![AITF President Acharya CMK Reddy Condolence To Director PC Reddy Death - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/5/pc-reddy.jpg.webp?itok=aSH1HyvK)
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి(ఆచార్య సీఎంకే రెడ్డి) సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘నెల్లూరు జిల్లాలో జన్మించి పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేధావి చంద్రశేఖరరెడ్డి. ఈయన దర్శకత్వం వహించిన 93 చిత్రాల్లో 55 చిత్రాలు కృష్ణగారితోనే తీయడం విశేషం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment