
ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని, లక్ష్మీ పార్వతి తన జీవితంలోకి వచ్చిన తరువాత జరిగన సంఘటనలు, చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా గత వారం ఏపీ మినహా అన్ని ప్రాంతాల్లో విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా కొన్ని శక్తులు అడ్డుతగులుతున్నాయి. అయినా సరే వాటిని ఎదుర్కొంటానని, ఏపీలో వీలైన తొందరగానే మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. కానీ, అదంతా ఈజీగా అయ్యేలా కనబడటం లేదని వర్మకు తెలిసివచ్చింది.
ఏపీ హైకోర్టు సినిమాపై స్టే విధించగా.. సుప్రీం కోర్టు కూడా అదే ధోరణిలో వ్యవహరించింది. దీంతో ఈ చిత్రం విడుదలపై మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ చిత్రాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయకుండా ఆపేందుకే కొన్ని తెరవెనుక శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై కోర్టు తీర్పు ఇవ్వక పోవడం, మూవీ గురించి పోరాడి అలసిపోవడంపైనా.. వర్మ సెటైరికల్‌గా స్పందించాడు. కోతి బొమ్మల పెయింటింగ్ రూపంలో తన బాధను వర్ణించాడు. తల్లి కోతి (రామ్ గోపాల్ వర్మ).. పిల్ల కోతి (లక్ష్మీస్ ఎన్టీఆర్)ని ఓదార్చుతున్నట్టు తన బాధను ట్వీట్ చేశారు.
Mother Rgv consoling #LakshmisNTR baby😢😢😢 Painting done by a truly truthful and deep visionary @DPrasannavarma pic.twitter.com/S4RTE5AEnN
— Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2019
చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment