండ్ చేసింది తాను కాదని చెప్పడంతో.. ఆ తర్వాత ఆమె డీఎంహెచ్ఓను కలిశారు. అక్కడ కూడా ఇదే సమాధానం రావడంతో డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌ను ఆశ్రయించారు. ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో ఆమె విసిగిపోయారు. ఈ నెల 15న జిల్లా క్షయ నివారణ కేంద్రానికి చేరుకుని డ్రగ్‌స్టోర్‌కు తాళం వేసి, దానికి తన పేరుతో ఉన్న పేపర్‌ను అతికించి వెళ్లిపోయారు. జిల్లా క్షయ నివారణ కేంద్రంలోని డ్రగ్‌స్టోర్‌కు గతంలోనూ ఓ ఫార్మాసిస్టు ఆరు నెలల పాటు తాళం వేయడం గమనార్హం. ఫార్మాసిస్టుల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడంలో అధికారులు విఫలమవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తరచూ డ్రగ్‌స్టోర్‌కు తాళం పడుతుండటంతో మందుల కొరత ఏర్పడుతోంది. అధికారులు విధిలేని పరిస్థితుల్లో వచ్చిన స్టాక్‌ను నేరుగా టీబీ యూనిట్లకు పంపుతున్నారు. డ్రగ్‌స్టోర్‌కు తాళం వేసిన విషయమై ఫార్మాసిస్టు శారదను వివరణ కోరగా తన సస్పెన్షన్‌పై కోర్టు స్టే ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తాళం వేశానన్నారు. గతంలో ఆరు నెలల పాటు ఓ ఉద్యోగి ఇలాగే తాళం వేసినా ఎవ్వరూ ప్రశ్నించలేదన్నారు. సమస్యను డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే తాను తాళం వేసినట్లు తెలిపారు. -
స్టే ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో నర్సరీ అడ్మిషన్లకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లపై విధించిన స్టేను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తివేసింది. దీంతో గత ఐదునెలలుగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నర్సరీ అడ్మిషన్లలో అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 27న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోరు ్టకొట్టివేసింది. ఈ విషయమై తనను అశ్రయించిన 24 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే సీట్ల సంఖ్యను పెంచాలంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కారును ఆదేశించింది. డిసెంబర్ 18న ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం నర్సరీలో ప్రవేశాలు చేపట్టొచ్చని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో నర్సరీ అడ్మిషన్లపై గడచిన ఐదు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి అడ్మిషన్ ప్రక్రియకు దారులు తెరుచుకున్నాయి. అంత ర్రాష్ట్ర బదిలీ కేటగిరీ ఆధారంగా తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిలిపిఉంచిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీ కింద అడ్మిషన్ ఇవ్వాలని కోరుతూ కేవలం 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులే సుప్రీంకోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని సీనియర్ న్యాయవాది నితేష్ గుప్తా తెలియజేయడంతో న్యాయమూర్తులు హెచ్.ఎల్.దత్, ఎం.వై.ఇక్బాల్, ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల పాటు తీర్పును నిలిపి ఉంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. తమ పిల్లల అడ్మిషన్ కోసం సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన తల్లిదండ్రుల జాబి తా ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఈ కేసు విచారణ ఆఖరి దశలో ఆదేశించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేట గిరీకి సంబంధించిన కేసులపై తాను విచారణ జరుపుతానని, ఈ కేసులను మినహాయించి మిగతా అన్ని కేటగిరీలకు నర్సరీ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ మూడో తేదీన ఉత్తర్వు జారీ చేసింది. కానీ సుప్రీంకోర్టు దీనిపై ఏప్రిల్ 11వ తేదీనస్టే విధించింది. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు జరుపుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఈ కేటగిరీ అడ్మిషన్లపై సర్వత్రా సందేహాలు తలెత్తాయి. అంతర్రాష్ట్ర బదిలీ కేటగిరీ కింద అడ్మిషన్లు అధికంగా జరుగుతున్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది. ఈ కేటగిరీ విద్యార్థులకు చివరలో అధిక పాయింట్లు రావడం వల్ల పాఠశాల పరిసరాలలో నివసించే విద్యార్థులు కూడా నైబర్‌హుడ్ కేటగిరీ కింద ప్రవేశాలు పొందలేకపోతున్నారని సదరు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలుచేస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం డిసెంబర్ 18న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమ పిల్లలు అడ్మిషన్లకు ఎంపికయ్యారని, అందువల్ల అడ్మిషన్ ఇవ్వాలని వారు కోరారు. అంతర్రాష్ట్ర కేటగిరీ కింద వివిధ పాఠశాలలకు వచ్చిన దరఖాస్తుల్లో 7,238 నిజమైనవి కాగా, 2,209 దరఖాస్తులు అసత్యమైనవని తేలింది. దీంతో తనను ఆశ్రయిం చిన 24 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలం టూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. -
నిర్భయ అత్యాచారం కేసు ఉరిశిక్షపై స్టే కొనసాగింపు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన గత డిసెంబర్ 16 నాటి నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషుల్లోకి ఇద్దరికి ఉరిశిక్ష విధింపుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 14 వరకు పొడగించింది. ఈ కేసులో ముకేశ్, పవన్‌గుప్తాకు ఉరి విధించడంపై మార్చి 15న సుప్రీంకోర్టు స్టే విధించింది. అది 31 తేదీన ముగియగా, దానిని ఈ నెల ఏడు వరకు పొడగించింది. తాజాగా మరో వారం గడువు ఇచ్చింది. నిర్భయ చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను ఈలోపు సమర్పించాలని న్యాయమూర్తులు బీఎస్ చౌహాన్, జె.చలమేశ్వర్‌తో కూడిన బెంచ్ దోషుల న్యాయవాది శర్మను ఆదేశించింది. ఈ కేసులో దిగువకోర్టు తీర్పు ప్రతులను సమర్పించాలని మార్చి 31నే ఆదేశించింది. వీరితోపాటు ఈ కేసులో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. ఇది అత్యంత అరుదైన, క్రూరమైన నేరం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 2012 డిసెంబర్ 16న దక్షిణఢిల్లీలో కదులుతున్న బస్సులో మైనర్ సహా ఆరుగురు నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేయడం తెలిసిందే. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ 2012 మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆరో నిందితుడైన మైనర్ యువకుడికి బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. మైనరే అయినా, ఇతడికి కూడా ఉరిశిక్ష విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. -
నిర్భయ కేసులో ఇద్దరి ఉరిశిక్షపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఇద్దరి ఉరిశిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నలుగురు దోషులు ముఖేష్ (26), అక్షయ్ ఠాకూర్ (28), పవన్ గుప్తా (19), వినయ్ శర్మ (20) హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఆ నలుగురు చేసిన నేరం అత్యంత అరుదైనదిగా భావించిన ధర్మాసనం.. మహిళలపై ఘోరమైన నేరాల్లో అనుసరించదగ్గ శిక్ష వేయాలని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ముఖేష్, పవన్‌ల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దాంతో ముఖేష్, పవన్‌ల ఉరిశిక్షపై మార్చి 31 వరకు సుప్రీం కోర్టు స్టే విధించింది. అప్పీలు పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. -
ఇగ్నో.. వినూత్న కోర్సులు..
జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినూత్న కోర్సులను ప్రవేశపెట్టడంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ముందుంది. ఈ యూనివర్సిటీ అందిస్తునన్ని కోర్సులను మరే యూనివర్సిటీ ఆఫర్ చేయడం లేదు. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని ీపీహెచ్డీ కోర్సుల వరకు ఇగ్నోలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులే. ఇగ్నో అందిస్తున్న కోర్సుల వివరాలు.. సర్టిఫికెట్ కోర్సులు: ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌లైన్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్, బీ కీపింగ్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్-బీపీవో-ఐటీఈఎస్, లైఫ్‌లాంగ్ లెర్నింగ్, యూత్ ఇన్ డెవలప్మెంట్ వర్క్, టెలిసెంటర్/విలేజ్ నాలెడ్జ్ సెంటర్ మేనేజ్మెంట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ఐటెమ్స్, డిస్పెన్సింగ్ ఆప్టిక్స్, కమ్యూనిటీ రేడియో, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, క్రాఫ్ట్ అండ్ డిజైన్, ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, క్రియేటివ్ మీడియా ఆర్ట్స్- డిజిటల్ సౌండ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఫంక్షనల్ ఇంగ్లిష్ (ప్రాథమిక స్థాయి), ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మొదలైనవి. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: కోర్సులను బట్టి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అర్హతలున్నాయి. పీజీ డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు: కార్పొరేట్ గవర్నెన్స్, రూరల్ బ్యాంకింగ్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, బుక్ పబ్లిషింగ్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొదలైనవి. అర్హత: గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు: ఆక్వాకల్చర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, రేడియో ఇమేజినింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, పంచాయతీ లెవల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్, డెయిరీ టెక్నాలజీ, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, క్రిటికల్ కేర్ నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎర్లీచైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ . వ్యవధి: ఏడాది, అర్హత: 10+2. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: బీఎస్సీ: నాటికల్ సైన్స్, నర్సింగ్ (పోస్ట్ బేసిక్), హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, లెదర్‌గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్/టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీఎస్సీ ఆనర్స్: ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్. బీఏ: ఇంగ్లిష్, హిందీ, 3డీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఉర్దూ, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, టూరిజం స్టడీస్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అప్పారెల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్. ఇతర కోర్సులు: బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఎల్ఐఎస్సీ, బీఎస్‌డబ్ల్యు, బీబీఏ (రిటైలింగ్), బీకాం, బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్). మాస్టర్స్ డిగ్రీ కోర్సులు: ఎంఎస్సీ: యాక్చూరియల్ సైన్స్, క్లినికల్ ట్రైల్స్, కెమిస్ట్రీ, డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్. ఎంఏ: అడల్డ్ ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్, ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, హిందీ, హిస్టరీ, ఫిలాసఫీ, లేబర్ అండ్ డెవలప్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, సోషియాలజీ, టూరిజం మేనేజ్మెంట్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్, అప్పారెల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇతర పీజీ కోర్సులు: ఎంఎస్డబ్ల్యు, ఎంఎఫ్ఏ (పెయింటింగ్), ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంఎల్ఐఎస్సీ, ఎంకాం, ఎంకాం (మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్), (బిజినెస్ పాలసీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్), ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), (కార్పొరేట్ గవర్నెన్స్), (ఫైనాన్షియల్ మార్కెట్స్), (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్), ఎంటెక్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్, ఐటీ. నిరుద్యోగ యువత అవకాశాలకు ఇగ్నో.. బీకాం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎంఏ సైకాలజీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉంది. వచ్చే జూలై నుంచి పీజీ డిప్లొమాలో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిని అందుకునేలా ఎన్నో కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులు విలువైన సమయాన్ని నష్టపోకుండా తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా టూరిజం, హెల్త్, లీగల్, అగ్రికల్చర్, టీచింగ్ వంటి రంగాల్లో అపార అవకాశాలున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే కోరుకున్న కెరీర్లో ఆశించిన స్థాయికి చేరొచ్చు. యూజీసీ, సంబంధిత సంస్థల గుర్తింపు ఉన్న కోర్సులను పూర్తిచేస్తే విలువైన సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా చేసిన కోర్సుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. - డాక్టర్ కామేశ్వరిమూర్తి, రీజనల్ డెరైక్టర్, ఇగ్నో, హైదరాబాద్. -
సుప్రీం కోర్టులో సీబీఐకి ఊరట, గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే