హరికృష్ణ దాదాపు 30అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన హరికృష్ణను 5నిమిషాల్లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగమే ప్రమాదానికి కారణం’ అని ఎస్పీ పేర్కొన్నారు.