Balakrishna and Harikrishna Look From RGV's Lakshmi's NTR - Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 12:20 PM | Last Updated on Tue, Jan 29 2019 1:18 PM

Hari Krishna And Balakrishna Look From Lakshmis NTR - Sakshi

ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్న వర్మ పేర్లు వెల్లడించకుండానే ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడు.

తాజాగా షూటింగ్‌కు సంబంధించి మరికొన్ని స్టిల్స్‌ను రిలీజ్ చేసిన వర్మ, మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపాడు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర ఎవరిది.?’ అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్‌చేశాడు వర్మ. దీనిపై స్పందించిన నెటిజెన్స్‌ ఈ క్యారెక్టర్‌ హరికృష్ణదే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరో ఫొటోలో హరికృష్ణతో పాటు బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నెటిజెన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement