last breath
-
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్‌లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్‌ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్‌లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
బాలీవుడ్లో విషాదం.. జిమ్ చేస్తూ సల్మాన్ ఖాన్ డూప్ మృతి
సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే కన్నుమూశారు. శుక్రవారం ఉదయం సాగర్ పాండే జిమ్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడి ట్రైయిర్ వెంటనే ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. సాగర్ పాండే మృతిపట్ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు సల్మాన్ పోస్ట్ షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. చదవండి: రాజమౌళి డైరెక్షన్లో నటించను: చిరంజీవి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా ‘భాయిజాన్’ మూవీ సెట్లో సాగర్ పాండేతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్ షేర్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశాడు. అలాగే బాలీవుడ్ సినీ సెలబ్రెటిలు, నటీనటులు సైతం సాగర్ పాండే మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా సాగర్ పాండే సల్మాన్‌కు డూప్‌గా దాదాపు 50 చిత్రాల్లో నటించారు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యింది. నిన్న(సెప్టెంబర్ 28) సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు. చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్, ఆయన భార్య నమ్రత శిరొద్కర్, సితారలు సోషల్ మీడియా వేదికగాఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ముఖ్యంగా సితార షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్ యూ సో మచ్ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది సితార. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్ అకేషన్ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
తాను ఊపిరొదిలి, ఇతరులకు ప్రాణభిక్ష
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సోమనహళ్లి తండాకు చెందిన రక్షిత (17) బ్రెయిన్‌డెడ్ కాగా, ఆమె అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, శ్వాసకోశం, కిడ్నీలు, మూత్రకోశ, కళ్లు తదితర 9 అవయవాలను సేకరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. గుండెను 9 ఏళ్లు బాలునికి అమర్చారు. తద్వారా ఆమె ఊపిరి వదులుతూ పలువురికి ప్రాణం నిలిపింది. విద్యార్థుల కన్నీటి నివాళి శ్వాసకోశాన్ని చెన్నైకి తరలించగా, మూత్రపిండాలను మంగళూరుకు పంపారు. కళ్లను చిక్కమగళూరు ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఆమె నుంచి సేకరించిన 9 అవయవాలను 9 మందికి అమర్చవచ్చని వైద్యులు తెలిపారు. ఆదివారం బస్సు దిగుతూ కింద పడిన రక్షిత బ్రెయిన్ డెడ్ కావడం తెలిసిందే. గురువారం ఉదయం చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు ఆమె దేహం నుంచి అవయవాలను సేకరించి భద్రపరిచారు. తరువాత రక్షిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం బసవనహళ్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి తీసుకెళ్లి విద్యార్థుల అంతిమ దర్శనం కోసం ఉంచారు. విద్యార్థులు, బోధన సిబ్బంది రక్షితకు కన్నీటి నివాళులు అర్పించారు. రక్షిత తల్లిదండ్రుల మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిస్వార్థంగా అవయవదానం చేసి పలు కుటుంబాలకు సాయం చేశారని సోషల్ మీడియాలోనూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: రూ. 35 కోట్లు విలువ చేసే విగ్రహం..అమెరికాలో ప్రత్యక్షం) -
విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా గత నెల ఆగస్ట్‌లో జిమ్ చేస్తూ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో జిమ్ ట్రైయినర్ శ్రీవాత్సవను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా శ్రీవాత్సవ యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి(43) అలియాస్ రవిప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. రవిప్రసాద్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. కాగా ఫేమస్ రచయిత డాక్టర్ హెచ్ఎస్ ముద్దెగౌడ కుమారుడే ఈ మాండ్య రవి. ఆయన కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో సైతం పలు సీరియల్స్‌లో నటించారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన పలు సీరియల్స్‌లో ఆయన గుర్తింపు పొందారు. డైరెక్టర్ టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన మహామయి సిరీయల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన రవిప్రసాద్ ‘చిత్రలేఖ’, ‘వరలక్ష్మి’, ‘ముక్కత ముక్త’, ‘యశోదే’ వంటి సీరియల్స్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ -
కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి
‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆయన మనతో లేరు అనేది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ‘ఎప్పుడు కనిపించిన జయప్రద ఎలా ఉన్నావంటూ చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలుపు ఇప్పటికీ నా చేవుల్లో మారుమ్రోగుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన అనారోగ్యంతో తరచూ ఆస్పత్రికి వెళుతు వస్తున్నారని తెలుసు, ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్పత్రికి నుంచి ఆయన తిరిగి వస్తారనుకున్నాం’ అంటూ ఆమె వెక్కెక్కి ఏడ్చారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. తాండ్ర పాపరాయుడు, భక్త కన్నప్ప వంటి ఎన్నో చిత్రాలు చేసి ఈ రోజు రెబల్ స్టార్‌గా నిలిచారు. ఆయన కూతుళ్లు ఇంకా చిన్నపల్లలు. వారికి, ఆయన సతిమణికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, కేంద్రమంత్రి ఆయన ఎదిగిన ఎత్తులు సాధారణమైనవి కాదు. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన రారాజుగా వెళ్లిపోయారు’ అంటూ జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..! -
ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. మెల్బోర్న్లో బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కారు క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. ఘటనకు కారణమైన 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. నిర్వేయర్ సింగ్ తాను పని చేస్తున్న కార్యాలయానికి కారులో బయలుదేరారు. మెల్బోర్న్లోని బుల్లా డిగ్గర్స్ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనక నుంచి ఢికొట్టింది. చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ ఈ ఘటనలో ఆయన కారు పూర్తిగా ధ్వంసం కాగా నిర్వేయర్ సింగ్ ఘటన సమయంలో మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. పంజాబ్‌కు చెందిన నిర్వేయర్ సింగ్ సింగింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు 9 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన పంజాబీ సింగర్‌గా, ర్యాపర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఆయన పాడిన పలు పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి కూడా. ఇక ఆయన మృతిపై ఫ్యాన్స్, ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: యువ నటి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. బాబురాజ్ ఆకస్మిక మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు మాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా బాబురాజ్‌కు భార్య సంధ్య, కుమారుడు బిషన్లు ఉన్నారు. ఆయన సినిమాల విషయానికి వస్తే.. బాబూరాజ్ ‘త్రిస్సూర్‌లో డ్రామా స్కెచ్’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు. బాబూరాజ్ ఆండ్రాయిడ్ కుంజప్పన్, సీఐఏ, మాస్టర్ పీస్, గుండా జయన్, బ్రేకింగ్ న్యూస్, మనోహరన్ ,అర్చన 31 నాటౌట్ వంటి మలయాళ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన పనిచేశారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటుడు హఠాన్మరణం
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శరత్ కొచ్చిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. శరత్ హఠాన్మరణంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్ ప్రముఖ మాలీవుడ్ నటుడు ఆంటోనీ వర్గీస్ పెపే సోషల్ మీడియా వేదికగా శరత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. కాగా శరత్ చంద్రన్.. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట ఐటీ సంస్థలో పనిచేసిన శరత్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో అనిస్య సినిమాతో సినీ నటుడిగా అరంగేట్రం చేశాడు. లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్‌లో శరత్ కీలక పాత్ర పోషించాడు. -
‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్, సీనియర్ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్‌గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘గాడ్ ఫాదర్’ నటుడు మృతి
గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమల్లో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. వారి మరణవార్త నుంచి బయటపడక ముందే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ కాన్(82) శుక్రవారం కన్నుమూశారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో నివాసం ఉంటున్న జేమ్స్ నేడు ఉదయం తుదిశ్వాస విడిచనట్లు ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చదవండి: ‘ఏంటీ.. మహేశ్ సినిమాకు పూజా కండిషన్స్ పెట్టిందా?’ ‘బుధవారం (జూలై 6) సాయంత్రం జిమ్మీ కన్నుమూశారనే విషయాన్ని తెలియజేయడానికి మేం చింతిస్తున్నాం’ అని జేమ్స్ ఫ్యామిలీ ట్వీట్ చేసింది. అలాగే ఆయన మేనేజర్ స్పందిస్తూ ‘జేమ్స్ చాలా గొప్పవాడు. చాలా సరదాగా ఉంటారు. అందరితో ప్రేమగా ఉండే ఆయన ఇకలేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని పార్థిస్తున్నా’ అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్ చిత్రంతో గుర్తింపు పొందిన జేమ్స్ కాన్ మిజరీ, ఎల్ఫ్ వంటి తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు పలుమార్లు ఆయన ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. చదవండి: హీరో విక్రమ్‌కు గుండెపోటు James Caan. Loved him very much. Always wanted to be like him. So happy I got to know him. Never ever stopped laughing when I was around that man. His movies were best of the best. We all will miss him terribly. Thinking of his family and sending my love. pic.twitter.com/a0q8rCP1Yl — Adam Sandler (@AdamSandler) July 7, 2022 -
టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చలన చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) మృతిచెందారు. నిన్న ఫిలిం ఎడిటర్ గౌతమ్ రాజు హఠాన్మరణం మరువకముందే నిర్మాత రాజేంద్ర ప్రసాద్ మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చదవండి: నటి ఖుష్బూకు కీలక బాధ్యతలు దీంతో నిర్మాత మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా మాధవి పిక్చర్స్ బ్యానర్లో దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి తదితర చిత్రాలను నిర్మించారు ఆయన. అంతేకాదు ప్రముఖ దివంగ నిర్మాత రామానాయడుతో కలిసి పలు చిత్రాలకు సహా నిర్మాతగా గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. -
గుండెపోటుతో ప్రముఖ సీనియర్ నటుడు మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సలీం గౌస్(70) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంలో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆయన అరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనిత సలీం తెలిపారు. సలీం మృతికి బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చదవండి: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం కాగా సిలీం గౌస్ హిందీ, బెంగాలిలో పలు సీరియల్స్‌లో నటించిన ఆయన బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఆయన అంతం, రక్షణ, ముగ్గురు మొనగాళ్లు వంటి తదితర చిత్రాల్లో నటించారు. ఇక బాలీవుడ్లో సలీం గౌస్ ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు. ‘సారాంశ్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషీ హాజిర్ హో, త్రికాల్, అఘాత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్, వెల్ డన్ అబ్బా’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. వీటితో పాటు సౌత్‌లోను ఆయన పలు సినిమాలు చేశారు. 1993లో మణిరత్నం ‘తిరుడా తిరుడా’లో ప్రతికథానాయకుడిగా నటించారు. చదవండి: హీరోల మధ్య ట్వీట్ల వార్, బాలీవుడ్ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్ -
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
Hero Nikhil Father Passed Away: యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: ‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్‌ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్‌తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. -
డైరెక్టర్ కుమారుడు మృతి, తాగొద్దని మందలించడంతో ఆత్మహత్య
Director Girish Malik Son Commits Suicide: హోలీ పండగ నాడు ప్రముఖ దర్శకుడు, నటుడు గిరీశ్ మాలిక్ ఇంట తీవ్రి విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం గిరీశ్ మాలిక్ తనయుడు మన్నన్(17) ప్రమాదవశాత్తూ ఐదో అంతస్థు నుంచి కింద పడి మరణించాడని 'టొర్బాజ్' నిర్మాత రాహుల్ మిత్ర ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం మద్యం మత్తులో మన్నన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం హోలీ ఆడుతూ మద్యం సేవించిన మన్నన్ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర కూడా తాగుతుండటంతో తండ్రి గిరీశ్ అతడిని మందలించాడు. చదవండి: Girish Malik: దర్శకుడి ఇంట విషాదం, ఐదో అంతస్థు నుంచి.. తాగుడు మానేయాలని చెప్పడంతో మన్నన్ కోపంతో తండ్రితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు మన్నన్ తల్లితో దురుసుగా ప్రవర్తించడంతో ఆమె కోపంతో వంట గదిలోకి వెళ్లిపోయింది. గిరీశ్ కొడుకుతో గొడవ అనంతరం తన రూంకు వెళ్లిపోయాడు. ఇక మన్నన్ కూడా 5వ అంతస్తులోకి తన గదికి వెళ్లినట్లు సమాచారం. పైకి వెళ్లాక కోపంతో మరింత రగిలిపోయిన మన్నన్ కిటికి తలుపులు పగలగొట్టి కిందికి దూకేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అలా చేస్తే ‘గాడ్ ఫాదర్’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్ కండిషన్! పెద్ద శబ్ధం వినిపించడంతో గిరీశ్ బయటకు వచ్చి చూడగా మన్నన్ రక్తం మడుగులో కనిపించాడు. ఇక హుటాహుటిన అతడిని ముంబైలోని కొకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మన్నన్ తుదిశ్వాస విడిచాడు. శనివారం సాయంత్రం సిద్ధార్థ్ ఆసుపత్రిలో అతడి మృతదేహానికి పోస్ట్‌మార్ట్ జరగగా.. నేడు ముంబైలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా గిరీజ్ 2013లో 'జల్' సినిమాతో దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'టొర్బాజో', 'మాన్ వర్సెస్ ఖాన్' సినిమాలు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి. -
ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం
ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి గాయత్రి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హోలీ వేడుకలో భాగంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె మరికొద్ది క్షణాల్లోనే జీవచ్చవంలా మారడంతో ఆమె సన్నిహితులు, సహానటినటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త తెలిసి యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్, శ్రీహాన్ సహా పలువురు సోషల్ మీడియా వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నటి సురేఖ వాణి సైతం ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాయత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో నటి మృతి.. ప్రమాదానికి కారణం అదేనా ? ఈ మేరకు సురేఖ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది. నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నా. ప్లీజ్ తిరిగి రా గాయత్రి. మనం మంచి పార్టీ చేసుకుందాం. నీతో ఇంకా ఎన్నో షేర్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. తిరిగి రా తల్లి..! ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లలేవు. ఇది సరైన సయమం కాదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మిస్ యూ.. డాలీ’ అంటూ సురేఖ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సురేఖ, ఆమె కూతురు సుప్రితలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో తెలిసిందే. తరచూ రిల్స్ చేస్తూ, పార్టీలు, పబ్‌లు, టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ఈ మధ్య గాయత్రి సురేఖ, సుప్రితలతో క్లోజ్ అయ్యింది. చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం దీంతో వారితో కలిసి పార్టీలు చేసుకోవడం, రిల్స్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన గాయత్రిని ఓ నెటిజన్ సురేఖ వాణి గురించి అడగ్గా.. ‘తను నాకు సెకండ్ మదర్ లాంటిది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అదే ఫొటో పోస్ట్‌ను సురేఖ పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా గాయంత్రి శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి కారులో విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై పల్టీ కొట్టింది. దీంతో గాయత్రి ఆ పక్కనే రెస్టారెంట్లో గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మద్యం సేవించి కారు నడపడం, అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం(61) గుండెపోటుతో కేరళలో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి మాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖు, సహా నటీనటులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఈ క్రమంలో మలయాళ నటుడు, స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ అయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు నివాళులు అర్పిస్తూ హీరో పధ్వీరాజ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రదీప్ కేఆర్ తన కెరీర్లో 70కి పైగా చ్రితాల్లో నటించారు. తెలుగులో సైతం ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఏం మాయ చేశావేలో జార్జ్ అంకుల్ ప్రదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రాజా రాణి చిత్రంలో కూడా ఓ పాత్ర పోషించారాయన. Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022 -
తెలుగులో బప్పి లహరి పాడిన చివరి పాట ఇదే..
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్ 27న బెంగాల్‌కు చెందిన బ్రహ్మాణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు అలొకేష్ లహరి. సినిమాల్లోకి వచ్చాక బప్పి లహరిగా మారిన ఆయన సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ పాటతో ఓ ఊపు ఊపిన ఈ బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత బాలీవుడ్‌ను తన సంగీతంతో శాసించారు. తెలుగులోనూ ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. 1986లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బప్పి ఆ తరువాత తెలుగులో ఎన్నో బంపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. తండ్రి అపరేష్, తల్లి బన్సూరి ఇద్దరూ మ్యుజీషియన్స్, సింగర్స్ కావడంతో.. ఆటోమేటిక్‌గా బప్పీ లహరి కూడా మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. బప్పీ తెలుగులో 1987లో త్రిమూర్తులు, 1989లో స్టేట్‌రౌడీ, 1991లో గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, 1993లో నిప్పు రవ్వ, 1995లో బిగ్ బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం సినిమాలకు మ్యూజిక్ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చివరిగా తెలుగులో ఆయన 2020లో వచ్చిన రవితేజ డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ రాక్ స్టైల్లో పాటను పాడారు ఆయన. -
Kim Mi Soo: ప్రముఖ ‘స్నోడ్రాప్’ నటి అనుమానాస్పద మృతి
Snowdrop Series Actress Kim Mi Soo Died At Age 29: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్ మీ సూ(Kim Mi-soo) ఆకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. 29 ఏళ్ల కిమ్ మీ సూ సౌత్ కొరియాలోని తన ఇంటిలో బుధవారం అనూమానస్పదంగా కన్నుమూసినట్లు అక్కడ స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ‘స్నో డ్రాప్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన కిమ్ సూ హఠ్మారణం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా.. దీంతో ఆమె మృతికి కొరియన్ నటీనటులతో పాటు ప్రపంచ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా గతేడాది జనవరి 28న నటి సాంగ్ యూ జంగ్(26) మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కొరియన్‌కు చెందిన చాలా మంది సినీ తారలు 30 ఏళ్లలోపే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన అక్కడ నటీనటులలో చాలా మంది 30 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం. -
పీసీ రెడ్డి మృతికి ఆచార్య సీఎంకే రెడ్డి సంతాపం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య తరపున ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి(ఆచార్య సీఎంకే రెడ్డి) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘నెల్లూరు జిల్లాలో జన్మించి పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేధావి చంద్రశేఖరరెడ్డి. ఈయన దర్శకత్వం వహించిన 93 చిత్రాల్లో 55 చిత్రాలు కృష్ణగారితోనే తీయడం విశేషం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
అత్యంత ఆప్తుడిని కోల్పోయా: సూపర్ స్టార్ కృష్ణ
Supers Star Krishna Condolence To Director Death: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) సోమవారం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సూపర్ స్టార్ కృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాదు పీసీ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు పీసీ రెడ్డి. అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డిగారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు, ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం అత్తలు-కోడళ్లు’లో హీరోగా నేను నటించాను. రెండవ చిత్రం ‘అనురాధ’లో కూడా నేనే హీరో. మా ఇద్దరి కాంబినేషన్లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం’ మంచి హిట్స్. మా పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. అలాగే నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు కూడా పీసీ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. ‘నా బాల్యం నుంచి చూసిన దర్శకుడు పిసీ రెడ్డిగారు. పద్మాలయ సంస్థలో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరవలేదనిది. సాక్షి దినపత్రిక అంటే పీసీ రెడ్డికి ఎంతో ఇష్టం’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం చెన్నైలో ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు పీసీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులు అర్పించారు. -
విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి
Tollywood Director P Chandra Shekar Reddy Died: ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి (పి. చంద్రశేఖరరెడ్డి) ఇకలేరు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో చెన్నైలో టీ నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. పీసీ రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. సొంత ఊరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామం. 1933 అక్టోబర్ 15న పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకులు వి. మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావుల చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. దర్శకుడిగా మారాక ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు తదితర స్టార్స్‌తో సినిమాలు తెరకెక్కించారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ దర్శకుడిగా ఆయన అంగీకరించిన తొలి చిత్రం ‘అనురాధ’ (1971). కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందింది. అయితే ఇది మూడో చిత్రంగా విడుదలైంది. అదే ఏడాది కృష్ణతో ‘అత్తలు – కోడళ్లు’, శోభన్‌బాబు హీరోగా ‘విచిత్ర దాంపత్యం’ చిత్రాలు తెరకెక్కించారు. విశేషం ఏంటంటే... ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు (1971, ఏప్రిల్ 14) విడుదల కావడంతో పాటు దర్శకుడిగా మంచి పేరు తెచ్చాయి. ఇక మాస్ హీరోగా ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయన హీరోగా పీసీ రెడ్డి తెరకెక్కించిన ‘బడి పంతులు’ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్‌ని వృద్ధ బడిపంతులుగా చూపించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆయన సరసన కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. కృష్ణతో పీసీ రెడ్డిది ప్రత్యేక అనుబంధం. కృష్ణతో 20 పై చిలుకు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘పాడి పంటలు’, ‘పచ్చని కాపురం’ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఏసు ప్రభువు పాత్రలో కృష్ణతో ‘శాంతి సందేశం’ కూడా తెరకెక్కించారు. ఇంకా కృష్ణతో పాటు ఇతర స్టార్స్‌తో పీసీ రెడ్డి చేసిన చిత్రాల్లో ‘భలే అల్లుడు’, ‘మానవుడు – దానవుడు’, ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పట్నవాసం’, ‘అన్నా చెల్లెలు’, ‘పెద్దలు మారాలి’ వంటివి ఉన్నాయి. పీసీ రెడ్డి కెరీర్లో నాలుగైదు సినిమాలు ఆగిపోయినవి ఉన్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా ఆరంభమైన ‘చిన్న పులి – పెద్ద పులి’ ఒకటి. పీసీ రెడ్డి చివరి చిత్రం ‘జగన్నాయకుడు’. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత విశేషాలతో భానుచందర్, రాజా, మమత తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. పలు పౌరాణిక, సాంఘిక టీవీ సీరియల్స్ కూడా తెరకెక్కించారు. కృష్ణతో చేసిన ‘అన్నయ్య’ సీరియల్ మంచి హిట్. 40 ఏళ్లకు పైబడిన కెరీర్లో 75 సినిమాల వరకూ దర్శకత్వం వహించారాయన. పీసీ రెడ్డి భార్య కొంతకాలం క్రితం కన్ను మూశారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు శ్రీదేవి, అనురాధ. పీసీ రెడ్డి భౌతిక కాయానికి దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, తమిళ దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, నటుడు వైభవ్ తదితరులు నివాళులర్పించారు. కాగా పీసీ రెడ్డి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం చెన్నైలోని కొట్టూరుపురంలోని శ్మశానవాటికలో జరిగాయి. -
ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి
youtube Star shreya Muralidhar(27) Last Breath Due To Cardiac Arrest: ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శ్రియా మురళిధర్(27) మృతి చెందారు. సోమవారం(డిసెంబర్ 7) రాత్రి గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. నిన్న అర్థరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానికి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణంచినట్లు వైద్యలు స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా మురళీధర్… యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించేది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ ఇక ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది. ‘వాట్ ద ఫన్’ అనే యూట్యూబ్ ఛానల్లో ఆమె చేసిన వీడియోలు.. నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వెండితెరపై కనిపించాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా చనిపోవడం పలువురి బాధిస్తోంది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. కాగా శ్రీయా మృతి పట్ల యూట్యూబ్ స్టార్ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Shreya Muralidhar Ambala! (@shreyamuralidhar__) -
సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా?
Mohan Babu Explains Why He Not Attend Sirivennela Sitarama Sastry Cremation: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అక్షర శిల్పికి టాలీవుడ్ కన్నీటీ వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదలివచ్చి ఆయనకు తుది వీడ్కోలు చెప్పారు. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, రాజశేఖర్, తివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్, వరుణ్‌సందేశ్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్, శివబాలాజీ, నరేశ్, జగపతిబాబుతో సహా నటీనటులు, క్యారెక్టర్ అర్టిస్టులతో పాటు సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హజరై నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎలాంటి సమస్యలు వచ్చిన, ప్రముఖులు మరణించిన ముందుగా అక్కడ ఉండేది మంచు కుటుంబమే. ఏ కార్యక్రమైన విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబం తప్పకుండా హజరవుతారు. అలాంటిది తెలుగు పాటకు కోట కట్టిన సిరివెన్నెల వంటి వ్యక్తి మరణిస్తే మోహన్ బాబు, ఆయన కుటుంబం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఏమైంది, మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదంటూ పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మూవీ ఈవెంట్లో పాల్గోన్న మోహన్‌బాబు దీనిపై వివరణ ఇచ్చాడు. చదవండి: నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు ‘సిరివెన్నెల మరణంతో ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.. ఇటీవల మా ఇంట్లో నా సొంత తమ్ముడు మృతి చెందిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల గారు చనిపోయిన రోజే నా తమ్ముడి పెద్దకర్మ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు బయటికి వెళ్లకూడదు. అందుకే సిరివెన్నెల భౌతికకాయం చూడడానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పా. ఆ కారణంగానే ఆయన చివరికి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సినిమా పరిశ్రమలో ఇలా వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు మృతి
Actor Shivaram Passed Away: సినీ పరిశ్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ శివరాం(83) కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 30న ఇంట్లో పూజ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు రీత్యా వైద్యులు ఆయనకు సర్జరీ చేయకుండా చిక్సిత అందిస్తూ వచ్చారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు(డిసెంబర్ 4) తుదిశ్వాస విడిచారు. కాగా 6 దశాబ్ధాలుగా ఆయన వందలకు పైగా కన్నడ సినిమాలో నటించారు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నగరహావు, శుభమంగళ్ చిత్రాలతో శివరాం పాపులర్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో బిగ్‌బి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. -
అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన
Kiran Abbavaram Pens Emotional Post On His Brother Death: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబర్ 1) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక సోదరుడిని తలచుకుంటూ హీరో కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోదరుడు గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తన సోదరుడు గురించి కిరణ్ రాసుకొచ్చిన ఈ భావోద్వేగభరితమైన పోస్ట్ చదవుతుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. హీరో సోదరుడు మృతి ‘‘ఒరేయ్ కిరా.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా’’ అని మా అన్నయ్య రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైనదానికంటే ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదా, సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోపు తను లేకుండా పోయాడు. ‘అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా?’ అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామనుకున్నా. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ‘రాజావారు రాణిగారు’ మూవీతో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీకి సొంతంగా స్క్రిప్ట్ రాసి హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరం ఇటూ హీరోగా, అటూ సినీ రచయితగా ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి హఠాన్మరణం తనకు తీరనిలోటు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
టాలీవుడ్లో విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి
Tollywood Producer Jakkula Nageswara Rao Died In Road Accident: టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీల మరణాన్ని జీర్ణించుకోకముందే నిర్మాత నాగేశ్వరావు మృతి టాలీవుడ్‌ను మరింత విషాదంలోకి నెట్టింది. ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మాత నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత మృతికి సినీ నటీనటులు, దర్శక-నిర్మాతలు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వరుసగా చిత్రపరిశ్రమకు చెందిన వారు మృతి చెందుతుండటం టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు. -
సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా?
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’ అంటూ మొదలైన తన ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాలను అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ.. అంటూ భక్తిభావం కలిగించాడు. అర్ధశతాబ్దపు అజ్ఞాన్ని స్వతంత్రం అందామా అంటూ.. అగ్నిజ్వాలలను రగలించే పాటలను రాశారు. తెల్లారింది లెగండొయ్ అంటూ స్ఫూర్తిని నింపారు. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ ప్రేమగీతాలను రాశారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కేవలం ఒక్క జోనర్‌కు అని పరిమితం కాకుండా సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వంలో ఎన్ని విభాగాలు ఉంటే అన్నింటిలోనూ పాటలను రాసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ కెరీర్లో 3వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెలకు కొన్ని రకాల పాటలు రాయడం అస్సలు నచ్చదట. ఎంత డబ్బు ఇచ్చిన సరే అలాంటి పాటలు రాసేవాడు కాదట. ఈ విషయాన్ని సిరివెన్నెల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలను రాయడం తనకు ఇబ్బందిగా ఉంటుందని సిరివెన్నెల ఓ సందర్భంలో తెలిపారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు ‘సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలపై నన్ను పాటలు రాయమని చెప్పొద్దని డైరెక్టర్లు, నిర్మాతలకు చెప్పేవాడిని. నా అనుభూతుల్ని మాత్రమే పాటలుగా రాస్తాను. కఠినమైన పాట రాసేంత భాష నాకు రాదు. నాకు అష్టైశ్వర్యాలు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. ఇది నా పాట అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా నా పాటలు ఉండాలనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనైన నా పాటల్లో స్త్రీని కించపరచను. సినిమాలో ఆ పాత్ర ఎలాంటిది అయినా సరే అవమానిస్తూ రాయడం నాకు ఇష్టం ఉండదు. నా పాటల్లో శృంగార రచనలు చేస్తాను.. కానీ అవి కుటుంబ సభ్యులతో కలిసి వినగలిగేలా ఉంటాయి. అంతేతప్ప అంగాంగ వర్ణనలు మాత్రం చేయను. ఇక కుర్రకారును రెచ్చగొట్టే పాటలు అస్పలు రాయను’ అంటూ ఆయన చెప్పకొచ్చారు. -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
శివశంకర్ మాస్టర్: ‘కురువి కూడు’ చిత్రంతో డ్యాన్స్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(నవంబర్ 28) ఆయన తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్ సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు. ఏడాది వయసులోనే ఓ ప్రమాదంలో తన వెన్నుముక దెబ్బతినడంతో 8 ఏళ్లు మంచానికే పరిమితమైన ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా ఎలా మారారో తెలుసుకుందాం.ఏడాది వయసులోనే వెన్నుముకకు గాయం కావడంతో ఏనిమిదేళ్లు మాస్టర్ మంచానికి పరిమితయ్యారు. దీంతో ఆయన తండ్రి మాస్టర్‌కు ట్యూషన్ పెట్టించారు. ఇక మాస్టర్ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి వాటిపై శివ శంకర్ మాస్టర్‌కు ఆసక్తి నెలకొంది. ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలనే పట్టుదల ఆయనలో పెరిగిపోయింది.దాంతో తనంతట తానే డ్యాన్స్ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అలా 1974లో డ్యాన్స్ మాస్టర్ సలీమ్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు శివశంకర్. అప్పటికి సలీమ్ మాస్టర్ సినిమా పరిశ్రమలో పేరున్న కొరియోగ్రాఫర్. ఆరేళ్ల పాటు అసిస్టెంట్‌గా చేసి... ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా మారారు శివ శంకర్. అక్కడి నుంచి వరుసగా ‘సాటై్ట ఇల్లాద పంబరం’, ‘మన్ వాసనై’, ‘ఎన్ ఆసై మచ్చాన్’, ‘పూవే ఉనక్కాగ’ తదితర తమిళ చిత్రాలకు చేశారు. అప్పటికి శివ శంకర్ మాస్టర్ హవా మొదలైంది. శివ శంకర్ స్టెప్పులను తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న తరుణంలో తెలుగు పరిశ్రమ దృష్టి కూడా ఆయనపై పడింది. ‘ఖైదీ’లో చిరంజీవి, మాధవిలతో ‘రగులుతోంది మొగలి పొద..’ అంటూ శివ శంకర్ మాస్టర్ చేయించిన డ్యాన్స్ సూపర్ హిట్. ‘అమ్మోరు’ (1995), ‘దొంగ దొంగది’ (2003), ‘అల్లరి పిడుగు’ (2005).. ఇలా వరుసగా తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ కొరియోగ్రాఫర్ అయిపోయారు. ‘దొంగ దొంగది’లో మనోజ్, సదాతో ‘మన్మథ రాజా మన్మథ రాజా..’ పాటకు శివ శంకర్ మాస్టర్ మంచి మాస్ స్టెప్స్.. అది కూడా స్పీడ్ స్టెప్స్ వేయించారు. అలాగే ‘అరుంధతి’ (2009)లో క్షుద్ర మాంత్రికుడు సోనూ సూద్‌ని అంతం చేయడానికి అనుష్కతో ‘భు భు భుజంగం.. ది ది తరంగం....’ అంటూ డ్రమ్స్ డ్యాన్స్ చేయించిన తీరు అద్భుతం. ఇందుకు పూర్తి భిన్నంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ (2009)లో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్‌తో ‘ధీర ధీర ధీర మనసాగలేదురా..’లో స్టయిలిష్ రొమాంటిక్ స్టెప్ట్స్ వేయించారు. ఈ స్టెప్సే ఆయనకు ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలోనే కాదు.. దక్షిణాదిన పలు భాషల్లో కొరియోగ్రాఫర్‌గా చేసిన రికార్డ్ శివ శంకర్‌ది. పది భాషల్లో సుమారు 800 చిత్రాల్లో 15వేలకు పైగా పాటలకు నృత్యదర్శకుడిగా చేశారు. నటుడిగానూ...శింబు, త్రిష నటించిన ‘అలై’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ క్యారెక్టర్‌తో నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు ఆయన. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన ‘వరలారు’లో అజిత్‌కు డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా శివ శంకర్ నటించారు. బాల దర్శకత్వంలో వచ్చిన ‘పరదేశి’లో ఓ కీలక పాత్ర చేశారు. ఇక తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘నీను వీడని నీడను నేనే’, ‘రాజుగారి గది 3’ చిత్రాల్లో తనదైన శైలి నటనతో మాస్టర్ మెప్పించారు. ఇతర భాషా చిత్రాలోన్లూ నటించారాయన. బుల్లితెరపై కూడా ఇటు యాక్టింగ్‌లోనూ, అటు డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగాను సత్తా చాటారు. తెలుగులో ‘నాగభైరవి’, ‘నెంబర్ 1 కోడలు’ సీరియల్స్‌తో పాటు తమిళ సీరియల్ ‘జ్యోతి’లోనూ నటించారు. శివ శంకర్ మాస్టర్‌కు భార్య సుకన్య, ఇద్దరు కుమారులు (విజయ్, అజయ్) ఉన్నారు. కుమారులిద్దరూ కొరియోగ్రాఫర్లుగా చేస్తున్నారు. -
శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా?
Shiva Shankar Master Last Wish: ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ (72) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనుటుల, హీరోలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ శివ శంకర్ మాస్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్, మంచు విష్ణుతో పాటు పలువురు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 80కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. అలాంటి మాస్టర్ తన చివరి శ్వాస వరకు పని చేయాలని ఆకాంక్షించారు. మరణం కూడా తనకు షూటింగ్‌లోనే రావాలని, సినిమా సెట్లోనే తను కన్నుమూయాలనేది మాస్టర్ కోరిక. ఈ విషయాన్ని తరచూ ఆయన తన సన్నిహితులతో పాటు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చేవారు. దీన్ని బట్టి ఆయన వృత్తిని ఎంత ప్రేమించి ఉంటారో ఊహించుకోండి. 2009లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి కొరియోగ్రఫి అందించిన శివ శంకర్ మాస్టర్ ఈ మూవీకిగాను జాతీయ పురస్కారం అందుకున్నారు. -
కరోనాతో ప్రముఖ నటి మాధవీ మృతి
Actress Madhavi Gogate Died Due To Coronavirus: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ప్రముఖ సినీ, టీవీ నటి మాధవీ గోగటే(58) కన్నుమూశారు. మరాఠి చిత్ర పరిశ్రమకు చెందిన నటి మాధవి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి బాలీవుడ్ టీవీ, సినీ పరిశ్రమకు చెందని పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి కాగా మాధవీ పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో తల్లి పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ‘ఘన్ చక్కర్’లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ‘తుజా మాజా జంటాయ్’ అనే మరాఠీ సీరియల్ బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా’ వంటి సీరియల్స్ నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్ -
‘దునియా’ విజయ్ ఇంట మరో విషాదం
ప్రముఖ నటుడు, కన్నడ హీరో ‘దునియా’ విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవల ఆయన తల్లి కూడా మరణించిన సంగతి తెలిసిందే. విజయ్ తండ్రి రుద్రప్ప వయోవృద్ధ సమస్యలతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందతున్న ఆయన నిన్న(గురువారం) తుదిశ్వాస విడిచారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా ఈ రోజు వారి స్వగ్రామం అనేకల్ తాలుకా కుంబారహళ్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కాగా విజయ్ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే ఆయన తండ్రి కూడా మరణించడంతో విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అయితే కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. -
మరో విషాదం, ప్రముఖ నటి కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి కోజికోడ్ శారద(84) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు సోమవారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పోందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో మంగళవారం(నవంబర్ 9) ఉదయం తుదిశ్వాస విడిచారు. శారద మృతి పట్ల కేరళ ఫిల్మ్స్ అండ్ కల్చరల్ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ అలాగే మలయాళ సినీ పరిశ్రమకు స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్‌తో పాటు పలువురు నటీనటులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం ఆమె స్వస్థలమైన కోజికోడ్‌లో శారద అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. మలయాళ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శారద, రంగస్థలంపై తన నటన జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ‘అంగక్కురి’ చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా నటిగా రాణించిన ఆమె దాదాపు 90కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే పలు మలయాళ టీవీ సీరియల్స్‌లో కూడా శారద నటించారు. Rest in peace 🙏 pic.twitter.com/aR4DyQLP5e — Prithviraj Sukumaran (@PrithviOfficial) November 9, 2021 -
పునీత్ మరణంపై అవమానకర పోస్టులు, యువకుడి అరెస్ట్
Bengaluru Man Arrested For Offensive Comments On Puneeth rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. అభిమానులు ఇంకా ఈ వార్తను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక పునీత్ కుటుంబ సభ్యుల ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 29) పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పుకు నివాళులు అర్పిస్తుంటే.. మరికొందరూ ఆకతాయిలు ఆయన మరణంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! మద్యం సీసాతో పునీత్ మరణాన్ని అపహస్యం చేస్తూ రిత్విక్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ వరుస పోస్టులు పెట్టాడు. అది గమనించిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషన్ కమల్ పంత్ స్పందిస్తూ.. ‘ఇప్పటికే ఓ యువకుడిని అరెస్టు చేశాం. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్లో వెల్లడించారు. కాగా శుక్రవారం పునీత్ గుండెపోటుతో మృతి చెందిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన విషయం విధితమే. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక అలాగే నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. దీనిపై నిందితుడు మద్యం సీసాను చేతిలో పట్టుకొని ‘రేపటి నుంచి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మద్యం తాగి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర.. ’అంటూ అవమానకర రీతిలో పోస్ట్ పెట్టాడు. దీంతో పునీత్ ఫ్యాన్స్ సదరు నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The accused has been arrested and further legal action is being taken. https://t.co/uIEHFryfUk — Kamal Pant, IPS (@CPBlr) November 1, 2021 -
పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
Puneeth Rajkumar Home Inside CCTV Video Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా దైవంలా ఆరాధించే తమ అప్పు ఇకలేరనే చేదు నిజాన్ని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది. కర్ణాటకలో ఏ వీధి, ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అప్పును గుండెపోటు ఎలా బలి తీసుకుందంటూ అభిమానులు రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: 50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి అప్పు ఆసుపత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో ఇది. ఈ క్రమంలో తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో చాలా యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. చివరి క్షణాలు ఇవే అంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోలో అప్పుని చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం డాక్టర్ దగ్గరకు కారు ఎక్కిన పునీత్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే జీవచ్ఛవంలా మారారని తలుచుకుంటుంటే కన్నీరు ఆగడం లేదు. కాగా ఆ రోజు వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీసేవరకూ ఆయన యాక్టివ్గానే ఉన్నారట. అయితే ఈసీజీ రిపోర్ట్‌లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో పునీత్ చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారట. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు పరిస్థితి చేజారిపోయింది. చదవండి: పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం(అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికి పునీత్ మరణాన్ని అభిమానులతో పాటు నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. ఇక సోషల్ మీడియాలో పునీత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అక్కినేని హీరో నాగార్జున ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం పునీత్ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. శివరాజ్‌తో కాసేపు మాట్లాడి ఓదార్చారు. కాగా ఆయన అంత్యక్రియలకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వెంకటేశ్, శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువుకు తెలుగు హీరోలు హజరైన సంగతి తెలిసిందే. -
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం
Puneeth Rajkumar Last Movie James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఇదిలా ఉంటే పునీత్ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి. చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’! మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్’ షూటింగ్ చివరి దశకు చేరుకోగా..మరో చిత్రం ద్విత్వ డిసెంబర్లో సెట్స్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోందట. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జేమ్స్ మూవీలో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. దీని కోసమే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక జేమ్స్ మూవీ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. ఆయన మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి కావడంతో ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: పునీత్ రాజ్‌కుమార్: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో.. అంతా బాగానే ఉన్న ఆయన వాయిస్ డబ్బింగ్ దగ్గరే అసలు చిక్కొచ్చి పడిందట. పునీత్ వాయిస్ కాకుండా వేరే వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిస్తే.. అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఫ్యాన్స్‌ను నొప్పించకుండా పునీత్ వాయిస్‌తోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అధునాత టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట చిత్ర బృందం. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్కాలజీతో ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్‌కుమార్ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్ చేసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. 2022 మార్చి 17న పునీత్ పుట్టినరోజు వరకు జేమ్స్ మూవీ పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. -
పునీత్ రాజ్‌కుమార్ మృతి.. పూరి జగన్నాథ్ భావోద్వేగం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని శాండల్‌వుడ్ సినీ ప్రుముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సెలబ్రెటీలు సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పునీత్ మృతిపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పందించారు. ఆయన మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. ‘చావు అనేది ఊహించలేనిది అని తెలుసు. కానీ పునీత్ మృతి మాత్రం షాక్‌కు గురి చేసింది. పునీత్ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. తనతో ‘అప్పు’ మూవీ తీశాను. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు, ఎందరికో సాయం చేశారు. ఆయన చాలా మంచి వారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్ గారు లేరు, ఆయన తల్లి పార్వతమ్మ కూడా పోయారు.. ఇప్పుడు పునీత్ మృతి తట్టుకోలేకపోతున్నా. పునీత్‌ది చాలా చిన్న వయసు. అంతలోనే ఆయన కన్నుయూయడం జీర్ణించుకోలేకపోతున్నా. ఇటీవల నాకు ఫోన్ చేసి మాట్లాడారు.. చాలా సరదాగా మాట్లాడుకున్నాం. త్వరలోనే కలుద్దామని కూడా చెప్పారు. ఎప్పుడు సరదాగా ఉంటే వ్యక్తి మరణించడం ఆయన కుటుంబానికే కాదు భారత సినీ పరిశ్రమకు సైతం బిగ్ లాస్. లవ్యూ పునీత్, రియల్లీ ఐ మిస్ యూ’ అంటూ పూరి జగన్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’! -
పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది జరిగిన సంఘటనలను చూస్తుంటే. అగ్ర కథానాయకుడైన పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ, రాజ్‌కుమార్ గుండెపోటుతోనే చనిపోయారు. అలాగే ఆయన సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్లే శివరాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆయన జిమ్‌లో అతిగా కష్టపడటం తగ్గించారు. ఇక నేడు అదే కారణంతో పునీత్ రాజ్‌కుమార్ మరణించడం బాధాకరం. చదవండి: మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే.. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 54 ఏళ్ల వయసులో జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తుండగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌కు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయనకు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన జిమ్‌లో తక్కువగా కనిపిస్తారు. కానీ పునీత్ రాజ్‌కుమార్ మాత్రం ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడుపుతారని తాజాగా వైరల్ అవుతున్న తన జిమ్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్.. ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరోగా పేరు కూడా ఉంది. జిమ్‌లోనే కాదూ షూటింగ్ కోసం ఎక్కడికెళ్లినా వర్కౌట్స్ మాత్రం వదలరట. ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. ఇందుకోసం బాడీ బిల్డర్‌గా తనని తాను మేకోవర్ చేసుకునేందుకు జిమ్‌లో ఓవర్‌గా ఎక్స్ర్సైజులు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ డేంజర్ స్ట్రోక్ పునీత్‌ను బలితీసుకుంది. భారత సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. -
పునీత్ రాజ్‌కుమార్: కళ్లు దానం చేసిన కన్నడ సూపర్ స్టార్
Puneeth Rajkumar Eyes Donated: భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46) మరణ వార్తతో అందరి గుండెలు బరువెక్కాయి. కన్నడనాట ఎక్కడ చూసిన అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. చిన్న వయసులో తమ అభిమాన హీరో, సహానటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇది నిజం కాదు.. ప్లీజ్ తిరిగి రా అప్పు’ అంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చనిపోయిన కూడా మరొకరి ద్వారా ఈ లోకాన్ని చూడనున్నారు. ఈ సూపర్ స్టార్ తన కళ్లను దానం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాన్స్ సోషల్ మీడియా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా ఈ రోజు ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. -
మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లు, నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. ఇదిలా ఉంటే గతంలో ఆయన భవిష్యత్తు గురించి, చావు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పునీత్.. ‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇది చూసిన వారంత ‘అప్పుడు ఆయన తెలియదు ఈ రోజు మనకు దూరం అవుతారని, అయ్యో.. దేవుడా ఈ చేదు వార్తను నమ్మలేకపోతున్నాం. ఈ వార్త నిజం కాకూడదు.. ప్లీజ్ పునీత్ తిరిగి రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
మహేశ్ మరణవార్త విని షాకయ్యా, నమ్మలేకపోతున్నా: కల్యాణ్ రామ్
టాలీవుడ్ నిర్మాత, ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్లానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్ పరిశ్రమ షాక్ గురయ్యింది. మరీ ముఖ్యంగా నందమూరి హీరోలు జూనీయర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్‌లు ఆయన మరణవార్తకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. \ చదవండి: టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి ఇప్పటికే మహేశ్ మృతిపై ఎన్టీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మహేశ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నానని, మాటలు రావడం లేదు.. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ ఎమోషన్ ఆయ్యారు. తాజాగా ఆయన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ సైతం సోషల్ మీడియా వేదికగా భావోద్వేనికి గురయ్యారు. మహేశ్ మృతిపై ఆయన ట్వీట్.. అవును ఇది నమ్మలేకని వార్త. షాక్‌కు గురయ్యాను. మా స్నేహితులు, కుటుంబానికి అంత్యంత దగ్గరి వ్యక్తి, వెల్ విషర్ అయిన మహేశ్ కోనేరు ఇక లేరు. ప్రతి విషయంలో ఆయన మాకు వెన్ను దన్నుగా నిలిచారు. చదవండి: నా గుండె బరువెక్కింది, నమ్మలేకపోతున్నా: జూ. ఎన్టీఆర్ ఆయన మా కుటుంబానికి వెన్నుముకగా నిలిచారు. ఆయనను కొల్పోవడం వ్యక్తిగతంగా నాకు, సినీ పరిశ్రమకు పెద్ద నష్టం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు, స్నేహితులు శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. కాగా గత కొంతకాలంగా మహేశ్ కోనేరు జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా వారి వ్యక్తిగత విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నందమూరి ఫ్యామిలీకి అంత్యంత సన్నిహితులయ్యారు. Absolutely shook and in disbelief. A man who is a friend, family and well wisher is no more. Mahesh Koneru garu has been our backbone no matter what. Huge loss to me personally and the whole industry. Strength to his near and dear ones. pic.twitter.com/I8RbQNNRpH — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 12, 2021 -
నా గుండె బరువెక్కింది, నమ్మలేకపోతున్నా: జూ. ఎన్టీఆర్
Film Producer Mahesh S. Koneru: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి అలాగే మహేశ్ మృతిపై జూ. ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ. ‘బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు. నా స్నేహితుడు మహేశ్ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా మహేశ్ ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు, కల్యాణ్ రామ్‌లకు పీఆర్ఓ వ్యవహరిస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ‘118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాత కూడా మారారు. మొదట ఒక సాధారణ జర్నలిస్ట్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన మహేశ్ ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్‌గా ఎదిగారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు With the heaviest of heart and in utter disbelief, I am letting you all know that my dearest friend @SMKoneru is no more. I am shell shocked and utterly speechless. My sincerest condolences to his family and his near and dear. pic.twitter.com/VhurazUPQk — Jr NTR (@tarak9999) October 12, 2021 -
టాలీవుడ్లో విషాదం: జూ. ఎన్టీఆర్ మేనేజర్, నిర్మాత మృతి
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేశ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా ఎంతోకాలంగా జూ. ఎన్టీఆర్‌కు మహేశ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ‘118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా మారారు. Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest today in Vizag. Om Shanthi pic.twitter.com/sxCmJxag13 — BA Raju's Team (@baraju_SuperHit) October 12, 2021 -
విషాదం: ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ లెజెండరి నటుడు, జాతీయ అవార్డు గ్రహిత నెడుముడి వేణు(73) సోమవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాలేయ వ్యాధి సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చదవండి: కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా.. ఇక ఆయన మరణవార్త విన్న ఆయన సహా నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పార్వతిలతో పాటు మలయాళం, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా నెడుముడి వేణు సినిమా విషయానికి వస్తే.. ఆయన చిన్న థియేటర్ ఆర్టిస్ట్‌గా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) ఇక 1978లో జీ అరవిందన్ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన తెలుగులోకి డబ్ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. తన అద్భుత నటనతో ఆకట్టుకునే ఆయన మూడు నేషనల్ అవార్డ్స్‌తో పాటు 7 రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూత
ప్రముఖ నటుడు, ‘రామయణ్’ ఫేం అరవింద్ త్రివేది(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ టీవీ, సినీ నటీనటుల సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా అరవింద్ త్రివేది ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ సీరియల్లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్ 1980లో వచ్చిన ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఇటీవల ఫస్ట్ లాక్డౌన్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్ ‘రామాయణ్’ను పున:ప్రసారం చేసింది. 2020 ఏప్రిల్ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్‌కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. చదవండి: ఆర్యన్ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్ తండ్రి అయితే గతంలో అరవింద్ కరోనా మృతి చెందినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ స్పందించారు. అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు అరవింద్ మృతి వార్తను కూడా ఆయన వెల్లడించారు. కాగా ఈ సీరియల్లో రావణుడిగా అరవింద్ త్రివేదీ నటించగా అరుణ్ గోవిల్.. రాముడిగా, సునీల్ లాహిర్.. లక్ష్మణ్‌గా, దీపిక చిఖిలియా.. సీతగా నటించారు. View this post on Instagram A post shared by Sunil Lahri (@sunil_lahri) -
నిన్న తల్లి మరణం, నేడు బర్త్‌డే... అక్షయ్ భావోద్వేగం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేటితో 54వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇవాళ (సెప్టెంబర్ 9) ఆయన బర్త్‌డే. కానీ ఆయన కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగింది. బుధవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున అక్షయ్ మాతృమూర్తి అరుణ భాటియా మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించిన తెల్లవారే తన జన్మదినం కావడంతో అక్షయ్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం ఈ సందర్భంగా తల్లి తన చెంపపై ముద్దు పెడుతున్న ఫొటోను గురువారం షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. కానీ అమ్మ పైనుంచి నా కోసం కచ్చితంగా హ్యాపీ బర్త్‌డే పాట పాడుతుందని తెలుసు! మీ అందరి సంతాపం, విషెస్‌కు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా అక్షయ్ తన తల్లితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సందర్భంగా లండన్‌కు తీసుకెళ్లి వీల్ చైర్‌పై తల్లితో అక్కడి రోడ్లపై సందడి చేసిన వీడియోను కూడా పంచుకున్నారు. చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ Would have never liked it this way but am sure mom is singing Happy Birthday to me from right up there! Thanks to each one of you for your condolences and wishes alike. Life goes on. pic.twitter.com/PdCGtRxrvq — Akshay Kumar (@akshaykumar) September 9, 2021 ఈ సందర్భంగా ‘మనం పనిలో ఎంత బిజీగా ఉన్న, ఎంత ఎత్తుకు ఎదిగినా మన తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నారనే విషయాన్ని మరవకండి. బిడ్డలుగా వీలైనంత సమయం వారితో కేటాయించండి’ అంటూ రాసుకొచ్చారు. కాగా అక్షయ్ ప్రస్తుతం ‘సిండ్రెల్లా’ సినిమా చేస్తున్నారు. ఆ షూటింగ్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఆ సమయంలోనే తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో హుటాహుటినా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
సిద్ధార్థ్‌కు నివాళి తెలుపను, ఎందుకంటే: షెహనాజ్ సోదరుడు
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు, బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో అతడి కుటుంబంతో పాటు, బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. నిన్న(శుక్రవారం) ముంబైలో జూహులో కుటుంబ సభ్యులు, బాలీవుడ్ టీవీ నటీనటుల ఆశ్రునివాళి మధ్య సిద్ధార్థ్ అంత్యక్రియలు ముగిశాయి. అనంతరం సిద్ధార్థ్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్ సోదరుడు షెహ్బజ్ బడేషా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. చివరిగా సిద్ధార్థ్‌కు వీడ్కోలు చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. చదవండి: భావోద్వేగం: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ‘సిద్నాజ్’ ‘మేరా షేర్. నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు. ఉంటావు కూడా. అందుకే నీకు నివాళి ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే నీలా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ఇదే నా కల. త్వరలోనే ఈ కలను నిజం చేస్తా. నీకు ఎప్పటికీ నివాళి తెలుపలేను. లవ్ యూ’ అంటూ షెహ్బజ్ తన స్నేహితుడిగా హృదయపూర్వక నివాళి అర్పించాడు. కాగా బిగ్‌బాస్ 13 సీజన్లో షెహనాజ్‌తో సిద్ధార్థ్ ప్రేమాయణం సిద్నాజ్గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే షెహ్బజ్ తొలిసారిగా సిద్ధార్థ్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో కలుసుకున్నాడు. షెహనాజ్, సిద్ధార్థ్‌ల రిలేషన్‌తో వీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారారు. ఇక వీరి రిలేషన్లో సోదరి షెహనాజ్‌కు షెహ్బజ్ ఎప్పుడు మద్దతుగా ఉన్నాడు. కాగా సిద్ధార్థ్ అంత్యక్రియలకు షెహనాజ్ గిల్, ఆమె తల్లి కూడా హజరైన సంగతి తెలిసిందే. కారులో షెహనాజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే పక్కనే షెహ్బజ్ ఆమెను ఓదార్పునిస్తూ కనిపించాడు. చదవండి: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్ MERA SHER 🦁 U R ALWAYS WITH US AND U WILL B ALWAYS 🙂WILL TRY TO BECOME LIKE U. IT IS A DREAM NOW 🙂 AND THIS DREAM WILL COME TRUE SOON 😔 I WILL NOT SAY RIP BECAUSE U R NOT LOVE U 😍 @sidharth_shukla pic.twitter.com/rOnJsPkjlC — Shehbaz Badesha (@ShehbazBadesha) September 3, 2021 -
విషాదం: ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ (63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలకు గత కొంతకాలంగా ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో బర్బన్ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్ ఆసుప్రతిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు అనుపమ్ స్నేహితుడు యశ్పాల్ శర్మ తెలిపారు. కాగా అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ వంటి పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ వంటి చిత్రాల్లో నటించారు. కాగా అనుపమ్ శ్యామ్ నటించిన ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్లో ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్ర పోషించారు. ఈ సీరియల్లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2009లో ప్రసారమైన ఈ సీరియల్ సెకండ్ సీజన్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. Saddened by the demise of my friend and very talented actor Anupam Shyam ji. We have lost a great man. My deepest condolences to his family and friends. ॐ शांति pic.twitter.com/bzRMUpqVQL — Manoj Joshi (@actormanojjoshi) August 8, 2021 -
ప్రముఖ నటుడు సంచారి విజయ్ బ్రెయిన్ డెడ్
జాతీయ అవార్డు గ్రహిత, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూశారు. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం(జూన్ 14) ఆయన మృతి చెందారు. విజయ్‌ది బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ధృవీకరించారని, తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్ సోదరుడు సిద్దేశ్ వెల్లడించారు. కాగా విజయ్ మృతి వార్తతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరోలు సుదీప్, రాక్‌స్టార్ యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా శనివారం (జూన్ 12) రాత్రి రేషన్ పంపిణి చేసేందుకు వెళ్లిన విజయ్ తన స్నిహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడటంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యలు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైందని, పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. కాగా విజయ్ 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో 2011లో వెండితెరపై అరంగేట్రం చేశారు. 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో స్టార్ హోదా పొందాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. తను చివరిసారిగా 'యాక్ట్ 1978' చిత్రంలో నటించారు. Very very disheartening to accept that Sanchari Vijay breathed his last. Met him couple of times just bfr this lockdown,,,, all excited about his nxt film,, tats due for release. Very sad. Deepest Condolences to his family and friends. RIP 🙏🏼 — Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2021 చదవండి: రోడ్డుప్రమాదానికి గురైన నటుడు, పరిస్థితి విషమం -
నటుడు మృతిపై కస్తూరి సంతాపం; మండిపడుతున్న నెటిజన్లు
తమిళ నటుటు, నిర్మాత వెంకట్ సుభా మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29) తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్, నటి రాధిక శరత్ కుమార్‌లతో పాటు నటి కస్తూరి శంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కస్తూరి ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. Shocked beyond belief. Venkat sir . Returned frm Udhaynidhi new film shoot , got fever next day, but not positive... after a week got sick... and now he is gone. he wasn't vaccinated it seems. I am so sorry subha. pic.twitter.com/trdZ41ZSBa — Kasturi Shankar (@KasthuriShankar) May 29, 2021 ఇక రాధిక ట్వీట్ చేస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు. వెంకట్ గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మరణవార్త తెలియగానే గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారి జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు. So very saddened to say goodbye to Venkat, his wife Subaa has been associated with me for many years in Radaan. Venkat was a kind, strong thinking person& known him for many years. Subaa fought so strongly for his recovery, heartbreaking to see he lost the fight. Prayers to all pic.twitter.com/43oorm0lvz — Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2021 -
మరో విషాదం: కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్ సుభా శనివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మే 29(శనివారం) తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తకు కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెంకట్ సుభా మృతి బాధాకరం అంటు నటి రాధిక శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్‌లతో పాటు పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా వెంకట్ సుభా ‘మొజి, అఘగియా తీయే, కందనాల్ ముధల్’ వంటి చిత్రాలకు పనిచేశారు. అంతేగాక పలు తమిళ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. ఇక టూరింగ్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఆయన సినిమా రివ్యూయర్‌గా వ్యవహరించారు. So very saddened to say goodbye to Venkat, his wife Subaa has been associated with me for many years in Radaan. Venkat was a kind, strong thinking person& known him for many years. Subaa fought so strongly for his recovery, heartbreaking to see he lost the fight. Prayers to all pic.twitter.com/43oorm0lvz — Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2021 -
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు శాంతిరాజ్ కోశల(53) కరోనాతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అనంతరం హోం క్వారంటైన్లో ఉంటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్న ఆయనకు బుధవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కటక్‌లోని ఎస్బీబీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కోశల మరణం పట్ల ఒడిశాకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ కోశల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా శాంతిరాజ్ కోశల 20కి పైగా ఒడియా చిత్రాలకు సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నారు. అంతేగాక 2వేలకు పైగా ఆయన సొంతంగా ఆల్బమ్స్ రూపొందించారు. -
విషాదం: నటుడు కుట్టి రమేష్ కన్నుమూత
చెన్నై: కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుముశారు. పలు టీవీ సీరియల్లలో నటించి గుర్తింపు పొందిన కుట్టి రమేష్ నిన్న(మే 14) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తమిళ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న ‘తేన్మోవి’, ‘బీఏ’ వంటి మెగా సీరియల్స్‌తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కుట్టి రమేష్ మృతి తీరని లోటని విజయ్ టీవీ బృందం సంతాపం ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, నాన్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్‌కు పితృవియోగం కలిగింది. ఈయన తండ్రి సెన్తమిళన్ శుక్రవారం అనారోగ్యంతో స్వగ్రామం శివగంగ జిల్లా అరణైయూరులో కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
విషాదం: కరోనాతో ఎడిటర్ అజయ్ శర్మ మృతి
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కొరలు చాస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం మునుపటి కంటే ఈ సారి మరింత్ర తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకు కోవిడ్‌తో ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నా ఇక సినీ పరిశ్రమలో కరోనా అంతులేని విషాదాన్ని నింపుతోంది. గత వారంరోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఎడిటర్ అజయ్‌శర్మ(30) కరోనాతో మృతి చెందారు. ఇటీవల కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పత్రిలో చేరినా ఆయన ఈ రోజు(గురువారం) పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యే జావానీ హే దీవాని, బర్ఫీ, అగ్నిపత్, కోయ్ పో చే, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన ఆయన తాప్పీ లీడ్ రోల్లో వస్తున్న స్పోడ్స్ డ్రామ చిత్రం ‘రష్మీ రాకేట్’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఇప్పటికే ‘లూడో’, ‘జగ్గాజూసూస్’, ‘కార్వాన్’ చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కూమారుడు ఉన్నారు. అతి చిన్న వయసులోనే అజయ్ మృతి చెందడంపై బాలీవుడ్ నిర్మాత అనురాగ్ బసుతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. This is still difficult to accept. I barely have courage to write this. Ajay independently edited Jagga Jasoos, Ludo but he was associated with me since Life in a Metro, Barfii, Kites . He was my core team, my creative soundboard, my friend. pic.twitter.com/3TiAc10jTe — anurag basu (@basuanurag) May 5, 2021 -
మరో విషాదం: కరోనాతో యంగ్ డైరెక్టర్ కన్నుమూత
కరోనా వైరస్ చిత్ర పరిశ్రమను కుదిపెస్తోంది. మునుపటి కంటే కరోనా సెకండ్ వేవ్ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరోనాతో మృత్యువాత పడుతుండగా.. తాజాగా మరో యువ దర్శకుడు మహమ్మారికి బలైపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఆయన మృతితో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు నవీన్(36) కోవిడ్-19తో మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని, కర్ణాటకలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా పూర్తెయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా నవీన్ 2011లో ‘వన్ డే’ అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అప్పు వెంకటేష్, రేవన్నలు ప్రధాన పాత్రల్లో నటించారు. -
టాలీవుడ్లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి
కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్ లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సినీ రంగంలో సాయిబాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్. చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం ఆయన స్వస్థలం. హీరో శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’, అలాగే ఉదయకిరణ్ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్’లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు. హీరో చిరంజీవి నటించిన ‘బావ గారూ బాగున్నారా!’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సాయిబాలాజీవే! అలాగే, ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ లాంటి పలు టీవీ సీరియల్స్ కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడే సినీరంగానికి వచ్చిన సాయిబాలాజీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారు. మోహన్ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’ తదితర అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు. రచయిత ఎమ్మెస్ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు నటుడిగా తీసుకురావడంలో సాయిబాలాజీ కీలకపాత్ర వహించారు. చాలాకాలం పాటు నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు. ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్ రాజ్ తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సినిమా, స్క్రిప్టులపై సాయిబాలాజీ నిష్కర్షగా వ్యక్తం చేసే అభిప్రాయాలను పలువురు దర్శక, నిర్మాతలు గౌరవించేవారు. ప్రపంచ సినిమాతో పాటు వివిధ భారతీయ భాషా చిత్రాలపై ఆయనకు పట్టు ఎక్కువ. సినీ కథ, కథనాల్లోని తాజా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయిబాలాజీ దిట్ట. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం పలు సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ ల రూపకల్పనకు కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను తీసుకుపోయింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయిబాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ అనుకోకుండా కరోనా సోకడంతో, వారం రోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఇద్దరూ ఇంట్లోనే కోలుకున్నప్పటికీ, ఆయన మాత్రం గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో చివరి చూపు అయినా దక్కకుండా ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. -
పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం
ఒకప్పుడు యాంకర్‌గా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రముఖ యాంకర్ ఉదయభాను. ఇక సినిమాల్లో సైతం పలు పాత్రల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారామె. తన గలగల మాటలతో ప్రేక్షకదారణ పొందిన ఆమె అప్పట్లో యాంకర్‌గా బుల్లితెరను ఏలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచిన ఆమె ఆ తర్వాత యాంకరింగ్‌కు, నటనకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం కొంతకాలానికి ఓ ఛానల్లో ప్రసారమైన పిల్లలు పిడుగులు అనే షో ద్వారా ఉదయభాను మళ్లీ యాంకర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్లారు. ఇక ఈ షోను నుంచి కూడా తప్పుకున్న ఆమె అప్పటి నుంచి బుల్లితెరపై కనిపించడం తగ్గించారు. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్న అఘాయిత్యాలపై అప్పడప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఉదయభాను ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మరణంతో మరోసారి తెరపైకి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పొట్టి వీరయ్య నిన్న(ఆదివారం) గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఉదయభాను కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్‌తో అందరినీ కంటతడి పెట్టించారు.‘వీరయ్య అంకుల్ మరణవార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించింది. ఇది భరించలేని నిజమని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్. ఓ మంచి వ్యక్తిని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద అయిన కొంచెం దయచూపు’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత -
ప్రముఖ నటుడు, రచయిత కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు. కళా రంగానికి ఆయన అందించిన సేవకుగాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ అనే నాటాకానికి అందుకున్నారు. బాలచంద్రన్ నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత థియేరిటికల్ ఆర్ట్స్, నటనలో శిక్షణ తీసుకున్నారు. చదవండి: చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా! నిజంగానే ఈ జంట విడిపోతుందా! -
విషాదం: నటుడు, దర్శకుడు మృతి
బాలీవుడ్ నటుడు దర్శకుడు తారిఖ్ షా మృతి చెందారు. కొంతకాలంగా న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ముంబై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. తారిఖ్ ప్రముఖ టీవీ నటి షోమా అనంద్ భర్త. వీరిద్దరూ 1987లో వివాహం చేసుకున్నారు. కాగా తారిఖ్ ‘బాహర్ ఆనే తఖ్’, ‘గుమ్నామ్ హై కోయ్’, ‘ముంబై సెంట్రల్’ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 1995లో వచ్చిన హిట్ చిత్రం ‘జనమ్ కుండ్లీ’ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వినోద్ ఖన్నా, జితేంద్రా రినా రాయ్, అనుపమ్ ఖేర్‌తో పాటు తదితరులు నటించారు. దీనితోపాటు కడ్వా సచ్ మూవీకి ఆయన దర్శకుడిగా వ్యవహించారు. కాగా షోమా ఆనంద్, తారిఖ్ షాలు 1987లో వివాహం చేసుకున్నారు. Sad News Actor director Tariq Shah of serial "Kadwa Sach" and film "Janam Kundali" fame expired today morning at private hospital in Mumbai. He was husband of Shoma Anand. May Allah bless the departed soul. #tariqshah #shomaanand omshanti🙏 — Viral Bhayani (@viralbhayani77) April 3, 2021 -
వేదం నటుడు నాగయ్య మృతి
-
విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి
‘వేదం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటుడు నాగయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన తన నటన, డైలాగ్ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఆయన దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. కాగా ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత సినిమా ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందుల్లో నాగయ్యకు సీఎం కేసీఆర్, మా ఆసోసియేషన్ అండగా నిలిచింది. కాగా, నాగయ్య మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారన్నారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, వైరల్‌గా మారిన అఖిల్ కామెంట్ రామ్ చరణ్ బర్త్‌డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో -
విషాదం: కరోనాతో ఏఆర్ ఎస్ఐ మృతి
సాక్షి, కామారెడ్డి: దేశంలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టల్స్‌లో కరోనా వ్యాపించిన సంఘటన ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో కరోనా బారిన పడిన కామారెడ్డిలో ఏఆర్ ఎస్ఐ రాఘవేంద్ర మృతి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22న ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన కన్నుముశారు. -
విషాదం: ఆరు నెలల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు..
సాక్షి, నాగోలు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేçసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ వాస్తుకాలనీకి చెందిన కీత నితేష్‌సాయి(26) మృత్తి రీత్యా వ్యాపారి. బుధవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న స్నేహితుడిని కలసి బుల్లెట్‌పై వాస్తుకాలనీలో ఉన్న తన ఇంటి రాత్రి 11:45గంటలకు సమయంలో వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓంకార్‌నగర్ యూటర్న్ వద్ద మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన నితేష్‌సాయిని చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతూ నితేష్‌సాయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణలు దక్కేవి... హెల్మెంట్ లేక పోవడంతో కింద పడిన నితేష్‌సాయి తలకు తీవ్ర గాయలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెంట్ ధరించి ఉంటే నితేష్‌సాయి ప్రాణాలతో బయట పడేవారని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితమే తండ్రి మృతి.. నితేష్‌సాయి తండ్రి మధుసూదన్ ఆరు నెలల క్రితం నాగోలు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంతలోనే కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ ఏక్‌మినార్ మజీద్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మైబెల్లి తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీగూర శివనాగిరెడ్డి (26) ఉప్పల్ రోడ్డులోని ఎన్ఎస్ఎల్ భవనంలో మూడు సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. కార్యాలయంలో ఉన్న ల్యాప్‌టాప్ కోసం ఇంటి నుంచి తన ద్విచక్ర వాహానం (ఏపి 09 సిఎన్ 3009)పై గురువారం ఉదయం బయలు దేరాడు. ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ వేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. గాయపడిన శివనాగిరెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనాగిరెడ్డి భార్య తీగూర సుశ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: తండ్రి పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన యర్రమాద సదానంద్ టైలర్‌గా పనిచేసేవాడు. లాక్డౌన్ కారణంగా చిట్యాలలో పనిలేక పోవడంతో భార్య సంధ్య, కుమారుడు శివప్రసాద్ (24)కుమార్తె స్వాతిలతో కలసి సదానంద్ నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్ కాకతీయనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. అతని కుమారుడు సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సదానంద్ ప్లంబర్‌గా పని చేస్తున్నా ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న కుమారుడు గత కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నా డు. ఆదివారం మధ్యాహ్నం అతడి తల్లి సంధ్య, సోదరి స్వాతి బయటకు వెళ్లిన సమయంలో శివప్రసాద్ ఇంట్లోని సీలింగ్ రాడుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. ఆర్థిక సమస్యలతోనే కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సదానందం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. -
సచివాలయం మహిళా పోలీస్ ఆత్మహత్య!?
సాక్షి, చీరాల: చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయం మహిళా పోలీసు ముత్యాల భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురువారం చీరాల సాల్మన్ సెంటర్లో వెలుగు చూసింది. చీరాల ఒన్‌టౌన్ సీఐ రాజమోహన్ కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు సచివాలయంలో ముత్యాల భార్గవి మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి ఏం జరిగిందో ఏమోగానీ ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి మృతురాలి భర్త రాంబాబును విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని, ఈ మేరకు భార్గవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తమ కుమార్తె భార్గవిని అల్లుడు రాంబాబు మద్యం తాగి తరుచూ వేధింపులకు గురిచేస్తుండేవాడని, ఈ విషయం పలుమార్లు తమకు చెప్పుకుని బాధపడిందని, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లి విగత జీవిగా పడి ఉండటంతో పిల్లలు భోరున విలపిస్తున్నారు. సాల్మన్ సెంటర్‌తో పాటు మృతురాలు పనిచేసే సచివాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
డ్రంక్ అండ్ డ్రైవ్: పుణే ఫైనాన్సర్ వైస్ ప్రెసిడెంట్ మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి నగర ఆర్థిక సంస్థ ఉపాధ్యక్షుడి మృతికి కారమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు యజమాని జేమ్స్(30)పై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్టు అయిన సాయంత్రమే నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం స్థానికంగా ఆందోళన రేపుతోంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ ఖండేల్వాల్(38) ఆదివారం రాత్రి భార్య రోషిణి, కుమారుడితో కలిసి ఆదివారం ఉదయం 12:30 గంటలకు పక్కింట్లొ జరిగే ఓ కార్యక్రమానికి నడుచుకుంటూ బయలుదేరాడు. అదే సమయంలో జేమ్స్(30) అనే వ్యక్తి ఫుల్‌గా తాగి కారు నడిపాడు. ఈ క్రమంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో కారు అదుపు తప్పి ఖండేల్వాల్ తాగి గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఖండేల్వాల్ తీవ్రంగా గాయపడగా ఆయన భార్య రోషిణికి స్వల్ప గాయలయ్యాయి. కాగా ఈ ఘటనలో బాధితుడి కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో వెంటనే స్థానికులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా ఖండేల్వాల్ చికిత్స పొందుతూ మరణించగా ఆయన భార్య కొలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వీర్ కారు యజమానికి జేమ్స్ ఆ సమయంలో మద్యం సేవించినట్లు ప్రాథమిక పరీక్షలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడు ఖండేల్వాల్ భార్య ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు జేమ్స్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై ఎస్ఐ సునిల్ జాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు జేమ్స్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కుమార్ అనే వ్యక్తి ఇంటి ప్రహారీ గొడతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో నిందితుడు జేమ్స్‌పై నిర్లక్ష్యంగా కారు నడపడం, వాహనం చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరపరచమన్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం దీనిపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ లీగల్ ఆఫీసర్లను కలిసినట్లు ఆయన చెప్పారు. కాగా నిందితుడు జెమ్స్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు ఆయన వెల్లడించారు. -
చేతులు మారిన రూ.2.50లక్షలు..?
సాక్షి, బేల(అదిలాబాద్): ఓ ప్రైవేట్ లైన్‌మన్ విద్యుత్‌షాక్‌తో ఇటీవల చనిపోయిన ఘటనలో బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకుడొకరు ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి రూ.2.50లక్షలు వసూలు చేశాడని, ఇందుకు సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఒకరు సహకరించారన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు విద్యుత్‌శాఖ అధికారులు కూడా ‘పైసలుపాయే.. ఆపై కేసు నమోదాయే..’ అని చర్చించుకుంటున్నారు. వీరిచ్చిన రూ.2.50 లక్షలు చేతులు మారాయా..? మారితే ఎవరికి చేరాయి..? డబ్బులిచ్చినా కేసు ఎందుకు నమోదైంది..? అని ఆ శాఖలో తర్జనభర్జన నెలకొంది. బేల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అంతర్రాష్ట్ర రోడ్డు పక్కన ఓ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు వచ్చింది. దీంతో గతనెల 17న చిన్న ట్రాన్స్ఫార్మర్ బిగింపు, మరమ్మతు చేసేందుకు ప్రైవేటు లైన్‌మన్ షేక్ అయ్యూబ్ (22)ను తీసుకొచ్చారు. ఆ సమయంలో విద్యుత్‌షాక్ తగిలి అయ్యూబ్ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం సమయంలో ఓ నాయకుడు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ కలిసి బాధిత కుటుంబం నుంచి పోలీసులకు ఆరుసార్లు ఫిర్యాదు రాయించారు. సంఘటనకు బాధ్యులైన అధికారులను కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ. 2.50లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ఇందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.2లక్షలు అందించాలని, మిగిలిన రూ. 50 వేలు కేసుల ఖర్చుల కోసమని నిర్ణయించుకున్నారు. కేసు ప్రారంభంలో పోలీసులు ప్రమాదానికి విలేజ్ వర్కర్ (ఆదివాసీ యువకుడు) కనకే శ్యాం కారణమని పేర్కొంటూ కేసు నెట్టారు. దీంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కేసును తాత్కాలిక విలేజ్ వర్కర్‌పై నెట్టడమేంటని, అమాయకుడిని బలిచేస్తే ఊరుకోబోమని పోలీసులను ఆశ్రయించారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదివాసీ నాయకులను సముదాయించారు. ఇటీవల ఆ కేసు నుంచి విద్యుత్ అధికారులను తప్పించి.. విలేజ్ వర్కర్‌పై నెట్టడానికి డబ్బులు వసూలు చేసిన సదరు నాయకుడు ఓ మైనార్టీ నాయకుడితోపాటు బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై సాయన్న సమగ్ర విచారణ చేపట్టి గతనెల 26న ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులతోపాటు విలేజ్ వర్కర్‌ను రిమాండ్ చేశారు. రిమాండ్ అయినవారిలో ఏఈ శంకర్, లైన్ ఇన్స్పెక్టర్ పవార్ సౌలా, జూనియర్ లైన్‌మన్ మనోహర్, విలేజ్ వర్కర్ కనకే శ్యాం ఉన్నారు. ఇలా ముగ్గురు అధికారులపై కేసు కావడంతో డివిజన్ పరిధిలోని విద్యుత్ బృందం తలాకొంత కలిపి ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇవ్వాలంటూ కేసులో మధ్యవర్తిత్వం వహించిన సబ్‌స్టేషన్ ఆపరేటర్‌తో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులను సదరు ఆపరేటర్ నాయకుడికి ఇచ్చాడా..? ఒకవేళ నాయకుడికి ఇస్తే వెనక్కి ఎలా తీసుకోవాలి..? అని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. సదరు నాయకుడు అధికారపారీ్టకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరోవైపు బాధిత కుటుంబానికీ రూ.2లక్షలు ఇవ్వలేదని తెలిసింది. మొత్తం డబ్బులను ఆ నాయకుడే నొక్కేశాడా? ఆపరేటర్ నొక్కేశాడా..? తేలాల్సి ఉంద ని విద్యుత్‌శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
సాక్షి, మూసాపేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గలో కడపకు చెందిన రేష్మ (20) దంత కళాశాలలో చదువుతోంది. కుటుంబసభ్యులు కాశీ యాత్రకు వెళుతుండటంతో కడపకు బయలుదేరింది. మధ్యలో కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట కాలనీలోని ఉమెన్స్ హాస్టల్స్‌లో ఉన్న శ్రీజను కలవడానికి శుక్రవారం వచ్చింది. శనివారం రాత్రి శ్రీజ, మమత, అజయ్‌సింగ్, శ్రావణ్కుమార్లతో కలిసి మదీనాగూడలో ఉన్న జీఎస్ఎం మాల్లో సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి సినిమా ముగిసిన తరువాత రేష్మ స్కూటీపై కేపీహెచ్‌బీకాలనీకి వస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీకి వస్తుండగా మధ్యలో మెట్రో పిల్లర్ 660, 661 వద్ద పక్క నుంచి ఇంకో వాహనం వేగంగా వెళ్లింది. దీంతో రేష్మా అదుపు తప్పి కిందపడిపోయింది. వెనకే వస్తున్న లారీ ముందు టైరు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. లారీ డ్రైవర్ కృష్ణ అక్కడే లారీని వదిలేసి పారిపోయాయడు. స్కూటీ ఇచ్చినందుకు అజయ్‌కుమార్, లారీ డ్రైవర్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్) (అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. ) -
ప్రముఖ రచయిత్రి ఆనందరామం ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామం గురువారం ఉదయం హైదరాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్షి్మ. భర్త రామం పేరును తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందరామంగా తెలుగు సాహిత్య లోకంలో రాణించారు. 1935, ఆగస్టు 20వ తేదీన ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా ఏలూరులో ఆమె జని్మంచారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలను రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి... సంసార బంధం పేరుతో సినిమాగా, అదే నవల జీవన తరంగాలు పేరిట టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్ వరకు మామూలుగా చదివి బీఏ డిగ్రీని ప్రైవేటుగా పూర్తి చేశారు. అనంతరం సీఆర్ఆర్ కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చారు. 1958–60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్‌గా పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోంసైన్స్ కాలేజీ, తర్వాత నవజీవన్ కాలేజీలో కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఆమె ఆధ్వర్యంలో పీహెచ్డీ చేశారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. ఎన్నో అవార్డులు.. గృహలక్ష్మి స్వర్ణకంకణం 1972, మాలతీ చందూర్ స్మారక అవార్డు 2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె మృతితో ఒక శకం ముగిసిందని, శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామంకు అశ్రు నివాళి.. అని పలువురు కవులు పేర్కొన్నారు. -
అమెరికా రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వాసి మృతి
సాక్షి, అనంతగిరి (వికారాబాద్): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ పట్టణానికి చెందిన నిఖిల్(35) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం గంగారం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడు నిఖిల్ అమెరికాలోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పది రోజుల క్రితం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వెళ్తుండగా న్యూ మెక్సికో రహదారిలో ఎదురుగా రాంగ్ రూట్ వచ్చిన మరో వాహనం ఇతడి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఉదయం నిఖిల్ మృతదేహం వికారాబాద్ చేరుకుంటుందని కుటుంబీకులు తెలిపారు. -
పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి
సాక్షి, వేములవాడ(కరీంనగర్): ఉద్యమనేత, కమ్యూనిస్టు యోధుడు నమిలికొండ పుల్లయ్య ఉరఫ్ గుమ్మి పుల్లన్న(95) ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కమ్యూనిస్టు నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, గుంటి వేణు, కడారి రాములు, వేములవాడ మున్సి పల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్ మధు రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు సంతాపం ప్రకటించారు. భూపోరాటమే ఊపిరి.. వేములవాడ బద్దిపోచమ్మవీధిలో పెంకుటింట్లో ఆ యన నివాసం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన.. విద్యార్థిదశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. చిన్నవయసులోనే వేదాలు, వేదమంత్రాలు నేర్చుకున్న ఆయన.. మెట్రిక్యులేషన్ పాసయ్యారు. తన 16వ ఏట భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రెండేళ్ల తర్వాత సాయుధ పోరాటం ఎంచుకున్నారు. చివరిదశ వరకూ స్వాతంత్య్ర సమరయోధుడి పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరం. సీనియర్ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సీహెచ్ రాజేశ్వర్‌రావుతో సన్నిహితంగా ఉండేవారు. భూపోరాటాల కోసం ఊరూరా తిరుగుతూ రైతులను జాగృతం చేశారు. గడీలపై జెండాలు ఎగురవేశారు. భూముల్లో ఎర్రజెండాలు పాతారు. సిరిసిల్ల ఠాణాపై దాడి చేసి ఆయుధాలు అపహరించారు. తిమ్మాపూర్ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలిసి దాడి చేసి 110 తుపాకులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కంటపడకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు కాలనడకన చేరుకున్నారు. అక్కడ మూడేళ్లపాటు కోయ, గోండు, నేతకాని, గుత్తికోయలను చైతన్యపరిచి 4 వేల ఎకరాల అటవీ భూములను సాగులోకి తీసుకొచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. ఇద్దరు కొరియర్ల సాయంతో ధర్మపురిలోని గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ స్నానాలు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి కొరియర్లను చంపేశారు. పులన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించారు. మూడేళ్ల జైలుజీవనం అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చారు. చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలోనూ పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. ఆయనను తెలంగాణ సాయుధ పోరాటయోధుడిగా గుర్తించి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు సన్మానిస్తూ వస్తున్నారు. పుల్లన్న తల్లిదండ్రులు ఆలియాబాయి–కిష్టయ్య, భార్య రుక్మిణి(చనిపోయారు), కుమారులు పవన్‌కుమార్, మధు మహేశ్, కుమార్తెలు సురేఖ, సునీతతోపాటు 17మంది మనునమలు, మనుమరాండ్రు ఉన్నారు. ఎక్కడికైనా కాలినడకన వెళ్లడం ఆయన ప్రత్యేకత. -
క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి
ఫ్లోరిడా: ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్ డైమండ్(44) మృతి చెందారు. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న డస్టిన్ ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో సోమవారం కన్నుముశారు. ‘సెవ్డ్ బై ది బెల్’ సిరీయల్తో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్ కొంతకాలంగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన తండ్రి మార్క్ డైమండ్ తెలిపాడు. స్టేజ్ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడు నిన్న మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు. కాగా 1989 నుంచి 1992 మధ్యకాలంలో వచ్చిన ‘సెవ్డ్ బై ది బెల్’ సరీయల్లో డస్టీన్ బాల నటుడిగా అందరిని మెప్పించాడు. ఇందులో డస్టిన్ తన స్కెచ్ ప్రతిభతో మంచి గుర్తింపు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్ ఎన్బీసీలో ప్రతి రోజు శనివారం ఉదయం ప్రసారమయ్యే ఈ సిరీయల్ అత్యంత ప్రేక్షక ఆదరణ పొందింది. -
కారు బోల్తా: సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, ధారూరు: హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఆదివారం అనంతగిరి పద్మనాభస్వామి, కోట్‌పల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడడంతో ఉద్యోగస్తులతోపాటు డ్రైవర్ శివ గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దివ్య (24) మృతి చెందింది. ఈ దుర్ఘటన మండల పరిధిలోని తాండూర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కేరెళ్లి రైతువేదిక సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్లుగా పనిచేస్తున్న ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం అనంతగిరి పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్తున్న క్రమంలో కారును వేగంగా నడుపుతున్న శివసాయి మూలమలుపును గమనించలేదు. దీంతో కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూపక్కనేఉన్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దండెం నిఖిల్(24), హర్షల్ కావల్‌కార్(27), శృతిక(22), పురుషోత్తం(25), షాజహా న్(25)లు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ శివసాయి(25) కాలుకు, దివ్య తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో క్షతగాత్రులను ఆయన వాహనంలో వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. డ్రైవర్ శివసాయినినగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితికూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. హర్షల్ కావల్‌కార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. కాగా డ్రైవర్ శివసాయి తన తండ్రి ప్రభుత్వ వాహనాన్ని ఇంట్లో చెప్పకుండా తీసుకవచ్చినట్లు ఎస్సై చెప్పారు. -
అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతి
సాక్షి, కట్టంగూర్(నల్గొండ) : అనుమానస్పద స్థితిలో ఫొటోగ్రాఫర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లారం పంచాయతీ పరిధి ఎస్ఎల్బీసీ కాల్వపక్కనే ఉన్న పెద్దవాగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టం గూర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన మేకల హరికృష్ణ(23) ఈనెల 23న ఉదయం ఈదులూరు రోడ్డు వెంట ఉన్న ఫొటో స్టూడియో తీస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ద్విచక్రవాహనంపై వెళ్లాడు.సాయంత్రం వరకు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారు షాప్‌వద్దకు వెళ్లి చూసేసరికి ఓపెన్ చేసి ఉంది కానీ హరికృష్ణ లేడు. దీంతో బంధువులకు ఫోన్ చేసినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా.. మల్లారం శివారులోని పెదవాగు సమీపంలో ద్విచక్రవాహనం ఉందని గ్రామస్తులు ఆదివారం తెలిపారు. అక్కడికి వెళ్లి చుట్టుపక్కల చూసి.. అటుగా వచ్చేవారిని వాకబు చేశారు. వాగుపక్కనే యువకుడు పడి ఉన్నాడని తెలుసుకుని.. అక్కడికి వెళ్లి చూడగా హరికృష్ణ విగతజీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ అన్న హరిబాబు ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
జేమ్స్ బాండ్ 007 నటి మృతి
లాస్ ఎంజెలస్: జేమ్స్ బాండ్ 007 సిరీస్ నటి తన్య రాబర్ట్(65) మృతి చెందారు. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం కన్నుమూశారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినార్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆమె స్నేహితుడు, ప్రతినిధి మైక్ పింగెల్ స్థానిక మీడియాకు తెలిపాడు. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. ఈ క్రమంలో తన్య నిన్న మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆమె మృతికి కారణం ఇంకా తెలియలేదని, చనిపోవడానికి ముందు తన్య రాబర్ట్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విక్టోరియా లీ బ్లమ్లో జన్మించిన తాన్య రాబర్ట్స్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన హర్రర్ చిత్రం ఫోర్స్డ్తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో తన్య అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతో తన్య నటిగా మంచి గుర్తింపు పొందారు. అయితే సినిమాలలో నటించడానికి ముందు ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేశారు. -
కోల్‌కతా:ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి
-
‘ది డర్టీ పిక్చర్’ నటి అనుమానాస్పద మృతి
కోల్‌కతా: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొద్ది కాలంగా బెనర్జీ కలకత్తాలో ఒంటిరిగా జీవిస్తున్నారని ఆమె పనిమనిషి పోలీసులకు తెలిపింది. దీంతో పనిమనిషి అందిచిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నటి మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’లో షకీలా పాత్ర పోషించారు. -
కరోనాతో ప్రముఖ టీవీ నటి మృతి
ముంబై: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను కబళిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన కొంతమంది సినీ, రాజకీయ నేతలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ టీవీ నటి దివ్య భట్నాగర్(34) సోమవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబైలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారు జామున ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. (చదవండి: దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు) అయితే దివ్య అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో పలువురు టీవీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా దివ్య భట్నాగర్ కామెడీ షో తేరా యార్ హూన్ మెయిన్ షూటింగ్లో సమయంలో అనారోగ్యంతో బాధపడుత్ను ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమె ‘ఏ రిషిత క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తొహ్ పియా మోర్రే’ వంటి సిరీయల్స్‌లో నటించారు. (చదవండి: కోవిడ్ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్) -
దారణం: హత్యకు దారితీసిన యువకుల గొడవ
సాక్షి, నెల్లూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్ల కుక్కలగుంట కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కరివేపాకు వ్యాపారం చేసుకొని జీవించే సాయి అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దయానంద్‌తో చిన్నపాటి వివాదం తలెత్తింది. గొడవ మరింత ముదరడంతో దయానంద్ ఆవేశంతో సాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్లానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
శాంసంగ్ చైర్మన్ లీకున్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియా సంస్థను గ్లోబల్ టెక్ టైటాన్‌గా మార్చిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శామ్సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ (78) కన్నుమూశారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. లీ సారథ్యంలోనే శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేస్తూ.. లీ నిజమైన దార్శనికుడని, శాంసాంగ్‌ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చారంటూ కొనియాడింది. కాగా శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని 10వ వంతుతో సమానంగా ఉంది. (చదవండి: వాళ్ల బాస్ నిజం తెలుసుకునే చాన్సే లేదు (స్పాన్సర్డ్) అయితే లీకి 2014లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం అనంతరం లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో శాంసంగ్ సంస్థను లీ అగ్రగామిగా తీర్చిదిద్దారు. (చదవండి: ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు) -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ్ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత కన్నడ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘గాంధడ గుడి’, ‘నా నిన్న బిదాలారే’, ‘రంగమహాల్ రహస్య’, ‘శ్రీనివాస కళ్యాణ’, ‘సనాడి అప్పన్న’, ‘కర్ణాటక సుపుత్ర’ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ 1996లో నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. (చదవండి: అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను: నయన్) -
ఏసీపీ బాలుజాదవ్ మృతి
సాక్షి, కూసుమంచి(నిజామాబాద్): మండలంలోని లోక్యాతండాకు చెందిన వడిత్య బాలుజాదవ్ (54) నిజామాబాద్ జిల్లాలో ఏసీపీగా (ఎన్ఐఏ విభాగంలో) విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో గత నెల 28న రాత్రి తన ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తూ మండలంలోని జీళ్లచెరువు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన సొంత గ్రామమైన లోక్యాతండాకు తరలించారు. దీంతో తండా ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుజాదవ్‌కు భార్య భాగ్యవతి, కుమారులు రాఫాప్రతాప్, అశోక్, కుమార్తె సంధ్య ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగి.. మృతిచెందిన బాలుజాదవ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఎస్ఐగా అదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం పొందారు. అక్కడి నుంచి విధి నిర్వహణలో నిబద్ధత చూపిస్తూ ఉత్తమ అధికారిగా మన్ననలను పొందుతూ ఏసీపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతిపై విచారణ అధికారిగా ఆయన్ను నియమించారు.పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
‘దాదా లేని ఢిల్లీని ఊహించలేం’
కోల్‌కతా : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు. దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి : ‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’ It is with deep sorrow I write this. Bharat Ratna Pranab Mukherjee has left us. An era has ended. For decades he was a father figure. From my first win as MP, to being my senior Cabinet colleague, to his becoming President while I was CM...(1/2) — Mamata Banerjee (@MamataOfficial) August 31, 2020 -
కోవిడ్‌కు మరొకరు బలి
సాక్షి, ఆదిలాబాద్: కోవిడ్‌తో జిల్లాలో మరొకరు మరణించారు. గురువారం బోథ్‌కు చెందిన ఒకరు కరోనాకు బలి అయ్యారు. ఇతను బీపీ, షుగర్‌వ్యాధితో బాధపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 18కి చేరింది. జిల్లాలో ఇప్పటివరకు 17,371 నమూనాలు సేకరించగా, 1423 మందికి పాజిటివ్ వచ్చింది. 653 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గురువారం 1,575 నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించా రు. ఒకరు మృతి చెందగా, 76 మందికి పాజిటివ్ వ చ్చింది. 6 నమూనాలు పెండింగ్‌లో ఉండగా, 27 మ ంది డిశ్చార్జ్ అయినట్లు డీఎంహెచ్‌లో పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా కేసులు ఇలా.. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్‌రోడ్‌లో 1, భీంసరి 1, భుక్తాపూర్ 3, బ్రాహ్మణవాడ 1, ఛోటతలాబ్ 1, కైలాస్‌నగర్ 1, క్రాంతినగర్ 1, కేఆర్‌కేకాలనీ 1, మహాలక్ష్మీవాడ 1, న్యూ కుమ్మరికుంట 1, పాత హౌసింగ్‌బోర్డు 4, పీహెచ్సీలో కాలనీ 1, పిట్టల్‌వాడ 2, పుత్లీబౌళి 1, రాంనగర్ 1, రాణిసతీజి రోడ్ 1, రవీంద్రనగర్ 3, రిమ్స్ క్వార్టర్స్ 2, సాలెగూడ 1, సంజయ్‌నగర్ 1, శాంతినగర్ 3, టైలర్స్‌కాలనీ 3, తాటిగూడ 5, టీచర్స్ కాలనీ 2, తిర్పెల్లి 3, విద్యానగర్ 2, బోథ్‌లోని 5వ బ్లాక్ 8, బోథ్ మండలం కౌఠ(బి) 2, మావల 1, ఉట్నూర్‌లోని బోయవాడలో 1, ఉట్నూర్ మండలం పులిమడుగులో 5, ఉట్నూర్‌లోని వేణునగర్‌లో 1, జైనథ్ మండలం గిమ్మలో 1, నేరడిగొండ 2, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో 4, తాంసి మండలం గిర్గావ్లో 3, గుడిహత్నూర్ ఎస్సీకాలనీలో 1 చొప్పున కేసులు నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్ఓ వివరించారు. -
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కేవీఆర్ మృతి
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల)/కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ చైర్మన్ కేవీ రాజేశ్వర్‌రావు(84) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన కేవీ ఆ గ్రామ సర్పంచ్‌గా రెండు దశాబ్దాలపాటు పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన 2001లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మెట్పల్లి నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెట్పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో 2005లో కాంగ్రెస్‌లో చేరారు. 2008లో మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ చైర్మన్‌గా నియమితులైన కేవీ ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చరిత్రలో అత్యధిక నిధులు తీసుకువచ్చిన చైర్మన్‌గా ఘనత సాధించారు. రాజేశ్వర్‌రావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కేవీ మృతిపట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ధర్మపురి దేవస్థానం కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. -
కరోనాతో వ్యక్తి మృతి.. భార్య పిల్లల ఆత్మహత్యయత్నం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డాబా గార్డెన్లో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకి చికిత్స పొందుతుండగా ఈ రోజు మృత్యువాత పడ్డాడు. ఆ విషయం తెలిసిన మృతుడి భార్య అతడి పిల్లలు శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడటంతో స్థానికులు వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
శ్రీనివాస్ చనిపోయాడు..
సాక్షి, కరీంనగర్(సిరిసిల్ల): ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తమ సీనయ్య వస్తాడంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన తల్లి, భార్యాబిడ్డలకు కన్నీరే మిగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తంగళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు జంగపెల్లి శ్రీనివాస్(33) గత ఆదివారం సిద్దిపేట జిల్లా బద్దిపడిగె వాగులో కారుతో సహ గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు వారం రోజులపాటు నిరాటంకంగా కొనసాగగా, శనివారం నంగునూరు మండలం దర్గపల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానికులకు చెక్ డ్యామ్ సమీపంలోని చెట్లపొదల్లో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి శ్రీనివాస్‌గా గుర్తించారు. మృతి వార్త తెలియగానే తల్లి సత్తవ్వ, భార్య మానస గుండెలుపగిలేలా రోదించారు. శ్రీనివాస్ మరణవార్త విని మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లి రాంమోహన్, ఎస్సై అభిలాష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు కృతిక, లాస్య, సోదరుడు శేఖర్ ఉన్నారు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం
సాక్షి, నల్గొండ: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. (చదవండి: నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించెందుకు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఈ రోజు బయలుదేరారు. ఈ క్రమంలో అంబులెన్స్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిమ్స్ వైద్య విద్యార్థి బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడి ఘటన కలకలం రేపుతోంది. ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్ (22) అనే వైద్య విద్యార్థి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో వికాస్ అనే వైద్య విద్యార్థి హాస్టల్ పైకప్పుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం సదరు బాధితుడిని ఎయిమ్స్‌లోని సంబంధిత విభాగానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం) వికాస్‌కు చికిత్స అందిస్తుండగానే అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు వికాస్ బెంగళూరుకు చెందిన వాడని, అతడు 2018 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వికాస్ కొద్ది రోజులుగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, అతడికి మానసిక వైద్య చికిత్స వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వికాస్ రోజులాగే ఈ రోజు కూడా విధులకు హజరయ్యాడని, సాయంత్రం సమయంలో ఒక గంట సెలవు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విరామం కోసం వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం) -
ముగ్గురు చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలాడు
వాషింగ్టన్: అమెరికాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న ముగ్గురూ పిల్లలను కాపాడే క్రమంలో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలను కొల్పోయాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడగా మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, ఓ పదేళ్ల బాలుడు కలిసి నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. (చదవండి: విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..) వారు ఆడుకుంటుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఒడ్డు మీద నిలుచున్న మజీద్ సింగ్ వారిని చూసి కాపాడేందుకు నదిలో దూకాడు. వారిని కాపాడే క్రమంలో మజీద్ నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు 40 నిమిషాల అనంతరం మజీద్ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరూ సురక్షితం ఉన్నారని, మరో ఎనిమిదేళ్ల చిన్నారి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి) -
స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం
సాక్షి, తిరుపతి: స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు నిలువు దోపిడీ చేసి మానవత్వానికి మచ్చ తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) రిటైడ్ అధికారికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన పద్మావతి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న బంగారం, పర్సులో నగదు, ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలించారు. దీనిపై కుటుంబ సభ్యులు బుధవారం స్విమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. స్పందించిన స్విమ్స్ అధికారులు మృతుడి కుటుంబీకులకు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అందచేశారు. నగదు, మొబైల్ మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కోవిడ్ బాదితులకు వైద్యం అందిస్తుంటే కొంతమంది ఇలా దారుణానికి పాల్పడటం బాద కలిగిస్తోందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు కరోనా..) -
బాలుడి ప్రాణాలను బలికొన్న సెల్ ఫోన్ చోరీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ చోరీ మైనర్ బాలుడిని బలికొన్న ఘటన చిత్తూరులోని మదనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఈశ్వమ్మ కాలనికి చెందిన మైనర్ బాలుడు భరత్ రెండు రోజు క్రితం బంధువుల ఇంట్లో ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. తన దొంగలించిన ఫోన్ స్థానికి మొబైల్ షాపులో 2500 రూపాయలకు విక్రయించాడు. సెల్‌ఫోన్ కనింపచకుండా పోవడంతో భరత్‌ను బంధువులు ఆరాతీయడంతో భరత్ తానే దొంగలించినట్లను ఒప్పుకున్నాడు. అనంతరం బాలుడు తాను అమ్మిన షాపు వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వాలని షాపు యజమాని చాంద్ భాషాను కోరాడు. షాపు యజమాని సెల్ ఇవ్వకపోగా బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు. చాంద్ భాష కొట్టిన దెబ్బలకు తీవ్ర అస్వస్థకు గురై భరత్ ఇవాళ మృతి చెందాడు. దీంతో షాపు యజమాని చాంద్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘జెండాపై కపిరాజు’ నటుడు మృతి
కొచ్చి(కేరళ): మలయాళ నటుడు అనిల్ మురళీ(56) గురువారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠన్మారణం తమిళ, తెలుగు పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ నటులు టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు భార్య సుమ, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. (చదవండి: సీనియర్ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత) Rest in peace Anil Etta. #AnilMurali 🙏 pic.twitter.com/nbCiPr09bD — Prithviraj Sukumaran (@PrithviOfficial) July 30, 2020 అనిల్ మొరళీ మొదట 1993లో ‘కన్యాకుమారియిల్ ఒరు కవిత’ అనే సినిమాతో తమిళ పరిశ్రమలో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాతి తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో నాని హీట్ సినిమా ‘జెండాపై కపిరాజు’, ’రంగేలీ కాశీ’లో నటించిన ఆయనకు తమిళంలో నటించిన ‘అవతారం’, ‘రాక్ అండ్ రోల్’, ‘బాడీగార్డ్’, ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘బ్రదర్స్ డే’ చిత్రాల్లోని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆయన సినమాల్లోకి రాకుముందు పలు సీరియల్లో కూడా నటించారు. ఆహా డిజటల్ ప్లాట్‌ఫాంలో వస్తున్న ‘ఫొరోన్సిక్’ ఆయన చివరి చిత్రం. ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. -
బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు మృతి
కోల్‌కతా: బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) అధ్యక్షుడు సోమెన్ మిత్ర(78) గురువారం మృతి చెందారు. 1972-2006 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్ ఆయన మరణించినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. కిడ్ని, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న మిత్రను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన జూలై 30వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు గుండె నొప్పితో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మిత్రకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మిత్ర ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిత్ర మరణవార్తను ఆయన కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. సోమెన్ మిత్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ My heart goes out to the family of the Lt Somen Mitra. He was a giant of Bengal and he touched the lives of millions of people in his long journey. My condolences to his family and all those who admired him. His legacy will not be forgotten. @INCIndia @INCWestBengal https://t.co/YljhsJ0f0M — Gaurav Gogoi (@GauravGogoiAsm) July 29, 2020 -
వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆకతాయిల లైంగిక వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పీలేరులో జరిగింది. పీలేరు బండ్ల వీధికి చెందిన విజయలక్ష్మిని అదే వీధికి చెందిన కొంత మంది యువకులు వేధించడంతో మనస్తాపం చెంది ఈ రోజు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (చదవండి: బైక్ తాకినందుకు రోడ్డుపైకి ఈడ్చి దాడి) -
ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత
ముంబై: ప్రముఖ నటుడు, బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:40 గంటలకు కన్నుముశారు. మార్చి 29, 1939న జన్మించిన జగదీప్‌కు ఇద్దరూ కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: దర్శక–నిర్మాత హరీశ్ షా కన్నుమూత) My first film & the first time I ever faced the camera, was in the film #yehrishtanatoote with the legend himself #Jagdeep bhai. We will miss you...May his soul rest in peace 🙏🏽 Our prayers & deepest condolences to the family. pic.twitter.com/uhBjYSZdVe — Johny Lever (@iamjohnylever) July 8, 2020 జగదీప్ సహా నటుడు, కమెడియన్ జాన్ లీవర్ ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నా మొట్టమొదటి సినిమా ‘యే రిషితా నా టూటే’లో లెజెండ్ నటుడు జగదీప్‌తో కలిసి నటించాను. జగదీప్ భాయ్ వియ్ మిస్ యూ. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించిన జగదీప్ 1975లో వచ్చిన ‘షోలే’లో సూర్య భోపాలి పాత్రను పోషించారు. ఆయన నటించిన అదే పాత్ర పేరుతో వచ్చిన ‘సూర్య భోపాలి’ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అందాజ్ అప్నా, బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు. -
ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి
సాక్షి, వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే పాలకొలను నారాయణరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆయన 1962లో మైదూకూరు నియోజకవర్గంలో స్వతంత్ర పార్టీ తరుపున ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మృతికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు, రాష్ట్ర మాజీ మహిళా అర్థిక ఛైర్ పర్సన్ క్రిష్ణమ్మ సంతాపం తెలిపారు. -
కరోనా భయం; యువతిపై అమానుషం!
నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్ల బస్సు కండక్టర్, డ్రైవర్ మానవత్వం మరిచి ప్రవర్తించారు. సదరు యువతిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారు ఆమెను బస్సు నుంచి తోయడంతో గుండెపోటుతో మరణించిందని కుటుంబ సభ్యులు మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 19 ఏళ్ల అన్షీక తన తల్లితో కలిసి యూపీ రోడ్‌వేస్ బస్సులో నోయిడా నుంచి షికోహాబాద్ వెళ్తుంది. మధుర సమీపంలో అన్షీక ఎండ కారణంగా అలసటగా ఉండటంతో మూర్చపోయింది. దీంతో ఆమెకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో కండక్టర్, డ్రైవర్ మధుర వద్ద బస్సు నుంచి ఆమెను తోసేయయడంతో యువతి మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు మాంట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ భీమ్ సింగ్ తెలిపారు. (గ్రేటర్లో కరోనా విజృంభణ.. జనం హైరానా ) పోస్టుమార్టం రిపోర్టులో అన్షీక గుండెపోటుతో మరణించినట్లు వెల్లడైంది. అన్షీకను బస్సు నుంచి కిందకు తోసే క్రమంలో డ్రైవర్, కండక్టతో వాదన జరుగిందని, అప్పుడే అన్షీకకు గుండెపోటు వచ్చి ఉంటుందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. ఇది సహజ మరణం కిందకు వస్తున్నందున ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సింగ్ పేర్కొన్నారు. ఇక మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. బస్సు ఎక్కేటప్పుడు తన సొదరి బాగానే ఉందని, ఎండకారణంగా అలసిపోయి మూర్చపోయిందని చెప్పాడు. దీంతో బస్సు మొత్తం తను కరోనా వైరస్ సోకినట్లుగా ప్రవర్తించడంతో డ్రెవర్, కండక్టర్ తన సోదరిని వేధించడం ప్రారంభించారని తెలిపాడు. ఆ తర్వాత తనని దుప్పటితో చుట్టి బస్సులోంచి విసిరారని ఆవేదన వ్యక్తం చేశాడు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు ) -
అమెరికాలో భారత సంతతి కుటుంబం మృతి
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు మంగళవారం ప్రకటించారు. మరణించిన వారిలో భరత్ పటేల్(62), ఆయన కోడలు నిషా పటేల్(32), ఆయన ఎనిమిదేళ్ల మనవరాలుగా పోలీసులు గుర్తించారు. తమ ఇంటి వెనకాల స్విమ్మింగ్ ఫూల్లో పడి వారు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. (బీజింగ్‌లో కరోనా.. సూపర్ స్ర్పెడ్డర్ అతనేనా !) ఈ ఘటనపై లెఫ్టినెంట్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. వారి పక్కింటివారు ఘటనపై సీపీఆర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు. అయితే అప్పటికే వారు మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కాగా వారు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్లో పడి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు ఆయన తెలిపారు. -
ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నా: క్రికెటర్
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటీ నుంచి పలువురు బాలీవుడ్ నటులు తాము కూడా ఒత్తిడికి గురయ్యామంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలు పంచుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ 12 కంటెస్టెంట్, క్రికెటర్ శ్రీశాంత్.. సుశాంత్ ఆత్మహత్యపై స్పందించాడు. సుశాంత్ మరణ వార్త తనను బాగా ప్రభావితం చేసిందన్నాడు. (సుశాంత్ మృతిపై విచారణకు ఎల్జేపీ నేత డిమాండ్) గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే గతేడాది దానిని బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ ఏడేళ్లకు కుదించారు. దాంతో అతడి నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో అతని రీఎంట్రీ ఖాయమైంది. ఫలితంగా కేరళ తరఫున ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్న శ్రీశాంత్.. ‘ఒకప్పుడు నేను చీకటిని చుశానని మీకు తెలుసు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇంటి నుంచి అసలు బయటకు వచ్చేవాడిని కాదు. అలా ఒంటరిగా గడపుతున్న క్రమంలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి’ అంటూ తాను ఎదుర్కొన్నా చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా శ్రీశాంత్ గుర్తుచేసుకున్నాడు. (‘ఆ సినిమా నుంచి సుశాంత్ అభిమానిగా మరాను’) ‘‘నేను ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు నిరాశ, ఒత్తిడికి లోనయ్యేవాడిని. కానీ రూమ్ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహీనతను, నిరాశను నా తల్లిదండ్రులు చూపించాలనుకోలేదు. ఎందుకంటే బయటి ప్రపంచానికి నేను శ్రీశాంత్‌ని కానీ నా పేరెంట్స్‌కి మాత్రం గోపుని. కానీ నా గదిలో నేను ఏంటన్నది నాకు కూడా తెలియదు. ఇది నేను 2013లో నిరంతరాయంగా పోరాడిన చీకిటి కాలం. అందుకే సుశాంత్ సింగ్ మరణ వార్త నన్ను బాగా ప్రభావితం చేసింది. తన మరణానికి కారణం తెలియగానే ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నాను’’ అంటు చెప్పుకొచ్చాడు. -
సుశాంత్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి వారం దాటుతున్న ఇంకా ఎవరు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలలో కలకలం రేపింది. సుశాంత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. స్టార్ కిడ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బాలీవుడ్లో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, టాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌ఫాలో స్టార్ కిడ్స్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్శహిస్తున్నారు. అభిమానులే కాకుండా బాలీవుడ్ స్టార్లు కూడా సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలను బయటపడుతున్నారు. (‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’) కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మంది బంధుప్రీతి చూపిస్తున్నారంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఈ విషయంలో తన అభిమానులు .. సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ సైతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. దీనికి సంబంధించి రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సుశాంత్ తన కలలో కనిపించి బాలీవుడ్ తనని వెలివేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేగాక త్వరలోనే సుశాంత్ తనకు బిడ్డగా జన్మించబోతున్నాడని ఈ సందర్భంగా రాఖీ వెల్లడించారు. దీంతో పాటు పూర్తి కానీ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్టు ఈ వీడియోలో రాఖీ సావంత్ తెలిపింది. (‘సుశాంత్ నెలసరి ఖర్చు రూ. 10 లక్షలు’) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Jun 21, 2020 at 1:17am PDT -
సుశాంత్ ఇంట మరో విషాదం
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ ఆకస్మిక మృతిని తట్టుకోలేక అతడి వదిన (కసిన్ బ్రదర్ భార్య) బీహార్‌లోని పూర్ణియాలో సోమవారం కన్నుముశారు. సుశాంత్ మరణంచిన విషయాన్ని తట్టుకోలేని ఆమె.. అప్పటి నుంచి ఆహారం తీసుకోవడం మానేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె బీహార్‌లో తుది శ్వాస విడిచారు. (అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!) సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని, ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. (‘ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావనుకుంటున్నా’) -
జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, రాజమండ్రి: జెన్కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కరోనా: కానిస్టేబుల్ మృతికి సీపీ సంతాపం
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి కుటుంబానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సంతాపం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి మృతి బాధకరమన్నారు. ఆయన కోర్టు బీట్ చూస్తుండేవాడని.. ఒక మంచి ఆఫీసర్‌ను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి) ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన పిల్లల చదువులు మొత్తం ఓ ఎన్జీఓ చూసుకుంటుందని, ఆయన భార్యకు ఉద్యోగం కలిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం కరోనాతో యుద్ధం చేస్తున్నామని, ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా పోలీసు స్టేషన్‌కు పబ్లిక్ వచ్చేటప్పుడు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులకు ఆయన సూచించారు. (ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు) -
ప్రముఖ సీనియర్ గాయని మృతి
బెంగళూరు : ‘ఉభయ గాన విదుషి’గా పేరుగాంచిన ప్రఖ్యాత హిందూస్థానీ, కర్ణాటక సంగీత గాయకురాలు శ్యామల జి భావే(79) శుక్రవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఆమె నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కొంతకాలంగా శ్యామల హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొంది మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించడంతో ఈ రోజు ఉదయం గుండేపోటుతో కన్నుమూసినట్లు వారు వెల్లడించారు. అయితే ఆమెరికాలో నివసిస్తున్న ఆమె సోదరి నిర్మలా వచ్చాకే అంత్యక్రియలు చేయాలనే యోజనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఆమె తండ్రి, ప్రఖ్యాత దివంగత గోవింద్ విఠల్ భావే శ్యామలకు హిందూస్థానీ సంగీతంలో శిక్షణ ఇవ్వగా... ప్రముఖ కర్ణాటక గాయకులు ఎ సుబ్బారాయ, బి దోరేస్వామి ఆమెకు కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తల్లి లక్ష్మీ భావే కూడా శాస్త్రీయ గాయకురాలే. ఇక శ్యామల 12 ఏళ్ల వయసు నుంచే సంగీత ప్రదర్శలు ఇవ్వడం ప్రారంభించారు. కాగా మైసూర్ 19వ దివాన్ సర్ ఎం విశ్వేశ్వరాయ ఆమెకు ‘ఉభయ గాన విదుషి’ బిరుదును ప్రదానం చేశారు. -
కరోనా: అమెరికాలో మరో ఇద్దరు వైద్యులు మృతి
న్యూజెర్సీ: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వైద్యులు కరోనా బారిన పడి, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. 35 ఏళ్లకు పైగా తాను పని చేస్తున్న క్లారా మాస్ మెడికల్ సెంటర్లోనే సత్యేందర్ దేవ్ ఖన్నా(78)తో పాటు, ఆయన కుమార్తె ప్రియా ఖన్నా(43) మరణించారు. ఈ విషయాన్ని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మార్ఫీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘వారి మరణ వార్త బాధాకరం.. ఇతరుల కోసం వారి జీవితాలను అంకితం చేశారు’ అని ప్రశంసిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు. ‘అమెరికాలో దశాబ్ధాల క్రితం వైద్యుడిగా స్థిరపడిన సత్యేందర్ దేవ్ ఖన్నా న్యూజెర్సీలోని పలు ఆసుపత్రులకు శస్త్ర చికిత్స విభాగానికి అధిపతిగా పని చేస్తున్నారు. ఇక ఆయన కుమార్తె ప్రియా ఖన్నా ఆర్‌డబ్ల్యూజే బర్నబాస్ ఆరోగ్య విభాగంలో హాస్పిటల్ చీఫ్ ఆఫ్ రెసిడెంట్స్‌గా పనిచేస్తున్నారు’ అని ట్వీట్లో తెలిపారు. (కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం) ‘‘భారతీయ సంతతికి చెందిన డాక్టర్ సత్యేందర్ దేవ్ ఖన్నా, ఆయన కుమార్తె ప్రియా ఖన్నాలు దశాబ్థాలుగా న్యూజెర్సీలో ప్రధాన వైద్యులుగా పని చేస్తున్నారు. కరోనా నుంచి ఇతరులను కాపాడేందుకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో వారిద్దరూ ఆ మహమ్మారికి బలైపోయారు. వీరి కుటుంబం ఆరోగ్యం, వైద్యానికి అంకితమైన కుటుంబం. అయితే ఈ మాటలు ఆ కుటుంబానికి వారు లేని లోటును తీర్చలేవు. ఈ తండ్రికూతుళ్ల మరణానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా’’ అంటూ గవర్నర్ మర్ఫీ ట్వీట్లో పేర్కొన్నారు. సత్యేందర్ భార్య కోమ్లిష్‌ను గవర్నర్ పరామర్శించారు. కాగా సత్యేందర్ మరో ఇద్దరు కూతుర్లు సుగంధ ఖన్నా కూడా వైద్యులుగా పనిచేస్తున్నారు. (అమెరికాలో చైనా శాస్త్రవేత్త దారుణ హత్య) -
కరోనా మృతుల్లో నల్ల జాతీయులే అధికం
న్యూఢిల్లీ : నల్ల జాతీయులు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని భావిస్తాం. వారు ఆకలి బాధతో తపించి, రోగాల బారిన పడి అంత త్వరగా చనిపోరనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారిలో శ్వేత జాతీయులకన్న నల్ల జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నారట. ఇంగ్లండ్, వేల్స్లో నల్ల జాతీయుల్లో పురుషులు శ్వేతజాతీయులకన్నా 4.2 రెట్లు ఎక్కువ, అదే నల్లజాతీయులైన మహిళలు 4.3 రెట్లు ఎక్కువగా మరణిస్తున్నారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్)’ తెలియజేసింది. శ్వేత జాతీయులకన్నా బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత జాతికి చెందిన వారు ఎక్కువగా మరణిస్తున్నారని ఓఎన్ఎస్ పేర్కొంది. మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేది మధ్యన బ్రిటన్‌లో సంభవించిన మరణాలను జాతుల వారిగా విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్ఎస్ తెలిపింది. (‘లాక్డౌన్లో కూడా ప్రమాదాల రేటు మారలేదు’ ) ఓఎన్ఎస్ ప్రకారం.. ఎక్కువ మరణాలకు కారణం కొంత మేరకు వారి సామాజిక, ఆర్థిక వెనకబడిన తనం కాగా, అంతుచిక్కని ఇతర కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆరోగ్యం, వైకల్యం లాంటి ఇతర కారణాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినప్పటికీ శ్వేత జాతీయులకన్నా నల్ల జాతికి చెందిన స్త్రీలు, పురుషులు 1.9 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ఓఎన్ఎస్ అధ్యయనంలో తేలింది. అందుకే నల్ల జాతీయులతోపాటు నిమ్న జాతీయులే ఎక్కువగా మరణించడానికి దారితీస్తున్న కారణాలపై దర్యాప్తు జరపాల్సిందిగా ‘బ్లాక్ అండ్ మైనారిటీ ఎత్నిక్ (బీఏఎంఈ)’ జాతులు డిమాండ్ చేస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్హెచ్ఎస్)లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందిలో కరానో బారిన పడి 72 శాతం మంది బీఏఎంఈ జాతీయులే ఎందుకు మరణించారని ఆ జాతులు ప్రశ్నిస్తున్నాయి. -
నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్ భార్య
బాలీవుడ్ లెజెండరి నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో బుధవారం తుది శ్వాస విడిచారు. కాగా ఆయన భార్య సుతప సిక్దర్ సోషల్ మీడియాలో తన భర్తతో దిగిన ఫొటోను గురువారం షేర్ చేస్తూ.. భావోద్యేగానికి లోనయ్యారు. అంతేకాదు సోషల్ మీడియాలోని తన ఖాతాలన్నింటికీ ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్న ఈ ఫొటోలో సుతప తన భర్త ఇర్ఫాన్ పక్కనే కూర్చుని ఆయన భుజాన్ని తన చేతులతో చుట్టేసుకుని కనిపిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు) తన భర్త లోకాన్ని విడిచినప్పటికీ తనతోనే ఉన్నాడంటూ ఉద్వేగంతో షేర్ చేసిన ఈ పోస్టుకు ‘నేను కోల్పోలేదు.. అన్ని విధాలుగా కలిగి ఉన్నాను’ అనే క్యాప్షన్‌ను జత చేసి పోస్టు చేశారు. ఆమె షేర్ చేసిన ఈ ఫొటో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. సుతప ఆత్మస్థైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయి అంబాని ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విలక్షణ నటుడి మరణానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించగా... బాలీవుడ్ ఓ గొప్ప నటుడి కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల భావోద్యేగంతో సంతాపం వ్యక్తం చేశారు. (మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగ మాటలు!) -
మరణంపై ఇర్ఫాన్ ఖాన్ భావోద్వేగ మాటలు!
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి బుధవారం కన్నుముశారు. కాగా ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘లైప్ ఆఫ్ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన సన్నివేశాన్ని ట్వీట్ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.(ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) ‘మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు’ అని చెప్పిన సన్నివేశానికి ‘‘మీమ్మల్ని మిస్ అవుతున్నాము సార్.. వీ లవ్ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు. కాగా హాలీవుడ్ డైరెక్టర్ అంగ్ లీ తెరకెక్కించిన ‘లైఫ్ ఆఫ్ పై’ లో ఇర్ఫాన్‌తో పాటు హీరోయిన్ టబు, సూరజ్ శర్మ నటించారు. ఈ చిత్రం నాలుగు ఆస్కార్ ఆవార్డులను అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) Scene from "LIFE OF PI" "I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye" We love and will miss you #IrrfanKhan. #ripirfankhan 🙏💔 pic.twitter.com/BFz0kRGhis — Devil V!SHAL (@VishalRC007) April 29, 2020 -
ఇర్ఫాన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం సినిమా, నాటక రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకే కాకుండా ప్రపంచ సినీ రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ తన నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పెద్దపేగు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మరణించారు. చిన్న వయసులోనే బాలీవుడ్ విలక్షణ నటుడు మరణించడం బాధాకరమని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇర్ఫాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం -
భారత్‌లో మూడో మరణం
న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం మూడో కరోనా మరణం నమోదైంది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో కేరళ(26 కేసులు) ఉంది. హరియాణా, యూపీలో చెరో 15, ఢిల్లీలో 8, లద్దాఖ్‌లో 6, కశ్మీర్లో 3 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 137కి పెరిగింది. వాటిలో సోమవారం రాత్రి నుంచి 12 కేసులు నమోదవడం గమనార్హం. ఈ 137 మందిలో 24 మంది విదేశీయులున్నారు. కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కోవిడ్‌తో మరణించడం తెల్సిందే. ముంబైలో మంగళవారం మరణించిన వ్యక్తి భార్యకు కరోనా వైరస్ సోకింది. ఆమె కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొత్త కేసుల్లో రెండు నోయిడాలో, రెండు బెంగళూరులో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన రెండు కేసులతో కలిపి కర్ణాటకలో నమోదైన కేసుల సంఖ్య 11కి పెరిగింది. అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి, చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14 అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన 137 మందితో సన్నిహితంగా ఉన్న దాదాపు 52 వేల మందిని గుర్తించామని, వారిని ఐసోలేట్ చేసి, వైద్య పరీక్షలు జరుపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక పరిశీలన, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం సహా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో థర్మల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయాలని, సందర్శకుల పాస్‌లను రద్దు చేయాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్న వారిని తక్షణమే వేరుగా ఉంచి, నిర్ధారణ పరీక్షలు జరపాలని సూచించింది. అనవసర పర్యటనలను రద్దు చేసుకోవాలని, వీలైన ప్రతీసారి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని అధికారులను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశించింది. ఫ్లూ లక్షణాలున్నవారికి సెలవుల మంజూరులో అలసత్వం చూపొద్దంది. ఎయిడ్స్‌కు వాడే మందులు కోవిడ్ సోకినవారికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాడే యాంటీవైరల్ ఔషధాలైన లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్‌ను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులకు సూచించింది. ఒక్కోకేసు తీవ్రత, లక్షణాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. 60 ఏళ్ల వయసు దాటిన, మధుమేహం, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు ఉన్న హై రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారికి లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్ ఇవ్వాలని సూచించింది. ‘క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్–19’ పేరుతో మంగళవారం ఒక మార్గదర్శక ప్రకటన విడుదల చేసింది. ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. లోపినవైర్, రొటినవైర్ కాంబినేషన్‌ను హెచ్ఐవీ చికిత్సకు వాడతారు. -
నిద్రలోనే తనువు చాలించాడు
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన భూర్ల అరుణ్‌కుమార్ (41) అమెరికాలో గురువారం రాత్రి మృతి చెం దాడు. జ్వరం, లోబీపీతో నిద్రలోనే తనువు చా లించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అమెరికాలోని హోస్టన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్.. రెండు రోజులుగా జ్వరం, లోబీపీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి కామారెడ్డిలోని తల్లితో భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు మాట్లాడారు. ‘అమ్మా నాకు దమ్ము వస్తోంది.. మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతోంది, రేపు మళ్లీ మా ట్లాడుతా’అని చెప్పాడు. అరుణ్ మందులు వేసుకుని నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతని భార్య రజనీ ఉద్యోగానికి వెళ్లింది. గంట తర్వాత ఫోన్ చేయగా..ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా అరుణ్ పలుకక పోవ డంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో అరుణ్ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. అమెరికా ప్రభుత్వం సమ్మతిస్తే అరుణ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు హోస్టన్‌లోని ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ సంస్థలు సమాయత్తమయ్యాయి. మృతదేహం ఇండియాకు తేవడం సాధ్యం కాదు పలు దేశాల్లో కరోనా వ్యాధి విజృంభించడం వల్ల అమెరికా నుంచి ఇండియాకు అరుణ్ మృతదేహాన్ని పంపించేందుకు అక్కడి ప్రభుత్వం అను మతివ్వకపోవచ్చని తెలుస్తోంది. అరుణ్ అంత్యక్రియలను అక్కడే నిర్వహిస్తారని చెబుతున్నారు. అరుణ్, రజనీ తల్లిదండ్రులు గురువా రం వేకువ జామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు. -
పండుగ పూట విషాదం
సంగెం/భూపాలపల్లి అర్బన్/మల్హర్: హోలీ వేడుకలు ముగించుకుని స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసు కున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కాపులకనిపర్తికి చెందిన కందికట్ల యశ్వంత్ (13) బర్ల రాజ్‌కుమార్ (13), సదిరం రాకేష్ (12), దౌడు రాకేష్ (9) స్నే హితులతో కలసి హోలీ ఆడారు. అనంతరం పాయచెరువులో స్నానానికి దిగా రు. యశ్వంత్, దౌడు రాకేష్ మొరం కోసం తీసిన గోతిలో పడి చనిపోయారు. వారి వెనుక వెళ్లిన సదిరం రాకేష్ తృటిలో బయటపడ్డాడు. అలాగే.. భూపాలపల్లి జవహర్‌నగర్ కాలనీ చెందిన మాచర్ల కల్యాణ్S(16) మల్హర్ మండలం తాడ్వాయి గ్రామ సమీప చెరువుకు వెళ్లాడు. అందులో స్నానం చేసేందుకు దిగి.. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. హసన్‌పర్తి మండలం నిరూప్‌నగర్ తండాకు చెందిన భూక్య తిరుపతి (16) గ్రామంలోని దామోదర చెరువులోకి ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు. -
చిన్నమ్మకు షాక్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆంతరంగికురాలు శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కానున్నారనే అంచనాలపై పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.అలా జరగడానికి వీల్లే దని ఆమె తెగేసి చెపుతున్నారు. తన ప్రాణం పోయేంత వరకు చిన్నమ్మ(శశికళ) మీద పోరాటం చేస్తానని ఆమె సవాల్ చేశారు. తన చివరి శ్వాస వరకూ ఆమె కుట్రలను సాగనివ్వనని హెచ్చరించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన శశికళ పుష్ప కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందన్న అందరూ నమ్ముతున్న ప్రస్తుత తరుణంలో ఆమె పార్టీ భవిష్యత్ నేత ఎలా అవుతుందని ప్రశ్నించారు. కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనిశశికళ నటరాజన్ కు కు ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు ఎలా అప్పగిస్తారని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు తీసుకున్న తరువాత ఆ పార్టీని ఆమె భర్త నటరాజన్ నడిపిస్తాడని, అందులో ఎలాంటి డౌట్ లేదని శశికళ పుష్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మద్దుతుపై ప్రశ్నించినపుడు అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్లను శశికళ నటరాజన్ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, అందుకే వారు పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తాను అడ్డుకుంటానని అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పార్టీకి దిశా నిర్దేశం చేయాలని ఆశిస్తున్నాన్నారు. సీనియర్లకే ఆ పదవి వచ్చేలా చెయ్యాలని, శశికళ నటరాజన్ కుట్రలను అడ్డుకోవాలని శశికళ పుష్ప కోరారు. జయలలితకు శశికళ 35 సంవత్సరాలు సేవ చేసినంత మాత్రాన అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా ఇంటిలో గత 25 సంవత్సరాల నుంచి ఒకరు పని చేస్తున్నారు అయితే తన పదవిని ఎలా ఇచ్చేస్తానంటూ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉండటానికి ఆ పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు అంగీకరించరన్నారు. శశికళ నటరాజన్ చేతికి పగ్గాలు ఇస్తే వారి కుటుంబ సభ్యులను రాజ్యసభలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారని ఆరోపించారు.ఇప్పటికైన పార్టీ లీడర్లు జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకుని కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. కాగా అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్లు పోటీ పడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ,శశికళనే పార్టీ పగ్గాలు చేపడుతారనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
మాజీ ఎంపీ సదాశివరామ్ అస్తమయం
సాక్షి, ముంబై: మాజీ పార్లమెంట్ సభ్యుడు సదాశివరావ్ మండలిక్ (80) సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాదపడుతున్న శివరావ్ బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోల్హపూర్ జిల్లా రాజకీయాలో బలమైన నాయకునిగా గుర్తింపు పొందిన ఆయన 1934లో కోల్హపూర్ జిల్లా కాగల్ తాలూకా మురగడ్ గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన తక్కువ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. మూడు సార్లు కోల్హపూర్ లోక్‌సభ సభ్యునిగా, కాగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో విభేదాల కారణంగా ఎన్సీపీలో తిరుగుబాటు చే సి స్వతంత్రంగా పోటీచేసి విజయ దుందుభి మోగించారు. ప్రజల సమస్యల కోసం నిత్యం ముందుండే ఆయనకు జిల్లా రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా గుర్తింపు లభించింది. జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు గానూ ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన కుమారుడు సంజయ్ మండలిక్ శివసేన పార్టీలో కొనసాగుతున్నారు. సదాశివరావ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కోల్హపూర్ జిల్లాలోని మురగడ్ గ్రామంలో నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర కీలక యకున్ని కోల్పోయింది: ముఖ్యమంత్రి సదాశివరావ్ మరణంతో రాజకీయాల్లో పూడ్చలేని లోటు ఏర్పడిందని, పశ్చిమ మహారాష్ట్ర కీలక నాయకున్ని కోల్పోయిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. చెరకు రైతుల సమస్యలపై తనదైన శైలిలో పోరాడి అందరికి న్యాయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాజకీయాలతో పాటు వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు.