‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి వీడియో సాంగ్‌ | First Song Video of Lakshmis NTR Sung by S P Balasubramaniam | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి వీడియో సాంగ్‌

Published Sat, Feb 23 2019 3:27 PM | Last Updated on Sat, Feb 23 2019 3:29 PM

First Song Video of Lakshmis NTR Sung by S P Balasubramaniam - Sakshi

యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు నిరాశపరచటంతో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మరో సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పై ఆసక్తి మరింత పెరిగింది. బాలకృష్ణ నిర్మించిన బయోపిక్‌లో చూపించని చాలా నిజాలు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో చూడొచ్చని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు. వర్మ కూడా తను తెరకెక్కిస్తున్నదే అసలు కథ అంటూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు.

ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో పాటు లిరికల్‌ వీడియోలతో ఆకట్టుకున్న రామ్ గోపాల్‌ వర్మ, రేపు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. సినిమాలో ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే పాట వీడియోను రేపు ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ పాటను ఎన్టీఆర్‌కు ఎన్నో సూపర్‌ హిట్ పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని తెలిపారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement