Nandamuri Harikrishna
-
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'జానకీ రామ్' కుమారుడు.. కథ రెడీ చేసిన డైరెక్టర్
‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారట.. అది కూడా కొత్త హీరోతో ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధరమ్ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం నందమూరి కుటుంబానికి చెందిన ఒకరిని హీరోగా ఆయన ఎంచుకున్నారట. స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేయాలని వైవీఎస్ చౌదరి ఉన్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. జానకీ రామ్ కుమారుడికి కూడా సినిమాలంటే ఇష్టం.. అందుకే పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో ఆయన నటించాడు. అదే చిత్రంలో జానకీ రామ్ రెండో కుమారుడు సౌమిత్ర కూడా సహదేవుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వీరిలో తారక రామారావుతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమా ప్లాన్ చేశారు. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో కథ ఉండబోతుందట. చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నట్లు డైరెక్టర్ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అండ కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ మార్కెట్‌నే శాసిస్తున్నాడు. ఆయనకు ఫ్యాన్స్ కూడ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే. జానకీ రామ్ అంటే తారక్‌కు ఎనలేని ప్రేమ.. ఇన్నీ ఎమోషన్స్ మధ్య తారక రామారావు లాంచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వాస్తవంగా జానకీ రామ్ కూడా తన కుమారులను సినిమా ఇండస్ట్రీలో కొనసాగించాలని గతంలో పలు సందర్భాల్లో చెప్పేవారట. కానీ 2014 డిసెంబరు నెలలో కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. -
జూ. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయనకున్న బలం ఎవరు?
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది 1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్‌కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్‌లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం. నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్‌కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్‌తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు. 'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్గ్రీన్ ♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. ♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు. ♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు. ♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ♦ నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు. ♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. ♦ తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట ♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ. ♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. -
హరికృష్ణ మనవడి వివాహానికి పొంగులేటికి ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. ఆదివారం హైదరాబాద్‌లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లిన సుహాసిని తన కుమారుడు హర్ష వివాహ శుభలేఖను అందించారు. -
తండ్రి హరికృష్ణ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పిన కల్యాణ్ రామ్
-
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా బింబిసార టీం యాంకర్ సుమతో. కల్యాణ్ రామ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర టీం కలిసి సుమతో లంచ్ చేస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ కాగా ఈ మూవీ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందడంతో సుమ ఈ ప్రశ్నతోనే ఇంటర్య్వూను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కీరవాణిని మీరు టైం ట్రావెల్ అవ్వాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటారని అడగ్గా.. కీరవాణి తాను 2018 ఆగస్ట్ 28కి వెళ్తానన్నారు. ‘అప్పుడు నేను హరికృష్ణ గారికి కాల్ చేసి మనం కంపోజింగ్ పెట్టుకుందాం, ఓ రెండు రోజులు నాతో ఉండిపోండి అని చెప్పేవాడి. అలా చెప్పడం వల్ల ఆయన ఆగస్ట్ 29న జర్నీ చేయరు కదా. ఎందుకంటే హరికృష్ణ గారికి నా కంపోజింగ్ అంటే చాలా ఇష్టం. నేను అలా కాల్ చేసుంటే కచ్చితంగా ఆయన నాతోనే ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ కల్యాణ్ రామ్‌ని మీ తండ్రి చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తాను ఇంట్లోనే ఉన్నానన్నాడు. చదవండి: సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా? ‘ఉదయం 5:30 ఆ సమయంలో నేను ఇంట్లో బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నా. అప్పుడే నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆయన నాన్నతో(హరికృష్ణ) కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైందా అని శివాజీ గారు శివాజీ గారు అని అన్నాను. కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది’ అని చెప్పాడు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్ చేసి.. కొన్ని ఫొటోలు పంపించారని గుర్తు చేసుకుని కల్యాణ్ రామ్ ఏమోషనల్ అయ్యాడు. కాగా 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆయన సోదరి, కల్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
మిస్ యూ నాన్న: జూనియర్ ఎన్టీఆర్
నేడు(బుధవారం) దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. "ఈ అస్థిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు" అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. (ఆర్ఆర్ఆర్: ‘క్లైమాక్స్ అద్భుతం..!’) 'మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న'! అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. వెండితెరపై సీతయ్యగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. (మీ మరణంతో నా జీవితంలో శూన్యం) మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna! pic.twitter.com/GG11AnPbIY — Jr NTR (@tarak9999) September 2, 2020 -
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ట్విటర్ వేదికగా తన అన్నయ్య దివంగత జానకిరామ్‌ను గుర్తుచేసుకున్నాడు. బుధవారం జానకిరామ్ జయంతి. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ జానకిరామ్‌కు నివాళులర్పించారు. తన అన్నయ్య జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా కళ్యాణ్‌రామ్ స్పందిస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో, మా ప్రార్థనలలో జీవించే ఉంటారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. వి మిస్ యూ’అంటూ ట్వీట్ చేశాడు. సొంతంగా ఎన్టీఆర్ బ్యానర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన జానకిరామ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాల్సిన జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పెద్దకుమారుడి మాదిరిగానే నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వరుస ప్రమాద కారణాలతోనే ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మేము ఎంతో కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అంటూ నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ వస్తుంటుంది. చదవండి: లవ్ యూ అమ్మ: రామ్ చరణ్ విలన్‌గా అనసూయ..! -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర ఎవరిది?’
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్లో చేస్తున్నాడు. వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్న వర్మ పేర్లు వెల్లడించకుండానే ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. తాజాగా షూటింగ్‌కు సంబంధించి మరికొన్ని స్టిల్స్‌ను రిలీజ్ చేసిన వర్మ, మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర ఎవరిది.?’ అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్చేశాడు వర్మ. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఈ క్యారెక్టర్ హరికృష్ణదే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరో ఫొటోలో హరికృష్ణతో పాటు బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. I wonder who these characters are in #LakshmisNTR and why they are looking so upset with Lakshmi Parvathi ? pic.twitter.com/KAdAKrHIVR — Ram Gopal Varma (@RGVzoomin) 29 January 2019 -
రాత్రికి రాత్రే వెలసిన నందమూరి హరికృష్ణ విగ్రహం
ఉన్న పళంగా బీచ్‌రోడ్డులో వెలసిన మూడు విగ్రహాలు జీవీఎంసీ వర్గాల్లో కలకలం రేపాయి.. జోన్–2 అధికారులను విధులకు దూరం చేశాయి. కారణం.. సదరు విగ్రహాల ఏర్పాటు సమాచారం ఉన్నతాధికారులకు తెలియకపోవడం.. అసలు అనుమతులే లేకపోవడం.. శుక్రవారం సాయంత్రం వరకు అక్కడ ఆ విగ్రహాలు కాదు కదా.. వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా మచ్చుకైనా కనిపించలేదు. కానీ రాత్రికి రాత్రే.. దిమ్మలు నిర్మించేసి.. విగ్రహాలను కొలువుదీర్చడమే కాదు.. వాటిని మంత్రి ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్‌లు కూడా చేసేశారు. వాస్తవానికి ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే.. ముందుగా విగ్రహాల కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి.. కానీ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి కూడా అయిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్‌కు నోటిమాటగానైనా సమాచారం ఇవ్వలేదు. ఇవేవీ లేకుండానే విగ్రహాలను ప్రారంభించేయడాన్ని తెలుసుకున్న కమిషనర్ మీరేం చేస్తున్నారంటూ సంబంధిత జోన్–2 ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పేవరకు విధులకు హాజరుకావద్దని ఆదేశించారు. ఇంత రాద్దాంతానికి కారణమైన ఆ విగ్రహాలు ఎవరివో తెలుసా?.. ఇటీవల మరణించిన టీడీపీ నేత నందమూరి హరికృష్ణది ఒకటి కాగా.. మిగిలిన రెండు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, దిగ్దర్శకుడు దాసరి నారాయణరావులవి. విశాఖసిటీ: తీరంలో ముగ్గురు వ్యక్తుల విగ్రహాల ఏర్పాటు మహా విశాఖ నగర పాలక సంస్థలో రచ్చకు దారితీసింది. కొన్ని సంస్థలు ఆర్కే బీచ్‌లో వేర్వేరు చోట్ల ముగ్గురు విగ్రహాలను ఏర్పాటు చేశాయి. వారిలో దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత అక్కినేని నాగేశ్వరరావు, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ హరికృష్ణ విగ్రహాలను పెట్టారు. అయితే జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా విగ్రహం ఏర్పాటు చెయ్యాలంటే సంబంధిత జోన్ పరిధిలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే జీవీఎంసీ స్టాట్యూ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌కు అయినా దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ నుంచి అనుమతి వస్తేనే విగ్రహం ఏర్పాటు చెయ్యాలి. నగరంలో కొన్ని చోట్ల మహనీయుల విగ్రహాల ఏర్పాటు దరఖాస్తుల ఫైల్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో ఈ నిబంధనలేవీ అడ్డు రాలేదు. అధికారం తమ చేతిలో ఉంది.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించారు. స్టాట్యూ కమిటీకి గానీ, జీవీఎంసీకి గానీ చిన్న మాటైనా చెప్పకుండా, ఇద్దరు ఐఎఎస్ అధికారులకైనా మాట మాత్రం చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బీచ్‌రోడ్డులో శుక్రవారం రాత్రికి రాత్రే దిమ్మలను నిర్మించేసి ముగ్గురు విగ్రహాలను ఏర్పాటు చేసేశారు. ఈ విగ్రహాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించేశారు కూడా. లోపం ఎవరిది.?.. కమిషనర్ అసహనం ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్.. అవాక్కయ్యారు. ఇంత తంతు జరిగినా.. తనకు చెప్పలేదంటూ అసహనానికి గురయ్యారు. జీవీఎంసీ పరిధిలో ఏం జరిగినా క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది.. విభాగాధిపతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కమిషనర్‌కు విషయం చేరవేస్తారు. అయితే ఈ విగ్రహాల ఏర్పాటు మాత్రం ప్రారంభమనంత వరకూ కమిషనర్‌కు తెలీలేదు. టౌన్‌ప్లానింగ్ పరిధిలోకి వచ్చే ఈ తతంగమంతా జోన్–2 పరిధిలో ఉన్న ఏసీపీలు డీసీపీకి గానీ, చీఫ్‌సిటీప్లానర్‌కు గానీ, జోనల్ కమిషనర్‌కు గానీ సమాచారం అందించాల్సి ఉంది. కానీ వారు ఈ విషయం ఎవ్వరికీ చేరవెయ్యలేదు. తెలిసి చెప్పలేదా..? అక్కడ విగ్రహాల ఏర్పాటు గురించి తెలీకపోవడం వల్ల చెప్పలేదా అన్న విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తుతున్న కొంతమంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఏం జరిగినా ఉన్నతాధికారులకు చేరవెయ్యడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహాల విషయంలోనూ ఇదే తరçహాలో వ్యవహరించారని తెలుస్తోంది. మూడు చోట్ల దిమ్మలు కట్టి, విగ్రహాల్ని వాహనాల్లో తీసుకొచ్చి ఏర్పాటు చేసినా.. ఎవ్వరికీ తెలియకపోవడమేంటంటూ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఇంత జరిగినా.. సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. టౌన్‌ప్లానింగ్ వాట్సప్ గ్రూపుల్లో ఏసీపీలెవ్వరూ విధుల్లోకి వెళ్లొద్దు, తాను చెప్పిన తర్వాతే విధులకు హాజరు కావాలని ఆయన మెసేజ్ చెయ్యడం కార్పొరేషన్లో కలకలం రేపుతోంది. ఈవ్యవహారంపై జోన్–2 కమిషనర్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తమ్మీద రాత్రికి రాత్రే వెలిసిన విగ్రహాలు.. జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి. -
ఆక్ పాక్ కరివేపాక్
-
‘అరవింద’ సక్సెస్ మీట్: బాలయ్య రాక వెనుక ఆంతర్యమిదే!
ఎవరినైనా సరే...అవసరానికి వాడుకోవడంలో టీడీపీ పెద్దలకు ఎవరూ సాటిరారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక కూరలో కరివేపాకులా ఏరి పారేయడంలో వారికి వారే సాటి. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ను శుభ్రంగా వాడేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత జూనియర్ ఎవరో కూడా తెలినయట్లుగా పక్కన పెట్టేశారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో రేపన్న రోజున జూనియర్ ను మళ్లీ వాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. అబ్బాయి సినిమా సక్సెస్ మీట్ కి బాబాయ్‌ని చంద్రబాబే పంపించారని అమరావతి కోళ్లు డాల్బీ సౌండ్ సిస్టమ్‌లో అదే పనిగా కూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా నచ్చిన ఫిలాసఫీ ఒకటుంది. అదే..యూజ్ అండ్ త్రో. అవసరానికి వాడుకో..అవసరం తీరిన వెంటనే అవతలికి విసిరేయ్. ఈ పాలసీని చంద్రబాబు నాయుడు తన రాజకీయ కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారని ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు అంటూ ఉంటారు. ఇపుడు ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి ఎదురీత తప్పదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా చంద్రబాబు నిర్వహించుకున్న సర్వేలతోపాటు.. ప్రైవేటు సంస్థల సర్వేల్లోనూ 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని తేలడంతో చంద్రబాబు నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలన్న ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ క్రమంలో భాగంగా..పదేళ్ల క్రితం తాము వాడుకుని పక్కన పారేసిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ బుట్టలో వేసుకోవాలన్న వ్యూహంతో చంద్రబాబు నాయుడు ఉన్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే కావచ్చు... జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద సమేత వీరరాఘవ సక్సెస్ మీట్ సభకు బాబాయ్ బాలకృష్ణ వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే 2009 ఎన్నికల తర్వాత...జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కార్యక్రమంలోనూ బాలకృష్ణ కనిపించలేదు. ఇపుడు అమాంతం జూనియర్ సినిమా సక్సెస్ మీట్ కి రావడం...జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపి ప్రచారం కోసం ఆకట్టుకోవడానికేనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. అంతకన్నా కొసమెరుపు ఏంటంటే.. ఇంచుమించు రెండేళ్ల క్రితం బాలకృష్ణ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తమకి సంబంధాలే లేవన్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. అంతగా సంబంధాలు లేని జూనియర్ సినిమా కార్యక్రమానికి ఇపుడు బాలయ్య అమాంతం ఎందుకొచ్చినట్లు? వచ్చారు సరే... అరవింద సమేత వీరరాఘవ సినిమాలో హీరోయిన్ తో పాటు ప్రతీ ఒక్కరినీ పొగిడిన బాలయ్య... జూనియర్ ఎన్టీఆర్ గురించి నామమాత్రంగా మాట్లాడి ఊరుకున్నారు. అందరినీ పొగిడిన బాలయ్య అసలు ఈ సినిమా చూడనే లేదట. సినిమా చూడకుండానే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడేశారు. అసలు సినిమా కూడా చూడకుండా.. మొక్కుబడిగా బాలయ్య ఈ మీట్ కి ఎందుకొచ్చారంటే జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రాప్ చేయడానికే అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబే వ్యూహం ప్రకారం తన బావమరిది అయిన బాలయ్యను జూనియర్ ను మంచి చేసుకునే పనిలో ఉండమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్‌ను మంచి చేసుకోవలసిన అవసరం ఏముంది? బాబాయ్ గా రమ్మని పిలిస్తే జూనియర్ వస్తాడు కదా అంటారా? ఆ సీన్ లేదిపుడు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్‌ని, ఆయనలోని అనితర సాధ్యమైన వక్తృత్వపు ప్రతిభను వీలైనంతగా వాడేసుకుని ఎన్నికల్లో లాభపడాలన్న వ్యూహంతో 2009లో చంద్రబాబు నాయుడే దగ్గరుండి జూనియర్‌ను పార్టీ వేదికలపైకి ఆహ్వానించారు. అప్పట్లో చంద్రం మావయ్య చూపించేది ఆప్యాయతే కాబోలు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన రమ్మనమనడమే ఆలస్యం అన్నట్లు.. ఎన్నికల ప్రచారం బరిలోకి దూకేశారు. తన అద్భుత ప్రసంగ పాటవాలతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. ఎంతగా ప్రచారం చేశారంటే.. ప్రాణాలకు సైతం తెగించి తెలుగుదేశానికి అంకితమై రాత్రింబవళ్లూ శ్రమించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురై తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కూడా. తీవ్ర గాయాలపాలై కట్లుకట్టుకుని ఆసుపత్రి మంచంపై ఉండి కూడా టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు జూనియర్. సరే... 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని యుక్తులు పన్నిన్నా.. అందరితో కలిసి మహాకూటమి పెట్టినా.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మా ముందు కూటమి తేలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్నికలు అయిపోగానే... నెమ్మది నెమ్మదిగా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. తన తనయుడు లోకేష్‌ను పార్టీలో తన వారసుడిగా నిలబెట్టేందుకు.. పార్టీలో అసలు జూనియర్ ఎన్టీఆర్ నీడ కూడా లేకుండా జాగ్రత్తలు పడ్డారు చంద్రబాబు. జూనియర్‌ను పక్కన పెట్టడమే కాదు.. జూనియర్ తండ్రి హరికష్ణకూ, ఆయనకు అత్యంత విధేయులైన పార్టీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆ కారణంగానే హరికృష్ణకు నమ్మకస్తుడైన పార్టీ సీనియర్ నేత కొడాలి నాని టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హరికృష్ణనీ, ఆయన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ నీ, హరికష్ణ అనుచరులైన పార్టీ నేతలను పార్టీలో డమ్మీలుగా మార్చేశారు చంద్రబాబు. జూనియర్ సినిమా దమ్ము విడుదలైన సందర్భంలో అయితే ఆ సినిమాని ఎవరూ చూడవద్దని టీడీపీ నేతలే ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి థియేటర్లు దొరక్కుండా టీడీపీ పెద్దలే అడ్డుకున్నారన్న ఆరోపణలు వినపడ్డాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, నరేంద్ర మోదీ ప్రభంజనాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకుని.. పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు. మరోవైపు బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎవరో ఒకరి అండ.. జనాకర్షణ గల నేతల ప్రచారం లేనిదే ఎన్నికల ఏరు దాటలేని చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ వేదికలపైకి రప్పించి పార్టీ తరపున ప్రచారం చేయించుకుంటే బాగుంటుందని చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రిత జూనియర్ ఎన్టీఆర్‌పై కక్షగట్టేసినట్లు ఆయన సినిమాలకు థియేటర్లు దొరక్కుండా, ఆయన సినిమాలు ఎవరూ చూడకూడదంటూ ప్రచారం చేసిన వారే ఇపుడు మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జూనియర్‌ను మంచి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఒకసారి వాడుకుని పక్కన పెట్టేసిన జూనియర్ ఎన్టీఆర్ అంత ఈజీగా టీడీపీ వైపు రారేమోనన్న అనుమానంతోనే.. బాబాయ్ బాలయ్యను ఎన్టీఆర్ సినిమా సక్సెస్ మీట్ కి పంపారు. తద్వారా.. జూనియర్‌ను టీడీపీ వైపు రప్పించుకోడానికి చంద్రబాబు పథక రచన చేశారని అంటున్నారు. చంద్రబాబు వైఖరి, విధానాలు నచ్చకనే నందమూరి హరికృష్ణ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల హరికష్ణ దుర్మరణం చెందిన సందర్భంలో ఆయన పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద కాసేపు ఉంచుదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే హరికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం దానికి నో అనేశారని సమాచారం. పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరికృష్ణ తన కుటుంబ సభ్యులతోనూ, అనుచరులతోనూ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ నేపథ్యంలోనే కుటుంబసభ్యులతోపాటు అనుచరులు కూడా టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు హరికృష్ణ భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయలేదంటారు. ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో జూనియర్‌ను ఎలాగైనా మచ్చిక చేసుకుని ఆయన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారట. జూనియర్ అభిమానులైతే.. టీడీపీ ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వెళ్లరాదని సోషల్ మీడియాలో ఇప్పుడే డిమాండ్ చేస్తున్నారు. జూనియర్‌ను మరోసారి వాడుకుని వదిలేస్తారని కూడా ట్వీట్లు పెట్టారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది చూడాలి. - సీఎన్ఎస్ యాజులు -
శ్రావణ్‌కు ఓటు వేయడం అవసరమా!
గుంటూరు, తాడికొండ: తాడికొండ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నందమూరి హరికృష్ణ సంస్మరణ సభ సాక్షిగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు మానుకొండ రత్తయ్య, యెడ్డూరి హనుమంతరావులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. తమకు వ్యతిరేకంగా గ్రూపులు నడుపుతున్నారంటూ మండిపడ్డారు. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్మిస్తే నిలిపేస్తారా? అందుకు అవసరమైతే జైలుకు వెళదాం ఏమవుతుంది. అనుమతి ఇప్పించలేని ఎమ్మెల్యేకు మనం ఓట్లు వేయడం అవసరమా అంటూ సీనియర్ నాయకుడు రత్తయ్య తనదైన శైలిలో విమర్మించడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. గత రెండేళ్లుగా జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు క్రియాశీలక రాజకీయాలు, ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆదివారం నందమూరి హరికృష్ణ సంస్మరణ సభ పేరిట ఒక్కసారిగా విరుచుకుపడటం అందరిలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వడ్లమూడి మాట్లాడుతూ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మానుకొండ రత్తయ్యతో తనకు రాజకీయాల వలననే విభేదం వచ్చిందని, దీనిని ఆసరాగా తీసుకొనేందుకు కొందరు యత్నించారన్నారు. రాజకీయాల్లో పదవులలో ఉన్న వారికి అహంకారం పెరుగుతుందని, కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా తాను ఎప్పుడూ గ్రూపులను ప్రోత్సహించలేదన్నారు. గ్రూపులు కట్టడి చేసేందుకే పలు కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. బేజాత్పురం గ్రామంలో పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వస్తే కార్యక్రమం నిర్వహించమని తాను చెప్పానని, కానీ 3 వ్యానుల పోలీసులను పెట్టి కార్యక్రమం నిర్వహిస్తూ తనపై బురద చల్లేందుకు యత్నిస్తే గ్రామానికి వెళ్లినపుడు అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారని గుర్తు చేశారు. తాను కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేయడం లేదని, ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉన్నా పార్టీని అడ్డంపెట్టి ఒక్క పని కూడా చేయించుకోలేదన్నారు. గ్రూపు రాజకీయాలు మానుకోవాలి: హనుమంతరావు సీనియర్ నాయకుడు మానుకొండ రత్తయ్య మాట్లాడుతూ తాడికొండలో సర్పంచి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మిస్తే మూడేళ్లుగా డీపీవోతో అనుమతి ఇప్పించలేని ఎమ్మెల్యేకు ఓటు వేయడం అవసరమా అన్నారు. మరో సీనియర్ నాయకుడు యెడ్డూరి హనుమంతరావు మాట్లాడుతూ ఎంతమంది కొత్త నాయకులు వచ్చినా 40 ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న తన నుంచి నాయకత్వం తీసుకోలేరన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను నడుపుతూ సీనియర్లను విస్మరించడం పట్ల ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో యార్డు చైర్మన్ గుంటుపల్లి మధుసూధనరావు, మాజీ చైర్మన్ నూతలపాటి రామారావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ ఎంపీపీ దమ్మాటి సీతామహాలక్ష్మీ, మాజీ సర్పంచ్ నూతక్కి నవీన్ కుమార్, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు, బీసీ నాయకులు ముక్కెర శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్ సుభానీ తుళ్లూరు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జొన్నలగడ్డ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నోరెత్తని ఎమ్మెల్యే వర్గం! గతంలో ఇదే నాయకులు 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్‌పై తమ వ్యతిరేక గళం వినిపించి చంద్రబాబు వద్ద అభ్యర్థిని మార్చి తెనాలి శ్రావణ్ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన తిరిగి 2014లో విజయం సాధించినప్పటికీ ఏడాది పాలన గడవకముందే వర్గ విభేదాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెరిగి పెద్దవై ఎన్నికల వేళ సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్క సారిగా స్వరం పెంచారు. ఇదే వేదికపై ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి మధుసూధనరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ యార్డు ఛైర్మన్ నూతలపాటి రామారావులు ఉన్నప్పటికీ తిరుగుబాటు బావుటాను ఖండించకపోవడం విశేషం. సీనియర్ నాయకుడు మానుకొండ రత్తయ్య కుమారుడు మానుకొండ శివరామకృష్ణ ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసంతృప్తి వర్గానికి మద్దతుగా ఆయన సైతం మైకు తీసుకొని 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉండి పార్టీకోసం నష్టపోయింది తామేనంటూ గళం విప్పడంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
మరణానంతర ప్రేమకు విలువుందా?
సోమ్‌నాథ్ ఛటర్జీ భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పేందుకు సీపీఎం నాయకత్వం వెళ్లింది. కానీ ఆయన కుమారుడు, కుమార్తె తిరస్కరించారు. తనను సీపీఎం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన రోజున ‘నా జీవితంలో ఇది అత్యంత దుర్దినం అని ఆయన క్షోభ చెందారు. ఆ క్షోభ నుంచి ఆయన కోలుకోలేదు. మాకు తెలుసు ఆయన హృదయం ఎంత గాయపడిందో..’ అంటూనే వారు సీపీఎం నేతల ప్రయత్నాన్ని అంగీకరించలేదు. ఇక్కడ హరికృష్ణ, అక్కడ సోమ్‌నాథ్ ఉదంతాలు ఒకేలా ఉన్నాయని అనలేం. కానీ జీవించి ఉన్నప్పుడు వారితో అమర్యాదగా వ్యవహరించి, మరణించిన తర్వాత వారితో తమకు వైరుధ్యాలే లేనట్లు కృత్రిమ ప్రేమను నటించడం సబబేనా? హరికృష్ణ మరణవార్త ఆయన కుటుంబసభ్యు లను, సినిమా ప్రపంచానికి చెందినవారినే కాదు... హరికృష్ణ, ఎన్టీఆర్ అభిమానులను కూడా ఎంతో కలవరపరిచి ఉంటుంది. సాధారణ మానవునిగా ఆయన ఎన్నో ఆటుపోట్లకు గురై ఉండవచ్చు. అదే సమయంలో అక్రమాలను, అన్యాయాలను ఆమోదించకపోవడం.. తనను నమ్ముకున్నవారిని, తాను నమ్మిన వారిని ఆదుకోవడం హరికృష్ణ నైజం. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తలవంచకుండా విలువల కోసం కొన్ని సందర్భాల్లోనైనా గట్టిగా నిలబడిన వ్యక్తి. అన్నిటికీమించి తన తండ్రి ఆచరించిన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలుగు నేల నాలుగు చెరగులా విస్తరింపజేయడంలో రథసారథిగా భాగస్వామి అయినాడు. తండ్రి ఆయన ఆశయ సాధనలో ఆత్మీయునిగా, పుత్రుడు అనే పదానికి తండ్రి జీవించి ఉన్నంతవరకూ న్యాయం చేశాడన్నదాన్ని ఎవరూ కాదనలేరు. హరికృష్ణది ఒక ప్రత్యేక అసాధారణ వ్యక్తిత్వం. ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో తండ్రికి ఎలాంటి గౌరవం లభిస్తున్నా మారు మాట్లాడకుండా ఆయన మనోగతానికి తగినట్టుగా ఆ పార్టీవైపే మొగ్గుచూపేవారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా, వాగ్ధాటి తెలుగు ప్రజలందరికీ పరిచితమే. రూపంలో సైతం అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్‌లా ఉండే జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి చంద్రబాబులో కాస్త బెరుకు ఉండేదని, ఇతడివల్ల ఇప్పటికిప్పుడు ఏ నష్టమూ లేకపోయినా, ప్రోత్సహించటం మొదలుపెడితే క్రమేపీ పార్టీ సమస్తం అతడివైపు మొగ్గవచ్చునని, ఫలితంగా లోకేష్ పూర్తిగా తెరమరు గవటం ఖాయమని బాబు అనుకునేవారని అంటారు. అందుకే ఆయన జూనియర్ ఎన్టీఆర్ పట్ల ముభావంగా వ్యవహరించేవారని ఒక అభి ప్రాయం ఉంది. హరికృష్ణ విషయంలోనూ ఇంతే. ఆయన తనకు విధే యుడిగా ఉంటాడన్న విశ్వాసం చంద్రబాబుకు లేదు. అందుకే హరికృష్ణ బదులు బాలకృష్ణను చేరదీసి వియ్యంకుణ్ణి చేసుకుని, ఆయన తన పట్టు నుంచి జారిపోకుండా శాసనసభ్యుని చేసి ఆయనతోపాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులనూ, తెలుగు ప్రజలనూ ఎల్లకాలమూ తనవైపు నిలబె ట్టుకోవటం బాబు ఎత్తుగడ. అదే సమయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యత్వం మినహా హరికృష్ణకు మరే ఇతర బాధ్యతలు అప్పగించకుండా ఆయన్ను నిరాదరించారు. అందుకే హరి పార్థివ దేహాన్ని తెలుగుదేశం కార్యాలయంలో ఉంచేందుకు చంద్రబాబు కొందరు కుటుంబసభ్యులను రాయబారులుగా పంపినప్పుడు హరికృష్ణ తనయులిద్దరూ నిర్ద్వం ద్వంగా తిరస్కరించినట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా జూని యర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు తమ తండ్రికి పార్టీలో జరిగిందేమిటో, ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనలోని ఆంతర్యమేమిటో గ్రహించలేని అమా యకులేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించటానికి చంద్రబాబు లేఖ ఇచ్చినప్పుడు హరికృష్ణ సమైక్యాంధ్ర గళమెత్తారు. అందుకోసం తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. అంతేకాదు.. రాజీనామా చేసిన సందర్భంగా రాజ్యసభలో తెలుగులోనే తన స్వరం వినిపించారు. తన తండ్రి ఆత్మగౌరవ నినాదానికి ఒక రూపుగా వ్యవహరించారు. అలాంటి ఉన్నతుడి పార్థివదేహాన్ని తెలుగుదేశం కార్యాలయంలో ఉంచేందుకు అనుమతినిస్తే, చంద్రబాబు, లోకేశ్ అక్కడ నిలబడి ‘ఓట్లాట’ ఆడుకుం టారని హరికృష్ణ తనయులు గ్రహించబట్టే దాన్ని సాగనీయలేదని నా భావన. కానీ జీవించి ఉన్నప్పుడు వారితో అమర్యాదగా వ్యవహరించి మరణించిన తర్వాత వారితో తమకు వైరుధ్యాలే లేనట్లు కృత్రిమ ప్రేమను నటించడం సబబేనా? ఈ మరణానంతర ప్రేమలు ఏమిటి? రాజకీయాలలో, సినిమాలలో, వివిధ వృత్తులలో ఉన్నవారికి కనీసం మనిషి అనిపించుకునేందుకు అన్ని సద్ లక్షణాలూ కాకున్నా... కొన్ని మౌలిక విలువలు ఉండితీరాలి. అందులో కృతజ్ఞత ఒక ప్రధాన లక్షణం. మహాభారత సంగ్రామానికి ముందు కర్ణుడి వద్దకు వచ్చిన ద్రౌపది ‘అసలు నువ్వు కూడా కుంతీపుత్రులలో ఒకడివి. పైగా అందరి కన్నా పెద్దవాడివి. పాండవపక్షం చేరితే నువ్వే పట్టాభిషిక్తుడివి అవు తావు’ అని చెప్పడంతోపాటు ‘నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తాను కూడా’ అని ఎరవేసినప్పుడు ద్రౌపదికి కర్ణుడు ఎంతో ఉదాత్తమైన సమాధానం ఇస్తాడు. ‘ఎంతో దీక్షతో నన్నాదరించి, విద్యాబుద్ధులు నేర్పి, అండదండ లందించిన దుర్యోధన సార్వభౌముణ్ణి విడిచిపెట్టి పాండవులతో చేరే రాక్షసకృత్యానికి నేను ఒడిగడితే చివరకు జరిగేదేమిటి... అంతకన్నా బిచ్చమెత్తుకోవడం మేలు కదా’ అంటాడు. ఇది అభినవ తిక్కనగా పేరు గాంచిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి తన ‘శబల’ అన్న కావ్య ఖండికలో రాసిన కథనం. ‘దాన వీర శూర కర్ణ’లో దుర్యోధనుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన తాతకు తగ్గ వారసులమని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు నిరూపించుకున్నారు. బాబు చెప్పినట్టు చేయకపోతే మహా అయితే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి ఇచ్చినట్టు తమ సినిమాలకు ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవచ్చు. పాశుపతాస్త్రాన్ని నిందించిన ధర్మరాజును గత శపథం ప్రకారం సంహరించకపోతే ఆత్మహత్యే శరణ్యం అనుకున్న అర్జునుడు తర్వాత శ్రీకృష్ణుడి సలహాతో తనపై తాను ఆత్మస్తుతి చేసుకుని సమస్యను పరి ష్కరించుకుంటాడు. అతిశయోక్తి వల్లించటం ఆత్మహత్యతో సమానమే అన్న నేపథ్యం నుంచే ‘తనను తాను పొగుడుకుంటే తన్నుకు చచ్చినట్టే’ అన్న నానుడి వచ్చింది. ఈరోజు ఇలా ఆత్మస్తుతి చేసుకునే నేతలు మనకు కొత్తకాదు. ‘నా దూరదృష్టి, ముందు చూపు లేకపోతే దేశం అనా గరికంగా ఉండేది. శాస్త్ర సాంకేతిక విప్లవం సాధ్యమయ్యేదికాదు. నేను లేనప్పుడు ఈ హైదరాబాద్ ఉన్నదా... పుష్కరాలు జరుపుకుంటున్న కృష్ణా గోదావరి నదులు సైతం ప్రవహించేవా’ అని అతిశయోక్తులు చెప్పు కుంటూ ఆత్మస్తుతి చేసుకునే నేతలను చూస్తున్నాం! మంచి చేయపోయినా, చెడు చేయకపోవడం కనీస మానవ లక్షణం. కానీ తమను విమర్శించినవారిని భయభ్రాంతులకు గురిచే యడం, లొంగదీసు కోవాలనుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండిం టిలో కనబడుతోంది. ఈమధ్య తెలుగుదేశం ఆర్భాటంగా చేద్దామను కున్న బహిరంగ సభ అభాసుపాలైన తీరు ఇందుకు ఉదాహరణ. ఆ సభలో కొందరు ముస్లిం యువకులు తమకు జరిగిన అన్యాయాన్ని నేతలకు వివరించటం కోసమని ప్లకార్డులు పట్టుకుని మౌనంగా నించు న్నారు. కానీ రాజుగారికి ఆగ్రహం వచ్చింది. వారి భటులు తమ రాజభక్తి ప్రదర్శించుకునేందుకు అక్రమంగా ఆ ముస్లిం యువకులను లాఠీలతో తమ చేతులు నొప్పి పెట్టేంతవరకూ కొట్టి పోలీస్స్టేషన్లన్నీ తిప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టిన వైనం ఇది. అందుకే రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా అన్న నానుడి వచ్చింది. ఇదే సందర్భంలో, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ ఉదంతం గుర్తుకురావడం సహజం. ఆయన సీపీఎం తరఫున పార్లమెం టుకు ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఏర్పాటు చేసి నప్పుడు తొలిసారి ఆయనకే లభించింది. ఆయనే అన్నివిధాలా అర్హుడని అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో అభినందించారు కూడా. అయితే 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో అణ్వస్త్ర ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎంతో పాటు విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి. కానీ సోమ్‌నాథ్ ఛటర్జీ మాత్రం సీపీఎం ఆదేశాన్ని శిరసా వహించనని చెప్పారు. ‘నేను ఏ పార్టీవాడిని అయినా ఆ స్థానం (స్పీకర్)లో ఉన్నం తవరకూ తన, పర అన్న భేదభావం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహ రిస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి స్వీకరించాను. కనుక నేనిపుడు పాలకపక్షం వైపు మొగ్గు చూపడమో, ప్రతిపక్షం కొమ్ము కాయ డమో సరికాద’ని వివరించారు. అయినా సీపీఎం నేతలు తమ నిబంధ నావళి ప్రకారం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇటీవల ఆయన కన్నుమూశారు. సోమ్‌నాథ్ భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పేందుకు సీపీఎం నాయకత్వం వెళ్లింది. కానీ ఆయన కుమారుడు, కుమార్తె అందుకు తిరస్కరించారు. తనను సీపీఎం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన రోజున ‘నా జీవితంలో ఇది అత్యంత దుర్దినం అని క్షోభ చెందారు. ఆ మానసిక క్షోభ నుంచి ఆయన కోలు కోలేదు. మాకు తెలుసు ఆయన హృదయం ఎంత గాయపడిందో. మాకు మరొకటి తెలుసు ఆయన అంతరాల్లో శ్రామిక వర్గం పట్ల పేదల పట్ల ఎంతటి ప్రేమ ఉన్నదో’ అంటూనే సీపీఎం నేతల ప్రయత్నాన్ని అంగీకరించలేదు. ఇక్కడ హరికృష్ణ ఉదంతం, సోమ్‌నాథ్ ఉదంతం నూటికి నూరుపాళ్లూ ఒకే రీతిన ఉన్నాయని అనలేం. కానీ సీపీఎం నేతలు కూడా ఒక అంశం గుర్తించాలి. పార్టీ నిర్మాణ నిబంధనావళి కూడా భౌతిక వాస్తవికతపై ఆధారపడి ఉండాలి. కేంద్రీకృత నియం తృత్వం అన్న నిర్మాణసూత్రం ఆచరణలో వ్యక్తుల నియంతృత్వానికి దారితీస్తుందని రష్యా, చైనా వంటి దేశాలలో కొన్ని అనుభవాలున్నాయి. అవి మార్క్సిస్టు పార్టీ నేతలకు తెలియనివి కాదు. నిబంధనావళి ‘రోడ్డు రోలర్’ మాదిరిగా కాక, కేంద్రీకృత ప్రజా స్వామ్యంగా ఉండాలని వారు గ్రహించాలి. పార్టీకి సోమ్‌నాథ్ ఛటర్జీ చేసిన సేవలు నాయకత్వం మరి చిందా? చర్య తీసుకునేముందు పార్టీకి మానవీయ దృక్పథం ఉండాలి కదా! అలా సమతుల్యంగా అంచనా వేయటం ఇంకా కమ్యూనిస్టులు నేర్చుకోవలసే ఉంది. ఏంగెల్స్ చెప్పిన ఉటంకింపుతో దీన్ని ముగిస్తాను. ‘‘ఎవరి గురించి ఎవరేమనుకున్నా, అంతిమంగా చరిత్ర తన గమనంలో ఎవరి పాత్రేమిటో నిర్ధారిస్తుంది. అయితే అప్పటికి ఆ వ్యక్తి తనపై చరిత్ర ఇచ్చిన తీర్పు పట్టనట్లు సమాధిలో దీర్ఘ నిద్ర పోతూ ఉంటాడు’’. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ప్రొఫెషనల్ బ్రదర్స్
నటుడు హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. కానీ తమ కుటుంబానికి సంబంధించిన బాధను తమ సినిమా మీద పడనీయకూడదని అనుకున్నారు. అందుకే తమ తమ సినిమా షూటింగ్స్‌కి హాజరు కానున్నారు. తమ ప్రొఫెషనలిజమ్ చూపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాను దసరాకు విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ డెడ్‌లైన్ మీట్ అవ్వడం కోసం ఆల్రెడీ చిత్రబృందం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు తన వల్ల షూటింగ్ ఆలస్యం కాకూడదని ప్రొఫెషనల్‌గా ఆలోచించారు ఎన్టీఆర్. ఆయన షూట్లో జాయిన్ అవుతున్నట్టు చిత్రబృందం తెలిపింది. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా ఇదే విధంగా ఆలోచించారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో ఎప్పటిలానే పాల్గొంటారట కల్యాణ్ రామ్. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ హీరోలుగా తమ బాధ్యతను నిర్వర్తించాలనుకున్న ఈ అన్నదమ్ములను ‘ప్రొఫెషనల్ బ్రదర్స్’ అనొచ్చు. -
హరికృష్ణతో సెల్ఫీ.. స్పందించిన ఆసుపత్రి
సాక్షి, నల్గొండ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో కొందరు హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు. కాగా, ఈ విషయంపై కామినేని ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగిన వారిపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సిబ్బందిలో కొంతమంది చేసిన తప్పిదం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని పేర్కొంది. సిబ్బందిలో కొందరి అనాగరిక, అమానుష ప్రవర్తన వల్లే ఈ తప్పిందం జరిగిందనీ, హరికృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆసుపత్రి తరపున క్షమాపణలు తెలిపింది. -
నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే...
సాక్షి, హైదరాబాద్ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ వన్‌గా, అవినీతిలో నెంబర్ 2గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తమకు ఒక కుటుంబం ప్రగతి మాత్రమే కనబడుతోందని, ప్రగతి ఇంకా ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్ 12న దీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశంలో సెక్రటేరియట్‌కు రాని నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్‌ను గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ‘‘25,000 మంది వీఆర్ఏలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలి. రింగ్ రోడ్డును మార్చుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రైతుల భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపినా వినటం లేదు. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 13,000 టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. మరో 10 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ అయ్యాయి. మన తెలంగాణలో అక్షరాస్యత 36 శాతం ఉంది. స్కూల్‌కు వెళ్లని వారు 30 శాతంపైగా ఉన్నారు. 57 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,000 పాఠశాలలు మూసివేశారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రైతు అప్పులలో 2 స్థానంలో ఉండగా దాదాపు 35000 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సగానికిపైగా ఇప్పటికీ ఖర్చు కాలేదు. పెన్షన్లు అందరికి ఇవ్వడం లేదు. ఉపాధి హామీ, పెన్షన్లపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఒక కుటుంబం కోసం, ఒక కాంట్రక్టర్ కోసం పాలన సాగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి పథకం అవినీతి మయం అయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రగతి నివేదన సభకు రమ్మని అడిగితే ప్రజల సమస్యలను గురించి అడగండి. ధర్నాచౌక్ ఎందుకు ఎత్తి వేసారో అడగండి, పండిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదని అడగండి. నేరేళ్ళలో దళితుల మీద దాడులు ఎందుకు చేశారో అడగండి. అధికార పక్షం వాళ్లు మన దగ్గరకి వస్తున్నారు మన సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అడగండి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావు జాధవ్, గూడ అంజన్నలను కూడా మనం గౌరవించుకోవాల’’ని కోదంరామ్ అన్నారు. (చదవండి: హరికృష్ణ కారు ప్రమాదం.. మరి మా పరిస్థితి ఏంటి!?) -
హరికృష్ణతో సెల్ఫీ.. నెటిజన్ల ఫైర్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే అక్కడ పనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియదా అంటూ చివాట్లు పెడుతున్నారు. మానవత్వం చనిపోయిందంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. Nijama idi.. Intha darunam ga ayyarentra manushulu.. 🙏🙏 Humanity chachipoyindhi. #RIPHariKrishnaGaru #Harikrishna #ThankYouManchuManoj #BiggBossTelugu2 #KaushalArmy pic.twitter.com/nA9EivqGfB — VK03 (@VK03_) August 31, 2018 -
పరాకాష్టకు చేరిన సెల్ఫీ పిచ్చి..
-
హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్య క్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛ నాలతో జరిగాయి. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హరి కృష్ణకు కడసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహిం చారు. చితికి కల్యాణ్‌రామ్ నిప్పంటించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. హరికృష్ణ చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. నివాళులర్పించిన రాజకీయ, సినీ ప్రముఖులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ చలమేశ్వర్, మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, ఎంపీలు కవిత, డి.శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమెహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, ప్రసన్న కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సురేశ్‌రెడ్డి, రేణుకాచౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగల, సీఎం రమేశ్, నన్నపనేని రాజకుమారి, మాగంటి బాబు, యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు నాగార్జున, కోటా శ్రీనివాసరావు, జగపతి బాబు, అర్జున్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఆలీ, బెనర్జీ, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున వచ్చిన వారిని ఉదయం 11 గంటల తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీ సులకు, అభిమానులకు మధ్య స్వల్ప తోపు లాట చోటు చేసుకుంది. పోలీసులు చివరకు వీఐపీలకు, అభిమానులకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి, భౌతికకాయం సందర్శనార్థం అనుమతించడంతో వారు శాంతించారు. అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేం దుకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద మొత్తంలో చేరుకోవడంతో మాసబ్‌ట్యాంక్ మొదలు మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటన్నరపాటు సాగిన అంతిమ యాత్ర హాలులో ఉన్న హరికృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోర్టికోలోకి తీసుకొచ్చారు. అక్కడే కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో బ్రాహ్మణులు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేయించారు. అనంతరం అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమ యాత్ర సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్వయంగా పాడెను మోసుకుంటూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠరథంలో ఎక్కించారు. ‘నందమూరి హరికృష్ణ అమర్ రహే..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ అభి మానులు ముందుకు సాగారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నర పాటు అంతిమయాత్ర సాగింది. తండ్రికి తగ్గ తనయుడు: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో తెలుగు లోనే మాట్లాడతానని హరికృష్ణ పట్టుబట్టారు. ఆ సమయంలో నేను జోక్యం చోసు కుని తెలుగును ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పాను’అనే విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బతికారని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశారని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనా లతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించిం ది. అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరు కున్న తర్వాత వైకుంఠరథం నుంచి భౌతిక కాయాన్ని కిందికి దింపారు. కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ముందు నడుస్తుండగా ఆ వెనుకాలే చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా పాడెపట్టి భౌతిక కాయాన్ని చితివరకు మోసుకొచ్చారు. పోలీ సులు హరికృష్ణ భౌతికకాయానికి గౌరవ వంద నం చేసి.. గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరిపారు. సరిగ్గా 4.10 గంటలకు కల్యాణ్ రామ్ హరికృష్ణ చితికి నిప్పంటించారు. -
‘తారక్ భయ్యా.. మీకు తోడుగా ఉన్నాం’
‘డల్లాస్ కన్సర్ట్ను నందమూరి హరికృష్ణ గారికి అంకితం ఇస్తున్నానంటూ’ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన డీఎస్పీ... ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్. తారక్ భయ్యా, కల్యాణ్‌రామ్ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్ కన్సర్ట్ను ఆయనకు అంకితం చేస్తున్నానంటూ’ దేవిశ్రీ ట్వీట్ చేశారు. కాగా నల్గొండ జిల్లాలో అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కుమారులు నందమూరి కల్యాణ్‌రాం, జూనియర్ ఎన్టీఆర్‌లు హరికృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు. Took dis pic a few months bak..Such a loving & warm Human.. We wl miss U sir❤️ May ur soul R.I.P🙏🏻💐 Dear @tarak9999 brother and @NANDAMURIKALYAN garu,we r always with U and HE wil always be watching over you Dedicating DALLAS CONCERT to Sri NANDAMURI HARIKRISHNA garu🙏🏻 pic.twitter.com/L8KyP3KNJN — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018 Jst cant believe d news of Sri HariKrishna Garu..Heart Breaking.. Such a Dear person 2 my Father and Me🙏🏻🙏🏻 And d Sweetest & Most Humble Soul..May God bless his soul & give strength 2 d family of my Dear brother @tarak9999 @NANDAMURIKALYAN garu.. May his soul R.I.P🙏🏻💐❤️ — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 29, 2018 -
ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
-
హరికృష్ణ దుర్మరణం.. మరి మా పరిస్థితి ఏంటి!?
సాక్షి, నల్గొండ : అతివేగం, సీటుబెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు... మరో నలుగురు యువకుల జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చేసింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హరికృష్ణ కారు అదుపు తప్పి అన్నేపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది. ఈ ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితో పాటు కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించిన పోలీసులు... వీరిని కూడా ఆస్పత్రిలో చేర్చి వైద్య సదుపాయం కల్పించారు. కానీ హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన తర్వాత తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబాలకు అవే జీవనాధారం.. ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్న ఆ యువకులు ఓ ప్రోగ్రామ్ నిమిత్తం చెన్నైకి వెళ్లి వస్తుండగా అనుకోని విధంగా హరికృష్ణ కారు రూపంలో ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో వీరికి గాయాలు కాగా కెమెరాలు, ఫొటోగ్రఫీ సామాగ్రి సహా కారు కూడా ధ్వంసమైంది. అయితే ఆస్పత్రిలో చేర్చిన అనంతరం పోలీసులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లం. ప్రస్తుతం మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పులు తెచ్చి మరీ కెమెరాలు కొనుగోలు చేశాం. అవే మా కుటుంబాలకు జీవనాధారం. రేపటి నుంచి ఎలా బతకాలి. గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరేంత వరకు మమ్మల్ని ఎవరు పోషిస్తారు. మాకు ఎవరు న్యాయం చేస్తారంటూ’ ప్రవీణ్, శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం.. తమకు కూడా సహాయం చేసి, కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. సంబంధిత కథనాలు: ప్రముఖులకు ఈ జిల్లా అచ్చిరాదా!? కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు.. వేగం తీసిన ప్రాణాలెన్నో! -
హరికృష్ణ చితికి నిప్పంటించిన కల్యాణ్‌రామ్
-
ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్ నిప్పంటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర సాగింది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం మహాప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నరపాటు అంతిమయాత్ర సాగింది. ‘రథసారధి’కి అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరి మా పరిస్థితి ఏంటి!?
-
‘ఆత్మీయుడైన తమ్ముడు.. మా అన్నగారి బిడ్డ’
నందమూరి కుటుంబంతో నటుడు మోహన్‌బాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అన్నా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే మోహన్‌బాబు... హరికృష్ణ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున హరికృష్ణ భౌతికకాయాన్ని చూసే వీలు లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలి.. ‘నేను ఇండియాలో లేను. అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్లంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు.. మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్‌తో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆరోజు మొదలైన మా అనుబంధం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ’ మోహన్ బాబు.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. కాగా మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యులు అభిమానుల ఆశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర
-
ఆప్యాయంగా పలకరించేవారు
జనగామ : మానవతావాది...మాటమీద నిలబడే వ్యక్తి.. ఆయన ఆలోచనలు ధర్మపథంగా ఉంటాయి.. గురువులను గౌరవించే కుటుంబం వారిది అంటూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరిక్రిష్ణ చిన్ననాటి స్నేహితుడు, కుటుంబానికి దగ్గరి వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో నివాసముంటున్న యాదగిరి జగ్గారావు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తెల్లవారు జామున హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న జగ్గారావు. టీవీకి అతుక్కుపోయారు. నాటి స్నేహాన్ని గుర్తుకు చేసుకుంటూ.. తోటి వారితో తన బాధను పంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన యాదగిరి జగన్నాథరావు జ్యోతిష్య పండితుడిగా.. గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్ధాంతిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగన్నాథరావుకు ఎన్టీఆర్ తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి నుంచి పిలుపువచ్చింది. వెంటనే 1945లో ఆయన సొంత గ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వెళ్లారు. జగన్నాథరావుకు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు జన్మించారు. లక్ష్మయ్య చౌదరి ఆశిస్సులతో అక్కడే స్థిరపడిపోయారు. జగన్నాథరావు సిద్ధాంతి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం ఏ పని ప్రారంభించినా.. ఈయన సలహాలు, సూచనలు తీసుకునే వారు. జగన్నాథరావు కుమారుల్లో ఒక్కరైన యాదగిరి జగ్గారావు కంటే (ప్రస్తుతం జనగామలో నివాసం) ఎన్టీఆర్ కుమారుడు, దివంగత హరికృష్ణ పదేళ్లు చిన్నవాడు. విద్యాభ్యాసం చేయాలంటే పక్క ఊరికి వెళ్లే పరిస్థితి.దీంతో నిమ్మకూరులోనే పాఠశాలను ఏర్పాటు చేసి..అక్కడే హరికృష్ణను చదివించగా.. అప్పటికే గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన జగ్గారావు ఆయనకు తోడుగా ఉండేవారు. కార్తీక పున్నమి రోజున నదీ స్నానం చేసేందుకు.. మచిలీపట్నం మంగినపూడిరేవుకు ఎద్దుల బండిపై హరిక్రిష్ణను తీసుకువెళ్లిన జ్ఞాపకాలు కళ్ల ముందు తేలియాడుతున్నాయని గుర్తుకు చేశారు. జగన్నాథ సిద్ధాంతికి వృద్ధాప్యం మీద పడడంతో సొంతూరికి వెళ్లాలనే ఆలోచనతో..1970 ఇక్కడకు వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని స్టూడియోలో ఒక్కసారి కలుసుకున్నాం. చదువుతో పాటు వినయం, మర్యాద, ఆలోచనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునే హరికృష్ణ అకాల మరణం తీరని లోటని జగ్గారావు కన్నీళ్ల పర్యంతమయ్యారు. హరికృష్ణకు వరంగల్‌తో అనుబంధం.. హన్మకొండ కల్చరల్ : సినీనటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల జిల్లాలోని ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తొలినాళ్లలో హరికృష్ణ అనేకసార్లు జిల్లాను సందర్శించారు. శ్రీభద్రకాళి అమ్మవారిపై హరికృష్ణకు అమితమైన భక్తి. చాలాసార్లు అమ్మవారిని దర్శించుకున్నారు. హేమాచలుడికి ప్రియ భక్తుడు హరికృష్ణ మంగపేట: సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం మృతి చెందడంపై మండలంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల కొండపై స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామికి ఆయన అత్యంత ప్రియభక్తుడు. 2013లో ఆయన స్వయంగా తన సతీమణితో హేమచలక్షేత్రానికి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను పర్యటించి పులకించారు. ఆలయ అభివృద్ధి కొరకు తనవంతు సహాయమందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మృతి చెందారని తెలియడంతో మండలంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఆయనతో ఐదేళ్ల క్రితం కలిసిన తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. -
హరికృష్ణ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కీరవాణి
నేతలు, ఉన్నతాధికారుల పిల్లలు ఎలా ఉంటారో.. ఎంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారో అందరికి తెలిసిన సంగతే. అందరూ అలా ఉండకపోయినా కొందరైనా తమ తల్లిదండ్రుల హోదాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అధికారులు.. సామాన్యుల మీద జులుం ప్రదర్శిస్తుంటారు. కానీ ఓ ముఖ్యమంత్రి కుమారుడు.. తానేవరో, తన తండ్రి హోదా ఏమిటనే విషయాలు వెల్లడించకుండా.. సాధారణ వ్యక్తిలాగా ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన చలానా చెల్లించిండంటే నమ్మడానికి కాస్తా కష్టంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తికి తండ్రి సీఎం అయినంత మాత్రాన కుమారులు తలబిరుసుగా.. అమర్యాదగా ప్రవర్తించకూడదని తెలుసు. అందుకే అంతా సాధరణంగా ఉండగలిగాడు. ఆయనే నందమూరి హరికృష్ణ.. భేషజాలు తెలియని వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కీరవాణి... ‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఒక సారి హరికృష్ణ ట్రాఫిక్ సిగ్నల్ దాటారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా కట్టి వెళ్లిపోయారు.. తప్ప తాను ఎవరో చెప్పలేదు’ అంటూ కీరవాణి, హరికృష్ణ గురించి తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంత గొప్ప వ్యక్తిత్వమున్న ఆ రథసారథిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. హరికృష్ణ మృతి ఆయన కుటుంబానికే కాక సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అంటున్నారు అభిమానులు. రెండో వివాహాన్ని తండ్రి ఒప్పుకోలేదు తండ్రి అంటే అపార గౌరవం ఉన్న హరికృష్ణ తండ్రికి ఇష్టం లేని పని ఒకటి చేశారంట. అది షాలినిని రెండో వివాహం చేసుకోవడం. హరికృష్ణ షాలిని(జూ ఎన్టీఆర్ తల్లి)ని వివాహం చేసుకోవడం ఆయన తండ్రి ఎన్టీఆర్‌కి నచ్చలేదు. కానీ హరికృష్ణ ఈ విషయంలో తండ్రితో కూడా విభేదించారు. అయితే జూ. ఎన్టీఆర్ పుట్టిన తర్వాత ఆ విభేదాలన్ని దూరమయినట్లు సమాచారం. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా తన మనవడికి తన పేరు ‘నందమూరి తారక రామరావు’ అని పెట్టుకున్నారని మరో సినీ ప్రముఖుడు తెలిపారు. -
హరికృష్ణకు నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
విషాదం....
నల్గొండ : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అకాల మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. బుధవారం నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం, గతంలో అతని కుమారుడు జానకీరామ్ కూడా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. -
చైతన్య రథసారథి.. ఇక్కడి ప్రజలకు పెన్నిధి
అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ పొలిటబ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో అనుబంధముంది. మంత్రి హోదాలో ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ప్రయాణించే క్రమంలో సూర్యాపేట, కోదాడలో ఉన్న తమ స్నేహితులు, సన్నిహితుల ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. హరికృష్ణ అకాలమరణ వార్త తెలుసుకుని స్నేహితులు, అభిమానులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కోదాడఅర్బన్ : కోదాడతో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధముంది. స్థానిక నాయకులతో సన్నిహి త సంబంధాలున్న హరికృష్ణ హైదరాబాద్ – విజయవాడల మధ్య ప్రయాణించే సమయంలో తరచూ ఇక్కడ ఆగేవారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నాయకులతో ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. 2008లో అప్పటి టీడీపీ నాయకుడు మధిర బ్రహ్మారెడ్డి ఎన్టీఆర్ ఆరోగ్య రథాల పేరిట ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ వ్యాన్లను ఆయనే నడిపి ప్రారంభించారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు నివాసానికి భోజనానికి వచ్చిన ఆయనను ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న కౌన్సిలర్ పార సీతయ్యతో పాటు పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం 2016లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతూ ముత్తవరపు పాం డురంగారావు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చారు. ఆ సమయంలో గంటకు పైగా ఇక్కడ గడిపిన హరికృష్ణ అక్కడ వచ్చిన నాయకులను పేరుపేరున పలకరిస్తూ ఫొటోలు దిగారు. 2014లో ఆయన కుమారుడు నందమూరి జానకిరామ్ ఆకుపాముల వద్ద ప్రమాదంలో మరణిం చిన సమయంలో స్థానికంగా ఉన్న పలువురు నా యకులు హైదరాబాద్‌కు వెళ్లి ఆయనను పరామర్శించి, సానుభూతి తెలిపారు. తమతో సన్నిహితంగా ఉండి ఆప్యాయంగా పలకరించే హరికృష్ణ మరణం తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.పలుమార్లు సూర్యాపేటకు..సూర్యాపేటటౌన్ : సూర్యాపేటతో నందమూరి హరికృష్ణకు ఎంతో అనుబంధం ఉంది. సూర్యాపేట పట్టణానికి చెందిన సినీ నిర్మాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొల్లి వెంకటేశ్వర్రావు(కేవీ) ఇంటికి పలుమార్లు వచ్చాడు. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే సమయంలో కొల్లి వెంకటేశ్వర్రావు ఇంటికి వచ్చి కొద్దిసేపు ఆగి, భోజనం చేసి వెళ్లేవారు. వారి ఇంట్లోనే కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. కానీ కొల్లి వెంకటేశ్వర్రావు చని పోవడంతో అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులకు అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకునేవారు. వచ్చే ముందు ఫోన్ చేసేవారు ..కొల్లి సంధ్యారాణి, కేవీ సతీమణి హరికృష్ణ చనిపోయాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యా. మా వారితో హరికృష్ణకు మంచి స్నే హం ఉండేది. మా వారు ఉండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు మా ఇంటికి వచ్చేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నా.. భోజనం చేసి వెళ్తా.. అని ముందే చెప్పి వచ్చేవారు. ఐదారు సార్లు మా ఇంటికి వ చ్చారు. చాలా సేపు ఉండి భోజనం చేసి మాట్లాడేవారు. బాలకృష్ణ కూడా మా ఇంటికి వస్తుం టారు. హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించు కోలేకపోతున్నాం. వలిగొండలో బస్టాండ్ ప్రారంభం వలిగొండ(భువనగిరి) : వలిగొండలోని సా యినగర్ సమీపంలో భువనగిరి– నల్లగొండ ప్రధాన రహదారిపై నిర్మించిన బస్టాండ్‌ను 1996లో రవాణాశాఖ మంత్రి హోదాలో ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ ప్రారంభించారు. అంతకుముందు 1983లో హరి కృష్ణ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య రథంపై డ్రైవర్‌గా వచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మండల ప్రజలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పార్టీ స్థాపన ప్రకటన మిర్యాలగూడ సభలోనే మిర్యాలగూడ : హరికృష్ణకు మిర్యాలగూడతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించిన సమయంలో తెలంగాణలోనే మొట్టమొదటగా 1983లో నాగార్జునసాగర్ (చలకుర్తి) నియోజకవర్గంలో చైతన్యయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో చలకుర్తి నుంచి మిర్యాలగూడ వరకు నిర్వహించిన చైతన్య రథయాత్రకు రథసారథిగా ఉన్నారు. మిర్యాగూడలో యాత్ర ముగిసిన సమయంలో ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ కూడా స్థాని కంగా మాజీ జెడ్పీ చైర్మన్ సీడీ రవికుమార్ నివాసంలో నిద్రించారు. అదేవిధంగా ఎన్ని కల సమయంలో అనేక పర్యాయాలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట 1999 జనవరి 8వ తేదీన ఎన్టీ రామారావు విగ్రహాన్ని హరికృష్ణ ఆవిష్కరించారు. ఆ సమయంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలోనే తాను పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా చివరి సారిగా 2017 మే 14వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వాడపల్లి శ్రీఅగస్తేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిర్యాలగూడకు చెందిన టీడీపీ నాయకులు యూసుఫ్, సాధినేని శ్రీనివాసరావు, బంటు వెంకటేశ్వర్లు కూడా అనుబంధం కలిగి ఉన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో.. హరికృష్ణతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్‌రావుకు హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపించిన సమయంలో కుందూరు జానారెడ్డితో పాటుగా ఉన్న భాస్కర్‌రావుకు కూడా హరికృష్ణతో సంబంధం ఉండేది. చౌటుప్పల్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. చౌటుప్పల్(మునుగోడు) : నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చౌటుప్పల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందమూరి తారకరామారావు చేపట్టిన చైతన్య యాత్ర బస్సుకు డ్రైవర్‌గా చౌటుప్పల్‌కు వచ్చారు. 1995లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించేందుకు అప్ప టి హోంశాఖా మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డితో కలిసి వచ్చారు. 1996లో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అదనపు ప్లాట్‌ఫాం నిర్మాణాలను ప్రారంభించేందుకు హాజరయ్యారు. అనంతరం అన్న తెలుగుదేశం పార్టీ జెండావిష్కరణకు మరోసారి చౌటుప్పల్‌కు వచ్చారు. మూడుసార్లు అడ్లూరు సరస్వతీ ఆలయానికి రాక శాలిగౌరారం(తుంగతుర్తి) : నందమూరి హరికృష్ణతో శాలి గౌరారం మండలానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అడ్లూరు గ్రామంలో గల ప్రసిద్ధ వీణగాన నృత్య సరస్వతీ ఆలయంతో ఆయనకు విడదీయని బంధం ఏర్పడింది. 1995, 1996, 1999 సంవత్సరాల్లో అడ్లూరులోని సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. తన మనుమరాలికి ఈ దేవాలయంలోనే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించినప్పుడల్లా ఆలయ పూజారి పానుగంటి మదనాచారితో ప్రత్యేకంగా సుమాలోచనలు జరిపేవారు. హరి కృష్ణ మరణవార్త తెలుసుకుని ఆలయ వంశపారంపర్య పూజా రి పానుగంటి అశోకాచారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో పూజలునల్లగొండ కల్చరల్ : నందమూరి హరికృష్ణ 2015, 2017 సంవత్సరాల్లో పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. మొదటిసారి 2015 డిసెంబర్ 2న, రెండోసారి 2017 మార్చి 11 ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ఛాయా సోమేశ్వరాలయంపై హరికృష్ణకు మంచి అభిప్రాయం ఏర్పడిందని, మళ్లీ ఆలయానికి వస్తానన్నారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారని పేర్కొన్నారు. పోచంపల్లిలో భావోద్వేగంతో ప్రసంగం భూదాన్‌పోచంపల్లి(భువగనగిరి) : నందమూరి హరికృష్ణకు పోచంపల్లితో అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు మరణాంతరం ‘అన్న తెలుగుదేశం పార్టీ’ని స్థాపించి, ఎన్నికల ప్రచారంలో భా గంగా 1998 ఆగస్టు నెలలో పోచంపల్లికి వచ్చా రు. కర్నాటి పాండు ఇం టి పైన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నేతాజీ చౌరస్తాలో నాడు దివంగత ఎన్టీ రా మారావు చైతన్యరథ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడి వారి మన్ననలు చూరగొన్నారు. మండల ప్రజలు చూపించిన అభిమానాన్ని ఎన్నడూ మరువలేనని భావోద్వేగంతో ప్రసం గించారు. ఆ రోజు పోచంపల్లిలో 2 గంటలపాటు గడిపాడు. అప్పటి అన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న బొంగు శంకరయ్యతో పాటు గునిగంటి మల్లేశ్‌గౌడ్, బండి యాదగిరి, బైరు రామాంజనేయులు, బోగ రఘు తదితరులు నందమూరి హరికృష్ణను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. హరికృష్ణ అకాల మృతిపై బుధవారం పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం
నల్లగొండ : ‘మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం. కారు నడిపే వ్యక్తితో పాటు కారులో ఉన్న అందరూ ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. అదే ప్రాణానికి రక్షణ కవచం లాంటిది’ అంటున్నారు నల్ల గొండ ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతిచెందిన నేపథ్యంలో ఆయన బుధవారం పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ‘ఇంటర్నేషనల్ సెప్టీ టెస్టింగ్’ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఏ కారైన 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తేనే మంచిది. ఆ సమయంలో ప్రమాదం జరిగినా కారులో రక్షణ కోసం ఉన్న ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తాయి. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంతకంటే వేగం మించితే వారు వెళ్లే వేగాన్ని బట్టి ఎంత రక్షణ ఉంటుదనేది చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రమాదం అనేది మానవ తప్పిదంగానే ఎక్కువ శాతం ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సాంకేతికతతో కూడిన వాహనాలు తయారవుతున్నాయి. కారును స్టార్ట్ చేయడానికి కీ పెట్టగానే అన్ని లైట్లు వస్తాయి. ఆన్ చేయగానే ఆ లైట్లన్ని పోతాయి. ఒక వేళ లైట్లు కొన్ని వెలుగుతున్నాయంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉందని వాహనచోదకుడు తెలుసుకోవాల్సిందే. కానీ చాలా మంది పట్టించుకోకుండా అలానే నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్ పెట్టుకోకుంటే శబ్ధం వస్తుంది. అది కొంతదూరం వెళ్లే వరకే వస్తుంది. కానీ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. ఇంజన్అయిల్ మార్చుకోవాల్సిన సమయం వచ్చినా, టైర్లో గాలి తక్కువగా ఉన్నా సిగ్నల్స్ వస్తాయి. పట్టించుకోవడం లేదు. టైర్ల కంపెనీలు లక్ష కిలోమీటర్ల వరకు మన్నిక ఉంటాయని చెప్పుతున్నాయి. కానీ నడిపే వ్యక్తికి బ్రేక్ వేసిన సందర్భంలో టైర్ జారీపోతున్నట్లుగా ఉంటే దానిని వెంటనే మార్చుకోవాల్సిందే. సెల్ప్ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం మంచిది కాదు. చోదకుడు ఎప్పుడూ వాహనం ఎంత వేగంలో ఉందో చూసుకుంటూ, ప్రయాణం మీదనే దృష్టి సారిం చాలి. ఏదైనా అవసరమైతే ఆగాలి. తప్ప కారు నడుపుతూ ఫోన్ మాట్లాడటం, వాటర్ తాగడం లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎన్ని కోట్ల రూపాయల వాహనమైనా నిబంధనల ప్రకారం నడిపితేనే రక్షణ. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవాళ్లమే అవుతాము. సీటు బెల్ట్‌తో ప్రాణానికి రక్షణ నల్లగొండ క్రైం : సీటు బెల్ట్‌తో ప్రాణానికి లింక్ ఉంది. కారులో సీటు బెల్ట్ ధరించి వాహనాన్ని నడిపే వారంతా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా సీటు బెల్ట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడతారని నల్లగొండ టూటౌన్ సీఐ భాష తెలిపారు. హరికృష్ణ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. సీటుబెల్ట్ ధరిస్తే ఎంతటి రోడ్డు ప్రమాదమైన ప్రాణాలు సురక్షితం. వాహన మోడల్‌ను బట్టి కొన్ని కిలోమీటర్ల వేగం వరకే హెయిర్ బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటుబెల్ట్ పెట్టుకుంటేనే బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటు బెల్ట్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, చాతి ఎముకలకు, తలకు గాయాలు కావు. స్టీరింగ్ తగలకపోగా, కుడి, ఎడమ వైపు కూడా గాయాలు కావు. బలంగా ఇసుకలారీ వేగంగా గుద్దితే సీటు బెల్ట్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. గత అనేక సంఘటనల్లో 95 శాతం సీటు బెల్ట్ పెట్టుకున్న వారు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వాహనం నడిపేటప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే చిన్న ప్రమాదమైనా తల, స్టీరింగ్‌కు తగిలి మృతి చెందుతారు. వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకునేలా అలవాటు చేసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ముందుచూపు, పరిమిత వేగం మాత్రమే ఉండాలి. ఇక్కడి రహదారులలో 80 నుంచి 90 కిలోమీటర్ల లోపు వేగమే సురక్షితం. -
మునగాల మండలంలో జానకీరామ్..
మునగాల (కోదాడ) : 2014డిసెంబర్ 6వ తేదీన 65వ నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో సాయంత్రం 6.45గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి జానకీరామ్(38) దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి తన సొంత కారు (టాటా సఫారీ ఈఎక్స్, ఏపీ 29 బీడీ-2323)లో విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నాలు గేళ్ల క్రితం ఈ ప్రమాదం సంభవించింది. ఆకుపాముల వద్ద వరినారుతో వస్తున్న ఓట్రాక్టర్(ట్రాలీ) రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా వస్తున్న జానకీరామ్ కారు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా ట్రాలీ ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న జానకీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. జానకీరామ్‌ను ముందుగా ఎవరూ గుర్తించలేదు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పలువురు గ్రామస్తులు జానకీరామ్ సెల్‌ఫోన్ ద్వారా డైల్డ్కాల్కు రింగ్ చేయగా అవతల వైపు నుంచి హరికృష్ణ ఫోన్ ఎత్తడంలో ప్రమాదం జరిగిన వ్యక్తి జానకీరామ్గా గ్రహించారు. గాయపడ్డ జానకీరామ్‌ను గ్రామస్తులు 108లో కోదాడలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జానకీరామ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణం ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నాడు గుర్తించారు. దీనికి తోడు రహదారిపై వరినారుతో ఉన్నట్రాక్టర్, ట్రాలీ రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేయడం మరొక కారణం. ఈ ప్రాంతంలో ఉన్న క్రాసింగ్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
అభిమానలోకం..శోకసంద్రం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలతెలవారుతుండగానే నందమూరి అభిమానులు చేదువార్త వినాల్సి వచ్చింది. నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ మూల మలుపు వద్ద బుధవారం ఉదయం 5.50 గంట లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ(61) తీవ్రం గా గాయపడిన వార్త ఒక్కసారిగా గుప్పుమంది. సమీపంలోని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం 7.15 గంటలకు హరికృష్ణ మృతి చెందినట్లు కామినేని వైద్యులు ప్రకటించడం, ఆవెంటనే టీవీ చానళ్లలో ఆ వార్త ప్రసారం కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన వార్త, ప్రమాద ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఉదయం 8.30 గంటలకల్లా కామినేనికి చేరుకున్నారన్న వార్త బయటకు రావడంతో వారి అభిమానులు పె ద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై పోగయ్యారు. సినీ హీరోలు బాలకృష్ణ, జగపతి బాబు తదితరులూ వచ్చారని తెలుసుకున్న అభిమానులు మ రింత మంది తరలివచ్చారు. ఒక దశలో జనానికి సర్దిచెప్పడం పోలీసులకు కష్టసాధ్యమైంది. హరికృష్ణకు నివాళి అర్పించేందుకు, నందమూరి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తారన్న సమాచారంతో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కామినేని ఆస్పత్రి ప్రధాన గేటుకు తాళం వేసి లోనికి ఎవరినీ వెళ్లనీయలేదు. దీంతో పెద్ద సంఖ్యలో గుమికూడిన నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచీ తమతో కలిసి పార్టీలో పనిచేసిన హరికృష్ణను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హరికృష్ణతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధం, పరిచయం ఉన్న నేతలు, వారి అనుచరులు రావడంతో కామినేని ఆస్పత్రి ప్రాంతం జనంతో నిండిపోయింది. జాతీయ రహదారిపై కనీసం కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక మధ్యాహ్నం 12.17 గంటలకు హరికృష్ణ మృతదేహాన్ని తరలించాక చాలా సేపటి వరకు కామినేని వద్ద జనం తగ్గలేదు. తక్షణం స్పందించిన స్థానిక నాయకత్వం రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ కామినేనిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హుటాహుటిన కామినేనికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైద్యులతో మాట్లాడిన వెంటనే సీఎం కేసీఆర్‌కు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి సమాచారం అందించారు. హరికృష్ణతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నల్లగొండ టీఆర్ఎస్ ఇన్‌ఛార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. నందమూరి కుటుంబంతోనూ ఆ యనకు సంబంధాలు ఉండడంతో ఆస్పత్రికి వ చ్చిన కుటుంబ సభ్యులందరినీ ఆయనే లోపలికి తీసుకెళ్లి వెంట ఉన్నారు. రాష్ట్ర టీడీపీ నాయకులూ కామినేనికి వచ్చారు. జిల్లాకు చెందిన వివిధ పా ర్టీల నేతలు సైతం హాస్పిటల్‌కు వచ్చినా చాలా మందిలోనికి వెళ్లలేక పోయారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రమాదం జరగడంతో నల్లగొండ ప ట్టణం నుంచి యువకులు పెద్ద సంఖ్యలో సంఘట నా స్థలికి, అటు నుంచి కామినేనికి చేరుకున్నారు. ప్రమాదకరంగా రోడ్డు మలుపు బెటాలియన్ నుంచి అన్నెపర్తి స్టేజి వరకు అర కిలోమీటరు దూరం ‘ఎస్’ ఆకారంలో ప్రమాదకరంగా మూలమలుపు ఉంది. కల్వర్టు వద్ద మూలమలుపు ఉండడంతో ప్రమాద హెచ్చరికగా కాంక్రీ టు నింపిన పీవీసీ పైపులను రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. కల్వర్టును, మూలమలుపును విస్తరించాల్సి ఉంది. 10రోజుల క్రితమే రోడ్డు ప్ర మాదంలో అన్నెపర్తిలో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తున్న అల్గుబెల్లి సత్తిరెడ్డి మృతి చెందాడు. ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ అన్నెపర్తి వద్ద ఘటన స్థలాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ సందర్శించారు. ప్రమాద వివరా లపై అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. -
భారీ కాన్వాయ్‌తో హరికృష్ణ పార్థివదేహం
చౌటుప్పల్ (మునుగోడు) : నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సినీ నటుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పార్థివదేహాన్ని రోడ్డుమార్గం ద్వారా చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ వెంట భారీ వాహన శ్రేణి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రముఖులు అంబులెన్స్ వెంటే ఉన్నారు. స్థానిక తంగడపల్లి రోడ్డు, బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానులు అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. శాంతి భద్రతల సమస్యల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా హరికృష్ణ అమరహై, హరికృష్ణకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. తంగడపల్లి క్రాస్‌రోడ్డు వద్ద అడ్డంగా వాహనాలు రావడంతో అంబులెన్స్, చంద్రబాబు కాన్వాయ్ కొద్దిసేపు ఆగిపోయింది. పోలీసులు అడ్డంగా వచ్చిన వాహనాలను పంపించడంతో కాన్వాయ్ వెళ్లిపోయింది. హుటాహుటిన తరలిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఏపీ సీఎంను ఆస్పత్రికి తీసుకెళ్లిన మంత్రి నల్లగొండ ప్రతినిధి : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాద సంఘటన తెలియడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెరెడ్డి హుటాహుటిన బెటాలియన్ వద్దకు చేరుకున్నాడు. హెలికాప్టర్ ద్వారా అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మంత్రి జగదీశ్‌రెడ్డి రిసీవ్ చేసుకుని కార్లో కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దుర్ఘటన తీరును, వైద్య సేవలను మంత్రి సీఎంకు కార్లో వివరించారు. అంతకుముందు మంత్రి హరికృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నటుడు బాలకృష్ణను మంత్రి ఓదార్చారు. మంత్రి కామినేనిలో ఉన్న సమయంలోనే హరికృష్ణ పార్థివదేహం వెంట హైదరాబాద్‌కు తరలిరావాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించడంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హరికృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు తలపెట్టిన విషయాన్ని ఏపీ సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ హరికృష్ణ ఇంటికి చేరుకోగా.. సంఘటన వివరాలను ఆయనకు వివరించారు. -
తెలుగులోనే మాట్లాడతానని చెప్పాడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్డాడని, తాను జోక్యం చోసుకుని తెలుగును ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పిన విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధీవదేహానికి వెంకయ్య నాయుడు నివాళులుల అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బ్రతికాడని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశాడని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణ అని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నాఉ. తన కుటుంబానికి , హరికృష్ణ మరణం తీరని లోటని అన్నారు. -
జనసంద్రంగా ‘కామినేని’
నకిరేకల్ / చిట్యాల : సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదానికి గురాయ్యరు. చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ మృతి వార్త టీవీలు, సోషల్‌మీడియా ద్వారా తెలియడంతో ఆయన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని వైద్యశాల జనసంద్రంగా మారింది. హరికృష్ణ మృతదేహాన్ని చూసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, సినీ, రాజకీయ ప్రముఖులు కామినేని వైద్యశాలకు వచ్చారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి ముందు కిక్కిరిసి పోయింది. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు మోహరించారు. వచ్చిన జనాన్ని, అభిమానులను అదుపుచేయడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కాన్వాయ్‌లో ఎవ్వరు వచ్చిన ఒక్కసారిగా కేరింతలతో హైవే మీదకు దూసుకురావడంతో విజయవాడ, హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. సినీ ప్రముఖులు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు కాన్వాయ్ మీదకు ఎగబడి చూశారు. అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఆయన వాహనంలోనే నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు ఉదయం 11:09 నిమిషాలకు చేరుకున్నారు. గంటపాటు కామినేని వైద్యశాలలోనే ఉన్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం.. హరికృష్ణ వాహనంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. తదనంతరం హరికృష్ణ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చంద్రబాబునాయుడు తన వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో ఆసుపత్రి ముందున్న అభిమానులు పెద్దఎత్తున వాహనాలను వెంబడించారు. భారీ కేరింతలతో సుమారు కిలోమీటర్ మేర వారి కాన్వాయ్ వెంట అభిమానులు పరుగులు తీశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హరికృష్ణ మృతదేహం తీసుకెళ్లే వరకు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. సినీ ప్రముఖులు జగపతిబాబు, హరికృష్ణ కుటుంబీకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, హరికృష్ణ సోదరి పురందేశ్వరి, కొడాలి నాని, ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహం వద్ద నివాళులర్పించారు. భారీ బందోబస్తు.. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. ఆసుపత్రి గేటు లోపలికి ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే అనుమతించారు. కొందరు ప్రముఖుల కార్లును సైతం ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ప్రముఖ హీరో జగపతిబాబు కారును కూడా పోలీసులు అనుమతించకపోవటంతో ఆయన ఆసుపత్రి గేటు బయటనే కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లాడు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదం.. ఆసుపత్రి వద్ద కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద పలు టీవీ న్యూస్ చానల్స్ వీడియోగ్రాఫర్స్ కవరేజీ చేస్తుండగా దూరంగా వెళ్లి కవరేజీ చేయాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎదుట ట్రాఫిక్‌జాం.. కామినేని ఆసుపత్రి ఎదురుగానే జాతీయ రహదారి ఉండడంతో ఆసుపత్రి వద్దకు వచ్చిన ప్రజలు, వారి వాహనాలతో హైవేపై ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు కల్పించుకుని తగిన చర్యలు తీసుకోవడంతో రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. ప్రముఖులు ఆసుపత్రి వద్దకు వచ్చిన సందర్భంలో, హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన సందర్భంలో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. -
అప్పుడు అదే డ్రెస్సు.. ఇప్పుడు అదే డ్రెస్సు
చిట్యాల (నకిరేకల్) : నందమూరి హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రచార రథానికి డ్రైవర్‌గా వ్యవహరించే వారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో పాటుగా హరికృష్ణ కూడా ఖాకీ రంగు డ్రెస్‌ను ధరించేవారు. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణ వివాహానికి వెళ్తున్నప్పటికీ తన తండ్రి స్థాపించిన పార్టీ రంగైన పసుపు రంగు చొక్కాను, ఖాకీ రంగు ప్యాంట్‌నే ధరించి ఉన్నారు. -
రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు
-
మొయినాబాద్‌తో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం
మొయినాబాద్(చేవెళ్ల) వికారాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు మొయినాబాద్ మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న గండిపేట కుటీరం వద్ద నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఆయన తన తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి వచ్చేవారు. హైదరాబాద్ నగరానికి చేరువలో జంటజలాశయాల చెంత పచ్చని వాతావరణంతో ఉండే ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో హరికృష్ణ తన కొడుకు పేరున 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సమయంలో ‘తెలుగు విజయం’ పేరుతో మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే గండిపేట చెరువు సమీపంలో నివాసం ఉండేందుకు శాంతి కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగించేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎన్టీఆర్ కుటీరం కేంద్ర బిందువుగా మారింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులకు కుటీరంలోనే రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. ఆ సమయంలో హరికృష్ణ పార్టీ నాయకులతోపాటు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఏ కార్యక్రమం జరిగినా తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి ఆయన ఇక్కడికి వచ్చేవారని సీనియర్ నాయకులు తెలిపారు. హరికృష్ణ ఎక్కువగా ఎన్టీఆర్ ప్రచార రథాన్ని నడుపుతూ కుటీరానికి వచ్చేవారని అన్నారు. ఎన్టీఆర్ పాఠశాలగా.. కుటీరం ఎన్టీఆర్ మరణం తర్వాత కుటీరం పాఠశాలగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. అయితే, టీడీపీ నిర్వహించే మహానాడును సైతం ఇక్కడే నిర్వహించేవారు. 2009, 2010, 2011, 2013, 2014లో ఎన్టీఆర్ కుటీరంలో నిర్వహించిన మహానాడుల్లో హరికృష్ణ పాల్గొన్నారు. పదిహేనేళ్ల క్రితం భూమి కొనుగోలు.. హరికృష్ణ తన చిన్న కొడుకు కల్యాణ్‌రామ్ పేరు మీద గతంలో మొయినాబాద్ మండలం ముర్తూజగూడ రెవెన్యూలో 4 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో రాళ్లతో ఉన్న భూమిని చదును చేయించారు. అందులో ఎలాంటి నిర్మాణాలుగాని, పంటలు సాగుగాని చేయకుండా బీడుగానే వదిలేశారు. నాలుగేళ్ల క్రితం 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్దకొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు ఇక్కడే నిర్వహించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం చెక్కును కల్యాణ్‌రామ్‌కు అందజేసింది. అయితే, హరికృష్ణ అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. ఇతర కారణాలతో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. హరికృష్ణ మృతితో కుటీరంలో బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు. అనుబంధం మరువలేనిది: పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి చేవెళ్ల : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధకరమని పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆయన మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, సినీ హీరోగా నేను ఎక్కువ అనే గర్వం అనేది ఆయనలో ఎప్పుడు కనిపించేది కాదు అన్నారు. అందరితో కలివిడిగా చాలా సాధారణంగా ఉండేవారన్నారు. తాను దేవునిఎర్రవల్లి సర్పంచ్‌గా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తన గ్రామానికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ నుంచి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కోసం రూ.5లక్షల నిధులను ఇచ్చారన్నారు. టీడీపీలో పనిచేసే సమయంలో చాలా దగ్గర సంబంధం ఉండేదన్నారు. ఇలాంటి నాయకులు ఉండటం చాలా అరుదు అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఆయన మరణం ఆయన కుటుంబానికి, పార్టీకి తీరని లోటన్నారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారు : కంజర్ల శేఖర్ నందమూరి హరికృష్ణ మృతిచెందడం బాధాకారం. ఆయన ఎన్టీఆర్ కుటీరానికి వచ్చినప్పుడల్లా స్థానికులు, నాయకులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు శిక్షణ ఇచ్చేటప్పుడు హరి కృష్ణ సైతం క్రమం తప్పకుండా వచ్చేవారు. హరికృష్ణ అంత్యక్రియల కోసం స్థల పరిశీలన వీఐపీలు, సినీ ప్రముఖుల తాకిడి దృష్ట్యా మార్పిడి మొయినాబాద్ రూరల్(చేవెళ్ల) : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలను మొదటగా తన వ్యవసాయ పొలంలో నిర్వహించాలని భావించడంతో బుధవారం చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగయ్య, టీడీపీ నాయకులు పరిశీలించారు. మొయినాబాద్ మండలంలోని ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న 133 సర్వే నంబర్లో హరికృష్ణకు నాలుగెకరాల పొలం ఉంది. ఆయన ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు. 2014లో హరికృష్ణ కుమారుడు జానకీరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు అతని అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. తాజాగా హరికృష్ణ మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలని కుటుంబీకులు మొదటగా నిర్ణయం తీసుకున్నారు. వీఐపీలు, సినీ ప్రముఖులకు తాకిడి, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించాల్సిన అంత్యక్రియల స్థలాన్ని మార్చినట్లు తెలుస్తోంది. చివరకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవిషయాన్ని అధికారులు సైతం ధృవీకరించారు. -
స్పీడ్ థ్రిల్స్ బట్...!
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్... మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్.. తాజాగా నందమూరి హరికృష్ణ... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరిలో ఎవరికీ వాహనం నడపాల్సిన అవసరం లేదు. అయినా ప్యాషన్ కోసం స్టీరింగ్ పట్టి, మితిమీరిన వేగంతో దూసుకుపోతూ హఠాన్మరణం పాలయ్యారు. కేవలం ఇవే కాదు రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం శాతం అతి వేగం కారణంగానే జరుగుతున్నాయి. అంతర్గత రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో, జాతీయ రహదారులు గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. పరిమిత వేగం పాదచారులకూ రక్షణే... ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతున్నది పాదచారులే. ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్స్ సహా ఎలాంటి సౌకర్యాలు అవసరమైన స్థాయిలో ఉండవు. ఫలితంగా రోడ్డు దాటుతున్న, రహదారులపై నడుస్తున్న బాటసారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వాహన వేగం 5 శాతం తగ్గినప్పుడు ప్రమాదాలబారిపడే ఆస్కారం 30 శాతం తగ్గుతుందని స్పష్టం చేసింది. గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించే వాహనం ఓ పాదచారుడిని ఢీ కొట్టినా... అతడికి మరణం సంభవించే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉంటుంది. వాహన వేగం గంటకు 80 కిమీ మించితే ఎదుటి వ్యక్తికి మరణం సంభవించే అవకాశం 60 శాతం పెరిగినట్లేనని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. రెస్పాన్స్ కావడానికి కొంత సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగానే ముందు వస్తున్న ప్రమాదాలను గమనిస్తూనే ఉంటాడు. ఎదుటి వాహనం, గుంత... ఇలాంటి ఏవైనా ముప్పులు కనిపించినప్పుడు వెంటనే స్పందించి బ్రేక్ వేయడానికో, పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇలా ముప్పును గుర్తించిన తర్వాత, బ్రేక్ వేయడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీనినే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమిది. ఈ మధ్య కాలంలో వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత దూరంలోనే ముప్పును గుర్తించి, అవసరమైన ముందే బ్రేక్ వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
అంతిమయాత్ర కోసం చైతన్యరథం..?
నందమూరి హరికృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పదం ‘చైతన్యరథం’.. దీనికి, హరికృష్ణకి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘చైతన్యరథం’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ‘చైతన్యరథం’పైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. అయితే ఆ చైతన్యరథానికి రథసారథి హరికృష్ణ. తండ్రి కోసం ‘సీతయ్య’ డ్రైవర్‌గా మారారు. తన తండ్రి రాజకీయ జీవితానికి అండగా నిలబడ్డారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఎవరు మాట్లాడినా హరికృష్ణ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. డ్రైవింగ్‌లో నిష్ణాతుడైనా హరికృష్ణ.. తండ్రిని అసెంబ్లీకి చేర్చిన హరికృష్ణ.. చివరికి ఆ డ్రైవింగ్ వల్లే దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హరికృష్ణ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంతిమయాత్రని ‘చైతన్యరథం’పై నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం చైతన్యరథం అందుబాటులో లేనట్లు సమాచారం. రామకృష్ణా స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని కొంతకాలం క్రితమే ఆర్ట్ డిపార్ట్మెంట్కు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా చైతన్య రథాన్ని వాడాలని భావించినట్లు సమాచారం. కానీ అందుబాటులో లేకపోవడంతో మరో వాహనాన్ని డిజైన్ చేసినట్లు సమాచరం. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరి కాసేపు ఎదురుచూడాల్సి ఉంది. -
మృత్యు వేగం !
-
నెత్తురోడుతున్న రహదారులు
రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ మానవ తప్పిదాల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్‌లో ఎంతటి నిపుణులైనా నిబంధనలు పాటించకుంటే ప్రమాదాలు తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఇటువంటిదే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవింగ్ సీటులో ఉన్న హరికృష్ణ సీటు బెల్టు ధరించకపోవడం, అత్యంత వేగంగా వాహనం నడపడం అని నల్గొండ పోలీసులు చెబుతున్నారు. ఇక మన జిల్లాకు వస్తే రహదారి ప్రమాదాల కారణంగా అధికారుల గణాంకాల ప్రకారం ఏటా రెండు వేలకు పైగా మృత్యువాత పడుతున్నారు. మరో 700 మంది వరకూ క్షతగాత్రులవుతున్నారు. లెక్కల్లోని రాని ప్రమాదాల్లో మరో వెయ్యిమంది వరకూ గాయాలు పాలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసులు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు. నిపుణుల సూచనలు తెలుసుకుందాం. నిడమర్రు: వాహనచోదకుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. రోడ్డు సేప్టీ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా.. ► కార్లు, జీపులు, బస్సులు, లారీలు నడిపే సమయంలో ముఖ్యంగా కాళ్ల సమీపంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి, బ్రేక్ కిందకు వచ్చినప్పుడు వాటిని నొక్కినా బ్రేక్ పట్టక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ► వాహనం నడిపేటప్పుడు క్లచ్, బ్రేకు ఎక్స్‌లేటర్ విషయంలో కచ్చితమైన అవగాహన అవసరం. కొత్తగా కొన్న వాహనాన్ని ► కారు పార్కింగ్ చేసేటప్పుడు సెంట్రల్ బ్రేకు వేస్తుంటాం, అయితే కారు వేగంగా వెళ్తున్నప్పుడు అదే సెంట్రల్ బ్రేకు ప్రమాదానికి కారణమవ్వవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలుంటే దాన్ని పట్టుకొని లాగితే ప్రమాదం. అలా లాగితే నాలుగు చక్రాలకు బ్రేకులు పడతాయి. ► టైర్లలో గాలి తక్కువగా ఉంటే వెంటనే గాలి నింపుకోవాలి. లేకుంటే వేగంగా వెళ్తుండగా మొత్తం గాలిపోతే కారు నెమ్మదిగా వెళ్లడంతో పాటు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అదీగాక పంక్చర్ పడితే వాహనాన్ని నియంత్రించడం కష్టం. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో జాగ్రత్తలు ఇలా.. ప్రమాదాల శాతం ఎక్కువగా పొగమంచు రోజుల్లోనూ, వర్షాకాలంలో జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వర్షంలో తడిసిన / నీటితో నిండిన రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాన్ని స్లో చెయ్యటం క్లిష్టం, అలాంటి సందర్భాల్లో మితిమీరిన వేగం వద్దు. ప్రత్యేకించి కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తతో డ్రైవ్ చెయ్యాలి. వైఫర్స్ సరి చేసుకోవాలి. పగటి పూట హెడ్‌లైట్స్ వేయాలి. వాహనాల మధ్య దూరం ఎక్కువ ఉండాలి. ద్విచక్ర వాహనాల విషయంలో.. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పలుమార్లు జరిమానా కడుతున్నా హెల్మెట్ ధరించడం లేదని జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు చెప్పారు. జిల్లాలో డీటీ ఆర్బీ అనే ప్రత్యేక వింగ్ జిల్లాలో రహదారిపై జరిగే ప్రమాదాల నివారణకు డీటీఆర్బీ(డిస్ట్రిక్ ట్రాఫిక్ రికార్డ్ బ్రాంచ్) అనే ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. ఈ వింగ్ జిల్లా పోలీసులు, ఆర్టీవో అ«ధికారులకు నోడల్ ఏజెన్సీగా సహకరిస్తుంది. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికి కారణాలు, తర్వాత తీసుకోవల్సిన చర్యలు, ప్రమాదానికి సంబంధించిన డేటా సేకరించి అనుబంధ శాఖలకు అందిస్తారు. హైవేలపై డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు సిద్ధాంతం నుంచి ఏలూరు వరకూ 23 పెట్రోలింగ్ వాహనాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తెలిపారు. హరికృష్ణ మృతికి ఇదే కారణమా..! సీటు బెల్టు పెట్టుకోని కారణంగా కార్లకు ఉండే సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాపిడికి ముందుగా తెరుచుకునేవి కారు తలుపులే. అలాంటి సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అనేక మంది ప్రమాదాల్లో వాహనంలోంచి విసిరేసినట్లు పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. హరికృష్ణ మృతి విషయంలో ఇదే జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే కారు తిరగబడుతున్న సమయంలో సీట్ బెల్టు పెట్టుకోకపోవడంతో హరికృష్ణ వాహనంలోచి బయటకు విసిరి వేయబడి తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. నాలుగు ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీర వేగం వల్లే సంభవిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు జిల్లాలో కొవ్వూరు, తణుకు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల వెంబడి స్పీడ్ లేజర్‌గన్స్ ఏర్పాటు చేశాం. రహదారి వెంబడి ఉంచిన స్పీడ్ లిమిట్ సూచీల్లో ఉన్న వేగంకంటే అధిక వేగంతో వాహనాలు నడిపిన వారికి ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తున్నాం. ఈ చలానాలో వాహనం ఫొటో, ఏ సమయంలో, ఎంత వేగంతో వెళ్లింది ఉంటుంది, దీంతో వారు వేగం లిమిట్ దాటకుండా నియంత్రిస్తున్నాం. –పి.భాస్కరరావు, డీఎస్పీ, ట్రాఫిక్ హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్ పెట్రోలింగ్ వాహనాల్లో సిబ్బంది హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన 5 నుంచి 10 నిమిషాల్లో స్పాట్‌కు చేరి క్షతగాత్రులను హాస్పటల్‌కు తరలించేలా పెట్రోలింగ్ సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోడ్డు మార్జిన్లో వాహనాలు నిలిపినా, అపసవ్య దిశలో వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. రోడ్డు ప్రమాదాలకు కారణాలు సేకరించి. అవసరమైన సూచనలు అందించేందుకు కృషి చేస్తున్నాం. –చావా సురేష్ ఎస్సై, డీటీ ఆర్బీ స్వీయ నియంత్రణ అవసరం వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ విషయంలో స్వీయ నియంత్రణ ఉంటే ప్రమాదాలు జరగవు. రహదారుల అధ్వానంగా ఉండటం, హైవేలపై రోడ్డు నిర్వహణ సక్రమంగా చెయ్యకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో జరిగిన ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నట్టు రోడ్డు ప్రమాద కేసుల ద్వారా తెలుస్తోంది. –మోపాటి బాల పరమేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, భీమవరం -
పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు
పాలకొల్లు అర్బన్: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ బుధవా రం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో జిల్లావాసులు, సినీ అభిమానులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ది గ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగుల నిమిత్తం హరికృష్ణ పలుమార్లు జిల్లాకు విచ్చేశారు. సీతయ్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆత్రేయపురం లాకుల వద్ద చిత్రీకరించారు. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ సినిమా షూటింగ్‌ను రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు జూనియర్ ఆర్టిస్ట్ సరఫరా కాంట్రాక్టర్ కె.అన్నపూర్ణ తెలిపారు. ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి షూటింగ్‌లకు వినియోగించే వ్యాన్‌ను చైతన్య రథంగా మార్చి రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో ఆ వాహనానికి డ్రైవర్‌గా నందమూరి హరికృష్ణ తొలిసారి పాలకొల్లు విచ్చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి ఆకివీడు, ఉండి, భీమవరం మీదుగా పాలకొల్లు వచ్చినట్టు అభిమానులు చెబుతున్నారు. అప్పుడు సామాన్య కార్యకర్తగా హరికృష్ణ గ్రౌండ్లో నిలబడి తండ్రి రామారావు ప్రసంగాన్ని ఆలకించారని ఆనాటి సీనియర్ టీడీపీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పాలకొల్లు కెనాల్ రోడ్డు మీదుగా మార్టేరు వెళుతుండగా చైతన్యరథాన్ని నడుపుతున్న హరికృష్ణను చూసినట్టు పట్టణానికి చెందిన రామా స్టూడియో నాయుడు తెలిపారు. తాను అప్పుడు ఆర్ఎంసీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నానన్నారు. ఎర్రవంతెన వద్ద చైతన్యరథం ఆపి కొబ్బరి జట్టు కార్మికులతో ఎన్టీఆర్ ముచ్చటించారని చెప్పారు. మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి పోడూరు మండలం వేడంగిపాలెం సర్పంచ్‌గా పనిచేస్తున్న తాను టీడీపీలో చేరినట్టు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. ఆ సమయంలో తొలిసారిగా హరికృష్ణను చూశానన్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలోనూ అన్న ఎన్టీఆర్ చైతన్యరథానికి హరికృష్ణ సారథిగా ఉండి రెండోసారి పాలకొల్లు వచ్చారు. లాహరి.. లాహిరి.. లాహిరిలో.. చిత్ర విజయోత్సవాలు పాలకొల్లు మారుతి థియేటర్లో నిర్వహించారని, ఆ వేడుకలకు హరికృష్ణ హాజరయ్యారని పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ సిలార్ చెప్పారు. స్ఫూర్తిప్రదాత.. హరికృష్ణ పాలకొల్లు సెంట్రల్: రథసారథిగా రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్‌ను సీఎం పీఠం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అనంతరం జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల్లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో రథయాత్రను కొనసాగించారు. ఆ రథయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇం టి వెంకటరెడ్డి అనే వ్యక్తి హరికృష్ణ యాత్రలో వె న్నంటి ఉండి విజయవంతం చేసినట్టు చెప్పారు. రథయాత్రను నరసాపురం నుంచి ఏనుగువానిలంక, యలమంచిలి, మేడపాడు ప్రాంతాల్లో తిరిగి అనంతరం పాలకొల్లు గాంధీబొమ్మల సెం టర్లో జరిగిన సభలో హరికృష్ణ మాట్లాడారు. మార్టేరు, పెనుమంట్ర మీదుగా వీరవాసరం వర కూ హరికృష్ణ యాత్ర కొనసాగింది. అన్న టీడీపీలో తనను జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అప్పట్లో హరికృష్ణ ప్రకటించినట్టు వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయనతో అనుబంధం స్ఫూర్తినిచ్చిందని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. 1996లో కురెళ్లగూడెంలో.. భీమడోలు: భీమడోలు మండలం కురెళ్లగూడెంలో 1996లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు. అప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం వైఎస్సార్ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. నాటి స్మృతులను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. పసలతో సాన్నిహిత్యం తాడేపల్లిగూడెం: హరికృష్ణకు టీడీపీ సీనియర్ నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లో ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు ఎన్టీఆర్‌కు విధేయుడిగా, హరికృష్ణకు సన్నిహితుడిగా మెలిగారు. 1995లో హరికృష్ణ టీడీపీ మంత్రి వర్గంలో మం త్రిగా ఉన్న సమయంలో పసల ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరికృష్ణతో కలిసి రాష్ట్రమంతా తాను పర్యటించానని, హరికృష్ణ మరణం తీరనిలోటని పసల కనకసుందరరావు అన్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు లండన్ నుంచి సంతా పం తెలిపారు. హరికృష్ణతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. -
అభిమాన సీతయ్య
ఈ వేలు మా నాన్నలో పవర్.. ఈ వేలు నాలోని పొగరు.. రండి రా.. రండి... నువ్వు చంపితే అన్ లీగల్.. నేను చంపితే లీగల్..’’ ‘‘అరవకు.. అరచి నీ ఆధిక్యాన్ని ప్రదర్శించకు’’ అంటూ పవర్ఫుల్ డైలాగులతో అదరగొట్టాలన్నా.. బస్కెక్కి వస్తాను.. బండెక్కి వస్తాను.. కారెక్కి వస్తాను.. లారెక్కి వస్తాను.. రాముడై వస్తాను.. భీముడై వస్తాను.. కాముడై వస్తాను.. కృష్ణుడై వస్తానూ.. అంటూ స్టెప్పులతో అభిమానులను ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో.. ఎక్కడికో తీసుకు వెళ్లడం ఆయనకే దక్కింది. ‘సీతయ్య’.. ఎవ్వరి మాటా వినడు.. అవును! నిజమే ఆయన ముక్కుసూటి మనిషి. అందుకే ఎవ్వరి మాటా వినేవారు కాదు. మనసులో ఏదనుకుంటే అదే. ఏ విషయంలోనూ నో కాంప్రమైజ్. అందుకే ఆయనంటే ఆ తారకరామారావుకు అమితమైన ఇష్టం. ఆయన చైతన్యరథానికి హరికృష్ణనే సారధిగా చేశారు. నందమూరి అభిమానులకు ఆయన ‘టైగర్’ హరిశ్చంద్ర ప్రసాదే.. తాతమ్మ కలతో సినీ కళారంగంలోకి అడుగుపెట్టిన ఆయన శ్రీరాములయ్యగా అందరి మన్ననలు పొందారు. దానవీరశూరకర్ణలోనూ నటించి.. సీతారామరాజు, శివరామరాజులతో జతకట్టి.. స్వామిగా శ్రావణమాసంలోనూ అలరించారు. సినీ ప్రముఖుడిగా, రాజకీయ వేత్తగా పేరొందిన నందమూరి హరికృష్ణతో జిల్లావాసులతో ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆయన తనయుడు జానకీరామ్‌కు కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకర చౌదరి కుమార్తెతో వివాహం జరిపించారు. హరికృష్ణ కుమార్తెను సైతం కాకినాడే ఇచ్చారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు జిల్లాలోనే చిత్రీకరించారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారన్న వార్తను జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. వేళంగిలో విషాదఛాయలు కరప: మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తనయుడు, మాజీ మంత్రి, సినీనటుడు నందమూరి హరికృష్ణ అకాల మరణంతో కరప మండలం వేళంగిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి వేళంగి గ్రామానికి అనుబంధం ఉంది. హరికృష్ణ తనయుడు జానకిరామ్ వేళంగి గ్రామానికి చెందిన యార్లగడ్డ ప్రభాకరచౌదరి కుమార్తె ప్రభాదీపికను వివాహమాడారు. ఈ వివాహం కాకినాడలోని టీటీడీ కళ్యాణమండపంలో జరిగింది. అప్పటి నుంచి హరికృష్ణ కుటుంబ సభ్యులు వేళంగి వస్తూ, పోతూ ఉండేవారు. 2014లో డిసెంబర్లో జానకిరాం జిల్లాకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభాదీపిక, ఆమె ఇద్దరు కుమారులు తారక రామారావు, సౌమిత్ర ప్రభాకర్‌లు హరికృష్ణ కుటుంబం వద్దే ఉంటున్నారు. కాగా 2016లో డిసెంబర్ 24వ తేదీన మాజీ మంత్రి హరికృష్ణ, ఆయన సతీమణి, కుమారులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు వేళంగిలో నిర్వహించిన హరికృష్ణ మనుమల పంచెకట్టు కార్యక్రమంలో పాల్గొని వేళంగిలోనే గడిపారు. హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న బంధువులు అందరూ బుధవారం వేళంగి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హరికృష్ణ గ్రామానికి వచ్చి కలుసుకున్న సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమకూ వచ్చేవారు.. మామిడికుదురు: హరికృష్ణకు కోనసీమతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన ఇంటిలో ఏ శుభ కార్యక్రమమైనా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించేవారు. 2012లో జూనియర్ ఎన్టీఆర్ వివాహం కూడా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. హరికృష్ణ రెండు పర్యాయాలు కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. 2013లో ఇక్కడికి వచ్చిన సందర్భంలో రోడ్ల అధ్వాన పరిస్థితి గమనించి మొగలికుదురులో సిమెంట్‌రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.ఆరులక్షలు కేటాయించారు. 2013లో కోటేశ్వరరావు ఇంటికి వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : కోటేశ్వరరావు ‘‘హరికృష్ణ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాతోపాటు మా కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా మాట్లాడేవారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు కేన్సర్ రోగులను ఆయన సహకారంతోనే హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాం. ఆయన మరణం మాకు తీరనిలోటు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాను’’ అని కోటేశ్వరరావు ‘సాక్షి’కి వివరించారు. మండలానికి నిధులు.. కడియం: కడియం ప్రాంతంలో మాజీ మంత్రి నందమూరి హరికృష్ణకు అనుబంధముందని స్థానిక అభిమానులు, నాయకులు గుర్తు చేసుకున్నారు. మండలంలోని మురమండ గ్రాంలోని ఎస్సీపేట కమ్యూనిటీహాలుకు రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి రూ.ఎనిమిది లక్షలు కేటాయించారని టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి రామారావు తెలిపారు. అలాగే ఏఎంజీనగర్లోని కమ్యూనిటీహాలుకు ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా రూ.రెండున్నరలక్షల నిధులు మంజూరు చేశారని వివరించారు. 2010లో గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హరికృష్ణ వచ్చినప్పుడు పది ఎండ్లబళ్లను ఏర్పాటు చేసి, వాటిపై గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. చందన రమేష్ రూరల్ ఎమ్మెల్యేగా ఉండగా ఆ కార్యక్రమంలో ప్రస్తుత హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు తదితరులు కూడా పాల్గొన్నారని ప్రత్తిపాటి వివరించారు. అలాగే హరికృష్ణ రవాణా శాఖామంత్రిగా ఉన్న సమయంలో కడియం మండలం వెంకాయమ్మపేట వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలు ఇరవై మంది వరకు మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి హరికృష్ణ చేరుకున్నారన్నారు. మృతులకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు, ఆర్టీసీ ద్వారా వారికి అందాల్సిన నష్టపరిహారం వేగంగా వచ్చేలా ఆయన చొరవతీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కడియం ప్రాంత నర్సరీ రైతులతో ఆయనకు పరిచయాలున్నాయని, పలు మార్లు ఆయన నర్సరీలను సందర్శించారని అభిమానులు తెలిపారు. గోదావరి జిల్లాతో హరికృష్ణ అనుబంధం రాజమహేంద్రవరం కల్చరల్: కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంతో హరికృష్ణకు అనుబంధం ఉంది. నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థా«పించినప్పుడు, ఆయన చైతన్యరథానికి సారధి హరికృష్ణ. 1982 జులై మూడో తేదీన ఎన్టీఆర్ కాకినాడకు వచ్చినప్పుడు ఆనందభారతి గ్రౌండ్స్‌లో బహిరంగసభ జరిగింది. ఆ సమయంలో హరికృష్ణ చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. హరికృష్ణ నటించిన సీతారామరాజు షూటింగ్ నగరంలో జరిగింది. లాహిరి లాహిరి.. లాహిరిలో, సీతయ్య సినిమాలు కూడా ఈ జిల్లాలోనే షూటింగ్ జరుపుకున్నాయి. ఎంతో హుందాగా ఉండేవారు. ‘‘నందమూరి హరికృష్ణ అకాలమరణం బాధాకరం. ఆయనతోపాటు‘ సీతయ్య’ సినిమాలో నటించాను. హరికృష్ణ ప్రవర్తన ఎంతో హుందాగా ఉండేది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అని జిల్లా సినీ జూనియర్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు, ‘మా’ కార్యవర్గసభ్యుడు, నటుడు, గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా తెలిపారు. నేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతం : హరికృష్ణ పిఠాపురం, కొత్తపల్లి: అచ్చుగుద్దినట్టు వివిధ కళారూపాలను నేత ద్వారా నేస్తున్న ఉప్పాడ చేనేత కార్మికుల కళానైపుణ్యం అద్భుతమని ప్రముఖ సినీనటుడు హరికృష్ణ ప్రశంసించారు. ఆయన గత జనవరిలో కొత్తపల్లికి చెందిన చోడిశెట్టి చినబాబు ఉప్పాడలో ఏర్పాటు చేసిన భువనశ్రీ జాంధానీ చీరల విక్రయ కేంద్రం ప్రారంభం సందర్భంగా అక్కడికి వచ్చారు. తన కుమార్తె సుహాసినీని కాకినాడకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. సుహాసిని కుమారుడు హర్ష, చినబాబు కుమారుడు వినయ్ స్నేహితులు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హరికృష్ణ విచ్చేసి అభిమానులతో సందడిచేశారు. తన కుమారుడు జూనియర్ ఎన్టీర్ వివాహానికి తన కోడలికి ఇవ్వడానికి జాంధానీ చీరలనే కొనుగోలు చేసినట్టు ఆయన అప్పట్లో చెప్పారు. నందరాడలో ‘సీతారామరాజు’ చిత్రీకరణ రాజానగరం: నాగార్జునతో కలిసి హరికృష్ణ నటించిన సీతారామరాజు సినిమా గ్రామీణ నేపథ్యంలోనిది కావడంతో షూటింగ్ ఎక్కువగా నందరాడ, దోసకాయలపల్లిలో జరిగింది. 1998లో ఈసినిమా షూటింగ్ చూసేందుకు వచ్చే అభిమానులను ఇద్దరు హీరోలు ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవారు. హరికృష్ణ మాత్రం ఏదో ఒక వరుస పెట్టి పలకరించడం ఈ ప్రాంతవాసులను కట్టి పడేసింది. నందరాడలోని రైస్ మిల్లు, పంట పొలాల్లో తీసిన సన్నివేశాల్లో స్థానికులు కూడా నటించడంతో హరికృష్ణ జ్ఞాపకాలను వారు నెమరువేసుకుంటున్నారు. విజయయాత్రలో భాగంగా కాకినాడకు.. కాకినాడ కల్చరల్: సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణంపై కాకినాడ ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 2002లో విడుదలైన లహిరి లాహిరి లాహిరిలో చిత్రం విజయ యాత్రలో భాగంగా స్ధానిక చాణుక్య థియేటర్‌కు హరికృష్ణ విచ్చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలరించారని శ్రీలక్ష్మీ థియేటర్ మేనేజింగ్ పార్టనర్ పి.శ్రీనివాస్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. చిత్ర విజయవతం చేసిన ప్రేక్షకులకు,అభిమానులను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని ఆయన అన్నారు. చిత్ర బృందానికి హెలికాన్ టైమ్స్(నాగమల్లితోట జంక్షన్)లో వసతి ఏర్పాటు చేసామని తెలిపారు. అంతేకాకుండా హరికృష్ణ స్వయంగా చిత్ర బృందం ప్రయాణించే వాల్వో బస్‌ను డ్రైవ్ చేసి హెలికాన్ టైమ్స్‌కు చిత్రబృందాన్ని తీసుకెళ్లారని ఆయన తెలిపారు. హరికృష్ణతో గడిపిన కొద్దిపాటి సమయం కూడా తన జీవితంలో మరిచిపోలేనిదని పి.శ్రీనివాస్ తనకు హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’కి తెలిపారు. చిత్ర బృందంలో చిత్రం íహీరో ఆదిత్య ఓం, హీరోయిన్ సంఘవి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. హరికృష్ణ అకస్మిక మరణాన్ని నగరంలో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణం తీరలని లోటని వాపోతున్నారు. -
టైగర్
-
అప్డేట్స్: హరన్నా.. ఇక సెలవు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతకుముందు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఇవి.. సాయంత్రం 4.20 గంటలు: మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3.25 గంటలు: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. దాదాపు గంటన్నరపాటు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటలు: మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమై హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యుల, అభిమానుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలు : నటుడు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసానికి వెళ్లిన పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉదయం 11.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో.. ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. హరికృష్ణ ఇంటికి వెళ్ళే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు. అభిమానులు అంత్యక్రియలు జరిగే జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటలు: హరికృష్ణ భౌతికకాయానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, సినీ నటుడు కోట శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన తనను చాలా అభిమానించేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడుగా ఉండేవారని పేర్కొన్నారు. కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..హరికృష్ణతో నా అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..హరికృష్ణ, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రలో, సత్తుపల్లిలో జరిగిన సమావేశాల్లో హరికృష్ణని కలిశానని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు. ఉదయం 9 గంటలు: హరికృష్ణ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు.. ఈ సందర్భంగా హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు. హరికృష్ణ పార్థివదేహానికి ఎంపీ కవిత, నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, అశ్వనీదత్ నివాళులర్పించారు. ఉదయం 8.30.. పలు చోట్ల నిదానంగా కదులుతున్న వాహనాలు పలు ప్రాంతాల్లో ట్రాఫ్‌క్ జామ్ ఏర్పడింది. లకిడికపూల్ ఫ్లైఓవర్, మహవీర్ ఆస్పత్రి, మాసబ్ ట్యాంక్ టవర్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి వైఎంసీఏ ఫ్లైఓవర్, ఎస్బీహెచ్ క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్ ప్రాంతల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్‌ఘట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతోంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనున్న అంతిమయాత్ర. సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నందమూరి ఫ్యామిలీని వెంటాడిన రోడ్డు ప్రమాదాలు
-
హరికృష్ణ మరణం టీడీపీకి తీరనిలోటు
అవనిగడ్డ : మాజీ రాజ్యసభ సభ్యులు, సినీనటుడు నందమూరి హరికష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దివిసీమ పర్యటనకు వచ్చిన ఆయన తన వియ్యంకుడు మాదివాడ విష్ణుమూర్తి స్వగృహంలో హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను టీవీలో చూశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ హరికష్ణ తనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు. ఎన్టీ రామారావు టీడీపీ స్ధాపించిన తరువాత ఛైతన్యరధంకు హరికృష్ణ సారధిగా వ్యవహరించారని అన్నారు. అప్పటి నుంచే తాను ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. పాలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న సమయంలో ఆయన కూడా సభ్యునిగా ఉన్నారని ఎప్పుడు కనబడినా ఎంతో ఆప్యాయతగా పలుకరించేవారని తెలిపారు. ఎన్టీఆర్ ఛైతన్య రధంకు సారధ్యం వహించి రాష్ట్ర మంతా తిప్పిన ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తను తీవ్రంగా కలచి వేసిందన్నారు. సర్పశాంతి హోమంపై ఆరా.... దివిసీమలో పాముకాట్లు పెరిగిన నేపధ్యంలో మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం సర్పశాంతి హోమం చేశారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హోమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాముకాట్లు, తీసుకుంటున్న చర్యలు, సర్పశాంతి హోమం గురించిన విషయాలను హోమంత్రి బుద్ధప్రసాద్‌ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి ఛైర్మన్ మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, డిఎస్పీ వి పోతురాజు, న్యాయవాది మాదివాడ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. -
నిమ్మకూరు కంట కన్నీరు
ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో స్వగ్రామమైన నిమ్మకూరు లో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుటుంబసభ్యుడ్ని కోల్పోయినట్లు గ్రామస్తులు రోదించారు. బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. జ్ఞాపకాలు తలచుకుంటూ విచారం వ్యక్తం చేశారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు బుధవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాక్షి,విజయవాడ/ పామర్రు : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఆయన స్వస్థలం నిమ్మకూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు విలపించారు. ఆయన పుట్టిన నిమ్మకూరులోనే అంత్యక్రియలు జరిగితే బాగుంటుదని పలువురు భావించినా, అది అసాధ్యమని మౌనంగా ఉండిపోయారు. హరికృష్ణ గురించి ఆయన సన్నిహితులు, గ్రామస్తులు అభిప్రాయాలు వారి మాటల్లోనే.... వరదయ్య కొట్టే అడ్డా..... హరికృష్ణకు చిన్నప్పుడు ఒక స్నేహితుల బృందం ఉండేదట. పాఠశాల సమీపంలో వరదయ్య కొట్టే వారకి అడ్డా. స్నేహితులతో కలిసి అక్కడ కూర్చుని చిరుతిళ్లు తిన్నేవారు. స్నేహితులకు చిరుతిళ్లు అన్ని హరికృష్ణ ఖాతాలోనే. డబ్బులు లేకపోతే వరదయ్య కోట్లోనే అప్పు చేసేవాడు. తరువాత నానామ్మ వెంకట రావమ్మ వద్ద దాచుకున్న డబ్బులు తెచ్చి అప్పు తీర్చేవాడని వరదయ్య సాక్షికి వివరించారు. తరువాత కాలంలో వరదయ్యకు అనారోగ్యం వస్తే హరికృష్ణ ఆయన్ను నిమ్స్ పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. నిమ్మకూరులో హరికృష్ణకు సన్మానం చేసినప్పుడు వరదయ్య షాపు వద్ద తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మామగారి పేరుతో బస్ షెల్టర్.... హరికృష్ణ మామగారు సోమశేఖరరావు చనిపోయిన తరువాత ఆయన జ్ఞాపకార్థం నిమ్మకూరులో బస్‌షెల్టర్ నిర్మించారు. దీనికి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కూడా వచ్చి అందర్ని పేరు పేరునా పలకరించారని కుదరవల్లి సతీష్ బాబు తెలిపారు. మంచి చతురుడు.. ఆయన అందరితోనూ ఎంతో సన్నిహితంగా, చతురతతో ఉండేవారని, మహిళల్ని అక్కా,అమ్మా అంటూ సంబోధించేవారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే పద్మ తెలిపింది. లక్మయ్య, ఎన్టీఆర్, హరికృష్ణ ఆమెకు సుపరిచితులే. రజక వృతి చేసుకుని జీవించే తనను హరికృష్ణ ఆర్థ్ధికంగా ఆదుకున్నారని పద్మ ‘సాక్షి’ కి తెలిపారు. కొడాలి నాని అంటే ఎంతో అభిమానం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అంటే హరికృష్ణకు ఎంతో అభిమానం. అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు నాని వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు స్థాపించడంలో కొడాలి నాని ఎంతో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణకు గ్రామస్తులు సన్మానం చేసినపుడు నాని స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని హరికృష్ణను సత్కరించారు. తరువాత నానికి గుడివాడ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిచడంలోనూ హరికృష్ణ ఎంతో ఆసక్తి చూపించారని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువులో ఈత... తాతతో కలిసి వ్యవసాయం నిమ్మకూరు చెరువులో స్నేహితులతో కలిసి ఈత కొట్టేవారు. తాతయ్య సాగు చేసే పొలానికి స్నేహితులతో కలిసి వెళ్లేవారు. తండ్రి ఎన్టీఆర్, తాతయ్య లక్ష్మయ్య లాగానే వ్యవసాయం అన్నా సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. అందువల్లనే నిమ్మకూరులో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ ఆయనకు ఆ గ్రామంలో పంటభూములు ఉన్నాయి. ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఈ గ్రామంలో పొలాలు కొనిపించటం విశేషం. గ్రామంలో అందరితోనూ సన్నిహితంగా.. హరికృష్ణ గ్రామంలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రాజ్యసభ సభ్యుడుగా స్వగ్రామనికి వచ్చినప్పుడు కూడా కారు గానీ, గన్‌మెన్ గానీ ఉండేవి కాదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. నడుచుకుంటూనే గ్రామమంతా తిరిగే వారు. పేరు పెట్టి కాకుండా బాబాయి, అన్నాయ్, తమ్ముడు, మామయ్య, అమ్మ, అక్కా అంటూ బంధుత్వాలను కలుపుకుని పిలిచేవారని ఏ మాత్రం బేషజం లేకుండా అందరితో కలిసి కూర్చుని మాట్లాడేవారని గ్రామస్తులు చెబుతున్నారు. నిమ్మకూరులోనే ఓటు.. హరికృష్ణ జీవితకాలమంతా నిమ్మకూరునే శ్వాస, ధ్యాసగా భావించారు. నిమ్మకూరులో పుట్టడమే కాకుండా అక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత నిమ్మకూరుకు తన ఓటును మార్చుకున్నారని ఆయన స్నేహితులు గుర్తు చేసుకున్నారు. నిమ్మకూరు అభివృద్ధిలో కీలకపాత్ర.... అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.25 లక్షలు, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.05 కోట్లు, ఏపీఆర్జేసీ గురుకుల పాఠశాలకు రూ.40 లక్షలు, సోలార్ విద్యుదీపాలకు రూ.1 కోటి రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా నిభానుపూడి వెళ్లే రోడ్డు, అవురుపూడి వెళ్లే రోడ్లకు కూడా నిధులు కేటాయించారని ఆయా గ్రామాల ప్రజలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. గరికపర్రుతో ప్రత్యేక అనుబంధం తోట్లవల్లూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైతన్యరధ సారథి, సినీనటుడు దివంగత నందమూరి హరికృష్ణ మృతితో మండలంలోని గరికపర్రులో విషాదచాయలు అలముకున్నాయి. తోడల్లుడి స్వగ్రామమైన గరికపర్రుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణా జిల్లాకు ఎప్పుడు వచ్చినా హరికృష్ణ గరికపర్రులోని ఆయన తోడల్లుడు సూరపనేని హనుమంతరావు నివాసంలోనే ఎక్కువగా గడిపేవారు. నాలుగైదు రోజులు ఉండి బంధువులతో ఆత్మీయంగా గడిపి హైదరాబాద్ వెళ్లేవారు. హరికృష్ణ రాక విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పార్టీ నాయకులు అధికసంఖ్యలో వచ్చి కలుసుకునే వారు. గరికపర్రు అభివృద్దికి హరికృష్ణ ఎనలేని కృషి చేశారు. ఆయన రవాణా మంత్రిగా పని చేసినప్పుడు ప్రత్యేకంగా గ్రామానికి బస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలకుపైగా మంజూరు చేయించి సిమెంటు రహదారులు, వంతెనలు నిర్మింపజేశారు. రూపాయి పాతి డబ్బుల చెట్టుకోసం.. రూపాయి బిళ్ల భూమిలో పాతితే డబ్బులు చెట్టు వస్తుందని అతని మిత్రుడు గాంధీ చెప్పడంతో నమ్మిన హరికృష్ణ తన ఇంట్లో రూపాయి బిళ్ల పాతి రోజు నీళ్లు పోసేవాడు. అయితే వారం తరువాత కూడా డబ్బులు చెట్లు రాకపోవడంతో స్నేహితులందరికి చెప్పడంతో అంతా సరదాగా నవ్వుకునేవారంట! అని ఆయన స్నేహితుడు కుదరవల్లి రఘురామయ్య సాక్షికి తెలిపారు. –రఘురామయ్య ఇద్దరం ఒకే చోట ఉండేవాళ్లం నేను హరికృష్ణ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. అయితే లక్మయ్య తాత ఇంట్లో, లేదా మా ఇంట్లో ఉండేవాళ్లం. పెళ్లయ్యే వరకు మద్రాసు వెళ్లినా కలిసి వెళ్లేవారం. కలిసి వచ్చేవాళ్లం. చిన్నప్పుడు వాళ్ల ఇంటి నుంచి సవారీ (పరిగెత్తు) చేసూ కొస్తున్నాం. ఇద్దరం కలిసే పొలానికి వెళ్లేవారం. మోటర్ సైకిల్ ఎక్కితే ఎదురుగా ఎవరు వచ్చినా చూసేవాడు కాదు. ఇద్దరం కలిసి పోటీ పెట్టుకుని పరిగుపెడుతుంటే ఎదురుగా వచ్చిన ఒక రైతు చేతిలో ఉన్న పలుగు ఇద్దరికి రెండువైపుల తగిలి ఇద్దరం ఒకేసారి కిందపడిపోయాం. –యలవర్తి శరత్‌బాబు -
నందమూరి కుటుంబంలో మరో విషాదం
-
ఆటగదరా శివ!
హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం ‘జన’దిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి! ప్రతి వాహనమూ పరామర్శకు బయల్దేరినట్లే కదల్లేక కదిలింది. హరికృష్ణ ఆకస్మిక శివైక్యం.. ‘ఆటగదరా శివ’ అనే వైరాగ్య భావనలోకి ఆయన అభిమానుల్ని నెట్టివేసింది! ‘‘ఈ ఏడాది నా జన్మదిన వేడుకలు వద్దు. కేరళలో వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు నిరాశ్రయులయ్యారు. ఇది మనందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. ఫ్లెక్సీలు, పుష్ప గుచ్ఛాలకు అయ్యే ఖర్చును బాధితులకు అందజేయాలని కోరుకుంటున్నా ’’... అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇది. ఆయన వేడుకలు వద్దనుకున్నారు. అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయం అభిమానులను నిరుత్సాహపరిచినా మంచి కార్యక్రమం కోసమే కదా అనుకున్నారు. అయితే ఇలా హఠాన్మరణం పొంది, విషాదంలో ముంచెత్తుతారని ఊహించలేదు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం. బుధవారం (ఆగస్ట్ 29) రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు, బసవతారకంల పదకొండు మంది సంతానంలో హరికృష్ణ నాలుగో కుమారుడు. 1956లో నిమ్మకూరులో జన్మించిన హరికృష్ణ అక్కడే తాతయ్య లక్ష్మయ్య చౌదరి దగ్గర పెరిగారు. మనవడ్ని నటుడిగా చూడాలనే కోరిక తాతయ్యకు ఉండేది. కొడుకు దగ్గర ఆ విషయం చెప్పగా చెప్పగా చివరికి ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణావతారం’లో చిన్ని కృష్ణుడి పాత్రను హరికృష్ణతో చేయించారు. తండ్రి ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపిస్తే హరికృష్ణ చిన్ని కృష్ణుడిగా కనిపించారు. ఆ సినిమాలో నటించినప్పుడు హరికృష్ణ వయసు దాదాపు పదేళ్లు. రక్తంలోనే నటన ఉంది కాబట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ సినిమా తర్వాత బాల నటుడిగా ‘తల్లా? పెళ్లామా? చిత్రం చేశారు. ‘తాతమ్మ కల’ (1974) చిత్రంతో హరికృష్ణ పూర్తి స్థాయి నటుడిగా మారారు. ఇందులో తమ్ముడు బాలకృష్ణతో కలసి నటించిన హరికృష్ణ ఆ తర్వాత వెంటనే ‘రామ్ రహీమ్’లోనూ సోదరుడితో కలసి నటించారు. అనంతరం స్వీయదర్శకత్వంలో తండ్రి నటించి, తెరకెక్కించిన భారీ చిత్రం ‘దాన వీర శూరకర్ణ’ (1977) సినిమాలో అర్జునుడి పాత్ర పోషించారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరికృష్ణ స్క్రీన్‌పై కనిపించడానికి 20 ఏళ్లు పట్టింది. హరికృష్ణ తన రాజకీయ వారసుడని, బాలకృష్ణ తన సినీ వారసుడని అప్పట్లో ఎన్టీఆర్ సన్నిహితులతో అనేవారట. హరికృష్ణకు కూడా సినిమాలకన్నా రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో 1977 తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. ‘శ్రీరాములయ్య’తో సెకండ్ ఇన్నింగ్స్ 1998లో మోహన్‌బాబు టైటిల్ రోల్లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ‘శ్రీరాములయ్య’లో చేసిన కీలక పాత్ర ద్వారా నటుడిగా హరికృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ వెంటనే ‘సీతారామరాజు’ చిత్రంలో నటించారు. హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా వైవీయస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ సమయంలో వైవీయస్కి, హరికృష్ణకీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఒక వ్యక్తిని నమ్మితే హరికృష్ణ ఎంతదాకా అయినా వెళతారని ఆయన సన్నిహితులు అంటుంటారు. అందుకే చౌదరితో వరుసగా మరో రెండు సినిమాలు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ చేశారు. నిజానికి హరికృష్ణ మాస్ ఆర్టిస్ట్. పవర్ఫుల్ ఫైట్స్ చేసినా, పంచ్ డైలాగ్స్ చెప్పినా ఆయన ఆహార్యానికి తగ్గట్టుగా ఉండేవి. అయినప్పటికీ ‘సీతారామరాజు’లో ‘చాంగురే.. చాంగురే..’లో వేసిన చిన్న స్టెప్స్, ‘సీతయ్య’లో ‘బస్సెక్కి వస్తావో..’, ‘సిగ్గేస్తోంది...’ పాటలకు వేసిన మాస్, క్లాస్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ‘సీతయ్య’లో గర్భవతిగా ఉన్న భార్య సౌందర్యకు శీమంతం చేస్తూ, ‘సమయానికి తగు సేవలు సేయనీ’ పాటలో హరికృష్ణ నటన ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘శివరామరాజు’లో కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’లో టైటిల్ రోల్ చేశారు. 2004లో ‘స్వామి’, 2005లో ‘శ్రావణ మాసం’ తర్వాత హరికృష్ణ సినిమాలు చేయలేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లాహిరి లాహిరి..లో’ చిత్రానికి నంది అవార్డు, ‘శ్రీరాములయ్య’కు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. 22 ఫిబ్రవరి 1973లో లక్ష్మీకుమారిని పెళ్లాడారు హరికృష్ణ. వీరికి ఇద్దరు కుమారులు జానకి రామ్, కల్యాణ్ రామ్, కుమార్తె సుహాసిని. జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరో భార్య శాలిని. ఈ దంపతుల తనయుడు ఎన్టీఆర్. తనయులకు ఓ మంచి గైడ్‌లా మాత్రమే వ్యవహరించారు హరికృష్ణ. సినిమాలు ఎంచుకునే చాయిస్ వాళ్లకే వదిలేశారు. వారి ఆడియో వేడుకల్లో పాల్గొంటుంటారు. ఆ మధ్య కల్యాణ్ రామ్ నటించిన ‘ఇజం’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న హరికృష్ణ.. ‘ఒక కుమారుడు ‘టెంపర్’తో మంచి హిట్, ఇంకో కుమారుడు ‘పటాస్’తో మంచి హిట్ ఇచ్చారు. ఒక తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు. కుమారులు సాధించే మరెన్నో మైల్స్టోన్స్ని ఆస్వాదించాల్సిన తరుణంలో హరికృష్ణ దూరం కావడం ఆ కుటుంబానికి తీరని శోకం. ఆరేళ్లకే జనంలోకి... ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథ్యం.. జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నేషనల్ డిఫెన్స్ ఫండ్స్‌లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ’’ అంటూ ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను దర్శకుడు క్రిష్ ట్వీటర్లో షేర్ చేశారు. 1962లో దేశ రక్షణ విరాళం కోసం ఎన్టీఆర్ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారనడానికి ఇదో ఉదాహరణ. ‘ఎన్టీఆర్’ బయోపిక్ రీసెర్చ్‌లో భాగంగా క్రిష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ బయోపిక్‌లో హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ కనిపించనున్నారని సమాచారం. తండ్రి ముందే తనయుడు హరికృష్ణ కోసం కథ రాయించిన తాత లక్ష్మయ్య నిమ్మకూరులో తన దగ్గర పెరుగుతున్న మనవడు హరికృష్ణను తీసుకుని తాత లక్ష్మయ్య మద్రాసు వెళ్లారు. అప్పటికే హీరోగా దూసుకెళుతోన్న ఎన్టీఆర్ మద్రాసులో ఉండేవారు. మనవడ్ని పెట్టి సినిమా తీయమని కొడుక్కి చెప్పారు. అయితే ఆ తర్వాత రెండు రోజులు ఎన్టీఆర్ ఏమీ మాట్లాడకపోవడంతో మళ్లీ అడిగారాయన. చిరునవ్వే సమాధానం అయింది. దాంతో ప్రముఖ రచయిత డీవీ నరసరాజుని పిలిపించి, ‘నా మనవడ్ని హీరోగా పెట్టి సినిమా తీయమంటే నా కొడుకు వినడంలేదు. వీడు హీరో అయితే తన మార్కెట్ పోతుందనే భయం వాడికి ఉన్నట్లుంది. నా మనవడు హీరోగా నిలబడాలి. లక్ష్మయ్య మంచి కథ రాసుకు రండి’ అని హరికృష్ణ చేతుల మీదగానే కొంత మొత్తం ఇచ్చారు. ఎన్టీఆర్‌కు హరికృష్ణను తమ్ముడిగా పెట్టి ‘తమ్ముడి పెళ్లి మామ భరతం’ అనే కథను రాసుకొచ్చారు నరసరాజు. కథ చెప్పడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఇంట్లోనే ఉన్నారట. దాంతో అసలు విషయం చెప్పక నరసరాజుకి తప్పలేదు. ‘వాడు హీరో అయితే నా మార్కెట్ పోతుందని భయపడుతున్నానా’ అని పెద్దగా నవ్వారట ఎన్టీఆర్. ఆ స్క్రిప్ట్ తీసుకుని టేబుల్ సొరుగులో పెట్టారట. ఈ విషయాన్ని డీవీ నరసరాజు తన ఆత్మకథలో రాశారు. ఎన్టీఆర్ చనిపోయాక టేబుల్ సొరుగులో ఉన్న ఆ కథను చూసి, నరసరాజుకి బాలకృష్ణ తిరిగి ఇస్తే, ‘‘ఆ కథకు తగిన పారితోషికం నాకు అందింది. ఆ కథ మీదే’’ అని నరసరాజు చెప్పారట. ‘ఇజం’ ఆడియో వేడుకలో తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సక్సెస్ గురించి ఉద్వేగంగా ప్రసంగించారు హరికృష్ణ. ఆ వేడుకలో హరికృష్ణ మాటల సారాంశం ఇది. ‘‘కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాలి. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. ఈ 60 ఏళ్లలో హరికృష్ణ ఏం చేశాడు? ఏం అనుభూతులు పొందాడు? ఎవరూ అనుభవించలేనివి ఏం పొందాడు అంటే.. ఆనంద సమయాలు.. ఒక మహానుభావుని.. నందమూరి అంటేనే రామారావుగారు. ఆయన దగ్గర నేను 30ఏళ్లు పనిచేశాను. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. హిమాలయ శిఖరాన్ని మరచిపోయేంత గొప్ప అనుభూతి పొందినవాడిని. ఆయనతో ఎన్నో విజయాలు, ఎన్నో పోరాటాలు చూశాం. సినిమా రంగంలో విజయం చూశాం. పార్టీ పెట్టి అందులోనూ విజయం చూశాం. సరే.. ఆయన దగ్గర్నుంచి పొందింది ఏంటీ? అంటే ఎనలేని నందమూరి వీరాభిమానులను. 59 నుంచి 60కి వచ్చే టైమ్‌లో వీరిద్దరి (కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్) హిట్ సినిమాలు చూశాను. ఒకటి ‘టెంపర్’, రెండు ‘పటాస్’. ఓకే అది 59. 60కి వచ్చే సరికి ‘జనతా గ్యారేజ్’. నా బిడ్డ జూనియర్ ‘మీకు 60ఏళ్లు వస్తున్నాయ్ కాబట్టి ఇది నా తరఫున గిఫ్ట్’ అన్నాడు. అది ఒక ఆనందం. 60 వచ్చిన తర్వాత మరో బిడ్డ ‘ఇజం’ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. ఇట్లు... మీ నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ 2న తన 62వ పుట్టినరోజు వేడుకలు జరపవద్దని హరికృష్ణ తన అభిమానులకు ఓ ఉత్తరం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికొచ్చింది. ఆ లేఖ యధాతథంగా... ‘‘సెప్టెంబర్ 2న నా అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందుచేత నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతే కాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను. ఇట్లు మీ నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతి నందమూరి హరికృష్ణ ఇక లేడు అంటే నమ్మలేకపోతున్నాను. నేను తీసిన ‘డ్రైవర్ రాముడు’కు నిర్మాతగా వ్యవహరించారు. మా ఇద్దరికీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నో వేల కిలో మీటర్లు డ్రైవ్ చేసిన ఆయన ఇలా మరణించడం చాలా విచారకరం. – దర్శకుడు కె. రాఘవేంద్రరావు నందమూరి హరికృష్ణగారు మనతో లేరన్న విషయం షాకింగ్‌గా ఉంది. అకస్మాత్తుగా మా కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం అనిపిస్తోంది. నా తమ్ముడ్ని నేను మిస్ అయ్యాను. – నిర్మాత అశ్వనీదత్ నా బ్రదర్ నందమూరి హరికృష్ణగారిని నేను కోల్పోయాను. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. మాటలు రావడం లేదు. అంత బాధగా ఉంది. గ్రేట్ లాస్. – నటుడు మోహన్‌బాబు ఇది చాలా దుర్దినం. మిత్రుడు, ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే నా సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చెందటం బాధగా ఉంది. ఇలా మనందరినీ శోకంలో ముంచి వెళతారని ఊహించలేదు. – నటుడు చిరంజీవి హరికృష్ణగారు మరణించడం చాలా బాధగా ఉంది. దురదృష్టకరం. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. – నటుడు వెంకటేశ్ ‘చాలా రోజులైంది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు...’ అని కొన్ని వారాల క్రితమే హరికృష్ణగారు అన్నారు. కానీ ఇప్పుడు లేరు. మా అన్నయ్య (హరికృష్ణ)ను మిస్ అవుతున్నాను – నటుడు నాగార్జున హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. ఆయన లేరంటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. – నటుడు రాజశేఖర్ హరికృష్ణగారి మరణం నన్ను బాధించింది. నా తమ్ముడు తారక్‌తో పాటు ఆ ఫ్యామిలీలోని అందరికీ ఈ శోక సమయంలో ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. – నటుడు మహేశ్‌బాబు హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని బాధపడ్డాను. తారక్, కల్యాణ్రామ్లతోపాటు ఆ ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు ప్రభాస్ ఒక విషాదకరమైన ప్రమాదంలో హరికృష్ణ గారు అకస్మాత్తుగా మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ శోకసమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. – నటుడు రామ్‌చరణ్ హరికృష్ణగారి మరణవార్త వెరీ వెరీ షాకింగ్‌లా ఉంది. నా బ్రదర్స్ తారక్, కల్యాణ్‌రామ్‌లతో పాటుగా నందమూరి ఫ్యామిలీ అందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. – నటుడు అల్లు అర్జున్ నా బ్రదర్స్ తారక్, కల్యాణ్‌రామ్‌లు స్ట్రాంగ్‌గా ఉండాల్సిన సమయం ఇది. ఈ భయంకరమైన సమయంలో వారి కుటుంబంలోని వారందరూ ధైర్యంగా ఉండాలి. – నటుడు రానా తారక్, కల్యాణ్‌రామ్‌లతో పాటు, నందమూరి ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – దర్శకుడు వీవీ వినాయక్ హరికృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం నేను షూటింగ్ నిమిత్తం వేరే దేశంలో ఉన్నాను. ఆయన హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి హరికృష్ణగారితో నాకు కొన్ని జ్ఞాప కాలు ఉన్నాయి. ఆయన హఠాన్మరణం షాకింగ్ గా ఉంది. ఈ శోక సమయంలో నా బ్రదర్స్ తారక్, కల్యాణ్‌రామ్‌లు ధైర్యంగా ఉండాలి. – దర్శకుడు కొరటాల శివ హరికృష్ణ శివ భక్తుడు. ఇక్కడ ఫొటోలో త్రిశూలం కనిపిస్తోంది కదా. రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ వాహనంలోంచి పడిన త్రిశూలం ఇది. జయశంకర్‌కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, సాయికృష్ణ, ఎన్.టి.రామారావు, జయకృష్ణ, మోహన్‌కృష్ణ, బాలకృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లతో హరికృష్ణ బాలకృష్ణుడిగా హరికృష్ణ -
బాబు యుక్తుల్లో చిక్కుకుని విలవిలలాడారు!
కొమ్మినేని శ్రీనివాసరావు– హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ జీవితంలో ఆవేశపరుడిగా గుర్తింపు పొందారు. దీని కారణంగా కొంత నష్టానికి గురికావాల్సి వచ్చింది. ఆ ఆవేశంలోనే తన బావ చంద్రబాబు పన్నిన యుక్తుల్లో చిక్కుకుని విలవిలలాడారు. కొన్నిసార్లు దానిని ఆయన బహిర్గతం కూడా చేశారు. మరికొన్నిసార్లు మౌనంగానే భరించారు. దివంగత నేత ఎన్.టి.రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయాల్లో హరికృష్ణ క్రియాశీలకంగా లేరు. ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఉపయోగించిన చైతన్య రథం డ్రైవర్‌గానే ఉండటానికి ఇష్టపడ్డారు. నిజానికి ఆ రోజుల్లో తండ్రితో పాటే హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర మరోలా ఉండేది. అలాగే తన వారసుడు బాలకృష్ణ అని 1986లో ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాత చంద్రబాబు వ్యూహాత్మకంగా దానిని ఆయనతోనే విరమింప చేశారు. ఎన్టీఆర్‌కు స్వాభావిక వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాలపై శ్రద్ధ చూపకపోవడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. అదే సమయంలో వీరిని తన చేతిలో పెట్టుకోవడంలో కూడా బాబు సక్సెస్ అయ్యారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఎన్టీఆర్ రెండో వివాహంతో విభేదాలు... ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో కుటుంబంలో ఒక చిన్న సైజు తుపాను ఏర్పడింది. దీంతో రాజకీయంగా టీడీపీకి నష్టం వస్తుందని చంద్రబాబు, మరికొందరు భయపడ్డారు. కాని ప్రజలు మరో రకంగా చూశారు. ధైర్యంగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం తప్పు కాదని భావించారు. కాని ఆ తర్వాత పరిణామాల్లో లక్ష్మీపార్వతి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఎన్టీఆర్ పరువును కాపాడాల్సిన చంద్రబాబు వర్గమే ఆయనను తమకు అండగా ఉండే మీడియా ద్వారా ఉన్నవి.. లేనివి.. ప్రచారం చేయించి అప్రతిష్టపాలు చేశారు. హరికృష్ణను రెచ్చగొట్టిన చంద్రబాబు... అదే సమయంలో ఆవేశపరుడైన హరికృష్ణను కూడా తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబు రెచ్చగొట్టారు. లక్ష్మీపార్వతిని వ్యతిరేకిస్తున్నట్లుగా హరికృష్ణ రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించేలా చేశారు. అయితే రాజకీయంగా తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. చంద్రబాబు, లక్ష్మీపార్వతి వర్గాలు గొడవపడి.. తన వద్దకు పంచాయితీకి వస్తారనుకున్నారు కానీ తన కాళ్లకిందకు నీళ్లు తెస్తారని అనుకోలేకపోయారు. ఆ క్రమంలో లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా చేసేవారు. ఆమెకు వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెడతారన్నంతగా వార్తలు వ్యాపింపజేశారు. ఆ దశలో చంద్రబాబు తన అనుయాయులతో కలసి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. లక్ష్మీపార్వతిని దుష్ట శక్తిగా, ఆమె చేతిలో ఎన్టీఆర్ చిక్కినట్లుగా బాబు వర్గం ప్రచారం చేసేది. లక్ష్మీపార్వతి తమ కుటుంబంలో ప్రవేశించడం ఇష్టం లేని ఇతర కుటుంబ సభ్యులు కూడా దానిని నమ్మినట్లు చెబుతారు. దీనికి తోడు ఆస్తుల వ్యవహారాలు కూడా ఉంటాయి. టీడీపీ అధ్యక్ష పదవి, మంత్రి పదవి ఆఫర్... ఆ దశలో హరికృష్ణతో చంద్రబాబు మంతనాలు జరిపి టీడీపీ అధ్యక్ష పదవి, మంత్రి పదవి ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. తండ్రి నుంచి హరికృష్ణను, ఇతర కుటుంబ సభ్యులను దూరం చేసి చంద్రబాబు తనవైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. అదే తరుణంలో మరో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా తనవైపు ఆకట్టుకోగలిగారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఎన్టీఆర్ మరో కుమారుడు బాలకృష్ణ ఆ రోజుల్లో తండ్రి వద్ద కనిపించినా, బాబుతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆ రకంగా ఎన్టీఆర్ కుటుంబం అంతా తన వెంటే ఉందని పార్టీ వారిని కూడా బాబు నమ్మించగలిగారు. దీంతో ఎన్టీఆర్ చివరి రోజుల్లో అందరూ ఉన్నా ఒంటరివాడిగా కుమిలిపోవలసి వచ్చింది. ఇదంతా చంద్రబాబు నమ్మక ద్రోహమని, తన కుమారులనూ బాబు వలలో వేసుకున్నారని ఎన్టీఆర్ బాధపడేవారు. హరికృష్ణకు అధ్యక్ష పదవి ఇవ్వని బాబు... ఏమైతేనేం ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి బాబు అధికార పగ్గాలు చేపట్టగలిగారు. అది వెన్నుపోటు అనండి.. కుట్ర అనండి.. మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. అప్పటికే చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి తొలగించినట్లు ఎన్టీఆర్ ప్రకటించి, మంత్రి పదవుల నుంచి తీసివేసినట్లు ఆదేశాలు ఇచ్చారు. అయినా నాటి గవర్నర్ కృష్ణకాంత్, ప్రధాని పీవీ నరసింహారావు బాబుకే మద్దతు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత మరో కథ ఆరంభం అయింది. జరిగిన ప్రచారం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా, హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చారు. దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా మొదటే మోసం చేశారు. దీంతో దగ్గుబాటి తాను తప్పు చేశానని తెలుసుకుని చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. హరికృష్ణ ఆరు నెలల పాటు మంత్రిగా ఉన్నారు. ఈలోగా నిబంధనల ప్రకారం ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉన్నా ఆయనకు ఆ అవకాశం రాలేదు. 1995, ఆగస్టు చివర్లో పదవి కోల్పోయిన ఎన్టీఆర్.. ఆ బాధతోనే 1996, జనవరిలో మరణించారు. టీడీపీలోకి వచ్చినా పార్టీ విధానాలపై విమర్శలు 2004 నాటికి చంద్రబాబు అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మళ్లీ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే హరికృష్ణను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. 2008లో రాజ్యసభ సీటు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబం తనతోనే ఉందన్న అభిప్రాయం కలిగించి ప్రజల్లో సానుభూతి పొందాలని బాబు భావించాడని చాలా మంది అభిప్రాయం. అయినా ఆయా సందర్భాల్లో హరికృష్ణ టీడీపీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించేవారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తే, హరికృష్ణ సమైక్య రాష్ట్రం కోరుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బాబు నాయకత్వం పట్ల ఆయనకున్న అసమ్మతికి ఇది పెద్ద ఉదాహరణ. ఆ తర్వాత తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల్లో చంద్రబాబు వాడుకుని వదలేశారన్న బాధ కూడా ఆయనకు ఉంది. గెలిచినా హరికృష్ణకు రాని మంత్రి పదవి... ఎన్టీఆర్ మరణంతో ఖాళీ అయిన హిందూపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడానికి కొంత సమయం పట్టింది. దీంతో హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి హిందూపూర్ ఉప ఎన్నిక జరిగి హరికృష్ణ గెలిచారు. ఆ వెంటనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణను పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర అవమాన భారానికి గురైన హరికృష్ణ కొంతకాలం ఓపిక పట్టి, 1999 ఎన్నికల ముందు సొంతంగా అన్నా టీడీపీ అనే పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో చంద్రబాబు నమ్మక ద్రోహంపై హరికృష్ణ తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ నాటి పరిస్థితులు ఆయనకు కలసి రాలేదు. కార్గిల్ యుద్ధం నేపథ్యం, వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిన సానుభూతి ఉపయోగపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఓటమి తర్వాత హరికృష్ణ రాజకీయంగా వెనుకబడ్డారు. పార్టీలో తగ్గిన ప్రాధాన్యతతో బాధ... ఇటీవలి కాలంలో తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న బాధ కూడా హరికృష్ణకు ఉండి ఉండవచ్చు. అందువల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారని చెప్పాలి. అదే సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణను పక్కనబెట్టి ఆయన సోదరుడు బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తెను కోడలిగా చేసుకోవడం, ఆయనకు హిందూపూర్ టికెట్ ఇవ్వడంతో అన్నదమ్ముల మధ్య కూడా ఒక రకంగా సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్న భావన ఉంది. స్థూలంగా చూస్తే హరికృష్ణ ఆవేశాన్ని, రాజకీయ అమాయకత్వాన్ని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు పూర్తిగా వాడుకోగలిగారు. హరికృష్ణ తన అమాయకత్వంతో రాజకీయంగా ఎంతో నష్టపోయారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వచ్చిన చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ద్వారా అధికార అందలం ఎక్కి ఆయనకే ఎసరు పెట్టగలిగారు. అలాగే హరికృష్ణను కూడా కరివేపాకు మాదిరి వాడుకుని వదలేశారు. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడిగా ఎదగవలసిన హరికృష్ణ ఒంటరిగా మిగిలిపోవడం చారిత్రక విషాదం. -
ఆహ్వానం..40 ఏళ్ల అనుబంధం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌తో నందమూరి హరికృష్ణకు విడదీయరాని బంధం ఉంది. గత నలభై ఏళ్లుగా ఆయనకు ఈ హోటల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానులు అక్కడకు తరలివచ్చేవారు.. వారిని హరికృష్ణ ఆత్మీయంగా పలకరించేవారు. యోగక్షేమాలను తెలుసుకుని.. వచ్చిన వారికి భోజనం పెట్టి ఆదరించి అక్కున చేర్చుకునేవారు. బుధవారం ఆయన అకాల మరణవార్త తెలిసి ఎన్టీఆర్ ఎస్టేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ థియేటర్‌తోపాటు దుకాణ సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి హరికృష్ణ నివాసానికి తరలివెళ్లారు. ఆహ్వానం హోటల్ సిబ్బంది హరికృష్ణ చిత్రపటాన్ని ప్రవేశద్వారం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. 1001 నంబరు గది.. : మూడంతస్తులున్న ఆహ్వానం హోటల్లో మొత్తం 48 గదులున్నాయి. వీటిలో మూడు మినహా మిగతా 45 గదులను హోటల్ సిబ్బంది అద్దెకిస్తున్నారు. ఈ మూడు గదులను హరికృష్ణ తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించేవారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మాత్రమే ఈ గదులను కేటాయించేవారు. రోజూ ఉదయం 11 గంటలకు హోటల్‌కు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు 1001 నంబరు గదిలో ఉండేవారు. పదేళ్లుగా హోటల్ నిర్వహణ బాధ్యతలను కృష్ణారావు అనే వ్యక్తికి హరికృష్ణ అప్పజెప్పారు. అంతకుముందు తానే హోటల్ బాధ్యతలు చూసేవారని సిబ్బంది తెలిపారు. ‘టాటా సియారా’పై ఎనలేని ప్రేమ: ఆహ్వానం హోటల్ ఎదురుగా పార్క్ చేసిన తెలుపు రంగు టాటా సియారా వాహనం అంటే హరికృష్ణకు ఎంతో ప్రేమ. ఈ వాహనం నంబర్ ఏపీ 20బి 3339ని లక్కీ నంబర్‌గా భావించేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. హోటల్ ఆవరణలో పార్క్ చేసిన ఏఏయూ 2622 నంబరు బుల్లెట్, ఏపీ 9ఏ 5229 బుల్లెట్లంటే ఆయనకు ఎంతో మక్కువ. ఇక్కడే పార్క్ చేసిన బజాజ్ చేతక్, హీరో హోండా వాహనాలు గతంలో హరికృష్ణ వాడినవే. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను నడపడం, వాటిపై సుదూర ప్రాంతాలకు నడుపుకుంటూ వెళ్లడం అంటే ఆయనకు ఎనలేని సరదా అని స్థానికులు తెలిపారు. -
ఆప్తులు.. మిత్రులు.. ఆ ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ చైతన్య రథానికి సారథిగా, మంత్రిగా, అన్న టీడీపీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సినిమా నటుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన నందమూరి హరికృష్ణ.. స్వతహాగా కొత్తవారిని అంత త్వరగా నమ్మే వ్యక్తికాదు. కొత్త వారితో అంతగా కలసిపోలేరు. సుదీర్ఘ పరిచయంతో ఆత్మీయులుగా మారితే తప్ప వేరెవరితోనూ తన మనసులో మాటను పంచుకునే వారు కాదు. కానీ ఆ ముగ్గురు కలిస్తే మాత్రం.. ఆయన మనసులో మాటలన్నీ ఊటలై వచ్చేవి. విషయం, నిర్ణయం ఏదైనా వారితో చర్చించాకే చేసేవారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ జస్టిస్ చలమేశ్వర్, దాసరి జై రమేశ్, పీఎన్వీ ప్రసాద్‌లే ఆ ముగ్గురు. స్నేహమంటే ఎంతో విలువనిచ్చే హరికృష్ణ ముక్కుసూటితనం అనేక మార్లు ఆయనను ఇబ్బందుల పాలు జేసింది. అబిడ్స్‌లోని ఎన్టీఆర్ ఎస్టేట్‌లో ఎక్కువ సమయం గడిపే హరికృష్ణ.. మిత్రులతోనూ అక్కడే చర్చలు, భోజనాలు చేసేవారు. వాహనాలు, పెంపుడు జంతువులంటే ఇష్టం హరికృష్ణకు వాహనాలు, పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఆయన వద్ద అరుదైన జాతి ఆవులతోపాటు, కుక్కలు ఉండేవి. పుంగనూరు ఆవుల కోసం ఆయన మాదాపూర్, ఎల్బీనగర్‌లలోని గోశాలలను తరచూ సందర్శించేవారు. తన అన్ని వాహనాలకు 3999 ఫ్యాన్సీ నంబర్ వచ్చేలా ప్లాన్ చేసేవారని, వాహనాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. సొంత డ్రైవింగ్‌లో ప్రయాణమంటే ఆయనకు ఎంతో ఇష్టమని, ఎంత రాత్రయినా సరే హైదరాబాద్ చేరేందుకే మొగ్గు చూపేవారని చెబుతారు. ‘మా పని అయిపోయిందనుకున్నా’ ‘1995లో హిందూపురం ఉప ఎన్నికల ఫలితాల రోజు రాత్రి హరికృష్ణతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరాం. మార్గమధ్యలో గేదె అడ్డం వచ్చింది.. అప్పుడే మా పని అయిపోయిందనుకున్నా. కానీ హరికృష్ణ చాకచక్యంతో వాహనాన్ని కట్ చేసి మాకేం కాకుండా చూశారు.. ఆయన డ్రైవింగ్ అంటే అంత నమ్మకం’’అని పీఎన్వీ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన లేరంటే నమ్మలేకున్నా.. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు. -
ముక్కుసూటి 'మనిషి'
సాక్షి, అమరావతి: ఏ విషయమైనా ముఖంమీదే మాట్లాడటం, నచ్చిందే చేయడం నందమూరి హరికృష్ణ నైజం. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే హరికృష్ణకు ఆత్మాభిమానం అధికమని, భోళా మనిషని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుం టున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో జరిగిన చర్చలో హరికృష్ణ పట్టుబట్టి తెలుగులో ప్రసంగించారు. అభ్యంతరాలను లెక్క చేయకుండా ట్రాన్స్లేషన్ కంటే ఎక్స్‌ప్రెషనే ముఖ్యమని ధైర్యంగా చాటారు. హరికృష్ణ హీరోగా నటించిన ‘సీతయ్య’ సినిమా ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెబుతారు. దాదాపు రెండు దశాబ్దాలు విరామం తీసుకున్నా శ్రీరాములయ్య, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరి తదితర చిత్రాలతో నందమూరి అభిమానులను హరికృష్ణ అలరించారు. మంత్రి పదవిలో ఆర్నెల్లు హరికృష్ణ 1995 వరకూ తండ్రి వెన్నంటే ఉన్నా రాజకీయంగా క్రియాశీలంగా లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హరికృష్ణను రవాణా శాఖ మంత్రిగా నియమించినా ఆర్నెల్ల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 1996లో హరికృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచినా మంత్రి వర్గంలో తిరిగి చోటు దక్కలేదు. టీడీపీలో ఇమడలేక సొంత పార్టీ తండ్రిని పదవి నుంచి దించేందుకు సహకరించి తప్పు చేశానని హరికృష్ణ పలుమార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తరచూ అవమానాలు ఎదురు కావడంతో టీడీపీలో ఇమడలేక 1999 జనవరిలో ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. 1999 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించినా ఆయన పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకపోగా గుడివాడలో హరికృష్ణ స్వయంగా ఓడిపోయారు. తండ్రిపై ఎనలేని అనురాగం టీడీపీలో ప్రతి నాయకుడితోనూ హరికృష్ణకు అను బంధం ఉంది. తండ్రిపై వల్లమాలిన అభిమానాన్ని ఆయన పలు సందర్భాల్లో చాటుకున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథిగా కొన్ని వేల కిలోమీటర్లు వాహనం నడిపారు. ఆయనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రేయింబవళ్లు తిరిగి అలసిపోయినా మరో డ్రైవర్ తండ్రి వాహనాన్ని నడిపేందుకు ఒప్పుకునేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆర్నెళ్ల పాటు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనూ హరికృష్ణ తనకు ఏది మంచి అనిపిస్తే అదే చేసేవారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. నిమ్మకూరుపై మక్కువ తాను పుట్టిన నిమ్మకూరు అంటే హరికృష్ణకు ప్రత్యేక అభిమానం. వీలు కుదిరినప్పుడల్లా గ్రామానికి వెళ్లేవారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నిమ్మకూరు అభివృద్ధికి ఎక్కువ నిధులిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం నియోజకవర్గంతోనూ హరికృష్ణకు అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మరణం తర్వాత హిందూపురం ఉప ఎన్నికల్లో పోటీ చేసి 62 వేల భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీలోకి తిరిగి వచ్చినా... కుటుంబసభ్యుల ఒత్తిడితో హరికృష్ణ తిరిగి టీడీపీలో చేరినా ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. రాజ్యసభకు పంపినా పార్టీలో అవమానాలు తప్పలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 2013 ఆగస్టు నాలుగో తేదీన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత మళ్లీ ఆయనకు రాజ్యసభకు వెళ్లే అవకాశమివ్వలేదు. హరికృష్ణ మూడేళ్లుగా టీడీపీ మహానాడుకు సైతం దూరంగా ఉన్నారు. రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని చివరికి స్తబ్దుగా మిగిలిపోయారు. -
దురదృష్టకరం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసంలో పార్థివదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులను కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా కేసీఆర్ పేర్కొన్నారు. హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి సూచించారు. గవర్నర్ ప్రగాఢ సంతాపం.. నందమూరి హరికృష్ణ అకాల మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని అన్నారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ముక్కుసూటి మనిషి సాక్షి, హైదరాబాద్: తెల్లవారుజామున నిద్రలేవగానే దిగ్భాంత్రికర వార్త విన్నా. విషయం తెలియగానే కళ్యాణ్‌రామ్‌తో మాట్లాడా. వెంటనే నార్కెట్పల్లికి చేరుకున్నా. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి. నీతినిజాయతీగా ఉండేవారు. ఒకపక్క కుటుంబ సభ్యుడిని, మరో పక్క పార్టీ నాయకుడిని కోల్పోయా. ఆయన మనసుకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నా. – చంద్రబాబు, ఏపీ సీఎం అమ్మగారూ.. అని ఆప్యాయంగా పిలిచేవాడు మా కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోంది. నా పెద్ద కుమారుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. తొలుత మా వివాహాన్ని హరికృష్ణ వ్యతిరేకించినా, ఆ తర్వాత నన్ను ఆప్యాయంగా పలకరించేవాడు. నన్ను అమ్మా.. అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమైన కుమారుడు. తండ్రికి రథసారధి. – లక్ష్మీపార్వతి పలువురి దిగ్భ్రాంతి హరికృష్ణ అకాల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సంతాపం తెలిపారు. -
షాక్‌కు గురయ్యా: జగన్
సాక్షి, హైదరాబాద్: నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం పట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ట్విట్టర్లో కూడా స్పందిస్తూ.. ‘నందమూరి హరికృష్ట హఠాన్మరణంతో షాక్‌కు గురయ్యాను. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోస్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’అని జగన్ ట్వీట్ చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. -
వేగం తీసిన ప్రాణాలెన్నో!
‘వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి. మా కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగొద్దని కోరుకుంటున్నా. వేడుక ముగిసిన వెంటనే క్షేమంగా ఇంటికి చేరుకోండి.. మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి’ సోదరుడు జానకిరాం మరణం తర్వాత రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే క్రమంలో భాగంగా తన సినిమా ప్రారంభంలో, పలు సందర్భాల్లో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేప్పే మాటలివీ. సాక్షి, హైదరాబాద్/మునగాల (నల్లగొండ): దురదృష్టవశాత్తు మళ్లీ అదే ఘోరం జరిగిపోయింది. నందమూరి జానకిరాం చనిపోయిన నల్లగొండ జిల్లాలోనే హీరో హరికృష్ణ కూడా మృత్యువాత పడ్డారు. అవసరం, దానికి తోడు తొందరపాటులో రెట్టించిన వేగంతో నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దూకుడుతో ప్రయాణించడంతో ప్రమాదాల బారినపడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి ఎర్రన్నాయుడు, మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, సినీ నటుడు భరత్, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ తదితరులు రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు.. గతేడాది జూన్‌లో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్.. శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. అంతకు ముందు నెలలో బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీశ్ మృత్యువాతపడ్డాడు. అత్యంత వేగంతో వాహనాన్ని నడుపుతూ పెద్దమ్మగుడి సమీపంలోని మెట్రోపిల్లర్‌కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 2014 ఏప్రిల్‌లో ప్రముఖ రాజకీయ నేత భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్‌బాషా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. నల్లగొండ–గుంటూరు రోడ్డులో అతివేగంతో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అంతకుముందు ఏడాది నవంబర్‌లో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఠి 2011 డిసెంబర్లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి పటాన్చెరు దగ్గర ఓఆర్ఆర్పై కారు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు రెండు నెలల ముందు క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ బైకుపై వెళ్తూ అతివేగంతో అదుపుతప్పి తీవ్రగాయాలపాలయ్యాడు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2010 జూన్‌లో సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. 2003 అక్టోబర్‌లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు పవన్‌కుమార్ బైక్‌పై వెళ్తూ జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీ కొట్టి చనిపోయాడు. 2000 ఏప్రిల్‌లో మాజీ హోంమంత్రి పట్లోల్ల ఇంద్రారెడ్డి మహబూబ్‌నగర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మరణించారు. నాడు తనయుడు.. నేడు తండ్రి నల్లగొండ జిల్లా మునగాల వద్ద 2014 డిసెంబర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం మరణించాడు. అతివేగంతో వెళ్తున్న సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డురావడంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ట్రాలీని జానకిరాం కారు ఢీకొట్టింది. ముందు సీటులో ఉన్న జానకిరాంకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఇప్పుడు తండ్రి హరికృష్ణ కూడా నల్లగొండ– అద్దంకి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాగా, తొమ్మిదేళ్ల కింద సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట–ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26 అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ వాహనం బోల్తాపడింది. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, అజాగ్రత్తగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. చదవండి: ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! -
టీడీపీ కార్యాలయానికి భౌతికకాయం తరలింపునకు నో!
రోడ్డు టెర్రర్.. నందమూరి కుటుంబంలో మరొకరిని బలి తీసుకుంది. మితిమీరిన వేగం ఓ నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నార్కెట్‌పల్లి– అద్దంకి రహదారిలో అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణ స్వయంగా నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆయన్ను స్థానికులు హుటాహుటిన సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఉదయం 7.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి, హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసానికి తరలివచ్చారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, హరికృష్ణ భౌతికకాయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలించాలంటూ చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అడిగించగా.. వారు అందుకు నిరాకరించినట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నార్కెట్‌పల్లి– అద్దంకి రహదారిలో అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అసలేం జరిగింది...! నెల్లూరు జిల్లా కావలిలో ఒక వేడుకలో పాల్గొనేందుకు నందమూరి హరికృష్ణ తన ఇద్దరు మిత్రులు అరికెపూడి శివాజీ, రావి వెంకటరావులతో కలిసి హైదరాబాద్‌లో తన ఇంటి నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో ఉదయం 4.30 గంటలకు బయలుదేరారు. డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ.. అన్నెపర్తి బెటాలియన్ సమీపంలోని ఓ మూల మలుపులో వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు. దీంతో వారి వాహనం ఎడమవైపు మార్జిన్ దిగి, పక్కకు వెళ్లిపోతుండగా.. ముందు సీట్లో కూర్చున్న శివాజీ అప్రమత్తమై హరికృష్ణను హెచ్చరించారు. వెంటనే ఆయన స్టీరింగ్‌ను ఒక్కసారిగా కుడివైపునకు తిప్పారు. అప్పటికే కారు అతివేగంతో ఉండటంతో పూర్తిగా రోడ్డుకు కుడివైపు తిరిగి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పది అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి.. ఎదురుగా హైదరాబాద్ వైపు వస్తున్న మరో కారు వెనుక భాగాన్ని రాసుకుంటూ వెళ్లి కిందపడి మూడు పల్టీలు కొట్టింది. హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ముందు అద్దాల్లోంచి ఎగిరి అక్కడున్న ఓ కల్వర్టులో పడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారకస్థితికి వెళ్లిపోయారు. శివాజీ వాహనంలో ఇరుక్కుపోగా, బెటాలియన్‌లో విధులుకు హాజరయ్యేందుకు వెళుతున్న కానిస్టేబుళ్లు రంజిత్, ఉపేందర్ ఆయన్ను బయటకు లాగారు. వెనుక సీట్లో కూర్చున్న రావి వెంకటరావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైన సమయంలోనే నల్లగొండ నుంచి హైదరాబాద్ మార్గంలో మరో కారు ప్రయాణిస్తోంది. హరికృష్ణ కారు గాలిలోకి ఎగరడంతో ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన ఆ డ్రైవర్ చాకచక్యంగా తమ వాహనాన్ని ఎడమవైపున ఉన్న చెట్లలోకి మళ్లించాడు. అయినప్పటికీ, హరికృష్ణ వాహనం ఆ కారును వెనుక వైపు ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పంగా గాయపడ్డారు. 15 నిమిషాలు వెతుకులాట... ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్న రావి వెంకటరావు రోడ్డుమీదకు వచ్చి సాయం కోసం ఆపడంతో బెటాలియన్ కానిస్టేబుళ్లు రంజిత్, ఉపేందర్ ఆగారు. వీరితోపాటు విషయం తెలుసుకున్న మిట్లపల్లి సైదులు అనే వ్యక్తి కూడా అక్కడకు వచ్చారు. తమతో పాటు మరో వ్యక్తి ఉండాలని వెంకటరావు చెప్పడంతో అంతా కలిసి హరికృష్ణ కోసం దాదాపు 15 నిమిషాలపాటు చుట్టుపక్కల వెతికారు. అప్పటికి ప్రమాదం జరిగింది హరికృష్ణకు అన్న విషయాన్ని వెంకటరావు ఎవరికీ చెప్పలేదు. చివరకు కల్వర్టులో పడిపోయి ఉన్న హరికృష్ణను సైదులు గుర్తించారు. కారు పడిపోయిన స్థలానికి, హరికృష్ణ పడిపోయిన కల్వర్టు 30 అడుగుల దూరం ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. కేసీఆర్, చంద్రబాబు సహా పలువురి నివాళి... హరికృష్ణ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలివచ్చారు. తొలుత హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కామినేనికి చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తండ్రి మృతదేహం వద్ద ఎవరూ ఉండొద్దని, అక్కడ ఎవరైనా ఉంటే తాము చూడబోమని చెప్పడంతో డాక్టర్లు అక్కడినుంచి వెళ్లిపోయారు. హరికృష్ణ సోదరి, దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు కామినేనికి వచ్చి హరికృష్ణ మృతదేహాన్ని చూసి విలపించారు. సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన సోదరుడి మృతదేహాన్ని చూసి మౌనంగా ఉండిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి లోకేష్ హెలికాప్టర్లో అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చేరుకుని అక్కడినుంచి కామినేనికి వచ్చారు. చంద్రబాబు వచ్చేవరకు హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం జరపలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్.భాస్కర్‌రావు, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ హీరో జగపతిబాబు కూడా ఆస్పత్రికి వచ్చి.. హరికృష్ణకు నివాళులు అర్పించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్ మోహదీపట్నం ఎన్‌ఎండీసీలోని ఆయన ఇంటికి చేర్చారు. అప్పటికే కళ్యాణ్‌రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్, ఈటెల, తలసాని, జగదీష్‌రెడ్డి, పలువురు ఏపీ మంత్రులు, సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, మురళీమోహన్, రాంచరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హరికృష్ణ పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయం వద్ద నివాళ్లు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘కారు పల్టీ కొట్టాక కనిపించలేదు’ కారులో వెనుక వైపు కూర్చున్నా. అన్నెపర్తి వద్దకు రాగానే రోడ్డు మూల మలుపులో కారు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగాక అందులో నుంచి నేను బయటకు వచ్చాను. శివాజీ బయటకు వచ్చారు. హరికృష్ణ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత 30 అడుగుల దూరంలో పడిపోయి ఉన్న హరికృష్ణను చూశాం. అప్పుడు కొద్దిగా శ్వాస ఆడుతోంది. – హరికృష్ణ స్నేహితుడు వెంకటరావు వారం క్రితమే ప్రయాణానికి ప్లాన్ నెల్లూరు ప్రయాణానికి వారం కిందటే ప్లాన్ చేశాం. హరికృష్ణ ఎక్కడికి వెళ్లినా నేను తోడుగా ఉంటాను. హరికృష్ణ శివ భక్తుడు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఇంట్లో శంకరుడికి పూజలు చేయనిదే బయటికిరారు. – హరికృష్ణ స్నేహితుడు శివాజీ మెదడులో రక్తం గడ్డకట్టింది హరికృష్ణ శరీరం కుడివైపున బాగా గాయాలయ్యాయి. ప్రధానంగా చెంప భాగం పూర్తిగా దెబ్బతింది. కుడి కన్నుపై దెబ్బ తగిలింది. కన్నుకు ఏమీ కాలేదు. తలపై భాగంలో దెబ్బ తగలడంతో అధిక రక్తస్రావం అయింది. దీనికి తోడు మెదడులో రక్తం గడ్డకట్టింది. ఉదయం 6 నుంచి 6.30 సమయంలో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. ప్రమాద స్థలి నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చాక 7.15 గంటల సమయంలో హరికృష్ణ చనిపోయారు. పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని అప్పజెప్పాం. – వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి -
హరి అన్న మొండితనం ఉన్న మంచి మనిషి
1977లో చేసిన ‘దాన వీర శూర కర్ణ’ తర్వాత హరికృష్ణ మళ్లీ స్క్రీన్ పై కనిపించింది 1998లో ‘శ్రీరాములయ్య’ చిత్రంలోనే. ఎన్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హరికృష్ణ కామ్రేడ్ సత్యం క్యారెక్టర్ చేశారు. హరికృష్ణ మృతిపట్ల శంకర్ స్పందిస్తూ – ‘‘మంచి మనసున్న వ్యక్తి హరికృష్ణగారు. అలాంటి కల్లాకపటం, కల్మషం లేని వ్యక్తి ఇక మన మధ్య లేరని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా గ్యాప్ తర్వాత ‘శ్రీరాములయ్య’ సినిమాలో సత్యం అనే విప్లవ వీరుడి క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా నటించి అఖండ ప్రేక్షకాదరణ పొందారు. ఈ సినిమా కోసం ‘పీపుల్స్ వార్ ఫౌండర్’ సత్యమూర్తిగారు రాసిన ‘విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ... నీకిస్తా తమ్ముడా.. నీకిస్తా తమ్ముడా’ అనే సాంగ్‌లో హరికృష్ణగారి అభినయం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది. ఆయన ఎంత మొండివాడంటే ఈ సాంగ్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక బరువైన చెట్టు మొదలుని భుజం మీద పెట్టుకుని పాడాలి. ఆ టైమ్‌లో మేము హైదరాబాద్ నుంచి డమ్మీ తెప్పించాలనుకున్నాం. కానీ ఆ ప్రాసెస్ డిలే అయ్యింది. షూటింగ్ రేపు పెట్టుకుందామని అన్నాం. అక్కర్లేదు. ఇక్కడున్న ఓ మొద్దుతో కానివ్వండి అన్నారు. ఇద్దురు వ్యక్తులు ఓ బరువైన మొద్దును ఎత్తి ఆయన భుజంపై పెట్టారు. ఆయన ఒక్కరే మోసారు. దీంతో అక్కడున్న మేమందరం షాక్ అయ్యాం. ఆ వయసులో కూడా ఆయనకు అంత సాహసం, మొండితనం ఉండేవి. ఆ కుటుంబానికే సినిమా అంటే అంత కమిట్మెంట్ ఉందనిపించింది. మంచితనం, మొండితనం ఉన్న మంచి వ్యక్తి హరి అన్న. నందమూరి కుటుంబ సభ్యులు తెల్లవారు జాము నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. ‘శ్రీరాములయ్య’ షూటింగ్ అప్పుడు నా గది, హరికృష్ణగారి గది పక్క పక్కనే ఉండేవి. నేనేమో నిద్ర పోతుంటే ఆయన నాలుగున్నరకే నిద్ర లేచి, రెడీ అయ్యి నన్ను లేపేవారు. ఆ క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయాను. హరి అన్న ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పైకి గంభీరంగా కనిపించే హరి అన్న నిజానికి చాలా సరదా మనిషి. ‘మీ బుగ్గలు బాగున్నాయి’ అంటూ నన్ను సరదాగా ఆటపట్టించేవారు. లొకేషన్లో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఆయన్ని దగ్గరగా చూసినవాళ్ళకే హరి అన్న ఎంత మంచి మనిషో అర్థం అవుతుంది’’ అన్నారు. -
సొంత సోదరుడిలా చూసుకునేవారు
హరికృష్ణతో ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వైవీయస్ చౌదరి ఆయనతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ – ‘‘నేను రాఘవేంద్రరావుగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు హరికృష్ణగారితో అనుబంధం ఏర్పడింది. ఆయన బాలకృష్ణగారి సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండేవారు. నేను గుడివాడ నుంచి వచ్చానని తెలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ‘బాలకృష్ణగారు అందంగా చందమామలా ఉంటారు. మీరు కొంచెం యాంగ్రీ యంగ్‌మేన్ సినిమాలు చేయొచ్చు’ కదా అని అడిగితే ‘నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్’ అనేవారు. నన్ను ఆప్యాయంగా సొంత సోదరుడిలా చూసుకునేవారు. ఇంటికి వెళ్లినప్పుడు కలిసి భోజనం చేసేవాళ్లం. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రామారావుగారి అభిమానిగా ఉన్న నాకు ఆయన కుమారుడితో సావాసం చాలా గొప్ప ఆనందం కలిగించింది. నిర్మాతగా నాకు జన్మనిచ్చారు ‘సీతారామరాజు’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాక నాగార్జునగారికి చెప్పినప్పుడు వేరే హీరోని ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగితే హరికృష్ణగారు అన్నాను. నీకు నమ్మకం ఉందా? అని అడిగారు. ఉందన్నాను. హరికృష్ణగారిని కలిసే ఏర్పాటు చేశారు. నా దగ్గర ఓ కథ ఉంది అని చెప్పగానే ‘నాగేశ్వరరావు బాబాయ్ ప్రొడక్షన్, నాగార్జున తమ్ముడి సినిమా. నువ్వు నా ఆత్మీయుడివి కచ్చితంగా చేస్తాను’ అని కథ కూడా వినకుండా ఓకే చెప్పారు. ఆ తర్వాత కూడా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాని నా మీద నమ్మకంతోనే చేశారు. దర్శకుడిగా ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి’ ద్వారా నాకు జన్మనిచ్చింది నాగార్జునగారైతే, నిర్మాతగా జన్మనిచ్చింది హరికృష్ణగారు. ఆ సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా వేరే పార్టీ స్థాపించి అపజయంలో ఉన్నారాయన. అలాంటి సమయంలో సినిమా చేస్తారా? అని అడగడమే సాహసం. పైగా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ నిర్మాతగా నా ఫస్ట్ సినిమా. ఎలా చేస్తావు అని అడిగారు తప్ప కథ కూడా అడగలేదు. నేను ఆయనకు నచ్చాను, ఆయనకు నచ్చితే అచంచెలమైన నమ్మకం ఏర్పరుచుకుంటారు. ఆ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో మధ్యలో అడ్జస్ట్మెంట్స్ ఉన్నా భరించారు. సినిమా రెమ్యునరేషన్ కూడా అందరికీ ఇచ్చాకే ఇవ్వులే అన్నారు. నీకు కుదిరినదాన్ని బట్టి ఇవ్వు అన్నారు. ఆయనకు ఇతరులను కష్టపెట్టే తత్వం లేదు, మానవత్వం ఉంది. ‘లాహిరి లాహిరి..’లో సినిమా రిలీజ్ రోజే ఆ సినిమా శతదినోత్సవ సంబరాలు ఫలానా చోట జరుగుతాయని యాడ్ ఇచ్చాను. ఆయన ఓడిపోయిన గుడివాడలోనే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ని ఓ పెద్ద బహిరంగ సభలా నిర్వహించాం. అది నాకు బెస్ట్ మూమెంట్ అని ఫీల్ అవుతాను. అక్కడే డైరెక్ట్‌గా అనౌన్స్ చేశాను.. మేం ఇద్దరం కలసి ‘సీతయ్య’ సినిమా చేస్తున్నాం అని. 175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం 48 ఏళ్ల వయసులో ఫుల్ టైమ్ హీరోగా చేయని ఆయనతో ఒక కమర్షియల్ సినిమా (‘సీతయ్య’) అనౌన్స్ చేయడం రిస్క్. ఆ సినిమా కమిట్ అయిన తర్వాత హీరోయిన్స్ ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగారు. సిమ్రాన్, సౌంద్రర్య అని చెప్పాను. ఆయన షాక్ అయ్యారేమో కానీ కనబడనివ్వలేదు. రామారావుగారి అబ్బాయి, సీయం కొడుకుగా ఆయన చాలా సరదా మనిషి. ‘సీతయ్య’ సినిమాను 175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం. అలా రిలీజ్ చేయడం చాలా తక్కువ మంది హీరోలకు జరిగేది ఆ రోజుల్లో. సుమారు 8 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. చివరిగా ఆయన్ను మార్చి 2న కలిశాను. బర్త్‌డే సందర్భంగా వచ్చే నెల 2న కలుద్దామనుకున్నాను. ఈలోపు ఇలా జరగకూడనిది జరిగింది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
విషాద ఉదంతం
నందమూరి వంశంలో నిష్కల్మష హృదయుడిగా, నిష్కర్షగా మాట్లాడే నేతగా పేరున్న హరికృష్ణ నల్లగొండ జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తీరు మన అస్తవ్యస్థ రహదారులను, వాటిపై అపరిమిత వేగంతో పరుగులెత్తే వాహనాల తీరుతెన్నులను వెల్లడించింది. ఇలాంటి రహదారులపై ప్రయాణించేవారైనా, పాదచారులైనా క్షేమంగా ఇళ్లకు చేర గలరని ప్రభుత్వాలు ఎలా అనుకుంటాయో అనూహ్యం. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మిగిలినవాటితోపాటే మన జాతీయ రహదారులు కూడా పూర్తిగా కొత్త రూపు సంత రించుకున్నాయి. ఆరు లేన్లు, ఎనిమిది లేన్ల రహదారులుగా మారాయి. విశాలమైన రహదార్ల మధ్య డివైడర్లు, వాటిపై పచ్చటి మొక్కలు ముచ్చట కలిగిస్తుంటాయి. ఆ రహదార్లపై అడ్డంగా అందంగా అమర్చిన టోల్ గేట్లు... వచ్చే పోయే వాహనాలు అక్కడ కప్పం కట్టడం అన్నిచోట్లా అనునిత్యం కనిపించే దృశ్యం. విశాలమైన రహదార్లను చూసి అమిత వేగంతో వెళ్లాలన్న సరదా కావొచ్చు... సత్వరం గమ్యం చేరాలన్న ఆత్రుత కావొచ్చు– మితిమీరి వెళ్తూ చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు హరికృష్ణ దుర్మరణం పాలైన ప్రాంతాన్ని గమనిస్తే అలాంటిచోట ప్రమాదం జరగటం ఆశ్చర్యం కలిగించదు. ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవటం, అతి వేగంతో వాహనాన్ని నడపటం, అదే సమయంలో పక్కనున్న వాటర్ బాటిల్ అందుకోవటానికి ప్రయ త్నించటం ప్రాణం మీదికి తెచ్చి ఉండొచ్చుగానీ, సరిగ్గా అక్కడే ఉన్న ప్రాణాంతక మలుపు కూడా ఈ విషాదానికి దోహదపడిందని అర్ధమవుతుంది. అక్కడ తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మలుపు ఉన్నచోట, పాదచారులు రహదారులు దాటేచోట స్పీడ్ బ్రేకర్లు నిర్మించటం, ఆ ప్రదేశానికి చాలా ముందే తగిన సంఖ్యలో హెచ్చరిక బోర్డులుంచటం అత్యవసరం. ఊళ్ల మధ్య నుంచి రహదారి పోతుంటే అండర్‌పాస్‌లను నిర్మించటం, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయటం చాలా ముఖ్యం. స్పీడ్ గన్ల ద్వారా వేగనియంత్రణ కూడా అవసరం. ఇవన్నీ లేకపోగా ఆ రహదారులపై మార్కింగ్‌లు వేయటంతో తమ పని పూర్తయిందన్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. నిర్దిష్ట ప్రాంతంలో తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రోడ్డు డిజైన్‌లో ఏం సవరణలు చేయాలో అధ్యయనం చేసే వ్యవస్థ ఉంటే ఆ ప్రమాదాలను నిరోధించవచ్చు. వీటి విష యంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగి ఆప్తులను కోల్పో యిన పలువురు ప్రముఖులు ప్రాణాంతకంగా మారిన ఇలాంటి లోపాలను ఎత్తిచూపిన సందర్భా లున్నాయి. కానీ ఫలితం ఏదీ? రెండేళ్లక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి 12 నిమిషాలకో మరణం, పదిమందికి గాయాలు, ఏటా 30 శాతంమందికి అంగవైకల్యం సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే మొదటి పది రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ చోటు సంపాదించాయి. ప్రమాదాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఇవన్నీ తక్షణ చర్యలకు పురిగొల్పి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగేది కాదు. హరికృష్ణకు డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉంది. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని ‘చైతన్యరథం’ వాహనంపై సుడిగాలిలా చుట్టుముట్టినప్పుడు ఆ వాహనానికి ఆయనే సారథి. అంత అనుభవశాలి సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం విచారకరం. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే నిరుడు రోడ్డు ప్రమాదాలు 3 శాతం తగ్గాయని రహదార్ల భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిలో 2016లో 1,50,935మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే... 2017నాటికి ఆ సంఖ్య 1,46,377కి తగ్గింది. తెలంగాణలో 2016లో 7,219మంది దుర్మరణం పాలైతే, నిరుడు ఆ సంఖ్య 6,595కి తగ్గింది. మన రోడ్ల స్థితిగతులెలా ఉన్నాయో గమనించకుండా అధిక సామర్ధ్యం గల ఇంజన్లున్న అత్యాధునిక వాహనాలను వెనకా ముందూ చూడకుండా ఇక్కడి మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి అనుమతించటం కూడా ప్రమాదాలకు మూల కారణం. ఇప్పుడొచ్చే వాహనాల గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్ల మేరకు చేరుకుంది. కారులో ప్రయాణించేవారికి ఈ వేగం తీవ్రత తెలియదు. బ్రేక్ వేయాల్సివచ్చినప్పుడు మాత్రమే పరిస్థితి అర్ధమవుతుంది. కానీ అప్పటికే నష్టం జరిగిపోతుంది. వాహనాల్లో అత్యవసర సమయాల్లో బెలూన్లు తెరుచుకునే వ్యవస్థ సక్రమంగా ఉందో లేదో చూడటం, వాహనాన్ని నడిపేవారు సీటు బెల్టు ధరించారో లేదో చూసి హెచ్చరించటం వంటివి పకడ్బందీగా అమలు కావాలి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై వివిధ రకాలుగా తీసుకుంటున్న చర్యల పర్యవసానంగా ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలొస్తున్నాయి. వీటిని జాతీయ రహదార్లకు సైతం వర్తింపజేయటం ఎలాగన్న విషయాన్ని ఆలోచించాలి. రహదార్లపై ప్రమాదాలు నివారించటానికి రహదారి భద్రత సంఘం ఏర్పాటు చేయాలని ఏడాదిక్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వైద్య, రవాణా, పోలీసు, ఆర్ అండ్ బీ అధికా రులు భాగస్వాములుగా ఉంటారని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటికీ దానికొక స్వరూపం ఏర్పడలేదు. ఈ సంఘం ఉనికిలోకొస్తే ప్రమాదాల నివారణకు అదెంతో దోహదపడుతుంది. సురక్షితమైన డ్రైవింగ్ విషయంలో హరికృష్ణ అందరినీ తరచు హెచ్చరిస్తూ చైతన్యవంతుల్ని చేయ డానికి ప్రయత్నించేవారు. ముఖ్యంగా తన కుమారుడు జానకిరామ్ నాలుగేళ్లక్రితం రోడ్డు ప్రమా దంలో మరణించాక ఆయన పదే పదే ఈ జాగ్రత్తలను ప్రస్తావించేవారు. సహృదయుడిగా, స్నేహ శీలిగా, నిష్కపటిగా పేరు తెచ్చుకున్న హరికృష్ణ అకాల మరణం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు... ప్రతి ఒక్కరికీ ఆవేదన కలిగిస్తోంది. -
కన్నీరు పెట్టుకున్న కృష్ణంరాజు
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ పార్థీవ దేహానికి సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు నివాళులు అర్పించారు. హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. సినీ, రాజకీయ రంగం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ స్వయంకృషితో ఎదగాలనుకునే తత్త్వం కలవాడన్న కృష్ణంరాజు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.. నందమూరి హరికృష్ణ మానవీయ, సామాజిక విలువలు కలిగిన వ్యక్తి అని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
ఎన్టీఆర్‌కు రథసారథిగా హరికృష్ణ చరిత్రలో నిలిచిపోతారు
-
ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం
-
బాలకృష్ణ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు రథసారథిగా నందమూరి హరికృష్ణ చరిత్రలో నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుడిని, పార్టీలో ముఖ్య నేతను కోల్పోయామన్నారు. హరికృష్ణ నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారని గుర్తు చేశారు. నమ్మబుద్ధి కావడం లేదు: బాలకృష్ణ హరికృష్ణ లేరన్న విషయం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సోదరుడు సంస్కృతి, సంప్రదాయం, బంధుత్వానికి ప్రాధాన్యం ఇచ్చే వారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ లేకపోవడం తమ కుటుంబానికి తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. రెండు రోజులు సంతాప దినాలు నందమూరి హరికృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని ప్రకటించింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. -
హరికృష్ణ హఠాన్మరణంపై చలించిపోయిన సిమ్రాన్
సాక్షి, చెన్నై : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయనతో రెండు చిత్రాలు చేశానని, సెట్లో ఆయన అందరితో కలివిడిగా అభిమానంగా ఉంటారని తెలిపారు. తన కుటుంబం అంటే హరికృష్ణకు చాలా అభిమానమన్నారు. ఆయన మృతి చిత్రసీమకే కాదు ఆయనను అభిమానించే వారందరికీ తీరనిలోటేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. షాక్ గురయ్యా : రాధికా శరత్ కుమార్ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యానని సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చాలా బాధ కలిగింది : సిమ్రాన్ కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు నటి సిమ్రాన్ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం చాలా బాధకలిగించిందని ఆమె అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టిన సీతయ్య సినిమాలో ఆయనకు జోడిగా సిమ్రాన్ నటించిన సంగతి తెలిసిందే. -
నిమ్మకూరు: హరికృష్ణ చదివిన స్కూలు
-
హరికృష్ణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్
-
హరికృష్ణకు నివాళులర్పించిన సినీ,రాజకీయ ప్రముఖులు
-
ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాజీ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవచేశారని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. హరికృష్ణ మృతిపట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘నా మిత్రులు కళ్యాణ్ రాం, ఎన్టీఆర్‌ల తండ్రి హరికృష్ణ మరణం చాలా బాధాకరం. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి కోరిక, ఏపీ సూచనల మేరకు అంత్యక్రియలపై నిర్ణయం జరిగింది. రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే అధికారులు మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నార’’ని తెలిపారు. -
హరికృష్ణకు ప్రముఖులు నివాళులు
-
గుండె బద్దలవుతోంది: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో తన గుండె బద్దలవుతోందని టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కన్నీటి పర్యంతమయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన అనంతరం ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మోత్కుపల్లి మీడియాతో పంచుకున్నారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు 1982లో హరికృష్ణను తొలిసారి కలిసానని గుర్తు చేసుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లినపుడు హరికృష్ణ అక్కడే ఉన్నారని, ఆ సందర్భంగా కలిసానన్నారు. ఆనాడు నీతికి అవినీతికి జరిగిన ప్రజాసంరక్షణ పోరులో ఎన్టీఆర్ మార్పు కోసం తలపెట్టినటువంటి యుద్దంలో రథసారధిగా ఉన్న మహానాయకుడు హరికృష్ణ అని మోత్కుపల్లి కొనియాడారు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్న అప్పటి పరిస్థితుల్లో కొన్ని వేల కిలోమీటర్లు రథాన్ని నడిపించి ఎన్టీఆర్‌గారి విజయానికి కృషి చేశారన్నారు. ఏ యుద్దానికైనా రథసారధి కావాలని, అలాంటి రథసారధి హరికృష్ణేనని తెలిపారు. తమంతా ఎమ్మెల్యేలు, మంత్రులు కావడానికి కారణం ఎన్టీఆర్ అని, ఆయనకు మద్దతుగా నిలిచింది మాత్రం హరికృష్ణ అని తెలిపారు. అన్ని రకాలుగా ఎన్టీఆర్‌ను మెప్పించారన్నారు. అలాంటి నేత మరణం బాధను కలిగిస్తోందన్నారు. వాహనం నడపాల్సింది కాదు.. ఈ వయసులో ఆయన వాహనం నడపాల్సింది కాదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఏ మానసిక ఒత్తిడికి లోనయ్యాడో.. ఏ దురదృష్టం వెంటాడిందో పాపం అంటూ మోత్కుపల్లి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇటీవల కుమారుడు కూడా మరణించాడని, అదే బాధతో ఉండి ఉంటాడని చెప్పారు. రాజకీయాల్లో కూడా కొంచెం వెనకకు జరిగినట్లు తెలుస్తోందని, దీంతోనే ఆయనకు మానసిక ఒత్తిడి నెలకున్నట్లు అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, శోకసంధ్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ -
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం : జీవితా రాజశేఖర్
కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు జీవిత రాజశేఖర్‌లు సంతాపం తెలిపారు. ‘హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేరంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. హరికృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’ అన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో నెల్లూరు జిల్లాలో ఓ వివాహవేడుక వెళ్తున్న హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
హైదరాబాద్ చేరుకున్న హరికృష్ణ భౌతిక కాయం