
ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్‌టిఆర్-మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ట్రైలర్‌ను ప్రేమికుల రోజున విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
తాజాగా మహానాయకుడు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడంతో.. తన సినిమా ట్రైలర్‌ను కూడా ఆ మూవీతో పాటు చూడండి అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ‘ఫిబ్రవరి 14న 9.27గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 22న మహానాయకుడుతో పాటు విడుదల చేస్తాము. మహానాయకుడు చూడటానికి వచ్చిన వారు మా మూవీ ట్రైలర్‌ను కూడా చూడొచ్చు’ట్విటర్‌లో పేర్కొన్నాడు.
Trailer of #LakshmisNTR releasing 14 th feb 9.27 AM and Theatrical Trailer will release on Feb 22nd with Mahanayakudu ..So whoever comes to the theatre to see Mahanayakudu can see the trailer of #LakshmisNTR 💐
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019