condolence
-
భారతీయ చిత్రసీమలో ఆయనొక లెజెండ్ : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగళ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. ‘‘భారతీయ చిత్రసీమలో ఒక లెజెండ్ శ్యామ్ బెనగల్(Shyam Benegal). చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన కృషి లక్షలాది మంది దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. శ్యామ్ బెనగల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.Deeply saddened by the passing of Shyam Benegal Ji, a legend in Indian cinema. His contributions to filmmaking continue to inspire millions of directors. May his soul rest in peace. pic.twitter.com/mw92JPkZFV— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2024హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్ బెనెగల్.. ఎన్నో కళాత్మకచిత్రాలను(Art Films) తెరకెక్కించారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నిన్న(డిసెంబర్ 23, 2024) సాయంత్రం 6గంటల 38నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. బెనెగల్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ.శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో పూర్తయ్యాయి. -
జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తుదిశ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.జాకీర్ హుస్సేన్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణించటం బాధ కలిగించింది. సంగీత విద్వాంసుడు అయిన జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
రతన్ టాటా మృతికి మంత్రిమండలి నివాళి
సాక్షి, అమరావతి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప దాతృత్వ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌తో రతన్ టాటాను సత్కరించిందని కొనియాడారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారన్నారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను వాయిదా వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయలుదేరి వెళ్లారు. దేశానికి తీరని లోటు: పరిశ్రమల శాఖ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఘన నివాళి అర్పించింది. మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో రతన్ టాటాకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా తన జీవితం చివరి వరకు విలువలు పాటించి ఎంతో సాధారణ జీవితం గడిపారన్నారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అడిషనల్ ఏవీ పటేల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విప్లవ వీరుడు రావికి కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని, పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డికి ఘన నివాళి అర్పించారు. ఆయన స్వగ్రామం బొల్లేపల్లి, బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి భవన్‌తో పాటు ఆయన నివాసంలో ఆయన కోడలు రావి ఊర్మిల, మనుమరాలు రావి ప్రతిభా రెడ్డిలు నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ప్రతిభా రెడ్డి మాట్లాడుతూ..‘రావి నారాయణరెడ్డి స్వయంగా తన భూమిని దానం చేయటంతో పాటు అదే భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ భూమి కోసం రైతాంగ పోరాటాన్ని నడిపిన తీరును జ్ఞాపకం చేసుకున్నారు. రావి నారాయణరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట గాధలను ఈ తరానికి తెలియచెప్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల సంతాపం లైవ్ అప్డేట్స్.. కేసీఆర్ సంతాపం..👉ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..👉రాజకీయాల్లో అజాత శత్రువు ధర్మపురి శ్రీనివాస్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి👉ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్సీఎం రేవంత్ సంతాపం.. 👉ధర్మపురి శ్రీనివాస్ పట్ల సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం..👉 ఈరోజు చాలా బాధాకరమైన రోజు. శ్రీనివాస్‌కు కాంగ్రెస్ అంటే ప్రాణం. మాలాంటి ఎంతోమంది ఎదుగుదలకి ధర్మపురి శ్రీనివాసే కారణం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తన్నాం. 👉కాంగ్రెస్ నేతల నివాళులు..కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ సేవలు గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వారి కుటుంబసభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డీఎస్ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి.హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.👉కిషన్ రెడ్డి సంతాపం..ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీజేపీ ఎంపీ అరవింద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.👉డీఎస్ మృతి బాధాకరం: డీకే అరుణడీఎస్ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చిన డీకే అరుణ. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివి. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. 👉డీ శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే, నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. 👉తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. -
రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి తదితరులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.వెంకయ్యనాయడు.. చేపట్టిన ప్రతీ పనిలో రామోజీరావు విజయంసాధించారుప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వపడేలా చేశారుఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయిరామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాకేటీఆర్జర్నలిజానికి గుర్తింపుగా చిరకాలం నిలిచారుఫిిల్మ్సిటీ నిర్మాణం రామోజీరావుకే సాధ్యమైందిఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినటుడు రజినీకాంత్నా గురువు, నా శ్రేయోభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాపాత్రికేయ రంగంలో, సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావురాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారునా జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉందిఆయన నాకు మార్గదర్శకుడు, నాకు స్ఫూర్తి ప్రదాతఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాచంద్రబాబురామోజీరావు మరణం పట్ల చంద్రబాబు సంతాపంఫిల్మ్సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులురామోజీ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారురామోజీరావు మరణం చాలా బాధాకరం: చంద్రబాబురామోజీరావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థతెలుగు జాతి కోసం అహర్నిశలు కృషిచేశారుప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కృషి చేసేవారుఎప్పుడూ ప్రజల పక్షంగానే నిలబడతానని ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారుఆయన సమాజహితం కోసం పని చేశారుచిత్రపరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించారురామోజీరావు లాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధగా ఉందిమరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రామోజీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.రామోజీరావుకు సినీ ప్రముఖులు సంతాపంఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ‘ఓం శాంతి’. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్ వేదికగా చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. రజనీకాంత్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా రామోజీరావుకి సంతాపం తెలిపారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది 🙏💔 🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024I am deeply saddened on hearing the demise of my mentor and well wisher Shri Ramoji Rao Garu. The man who created history in Journalism, Cinema and a great kingmaker in Politics. He was my guide and inspiration in my life. May his soul rest in peace. @Ramoji_FilmCity— Rajinikanth (@rajinikanth) June 8, 2024శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm— Jr NTR (@tarak9999) June 8, 2024Deeply saddened by the passing of Ramoji Rao Garu, a visionary always ahead of his time. Ramoji Film City is a testament to his brilliance and passion for cinema. His legacy will continue to inspire us all. My thoughts and prayers are with the family and loved ones. May his soul…— Mahesh Babu (@urstrulyMahesh) June 8, 2024Ramoji Rao garu was a true visionary whose revolutionary work in Indian media has left an unforgettable legacy. His contributions to journalism and cinema have inspired so many. He will be missed dearly. Heartfelt condolences to his loved ones. May his soul rest in peace 🙏🏻 pic.twitter.com/YKEDaEHeCT— Venkatesh Daggubati (@VenkyMama) June 8, 2024 -
విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం
గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్. యాక్షన్ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్ ఓ సంచలనం -
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
-
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం -
చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023 ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. చదవండి: టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే! -
జర్నలిస్ట్ ఆనంద్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. -
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
తాడి సన్యాసినాయుడు మృతిపట్ల సభ సంతాపం
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా సుపరిచితులు. చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగర్‌గా నిరాడంబరమైన తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా ఆయన పలు తెలుగు, తెలుగు దినపత్రికల్లో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం జగన్ సంతాపం సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. ► కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చలు వారి అభిప్రాయాలు అద్భుతం . నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా :::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి ► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు, టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. :::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం ► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం . పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . ::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
గద్దర్ మరణంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
అందరినీ ఆకట్టుకునే రచనలవి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ కథా రచయిత, పాత్రికేయుడు శ్రీరమణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. శ్రీరమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారాయన. ఆయన మానవత్వం, వ్యంగ్య రచనలు అందరినీ ఆకట్టుకున్నాయని, మిథునం లాంటి మంచి సినిమాకు రచయితగానే కాకుండా.. అనేక కథలతో అందర్నీ అలరించారని గుర్తు చేశారు సీఎం జగన్. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ.. మంగళవారం వేకువ ఝామున కన్నమూసిన సంగతి తెలిసిందే. శ్రీరమణ స్వస్థలం గుంటూరు జిల్లా, వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. పేరడీ రచనలకు పేరుగాంచిన కామరాజ రామారావు(శ్రీరమణ).. బాపు-రమణ(ముళ్ళపూడి వెంకటరమణ)లతో కలిసి పని చేశారు. పలు పత్రికలకు కాలమిస్ట్‌గా, సంపాదకుడిగా, నవలా రచయిత, సినీ రచయితగానూ ఆయన సాహిత్య రంగానికి సేవలందించారు. శ్రీ రమణ తన హస్య రచనకు గానూ 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం స్వీకరించారు. ఇదీ చదవండి: మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్‌తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్‌కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్/ ప్రకాశం: తెలుగు సాహిత్యంలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి(84) గారు ఇకలేరు. సోమవారం వేకువ ఝామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందించే యత్నం చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేతు విశ్వనాధ రెడ్డి మృతికి పలువురు వక్తలు, రచయితలు సంతాపం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేతు విశ్వనాథరెడ్డి (84).. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురం స్వస్థలం. సాహితీ, విద్యావేత్తగా కేతు విశ్వనాథరెడ్డి పేరొందారు. రాయలసీమ మాండలికానికి సాహితీ గౌరవం తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. కేతు విశ్వనాథరెడ్డి కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు ఆయన డాక్టరేట్ పొందారు. జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. కడప, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అధ్యాపకుడిగా విశిష్ట సేవలందించారు. ఒకప్పుడు కడప కేంద్రంగా సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెలకువలు నేర్చుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి పలు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే నవలలు వెలువరించారు. రాయలసీమ మాండలికంలో సాగిన ఈయన రచనలు మట్టి పరిమళాన్ని వెదజల్లాయి. ఈయన రాసిన అనేక కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఉద్యోగ విరమణ అనంతరం పుట్టిన గడ్డపై మమకారంతో కడపకు చేరుకున్నారు. కడప నగరంలో భార్యతో కలిసి సింగపూర్ టౌన్షిప్లో ఉంటున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ ఉదయం గుండెపోటురాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్‌బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్‌బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్‌బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్‌బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్‌బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్‌బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్‌బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
ఆయన గొప్ప నాయకుడు: ప్రధాని మోదీ సంతాపం
చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ (95) ఇక లేరు. చాలారోజులుగా మొహాలీలోని ఓ ఫోరి్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఏడాది జనవరిలో కరోనా బారినపడి కోలుకున్నారు. గ్యాస్రై్టటిస్, బ్రాంకియల్ ఆస్తా్మతో బాధపడుతూ గత ఏడాది జూన్‌లో మళ్లీ చికిత్స పొందారు. బాదల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడు, ఉన్నత రాజనీతిజ్ఞుడు అని కీర్తించారు. పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఎన్నో సంక్షోభాల నుంచి పంజాబ్‌ను గట్టెక్కించారంటూ మోదీ ట్వీట్ చేశారు. బాదల్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐదుసార్లు పంజాబ్ సీఎం 👉 బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. 👉 లాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 👉 గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్‌గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. 👉 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్‌పై మళ్లీ గెలిచారు. 👉 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు. 👉 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. 👉 గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా.. ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి. 👉ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. 👉 ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. (Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రెండో ఛార్జ్‌షీట్.. మనీష్ సిసోడియా పేరు..) -
రవ్వా శ్రీహరి కన్నుమూతపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి(80) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడు, సాహితీవేత్త అయిన రవ్వా శ్రీహరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు సీఎం జగన్. మరోవైపు రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ వీసీగా పని చేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. టీటీడీలోనూ ఆయన కొంతకాలం పని చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా వెల్వర్తిలో ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు శ్రీహరి. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు. హైదరాబాద్ మలకపేట యశోద ఆసుపత్రి ఎదురుగా వున్న జడ్జెస్ కాలనీలోని రుక్మిణి అపార్టుమెంట్లో ఆయన నివాసం ఉంది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్, కిషన్‌రెడ్డి సహా పలువురి సంతాపం
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. - సాయన్న మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి కేటీఆర్ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. - మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. -
కళాతపస్వికి తెలుగులో నివాళులు అర్పించిన ఇళయరాజా, వీడియో రిలీజ్..
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్‌కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! pic.twitter.com/blfTwMxHWW — Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023