Lakshmi’s NTR
-
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్‌కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్‌కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్‌కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్‌కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్‌ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్‌కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్‌లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్‌కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్‌కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్‌కుమార్, రంగస్థల నటుడు -
ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు. కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు(09-08-2019) ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతున్నాడు వర్మ. టైటిల్‌తోనే వివాదానికి తెర తీసిన వర్మ నిజంగా వివాదాలకు తావివ్వకుండానే ఈ సినిమా రూపొందిస్తున్నాడేమో చూడాలి. The most non controversial film “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am — Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2019 -
వస్తానన్నా.. వచ్చా : రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నంత పనీ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు ఆంధ్ర ప్రదేశ్‌లో అడ్డంకులు ఎదురుకావటంతో విజయవాడలోని పైపులరోడ్డులో ప్రెస్‌మీట్ పెట్టేందుకు వర్మ ప్రయత్నించాడు. కానీ పోలీసులు అడ్డుకొని వర్మను అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత కూడా పైపుల రోడ్డులో ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మ, ఎండ తీవ్రత కారణంగా ఫిలిం చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కానుంది. I finally on Paipula road in Vijaywada garlanded NTR in NTR circle అనుకున్నది చేసేసా.. https://t.co/tJUI7mTCfX 💪💪💪 — Ram Gopal Varma (@RGVzoomin) 28 May 2019 -
పసుపు–కుంకుమ తీసుకుని ఉప్పు–కారం ఇచ్చారు
భీమవరం: ఏపీ మహిళలు పసుపు–కుంకుమ తీసుకుని టీడీపీకి ఉప్పు–కారం ఇచ్చారని ప్రముఖ సినీదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేయగా కొంతమంది అడ్డుకున్నారని.. అందువల్లనే ఎన్టీరామారావు ఆగ్రహించి చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు. ఏపీలో సైకిల్‌కు పంక్చరైనందునే తాను కారులో వచ్చినట్టు చమత్కరించారు. ఎన్టీఆర్ జీవితం చివరి అంకంలో జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశాను తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని వర్మ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏనాడూ తనకున్న పవర్‌ను దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకోలేదన్నారు. -
ప్రజాసేవ చేయను: వర్మ
సాక్షి, భీమవరం: రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైకిల్ టైరు పంక్చర్ అయింది. అందుకే కారులో వచ్చామ’ని చమత్కరించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్ పడిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్‌బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానుంది. -
చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముందే చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. చిత్రం విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్ పడిందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఫిలిం చాంబర్‌హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని సన్నివేశాలు 25 ఏళ్ల కిందట జరిగిన వాస్తవ సంఘటనలు అని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఆ సంఘటనల్లో పాల్గొన్న ప్రధాన పాత్రలు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారన్నారు. అప్పట్లో మీడియా లేకపోవడంతో ఎన్టీఆర్ జీవితంలో చివరిరోజుల్లో జరిగిన సంఘటనలపై రకరకాల కథలు వినిపిస్తున్నాయన్నారు. నిజంగా ఆ సమయంలో ఏం జరిగిందో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించినట్లు చెప్పారు. ఒక వ్యక్తిని నమ్మి ఎన్టీఆర్ పెద్ద తప్పు చేశారన్నారు. ఆ వ్యక్తే ఎన్టీఆర్‌ను ఏం చేశారో.. థియేటర్లో చూడవచ్చన్నారు. తాను కాంట్రవర్సీని మాత్రమే సినిమాగా తెరకెక్కించానని, చంద్రబాబు సినిమాను కాంట్రవర్సీ చేశారన్నారు. ఎన్టీఆర్ వెనుక కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉద్దేశం తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని వర్మ అన్నారు. ఈనెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నిజజీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో తానీ సినిమా తీశానని చెప్పారు. ఏపీలో చిత్రం విడుదల కాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్, కోర్టులు ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రం విడుదలైందన్నారు. ప్రస్తుత తన ప్రెస్‌మీట్‌కు పోలీసులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
అందుకే చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్దుకున్నారు : వర్మ
-
31న ఆ నిజాలేంటో చూపిస్తాం : వర్మ
సాక్షి, విజయవాడ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో నిజం చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ కొంతమందికి నచ్చక సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 75 ఏళ్లు రాజుగా బతికిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి ఈ సినిమా తీసినట్లు వర్మ తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : వర్మ ఆయన మరణానికి కారణమైన వారే 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫొటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లడం పెద్ద వెన్నుపోటులా అనిపించిందన్నారు. తాను సినిమా తీస్తే చంద్రబాబు వివాదం చేశారన్నారు. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలైందని, కానీ ఇక్కడ సైకిల్ జోరువల్ల విడుదల చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సైకిల్‌కు పంక్చర్ అవ్వడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలు భయటపెట్టడం మినహా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. జనసేన ఓటమిపై స్పందిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ బిజీ వల్ల పవన్ కల్యాణ్ గురించి అంతగా పట్టించుకోలేదన్న వర్మ.. జనసేనతో పోలిస్తే చిరంజీవి ప్రజారాజ్యం బాహుబలని అభిప్రాయపడ్డారు. ‘తన తదుపరి చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అని తెలిపిన వర్మ.. వెన్నుపోటు, అబద్దాలు, వైఎస్ జగన్, లోకేష్‌లే చంద్రబాబు దారుణ ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు. -
31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : వర్మ
-
దీని వెనుక ఎవరున్నారో తెలుసు : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోవటంపై స్పందించారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను పోలింగ్ పూర్తి కావటంతో మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. గతంలో కోర్టు.. పోలింగ్ తరువాత విడుదల చేయవచ్చని ఉత్తర్వులు ఇవ్వటంతో రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తాజాగా ఎలక్షన్ కమీషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు మరోసారి బ్రేక్ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలపటంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోర్టు తీర్పుతో పాటు ఇచ్చిన ఈసీ లేకను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ, న్యాయపోరాటనికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు సినిమా విడుదలను అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత శక్తులెవరో అందరికీ తెలుసంటూ ట్వీట్ చేశారు. Point 8C in EC ‘s below letter combined with AP high court judgement is why we planned release today .we going to court against contradictory stand of EC now to stop film after giving permission to release for reasons best known to it and we all know the force behind responsible pic.twitter.com/TeI0XH3blT — Ram Gopal Varma (@RGVzoomin) 1 May 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల లేనట్టేనా!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బయోగ్రాఫికల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి ముగియటంతో ఇక రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టే అని భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించటం లేదు. రేపు సినిమా విడుదల చేయనున్నట్లు సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకులు రాంగోపాల్ వర్మలు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని ఈ నెల 25న చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మే1 సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే ఈ ఏప్రిల్ 10వ తేదిన సినిమా విడుదలను ఆపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఉత్తర్వులు అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ, వాయిదాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్.. రేపే విడుదల
తిరుపతి తుడా /సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చనిపోయేముందు, చివరి జీవితంతో చోటు చేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి పూజలు నిర్వహించి పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నారని నిర్మాత రాకేష్‌రెడ్డి సాక్షికి తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయితే ఎన్నికల్లో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా ఎన్నికల వరకు చిత్రాన్ని ఏపీలో విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశాలు జరీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కు దగ్గరకావడానికి గల కారణాలు, రాజకీయంగా నమ్మిన వారే ఆయనను మోసం చేయడం, పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడవడంతో మానసిక బాధతో ఆయన అనారోగ్యం పాలవ్వడం, మృతి చెందే సమయంలో ఆయన పడ్డ క్షోభను రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు. భావవ్యక్తీకరణకు అడ్డుపడిన ఆపద్ధర్మ సీఎం : విజయచందర్ విజయవాడలో రామ్‌గోపాల్‌వర్మ విలేకరుల సమావేశం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు, ఆయన చేసిన తప్పేమిటి? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార విభాగం ఏపీ సమన్వయకర్త టీఎస్ విజయచందర్ ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదా... మరి సెన్సార్ బోర్డు ఉన్నదెందుకు? అని నిలదీశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కాల రాస్తున్నారని, భావవ్యక్తీకరణకు కూడా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. రాంగోపాల్‌వర్మను అడ్డుకున్న విధంగానే భవిష్యత్‌లో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను ఏపీలోకి రాకుండా అడ్డుకోవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినీ డైరెక్టర్ విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితులలో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన చెందారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సారు బోర్డు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎన్నికల సంఘంతో పాటు కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని గుర్తు చేశారు. మరి అలాంటి చిత్రానికి చంద్రబాబు అడ్డుపడటం దేనికి? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవహారాలు చూస్తుంటే ఆయన మనో నిబ్బరం కోల్పోయినట్లు కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పాలన కావాలని ప్రజలంతా భావిస్తున్నారని, మే 23న వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు. రాంగోపాల్ వర్మను అడ్డుకోవడం తగదు: సీపీఎం మధు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. సినిమాపై సెన్సార్ బోర్డు, న్యాయస్థానాలు ఆంక్షలను విధించలేదని అయినా శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పోలీసులు ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చంద్రబాబు గారూ...! రాంగోపాల్‌వర్మ చేసిన తప్పేంటి...? ట్విట్టర్లో ప్రశ్నించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: విజయవాడలో విలేకరుల సమావేశం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందని, పోలీసులను బంట్రోతుల కన్నా అధ్వానంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ‘ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’ అని జగన్ సూటిగా ప్రశ్నించారు. నిజాన్ని దాచలేరన్న విషయం చంద్రబాబు గ్రహించడం లేదు జగన్ గారూ: రామ్‌గోపాల్ వర్మ నిజాన్ని ఎప్పటికీ దాచలేమన్న విషయాన్ని ఈ వయసులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రహించలేక పోతున్నారని ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు గారూ... రామ్‌గోపాల్ వర్మ చేసిన తప్పేంటి?’ అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కు వర్మ ప్రతి స్పందించారు. ‘జగన్ గారూ... నిజాన్ని దాచలేరన్న విషయాన్ని చంద్రబాబు ఈ వయసులో కూడా గ్రహించలేక పోతున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. -
వర్మ చిత్రానికి బాబు ‘బర్మా’?!
వర్మ తీసిన ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆంధ్రలో విడుదల కాకుండా చంద్రబాబు చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం.. పత్రికా మాధ్యమాలపైన, ప్రతిపక్ష చానళ్లపైన ప్రభుత్వాధినేత విరుచుకుపడుతూ వాటిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడనేందుకు నిదర్శనం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకోవటం ఎన్టీఆర్‌కు బాబు వెన్ను పోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని గుర్తించగలిగినప్పుడే.. ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు. పాత్రపోషణ చాలా కష్టం. అందులోనూ రాజకీయాల్లో మరీ కష్టం! ప్రాచీన కవి పిడపర్తి బసవనారాధ్యుడు ‘అహంకారం’ అనే మృగాన్ని నాయకుడనే వాడు ఎలా తొలగించుకుంటే సుఖపడతాడో లేదా ప్రజల మన్ననకు ఎలా పాత్రుడవుతాడో ‘ప్రభులింగలీల’లో వేదాంత సారాన్ని విప్పి చెప్పాడు. ఇంతకూ పాలకుడనేవాడు తన శరీరంలోనే తన మనస్సు పొరలలోనే గూడుకట్టుకుని జీవిస్తున్న ‘అహంకార’మనే మృగాన్ని ఎలా తొలగించుకోవాల్సి ఉంటుందో ఇలా చెప్పాడు: ‘‘అయ్యా, ఈ శరీరం అనే అడవిలో ఒక మృగం ఎప్పుడూ దాక్కునే ఉంటుంది. దాని పేరే అహంకారం (తనువను కానలో తావ లంబైయుండు/అరయ అహంకారమను మృగంబు)’’ అన్నాడు. మరి దాన్ని సాగనంపడం ఎలా అని ప్రశ్నించుకున్న పిడపర్తి కవికి ఒక ఆలో చన, ఒక పరిష్కారం దొరికిందట. అహంకారం తొలగించుకోవాలంటే ఒక ‘మందు’ కనిపెట్టాడాయన. ఆ మందు ఏది, ఎక్కడ దొరుకుతుంది అంటే ‘వివేకం’ అనే వేటగాడి వద్ద ఉంటుందట. వేటగాడి వద్ద ఉండాల్సింది ‘కత్తి’ కదా ‘వివేకం’ అంటాడేమిటి అనుకుంటున్నారా? పొరపడకండి, ఆ వేటగాడు ఎలాగూ వివేకి కాబట్టి ‘జ్ఞానం’ అనే అగ్నిలో వండి ‘అహంకార’ మృగాన్ని కూల్చి మరీ వివేకం ప్రదర్శిస్తాడట! ఇంతకీ ఆ వేటగాడు ఈ విద్యను తన గురువైన శివుడి వద్ద నేర్చుకున్నాడట. తన మూడు కన్నుల్లో (ముక్కంటి) శివుడు ఏ కన్ను విప్పాడో గానీ శివుడి శిష్యుడైన వేటగాడు ఎలాంటి జంకూ లేకుండా మూడో కన్ను విప్పి ఆ అహంకార మృగాన్ని కాస్తా కూల్చేశాడు. అలాంటి వేటగాళ్లు దుష్టపాలకుల విషయంలో మనకూ అవసరమే కదా! భారత, రామాయణాదులన్నీ దుష్ట శిక్షణ గురించి, శిష్ట రక్షణ గురించి వేల సంవత్సరాలుగా విసుగు లేకుండా బోధిస్తున్నవే, తల మొత్తేలా మొత్తుకుంటున్నవే! కథల్లో, కళల్లో, చిత్రాల్లో, వ్యంగ్య చిత్రాల్లో, చలన చిత్రాల్లో, వీధి నాటకాల్లో, బుర్రకథల్లో వీర గాధల ద్వారా అనాదిగా మనం వింటూ వస్తున్న ప్రబోధ రచనలే. మానవుడి లోని ఈ అహంకార, దురహంకార లక్షణాలన్నీ పలువురు చిత్రనిర్మా తలు, చిత్రదర్శకులు, స్త్రీ, పురుష నటులూ ఎండగడుతూ అసంఖ్యాక ప్రేక్షకులకు విజ్ఞాన ప్రబోధం చేసి కర్తవ్యాన్ని కళ్లముందుంచుతున్నవే. భారత రామాయణ, భాగవత పురాణ గాథలకు కొంత మసాలా కలిపి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కీర్తి ప్రతిష్టలు పొంది, తుదకు తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకను ప్రజాకంటక పాలకులకు వ్యతి రేకంగా ఎత్తి సమున్నత విజయాన్ని సాధించినవారు ఎన్టీ రామారావు! అంతవరకూ కాంగ్రెస్ ‘తెర’లో ఉన్న బాబు ఎవరి ప్రోత్సాహకంతోనో, మరెవరి ప్రోద్బలంతోనో ఎన్టీఆర్ దగ్గరకు జరిగి, ఆ ఇంటిలోనే ఓ ఇంటి వాడై, మామ అయిన ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచి కూలదోసి వెన్నుపోటు రాజకీయం ద్వారా అందలమెక్కిన గాథ అంతా లోకవి దితం. లోకానికి తెలిసిన ఈ బాబు బాగోతాన్ని తెరకెక్కించిన ప్రసిద్ధ దర్శకుడు రాం గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో ముందుకు వచ్చారు. ఈ బయోపిక్ వెలుగు చూడటానికి ముందు ఎన్టీఆర్ కొడుకు, ప్రసిద్ధ నటుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ‘కథా నాయకుడు’, ‘మహానాయకుడు’ అని రెండు బయో పిక్కులు తీశారు. ఈ రెండు చిత్రాలలోనూ ఏదీ ‘పిక్క’ లేదని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడం ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు తల వంపులు తెచ్చినంత పనైంది. ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం దివంగతురాలైన పిమ్మట ఆయన విద్యావంతురాలైన లక్ష్మీపార్వతిని లక్షలాదిమంది తిరుపతి ప్రేక్షకుల సమక్షంలో పెళ్లాడింది మొదలు ఎన్టీఆర్‌పై చంద్రబాబు సాగిం చిన కుట్రలకు హద్దూపద్దూ లేదు. ఈ మొత్తం పూర్వ రంగం నుంచి కథా గమనాన్ని ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ మరణానికి పూర్వం, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా, పదవినుంచి త్రోసిరాజని తాను పదవిలోకి రావడానికి అల్లిన అబద్ధ ప్రచారాలు, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు పన్నిన కుట్రలు, అందుకు పార్వతి వ్యక్తిత్వాన్ని కించపరచ డానికి బాబు చేసిన కుట్రలు, కుహకాలు రాంగోపాల్ వర్మ చిత్రానికి పోపు అందించాయి. ఈ పురాగాథ చలన చిత్రం రూపంలో బయోపిక్‌గా బట్టబయలయితే బాలకృష్ణ రెండు బయోపిక్ పరువుప్రతిష్టలు (ఎన్టీఆర్ చరిత్రలో ఖూనీ అయిన సత్యాలు) గంగలో కలిసిపోతాయన్న భీతి ఆందోళన చంద్రబాబు మనస్సును ముప్పెరగొని, కకావికలు చేసి ఉంటుంది. బహుశా బాబులో చల్లారని అంతరంగ సంక్షోభమే ఆంధ్ర ప్రాంతంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాకుండా అడ్డుకోడానికి కారణం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇంకో ముఖ్యాంశం– ఫిలిం సెన్సార్ బోర్డు ఆటంకాలు లేవు, ఎలెMý‡్షన్ కమిషన్ అయినా వర్మ తీసిన చిత్రం విడుదలను ఈ ఉద్రేక వాతావరణం మధ్య తాత్కాలికంగా నిలుపు చేసిందేగానీ అధికారికంగా నిషేధించలేదు. అయినా తెలుగు ప్రజలలో దాదాపు సగంమంది తెలంగాణలో వర్మ తీసిన బయోపిక్కు ఆనందాతిశయంతో ఆమోద ముద్ర వేశారు. ప్రజాముద్ర అన్నా, ప్రజా తీర్పు అన్నా అలా ఉండాలి. ప్రజల ఓటింగ్ ఫలితాలు ఏ ఎన్నికల సంఘ నిబంధనలకూ, ఏ సెన్సార్ నిబంధనలకూ అందేవి కావు, కట్టుబడేవీ కావు. కట్టుబడి ఉండాలని కోరు కోవటం గాడితప్పి అన్నిరకాల అవి నీతికి అలవాటుపడి అందలమెక్కిన నేటి రాజకీయ పాలక శక్తులకే అల వాటైన సంప్రదాయమని మరచి పోరాదు. పైగా భారత కేంద్ర ఎన్నికల సాధికార సంఘం ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిలోని అయిదవ అధ్యాయం (పే. 31–43) దేశమంతటా ఎన్నికల నిర్వహణ పరిపూర్తి అయి, నూతన ప్రభుత్వాలు అధికారం చేప ట్టేదాకా ఏ ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వమూ లేదా సీఎంలూ, మంత్రులూ మధ్యలో ‘కొత్త పథకాలను ప్రకటించడంగానీ, ద్రవ్య సంబంధమైన ఆర్థిక, పరిపాలనా సంబంధమైన నిర్ణయాలు ప్రకటించటంగానీ’ పూర్తిగా నిషిద్ధమని పాలకులను, అధికారులనూ ఆదేశించింది. అలాగే ఆర్థికపరమైన గ్రాంట్లనుగానీ, పునాదిరాళ్లు వేయడంగానీ, రోడ్ల నిర్మా ణంగానీ, మంచినీళ్ల సదుపాయం కల్పిస్తామనిగానీ ఎలాంటి హామీ లనూ ఎన్నికల నిబంధనావళి అమలులో ఉండగా ఇవ్వరాదని ఆ ఆదే శంలో స్పష్టం చేసింది. అలాగే 19 (6వ అధ్యాయం)లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దశలో ‘ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ఖజానా నుంచి పాలకులు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు విడుదల చేయరాదని, సొంత ప్రచార హోర్డింగ్‌లు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోల ప్రదర్శన విష యంలో కూడా ఇదే వర్తిస్తుందని ఆదేశించింది. తన పాలన అవసాన దశలో ఉన్న సమయంలో బాబు బరితెగించి తనకు పడకపోచ్చని భావి స్తున్న ఓట్లను, సీట్లనూ ఆధునిక టెక్నాలజీ లోని మాయ మర్మాలన్నిం టినీ వినియోగించి తారుమారు చేయించే యత్నాల (ఐటీ గ్రిడ్స్) ఆధా రంగా, 2016లో అమెరికా పర్యటించినప్పుడే ప్రారంభించినట్లు ఆయన సన్నిహితులు కొందరి ద్వారా ఇప్పుడు తెలియవచ్చింది: ‘అక్కడ, నేను 2019 కోసం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను’ అని ఆయన అన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనితో ట్యాంపరింగ్‌కి బాబే పురోహితుడా అనే అనుమానాలు వ్యాప్తిలో ఉంటున్నాయి. ముంచుకొస్తున్న ఓటమి భయం కూడా పీడిస్తున్నందున బాబు తీసుకున్న తాజా నిర్ణయం– మీడియాపై విరుచుకుపడటం. వర్మ తీసిన ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆంధ్రలో విడుదల కాకుండా చేస్తున్న ‘చీకటి’ ప్రయత్నం ఇందుకు నిదర్శనం. వర్మ విజయవాడలో పత్రికా గోష్టిని అడ్డుకోవటం కోసం ఎన్నికల కోడ్‌ను కూడా విస్మరించి పోలీసుల్ని ప్రయోగించటం గన్నవరం విమానాశ్రయంనుంచే వెనక్కి హైదరాబా ద్‌కు బలవంతంగా పంపించివేయటం! అయినా ఈసీ వర్మ విషయంలో టీడీపీ ప్రభుత్వ వ్యవహారంపై సహితం కరకుగా వ్యవహరించకపో వడం చూస్తుంటే ప్రజలలో ఉన్న ఒక అనుమానాన్ని బలపర్చకపోయినా లోలోపల తొలగని ఒక శంకను మాత్రం–తీర్చలేకుండా ఉంది అది– బాబు బరితెగించి అన్ని కేంద్రీయ సంస్థల్నీ ధిక్కరించి, రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్పటికీ, బీజేపీలో మిగిలి ఉన్న పై స్థాయిలోని కొందరు ‘మిత్రుల’తో ఎక్కడో, ఏమూలనో బాబుకున్న సన్నిహిత సంబంధాలు ఇంకా తొలగ లేదని, కొనసాగుతూనే ఉండి ఉండాలన్న భావన లీలామాత్రంగా ప్రజల మనస్సుల్లో దోబూచులాడుతూనే ఉంది. సాంఘిక సంస్కరణల పూర్వ రంగంలో గతంలో దూసుకువచ్చిన ఎన్నో సినిమాలు, శక్తివంతమైన డాక్యుమెంటరీలూ ఉన్నాయి. వాటిలో కొన్ని స్వతంత్ర భారత పాలకులు ముందు నిషేధించి, తరువాత విడు దల చేసినవీ ఉన్నాయి. దీపా మెహతా ‘ఫైర్’ చిత్రం, ‘ది డావెన్సీ కోడ్’ (2006), ‘ఆరక్షణ్’ (2011) చిత్రాలు ఈ కోవలోనివే. ఇంతకూ బాబుకు ఒకటే ప్రశ్న: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర దర్శకుడి పత్రికా గోష్టిని అడ్డుకో వటం ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచినందుకా లేక ఆ విషయాన్ని వెండితెరకు వర్మ ఎక్కించినందుకా?! వెన్నుపోటు పొడిస్తే భయంగానీ, పొడవకపోతే భయం దేనికి? తన కంట్లో దూలం ఉందని ఆయన గుర్తిం చగలిగితే ఎదుటివాళ్ల కళ్లల్లో నలుసులున్నాయని వేదికలెక్కి బాబు అరవటం మానేస్తాడు, రేపటి నిజాన్ని చెవులారా విని, కళ్లారా చూసు కుని ఆయనే చెప్పుకున్నట్లు తాను ‘ఓడినా ఫర్వాలేదు.. పెళ్లాం, కొడుకు, మనవడు ఉన్నారు’ కాలక్షేపానికి! మనకు సినిమాల్లో ఏవీఎస్ అనే దివంగత ప్రసిద్ధ హాస్యనటుడు తనకూ ఏదో ఒక తృప్తి కలిగిందనడానికి వ్యంగ్యంగా అలా ‘నాకూ ‘తుత్తి’ ఉంది’ అంటూండేవాడు. పాత్ర పోషణ చాలా కష్టం, అందులోనూ రాజకీయాల్లో మరీనూ!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా?
సాక్షి, హైదరాబాద్ : విజయవాడలో మీడియా సమావేశం పెట్టకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని అర్థమా? విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? అని వర్మ ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఏయిర్ పోర్ట్ సెక్యూరిటీతో సంబంధంలేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ అధికారంతో తనను ఏయిర్ పోర్ట్‌లో ఆపారని వర్మ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ.. ఏపీలో ప్రెస్ మీట్‌కు కూడా అనుమతి ఇవ్వడం లేదంటే..మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెడతానంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా గురించి ఇప్పటికే అంతా చెప్పానని, కొత్తగా చెప్పేది ఏమి లేదన్నారు. ‘సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని అడిగినా పర్మిషన్ లేదంటున్నారు. పై అధికారులతో మాట్లాడతాం అంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా? లక్ష్మీస్ ఎన్టీఆర్ మే 1న విడుదల అవుతంది. మేం ఎలా ప్రమోషన్ చేసుకోవాలి? ఏపీకి రావాలంటే వీసా తీసుకోవాలా?’ అని వర్మ ప్రశ్నించారు. -
బాబు అది అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం : వర్మ
సాక్షి, హైదరాబాద్ : తన న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకి వర్మ చేసిన తప్పేంటని వైఎస్ జగన్ చేసిన ట్విట్‌కు వర్మ స్పందించారు. ‘జగన్ గారు.. చంద్రబాబుకు ఇంత వయసు వచ్చిన నిజాన్ని ఎవరూ దాచలేరన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని వర్మ ట్విట్ చేశారు. చదవండి : ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్ జగన్ -
ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చదవండి : బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం? రామ్‌గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం?
నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. విజయవాడకు రాకూడదా? ఎవరితోనూ మాట్లాడకూడదా? హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం? – ట్విటర్లో రామ్‌గోపాల్ వర్మ సాక్షి, అమరావతి బ్యూరో, హైదరాబాద్ : బెజవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. సర్కారు తీరును చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకొనే పరిస్థితి నెలకొంది. రామ్‌గోపాల్, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ‘అసలు కథ’ అనేది ఉప శీర్షిక. రాకేశ్ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్ అయింది. అంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ అనుమతితో తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో మే1న రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించాలనుకున్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి. హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు గన్నవరం చేరుకున్నారు. అంతలోనే నోవాటెల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారన్న విషయం తెలిసింది. దీంతో హోటల్ ఐలాపురంలో ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేయబోగా.. అక్కడ కూడా నిరాకరిస్తూ సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మా చిత్ర బృందంతో నోవాటెల్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్రెస్‌మీట్ నిర్వహించాలని నిర్ణయించాం. కానీ ఆ హోటల్ వాళ్లు, ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో అనుమతి నిరాకరించారు. మిగతా చోట్ల ప్రయత్నించినా అన్ని హోటళ్లు, క్లబ్బుల మేనేజ్మెంట్లు మనందరికీ తెలిసిన ఓ వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు. దీంతో పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు, నా అభిమానులు, మీడియాను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా’ అని వర్మ ట్విటర్లో ట్వీట్ చేశారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అడ్డగింపు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దర్మక నిర్మాతలు వర్మ, రాకేష్‌రెడ్డి అతని స్నేహితులు పైపుల రోడ్డు వైపు మధ్యాహ్నం 12.20 గంటలకు కారులో బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే బెజవాడ పోలీసులు వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. పైపుల రోడ్డులో ప్రెస్‌మీట్ పెట్టడానికి వీల్లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలని కోరారు. అందుకు వర్మ ససేమిరా అన్నారు. తాను ప్రెస్‌మీట్ నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా మరో కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి లాంజ్‌లో ఉంచారు. అక్కడ ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌కు విమానంలో పంపించే ప్రయత్నం చేయగా, అందులో టికెట్లు దొరక్కపోవడంతో రోడ్డు మార్గంలో తరలించాలని చూశారు. తాను రోడ్డు మార్గంలో ప్రయాణం చేయనని వర్మ తేల్చి చెప్పడంతో రాత్రి 7.20 గంటలకు ఇండిగో విమానంలో వారిని హైదరాబాద్‌కు పంపించారు. ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్‌డే విమానాశ్రయం లాంజ్‌లో పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న వర్మ స్వయంగా ట్విటర్లో తన వీడియోను షేర్ చేశారు. ‘నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు కస్టడీలో ఉన్నా. మా కార్లను ఆపి, మమ్మల్ని బలవంతంగా వేరే కార్లలో ఎక్కించారు. విజయవాడకు రావడానికి వీలులేదు అని వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి విమానాశ్రయంలో పడేశారు. ఎందుకు ఇలా చేశారు? పోలీసులు చట్టపరంగా వ్యవహరించరా? వారికి బాధ్యత లేదా? విజయవాడకు రావడానికి వీలులేదు, ఏ హోటల్లోనూ ఉండటానికి వీలు లేదు.. అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను, నా నిర్మాత ఎంత అడిగినా పోలీసులు సమాధానం చెప్పకుండా ఇలా మమ్మల్ని విమానాశ్రయంలో పడేశారు. హే.. చంద్రబాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. అప్డేట్స్ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని వర్మ ట్వీట్ చేశారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్‌డే అని నా అభిప్రాయం. కోర్ట్, ఎలక్షన్ కమిషన్ వల్ల మా సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయడం కుదర్లేదు. అన్నీ అయిపోయి సినిమా రిలీజ్ చేయడానికి ప్రెస్‌మీట్ పెట్టడానికి విజయవాడ వెళ్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈవెంట్ కోసం నిర్మాత రాకేశ్ రెడ్డి నోవాటెల్ హోటల్ బుక్ చేశారు. వాళ్లు చివరి నిమిషంలో వీలు లేదని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఐలాపురంలో చేద్దామనుకుంటే వాళ్లూ అడ్వాన్సు తీసుకొని క్యాన్సిల్ చేశారు. ‘ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు మీద ప్రెస్‌మీట్ నిర్వహిస్తాను’ అంటూ నేనో ట్వీట్ పెట్టాను. మేం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే పోలీసులు దార్లో మమ్మల్ని ఆపేసి, బయటకు లాగి వేరే కార్లో బలవంతంగా ఎక్కించి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. ‘రోడ్డు మీద ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది’ అని చెప్పారు. అప్పుడు ఆ ప్రెస్‌మీట్‌ను అనుమతించకూడదు. అంతేకానీ మమ్మల్ని కార్లో ఎక్కించి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లడమేంటి? విజయవాడ రాకూడదు.. ఎక్కడా ఏ హోటల్లో ఉండకూడదు.. హైదరాబాద్ వెళ్లి తీరాలి.. అనేలా బలవంతం చేశారు. 7 గంటల పాటు మమ్మల్ని బయటకు రాకుండా ఓ గదిలో కూర్చోబెట్టారు. ఎవ్వర్నీ కలవనీకుండా చేశారు. తర్వాత విమానం ఎక్కించి హైదరాబాద్ పంపించేశారు. దీనికి అర్థమేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మిమ్మల్ని అలా చేయమని ఎవరు చెప్పారు? ఎవరి ఆదేశాలివి? మాకిచ్చిన నోట్లో కేవలం ప్రెస్ మీట్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని వివరించారు తప్పితే, మమ్మల్ని ఎందుకు పంపించేస్తున్నారన్న విషయం ఎక్కడా ఇవ్వలేదు. ఇదంతా రివేంజ్ డ్రామాలా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? అందరూ సినిమా చూశారు. చాలా మంది పైరసీలో చూశారు. నేనంత కన్నా చెప్పడానికి ఏమీ లేదు. ‘ప్రెస్ మీట్ పెట్టడానికి వీలులేదు, విజయవాడ రావడానికి వీలులేదు’ ఈ విషయం అంతు చూడాలనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. ఏ కారణంతో నన్ను ఆపుతున్నారు అన్నది లీగల్‌గా ప్రశ్నించదలుచుకున్నాను. ఏ గ్రౌండ్స్ మీద మమ్మల్ని వెనక్కు పంపించారు? ఓ పౌరుడిగా వీటిని ప్రశ్నించే హక్కు నాకుంది. ఇవాళంతా (ఆదివారం) ప్లాన్ చేసి ఎలా ముందుకు వెళ్తాం అనే విషయాన్ని రేపు (సోమవారం) డీటైల్స్‌తో సహా ఇస్తాను’’ అని వర్మ చెప్పారు. శాంతిభద్రలకు విఘాతమని అదుపులోకి తీసుకున్నాం ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 114 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయి. అందువల్ల ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలోని ఐబీఎం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. అందువల్ల అక్కడ ప్రెస్‌మీట్ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరాం. అందుకు ఆయన ససేమిరా అనడంతో అదుపులోకి తీసుకున్నాం. – ద్వారక తిరుమలరావు, పోలీసు కమిషనర్, విజయవాడ వర్మను నిర్బంధించడం ప్రభుత్వ పిరికిపంద చర్య గన్నవరం: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శక, నిర్మాతలు రాంగోపాల్‌వర్మ, రాకేష్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టులో నిర్భందించడం టీడీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో టీడీపీ ఎందుకు ఇంతగా భయపడుతోంది? అంత పిరికితనమా? పోలీసులు కూడా భారీ బందోబస్తుతో ఇలా నిర్భంధించాలా? చట్టానికి వ్యతిరేకంగా ఇలా వ్యవహరించడం సబబేనా? సెన్సార్ బోర్డు సినిమా రిలీజ్‌కు అంగీకరించాక ప్రమోషన్‌ను అడ్డుకోవడం చట్ట వ్యతిరేకం. అప్పుడే ఇక్కడ ఈ సినిమా విడుదలైంటే చంద్రబాబు థియేటర్లు దొరక్కుండా చేసేవారు’ అన్నారు. అంబటితో పాటు వైఎస్సార్సీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. వర్మ గొంతు నొక్కేసింది ప్రభుత్వమే – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించి బలవంతంగా హైదరాబాద్ పంపడం ద్వారా వర్మను మాట్లాడనీయకుండా ప్రభుత్వమే ఆయన గొంతు నొక్కేసిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
అందుకే వర్మ ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు
సాక్షి, విజయవాడ: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరించడంపై విజయవాడ పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగరపరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 114 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నాయని, అందువల్ల ప్రెస్‌మీట్ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు విడుదల చేసిన ఓ నోట్లో పేర్కొన్నారు. చదవండి....(నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న ) (హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ) వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిపారు. బహరింగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌మీట్ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని వర్మను కోరారు. ఈ మేరకు విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో ఓ లేఖను విడుదల చేసి, రాంగోపాల్ వర్మకు అందించారు. కాగా తన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్ లైవ్‌ను పోలీసులు ఆపివేశారంటూ వర్మ మరో ట్విట్ చేశారు. I can’t communicate because they blocked my insta facebook twitter live — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2019 -
హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ
సాక్షి, గన్నవరం : ఏపీ పోలీసుల చర్యను దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో ఉండకుండా వెళ్లిపోవాలంటూ పోలీసులు తమపై బలవంతంగా వెనక్కి పంపించారని ఆయన మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయం లాంజ్‌లోనే వర్మతో పాటు నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని... తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిపై వర్మ మాట్లాడుతూ ... ‘నేనేమైనా ఉగ్రవాదినా... నన్ను ఎందుకు నిర్బంధించారు. నిర్బంధించడానికి ఎలాంటి హక్కు, అధికారం ఉంది.’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నలకు మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వలేదు. తన నిర్బంధంపై రాంగోపాల్ వర్మ.... ‘నేను నిజం చెప్పేందుకు యత్నిస్తే ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ ఈ సందర్భంగా ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రెస్‌మీట్ రద్దు...తిరిగి హైదరాబాద్‌కు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ రద్దు అయినట్లు వర్మ ప్రకటించారు. పోలీసులు తనను బలవంతంగా నిర్భందించారని, దాంతో తాను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ‘హే సీబీఎన్..వేరీజ్ డెమోక్రసీ’ అంటూ వర్మ ట్విటర్లో సూటిగా ప్రశ్నించారు. చదవండి....(రాంగోపాల్ వర్మను అడ్డుకున్న పోలీసులు) -
నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ఓ హోటల్లో చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్ పెడతానని ప్రకటించిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. వారు విజయవాడ వెళుతుండగా.. ప్రకాశ్‌నగర్ సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిందేనని వర్మ, రాకేశ్‌రెడ్డిలపై పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, ఇందుకు వారు ససేమిరా ఒప్పుకోలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించి తీరుతానని వారు పోలీసులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తాము చేసిన తప్పు ఏంటని, ఎందుకు తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, సినిమా ప్రమోషన్లో భాగంగా తాము ప్రెస్‌మీట్ కూడా పెట్టుకోకూడదా? అని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వైఖరి మార్చుకోని పోలీసులు.. వర్మ, రాకేశ్‌రెడ్డిలను బలవంతంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి.. విమానాశ్రయం లాంజ్‌లో ఇద్దరిని నిర్బంధించారు. తనను ఎయిర్‌పోర్టులో నిర్బంధించడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నేనేమైనా ఉగ్రవాదినా.. ఎందుకు నన్ను నిర్బంధించారు? నిర్బంధించడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? ఏం అధికారముంది?’ అంటూ పోలీసులపై వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. వర్మ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులు నీళ్లు నమిలారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా ఏపీలో చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడ నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే, చివరి నిమిషయంలో నోవాటెల్ హోటల్లో తన ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వలేదని, అంతేకాకుండా తాను ఇచ్చిన అడ్వాన్స్ తీసికొని కూడా హోటల్ యాజమాన్యం తన కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కొంతమంది పెద్దల బెదిరింపుల వల్లే హోటల్ యాజమాన్యం తనకు అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో విజయవాడలోని పైపులురోడ్డులో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వర్మ, రాకేశ్‌రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వర్మ వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళాలని తనను ఎందుకు బలవంతం చేస్తున్నారని ఆయన పోలీసులను నిలదీశారు. ప్రెస్‌మీట్ వల్ల శాంతిభద్రతల సమస్య వస్తందనే ఉద్దేశంతో అనుమతించడం లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. దీంతో కనీసం తనను విజయవాడలోని హోటల్ వరకైనా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని వర్మ డిమాండ్ చేసినా పోలీసులు ససేమిరా ఒప్పుకోలేదు. ‘పోలీసులు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. నాకు మీడియా సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ లేదా’ అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. -
నడి రోడ్డు మీద ప్రెస్ మీట్: వర్మ
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు వర్మ ట్విటర్లో తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ‘నోవాటెల్ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా మనందరికీ తెలిసి ఒక వ్యక్తి భయంతో హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పారిపోయార’ని వర్మ పేర్కొన్నారు. అదే విధంగా ‘మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతివారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానమ’ని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని వర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. పైపుల రోడ్డులో NTR circle https://t.co/jvva4KotsW… దగ్గర today sunday 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం pic.twitter.com/vasqMPngil — Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2019 -
ఎన్టీఆర్ అనుభవించిన నరకం చూస్తారు : వర్మ
సాక్షి, అమరావతి : సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల కానుంది. మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఏపీలో విడుదల చేస్తున్నామని డైరెక్టర్ వర్మ వెల్లడించారు. ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని ట్విటర్లో తెలిపారు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైకోర్టు విచారణ) -
‘నీ తాట తీయనీకి వస్తున్నా’
లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్లో వివాదాలకు తెరతీశాడు వర్మ. ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు. కేసీఆర్ తనయుడు తారకరామారావు (కేటీఆర్), కూతురు కవిత, హరీష్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించాడు వర్మ. On the eve of Andhra Pradesh Chief Minister @ncbn ‘s birthday , I am releasing this first look of Telangana Chief Minister KCR ‘s biopic #TIGERKCR pic.twitter.com/0uvX5f49KT — Ram Gopal Varma (@RGVzoomin) 20 April 2019 -
ఓట్ అండ్ సీ
వానొచ్చి మ్యాచ్ ఆగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది.ఫ్రైడేకి కొత్త సినిమాలేమీ లేకపోతే జీవితం మీదే విరక్తి కలుగుతుంది.బ్రేకింగ్ న్యూస్ చూడకపోతే ఆ పూట బ్రేక్‌ఫాస్ట్ చేయనట్లే ఉంటుంది. క్రికెట్.. సినిమా.. రాజకీయాలు.. ఈ మూడూ దేశానికి ఎప్పుడూ నిత్యావసర సరకులే!ఇప్పుడా సరకుల్లో ఒకదానికి తీవ్రమైన కొరత ఏర్పడింది.ఎన్నికలు పూర్తయ్యేవరకు పొలిటికల్ ఫిల్మ్స్ ఆడ్డానికి వీల్లేదనిఎన్నికల సంఘం తాత్కాలికంగా కొరత విధించింది!!ఈ విరామంలో నిరీక్షణే బయోపిక్‌ల వీక్షకులకు ఊరడింపు.ఓట్ అండ్ సీ! తీర్పు కోసం చినరాయుడి దగ్గరికి వెళ్లినప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. చినరాయుడికి కండువా సర్దుకోవడంతోనే సరిపోతోందనుకుని పెదరాయుడి దగ్గరకి పరుగెడితే.. పెదరాయుడు ఇంకేదో వ్యవహారం చూస్తూ ఉండొచ్చు. అప్పుడు మళ్లీ చినరాడి దగ్గరికి తిరిగొస్తే చినరాయుడిచ్చే తీర్పు వేరుగా ఉంటుంది. ‘కేసు పెదరాయుడి దగ్గర ఉన్నప్పుడు నేను తీర్పు చెప్పడం మర్యాద కాదు’ అనేస్తాడు చినరాయుడు. తొందరపాటు వల్ల జరిగే అనర్థం ఇది. అయితే తొందరపడకపోవడం వల్ల జరిగే అనర్థాలను ఊహించుకుని సినిమా ప్రొడ్యూసర్లు కింది కోర్టు నుంచి పైకోర్టుకు వెళుతుంటారు. దాంతో బాక్సు కోర్టులో ఉండిపోతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పుడు పెదరాయుడి దగ్గర ఉంది. ఏప్రిల్ 15న తీర్పు ఇవ్వబోయిన చినరాయుడు.. ‘ఎటూ పెదరాయుడు ఏప్రిల్ 22న దీని గురించి మాట్లాడదాం అన్నాడు కాబట్టి.. అప్పటి వరకు మనం ఆగడం పెదరాయుడికి గౌరవం’ అని అనేశాడు! పెదరాయుడి దగ్గర ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్కటే కాదు.. కేసీఆర్ ‘ఉద్యమ సింహం’ ఉంది. అసలు ఇవి రెండూ కాదు. మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ ఉంది. అది క్లియర్ అయితే, ఆటోమేటిగ్గా మిగతా రెండూ క్లియర్ అవుతాయి. మెయిన్ కేస్ మోదీ బయోపిక్ది. మే 19 లోపు ఇవేవీ క్లియర్ అవకపోవచ్చు. ఆ రోజు ఈ దేశానికి చివరి విడత ఎన్నికలు. అయితే ఎన్నికల కమిషన్ సినిమాను ఆపి ఊరుకోలేదు. సినిమా ట్రైలర్‌ను కూడా ఆపింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా ట్రైలర్ ఇప్పుడు మీకు యూట్యూబ్‌లో కూడా కనిపించదు! ఈసీకి టైమ్ ఉంటుందా?! సుప్రీంకోర్టుకి ఈరోజు ఒక సీల్డ్ కవర్ రాబోతోంది! అందులో ఒక ‘ముఖ్యమైన అభిప్రాయం’ ఉంటుంది. ఆ ముఖ్యమైన అభిప్రాయం కేంద్ర ఎన్నికల సంఘానిది! రిలీజ్ ఆగిపోయిన బాలీవుడ్ బయోపిక్.. ‘పీఎం నరేంద్రమోదీ’పై ఎన్నికల సంఘం ఒపీనియన్ అది. సినిమా ఎలా ఉందన్నది కాదు కోర్టుకు కావలసింది. ఈ టైమ్‌లో రిలీజ్ చెయ్యడానికి తగినదా, తగనిదా అని. ఈ టైమ్‌లో అంటే.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న టైమ్‌లో. సినిమా ఎలాగూ బాగుంటుంది. తీసింది ఒమంగ్ కుమార్. ‘మేరీకోమ్’ ఆయన తీసిందే. హిట్ అయింది. ‘సరబ్జిత్ సింగ్’.. అదీ ఆయన్దే. హిట్ అయింది. ఇప్పుడు.. ‘పీఎం నరేంద్రమోదీ’. ఈ సినిమా ఏప్రిల్ 11నే విడుదల కావాలి. ఏప్రిల్ 10న ఎలక్షన్ కమిషన్ సడన్‌గా వచ్చి ‘స్టాప్’ అని అరిచింది. ‘ఎందుకు స్టాప్?’ అని నివ్వెరపోయి అడిగారు సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్. వాళ్లిద్దరూ ఆ సినిమా నిర్మాతలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద సినిమాను ఆపేసే పవర్ మాకుంది అంది ఈసీ. అర్థం కాలేదు అన్నారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కాలంలో ఓటర్లని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వం’ అంది. ఈ సినిమా చూస్తే కొందరికి లాస్, కొందరికి ప్రాఫిట్ ఉండే ప్రమాదం ఉంది అంది. అంటే మోదీకి లాభం. రాహుల్‌కి నష్టం.‘‘ట్రయిలర్ చూసి అదే సినిమా అనుకుంటే ఎలా?’’ అని నిర్మాతలు చికాకుపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏప్రిల్ 15న కేసు హియరింగ్‌కి వచ్చింది. ‘‘ఇదేం ఎన్నికల సంఘమండీ. సినిమాలు చూసి ఓటర్లు మారిపోయే పనైతే రాజకీయ నాయకులంతా ప్రచారం మానేసి, బయోపిక్‌లు తీయించుకునేవారు కదా’’ అని వాదించారు నిర్మాతల తరఫు న్యాయవాది. ఆ రోజు బెంచ్ మీద ఉన్నది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ‘‘నిజమే. ట్రైలర్‌ను చూసి సినిమాను ఆపేయాలని నిర్ణయానికి వచ్చినట్లున్నారు మీరు. బహుశా మీకు సినిమాను చూసే తీరిక లేక పోయుండాలి. అందువల్ల మీరొకసారి సినిమాను స్పెషల్‌గా వేయించుకుని చూసి శుక్రవారం లోపు (ఈరోజు) సీల్డ్ కవర్లో పెట్టి మీ అభిప్రాయాన్ని పంపండి’’ అని చెప్పారు. ‘‘మళ్లీ మనం ఏప్రిల్ 22 న ఈ కేసు గురించి ఆలోచిద్దాం’’ అని కూడా అన్నారు. నిన్నటి వరకైతే కోర్టుకు సీల్డ్ కవరేమీ వెళ్లినట్లు లేదు. ఈరోజు వచ్చినా ఉపయోగం ఏమీ లేదు. గుడ్ ఫ్రైడే కదా! కోర్టుకు సెలవు. ట్రైలర్లో ఏముంది?! ఏముంటుంది? గోద్రా దెయ్యం ఉంటుందా? ఉండదు. జింగోయిజం ఉంటుందా? ఉండదు. జింగోయిజం అంటే ‘మన దేశమే గొప్ప’ అనే వాదం. అది ఎందుకు ఉంటుంది, ఉన్నా డైరెక్టుగా ఎందుకు ఉంటుంది? మంత్రులతో కయ్యం నెయ్యం ఉంటాయా? ఉంటే అది ‘పీఎం నరేంద్ర మోదీ’ ఎందుకవుతుంది? మన్మోహన్సింగ్ మీద వచ్చిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ అవుతుంది కానీ. మరేం ఉంది ట్రైలర్లో?! ఎందుకు ఈసీ ‘అప్పుడే విడుదలొద్దు’ అనేసింది? మోదీని మించిన దేశభక్తుడు లేడన్నట్లుంది ట్రైలర్. వివేక్ ఒబెరాయ్ (మోదీ) కెమెరా వైపు కోపంగా చూస్తూ.. ‘‘పాకిస్తాన్‌ని హెచ్చరిస్తున్నాను. మాపై చెయ్యెత్తితే ఆ చెయ్యిని నరికేస్తాం’’ అంటాడు! ఇలా అన్నంత మాత్రాన మోదీకి ఓట్లు పడిపోతాయని కాదు. తనకున్న నిబంధనల ప్రకారం వెళుతోంది ఎలక్షన్ కమిషన్.‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా షూటింగ్ ఈ ఏడాది జనవరి 27న గుజరాత్లో మొదలైంది. మోదీ బాల్యం, రాజకీయ ప్రయాణం.. ఇలాంటి ముఖ్యమైన సీన్లు కొన్ని ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తీశారు. సినిమా చివరి సన్నివేశాల కోసం ముంబై వెళ్లారు. ఉత్తరకాశీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు వివేక్ ఒబెరాయ్ గాయపడ్డారు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్. మార్చి మొదటి వారానికి సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ లోపు ఎన్నికల షెడ్యూలు వచ్చిపడింది. అరకొర ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాక ఏప్రిల్ 11న రిలీజ్ అనుకున్నారు కానీ, అదే రోజు ఎన్నికలు మొదలవడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. అయితే తన ధర్మం ప్రకారం ఎన్నికల విడతలన్నీ పూర్తయే వరకు బయోపిక్‌ల విడుదలకు అనుమతి ఇవ్వడం కష్టమని ఈసీ అంటోంది. ఇప్పుడు సీల్డ్ కవర్లోనూ అదే ఉంటుందనుకోవాలి. మోదీ పీఎం కదా అని రిలీజ్‌కి ఓకే చెప్పదు. రామ్‌గోపాల్ వర్మ ముక్కుసూటి డైరెక్టర్ కదా అని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ముకుతాడు వేయ కుండా ఉండదు. సాధారణంగా పైకోర్టులో కేసు నలుగుతున్నప్పుడు కింది కోర్టులు ఏమీ చెయ్యడానికి ఉండదు. నిర్మాతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 22న రిలీజ్ అనుకున్నారు. మార్చి 29కి వాయిదా పడింది. ఆ రోజున తెలంగాణలో విడుదలైంది. ఆంధ్రాలో బ్రేక్ పడింది. ఆ సినిమాలో చంద్రబాబును విలన్‌గా చూపించాడు వర్మ. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ సినిమా రిలీజ్ అయిందంటే.. పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని టీడీపీ నుంచి కొందరు కోర్టుకు వెళ్లారు. సినిమా ఆగిపోయింది. కేసు ఏప్రిల్ 3న హియరింగ్‌కి వచ్చింది. అప్పటికే నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెల్ లీవ్ పిటిషన్ ఫైల్ చెయ్యడంతో కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 15కి వాయిదా పడింది. ఈలోపు ఆంధ్రాలో ఎన్నికలు అయిపోయాయి. ‘ఉద్యమ సింహం’ విడుదల కూడా ఇలాగే, ఇవే కారణాలతో ఆగిపోయింది! అయితే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అది కేసీఆర్ బయోపిక్. అల్లూరి కృష్ణంరాజు డైరెక్టర్. ఫస్ట్ లుక్ 2018 నవంబరులోనే రిలీజ్ అయింది. 2019లో సినిమా రిలీజ్ అనుకున్నారు. ఈలోపు లోక్‌సభ ఎన్నికలు ఊడిపడ్డాయి. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కనుక ఇప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు కదా. కానీ ఒకే కేసులో ఉన్న ఈ మూడు సినిమాలకూ ఒకే తీర్పు ఉంటుంది. అదింకా రాలేదు. అప్పుడే అన్నిటికీ ఒకేసారి విముక్తి. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై హైకోర్టు విచారణ
సాక్షి, అమరావతి : రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సినిమా విడుదలపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించవల్సిందిగా ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే సినిమా విడుదలవుతుందని ఆంధ్రా ప్రేక్షకులు భావించారు. కానీ ఎన్నికలు పూర్తయి నాలుగు రోజులు కావస్తున్నా సినిమా విడుదలపై క్లారిటీ రావటం లేదు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.