హరికృష్ణ మరణం : సమంతను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు | Nandamuri Harikrishna Death Samantha Trolled By Twitter Followers | Sakshi
Sakshi News home page

హరికృష్ణ మరణం : సమంతను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Published Wed, Aug 29 2018 1:19 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

Nandamuri Harikrishna Death Samantha Trolled By Twitter Followers - Sakshi

సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం మరణించారు. ఈ సందర్భంగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. వారిలో సమంత కూడా ఉన్నారు. హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్‌ ఆమెకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ముందు ‘పెద్దవారిని గౌరవించడం నేర్చుకో’ అంటూ నెటిజన్లు సమంతను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. విషయం ఏంటంటే సమంత తొలుత 'రిప్ హరికృష్ణ' (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ ట్వీట్‌ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్‌లో ఆమె హరికృష్ణను 'గారు' అని సంబోధించ లేదు. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

పొరపాటు గుర్తించిన సమంత.. దాన్ని సరిదిద్దుకునేందుకు నానాపాట్లూ పడింది. దాంతో ఆమె ముందు చేసిన ట్వీట్‌ని డిలీట్‌ చేసి, 'రిప్ హరికృష్ణ గారూ' అంటూ మరో ట్వీట్‌ చేసింది. అంతేకాక ప్రస్తుతం తాను చెన్నైలో ఉన్నానని, ఓ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్లానని కూడా చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది. కానీ అప్పటికే సమంత చేసిన రెండు ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement