
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం పట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు ట్విట్టర్‌లో కూడా స్పందిస్తూ.. ‘నందమూరి హరికృష్ట హఠాన్మరణంతో షాక్‌కు గురయ్యాను. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోస్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’అని జగన్ ట్వీట్ చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.