నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఈ రోజు(బుధవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతిచెందిన సంగతి తెల్సిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా..ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.