
ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కుటుంబానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సంతాపం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతి బాధకరమన్నారు. ఆయన కోర్టు బీట్ చూస్తుండేవాడని.. ఒక మంచి ఆఫీసర్‌ను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి)
ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన పిల్లల చదువులు మొత్తం ఓ ఎన్‌జీఓ చూసుకుంటుందని, ఆయన భార్యకు ఉద్యోగం కలిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం కరోనాతో యుద్ధం చేస్తున్నామని, ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా పోలీసు స్టేషన్‌కు పబ్లిక్ వచ్చేటప్పుడు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులకు ఆయన సూచించారు. (ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment