సాక్షి, విజయవాడ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో నిజం చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ కొంతమందికి నచ్చక సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 75 ఏళ్లు రాజుగా బతికిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి ఈ సినిమా తీసినట్లు వర్మ తెలిపారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
31న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల : వర్మ
ఆయన మరణానికి కారణమైన వారే 25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఫొటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లడం పెద్ద వెన్నుపోటులా అనిపించిందన్నారు. తాను సినిమా తీస్తే చంద్రబాబు వివాదం చేశారన్నారు. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలైందని, కానీ ఇక్కడ సైకిల్ జోరువల్ల విడుదల చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సైకిల్‌కు పంక్చర్ అవ్వడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలు భయటపెట్టడం మినహా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు.
జనసేన ఓటమిపై స్పందిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ బిజీ వల్ల పవన్ కల్యాణ్ గురించి అంతగా పట్టించుకోలేదన్న వర్మ.. జనసేనతో పోలిస్తే చిరంజీవి ప్రజారాజ్యం బాహుబలని అభిప్రాయపడ్డారు. ‘తన తదుపరి చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అని తెలిపిన వర్మ.. వెన్నుపోటు, అబద్దాలు, వైఎస్ జగన్, లోకేష్‌లే చంద్రబాబు దారుణ ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment