Bahubali
-
బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే!
సినిమా సూపర్‌డూపర్ హిట్టయితే సెలబ్రిటీలకు ఓపక్క సంతోషంతోపాటు మరోపక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విజయాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కష్టపడుతుంటారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఏం చేయాలో అర్థం కాలేదంటోంది హీరోయిన్ తమన్నా భాటియా.సక్సెస్ అందుకున్నా, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ... వయసులో నాకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు తెలుగు, తమిళం రెండూ వచ్చు. నేను కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను కానీ నటిగా ఇంకా విభిన్న పాత్రలు చేయాలన్న ఆకలి మాత్రం ఇంకా ఉంది.బాహుబలి గేమ్ ఛేంజర్నిజానికి కమర్షియల్‌గా సక్సెస్ అయిన తర్వాత ఛాలెంజింగ్ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. బాహుబలి విషయానికి వస్తే పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అందరికీ ఓ గేమ్‌ఛేంజర్ వంటిది. అయితే ఈ సినిమా చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు.అర్థం కాని పరిస్థితినెక్స్ట్ ఏం చేయాలి? బాహుబలి కంటే పెద్ద సినిమా చేయాలా? ఇంతకంటే పెద్దది ఎలా చేస్తా? పోనీ నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవాలా? అన్న ప్రశ్నలతో సతమతమయ్యాను అని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కా ముఖద్దర్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.చదవండి: హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం -
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. -
'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!
'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్‌కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్‌తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్పుట్ సరిగా రాలేదని మరో టీమ్‌తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం) -
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
భోజనం తింటే..బుల్లెట్ బండి ఫ్రీ
-
రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించా. పార్ట్- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్- 2 రిలీజ్ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్)కాగా.. బాహుబలి రెండు పార్ట్‌లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా సాధించిన నెట్ వసూళ్లను అధిగమించింది.'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్ ఖాన్ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్‌గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. -
ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. రీసెంట్గా 'కల్కి'తో ఇంటర్నేషనల్ రేంజుకి చేరుకున్న ఈ హీరోని ఇప్పటికే చాలామంది ప్రశంసించారు. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ లేకపోతే 'బాహుబలి' సినిమా లేదనే కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కోల్‌కతా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ ఆగ్రహం)క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందులోనే పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్టం రాజు అని చెప్పారు. అలానే హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన 'బాహుబలి' సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని పొగడ్తలు కురిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వెళ్లింది. 'సలార్', 'కల్కి' హిట్టవడంతో అది మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)Telangana Chief Minister about Telangana king👑#Prabhas pic.twitter.com/0U1Gsz071F— Prabhas Trends (@TrendsPrabhas) August 18, 2024 -
ఐదు నిమిషాల పాట.. 'బాహుబలి' బ్యూటీ రెమ్యునరేషన్ రూ.2 కోట్లా? (ఫొటోలు)
-
బాహుబలితో మొదలైంది.. ట్రెండ్ సెట్
-
'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. అది కూడా హారర్ బ్యాక్‌డ్రాప్ కావడం ఆసక్తి పెంచుతోంది. కొన్నిరోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సిరీస్ గురించి చెబుతూ వచ్చారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలానే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది కూడా అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?తెలుగులోనూ హారర్ కథలతో వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇప్పుడు అలా 'యక్షిణి' పేరుతో తీసిన సిరీస్‌లో మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 'బాహుబలి' నిర్మాతలు తీసిన ఈ సిరీస్.. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ట్రైలర్ బట్టి చూస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా పుడుతుంది. అలానే 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే శాపవిముక్తి జరుగుతుంది. దీంతో విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి తాను అనుకున్నది నెరవేర్చుకుందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.కాన్సెప్ట్ పరంగా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ట్రైలర్లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ పాత్రలే మెయిన్. మరి ఈ హారర్ సిరీస్.. తెలుగు ఓటీటీ ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్‌కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది -
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటేడ్ సిరీస్ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబలి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024 -
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్‌లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్‌తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్‌ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్‌తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్‌కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్‌ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్‌ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
రాజమౌళి డైరెక్టర్ మాత్రమే కాదు.. అంతకుమించి!
దర్శకధీరుడు రాజమౌళి పేరు వినగానే మనకు ఠక్కున ఆ రెండు సినిమాల పేర్లే అందరికీ గుర్తుకొస్తాయి. ఒకటి బాహుబలి.. మరొకటి ఆర్ఆర్ఆర్. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో రికార్డ్ క్రియేట్ చేసిన మన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పేరును మార్మోగించారు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే గుర్తుకొస్తుంది. అయితే ఆయన అందరూ కేవలం దర్శకుడిగానే చూస్తారు. కానీ రాజమౌళి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన తీసిన సినిమాల్లో నటుడిగా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ఆ సినిమాలేవి? ఏయే పాత్రలు చేశారో ఓ లుక్కేద్దాం పదండి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్యామియో పాత్రల్లో 8 సినిమాల్లో నటించారు. మొదిటసారి 'సై' సినిమాలో వేణుమాధవ్ అనుచరుడిగా కనిపించారు. ఆ తర్వాత రెయిన్ బో చిత్రంలోను నటించారు. అంతే కాకుండా ఆయన డైరెక్షన్లోనే రామ్ చరణ్ మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు. ఇక నేచురల్ స్టార్ నానితో తీసిన చిత్రం ఈగ ప్రారంభంలోనే స్టోరీ చెప్పారు. ప్రభాస్‌తో తీసిన బహుబలి మూవీలో సారా అమ్మే వ్యక్తిగా కనిపించారు. మజ్ను మూవీలో దర్శకుడిగా క్యామియోలో దర్శనమిచ్చారు. అంతే కాదు.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లో కూడా కథను స్టార్ట్ చేసేది జక్కన్ననే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' అనే సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. మొత్తానికి మన జక్కన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. -
అప్పుడు బాహుబలి..ఇప్పుడు సలార్..!
-
ఆనంద్ మహీంద్రా ఫిదా బాహుబలి పరోటా..
-
హీరోలను ఢీ కొట్టే రేంజ్ అనుష్క సొంతం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా. అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా 'భాగమతి-2' ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్. అనుష్క బర్త్‌డే.. స్ఫెషల్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రభాస్, అనుష్క గురించి ఒక్క మాటలో...?
-
ప్రభాస్ టార్గెట్ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్‌పై ఏమన్నారు?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి 'ఛత్రపతి'లా 'చక్రం' తిప్పాడు. 'పౌర్ణమి' వెలుగులో 'యోగి'లా నిలిచాడు. సిల్వర్ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూ అభిమానుల చేత 'డార్లింగ్' అని పిలిపించుకున్నాడు. అతని సినిమా రిలీజ్ తేదీ ఖరారు అయితే ఎంతటి హీరో అయినా 'సాహో' అంటూ తగ్గాల్సిందే.. అలా బాక్సాఫీస్ వద్దకు 'ఏక్ నిరంజన్'లా వచ్చి కలెక్షన్స్ రికార్డుల్లో 'బాహుబలి'గా మిగిలాడు. 'రాధేశ్యామ్' అంటూ ప్రేమను పంచడమే కాదు.. అవసరం అయితే 'రెబెల్'గా కూడా దుమ్ములేపుతాడు. 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి కుర్రోడు 'సలార్'గా మారితే ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 23) ప్రభాస్ 44వ పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం... ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్,డైనోసార్ అంటూ పిలుస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించిన ప్రభాస్.. భీమవరంలోని డీఎన్ఆర్ పాఠశాలలో చదువుకున్నారు. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఆపై ఇంజినీరింగ్ చేశారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్‌కు నటుడిగా పేరు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్- శ్రియా కాంబోలో 'ఛత్రపతి' వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఎక్కడలేని ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ చేరిపోయాడు. ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో అనుష్క, రానా దగ్గుబాటిలతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పాన్ ఇండియా రేంజ్లో 2015 జూలై 10న భారీ అంచనాలతో విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. అక్కడి నుంచి ప్రభాస్ మార్కెట్ ఇండియా బార్డర్ దాటేసింది. ప్రభాస్ మీద రూ. 5 వేల కోట్ల భారం సలార్, కల్కి, మారుతి కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో మరోక సినిమా ఇలా డార్లింగ్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలకు అయ్యే ఖర్చు సుమారు రూ.2 వేల కోట్లు అని అంచనా ఉంది. రిటర్న్ అంచనా రూ. 5 వేల కోట్లకు పై మాటే.. ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా.. అయినా ఇదే నిజం. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ ఆరోగ్యం కొంచెం క్షీణించింది. ఇప్పుడిప్పుడే ఆయన సరైన రూట్లోకి వస్తున్నాడు. ఇక ప్రభాస్ ఏమేరకు కష్టపడతాడో చూడాలి..! కానీ ఇండియన్ సినిమా తన మీద పెట్టుకున్న నమ్మకం ఓ విశేషమే. అనుష్క- ప్రభాస్‌పై రూమర్స్.. నిజమెంత అనుష్క- ప్రభాస్… ఈ జంట పేరు గత కొన్నేళ్లుగా వార్తల్లో ఉంది… నిజంగానే ఇద్దరి జంట చూడటానికి బాగుంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్‌కు అనుష్క అంటే ఎనలేని గౌరవం. 2009లో బిల్లా సినిమా షూటింగ్ దగ్గర వీరిద్దరి ప్రేమాయణం మొదలైందని చాలామంది చెప్పేవారు. సోషల్‌మీడియాలో కొన్ని వెబ్సైట్లు అయితే చాలారోజులపాటు డేటింగులో కూడా ఉన్నారని పేర్కొన్నాయి. అలా మన సైట్లు, చానెళ్లు బోలెడుసార్లు వాళ్లకు పెళ్లి చేశాయి. టీవీ తెర మీద సుధీర్- రష్మి.. వెండితెరకు సంబంధించి ప్రభాస్- అనుష్క… మంచి రొమాంటిక్ జంటలు అని టాక్. ఇవన్నీ రూమర్స్గా మిగిలాయి. పెళ్లి రూమర్స్‌పై ప్రభాస్ రియాక్షన్ ‘బాహుబలి’ తర్వాత దాదాపు వందల పెళ్లి ప్రపోజల్స్ ప్రభాస్‌కు వచ్చాయట. దీంతో ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబుతున్నాడు అంటూ వార్తలు కూడా ప్రచారమయ్యాయి. దీనిపై ప్రభాస్ గతంలో ఇలా స్పందించాడు. 'విజయాల్లో ఉన్నప్పుడు మంచో చెడో.. ఏదో రకమైన వదంతులు వస్తూనే ఉంటాయి. ‘బాహుబలి’ జరుగుతున్నన్నాళ్లూ నాపై కూడా వచ్చాయి. కొన్ని మాటల్లో చెప్పలేనివీ ఉన్నాయి. నా పెళ్లి గురించి కూడా ఆన్లైన్లో వదంతులు సృష్టించారు. పెళ్లి కూతురంటూ ఒక మోడల్ ఫొటోలు పోస్ట్ చేశారు. అలాంటివి ఆగడం కోసమైనా పెళ్లి చేసుకోవాలిక (నవ్వుతూ)’ అని అన్నారు. ఇలా పరోక్షంగా అనుష్కతో ఎలాంటి రిలేషన్ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు. ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం ► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు. ► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం ► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు. ► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట. ► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు. ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్ ► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. ► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు. ► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం ► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'. ► నటులు: షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిషలకు ప్రభాస్ అభిమాని. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?
ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. వేలకోట్ల వసూళ్లని రుచి చూపించాడు. ఫ్లాప్ అనే పదాన్ని తన డిక్షనరీలో లేకుండా చేశాడు. టాలీవుడ్ స్టార్స్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని తన మూవీతో సాధించాడు. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబరు 10). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు ఆస్తులు ఎంత సంపాదించాడనేది చూద్దాం. సీరియల్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి.. 'స్టూడెంట్ నం.1'తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవల్లో విధ్వంసం సృష్టించి, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ రేంజుకి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు 12 సినిమాలు తీసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) సినిమా ప్రమోషన్స్ తప్ప బయట పెద్దగా కనిపించని రాజమౌళికి హైదరాబాద్ మణికొండలోని ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలానే సిటీ చివర్లో ఫామ్ హౌస్ తో పాటు స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే పలు నగరాల్లో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రొడక్షన్ కూడా చేస్తున్నారట. ఇవన్నీ పక్కనబెడితే రాజమౌళి దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, వోల్వ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయట. అలా ఓవరాల్ గా రూ.158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అందనంత రేంజ్‌కి వెళ్లిపోయిన రాజమౌళి షారితోషికం మిగతా డైరెక్టర్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో రాజమౌళి.. తర్వాతి సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!) -
బాహుబలి 'కట్టప్ప' రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్‌ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్‌గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్‌గా అలరిస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్‌లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్‌కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్. అనేక అవార్డులు నటుడు సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆస్తి విలువ సత్యరాజ్‌కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్‌కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే..
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. – సాక్షి, హైదరాబాద్ 8 రోజులు.. 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు... ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ శనివారం నార్లాపూర్ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 4 గంటల పాటు కేసీఆర్ పర్యటన కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్‌లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు
సూపర్‌స్టార్ రజనీకాంత్ పనైపోయిందన్నారు. సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే 'జైలర్' బ్లాక్‌బస్టర్ అయింది. దెబ్బకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాతో రజనీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ విషయం ఆలోవర్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటి రికార్డ్? రజనీకాంత్ 'రోబో' సినిమా సంచలనం సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'రోబో 2.0'.. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు గానీ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైనే వచ్చాయి. దీని తర్వాత సూపర్‌స్టార్ పలు సినిమాలు చేస్తున్నప్పటికీ డబ్బులు సాధించలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు 'జైలర్' వల్ల రజనీ మూవ రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) ప్రభాస్ తర్వాత అయితే రజనీకాంత్ కంటే ముందు ఈ లిస్టులో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. 'బాహుబలి' రెండు పార్ట్లతో రూ.500 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరడం కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏదేమైనా ఇక పనైపోయిందనుకునే టైంలో రజనీ కమ్‌బ్యాక్ ఇవ్వడం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. కలెక్షన్స్ ఎంత? 'జైలర్' ప్రస్తుతం 10 రోజుల్లో రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే హైయస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక తెలుగులో రూ.60 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం.. యూఎస్‌లోనూ 5 మిలియన్ల కలెక్షన్స్ క్రాస్ అయిపోయింది. కన్నడ, మలయాళంలోనూ మంచి నంబర్స్ నమోదు చేయడం విశేషం. లాంగ్ రన్లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) -
రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్) అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్లోని థియేటర్లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్‌కు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్ ) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?
టాలీవుడ్ జక్కన ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త అవతార్ మెత్తాడు. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్ మేకింగ్‌లో అగ్ర దర్శకుడు రాజమౌళి తళుక్కుమన్నాడు. ఈ యాడ్‌కు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సెలబ్రిటీలు, స్టార్ ఆటగాళ్లు, సినిమా సూపర్ స్టార్లు మాత్రమే పలు బ్రాండ్లకు నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా కనిపించారు. కేవలం తమ వృత్తి ద్వారా మాత్రమే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్లుగా భారీగానే ఆర్జించారు. కానీ అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లుగా కనిపించి అరుదు. ఈ లోటును పూడ్చేందుకు మన దర్శకధీరుడు రడీ అయిపోయాడు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) ఒప్పో బ్రాండ్ రాజమౌళిని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన రాజమౌళికి టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో తనకున్న పాపులారిటీ, క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్యాన్ ఇండియా ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళితో ఒప్పో తన అప్‌కమింగ్ ఫోన్ రెనో 10 సిరీస్ వస్తున్న ఫోన్ ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. జూలై 10న ఈ ఫోన్ లాంచ్ కానుంది. రాజమౌళి డ్యుయల్ రోల్లో సూపర్బ్‌గా ఉన్న ఈ క్లిప్ వైరల్‌గా మారింది. హీరోలను మించి స్టైలిష్‌గా, హ్యాండ్సమ్గా డ్యుయల్ రోల్లో కనిపించిన తమ అభిమాన దర్శకుడిని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) కాగా కరియర్ పరంగా గురించి ఆలోచిస్తే..రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్లో మరో మూవీ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ రేంజ్లో ఉండబోతోందని హింట్ కూడా ఇచ్చేసి ఈ మూవీపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సూపర్ కాంబో మూవీ 2025లో రిలీజ్‌కానుందని అంచనా. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) @ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm — Hittu Cinma (@HittuCinma) June 28, 2023 -
సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్?
ఓ సినిమా నచ్చాలంటే ఏముండాలి అని అడగ్గానే చాలామంది 'హీరో' పేరే చెబుతారు. కానీ అన్నిసార్లు ఈ ఒక్కడి వల్లే హిట్ కొట్టలేరు. కరెక్ట్‌గా చెప్పాలంటే మూవీలో అంతకు మించి ఉండాలి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టోరీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ యాక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ హీరో ఏమో గానీ అమితాబ్, కమల్ లాంటి ఉద్దండులూ ఇందులో ఉన్నారు. మరి ఇలా స్టార్ కాంబినేషన్స్ తో గతంలో వచ్చిన సినిమాలేంటి? వాటి సక్సెస్ రేట్ ఎంత? బాహుబలి (2015, 2017) తెలుగు సినిమా చరిత్రని మార్చేసిన సినిమాగా 'బాహుబలి' చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక్కడ క్లియర్ చెప్పుకోవాల్సి పాయింట్ ఏంటంటే.. ఇందులో నటించిన యాక్టర్స్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్ దగ్గర నుంచి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్.. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడంతమంది స్టార్స్ ఇందులో భాగమయ్యారు. సరైన కాంబినేషన్ పడాలే గానీ రిజల్ట్ ఏ రేంజులో ఉంటుందో నిరూపించారు. (ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ఆర్ఆర్ఆర్ (2022) ఈ సినిమాని మల్టీస్టారర్ అని చెప్పలేం. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు కానీ ఈ మూవీ తీసే సమయానికి వీళ్ల కంటే ఎక్కువ ఫేమ్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఇందులో కీలక పాత్రలు చేశారు. సినిమాకు మరింత బలం తీసుకొచ్చారు. గ్లోబల్ వైడ్ హిట్ కొట్టి, వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టడానికి ఓ విధంగా కారణమయ్యారు. 'బాహుబలి'తో ఇలాంటి థియరీ పాటించిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తోనూ మరోసారి అలాంటి సక్సెస్ నే అందుకున్నాడు. విక్రమ్ (2022) విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రస్తుత జనరేషన్ కి పెద్దగా తెలీదు. ఎందుకంటే 1990-2000 సమయంలో ఆయన్నుంచి అద్భుతమైన సినిమాలొచ్చాయి. ఆ తర్వాత సరైన మూవీ ఒక్కటి పడలేదు. ఆ లోటుని 'విక్రమ్' ఫుల్లుగా తీర్చింది. ఇందులో కమల్ తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి అత్యద్భుతమైన యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేశారు. ఓ ఫెర్ఫెక్ట్ సినిమాకు ఏది ఎంత ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చో వీళ్లు ముగ్గురు కలిసికట్టుగా ప్రూవ్ చేశారు. దళపతి (1991) ఇది తమిళ సినిమా, తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దానికి మణిరత్నం డైరెక్షన్ ఓ కారణమైతే.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో విజృంభించి మరీ నటించడం మరో కారణం. వీళ్లిద్దరే కాదు ఇదే చిత్రంలో అప్పటి స్టార్స్ శోభన, అరవింద స్వామి లాంటి వాళ్లు కూడా తమ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేశారు. సౌత్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో దీని ప్లేస్ ఎప్పుడూ టాప్ లోనే. (ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) పఠాన్ (2022) నిరాశలో కూరుకుపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఈ ఏడాది కళకళలాడే చేసిన సినిమాల్లో 'పఠాన్' ఒకటి. షారుక్ ఖాన్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీ కూడా ఇదే. ఇందులో షారుక్ తోపాటు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. కానీ ఇతడు స్క్రీన్ పై కనిపించింది కొంచెం సేపే అయినా ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్. వీళ్లిద్దరే మళ్లీ 'టైగర్ vs పఠాన్', 'టైగర్ 3'లోనూ సందడి చేయనున్నారు. ఇద్దరు హీరోలున్నారని దీన్ని మల్టీస్టారర్ అనుకుంటారేమో? అస్సలు కాదు ఎందుకంటే దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం లాంటి స్టార్స్ కూడా 'పఠాన్'లో కనిపించారు. రాబోయే చిత్రాల్లో మరింత మంది కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. షోలే (1975) మన దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సినిమా అనగానే 'షోలే' అని తడుముకోకుండా చెప్పొచ్చు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు చూసినా సరే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అంజాద్ ఖాన్.. ముగ్గురు ఒకరికి మించి మరొకరు అన్నట్లు యాక్టింగ్ చేశారు. వీళ్లకు తోడుగా జయా బచ్చన్, హేమా మాలిని లాంటి వాళ్లు తమదైన గ్లామర్ తో మెప్పించారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) అమర్ అక్బర్ ఆంటోని (1977) - హమ్ (1991) బాలీవుడ్ కు దొరికిన అద్భుతమైన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. అప్పట్లో హీరోగా చేసినప్పటికీ.. చాలామంది హీరోలతో కలిసి కూడా సినిమాలు చేశారు. వీటిలో 'అమర్ అక్బర్ ఆంటోని' ఒకటి. విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముల కలిసే కథే ఈ సినిమా. అమితాబ్ తోపాటు రిషి కపూర్, వినోద్ ఖన్నా లాంటి ఇందులో నటించి మెప్పించారు. 'హమ్' చిత్రంలో అమితాబ్.. అప్పటి యంగ్ హీరోలైన రజనీకాంత్, గోవిందా లాంటి వాళ్లతో కలిసి నటించారు. స్టార్ కాస్టింగ్ ఉంటే హిట్స్ కొట్టొచ్చని ఆ సమయంలోనే నిరూపించారు. హమ్ సాథ్ సాథ్ హై (1999) - కబీ ఖుషీ కబీ ఘమ్ (2001) స్టార్ కాంబోలు ఉంటే చాలామంది దర్శకులు యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయాలని చూస్తారు. కానీ 90ల్లో బాలీవుడ్ దర్శకులు మాత్రం ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ జాబితాలో 'హమ్ సాథ్ సాథ్ హై' కచ్చితంగా ఉంటుంది. సల్మాన్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తే.. 'కబీ ఖుషీ కబీ ఘమ్'లో ఏకంగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ ఇలా లెక్కకు మించి స్టార్స్ నటించారు. ప్రేక్షకుల్ని మైమరచిపోయేలా చేశారు. ఇలా పైన చెప్పిన సినిమాలే కాదు.. స్పేస్ కుదరక చెప్పుకోని మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. స్టార్ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు దాదాపు 90 శాతానికి పైగానే హిట్స్ కొట్టాయి. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కూడా అందుకున్నాయి. త్వరలో రాబోతున్న ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్ట్ K' మూవీస్ లో కూడా లెక్కకి మించి స్టార్స్ ఉన్నారు. మరి ఇవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి? (ఇదీ చదవండి: నేషనల్ క్రష్ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?) -
ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతిసనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా) ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్ వాటిని మార్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్ ఎమోజీని చేర్చి ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్‌పై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్‌గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో వీరు చేసిన పోస్ట్‌కు సమాధానంగా వచ్చే కామెంట్స్ కూడా వైరల్ అవతున్నాయి. Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀 — Virender Sehwag (@virendersehwag) June 25, 2023 (ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి) -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్‌స్టార్‌కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్‌గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్‌కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. రామాయణాన్ని చాలావరకు మార్చి తీశారని, వీఎఫ్ఎక్స్.. హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదనని.. ఇలా ఎవరికివాళ్లు తమ తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా ఇందులో నటించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) 'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఊపులో చాలా సినిమాలు ఒప్పేసుకున్నాడు. వాటిలో సాహో(2019), రాధేశ్యామ్ (2022) ప్రేక్షకుల ముందుకొస్తే, తాజాగా 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్స్ తో కాస్త రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియెన్స్ మాత్రం చాలావరకు పెదవి విరుస్తున్నారు. 'ఆదిపురుష్' మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే తొలిరోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజులో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే దాదాపు రూ.140 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. గతంలో 'బాహుబలి', 'సాహో'తో పాటు ఇప్పుడు 'ఆదిపురుష్'.. రిలీజైన మొదటిరోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతానికైతే ఏ హీరో కూడా.. తొలిరోజు కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కి దరిదాపుల్లో లేకపోవడం విశేషం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్) -
'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ కి రెడీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ఓ రేంజులో ఆల్రెడీ సేల్ అయ్యాయి, అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లు దేవాలయాలుగా మారబోతున్నాయి. సోషల్ మీడియాలో డిస్కషన్ అంతా కూడా ఈ సినిమా గురించే. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇదీ ఫుల్ కిక్ ఇస్తోంది. డార్లింగ్ ప్రభాస్.. 'బాహుబలి' మూవీతో వేరే ఏ హీరో కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. తనకంటూ సెపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అంతకు ముందు కేవలం తెలుగులోనే మూవీస్ చేస్తూ వచ్చిన ప్రభాస్.. చాలావరకు కమర్షియల్ ఎంటర్ టైనర్స్, యాక్షన్ సినిమాలు చేశాడు. 'బాహుబలి' లాంటి పీరియాడికల్ మూవీలో నటించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. పాన్ ఇండియా హీరో అయిపోయాడు 'బాహుబలి' తర్వాత డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'ఆదిపురుష్'తో మైథలాజికల్ జానర్ లో తొలిసారి నటించాడు. డార్లింగ్ హీరో తన కెరీర్ లో ఈ జానర్ లో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్స్.. మైథలాజికల్ స్టోరీలతో ప్రభాస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంటుంది. ఇప్పటికైతే ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ పెద్దదే. భవిష్యత్తులో బహుశా కుదిరితే కుదరొచ్చు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్‌గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్‌గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్‌కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
బాహుబలి, RRR కాదు.. తెలుగులో ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఇదే..
-
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
'బాహుబలి' సీన్ రీక్రియేట్ చేసిన కాజల్.. వైరల్ అవుతున్న ఫోటో
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కొడుకు నీల్ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్ రీక్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన కాజల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'రాజమౌళి సర్ ఇది నీల్, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది. -
Viral Video: పెద్దపల్లి జిల్లాలో బాహుబలి సీన్‌ను తలపించిన దృశ్యం
-
మంథనిలో వరద బీభత్సం: అంతెత్తు నీటిలో.. 3 నెలల బాలుడిని బుట్టలో పెట్టుకుని
సాక్షి, పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి. చదవండి: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం -
Photo Feature: చీమ.. బలానికి చిరునామా..
ఇండోనేసియా: మనుషులను బాహుబలి బాహుబలి అంటాం గానీ.. అసలైన బాహుబలులు ఈ చీమలే.. చూశారుగా.. వాటి బలం.. తమ బరువుకు 10 రెట్ల బరువును అవి అలవోకగా మోయగలవు. ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ జాల్ఫిక్రి ఈ చిత్రాన్ని తీశారు. -
ఆ రాత్రి ఏం జరిగింది?
‘బాహుబలి’ ప్రభాకర్, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో పాలిక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ కొట్టారు. ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ – ‘‘రిటైర్డ్ మిలటరీ మేజర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’’ అన్నారు రావుల రమేష్. పాలిక్ మాట్లాడుతూ – ‘‘నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు’’ అన్నారు. వింధ్య రెడ్డి, సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడారు. -
RRR Movie Review: బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలుగొట్టిన ఆర్ఆర్ఆర్
-
బాహుబలి-3 ఉంటుంది, వర్క్ చేస్తున్నాం : రాజమౌళి
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాపై తాజాగా ఓక్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. త్వరలోనే బాహుబలి పార్ట్-3 రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ వార్తలపై స్పందిస్తూ.. పార్ట్-3 గురించి నాకు కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు అని హింట్ ఇచ్చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి-3 రానుందని భావించవచ్చా అని అడగ్గా.. తప్పకుండా భావించవచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల్ని చూపించనున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు..కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త రానుంది' అని వివరించారు. దీంతో త్వరలోనే బాహుబలి-3పై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. -
బాహుబలి 3 ఇక లేనట్టేనా..? రూ. 150 కోట్లు ఖర్చు చేశాక కూడా
Netflix Is Put Aside Bahubali Before The Beginning Web Series: దర్శక ధీరుడు తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం 'బాహుబలి'. డార్లింగ్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది ఈ సినిమా. ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో నటీనటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. అయితే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఓ సిరీస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించాలని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కనపెట్టిట్లు సమాచారం. ఇప్పటివరకూ 6 నెలల పాటు షూటింగ్ చేశారు. ఈ చిత్రీకరణకు రూ. 150 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ఫైనల్ అవుట్‌పుట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంతృప్తి చెందలేదని టాక్. అందుకే ఈ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అంతకుముందే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని షూట్ చేసిన తర్వతా పలు కారణాలతో ఆమె ఈ సిరీస్‌నుంచి తప్పుకుంది. తర్వాత వామికా గబ్బిని ఈ ప్రధాన పాత్రలో అనేక సన్నివేశాలను రీషూట్ చేశారు. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టారా ? తాత్కాలికంగానా ? అనేది తెలియాల్సి ఉంది. -
బాహుబలి కట్టప్ప ఇంట విషాదం
Bahubali Actor Sathyaraj Younger Sister Kalpana Passess Away Due To Ill Health: తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ అంటే గుర్తుపడతారో లేదో కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు. తాజాగా ఈ నటుడి ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్(66) శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్ సోదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు సంతాపం తెలియజేశారు. -
ప్రభాస్ నాట్ జస్ట్ ఎ నేమ్..ఇట్స్ ఎ బ్రాండ్
Happy Birthday Prabhas: ప్రభాస్.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు..ఇదొక బ్రాండ్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌కు అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్‌కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. శనివారం(అక్టోబర్23)న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేద్దాం. ప్రభాస్ వీరాభిమాని ఒకరు ఇటీవలె తన హోటల్‌ను ప్రారంభించారు. రాధే శ్యామ్ పోస్టర్‌ను హోటల్ బ్యాక్ గ్రౌండ్‌గా మార్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు ఈ సినిమాలో కీ రోల్ పోషించాయి. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ను తమ హోటట్ ప్రమోషన్స్‌కి వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్ ఉంది. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్ లవ్ ప్రభాస్ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి. ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు క్రేజీ గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓసారి జపాన్ లేడీ ఫ్యాన్స్ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమ బిజినెస్ ప్రమోషన్‌కు వాడేసింది జపాన్‌లోని ఓ హోటల్. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్ ప్యాకేజింగ్‌లో ప్రభాస్ ఫోటోను అతికించి తమ బిజినెస్‌కు ప్రమోట్ చేసుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు క్రేజీ ఫ్యాన్స్ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్ అనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. తన 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నట్లు ఇటీవలె ప్రభాస్ ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
బాహుబలి వచ్చి ఆరేళ్లు.. వైరల్‌గా మారిన ప్రభాస్ ఆసక్తికర పోస్ట్
వెండితెరపై సినిమాలు ఎన్నో వస్తుంటాయ్ పోతుంటాయ్. అందులో పరాజయాలు, హిట్లు, బ్లాక్బస్టర్లు ,ఇండస్ట్రీ హిట్లు ఉంటాయ్ కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతాయి. అలాంటి చిత్రమే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహాబలి’. ఈ చిత్రం తెలుగు సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరింది. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ దీనికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్‌ను తన ట్వీటర్లో పంచుకున్నాడు. నిర్మాతల భయాన్ని పోగొట్టిన బాహాబలి... అప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో భారీ బడ్జెట్ అంటే పెద్ద స్టార్లతోనే సాధ్యమవుతుందనే భావన ఉండేది. మరో వైపు సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వస్తుందో లేదో అన్న భయం కూడా నిర్మాతల్లో ఉండేది. ఎందుకంటే తెలుగు పరిశ్రమకు ఇతర భాషల్లో అప్పట్లో ఆదరణ పెద్దగా లేదనే చెప్పాలి. ఈ భయాలన్నింటికీ ఒక్క సినిమా చెక్ పెట్టింది. సరైన కథ, అద్భుతమైన నటన, పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇలా అన్ని సమకూరితే బ్లాక్ బస్లర్కు మించిన విజయం అందుకోవచ్చని నిరూపించింది ‘బాహుబలి’ చిత్రం. బాక్సాఫీస్ ఊచకోత.. రికార్డులు సౌండ్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది గతంలో ఉన్న వాటన్నింటిని తుడిచి పెట్టి చరిత్ర సృష్టించింది బాహుబలి. ఈ పీరియాడికల్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాక తెలుగు చిత్రాల ఖ్యాతిని అంతర్జాతీయంగా గుర్తింపుని సంపాదించి పెట్టింది. అదే క్రమంలో మన చిత్రాలకు ఇండియా వైడ్‌గా డిమాండ్‌ని కూడా క్రియేట్ చేసింది. మొదట ఒక పార్టుతోనే బాహుబలి ప్లాన్ చేసినప్పటికీ బడ్జెట్, కథాంశం, పాత్రల నిడివి కారణంగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్లు బాక్స్‌ఫీస్ కలెక్షన్లను ఊచకోత కోయడమే గాక వాటి రికార్డుల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగించేలా చేశాయి. విజువల్ వండర్‌కు ఆరేళ్లు ఈ సిరీస్‌లో మొదటి సినిమా బాహుబలి బిగినింగ్ విడుదలై నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఇందులో శివుడి పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేస్తూ..‘ ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహాబలి సినిమా యూనిట్ తమ సినిమాటిక్ మ్యాజిక్‌తో వరల్డ్ వైడ్‌గా తుపాన్ సృష్టించిందని పేర్కొన్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తొలి రూ. 100 కోట్ల పైగా షేర్ సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కిక సంగతి తెలిసిందే. #6YearsOfBaahubali: Here's to the team that created waves of cinematic magic all across the country and the world 🙌🏻 - #Prabhas @ssrajamouli @Shobu_ @BaahubaliMovie #6YearsOfUnrivalledBaahubali pic.twitter.com/Ud01NKuqWK — Prabhas (@PrabhasRaju) July 10, 2021 -
ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్
న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్డౌన్లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. పేర్లతో అనుబంధం వేరు.. పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు. సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. మ్యాజిక్.. పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్ నిపుణుడు ఫ్రొఫెసర్ ఆర్ఎల్ పండిట్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు. -
తెలుగు సినిమా టార్గెట్ @ ఆల్ ఇండియా
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్మయం’ కానుంది. ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్‌లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం. మరో హీరో అల్లు అర్జున్‌కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్‌నే ఇండియా లెవల్లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్‌రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్‌లో విజయ్‌కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది. మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్‌తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్‌చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్‌లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి. -
హీరోగా మారిన 'బాహుబలి' బాలనటుడు
'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్. నేహా పఠాన్ హీరోయిన్గా కనిపించనుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంతో పాటు కాలేజీలో కుర్రాళ్ల కథే మా సినిమా అన్నారు శివ. మా సినిమాకు సంగీత దర్శకుడు కుంచె మరో హీరో అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
వైరల్ వీడియో: బాహుబలి తేనేటీగలు
తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్‌డ్రింక్ బాటిల్‌ని ఓపెన్ చేశాయి. బాటిల్ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి... నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. Two bees opening a soda bottle together.. 😲 #repost pic.twitter.com/Kv8nJrwxJD — Buitengebieden (@buitengebieden_) May 26, 2021 -
'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'
ప్రభాస్ అనగానే అందరికీ డార్లింగ్ అనే పేరే గుర్తొస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిదే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు ఆదిత్య ప్రభాస్ గురించి ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నారు. 'బాహుబలిలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లేముందు మేకను బలిచ్చే సన్నివేశంలో...''యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా" అనేది నా డైలాగ్. అయితే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరికి వచ్చి...డార్లింగ్ ఏమనుకోకు..డైలాగ్ కొంచెం మెల్లిగా చెప్పవా..నా డైలాగ్ మరిచిపోతున్నాను అని అన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని ఘటన. నిజంగా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి..ఆయన లాంటి వ్యక్తిని నేను నా లైఫ్‌లో ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అంత స్టార్ స్టేటస్ ఉండి కూడా అందరితో ఎంతో సరదాగా కలిసిపోతారు. ప్రభాస్ క్యారవాన్ నుంచి దిగగానే అందరూ ఆయన కోసం ఎదురు చేస్తుంటారు. నిజంగానే ఆయన డార్లింగ్' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి : ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ Rashmika Mandanna: డేటింగ్ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక -
హీరోయిన్‌తో ముద్దు సీన్.. తండ్రికి ఫోన్ చేసిన ప్రభాస్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ అంటే ఆరడుగుల మంచితనం..ఇదీ ప్రభాస్‌ను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. ప్రభాస్ ఎంతో మొహమాటస్తుడని అంటుంటారు వాళ్లు. అంతేకాకుండా కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతుంటారని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. రియల్ లైఫ్‌లోనే కాదు, రీల్ లైఫ్‌లోనూ ప్రభాస్ సిగ్గరి. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేనప్పుడు ప్రభాస్ చాలా మొహమాటపడుతుంటాడని, డైరెక్టర్ రాజమౌళి సైతం ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి సినిమా సమయంలో తనకు యాక్షన్ సీన్లు డైరెక్ట్ చేయడం కంటే ప్రభాస్‌తో రొమాన్స్ చేయించడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. 2003లో ఆర్తి అగర్వాల్‌తో కలిసి ప్రభాస్ అడవి రాముడు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ప్రభాస్.. వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడట. ముద్దు సీన్ చేయడానికి తండ్రి వద్ద నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ మేనేజర్, నటుడు ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్‌కు వాళ్ల నాన్న గారంటే ఎంతో గౌరవం అని, ఏ చిన్న విషయాన్నైనా ఆయన అనుమతి తీసుకునేవారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరొచ్చినా, ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌దని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. చదవండి : ప్రభాస్ లగ్జరీ కారు! ఖరీదు ఎంతంటే? ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు! -
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు!
హైదరాబాద్ : టాలీవుడ్లో బాహుబలి విడుదల తర్వాత నాన్ బాహుబలి రికార్డులు గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటిది బాహుబలి రికార్డునే బీట్ చేస్తే…అది కూడా ఒక చిన్న సినిమా అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అండీ బాబు. ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్లకు అడ్డాగా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. 2017 ఏప్రిల్‌లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల గ్రాస్ వరకు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్నపాత రికార్డులను చెరిపేసి తన పేరుని నమోదు చేసుకుంది. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో 40.83 లక్షల గ్రాస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సరిలేరు నీకెవ్వరు దానికి చేరువగా వచ్చి తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకొని రెండో స్థానంలో ఉంది. ఆ చిత్రం 40.76 లక్షల రూపాయిలు కొల్లగొట్టింది. ప్రస్తుతం దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలిని నాలుగో స్ధానాని వెనక్కి నెట్టింది. ఫలితంగా మూడో స్థానానికి చేరుకుంది. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా పెద్ద సినిమాలతో ధీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదని సీని పండితులు అంటున్నారు. ( చదవండి : జాతి రత్నాలు ...కురిపిస్తున్నారు కాసులు ) -
రూ.100 కోట్లు వృధా: బాహుబలి మళ్లీ తీయండన్న నెట్‌ఫ్లిక్స్!
భారత రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందీ అద్భుత చిత్రం. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అటు రాజమౌళి, ఇటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దీన్ని వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలనుకున్నారు. దీంతో బాహుబలి మొదటి భాగానికి ముందు మాహిష్మతి రాజ్యం ఎలా ఉంది? శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా తదితర అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఈ మేరకు కథ రెడీ చేయించడమే కాక 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' అనే టైటిల్ సైతం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్‌ను భారీ స్థాయిల్ షూట్ చేశారు కూడా! కానీ ఫైనల్ కట్ చూసేసరికి అంతా చెత్తచెత్తగా వచ్చిందట. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజే కాని నెట్‌ఫ్లిక్స్ ఈ 9 ఎపిసోడ్లు చూసి గుడ్లు తేలిసినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్లో తీద్దామనుకున్న సిరీస్ ఇంత డొల్లగా చెత్తగా తయారైందేంటని ఆశ్చర్యపోయిందట. దీంతో ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. అంటే అప్పటివరకు ఖర్చు చేసిన రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరన్నమాటే. ఇక ఇది అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణం ఓ రకంగా తక్కువ బడ్జెట్ కూడా కారణమేనని భావించిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా రూ.200 కోట్లు కేటాయించి మరీ ఈ వెబ్‌సిరీస్‌ను సరికొత్తగా ప్లాన్ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. దీంతో ఈ సిరీస్ బడ్జెట్ లెక్కలు మూడు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళి కూడా ఒకరు. చదవండి: ‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా వివాదాస్పద 'బాంబే బేగమ్స్' అసలు కథేంటి..? -
చిన్నప్పటి మహేంద్ర బాహుబలిని ఇప్పుడు చూశారా..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో, భళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెలల పిల్లగా చిన్నగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చదవండి: బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్ బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB — DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021 -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్‌తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్
సాక్షి, జైనూర్(ఆసిఫాబాద్): సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో జిల్లావాసులను కాసేపు గందరగోళానికి గురిచేసింది. జైనూర్ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లు ఈ వీడియో, ఫొటోలో ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇలాంటి ఇక్కట్లు తప్పడం లేదంటూ సదరు పోస్టు ఉద్దేశం. ఈ పోస్టు అనేక గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. బాహుబలి సినిమాను తలపిస్తూ పసికందును వాగు దాటిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొద్ది సేపటికే అది ఫేక్ అని తేలింది. చింతకర్రకు వాగు కష్టాలు ఉన్నా గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని గ్రామస్తులు, అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో, ఫొటో 2006లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినదిగా తెలుస్తోంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై తిరుపతి తెలిపారు. -
జపాన్‌లో తగ్గని ప్రభాస్ క్రేజ్!
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.‘సాహో’ సినిమాతోనూ వసూళ్లపరంగా సత్తా చాటి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలకు జపాన్‌లో లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ నటనకు ఫిదా అయిన జపాన్‌వాసులు ‘బాహుబలి’తో పాటు ‘సాహో’పై కూడా కలక్షన్ల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు అక్కడ కొంతమంది ఫ్యాన్స్ మరో ముందడుగు వేసి.. ప్రభాస్ పేరిట షుగర్‌లెస్ మింట్ క్యాండీస్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.(దంగల్ రికార్డును బద్దలు కొట్టిన సాహో!) కాగా గతంలో చైనాలోనూ డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రభాస్‌తో పాటు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ల పేర్లన్నింటితో ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించారు. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డార్లింగ్ ‘సాహో’తో సందడి చేసినా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్.. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో నటించనున్నాడు.(సీతగా మహానటి?) ఇక బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ పాన్ ఇండియా స్టార్.. ‘ఆదిపురుష్’ అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనువిందు చేయనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూడు సినిమాల బడ్జెట్ కలిపి మొత్తంగా సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని వినికిడి. దీంతో ఎటువంటి రికార్డు సృష్టించాలన్నా తమ హీరోకి మాత్రమే సాధ్యమవుతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
బాహుబలితో ఆ ఐదింటిపై ప్రభాస్ పట్టు
రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రయాణాన్ని చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పాల్సిందే. అప్పటివరకూ కొందరివాడైన ప్రభాస్ "బాహుబలి: ది బిగినింగ్"తో చిత్రంతో అందరివాడిగా మారిపోయాడు. వరల్డ్ వైడ్‌గా హిట్ కొట్టిన ఈ సినిమా అందరికన్నా ప్రభాస్‌కే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కింది ఐదు అంశాలు డార్లింగ్ హీరోకు బాగా కలిసొచ్చాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. (బాహుబలికి ముందు ఆ సినిమానే!) సరిహద్దులు దాటిన ఫాలోయింగ్: బాహుబలి మొదటి పార్ట్‌తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. అతని ఫాలోయింగ్ ఖండాంతరాలను దాటింది. జపాన్, రష్యాలోనూ ప్రభాస్‌కు పుట్టెడు అభిమానులు పుట్టుకొచ్చారు. అతను తర్వాత నటించిన 'సాహో' తెలుగు బాక్సాఫీస్ కన్నా హిందీలోనే అధికంగా వసూళ్లు కురిపించడమే దీనికి నిదర్శనం. మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్ విగ్రహం: ఈ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఉండాలని ఎంతోమంది నటీనటుల కల. అలాంటి గొప్ప అవకాశం ప్రభాస్ చెంతన చేరింది. బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పడిన తొలి దక్షిణాది నటుడిగా అతని పేరిట రికార్డు నమోదైంది. (‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు) రాయల్ ఆల్బర్ట్ హాల్: లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో గతేడాది అక్టోబర్ 19వ తేదీన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రాన్ని స్క్రీనింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరోతోపాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, అనుష్క, రానా హాజరయ్యారు. అక్కడి మీడియా కూడా మన హీరోను కెమెరాల్లో బంధించేందుకు తెగ ఆసక్తి చూపింది. అతన్ని చూసేందుకు జపాన్ వంటి దేశాలనుంచి సైతం అభిమానులు లండన్ చేరుకోవడం విశేషం. రష్యాలో ప్రభాస్ ప్రభంజనం: రష్యాలోనూ బాహుబలి1,2 రిలీజయ్యాయి. కాకపోతే ఇవి అక్కడి టీవీ చానెల్లో ప్లే అయ్యాయి. ఈ సినిమాలు అక్కడ విశేష పాపులారిటీ దక్కించుకున్నాయి. ఇందులో అమరేంద్ర బాహుబలిగా అద్వితీయంగా నటించిన ప్రభాస్ "రష్యా ఆడియన్స్ హార్ట్" అవార్డును ఎగరేసుకుపోయాడు. బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలిచాడు. ముప్పై ఏళ్ల క్రితం.. శ్రీ 420, ఆవారా, ఆరాధన వంటి చిత్రాలతో రాజ్ కపూర్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. (‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’) హిందీలో మార్కెట్ ఉన్న దక్షిణాది హీరో: బాలీవుడ్ సెలబ్రిటీలకు దక్షిణాదిన పాపులారిటీ, ఫాలోయింగ్ సర్వసాధారణం. కానీ దక్షిణాది సెలబ్రిటీలకు మాత్రం బాలీవుడ్లో పెద్దగా ఆదరణ లేదు. ఏళ్ల తరబడి వస్తున్న ఈ నియమాన్ని ప్రభాస్ చెరిపేశాడు. హిందీలోనూ తనకంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. దీనికి హిందీలో రిలీజైన సాహో రికార్డులే సాక్ష్యం. వసూళ్ల పరంగా తెలుగు, తమిళంలో కన్నా హిందీ వర్షన్లో సాహో 150 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. -
ప్రభాస్ సినిమాలో మరోసారి రానా!
రానా, ప్రభాస్ కలిసి నటించిన బాహుబాలి ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ తాజాగా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు) ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. బాహుబలిలో భల్లాల దేవగా ప్రభాస్‌తో కలిసి నటించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో గెస్ట్‌రోల్ చేయబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. అయితే కేవలం రెండు నిమిషాల పాటు మాత్రమే రానా ఈ సినిమాలో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటించనున్నారు. యువీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా కూడా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. (రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది అతడే?) -
మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 11,489, తెలంగాణలో 11,364 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగానూ కోవిడ్ విజృంభణ ధాటిగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు కేసుల సంఖ్య 4.90 లక్షలకు చేరుకుంది. స్వీయ నియంత్రణ చర్యలే వైరస్ బారినపడకుండా మానవాళిని కాపాడలగలవని వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దానిలో భాగంగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, విదేశాల్లో మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా తలపడే సన్నివేశాన్ని యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ సూడియో టీమ్ ఎడిట్ చేసి.. భళ్లాల దేవ, మహేంద్ర బాహుబలి మాస్కులు ధరించినట్టుగా చూపించింది. మాహిష్మతీ రాజ్యంలో కూడా మాస్కులు తప్పనిసరి అని వీడియోలో పేర్కొంది. మాస్కులు మరువొద్దని సూచించింది. ఈ వీడియోను రాజమౌళీ ట్విటర్లో షేర్ చేశాడు. అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని ఆకాక్షించారు. యునైటెడ్ సాఫ్ట్ టీమ్‌కు అభినందనలు తెలిపాడు. (చదవండి: ‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు) -
రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ
హైదరాబాద్: తెలుగుతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. విడుదలై దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ల వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు వారాల క్రితం బాహుబలి 2 సినిమా రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ శుక్రవారం ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (9న సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ) 39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో(2017లో జరిగింది) బాహుబలి చిత్రాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రసంగించారు. (మహేశ్‌వారి పాటలు!) రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ నెమరువేసుకుంటూ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ వేడుకలకు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు. ఇక గత నెల 28న బాహుబలి-2 చిత్రం రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. While presenting #Baahubali2 at the Moscow Film Festival, director @SSRajamouli explained how the movie promotes Indian values all over the world. Here is was he said. pic.twitter.com/g257hAk9K3 — Russia in India (@RusEmbIndia) June 5, 2020 -
రేపు వార్నర్ ‘మైండ్ బ్లాక్’ సర్ప్రైజ్!
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గత కొద్దిరోజులుగా టిక్‌టాక్ వీడియోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఇప్పటికే చేసిన టిక్‌టాక్ వీడియోలు ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్, పొకిరి డైలాగ్, బాహుబలి సాంగ్‌కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్. తన సతీమణి, కూతురుతో చేస్తున్న వీడియోలతో టిక్‌టాక్‌లో వార్నర్ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్‌టాక్ చేయమని వార్నర్‌ను అభిమానులు కోరుతున్నారు. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్‌కు టిక్‌టాక్ చేసిన వార్నర్, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు టిక్‌టాక్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు వార్నర్. దీంతో వార్నర్ తర్వాత టిక్‌టాక్ ‘మైండ్ బ్లాక్’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక ‘బాహుబలి’ చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ ‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పండి’అంటూ అభిమానులను వార్నర్ ప్రశించాడు. ఇక ఈ ఫోటోకు ‘దేవసేన ఎక్కడ’, ‘టాలీవుడ్లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు’, ‘ప్రభాస్ ఇండియా బాహుబలి, వార్నర్ ఆస్ట్రేలియా బాహుబలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌కు వార్నర్ స్పెషల్ విషెస్!)! View this post on Instagram If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍 A post shared by David Warner (@davidwarner31) on May 28, 2020 at 11:36pm PDT View this post on Instagram Who’s costume do you prefer? 😂😂 @baahubalimovie #bahubali #prabhas #funny #fun A post shared by David Warner (@davidwarner31) on May 27, 2020 at 11:16pm PDT -
‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు లేక వాయిదా పడటంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌ను అలరించాలనే ఉద్దేశంతో టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ‘అల.. వైకుంటపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అనంతరం ‘పోకిరి’ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌కు టిక్‌టాక్ చేశాడు. సన్‌రైజర్స్ జెర్సీ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకొని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్‌తో టిక్‌టాక్ చేశాడు. తాజాగా వార్నర్ చేసిన మరో టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది. బాహుబలి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్‌ను టిక్‌టాక్ చేసి అందిరినీ సంభ్రమాశ్చర్యంలోకి ముంచెత్తాడు. ఇక టాలీవుడ్ అభిమానుల నుంచి వార్నర్‌కు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నా కెరీర్‌ను నాశనం చేశాడు.. 'ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి' -
పెళ్లిపై కామెంట్స్.. నచ్చావ్ సుబ్బరాజు
వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సుబ్బరాజు. 2003లో తెరంగేట్రం చేసిన ఈయన తొలి ఏడాదే ఖడ్గం, అమ్మనానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు నెగటీవ్ రోల్స్ చేసుకుంటూనే మరోవైపు విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. బాహుబలిలో కుమార వర్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర చేశాడు. అయితే ఆయన రియల్ లైఫ్ విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు. దీంతో అతడి పెళ్లి గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదు. 25ఏళ్లు వచ్చాక అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండటంతో నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదు. జీవిత భాగస్వామికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడ మాత్రమే పెళ్లి చేసుకుంటా’అని సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇక పెళ్లిపై సుబ్బరాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ వ్యాఖ్యలతో మీరు ఇంకా నచ్చారు సుబ్బరాజు గారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. రాఘవ.. నువ్వు రియల్ హీరోవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’ చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్‌తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్‌ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్‌కు 21.84 టీవీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్డీ ప్రింట్‌ను కొంత మంది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారు. అయినప్పటికీ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గడిచిన పదిహేనేళ్లలో ఏ తెలుగు చిత్రానికి ఈ విధంగా టీవీఆర్ రాలేదని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. చదవండి: ‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’ ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలీవుడ్ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్..
దక్షిణాది చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అని బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం దబాంగ్–3. దీనికి ఈయనే నిర్మాత కావడం విశేషం. మరో విశేషం ప్రభుదేవా దర్శకుడు కావడం. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన దబాంగ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దబాంగ్–2 చేశారు. తాజా గా దానికి మూడవ సీక్వెల్‌గా దబాంగ్ 3 రెడీ అయ్యింది. సోనాక్షిసిన్హా నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రకాశ్‌రాజ్, అర్బాస్ఖాన్, మహీగిల్ ముఖ్యపాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న దబాంగ్–3 చిత్ర ప్రమోషన్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇది హిందీతో పాటు పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో చిత్ర తమిళ వెర్షన్ ప్రసారంలో భాగంగా నటుడు సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా బుధవారం చెన్నైలో హల్చల్ చేశారు. దబాంగ్–3 చిత్ర దర్శకుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. దబాంగ్ చిత్రం సక్సెస్ తరువాత ఇప్పుడు దబాంగ్–3 చిత్రం చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయని అన్నారు. దీంతో చిత్ర యూనిట్ అంతా చాలా శ్రమించినట్లు తెలిపారు. దబాంగ్–3ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రేక్షకులను నేరుగా కలుసుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర ట్రైలర్ అందరినీ అలరించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ దక్షిణాది చిత్రాలు తనకెప్పుడూ ఇష్టమేనన్నారు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ నటించిన చిత్రాలను తాను చాలా ఇష్టపడిచూస్తానని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం హిందీ చిత్రాలకంటే కూడా బాహుబలి, కేజీఎఫ్ వంటి దక్షిణాది చిత్రాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. తమిళంలో విజయ్ నటించిన పోకిరి చిత్ర హీంది రీమేక్‌లో తాను నటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నటించిన తెరి, తిరుపాచ్చి చిత్రాలు తనకు బాగా నచ్చినట్లు చెప్పారు. దబాంగ్–3 చిత్రం తన మనసుకు బాగా దగ్గరైన చిత్రం అని అన్నారు. ఇది దక్షిణాది చిత్రాల మాదిరిగానే ఉంటుందని, ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఎక్కువగా పనిచేసినట్లు తెలిపారు. ప్రభుదేవా మా సొత్తు అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విజయానికి చిహ్నంగా పేర్కొన్నారు. తన తదుపరి చిత్రానికి ఆయనే దర్శకుడని చెప్పారు. మరోసారి త్వరలోనే తమిళ ప్రేక్షకులను తాను ప్రత్యక్షంగా కలుసుకుంటానని నటుడు సల్మాన్‌ఖాన్ అన్నారు. -
భళా బాహుబలి
‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్‌లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. -
బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్
బెంగుళూరు: ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. రాజమౌళికి ఉత్సుకత ఉంటే బాహుబలి 3 కూడా తెరకెక్కే అవకాశం ఉందన్నాడు. సినీ చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనం మనందరికి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజమౌళి ఉత్సాహంగా ఉంటే బాహుబలి-3 కూడా రావొచ్చని అభిప్రాయపడ్డాడు. తాము బాహుబలి రెండు భాగాల్లో దాదాపు 60% కథను మాత్రమే పూర్తి చేశామని చెప్పాడు. రాజమౌళి మదిలో బాహుబలి సీక్వెల్-3 కూడా ఉందన్నాడు. అయితే అది కార్యరూపం దాల్చే అవకాశాల గురించి మాత్రం తనకు తెలియదన్నాడు. ఇక బాహుబలితో తన అనుబంధాన్ని పంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించినందుకు తనకు ఏ మాత్రం బాధలేదన్నాడు. నా జీవితంలో అమరేంద్రబాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నాడు. కొన్నిసార్లు ఈ సినిమా కథలో లీనమయ్యి తనను తానే మర్చిపోయే సంఘటనలు కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు. కాగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ ఆగష్టు 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఇట్స్ షో టైమ్
డైరెక్టర్ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ ‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్ ‘బాహుబలి –3’ కోసమా? అని మాత్రం అడక్కండి. ఈ విషయానికి రాజమౌళీయే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాత్రం వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది. సినిమాలో నటించిన ప్రభాస్, అనుష్క, రానా వస్తారు. షో తర్వాత రాజమౌళితో ప్రశ్నోత్త్తరాల సమయం ఉంటుంది’’ అని ఈ విషయాన్ని రాయల్ ఆల్బర్ట్ హల్ ప్రతినిధులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ‘బాహుబలి’ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. రాయల్ ఆల్బర్ట్ హాల్ విషయానికి వస్తే....1871లో క్వీన్ విక్టోరియా ఈ హాల్‌ను స్టార్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ముఖ్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదికనే ఎక్కువగా ఉపయోగిస్తారట. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ హాల్ సీటింగ్ సామర్థ్యం ఎంతో తెలుసా.... 5,267. -
చాన్స్ వస్తే బాహుబలి 3లో చేస్తా
బాహుబలి లాంటి సినిమాలో నటించడం ఏ నటికైనా కల సాకారం కావడమేనని బాహుబలి 3 తీస్తే అందులో తనకు అవకాశం వస్తే ఆనందంగా చేస్తానని చెప్పింది బాలీవుడ్ నటి నిధి అగర్వాల్. ప్రముఖ టైర్ల బ్రాండ్ ఎఆర్‌ఎల్ టైర్స్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జీతో షాన్ సే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్లో తాను నటించిన గత 2 చిత్రాలతో పోలిస్తే త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్ శంకర్ తనకెంతో ప్రత్యేకమని ఈ సినిమా విడుదల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. తనకు అత్యంత ఇష్టమైన హాబీ ట్రావెలింగ్ అని చెప్పిన నిధి... పనిలో కాస్త విరామం చిక్కినా ఎక్కడో ఒక చోటకి టూర్ వెళ్లిపోతానని, తన ఇన్‌స్ట్రాగామ్ ఫాలోయర్స్ అందరికీ తన ట్రావెల్ హాబీ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుందంటూ నవ్వేసింది. -
వాళ్ళు తోపులు
-
కొత్త దర్శకుడితో?
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్లో పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెండుసినిమాలు (సాహో, జాన్ (వర్కింగ్ టైటిల్))లు కూడా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ కానుంది. ‘జాన్’ కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి.. ప్రభాస్ నెక్ట్స్ చిత్రం ఏంటి? అంటే... ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. తాజాగా క్రిష్ణ అనే కొత్త దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని టాక్. దర్శకుడు రాజమౌళి దగ్గర క్రిష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారట. మరి... అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హీరోతో కొత్త దర్శకుడికి సినిమా చేసే ఛాన్స్ దక్కుతుందా? వెయిట్ అండ్ సీ.