
సియోల్: దక్షిణ కొరియా సంస్థను గ్లోబల్ టెక్ టైటాన్‌గా మార్చిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శామ్‌సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ (78) కన్నుమూశారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. లీ సారథ్యంలోనే శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్‌లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేస్తూ.. లీ నిజమైన దార్శనికుడని, శాంసాంగ్‌ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చారంటూ కొనియాడింది. కాగా శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని 10వ వంతుతో సమానంగా ఉంది. (చదవండి: వాళ్ల బాస్ నిజం తెలుసుకునే చాన్సే లేదు (స్పాన్సర్డ్)
అయితే లీకి 2014లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం అనంతరం లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో శాంసంగ్ సంస్థను లీ అగ్రగామిగా తీర్చిదిద్దారు. (చదవండి: ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు)