అతివేగం, సీటుబెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు... మరో నలుగురు యువకుల జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చేసింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హరికృష్ణ కారు (నంబరు 2323) అదుపు తప్పి అన్నేపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారు(నంబరు 6000)ను ఢీకొట్టింది.ఈ ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితో పాటు కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించిన పోలీసులు... వీరిని కూడా ఆస్పత్రిలో చేర్చి వైద్య సదుపాయం కల్పించారు. కానీ హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన తర్వాత తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.