లక్ష్మీపార్వతి పాత్ర రివీల్‌ చేసిన ఆర్జీవీ | Yagna Shetty Play Laxmi Parvathi Role In Laxmis NTR | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 11 2019 7:59 PM | Last Updated on Fri, Jan 11 2019 8:28 PM

Yagna Shetty Play Laxmi Parvathi Role In Laxmis NTR - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి సంచలనం సృష్టించాయి. ఆర్జీవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రకటన చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరు కనిపిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీపార్వతి పాత్ర ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటిస్తుందని చెప్పిన వర్మ.. ఆ పాత్రకు సంబంధించి పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

యజ్ఞ శెట్టి గతంలో వర్మ దర్శకత్వం వహించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఈ చిత్రాని సంబంధించిన రెండో పాటలో ‘అబద్దాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ధ్యేయమ’ని చెప్పిన వర్మ.. సినిమాను త్వరలోనే సినిమాను విడుదల చేయనన్నట్టు తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement