CP Hyderabad
-
కరోనా: కానిస్టేబుల్ మృతికి సీపీ సంతాపం
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కుటుంబానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సంతాపం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతి బాధకరమన్నారు. ఆయన కోర్టు బీట్ చూస్తుండేవాడని.. ఒక మంచి ఆఫీసర్‌ను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి) ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన పిల్లల చదువులు మొత్తం ఓ ఎన్జీఓ చూసుకుంటుందని, ఆయన భార్యకు ఉద్యోగం కలిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం కరోనాతో యుద్ధం చేస్తున్నామని, ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా పోలీసు స్టేషన్‌కు పబ్లిక్ వచ్చేటప్పుడు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులకు ఆయన సూచించారు. (ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు) -
పోలీసుల సేవలు అభినందనీయం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో పోలీసుల సేవలు అభినందనీయమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన లాక్డౌన్ నేపథ్యంలో విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన పోలీసులకు ప్రోత్సాహకాలు, గుర్తింపు ప్రతాలు అందజేశారు. ఈస్ట్‌జోన్‌కు సంబంధించిన పోలీసులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. పోలీసులను సత్కరించడం ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా గౌరవం దక్కుతుందన్నారు. అన్ని జోన్లలో పనిచేస్తున్న పోలీసులందరిని సత్కరిస్తామని పేర్కొన్నారు. చెక్‌పోస్ట్ విధులు నిర్వహించడం చాలా కష్టతరమని.. ఒక్కో షిఫ్ట్‌లో 4 వేలకు పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని సీపీ అంజనీకుమార్ తెలిపారు.