
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్రాత్తేయ కుమారుడు వైష్ణవ్ ఆకస్మిక మృతి పట్లు పలువురు సంతాపం తెలిపారు. గతరాత్రి వైష్ణవ్ గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ...‘దత్తాత్రేయ ఇంటికి ఎన్నో సందర్భాలలో వచ్చాను కానీ ఈ రోజు ఈ రకంగా ఆయనను కలవడం చాలా బాధాకరం. ప్రపంచంలో అతి పెద్ద దుఃఖం పుత్రశోకం. భగవంతుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అని తెలిపారు. మరోవైపు సినీనటుడు హరికృష్ణ...బండారు దత్తాత్రేయకు సంతాపం తెలిపారు. కాగా బండారు వైష్ణవ్ అంత్యక్రియలు సైదాబాద్‌లోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంనగర్‌లోని స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment