Seoul
-
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
సాకేత్ జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.తొలి రౌండ్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.అనిరుధ్ జోడీ ముందంజ ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.రిత్విక్ ద్వయం ముందంజసాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
మూడు నగరాల ముచ్చట
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి) ఈశాన్య ఆసియాలో దక్షిణ కొరియాను ఆర్థిక హబ్‌గా నిలపాలన్న లక్ష్యంతో 2003లో ది ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఐఎఫ్ఈజెడ్)ను ఏర్పాటు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇక్కడే రూ.5 లక్షల కోట్ల వ్యయంతో మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేశారు. మూసీ పునరుజ్జీవం, ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ బృహత్తర ప్రాజెక్టులపై అధ్యయనానికి రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజైన బుధవారం ఇంచియాన్ నగరంలో అభివృద్ధి చేసిన 3 అంతర్జా తీయ స్మార్ట్ సిటీలను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. పనిలోపనిగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది. సాంగ్డో నగరంలో ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), సేవల పరిశ్రమలు, చెయోంగ్నాలో ఫైనాన్స్, హైటెక్ ఇండస్ట్రీలు, యోంగ్జోంగ్లో లాజిస్టిక్, టూరిజం పరిశ్రమలను అభి వృద్ధి చేశారు. ప్రస్తుతం 122.34 చదరపు కిలో మీటర్లు (చ.కి.మీ.) విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు నగరాల్లో 5,43,653 జనాభా నివాసం ఉంటోంది. 3 గంటల్లో ఇతర నగరాలకు..ఇంచియాన్ నుంచి షాంఘై, బీజింగ్, హాంగ్‌కాంగ్ వంటి నగరాలకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. దీంతో ఎగుమతి, దిగుమతి కేంద్రాలకు ఇంచియాన్ నిలయంగా మారింది. పబ్లిక్, మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, ఫెర్రీ టెర్మినల్స్తో మెరుగైన రవాణావ్యవస్థ ఉంది. ఇంచియాన్లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండటంతో పరిశ్రమ అవసరాలకు తగ్గిన నిపుణులు, నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరతే లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న స్థలాలు, దీర్ఘకాలంపాటు లీజు, నిర్మాణ వ్యయంలో రాయితీలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) భద్రత, విదేశీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు వంటివి అందిస్తున్నారు.స్టార్టప్ పార్క్..ఇప్పటివరకు ఐఎఫ్ఈజెడ్లో 14.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. ఇందులో 206 గ్లోబల్, 3,481 స్థానిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, రోబో, డ్రోన్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్ (జీసీఎఫ్) వంటి ఐక్యరాజ్య సమితికి చెందిన 15 కార్యాలయాలు న్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతను ఆకర్షించేందుకు ఇంచియాన్ నగరంలో స్టార్టప్ పార్క్‌ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో 422 స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారు 208 బిలియన్ వాన్ నిధులను సమీకరించాయి. ఇంచియాన్ గ్లోబల్ క్యాంపస్‌తో పాటు 6 కొరియన్ వర్సిటీలు, విదేశీ విశ్వ విద్యాలయాలున్నాయి. -
అనుక్షణం భయం..భయం!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి) ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. అలాంటిది ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాల మధ్య సరిహద్దుల్లా కాకుండా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సియోల్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. సందర్శన సమయంలోనే అక్కడ బాంబుల మోత మోగింది. ప్రతిక్షణం ఇరు దేశాల సైనికులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారని, అది సర్వసాధారణమని అక్కడి సైనికాధికారులు పేర్కొంటున్నారు. రెండు దేశాలను వేరు పరిచేదే డీఎంజెడ్..ఇరు దేశాలను సమానంగా ఈ డీఎంజెడ్ వేరుపరుస్తుంది. 4 కిలోమీటర్ల వెడల్పు, 258 కిలోమీటర్ల పొడవుతో ఈ సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది. ఇరువైపులా భారీస్థాయిలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ డీఎంజెడ్కు రెండువైపులా ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ స్థాయిలో సైనికులను మోహరించారు. డీఎంజెడ్‌లో మాత్రం సైనికులెవరూ ఉండరు. ఎలాంటి సైనిక కార్యకలాపాలు మాత్రం జరగవు. 1953లో ఇక్కడ సైనిక తటస్థ ప్రాంతం (డీఎంజెడ్) ఏర్పాటు చేశారు.ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన సమయంలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే 1953లో ఇరుదేశాల మధ్య అమెరికా, చైనా కలిసి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించాయి. రెండుదేశాలు ఇప్పటికీ అంగీకరించలేదు. కానీ డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రం ఎలాంటి సైనిక చర్య ఉండదు. ఇదే ప్రదేశంలో 1635 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల వెడల్పుతో ఓ టన్నెల్ కూడా ఉంది. ఈ సొరంగాన్ని ఉత్తర కొరియా సైనికులు సియోల్పై దాడి చేసేందుకు తవ్వారని చెబుతారు. ఇది పూర్తి కాకముందే ఐక్యరాజ్య సమితి పోలీసు అధికారులు గుర్తించి ఉత్తర కొరియాను హెచ్చరించారట. అయితే తొలుత అసలు ఈ సొరంగాన్ని తవ్వలేదని ఉత్తర కొరియా బుకాయించినా.. చివరకు అది గనుల తవ్వకాల్లో భాగంగా తవ్వామని మాట మార్చిందని అక్కడి పర్యాటకుల సందేశంలో రాసి ఉంది. డీఎంజెడ్తో పాటు ఈ సొరంగాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హిల్ పాయింట్ వ్యూ నుంచి ఉత్తర కొరియాతోపాటు దక్షిణకొరియా గ్రామాలను వీక్షించొచ్చు. కాకపోతే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న ఫొటో కూడా తీసుకోవడానికి అనుమతివ్వరు. -
తేలియాడే రెస్టారెంట్లు.. రూఫ్‌టాప్ గార్డెన్లు
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్‌లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లు, బైక్ పాత్లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్‌స్పాట్‌గా హాన్ నది మారింది. నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది. స్వచ్ఛమైన మంచినీటిని సియోల్వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది. -
సియోల్పైకి మళ్లీ చెత్త బెలూన్లు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్పైకి ఆదివారం(జులై 21) ఉదయం నార్త్‌కొరియా మళ్లీ చెత్త బెలూన్లు ప్రయోగించింది. సియోల్పై చెత్త బెలూన్లు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్త బెలూన్లకు ప్రతీకారంగా సరిహద్దులో లౌడ్‌స్పీకర్లతో ఉత్తరకొరియా నియంత కిమ్‌కు వ్యతిరేక ప్రసారాలు చేస్తామని సియోల్ హెచ్చరించింది. చెత్త బెలూన్ల ప్రయోగంపై నార్త్ కొరియా స్పందించింది. కొంత మంది సౌత్ కొరియా పౌరులు బెలూన్ల ద్వారా నార్త్ కొరియాపైకి రాజకీయ కరపత్రాలు పంపడం వల్లే తాము చెత్త బెలూన్లు ప్రయోగించామని తెలిపింది. ఇది కొనసాగితే రానున్న రోజుల్లో సౌత్‌కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నియంత కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. గతంలోనూ సౌత్కొరియాపైకి నార్త్‌కొరియా చెత్త బెలూన్లను ప్రయోగించింది. -
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్‌ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్‌ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్‌సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. -
Seoul: సౌత్‌కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్‌లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్‌లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!
మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!. అలాంటి వెరైటీ స్టోర్ సియోల్‌లో ఉంది. దీనిపేరు రామెన్ స్టోర్. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్‌పే చేసే ఆటోమెటిడ్ మెషిన్లో ఎంటర్ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్ పేయింగ్ అన్నమాట!. ఈ మేరకు ఫుడ్ వ్లోగర్ లిల్లీ హ్యూన్ అనే ఆమె ఆ స్టోర్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్, ప్రిపరేషన్‌కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్ డిష్‌లను తాను ఎలా తీసుకుని బిల్ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్ డిష్‌లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్ ఔట్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Lily Huynh (@biteswithlily) (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చా.. దంపతులు చేసిన పనికి విల్లా యజమాని షాక్..?
వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీకి భారీషాక్ తగిలింది. ఇద్దరు దంపతులు తీర్చుకున్న రివెంజ్ దెబ్బతో ఆ సంస్థకు రూ.1.2లక్షల నష్టం వాటిల్లింది. వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన భార్యభర్తలు సౌత్ కొరియాలో సియోల్‌లో 25 రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీలో సియోల్‌లో ఓ విల్లాను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే సమయంలో విల్లా యజమాని ‘లీ’(Lee)ని, ఎయిర్‌బీఎన్‌బీని సంప్రదించలేదు. అయితే వాళ్లిద్దరూ తాము బుక్ చేసుకున్న విల్లా నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని తెలుసుకొని కంగుతిన్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విల్లా ఓనర్ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక చైనా నుంచి సియోల్‌కు వచ్చారు. 25 రోజుల పాటు విల్లాలో ఉన్న భార్యభర్తలు విల్లా ఓనర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. లీ’కి ఫోన్ చేసి మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు మా విల్లాలో సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో తమ ప్లాన్‌ను అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్‌లను ఆన్ చేశారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే సియోల్‌ను సందర్శించారు. ఆ ఐదు రోజుల్లో ఐదైదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. గడువు ముగియడంతో విల్లాను ఖాళీ చేశారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ అధికారులు విల్లా ఓనర్‌కు లీకి ఫోన్ చేశారు. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అధికారులు సమాచారంతో విల్లాలో ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని బయపడ్డారు. విల్లాను సందర్శించిన తర్వాత దంపతులు చేసిన పనికి యజమానికి లీ షాక్‌కు గురయ్యాడు. విల్లాలో ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో కిటికీలు తెరిచి ఉండడం, గ్యాస్ ఆన్‌లో ఉండడం గమనించాడు. $116 (రూ. 9,506) నీరు, కరెంట్ $730 (రూ. 59,824), గ్యాస్ ఇతర $728 (రూ. 59,660) బిల్లులు వచ్చాయి. 120,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించారు. భార్య భర్తల ప్రతీకారంతో తమ సంస్థకు భారీ ఎత్తున నష్టం జరిగిందని ఎయిర్‌బీఎన్‌బీ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ప్రతీకారం తీర్చుకున్న చైనాలో ఉన్న భార్యభర్తలపై కోర్టును ఆశ్రయిస్తానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని లీ చెప్పడం కొసమెరుపు. చదవండి👉 ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు! -
మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్
సియోల్: రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్‌కాల్స్‌పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే.. -
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వేడుకలో దాదాపు 150పైగా ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువ గాయకుడు, నటుడు లి జి హాన్(24) కూడా మృతి చెందారు. లి జి హాన్(Lee Ji-han) మృతితో దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న సియోల్‌లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఈ యంగ్ పాప్ సింగర్ మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు లీ జీ హాన్ మృతిపై కొరియాకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా రాజధాని నగరం సియోల్‌లో రద్దీగా ఉండే నైట్ లైఫ్ జిల్లా ఇటావాన్‌లో శనివారం(అక్టోబర్ 29న) హాలోవీన్ వేడుకులను నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి ఇరుకైన వీధుల్లోంచి జనం ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక దాదాపు 154పైగా మంది మరణించారు. అందులో ఈ యువ గాయకుడు లీ జీ హాన్ ఒకరు. -
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం (ఫోటోలు)
-
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్‌ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Officials in Seoul said that at least 120 people were dead and 100 others were injured after a stampede in the South Korean capital's popular Itaewon district, where crowds had gathered to celebrate Halloween. https://t.co/auJuczo3Ll pic.twitter.com/7FXmfW8qab — The New York Times (@nytimes) October 29, 2022 ఇటెవోన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు. WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw — Reuters (@Reuters) October 29, 2022 పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది. Pushing and stressing hysterically, a man tries to escape..during the celebrations at the Halloween party..in South Korea..#SouthKorea #Halloween #Seoul #Itaewon #이태원 #이태원사고 #압사사고. pic.twitter.com/qqmgvLOXVf — Siraj Noorani (@sirajnoorani) October 29, 2022 తోపులాటకు కారణం తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్ బార్‌కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం. అత్యవసర సమావేశం విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్, దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ విషయమై తమ జపాన్ కోస్ట్ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్ రీగన్ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉత్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి. అదీగాక అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది. (చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు!) -
జనవరిలో పెళ్లి ప్రకటన, తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
సౌత్ కొరియాకు చెందిన స్టార్ హీరోయిన్ పార్క్ షిన్ హై తల్లయింది. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు కొరియన్ మీడియా వెల్లడించింది. సియోల్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో పార్క్ షీన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సాల్ట్ ఎంటర్టైన్మెంట్ ఎజెన్సీ ప్రకటించింది. ప్రియుడు, సహా నటుడు చోయి టే జూన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న ఈ ఏడాది జనవరి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లిని, ప్రెగ్నెన్సీని ఒకేసారి ఈ జంట ప్రకటించింది. చదవండి: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు తాజాగా ఈ జంటకు బిడ్డ పుట్టడంతో ఈ కొత్త దంపతులకు సౌత్ కొరియాకు చెందిన నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా 2017 నుంచి పార్క్ షిన్ హై, చోయి టే జూన్‌లు డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022 జనవరిలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని, ప్రస్తుతం షీన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా షిన్ హై ‘‘స్టేర్వే టూ హేవెన్, మిరాకిల్ ఇన్ సెల్ నెం.7, యూ ఆర్ బ్యూటీఫుల్, ది హెయిర్స్’’ వంటి సిరీస్‌తో గుర్తింపు పొందింది. చదవండి: OTT: అమెజాన్‌లో కేజీయఫ్ 2 స్ట్రీమింగ్, ఇకపై ఉచితం View this post on Instagram A post shared by 박신혜/Shin Hye Park (@ssinz7) -
గుడ్‌న్యూస్: ఇక మాస్క్‌లతో పని లేదు
సియోల్: మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇకపై మాస్క్‌లు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం అవసరం లేదు. మాస్క్‌లకు బై బై చెప్పేసి శానిటైజర్లను ఇక పక్కన పడేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో సంతరించుకుంటోంది. రెండు నెలల్లో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేవగంగా సాగుతోంది. దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ పూర్తి చేశారు. జూన్‌లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయొల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1,37,682. నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఆ దేశంలో వేస్తున్నారు. -
శాంసంగ్ చైర్మన్ లీకున్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియా సంస్థను గ్లోబల్ టెక్ టైటాన్‌గా మార్చిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శామ్సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ (78) కన్నుమూశారు. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. లీ సారథ్యంలోనే శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్ ఫోన్లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి కంపెనీగా అవతరించింది. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేస్తూ.. లీ నిజమైన దార్శనికుడని, శాంసాంగ్‌ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చారంటూ కొనియాడింది. కాగా శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని 10వ వంతుతో సమానంగా ఉంది. (చదవండి: వాళ్ల బాస్ నిజం తెలుసుకునే చాన్సే లేదు (స్పాన్సర్డ్) అయితే లీకి 2014లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం అనంతరం లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో శాంసంగ్ సంస్థను లీ అగ్రగామిగా తీర్చిదిద్దారు. (చదవండి: ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు) -
పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయి
సియోల్ : కరోనా వైరస్ జనాలను ఎంత భయపెడుతుందో చెప్పడానికి ఈ వార్తను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం ముట్టుకునే ప్రతీచోట వైరస్ ఉంటుందో లేదో తెలియదు గాని... మనం చేసే పనులు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కరోనా వైరస్‌కు భయపడి మనం తినే కూరగాయలు నుంచి వాడే ప్రతి వస్తువును శుభ్రం చేసే తీసుకుంటున్నాం. ఇది మంచిదే.. కరెన్సీ నోట్లకు వైరస్ ఉంటుందా లేదా అన్నది పక్కనపెడితే.. ఒకవేళ ఉన్నా వాటిని ఒకసారి నీళ్లలో ముంచి ఎండలో పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రబుద్దుడు వైరస్ సోకుంతుందేమోనని భయపడి వాటిని వాషింగ్ మెషిన్లో వేశాడు. ఇంకేముంది మంచిగా ఉన్న కరెన్సీ నోట్లన్నీ నిమిషాల్లో చిత్తుకాగితాల్లా మారిపోయాయి. వైరస్ రాకుండా శుభ్రత పాటించడం మంచిదే.. కానీ ఆ శుభ్రత మరీ ఎక్కువైపోతే ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయి.(పొగాకు నుంచి కోవిడ్ వ్యాక్సిన్?) ఈ ఘటన దక్షిణకొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది. సియోల్‌కు చెందిన ఒక వ్యక్తికి తన కుటుంబసభ్యుని అంత్యక్రియలు జరిపించమని అతని బంధువులు, మిత్రులు 50వేల వాన్ (కొరియా కరెన్సీ) అందజేశారు. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు 3వేల రూపాయలు. అయితే వారు ఇచ్చిన డబ్బుకు కరోనా వైరస్ ఉందన్న అనుమానం అతనికి వచ్చింది. వాషింగ్ మెషిన్లో ఆ నోట్లను వేస్తే వైరస్ సోకకుండా డిస్ ఇన్ప్క్ట్ చేస్తుందని భావించాడు.అంతే ఆ నోట్లన్నీ తీసి వాషింగ్ మెషిన్లో వేశాడు. ఒక్కరౌండ్ స్పిన్ అవగానే నోట్లను బయటికి తీసి చూడగా చాలా వరకు నోట్లు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి పరుగున బ్యాంకుకు వెళ్లి అసలు విషయం చెప్పి సహాయం చేయాలని కోరాడు. అయితే బ్యాంకు అధికారులు ఆ నోట్లను పరిశీలించి ఇవి చెల్లవని.. ఏ సహాయం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు లబోధిబోమంటూ ఎలాగైనా తనను ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. అధికారులు ఈ విషయాన్ని మేనేజర్ సియో జున్ వోన్ దృష్టికి తీసుకెళ్లారు. నోట్లలో చాలా వరకు చిరిగినవి ఉన్నాయని.. మంచి నోట్లను పరిశీలించి చూడగా కేవలం 507 వాన్లు మాత్రమే బాగున్నాయని చెప్పి బాధితుడికి అంతే మొత్తం ఇచ్చి అక్కడినుంచి పంపించేశారు. దయచేసి కరెన్సీ నోట్లను వాషింగ్ మెషిన్, ఓవెన్లలో వేయొద్దని ప్రజలకు బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి. -
లైంగిక ఆరోపణలు : మేయర్ బలవన్మరణం
సియోల్ : దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి పోటీపడతారని భావిస్తున్న సియోల్ మేయర్ ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సియోల్ మేయర్ పార్క్ వాన్‌సూన్ మృతదేహాన్ని నగరానికి సమీపంలోని పర్వత ప్రాంతంపై కనుగొన్నారు. మీటూ ఆరోపణలతో వివిధ రంగాల ప్రముఖులపై బాధిత మహిళలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో పార్క్ వాన్‌సూన్ విషాదాంతం చోటుచేసుకుంది. ఆయన అధికార నివాసంలో లభించిన సూసైడ్ నోట్లో ఈ ప్రపంచాన్ని వీడుతున్నందుకు అందరూ తనను క్షమించాలని రాసుకున్నారు. తన దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను తన తల్లితండ్రుల సమాధుల వద్ద చల్లాలని ఆయన కోరారు. తన కుటుంబాన్ని బాధపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను మన్నించాలని పార్క్ వాన్‌సూన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించకుండా బై ఎవిరివన్ అంటూ లేఖను ముగించారు. దశాబ్ధ కాలంగా సియోల్ మేయర్‌గా కొనసాగుతున్న పార్క్ దక్షిణ కొరియా రాజకీయాల్లో, పాలక డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గతంలో తన కార్యదర్శిగా పనిచేసిన మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా 2015లో పార్క్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పనివేళల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన అండర్వేర్ ధరించి ఉన్న సెల్ఫీలను తనకు పంపి మెసెంజర్ యాప్‌లో అసభ్యకర కామెంట్లు చేసేవారని ఫిర్యాదు చేశారు. పార్క్ చర్యలతో తనకు విపరీతంగా భయం వేసేదని, సియోల్నగర ప్రజలు, నగర ప్రయోజనాల కోసం వాటిని భరించానని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదును ధ్రువీకరించిన పోలీసులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు పార్క్ మరణించడంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళ చేసిన ఫిర్యాదులపై విచారణ సైతం ముగిసిపోనుంది. చదవండి : హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు -
ఉత్తర కొరియా దుందుడుకు చర్య.. ఉద్రిక్తత!
సియోల్: ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. సైనిక చర్యకు దిగుతామని ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా యూనిఫికేషన్ మినిస్ట్రీ(ఏకీకరణ మంత్రిత్వ శాఖ- కొరియా పునర్‌కలయికను ప్రోత్సహించేందుకు నెలకొల్పబడింది) శాఖ ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘కేసంగ్ అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది’’ అని ప్రకటన విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో పార్లమెంటులో ఉన్న దక్షిణ కొరియా యూనిషికేషన్ మినిస్టర్ కిమ్ యోన్- చౌల్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఊహించిందే జరిగింది. పరిస్థితులను సమీక్షిస్తున్నాం’’ అని తెలిపారు.(అమెరికా తీరుపై ఉత్తర కొరియా అసహనం!) ఇక ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ను వ్యతిరేకిస్తూ దక్షిణ కొరియా నిరసనకారులు సరిహద్దులో బుడగలు ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అణ్వాయుధాలపై కిమ్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్ సోదరి, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్ సభ్యురాలు కిమ్ యో జాంగ్.. దక్షిణ కొరియాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాక గత కొన్నిరోజులుగా శత్రు దేశ చర్యల(అమెరికాతో సంబంధాల)ను గమనిస్తున్నామన్న ఆమె.. తదుపరి చర్యలకు సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించానని శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక.. ఉత్తర- దక్షిణ కొరియాల బంధానికి వేదికైన అనుసంధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ మేరకు తన నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(దక్షిణ కొరియాకు కిమ్ సోదరి హెచ్చరికలు) చైనా స్పందన.. ఇరు దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో సరిహద్దులో నెలకొల్పిన కేసంగ్ పారిశ్రామిక ప్రాంతంలో పేలుడు సంభవించిందని యోనప్ న్యూస్ ఏజెన్సీ కథనాలు ప్రసారం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుందని తెలిపింది. అదే విధంగా.. దాయాది దేశంతో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నిస్సైనిక ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించాలని నార్త్ కొరియా భావిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇక కొరియా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ తాజాగా స్పందించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా దక్షిణ కొరియాకు అమెరికా మద్దతుగా నిలవగా.. ఉత్తర కొరియా మిత్రదేశంగా చైనా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
వాళ్లంతా సంకర జాతి కుక్కలు: కిమ్ సోదరి
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ బెదిరింపులకు దాయాది దేశం దక్షిణ కొరియా తలొగ్గింది. ఆమె హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా తీరును నిరసించిన కార్తకర్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. గత కొన్ని రోజులుగా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అనేక కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఎరువు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వదంతులకు తాత్కాలికంగా చెక్ పెట్టారు. అయినప్పటికీ కిమ్‌కు శస్త్ర చికిత్స జరిగిందని.. ఆయన మరణించారన్న ఊహాగానాలకు మాత్రం తెరపడలేదు. (మిలిటరీ మీటింగ్‌లో కిమ్) ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, దాయాది దేశం నుంచి వలస వచ్చిన వారు.. కిమ్ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. వాటితో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ... ‘‘మాతృదేశానికి ద్రోహం చేసిన ఫిరాయింపుదార్లంతా సంకరజాతి కుక్కలు. వారి ప్రేలాపనలకు యజమానులు సమాధానం చెప్సాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ అధికార మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..) అదే విధంగా కిమ్‌ను విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే.. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని దాయాది దేశాన్ని హెచ్చరించారు. అంతేగాకుండా ఉభయ కొరియాల పునర్ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ పేర్కొంది. ఆ బెలూన్ల వల్ల అంతా నష్టమే తప్ప ఏ మంచి జరుగలేదంటూ సియోల్ అధికారి ఒకరు వాపోయినట్లు తెలిపింది. కాగా కిమ్ తర్వాత ఆయన చెల్లెలు కిమ్ యో జాంగ్ ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. కిమ్ మరణించారన్న వదంతుల నేపథ్యంలో ఆయన వారసురాలిగా కిమ్ యో జాంగ్ పాలనాపగ్గాలు చేపట్టనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. -
ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’.. భారీ జరిమానా
సియోల్ : మైదానాల్లో ప్రేక్షకుల స్థానంలో సెక్స్ డాల్స్‌ను వాడినందుకుగానూ ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి, కే లీగ్ భారీ జరిమానా విధించింది. స్టాండ్స్‌లో బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను వాడి అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకుగానూ 100 మిలియన్ ఓన్(దాదాపు 61 లక్షల రూపాయలు) భారీ జరిమానాను ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి విధించింది. ('వర్షాకాలం తర్వాతే దేశంలో క్రికెట్ మొదలవ్వొచ్చు') కరోనా మహమ్మారితో ప్రేక్షకులు లేక క్రీడానిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక కనీసం టీవీల్లోనైనా మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించేవారికి ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి గ్రౌండ్లో భారీగా అభిమానులు ఉన్నట్టు బొమ్మలతో నింపింది దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్‌సి సియోల్ క్లబ్. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్‌ని తయారు చేసే ఓ సంస్థ సరఫరా చేసింది. గ్వాంగ్జు, ఎఫ్‌సీ-ఎఫ్‌సీ సియోల్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులు ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిలో కొన్ని సెక్స్ డాల్స్ కూడా ఉండటంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్టేడియం స్టాండ్స్‌లో ఖరీదైన షోకేస్ బొమ్మలని పెట్టాలనుకున్నామని, కానీ వాటిని ఉత్పత్తి చేసే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని ఎఫ్‌సి సియోల్ ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను కూడా తెచ్చి, వాటికి తమ టీమ్ టీషర్టులు తొడిగి స్టేడియంలో పెట్టిందని పేర్కొంది. (గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్) దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ, స్టాండ్స్‌లో ఉన్న కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లకి ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉన్నాయి. లైవ్‌లో మ్యాచ్ చూసిన అభిమానులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో, ఎఫ్‌సి సియోల్ క్లబ్ తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది. కాగా, ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 2020 కే లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాకపొతే, త్వరితగతిన వైరస్‌ని అరికట్టామని చెబుతున్న దక్షిణ కొరియాలో ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందే క్రీడలకి రంగం సిద్ధం అయింది. దీంతో మే 8 వ తేదీన కే లీగ్ మొదలయింది. ఖాళీ స్టేడియం స్టాండ్లతో పాటు, ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్‌లు ధరించి, కరచాలనం చేయకూడదనే నియమం విధించారు. ఉమ్ము వేయడం, చీదడం లాంటివి చేయకూడదని, క్రీడాకారుల మధ్య సంభాషణల్ని కూడా నిషేధించారు. కాగా, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సియోల్ ఎఫ్‌సీ 1-0తో గ్వాంగ్ఝూపై గెలిచింది. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్) -
కిమ్ ఆరోగ్యం విషమం.. సౌత్ కొరియా స్పందన
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ జోన్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలపై దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కిమ్ ఆరోగ్యం క్షీణించలేదని పేర్కొన్నాయి. కిమ్ గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశాయి. ఇందుకు సంబంధించి ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు వెలువడటం లేదని ది ప్రెసిడెన్షియల్ బ్లూ హౌజ్(దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికార భవనం) పేర్కొంది. కాగా గుండె కండరాల నొప్పితో ఆస్పత్రిలో చేరిన కిమ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని, బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సియోల్ కేంద్రంగా పనిచేసే వెబ్సైట్... ఏప్రిల్ 12న శస్త్రచికిత్స తర్వాత కిమ్ ప్రస్తుతం హ్యాంగ్‌సాన్‌లోని మౌంట్ కుమ్గాంగ్ రిసార్టులోని విల్లాలో ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఉత్తర కొరియా వ్యవస్థాపక ప్రీమియర్, తన తాత కిమ్ II సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాని విషయం తెలిసిందే. అన్నింటా తానే ముందుండి కార్యక్రమాలు నిర్వహించే కిమ్ ఈ విధంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.(విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!) -
యువ గాయని మృతి.. సూసైడ్‌గా అనుమానాలు!
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ గూ హరా హఠాన్మరణం చెందారు. దక్షిణ కొరియాకు చెందిన కే-పాప్ బ్యాండ్ ‘కారా’ సభ్యురాలిగా, గాయనిగా పేరొందిన గూ హరా ఆదివారం సియోల్‌లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా కనిపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని పరిచయస్తులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి కారణాలు తెలియదని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. అప్పట్లో ఆత్మహత్యయత్నానికి ఆమె ప్రయత్నించినట్టు కథనాలు వచ్చాయి. 2008లో ‘కారా’ బ్యాండ్ గర్ల్‌గా గూ హరా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కారా బ్యాండ్ గ్రూప్ సెన్సేషనల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. క్రమంగా ఈ బ్యాండ్ ప్రభ మసకబారింది. ఈ క్రమంలో గత ఏడాది రివేంజ్ పోర్నోగఫీ బారిన పడిన గూ హరా తన మ్యూజిక్ కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేసింది. మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో అతన్ని హరా కోర్టుకు ఈడ్చింది. దీంతో కోర్టు అతనికి తాత్కాలిక జైలుశిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. -
బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!
సియోల్ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’ నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్ అనే హీలింగ్ సెంటర్ మంగళవారం ‘డైయింగ్ వెల్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్ ఫర్నియల్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
పాక్ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం
సియోల్: పాకిస్తాన్ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లారు. అయితే అక్కడ పాక్ మద్దతుదారులు కొందరు భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో షాజియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు. షాజియా నిరసనకారుల భావోద్వేగాలపై స్పందిస్తూ.. ‘ఆర్టికల్ 370 రద్దు చేయడంపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ, మొత్తం దేశాన్ని నిందించడం సబబు కాదు. ఈ అంశం మాదేశ అంతర్గత సమస్య. దీనిపై మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. కొన్ని దేశాలలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. నిరసన తెలిపే హక్కును ఎవరైనా సక్రమంగా వినియోగించుకోవాలి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తే ఏ పరిణామాన్నైనా నేను దైర్యంగా ఎదుర్కొంటాన’ని అన్నారు. కాగా నిరసనకారుల తీవ్రత దృష్ట్యా పోలీసులు షాజియాను, ఆమె సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. -
ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు, ఎప్పుడు, ఏవిధంగా, ఎందుకు ఫేమస్ అవుతారో ప్రస్తుతం ఊహకందని విషయం. కాస్త ప్రతిభ, తెలివితేటలు ఉంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ... డబ్బు, పేరు ఈజీగా సంపాదించుకోవచ్చు. దక్షిణా కొరియాకు చెందిన ఆరేళ్ల చిన్నారి బోరమ్కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తనొక యూట్యూబ్ స్టార్. బొమ్మలతో ఆడుకుంటూ వాటి రివ్యూలు ఇచ్చే ఈ చిచ్చర పిడుగుకు రెండు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. వాటికి దాదాపు 30 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఇక వీక్షకుల సంఖ్య ఇంతపెద్ద మొత్తంలో ఉందంటే బోరమ్ సంపాదన కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అవును ఇప్పుడు తనొక కోటీశ్వరురాలు. తన సంపాదనతో ఏకంగా రాజధాని సియోల్‌లోని గంగ్నమ్ సబ్అర్బ్ ఏరియాలో 5 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసింది ఈ చిట్టితల్లి. దాని ధర 9.5 బిలియన్ కొరియన్ వన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 55 కోట్ల రూపాయలన్నట మాట. ఏంటి ఆరేళ్లకే ఇంత సంపాదనా.. అది కూడా హాయిగా ఆడుకుంటూ అని నోరెళ్లబెడుతున్నారా. అదంతే అంతా సోషల్ మీడియా మహిమ. ఏమంటారు?.. అంతేగా అంతేగా!! -
ప్రైజ్‌మనీని విరాళం ఇచ్చిన మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అంతేకాక తనకు వచ్చిన అవార్డును భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదు. ఇది దేశ ప్రజలకు చెందుతుంది.. గత ఐదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనం. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ. -
మోదీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం
సియోల్: దక్షిణా కొరియా ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సియోల్ శాంతి బహుమతిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ అభివృద్ధికి చేసిన సేవలకుగానూ దక్షిణకొరియా ప్రభుత్వం సియోల్ శాంతి బహుమతిని మోదీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు తనకు దక్కిన వ్యక్తిగతమైన గౌరవం కాదని, ఇది దేశ ప్రజలకు చెందుతుందని మోదీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ సాధించిన ప్రగతికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సత్తాకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ150వ జయంతి జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లని పేర్కొన్నారు. 1988లో సియోల్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరగడానికి కొన్ని వారాల ముందే ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ఏర్పడిందని, ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం .. ప్రపంచదేశాలకు సమస్యగా మారిందన్నారు. సియోల్ శాంతి బహుమతి గతంలో అందుకున్న ప్రముఖుల్లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజిలా మోర్కెల్‌లు ఉన్నారు. -
గాంధీ బోధనల్లో పరిష్కారం
సియోల్: ఉగ్రవాదం, వాతావరణ మార్పు అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలనీ, వీటికి పరిష్కారం మహాత్మా గాంధీ బోధనల్లో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే గాంధీ బోధనలు, విలువలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయంలో ఆ దేశాధ్యక్షుడు మూన్–జే–ఇన్, ఐక్యరాజ్య సమితి (ఐరాస) మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ–మూన్‌లతో కలిసి గాంధీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. భారత్–దక్షిణ కొరియాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతం లక్ష్యంగా, మూన్–జే–ఇన్ ఆహ్వానం మేరకు మోదీ గురువారం నుంచి రెండ్రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బోధనలు, విలువల్లోనే పరిష్కారం.. మానవాళి ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలైన ఉగ్రవాదం, వాతావరణ మార్పులకు గాంధీ బోధనలు, ఆయన జీవిత విలువల్లోనే పరిష్కారం ఉందని మోదీ అన్నారు. ‘మనం గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుక్కోగలం. గాంధీ బోధనలు, ఆయన ఇచ్చిన ఐక్యతా స్ఫూర్తి, విలువలు, హింసా మార్గంలో వెళ్తున్న వారి మనసులను అహింసతో మార్చాలంటూ గాంధీ ఇచ్చిన సందేశాలే.. ఉగ్రవాదంపై పోరాటంలో మనకు దారి చూపగలవు’ అని మోదీ తెలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ–మూన్ ఉండగానే గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. తర్వాతి తరాలకు హరిత గ్రహాన్ని అందించడం ముఖ్యమని గాంధీ బోధించారని తెలిపారు. మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి. -
దక్షిణ కొరియాలో ఘనంగా దసరా వేడుకలు
సియోల్: దక్షిణ కొరియాలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సియోల్ నగరంలోని సుంగ్కీంక్వాన్ విశ్వవిద్యాలయం(ఎస్‌కేకేయూ)లో దక్షిణ కొరియా తెలుగు సంఘం(టాస్క్) 15వ వార్షికోత్సవంతో పాటు, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరయ్యారు. పూజ కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకలు.. క్లాసికల్ డ్యాన్స్, పిల్లల ఫ్యాషన్ షో, కామెడీ స్కిట్స్, ఆట పాటలతో వినోదభరితంగా సాగాయి. మహిళలు అందరు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమాన్ని టాస్క్ కమిటీ మెంబర్లు డా. వేణు నూలు, డా. సుశ్రుత కొప్పుల, తరుణ్ కుమార్, డా. అనిల్ కావాలా, అంకంరెడ్డి హరినారాయణ, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంసత్ కుమార్, చంద్రకళలు ఘనంగా నిర్వహించారు. కొప్పల్లి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. -
మోదీకి అరుదైన విదేశీ పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను మోదీకి ఈ అవార్డు దక్కింది. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్’ చేశారని, భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని సియోల్ శాంతి పురస్కార కమిటీ పేర్కొంది. 1990లో 24వ ఒలింపిక్ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ పురస్కారం అందుకుంటున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి ప్రముఖులకు ఈ అవార్డు అందజేశారు. కాగా.. తనకు సియోల్ శాంతి పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. -
ప్రధాని మోదీకి సియోల్ శాంతి పురస్కారం
-
ప్రధాని మోదీకి శాంతి పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్’ చేశారని సియోల్ శాంతి పురస్కార కమిటీ వెల్లడించినట్లు రవీష్ తెలిపారు. ప్రధాని సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకోబోయే తేదీ త్వరలో వెల్లడిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని అవార్డు కమిటీ తెలిపింది. 1990లో 24వ ఒలింపిక్ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు అందుకోనున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి ప్రముఖులకు ఈ అవార్డు ఇచ్చారు. కాగా, సియోల్ శాంతి పురస్కారం ప్రకటించడం పట్ల చాలా ఆనందంగా ఉందని మోదీ తెలిపారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. -
మాజీ అధ్యక్షురాలికి మరో 8 ఏళ్లు శిక్ష
సియోల్ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గున్ హైకి ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సియోల్ సెంట్రల్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గూఢాచార సంస్థకు జరిపిన కేటాయింపుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడటం, నిషేధం ఉన్నప్పటికీ 2016 పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు రుజువైన నేపథ్యంలో శిక్ష ఖరారు చేసినట్లు కోర్టు తెలిపింది. కాగా పార్క్‌కు ఇప్పటికే ఓ అవినీతి కేసులో 24 ఏళ్ల పాటు శిక్ష పడింది. ప్రభుత్వ ఖజానాకు చెందిన 2.91 మిలియన్ డాలర్లను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న కారణంగా ఆమెకు శిక్ష పడింది. ఈ క్రమంలో పార్క్ 32 ఏళ్ల పాటు జైలులోనే జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. వివాదాలకు కేరాఫ్... దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు పార్క్ చుంగ్- హీ కుమార్తె అయిన పార్క్ గున్ హైపై అవినీతి, అధికార దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ వంటి పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సొంత పార్టీ నేతలే పట్టుబట్టారు. కాగా తనపై ఆరోపణలు రుజువైనప్పటికీ కూడా రాజీనామా చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఎనిమిది మందితో కూడిన రాజ్యాంగ కమిటీ ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. 2017లో పదవి కోల్పోయిన అనంతరం పార్క్ గున్పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా కోర్టుకు హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో శిక్షతో పాటు 16 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
కిమ్ ‘మిస్టిరియస్ ప్రియురాలిని’ చూసి.. షాక్!
ఉత్తర కొరియాలో ఆమె ఒక ‘మిస్టిరియస్ మహిళ’... ఆమె గురించి అనేక పుకార్లు ఉన్నాయి. దేశానికి నియంత పాలకుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్‌కు ఆమె ప్రియురాలు అని, విభేదాల కారణంగా ఆమెను గతంలోనే కిమ్ ఉరితీయించాడని వదంతులు కూడా వచ్చాయి. ఉత్తర కొరియాలో అందమైన భామగా, దేశానికి చెందిన ప్రముఖ యువతుల బ్యాండ్ సారథిగా ఆమె పాశ్చాత్య మీడియాలో పాపులర్ అయ్యారు. ఇలా అనేక వదంతులకు కేంద్ర బిందువుగా ఉన్న హ్యోన్ సాంగ్ వోల్ ఆదివారం ఒక్కసారిగా శత్రుదేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దర్శనమిచ్చారు. ద.కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఉ. కొరియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె సియోల్ వచ్చింది. ఆమెను చూడగానే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టి టకటకా ఫొటోలు తీసుకున్నారు. కానీ ఆమె మీడియాతో మాట్లాడలేదు. ఉ.కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షల కారణంగా కొరియా దేశాల నడుమ తీవ్ర శత్రుత్వం, ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉ.కొరియా వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకుంది. మిస్టిరియస్ మహిళ హ్యోన్ సాంగ్ వోల్ సియోల్‌లో అడుగుపెట్టగానే నిరసనలు హోరెత్తాయి. ఆమె సియోల్‌కు రాగానే కొందరు నిరసనకారులు కిమ్‌జాంగ్ ఉన్ ఫొటోలను తగులబెట్టి నిరసన తెలిపారు. సోమవారం సియోల్ రైల్వేస్టేషన్ వద్ద ఆమెకు ప్రత్యక్షంగా నిరసన సెగ తగిలింది. ఆమె ఎదురుగానే 150 నుంచి 200 మంది నిరసనకారులు కిమ్ ఫొటోను, ఉత్తర కొరియా జెండాను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ స్పందించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయినా, ఆ తర్వాత నిరసనకారులు వాటిని తగలబెట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. -
హైస్పీడ్ ట్రైన్లో కేటీఆర్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సియోల్ నుంచి డ్యాగు పట్టణానికి హైస్పీడ్ ట్రెయిన్లో పర్యటించారు. భారత్‌లోని టైయిర్ 2 పట్టణాలు ప్రధాన నగరాలతో అనుసంధానం కావాలంటే.. వాటి మధ్య దూరాన్ని త్వరగా తగ్గించేలా గంటకు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే, వైఫై అనుసంధానిత హైస్పీడ్ రైళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. హైస్పీడ్ ట్రెయిన్లో మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఇతర అధికారుల బృందం ఉంది. కేటీఎక్స్ హైస్పీడ్ ట్రెయిన్ ప్రత్యేకతలివే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్-డ్యాగు పట్టణం మధ్య ఈ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 417.5 కిలోమీటర్లు. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొరియన్ ట్రెయిన్ ఎక్స్‌ప్రెస్ (కేటీఎక్స్)కు చెందిన హైస్పీడ్ ట్రెయిన్.. రెండు గంటల పది నిమిషాల్లో వ్యవధిలోనే గమ్యానికి చేరుకుంటుంది. కాకతీయ మెగా టెక్స్ట్టైల్ పార్కులో పెట్టుబడులు తెలంగాణలో చేపడుతున్న పారిశ్రామిక అనుకూల చర్యలు దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించామని, ముఖ్యంగా వరంగల్‌లో చేపడుతున్న కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించామని కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. వస్త్ర తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్ పార్కు ఆదర్శనీయమైన గమ్యస్థలమని వివరించినట్టు వెల్లడించారు. అలాగే డ్యాగు పట్టణంలోని వ్యాపార ప్రతినిధులతోనూ భేటీ అయి.. పెట్టుబడుల విషయమై చర్చించినట్టు పేర్కొన్నారు. -
ఉత్తర కొరియా వైఖరి మారుతోందా?
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వైఖరిలో అనూహ్యంగా కాస్త మార్పు రావటంతో.. శాంతి చర్చలకు త్వరపడాలని అగ్రరాజ్యం అమెరికాకు పలు ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు కిమ్ సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో కిమ్ శాంతి ప్రస్తావన తేవటం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఉత్తర కొరియా ప్రజలు కోరుకునేది ఒక్కటే.. శాంతి. ఒంటరిగా ఓ దేశం అభివృద్ధి సాధించటం జరిగే పని కాదు. అందుకు పొరుగు దేశాల సహకారం చాలా అవసరం. దక్షిణ కొరియాతో దౌత్యానికి ఉత్తర కొరియా ఎల్లప్పుడూ సిద్ధం’’ అన్న కిమ్ సందేశాన్ని ప్యోంగ్యాంగ్, సియోల్ లోని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. దౌత్యపరమైన సంబంధాల ద్వారానే అది సాధ్యమంటూ అందులో కిమ్ పేర్కొన్నట్లు ఆయా కథనాలు ఉటంకించాయి. ఇక చర్చల ప్రతిపాదనను సియోల్(దక్షిణ కొరియా) వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే అమెరికా మాత్రం ఆ విషయంలో షరా మాములుగా అనుమానాలనే వ్యక్తం చేస్తోంది. కిమ్‌ను నమ్మలేం : అమెరికా కిమ్ వైఖరిలో మార్పును అంత తేలికగా నమ్మటం మంచిది కాదన్న భావనలో అమెరికా ఉంది. ‘‘ఉత్తర కొరియా ప్రకటను తక్షణమే స్వాగతించలేం. అణ్వాయుధాల నిషేధం అమలు.. కవ్వింపు చర్యలను పూర్తిగా నిలిపివేశాకే చర్చల గురించి ఆలోచించటం ఉత్తమం. దక్షిణ కొరియాకు మేం సూచించేది కూడా అదే.’’ అని అమెరికా తరపున ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హలే చెబుతున్నారు. మరి అమెరికా శాంతి చర్చలకు ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించారు. తెరపైకి ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్’ అగ్రిమెంట్... ఉత్తర కొరియా వైపు నుంచి కవ్వింపు చర్యలు తగ్గినట్లు కనిపిస్తుండటంతో స్వచ్ఛందంగా దౌత్యానికి అమెరికానే ముందుకు రావటమే మంచిదని సీనియర్ రక్షణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు మాటల యుద్ధానికి తెరదించి ఆపై ఇరు దేశాలు తటస్థ వేదికగా చర్చలు జరపటం ఉత్తమమని.. ఈ మేరకు రష్యా, చైనాలు చొరవతో గతంలో ప్రతిపాదించిన ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్ ఒప్పందం’ అమలు చేయటం పెద్ద కష్టమైన పనేం కాదని వారంటున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలన్నింటిని అమెరికా తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది. అదే సమయంలో దశల వారీగా అణు క్షిపణుల విషయంలో ఉత్తర కొరియా నియంత్రణ పాటిస్తూ నిషేధం దిశగా అడుగులు వేయాలి. తద్వారానే శాంతి చర్చలు దశల వారీగా ముందుకు కొనసాగుతుంటాయి. ఇది కూడా చదవండి... కిమ్.. నీ కంటే నాది పెద్దది : ట్రంప్ -
ఆపిల్‌పై దాడులు : ఆ ఫోనే టార్గెట్
సియోల్ : దక్షిణ అమెరికాలో సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ లాంచింగ్‌కు ముందు ఆపిల్ సంస్థలపై రెగ్యులేటర్లు దాడులు జరిపాయి. అయితే ఈ దాడులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐఫోన్ ఎక్స్ విజయాన్ని నాశనం చేయడం కోసం దక్షిణ కొరియా అథారిటీలు ఇలాంటి కుట్రలకు పన్నాగాలు పన్నుతున్నారేమోనని లండన్‌కు చెందిన మెట్రో లేటు రిపోర్టు చేసింది. శుక్రవారం నుంచి దక్షిణ కొరియాలో ఐఫోన్ ఎక్స్ విక్రయానికి వచ్చింది. ఈ విక్రయానికి ముందు ఆపిల్ కార్యాలయాలపై రెగ్యులేటర్లు దాడులు నిర్వహించారు. ఈ వారం ప్రారంభంలో ఇన్వెస్టిగేటర్లు ఆపిల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, వ్యాపార పద్దతుల గురించి ప్రశ్నలు వేశారని రిపోర్టు తెలిపింది. ఆపిల్, ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీ నుంచి స్థానిక కంపెనీలను రక్షించాలని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ కోరుతోంది. దక్షిణ కొరియాలో ఆపిల్ ఉత్పత్తులకు బాగా గిరాకి ఉంటుంది. స్థానిక దిగ్గజ కంపెనీలైన శాంసంగ్, ఎల్జీ ఉత్పత్తుల కంటే కూడా ఆపిల్ ఉత్పత్తులకే డిమాండ్ ఎక్కువ. అయితే స్థానిక ఫోన్ నెట్‌వర్క్‌లతో ఆపిల్ అన్యాయపూర్వకమైన కాంట్రాక్టులను ఏర్పరుచుకుందని ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టిగేటర్లు 2016లోనే విచారణ చేపట్టారు. -
ట్రంప్ ట్వీట్లు.. అమెరికాకే ప్రమాదం!
సియోల్ : అగ్ర రాజ్యంగా బాధ్యత కలిగిన ఓ దేశాధ్యక్షుడు అయి ఉండి రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం సరికాదని డొనాల్డ్ ట్రంప్ కి హిల్లరీ క్లింటన్ సూచించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో యుద్ధం వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘ఉత్తర కొరియాతో యుద్ధానికి సిద్ధమని పదేపదే ట్రంప్ ప్రకటన చేయడం సరికాదు. ఇలాంటి ప్రకటనలు అమెరికాకే ప్రమాదకరం. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్ చేసే ట్వీట్లు ఉత్తర కొరియాకే లాభం చేకూరుస్తాయి. అవి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ను మరింత ఉన్మాదిగా మారుస్తాయి. అసలు వారిపై అంతలా విరుచుకుపడాల్సిన అవసరం కూడా లేదు’ అని హిల్లరీ పేర్కొన్నారు. ఇక అణు, క్షిపణి పరీక్షలు చేయకుండా ఉత్తర కొరియాను నిరోధించడంలో కీలకపాత్ర పోషించాలని చైనాను ఆమె కోరారు. అణు పరీక్షలను అభినందించటం మంచిది కాదని ఆమె చైనాకు హితవు పలికారు. మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా దారిలోకి తీసుకురావాలని డ్రాగన్ కంట్రీకి ఆమె సూచించారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని.. ఆ దిశగా వారిని (ఉత్తర కొరియా)ను ఒప్పించాలని అగ్ర దేశాలకు ఆమె సూచించారు. -
నదిని శుద్ధి చేసే సిమెంటు చేప
హైదరాబాద్‌లో మూసీ, బెజవాడలో కృష్ణ, కోల్‌కతాలో హూగ్లీ.. ఇలా ప్రతి నగరంలోనూ కాలుష్యంతో నిండిన నది ఏదో ఒకటి ఉంటుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోనూ హాన్ నది ఉండనే ఉంది. మనమేమో వందల కోట్లు గుమ్మరించి సీవరేజ్ ట్రీట్మెంట్లు కట్టేసి.. నదినీటిని శుభ్రం చేసేయాలని తంటాలు పడుతున్నామా... సియోల్ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. నదివెంబడి ... ఇదిగో ఇలా ఫొటోల్లో కనిపిస్తున్నట్లు అందమైన నిర్మాణాలను చేపట్టనుంది. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే బోలెడన్ని అని చెప్పక తప్పదు. ముందుగా... నదిలో షికారు చేసే ఫెర్రీ బోట్లు నిలిపే బోట్ స్టేషన్‌గా పనికొస్తాయి ఇవి. దాంతోపాటే ఈ స్టేషన్ ప్రాంతంలో తీరం వెంబడి చిత్తడి నేలల్లో రకరకాల మొక్కలు పెంచుతారు. వీటివల్ల నీరు సహజసిద్ధంగా శుభ్రమైపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ మొక్కల కారణంగా నది తాలూకూ గట్టు కూడా పటిష్టంగా మారి వరదల సమయంలో ముంపు ప్రమాదం తగ్గుతుంది. స్టేషన్‌పైన ఒక అంతస్తులో నదిని, అటుపక్కనున్న నగరాన్ని చూసేందుకు ఏర్పాట్లు ఉంటే.. రెండో అంతస్తుపై సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు తో పాటు.. పచ్చటి మొక్కలు, క్రికెట్ బ్యాట్ల తయారీలో వాడే విల్లో వృక్షాలు పెంచుతారట. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలబోట్ డిజైన్ చేసిన ఈ బోట్ స్టేషన్.. మాంటా రే అనే చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుకూ అదే పేరు పెట్టేశారు. నీటిని శుద్ధి చేసేందుకు కేవలం మొక్కలపైనే ఆధారపడలేదు. పై అంతస్తు అంచుల్లో దాదాపు 3500 చదరపు మీటర్ల మేర సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు నిలువుగా తిరిగే గాలి మరలనూ వాడుకుంటారు. బోట్ స్టేషన్‌కు ఆనుకుని నదీతీరం వెంబడి ఉండే పార్కుల్లోంచి సేకరించే సేంద్రీయ వ్యర్థాలను బయోమెథనైజేషన్ ప్లాంట్‌కు సరఫరా చేసి అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటిశుద్దీకరణకు వాడుకుంటారన్నమాట. భలే ఐడియా కదూ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్
-
ఆ పరీక్షలో నార్త్ కొరియా ఫెయిల్
సియోల్, దక్షిణకొరియా : అమెరికా, దక్షిణ కొరియాలకు దడపుట్టిస్తూ నార్త్ కొరియా లాంచ్ చేసిన క్షిపణి పరీక్ష ఫెయిల్ అయింది. నార్త్ కొరియా పరీక్షించిన కొత్త క్షిపణి లాంచ్ చేసిన సెకన్ల వ్యవధుల్లోనే ఫెయిల్ అయినట్టు దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 22 బుధవారం ఉదయం వాన్ సాన్ ఎయిర్‌బేస్ నుంచి నార్త్ కొరియా ఓ క్షిపణి లాంచ్ చేసింది, కానీ అది విఫలమైనట్టు దక్షిణ కొరియా, అమెరికాలు తెలుసుకోవాల్సి ఉందని సియోల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఇది ఏ రకమైన క్షిపణో పరిశీలిస్తున్నామని అధికారి చెప్పారు. నార్త్ కొరియా లాంచ్ చేసే అదనపు క్షిపణి పరీక్షలకు దక్షిణ కొరియా సన్నద్ధమై ఉందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నార్త్ కొరియా నగరం వాన్ సాన్ నుంచి వివిధ రకాల క్షిపణులను నార్త్ కొరియా లాంచ్ చేసినట్టు జపనీస్ క్యోడో వార్తా సంస్థ అంచనావేస్తోంది. ప్రీక్వెన్సీని పెంచుతూ నార్త్ కొరియా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది. క్షిపణి టెక్నాలజీలో తాము ముందున్నామనే విషయాన్ని నార్త్ కొరియా ఈ పరీక్షల ద్వారా అమెరికాకు చాటిచెబుతోంది. జపాన్ లో నీటిలోకి 1000 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వెళ్లే విధంగా నాలుగు క్షిపణులను నార్త్ కొరియా ఈ నెల మొదట్లో పరీక్షించిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ కొరియా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించి నార్త్ కొరియా ఇటీవల పలుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, జపాన్ లకు దడపుట్టిస్తోంది. -
సోదరుడు నామ్ని కిమ్మే చంపించాడు!
సియోల్: ఉత్తరకొరియాపై దక్షిణకొరియా సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆరోపించింది. విదేశాంగ, రక్షణశాఖలో పనిచేస్తున్న మంత్రులు ఉన్నారని పేర్కొంది. ఈ నెల మలేసియా విమానాశ్రయంలో నామ్‌పై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఆయనపై వీఎక్స్ నెర్వ్ అనే అత్యంతప్రమాదమైన విషం ప్రభావం కారణంగా 20 నిమిషాల్లో చనిపోయారు. ఇది పెద్ద సంచలనం కాగా తొలుత ఉత్తర కొరియా ఏ విధంగానూ స్పందించలేదు. పైగా నామ్ పోస్టు మార్టం చేయడానికి మీరెవరు అంటూ మలేషియా ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే, ముందు నుంచే నామ్ హత్య వెనుక కీలకంగా కదులుతున్న మలేషియా ఎనిమిదిమందిని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా స్పందిస్తూ ఈ ఘటనపై తమ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నుంచి నామ్ హత్యను ఆపరేట్ చేశారని, సాక్షాత్తు ప్రభుత్వంలోని కీలక శాఖలైన విదేశాంగ, రక్షణ శాఖ చట్టప్రతినిధులు ఉన్నారని ఆరోపించింది. ‘నామ్ హత్య కేసులో మొత్తం ఎనిమిది మందిని అనుమానిస్తున్నారు. వీరిలో నలుగురు ఉత్తర కొరియా రక్షణ వ్యవహారాలు చూసుకునే వారున్నారు. మరో ఇద్దరు మాత్రం మొత్తం పనిని పూర్తి చేశారు. ఆ ఇద్దరు విదేశాంగ మంత్రిత్వశాఖ వారు’ అని దక్షిణ కొరియా చట్టప్రతినిధి లీ చియోల్ వూ ఆరోపించారు. ఇది ముమ్మాటికి ఉత్తర కొరియా చేసిన ఉగ్రవాద చర్యే. నామ్ హత్య జరిగిన తర్వాత విచారణ చేసిన మలేషియా పోలీసులు మొత్తం ఎనిమిదిమంది ఉత్తర కొరియా వాసులను అదుపులోకి తీసుకుంది. అలాగే, మలేషియాలోని ఎంబసీ అధికారులను కూడా విచారించనుంది. -
పొద్దుతిరుగుడు విద్యుత్తు
ఎందరు అవునన్నా... ఇంకెందరు కాదన్నా.. భూమికి ముప్పు ముంచుకొస్తోందన్నది మాత్రం వాస్తవం. పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వాతావరణ మార్పులు ఎక్కువైపోయి 2100 నాటికి భూమిపై మనిషి బతికే పరిస్థితులు ఉండవని శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే సౌరశక్తి మొదలుకొని అనేక సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలన్న విషయంలోనూ ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఇప్పటివరకూ ఇంటిపైకప్పులకే పరిమితమైన సోలార్ ప్యానెళ్లు ఇప్పుడు రోడ్లపై, కిటికీల్లోనూ వచ్చేస్తున్నాయి. సియోల్‌లోని ఓ ఆర్కిటెక్చర్ సంస్థ ఇంకో అడుగు ముందుకేసి... ఈ ఫొటోల్లో కనిపిస్తున్న తీరులో సోలార్పైన్స్ను డిజైన్ చేసింది. ఈ నిర్మాణం పైభాగంలో కొంత ఎడంగా... అందమైన డిజైన్ రూపంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇవి ఒకవైపు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఇంకోవైపు మంచి ఎండలోనూ చల్లటి నీడనిస్తాయి. అంతేకాకుండా... ఈ నిర్మాణం మొత్తం సూర్యుడి కదలికలకు అనుగుణంగా కదిలే ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రతిరోజు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ఒక్క నిర్మాణం ద్వారా గంటకు 1.2 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఇంకోలా చెప్పాలంటే ఒక ఇంటికి అవసరమైన విద్యుత్తు మొత్తం తయారవుతుందన్నమాట. పార్కుల్లో భారీ భవంతుల మధ్య ఉండే ఖాళీ స్థలాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే ప్రజలు, ఉద్యోగులు సేదదీరేందుకూ ఉపయోగించుకోవచ్చునని, పార్కింగ్ ప్లేస్లుగానూ వాడుకోవచ్చునని వీటిని డిజైన్ చేసిన హెచ్‌జీ ఆర్కిటెక్ట్స్ అంటోంది. ప్రస్తుతానికి ఇవి నమూనాలు మాత్రమే. డిమాండ్ పెరిగే కొద్దీ తాము మరింత సమర్థమైన, సరికొత్త డిజైన్లతో ఈ సోలార్ పైన్‌లను తయారు చేస్తామని అంటోంది ఈ కంపెనీ! -
సెల్ఫీ వద్దు త్రీడి ఇమేజ్ ముద్దు!
డిజిటల్ ఫోటోగ్రఫీకి కాలం చెల్లిపోనుందా? అవును దక్షిణ కొరియాలో తాజగా మొదలైన ఈ రెవల్యూషన్ ప్రపంచమంతటా పాకే అవకాశం లేకపోలేదు! డిజిటల్ ఫోటోగ్రఫీ కన్నా 3డీ ఫోటోల కోసం దక్షిణ కొరియన్లు ఎగబడుతున్నారు. సాధారణ ఫోటోల కంటే త్రీడి ఫోటోల్లో వయసు భేదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో వారు వీటిపై మక్కువ చూపిస్తున్నారు. 3డీ ఫోటోను తయారుచేసేందుకు దాదాపు 100 కెమెరాలను ఒక బూత్ లో ఉంచుతారు. ఫోటో కోసం వచ్చిన వ్యక్తిని అన్ని యాంగిల్స్ లో ఈ కెమెరాలను ఉపయోగించి చిత్రాలు తీస్తారు. ప్రస్తుతం ఇటువంటి చిత్రాలను ప్రింట్ చేయడానికి సియోల్ లో ఒక చోటే ప్లాంట్ ఉంది. జిప్సమ్ పౌడర్ ను ఉపయోగించి దాదాపు 1000 పొరలతో మెషీన్ 3డీ ఫోటోలను తయారు చేస్తుంది. అన్ని యాంగిల్స్ లో ఫోటోలను చిత్రించడం వల్ల వ్యక్తి ఎలా కోరుకుంటే అలా ఫోటోను ప్రింట్ చేయించుకునే అవకాశం కలుగుతోంది. 2 ఇంచ్ ల నుంచి 12 ఇంచ్ ల సైజుల్లో 3డీ ఫోటోలు లభ్యమవుతున్నాయి. మరి ఖరీదు విషయానికి వస్తే ఒక్క ఫోటోకు దాదాపు లక్షా పదివేల రూపాయలు ఖర్చవుతోంది. కపుల్స్, ఫ్యామిలీస్, పెంపుడు జంతువుల ఫోటోలతో సెల్ఫీలు దిగడంకంటే 3డీ ఫోటోలు తీయించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు స్టూడియో ప్రతినిధి లీ-సై చియాన్ చెప్పారు. -
ఎన్ఎస్జీ సభ్యత్వంపై ప్రతిష్టంభన
తాష్కెంట్/సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వంపై సియోల్‌లో గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక భేటీ ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది. ఈ అంశంపై ఎన్ఎస్జీ సభ్య దేశాలు రెండుగా చీలిపోయాయి. చైనాతోపాటు టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రియా, ఐర్లాండ్ కూడా భారత్‌కు సభ్యత్వంపై అభ్యంతరం తెలిపాయి. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు సభ్య దేశంగా ఉన్న బ్రెజిల్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే రెండో రోజు ప్లీనరీలో పరిష్కారం దొరుకుతుందేమోనని భారత్ ఆశాభావంతో ఉంది. గురువారం ఉదయం ఎన్ఎస్జీ ప్లీనరీ ప్రారంభ సదస్సులో జపాన్‌తో పాటు మరి కొన్ని దేశాలు భారత్ అంశాన్ని లేవనెత్తాయి. నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వ అంశం ఎజెండాలో లేకపోవడంతో... రాత్రి ప్రత్యేకంగా భేటీ అవ్వాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అంతకుముందు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్‌కు మద్దతివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు దాదాపు 50 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత విజ్ఞప్తిని నిజాయితీగా, సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పరిశీలించాలని మోదీ కోరారు. ఇతర అంశాలతో ముడిపెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని, సియోల్ సదస్సులో ఏకాభిప్రాయం వచ్చేందుకు చైనా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కీలక భేటీ జరిగింది. చైనా స్పందనపై మాట్లాడేందుకు విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ నిరాకరించారు. ‘ఇది సంక్లిష్ట, సున్నితమైన అంశం... సియోల్ నుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని ఎదురుచూస్తున్నాం’ అని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా చైనా అధ్యక్షుడితో చర్చించారు. ఎన్ఎస్జీ సభ్యత్వం అంశంలో పాక్‌కు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సియోల్ ప్లీనరీపై మోదీ-జిన్‌పింగ్ భేటీ ప్రభావం ఉంటుందని భారత్ ఆశలు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. చైనా మద్దతు కీలకం కావడంతో... ఆ దేశాన్ని ఒప్పిస్తే ఇతర దేశాల అభ్యంతరాలు కూడా తొలగిపోతాయని భావించింది. మొదటి నుంచి చైనా... భారత్‌ను వ్యతిరేకిస్తూనే పాక్‌కు అనుకూలంగా పావులు కదిపింది. సభ్యత్వం పొందాలంటే 48 సభ్య దేశాల ఏకాభిప్రాయం తప్పనిసరి. -
భారత్-ఎన్ఎస్జీకి మధ్య ‘చైనా వాల్’
సభ్యత్వం ఆశలపై నీళ్లు! బీజింగ్: ప్రతిష్టాత్మక అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వంపై ఉత్కంఠ నెలకొంది. ఓపక్క అమెరికా వంటి దేశాలు పూర్తి మద్దతు తెలుపుతుంటే.. భారత్‌కు సభ్యత్వాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో లేని భారత్‌కు ఎన్ఎస్జీలో సభ్యత్వమెలా ఇస్తారంటూ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తం 48 దేశాల ఈ కూటమి రెండుగా విడిపోయింది. తాము ఏ దేశానికీ వ్యతిరేకం కాదని చెబుతూనే భారత్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని చైనా విదేశాంగ శాఖ తప్పుపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్పీటీలో సభ్యులు కానివారికి ఎన్ఎస్జీలో ఎలా చోటు కల్పిస్తారని ప్రశ్నిస్తోంది. సియోల్‌లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీ నేపథ్యంలో... భారత్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా సభ్య దేశాలను అమెరికా తాజాగా కోరింది. దీనిపై చైనా ఈ మేరకు స్పందించింది. ఒకవేళ భారత్‌కు నిబంధనలు సడలిస్తే అవే నిబంధనలు పాక్‌కూ వర్తిస్తాయంది. ఫలితంగా ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు 20 దేశాలు మద్దతు తెలుపుతుండగా, మరికొన్ని ఎటువైపన్నదినిర్ణయించుకోలేదు. చైనా వంటి కొన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. సియోల్ పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలంటే ఎన్పీటీలో సభ్యదేశంగా ఉండాలన్న కచ్చితమైన నిబంధనేమీ లేదంటూ, అందుకు ఫ్రాన్స్‌ను భారత్ ఉదాహరణగా పేర్కొంది.కాగా, ఎన్ఎస్జీలో భారత్‌కు సభ్యత్వం రాకుండా విజయవంతంగా అడ్గుకోగలిగామని పాకిస్తాన్ ప్రకటించింది. ఎస్‌సీఓలోకి భారత్ అంతర్జాతీయ భద్రత విషయాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేయనుంది. కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ)లోశాశ్వత సభ్యత్వం పొందేందుకు రంగం సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో గురువారం ప్రారంభమయ్యే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో దాయాది పాక్‌తో కలసి ఈ సభ్యత్వాన్ని పొందడం లాంఛనమే! ప్రధాని మోదీ ఈ సదస్సుకు వెళ్తారు. -
22 ఏళ్ల యువతికి 20 వేల మంది ఫిదా..
'నిద్రపోయి కనేది కల.. నలుగురినీ కదిలించేది కళ' అనే డైలాగ్ వినే ఉంటారు. మరి కదలకుండా మనల్ని కదిలించే కళ గురించి ఎప్పుడైనా విన్నారా? పోనీ చూశారా? అవును. వాళ్లు కదలకుండా మనల్ని కదిలింపజేసేవారిని దృశ్యాభ్రాంతి కళాకారులంటారు. పదం కాస్త కఠినంగా ఉందనుకుంటే ఇంగ్లిష్ లో విజువల్ ఇల్ల్యూషన్ ఆర్టిస్ట్ అని పిలుద్దాం. రెండో వ్యక్తి సహాయం తీసుకోకుండా ఓ యువ కళాకారిని విజువల్ ఇల్ల్యూషన్ లో సంచలనాలు సృష్టిస్తోంది. బాడీ పెంయింటింగ్ లో మరో ముందడుగులాంటి ఈ పీట్ ను ప్రదర్శిస్తున్న 22 ఏళ్ల డెయిన్ యాన్.. సియోల్ లోని కొరియా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థిని. ఇటీవల తన ఆర్ట్ వర్క్స్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పట్టిన కొద్ది గంటల్లోనే వేలసార్లు షేర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమెను 20 వేలమంది రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. మీరూ ఏదైనా కళలో ప్రవీణులైతే ఇంకెందుకు ఆలస్యం.. సోషల్ మీడియా చెబుతోంది వెల్ కమ్.. -
సంచలన వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా మరోసారి వివాదానికి తెరలేపింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను భస్మం చేస్తామని బెదిరిస్తున్నట్లుగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియో ఎంత భయంకరంగా ఉందటే ఏక కాలంలో వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని ప్రధాన భవంతులన్నింటిని నామరూపాల్లేకుండా నేలమట్టం చేశాయి. జనవరి 6న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వాటిన్నంటిని భేఖాతరు చేస్తూ తాజాగా రెచ్చగొట్టేలాగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలో ఏం ఉందటే.. ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా.. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు. అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు పేల్చడంతో వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి. అంతేకాదు, ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ వాక్యాలను కూడా చేర్చారు. -
ఉత్తర కొరియాలో భూకంపం.. మళ్లీ అణుపరీక్షలు!
సియోల్: ఉత్తర కొరియాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా వాయువ్య ప్రాంతంలోని సోంగ్లిమ్ పట్టణ సమీపంలో రెక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు దక్షిణ కొరియా వాతావరణ సంస్థ ప్రకటించింది. అయితే ఈ భూకంపం అణుపరీక్షల కారణంగా సంభవించినట్లు ఎలాంటి సంకేతాలు లేవని ఆ సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించే పుంగేరీ ప్రాంతానికి భూకంప కేంద్రం దూరంగా ఉండటంతో మళ్లీ అణుపరీక్షలు జరిగినట్లు నిర్థారించలేదు. జనవరి 6న ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిపిన సమయంలో రెక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో సాధారణ స్థాయి భూకంపాలు మామూలేనని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో అణ్వాయుధ పరీక్షలతో దూకుడు మీదున్న నేపథ్యంలో ఈ భూకంపంపై దక్షిణ కొరియా అనుకూల వర్గాల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్'
-
'అది హైడ్రోజన్ బాంబు కాదు.. అటామిక్'
సియోల్: ఉత్తర కొరియా పరీక్షించింది హైడ్రోజన్ బాంబును కాదని, ఆటామిక్ బాంబు మాత్రమే అయ్యి ఉంటుందని దక్షిణ కొరియా నిఘా విభాగం పేర్కొంది. దక్షిణ కొరియా ప్రభుత్వాధినేత లీ కెయోల్ వూ ఈ విషయంపై మాట్లాడుతూ తమ దేశ నిఘా విభాగం తెలిపిన ప్రకారం ఉత్తర కొరియా పరీక్షించింది హైడ్రోజన్ బాంబును కాదు.. కొంత తీవ్రతను చూపించగల అటామిక్ బాంబు. ఆరు కిలో టన్నుల బాంబును అది పరీక్షించింది. ఫలితంగా 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇది గతంలో పరీక్షించినదానితో పోలిస్తే తక్కువ తీవ్రత గలది' అని ఆయన అన్నారు. -
ఫ్యాషన్ షోలో బుడతలు ఇరగదీశారు..
సియోల్(దక్షిణ కొరియా): బేబీ ఇన్స్టాగ్రామ్ స్టార్స్.. సియోల్ ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టారు. ఫ్యాషన్ షోల్లో మీకంటే మేమేం తక్కువ కాదంటూ చిన్నారులు ఇరగదీశారు. వివిధ రకాల టోపీలు..కళ్లద్దాలు పెట్టుకొని, చేతిలో కూల్ డ్రింక్స్, తినుబండారాలతో, మందం చొక్కాలు(జాకెట్లు), రకరకాల షూలు ధరించి అక్కడున్న వారందరిని ఆకర్షించారు. చిన్ని చిన్ని నడకతో చిట్టిపొట్టి మాటలతో హుషారుగా ఉండే బుడతలు స్టైలీ లుక్స్‌తో ఫోటోలకి ఫోజు ఇచ్చి వీక్షకుల మనసులు దోచేశారు. -
తెలిసి... తెలిసీ
సోల్ అనగనగా ఒక చీమ. పరమ శివుడి కోసం తపస్సు చేసింది.శివుడు మెచ్చాడు. వరం కోరుకోమన్నాడు. మనుషుల మీద కసితో ‘నేను కుట్టగానే చావు తథ్యం కావాలి’ అంది చీమ. తథాస్తు అన్నాడు శివుడు. పాపం నాటి నుంచి ఆ చీమ కుట్టీ కుట్టగానే మరణిస్తోంది. (కుట్టగానే చంపేస్తాం కదా). ఇదే స్వయంకృతం! ‘నేను ఎవరిని కుడితే వారు చావాలి’ అని వరం అడగవలసిన చీమ, కుట్టిన వెంటనే చావాలి అంది. ఇక మిడాస్ కథ తెలిసిందే. అత్యాశ పరుడైన మిడాస్ తాను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని భగవంతుడిని కోరాడు. ఆయన తథాస్తు అన్నాడు. అంతే... నాటి నుంచి మిడాస్ పట్టిందల్లా బంగారమే. మంచినీళ్లు, అన్నం సహా అన్నీ బంగారమై పోయాయి. ఆకలి దప్పులు తీరక నానా ఇక్కట్లు పడ్డాడు. అది మిడాస్ స్వయంకృతం. ఆది నుంచి ఈ స్వయంకృతాపరాధాలు ఏదో ఒకరూపంలో మానవజన్మను పీడిస్తూనే ఉన్నాయి. ఈ పీడనపై చిన్న ఫోకస్. స్వయంకృతాలే మహాపరాధాలుగా నిలిచిన సంఘటనలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్... ప్రతిభతో ఎంత ప్రఖ్యాతి గడించాడో... స్వయం తప్పిదాలతో అంతే బ్లేమ్ అయ్యాడు. మాదకద్రవ్యాలకు బానిసై, కుస్తీ బరిలో ప్రత్యర్థి చెవి కొరికి, గర్ల్‌ఫ్రెండ్‌ని హింసించి... తనకున్న మంచిపేరును మట్టికరిపించాడు. కటకటాల పాలయ్యాడు. వరల్డ్ ట్రేడ్ టవర్స్ ఆకాశాన్నంటిన కీర్తిని కూడా భూస్థాపితం చేస్తుంది ఈ స్వయంకృతాపరాధం. దీనికి సాక్ష్యం అమెరికానే. జార్జ్ బుష్ జూనియర్ రూపంలో అమెరికా చేసిన తప్పిదం.. ఇరాక్‌తో యుద్ధం. దీని ఫలితమే 9/11 దాడులు. వాసికెక్కిన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఆనవాలు లేకుండా నేల కూలాయి. ఎందరో ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. అయితే స్వయంకృతాపరాధాలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు. గల్ఫ్ యుద్ధం కంటే ముందే వియత్నాం మీద విరుచుకుపడింది. చిన్న దేశం చేతిలో చిత్తుగా ఓడి తోక ముడిచింది. ఇది ఒక దేశం చేసిన, చేస్తున్న స్వయంకృతాపరాధానికి సాక్ష్యం. గ్లామర్ వరల్డ్.. పేరున్న వాళ్ల స్వయంకృతపరాధాలను సామాన్యులకూ ట్రాన్స్పరెంట్గా చూపించేది గ్లామర్ వరల్డే. అందులో సినిమా ఫస్ట్. బ్లాక్ అండ్ వైట్ జమానా తీసుకుంటే మహానటి సావిత్రి, గురుదత్ మొదలు సిల్క్‌స్మిత, ఉదయ్‌కిరణ్, చక్రిలు ఠక్కున గుర్తొస్తారు. అభినయ ఘనాపాటి సావిత్రి.. జెమినీ గణేశన్‌కు మూడో భార్యగా ఆయన చేయి అందుకోవడానికి సిద్ధపడ్డప్పుడు తెలుగులోని సీనియర్ నటులు వద్దని వారించారట. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావని హెచ్చరించారట కూడా. అయినా వాటిని వినిపించుకోక జెమినీ గణేశన్‌కు భార్య అయి తర్వాత మందుకు బానిస అయింది. తాగితాగి తనువు చాలించింది. గురుదత్ విషయానికి వస్తే .. ఆయన ప్రేమకు బానిస. ఆ బలహీనతే ఆయనను మందుకు మాలిమి చేసి ఆత్మహత్యతో చేయి కలిపేలా చేసింది. అలాగే తెలుగులో నిన్నటి తరం నటి.. సిల్క్‌స్మిత అంతే! రంగుల ప్రపంచంలోని నలుపుతెలుపుల షేడ్స్‌ని సరిగ్గా గుర్తించక ఉరితాడు బిగించుకుంది. చిన్న వయసులో ఉదయ్‌కిరణ్ చేసిన పనీ అదే ఆత్మహత్య. గెలుపు, ఓటములు సహజం అన్న విషయం తెలిసీ.. సినీమాయా జగత్తులో ఎలా మసులుకోవాలో అవగతమయ్యీ... తొందరపాటు అనే స్వయంకృతంతో ఆత్మహత్య అనే అపరాధానికి చోటిచ్చాడు. ఫలితంగా భూమ్మీద తన ఉనికినే కోల్పోయాడు. సంగీత దర్శకుడు చక్రి.. తన స్థూలకాయాన్ని తగ్గించుకునే పరిష్కారం ఉండీ.. భయం, నిర్లక్ష్యం అనే స్వయంకృతంతో హార్ట్ఎటాక్కు ప్రాణాలను అప్పగించాడు. ‘రుణ’గణమన నాగరికత నేర్చిన మనుషులు ఒప్పులకుప్పల్లా ఉండాల్సింది పోయి, వాణిజ్యబ్యాంకుల పోటీ పుణ్యమాని అప్పులకుప్పల్లా మిగులుతున్నారు. క్రెడిట్ కార్డులతో స్తోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. కన్జూమర్ లోన్స్ ఊబిలో చిక్కుకుని, అవసరం ఉన్నా, లేకున్నా ఎడాపెడా విలాస వస్తువులను కొనుక్కొని, జీతాల్లో సింహభాగం ఈఎంఐలకు చెల్లిస్తూ, నిత్య రుణగ్రస్తుల్లా మిగులుతున్నారు. ఈ దా‘రుణ’భారం వ్యక్తులనే కాదు, దేశాలకు దేశాలనే కుంగదీస్తోంది. అగ్రరాజ్యాల రుణాల ఉచ్చులో చిక్కుకున్న చిన్న దేశాలు చితికిపోతున్నాయి. స్తోమతకు మించిన రుణాలు ఎవరికైనా స్వయంకృతాపరాధాలే! అభివృద్ధి అపరాధం అభివృద్ధి ... మానవజాతి చేస్తున్న స్వయంకృతాపరాధం. సౌకర్యవంతమైన జీవితం గడపడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే. అయితే మితిమీరుతున్న ఈ అభివృద్ధి మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కోవడం లాంటిదే. మనం తెచ్చుకున్న సాంకేతిక విప్లవం, వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ భూమ్మీద జీవించే హక్కున్న మిగిలిన జీవుల బతుకును దుర్భరం చేస్తున్నాయి. అడవులను నరికేయడం, భూగర్భంలోంచి విచక్షణా రహితంగా నీటిని తోడేయడం పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. కాలుష్యం పంచభూతాలను డిస్టర్బ్ చేస్తోంది. వర్షాల్లేవ్.. పంటల్లేవ్.. ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే జీవనప్రమాణం పాతాళానికి దిగజారుతోంది. స్వయంకృతాపరాధానికి వర్తమానంలో ఇంతకు మించిన సజీవ సాక్ష్యం లేదు. - సరస్వతి రమ భస్మాసుర హస్తం భస్మాసురుడు కఠోర తపస్సు చేశాడు. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. నేను ఎవరి నెత్తిన చెయ్యి పెడితే వాడు చావాలి అని కోరుకున్నాడు.తథాస్తు అన్నాడు. తన వరం పని చేస్తోందో లేదో పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్ష కూడా వరమిచ్చిన శివుడి మీదే ప్రయోగించాలనుకున్నాడు. శివుడు పరుగులు తీశాడు. అది శివుడి స్వయంకృతం. శివుడు విధిలేక విష్ణుమూర్తిని శరణు కోరాడు. విష్ణుమూర్తి మోిహ నిగా అవతరించి, భస్మాసురుడికి నాట్యం నేర్పడం ప్రారంభించాడు. హస్త ముద్రలు, పాద విన్యాసం నేర్పుతూ తాను ఎలా చెబితే అలా నాట్యం చేయిస్తూ, శిరసు మీద హస్తం ఉంచే ముద్రను నేర్పడంతో భస్మాసురుడు భస్మమైపోయాడు. అది పూర్తిగా భస్మాసురుడి స్వయంకృతమే. అరణ్యవాసం సమయంలో సీతాదేవి బంగారులేడి కావాలని కోరుకుంది. అది మాయ అని లక్ష్మణుడు ఎంత వారించినా సీత వినిపించుకోలేదు. రాముడు లేడి కోసం వెళ్లాడు. రావణుడు మారువేషంలో సీతను అపహరించాడు. అది సీత స్వయంకృతం. ఇక రావణుడు... సీతాదేవిని ఎత్తుకు రావద్దని ఎందరు వారించినా వారి సలహాలను పెడచెవినపెట్టి, సీతను ఎత్తుకు వచ్చి లంకలో అశోకవనంలో ఉంచాడు. చివరకు ఏమయ్యింది. లంక నాశనమే కదా! అందుకు సంపూర్ణంగా రావణుడి స్వయంకృతమే కారణం కాదా? ఇక దుర్యోధనుడు, శకుని కలిసి మాయా జూదం ఆడతారని తెలిసుండీ, రాజ ధర్మం, క్షాత్ర ధర్మం అంటూ ధర్మరాజు జూదం ఆడాడు. ఒళ్లు మరచి సర్వస్వం కోల్పోయాడు. అది ధర్మరాజు స్వయంకృతమే. కీచకుడు ద్రౌపదిని చెరపట్టాలనుకున్నాడు. ఆమె ఎంత వారించినా కీచకుడు తన పట్టు విడువలేదు. వినాశకాలే విపరీత బుద్ధీ అన్న చందాన కీచకుడి చెవులకు హితవాక్యాలు నచ్చలేదు. చివరకు భీముడి చేతిలో హతుడయ్యాడు. ఇది కీచకుని స్వయంకృతం తప్ప మరొకటి కాదు. - డా. పురాణపండ వైజయంతి -
'మెర్స్'తో మరో ఇద్దరు మృతి
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు శుక్రవారం మరణించారు. దాంతో మృతుల సంఖ్య 31 పెరిగింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో మరో మెర్స్ కేసు నమోదు అయిందని పేర్కొంది. అది శామ్సంగ్ ఆస్పత్రి వైద్యునికే అని చెప్పింది. అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో మెర్స్ వైరస్ సోకిన వారి సంఖ్య 181కి చేరింది. ఈ వైరస్ సోకిన వారిలో 81 మంది కోలుకున్నారని... ఇంకా 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ఏడాది మే 20వ తేదీన దక్షిణ కొరియాలో తొలి మెర్స్ వైరస్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. -
కొరియాలో 175కి పెరిగిన మెర్స్ కేసులు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మంగళవారం మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 175కి చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన నలుగురు వ్యక్తులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు తెలిపింది. దీంతో డిశ్చార్జీ చేసిన వారి సంఖ్య 54కు చేరుకుందని వివరించింది. మెర్స్ బారిన పడిన వారు సియోల్‌లోని శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే 14 ఏళ్ల యువకుడి వల్ల మెర్స్ వైరస్ 80 మందికి సోకిందని .... అయితే డిశ్చార్జ్ అయిన వారిలో సదరు యువకుడు కూడా ఉన్నాడని పేర్కొంది. -
భారత్ పట్ల ప్రపంచం తీరు మారింది
సియోల్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొరియాకు చేరుకున్న సియోల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు సౌత్ కొరియాలో ఘన స్వాగతం లభించింది. సియోల్ విమానాశ్రయానికి చేరుకున్న వందలాదిమంది భారతీయులు ప్రధానితో చేయి కలపడానికి ఉత్సాహం చూపారు. అనంతరం సౌత్ కొరియా జాతీయ సమాధిని ప్రధాని సందర్శించిన ఆ తర్వాత కొరియా కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. సౌత్ కొరియాలోని భారత సమాజం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్ హాల్ మోదీ మోదీ... నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ సంవత్సరాల కాల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధిని సాదించిందనీ, అందుకే మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులందరూ తిరిగి భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు,మంచి రోడ్లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, ప్రజలకు మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నాని మోదీ అన్నారు. దేశంలోని మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇంకా ఆరుబైటకు వెళ్లడం సిగ్గు చేటంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్ లేకుండా బ్రిక్స్ లేదన్నారు. భారత్ అభివృద్ధి పథాన్నిఎంచుకుందనీ ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్ రావాలన్నారు. దేశం పట్ల ప్రపంచ దృక్పథం మారిందని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా అవతరిస్తుందని ప్రధాని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. కొరియా ప్రెసిడెంట్ పార్క్ జియోన్ హై తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అటు వివిధ కంపెనీల సీఈవోలతోనూ సమావేశం కానున్నారు. -
సియోల్‌లో బాహుబలి గ్రాఫిక్స్
భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రం గ్రాఫిక్స్ వర్క్‌ని దక్షిణ కొరియాలోని సియోల్‌లో చేయనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్కే మీడియా పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇక గ్రాఫిక్స్ పనులు మాత్రమే మిగిలాయి. షూటింగ్‌తో సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా కొనసాగించారు. ఎప్పటికప్పుడు ఎడిటింగ్, రీ రికార్డింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా కీలకం. అందువల్ల క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్ విషయమై సియోల్ వెళ్లారు. -
సింక్ హోల్లో పడిపోయిన దంపతులు
సియోల్: బస్సు స్టాప్‌లో బస్సు ఆగింది. తాము దిగే స్టాప్ వచ్చిందని భర్త దిగాడు. అతడి వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య కూడా దిగింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పాదచారుల మార్గంలో నడుస్తుండగా... ఆ మార్గం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ దంపతులు ఇద్దరు ఒక్కసారిగా భూమిలోకి చోచ్చుకుని పడిపోయారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్రేన్ల సహాయంతో భార్యాభర్తలను బయటకు తీశారు. అనంతరం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దక్షిణ కోరియా రాజధాని సియోల్ నగరంలో చోటు చేసుకుంది. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పాదచారుల మార్గంలో డోల్లా ఎలా ఏర్పడిందనే అంశంపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. -
భారత్‌లో అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆఫర్లు
న్యూఢిల్లీ: భారత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థలు విమాన చార్జీలపై డిస్కౌంట్లు... కొత్త కొత్త సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ విమాన చార్జీల్లో 20% డిస్కౌంట్‌ను ప్రకటించింది. దక్షిణ అమెరికాకు వెళ్లే విమానాల్లో బిజినెస్ క్లాస్(క్లబ్ వరల్డ్) టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు నేటి నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల 31లోపు ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇక లుఫ్తాన్సా సంస్థ బెంగళూరు-లండన్ మార్గంలో తొలిసారిగా ఈ నెల 22 నుంచి ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరి చయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ఫ్రాంక్ఫర్ట్-బెంగళూరు మార్గంలో అంది స్తున్నామని పేర్కొంది. మలేసియా ఎయిర్‌లైన్స్ యెస్ ఆఫర్లు ఇక మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇయర్ ఎండ్ స్పెషల్ (యెస్) ఆఫర్లను అందిస్తోంది. భారత్ నుంచి మలేషియాకు ఎకానమీ క్లాస్ రాను, పోను చార్జీ రూ.11,860, ఇండోనేసియాకు రూ. 15,890, చైనాకు రూ.20,830, ఆస్ట్రేలియాకు రూ.39,660 అని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 2 వరకూ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. -
మహిళా వాలంటీర్‌కు లైంగిక వేధింపులు!
సియోల్: ఆసియూ క్రీడల ఆరంభానికి ముందే ఇంచియూన్‌లో లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి, ఓ మహిళా వాలంటీర్‌ను ప్రక్కనే నిలబడి ఫోటో దిగే సమయంలో ఆమెను తాకాడన్న ఆరోపణలు అలజడి సృష్టించాయి. దీనిపై ఓ కాలేజి విద్యార్థిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయుడంతో దక్షిణకొరియా పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అయితే ఇప్పటిదాకా అతన్ని కస్టడీలోకి తీసుకోకపోయినా... దేశం విడిచి వెళ్లొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును ప్రాసిక్యూటర్స్కు పంపాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయుం తీసుకోలేదని పోలీస్ ఇన్స్పెక్టర్ పార్క్ మిన్ జు చెప్పారు. ఇదిలా ఉండగా 38 ఏళ్ల ఇరాన్ సాకర్ అధికారి మాత్రం తనకే పాపం తెలియుదంటున్నారు. దక్షిణ కొరియూలో అది చట్టవిరుద్ధమన్న సంగతి తనకు తెలియదని ఆ అధికారి లబోదిబోమంటున్నాడు. -
మరణం సమీపిస్తున్నా... ఉల్లాసంగానే విద్యార్థులు!!
విహార యాత్రకని విద్యార్థులతో బయలుదేరిన నౌక సముద్రంలో మునిగిపోతుంది. అయితే అందులోని విద్యార్థులు మాత్రం తాము ప్రయాణిస్తున్న నౌకకు ముప్పు వాటిల్లందని...మరికొన్ని నిముషాలలో మృత్యు కౌగిలిలోకి జారుతున్నామని వారు అనుకోలేదేమో ఏమో. తమకు అవేమీ పట్టవన్నట్లు ఆ నౌకలోని విద్యార్థులు మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా జోకులు వేసుకున్నారు. టైటానిక్ నౌక లాగా ఈ నౌక కూడా మునిగిపోతుందని ఓ విద్యార్థి జోక్ పేలిస్తే.... నౌక మునిగి పోతే ఆ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుందంటూ మరోకరు జోక్ చేశారు. దక్షిణ కోరియాలో ఇటీవల విద్యార్థులతో విహారయాత్ర కోసం బయలుదేరిన నౌక ప్రమాదంలో చిక్కున్న తర్వాత పార్క్ సు హైయిన్ అనే విద్యార్థి నౌకలో జరుగుతున్న తతంగాన్ని అంతా తన కెమెరాలో బంధించాడు. ఆ కెమెరాలోని దృశ్యాలను పార్క్ తల్లితండ్రులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. పార్క్ మృతదేహన్ని ఇటీవలే సముద్రం నుంచి వెలికి తీసి... అతడి తల్లితండ్రులకు అప్పగించారు. కుమారుడి షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్‌ను వారు పరిశీలించగా... వారికి నౌక మునిగిపోతున్న క్రమంలో విద్యార్థులు పేల్చిన జోకులతో ఆ సెల్ ఫోన్లో నిక్షిప్తమై ఉంది. గతనెల 16వ తేదీన దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.