సియోల్లో బాహుబలి గ్రాఫిక్స్ | Bahubali graphics in Seoul | Sakshi
Sakshi News home page

సియోల్లో బాహుబలి గ్రాఫిక్స్

Apr 9 2015 9:49 PM | Updated on Jul 14 2019 4:05 PM

సియోల్లో బాహుబలి గ్రాఫిక్స్ - Sakshi

సియోల్లో బాహుబలి గ్రాఫిక్స్

భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రం గ్రాఫిక్స్ వర్క్ని దక్షిణ కొరియాలోని సియోల్లో చేయనున్నారు.

భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే విధంగా అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో  రూపొందుతున్న 'బాహుబలి'  చిత్రం గ్రాఫిక్స్ వర్క్ని దక్షిణ కొరియాలోని సియోల్లో చేయనున్నారు.   యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్కే మీడియా పతాకంపై  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇక గ్రాఫిక్స్ పనులు మాత్రమే మిగిలాయి. షూటింగ్తో సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా కొనసాగించారు. ఎప్పటికప్పుడు ఎడిటింగ్, రీ రికార్డింగ్‌ పనులు పూర్తి చేశారు.

ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా కీలకం. అందువల్ల క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం ఉంది.  దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్ విషయమై సియోల్ వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement