రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ అభిమానులు సైతం హరికృష్ణ మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టిన హరికృష్ణ వాహనం గాల్లో పల్టీలు కొడుతూ అవతలి వైపున పడిపోయింది. ఈ సమయంలో హరికృష్ణ కారులో నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో రోడ్డు పక్కన పడిపోయిన హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు.