సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిత్రం విడుదలపై ఆంక్షలు విధించడాన్ని అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి దాఖలు పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే.
చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీలో చిత్రం ఖచ్చితంగా విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment